
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతారావు(వీహెచ్)ను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్‌లో పరామర్శించారు. గురువారం వీహెచ్‌కు ఫోన్ చేసిన ఆమె... ‘‘ఏమైంది హన్మంత్... ఎలా ఉంది ఆరోగ్యం’’ అని ఆరా తీశారు. కిడ్నీలో ఇన్ఫెక‌్షన్ వచ్చిందని, ఇప్పుడు కాస్త బాగుందని వీహెచ్ బదులిచ్చారు. మీ ఆశీస్సులు కావాలని వీహెచ్ కోరగా ఆరోగ్యం కాపాడుకోవాలని సోనియా బదులిచ్చారు.
అదే విధంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా వీహెచ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా టీపీపీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఇటీవలే.. ఆస్పత్రికి వెళ్లి వీహెచ్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment