
సాక్షి, హైదరాబాద్: జనగణనలో బీసీ కులాలవారీగా జనాభాను లెక్కించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అన్నారు. బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ వేయడం కాలయాపనకు దారితీస్తుందని, ఈ అంశంపై యుద్ధప్రాతిపదికన స్పష్టతనిచ్చి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రత్యేకంగా లేఖ ద్వారా జాజుల కోరారు.
Comments
Please login to add a commentAdd a comment