VH Hanamantha rao
-
బాధపడుతున్న వీహెచ్
-
రేవంత్‌రెడ్డిపై వీహెచ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి.. నీస్థాయిని నీవు తగ్గించుకుంటున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీహెచ్.. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారు. అలాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు?. వారిని పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదు. ఆయన తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నారు.’’ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని తాను కలిసి ఇవన్నీ చెబుతామంటే తనకు సమయం ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్లు మన వైపు వస్తున్నారు. కాంగ్రెస్ కేడర్‌కు న్యాయం చేయకుండా మన వారిపై కేసులు పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. బీఆర్ఎస్ హయాంలో తాము ఎక్కడకు వెళ్లినా కేసులు పెట్టారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీటిని ఎత్తివేయాలి. రేవంత్ రెడ్డి ఒకవైపు కాకుండా రెండువైపుల వినాలి. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగవద్దనేది తన ఉద్దేశ్యమని వీహెచ్ అన్నారు. ఇదీ చదవండి: కవిత మేనల్లుడి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు -
TS Congress: భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీనియర్ నేత హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. కాగా, వీహెచ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భట్టి విక్రమార్క నాకు ఖమ్మం లోక్‌సభ సీటు రాకుండా చేస్తున్నారు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీని చేసింది నేనే. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలి. నేను లోకల్ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా?. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేసిన నాకు న్యాయం చేయండి. ఖమ్మం లోక్‌సభ సీటు నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా?. బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా?. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర, కుల గణన అంటున్నారు. రాహుల్ అయినా నాకు న్యాయం చేయాలి. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే నేను తప్పుకుంటాను. లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి నేనే అర్హుడిని. నేను పార్టీ కోసం పనిచేశాను. నేను చనిపోయే వరకు పార్టీలోనే ఉంటాను. చనిపోయిన తరువాత పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశాను. నా వయసు నాకు అడ్డంకి కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సీఎం రేవంత్ ను ఎత్తుకున్న హనుమంతరావు
-
సీఎం పదవిపై హనుమంతన్న పిచ్చ కామెడీ..
-
యాంకర్ తో వీహెచ్ కామెడీ
-
ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అకస్మాత్తుగా సీనియర్ నాయకులను మంగళవారం తన ఇంటికి లంచ్‌కు పిలవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పదిరోజుల క్రితం విష్ణు సోదరి విజయారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ పెద్దలపై ఆసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని హైదరాబాద్‌లోని సీనియర్ నేతలతోపాటు ఇతర ముఖ్యులను కూడా భోజనానికి ఆహ్వానించారు. పనిలో పనిగా తన అసంతృప్తిని సీనియర్లతో పంచుకోవాలని భావించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే పిలిచిన నేతలంతా లంచ్‌కు వెళ్తారా లేదా అని ఆసక్తిరేపుతున్న సమయంలో విష్ణు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగానే ప్రతీ ఏటా సీనియర్ నేతలను భోజనానికి ఆహ్వానిస్తుంటానని, పార్టీలో ఎవరు చేరినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కూడా రావాలని కోరారని, అయితే వారిద్దరు ఢిల్లీలో ఉండటంతో రాలేమని చెప్పారని విష్ణు పేర్కొన్నారు. అదే సమయంలో ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ విష్ణు తనను భోజనానికి రావాలని కోరారని చెప్పారు. హైదరాబాద్‌లో తన అభిమానులు, కార్యకర్తలతో సభ పెట్టుకుంటానని అడిగారని, అందుకు తాను అనుమతిచ్చినట్టు వెల్లడించారు. ప్రకటన తర్వాత దిగిన నేతలు... అటు రేవంత్‌రెడ్డి, ఇటు విష్ణువర్ధన్ ప్రకటనలతో సీనియర్ నేతలంతా ఆయన గృహానికి వెళ్లడం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్, గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ నేత మదన్మోహన్రావు, బెల్లయ్య నాయక్ తదితర నేతలు దోమల్‌గూడలోని విష్ణువర్థన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అసమ్మతి అనుకునేలోపు... విష్ణు ఆహ్వానించిన జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేరని చాలామంది నేతలు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. చేరికలపై ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయాలని నేతలు భావించారు. అసమ్మతి గ్రూపును నడిపిద్దామని భావించిన నేతలకు తీరా విష్ణు ఇచ్చిన స్పష్టతతో మింగుడుపడకుండా అయినట్టు చర్చ జరుగుతోంది. కాగా, విందు అనంతరం వీహెచ్ మాట్లాడుతూ ఒకప్పుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశానని, ఆయనను సోనియాగాంధీ నియమించినందున ఆయన నాయకత్వాన్ని బలపరుస్తానని, అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడా అందర్నీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఈరోజు లంచ్ మీటింగ్‌తో అందరి అపోహలు తొలగిపోయాయని ఆయన తెలిపారు. తన సమస్యపై కేంద్ర నాయకత్వంతోనే మాట్లాడుతానన్నారు. -
ఇది నీ జాగీర్ కాదు.. మేం నీ నౌకర్లం కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు బేగం పేట ఎయిర్‌పోర్టులో సిన్హాను కలవడం వివాదాస్పదమైంది. వీహెచ్ వ్యవహారం తన దృష్టికి రాలేదని, పార్టీ నిబంధనలు దాటితే ఎంతటి వారినైనా గోడకేసి కొడతామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘అసలు రేవంత్ ఎవడు? ఎవరిని కొడతావో కొట్టు చూద్దాం’అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ పార్టీని కొనుక్కున్నావా?.. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు నీ నౌకర్లమేమీ కాదు..’అని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సంబంధిత వార్త: కాంగ్రెస్‌లో కల్లోలం: వీహెచ్ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సీరియస్ మళ్లీ మాట్లాడాల్సి వస్తోంది ‘టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి రేవంత్ అలా ఎలా మీడియా ముందు టెంప్ట్ అయ్యారు. నేను గతంలో టెంప్ట్ అ యితే అనేక పంచాయితీలు వచ్చాయి. రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ మళ్లీ మా ట్లాడాల్సిన పరిస్థితి తెచ్చాడు. సీనియర్ నాయకులను కొడతా అని వ్యాఖ్యానిం చిన వ్యక్తి పీసీసీ పదవిలో కొనసాగకూడదు. దిగిపోవాలి. దీనిపై సోనియాగాంధీ, రాహుల్ గాం ధీలకు లేఖ రాసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతా..’అని జగ్గారెడ్డి తెలిపారు. సీఎల్పీని డమ్మీ చేశాడు... ‘పీసీసీ, సీఎల్పీ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు. కానీ సీఎల్పీ పోస్టును రేవంత్ రెడ్డి డమ్మీ చేశాడు. ఏమాత్రం విలువ ఇవ్వ కుండా ప్రవర్తిస్తున్నాడు. భట్టి విక్రమార్క ను ఆగం చేస్తున్నాడు. రేవంత్ చేస్తున్న తప్పులన్నీ పార్టీకి లేఖ ద్వారా వివరిస్తా..’అని తెలిపారు. మాపై కోవర్టులని ముద్రవేశాడు.. ‘గతంలో కోవర్టులని నా మీద, వీహెచ్ మీద ముద్రవేసి హైకమాండ్‌కు రేవంత్‌రెడ్డి అనేకసార్లు లేఖలు రాయించాడు. మాపై విషప్రచారం చేశాడు. అసమ్మతి వర్గానికి, కోవర్టులకు తేడా తెలియని వ్యక్తి రేవంత్‌రెడ్డి..’అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? ‘రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పడేవాడు ఎవడూ లేడు. ఇది రేవంత్ జాగీర్ కాదు. మీడియా ముందు ఎలా నోరు పారేసుకుంటావు. నాకు వార్నింగ్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎవడు? రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు, ఆహ్వానంపై ఇప్పటివరకు టీపీసీసీ సమావేశం కానీ సీఎల్పీ సమావేశం కానీ ఏర్పాటు చేయలేదు. యశ్వంత్ సిన్హాను కలవాలని గానీ, కలవకూడదని గానీ ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీలో యశ్వంత్‌సిన్హా నామినేషన్ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ, కేటీఆర్ పాల్గొంటే లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? రేవంత్ తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. చదవండి: డైనమిక్ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నా: తెలుగులో మోదీ ట్వీట్ -
టీఆర్ఎస్ పై విహెచ్ కీలక వ్యాఖ్యలు
-
అగమ్యగోచరంగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి
-
సోనియాను దెయ్యమ్మన్నవారు మా దాంట్లో ఉన్నారు
-
బతుకమ్మల పైనుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు?.. మండిపడ్డ వీహెచ్
సాక్షి, వరంగల్: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రంగు రంగు పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను కొలిచే ఈ పండగకు తెలంగాణ యావత్తూ పూలవనంలా మారిపోయింది. అలాంటి బతుకమ్మ పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మహిళలంతా బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆడుతుండగా వాటిపైనుంచి ఎమ్మెల్యే కారు పోనిచ్చారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మాట్లాడుతున్న ఏఐసీసీ మెంబర్ హన్మంతరావు మహిళలు బతుకమ్మ ఆడుతుండగా తన వాహనంతో తొక్కించి మహిళలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవమానపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్య తీసుకోవాలని ఏఐసీసీ మెంబర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుకుంటుండగా బతుకమ్మలపై నుంచి తన వాహనాన్ని తీసుకెళ్లిన ధర్మారెడ్డి.. మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. గతంలో ఎస్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. ఆత్మకూరు సర్పంచ్ రాజు బీసీ కావడం వల్లే ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడన్నారు. చదవండి: గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌పై టీఎస్ హైకోర్టు కీలక తీర్పు సలేం జరిగింది ఆత్మకూరు పోచమ్మ సెంటర్ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. అదే సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు చెప్పారు. దీంతో బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనిచ్చారని స్థానికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చదవండి: పెద్దమనసు చాటుకున్న కేటీఆర్ -
ఏమైంది హన్మంత్... ఆరోగ్యం ఎలా ఉంది?!
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతారావు(వీహెచ్)ను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్లో పరామర్శించారు. గురువారం వీహెచ్‌కు ఫోన్ చేసిన ఆమె... ‘‘ఏమైంది హన్మంత్... ఎలా ఉంది ఆరోగ్యం’’ అని ఆరా తీశారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఇప్పుడు కాస్త బాగుందని వీహెచ్ బదులిచ్చారు. మీ ఆశీస్సులు కావాలని వీహెచ్ కోరగా ఆరోగ్యం కాపాడుకోవాలని సోనియా బదులిచ్చారు. అదే విధంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా వీహెచ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా టీపీపీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఇటీవలే.. ఆస్పత్రికి వెళ్లి వీహెచ్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. -
హెచ్‌సీఏ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి 186 మంది క్లబ్ సెక్రేటరీలు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. కాగా అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మను నియమించాలని అజర్ వర్గం పట్టుబడుతుంటే.. వ్యతిరేక వర్గం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై అధ్యక్షుడు అజర్‌ను సభ్యులు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారడంతో వీహెచ్ హనుమంతరావు మధ్యలోనే బయటికి వచ్చి మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ మాట్లాడుతూ..'' హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయింది. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదు.ఆంద్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది. అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మ ని అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారు? దీనిపై అజార్ ని ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదు. ప్రెసిడెంట్ అజర్ కి అధికార పార్టీ అండదండలు వున్నాయి.'' అని మండిపడ్డారు. కాగా తదుపరి హెచ్‌సీఏ సమావేశం వచ్చే నెల 11న జరిగే అవకాశం ఉంది. -
కాంగ్రెస్‌లో వీహెచ్ వ్యాఖ్యల దుమారం
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ సీనీయర్ నేత వీహెచ్ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దూమారం రేపుతున్నాయి. వీహెచ్ వ్యాఖ్యలపై పార్టీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ వ్యాఖ్యలపై కార్యదర్శి బోస్‌రాజును ఠాగూర్ నివేదిక కోరారు. దీంతో హనుమంతరావు వ్యాఖ్యలు, పేపర్ క్లిప్పింగ్స్‌ను బోస్‌రాజు ఠాగూర్‌కు పంపించారు. ఈ క్రమంలో వీహెచ్‌కు నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా టీపీసీసీ చీఫ్ ఎంపిక నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన రగడ.. అభిప్రాయ సేకరణలో తను ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి చేరకుండా ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అడ్డుకున్నాడని వీహెచ్ విమర్శించారు. ఆయన అధిష్టానానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని, ప్యాకేజీకి అమ్ముడుపోయాడని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చదవండి: రేవంత్‌కన్నా నాకే క్రేజ్ ఎక్కువ ఉంది.. -
రేవంత్‌కన్నా నాకే క్రేజ్ ఎక్కువ ఉంది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అటు ఢిల్లీలోనూ.. ఇటు హైదరాబాద్‌లోనూ రేవంత్ పేరే ప్రముఖంగా వినపడుతోంది. ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా దాదాపు ఖరారు అయ్యారని, అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమని తెలుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకత్వ బాధ్యతలు టీడీపీ నుంచి వచ్చి న రేవంత్‌కు అప్పగించడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారని విమర్శించారు. అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. చదవండి: టీపీసీసీ చీఫ్ ఎంపిక దాదాపు పూర్తి! కాంగ్రెస్‌లో తాను సీనియర్ అని వీహెచ్ హనుమంతరావు అన్నారు. గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నానని, ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఏం సంపాదించుకోలేదన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకూ సోనియాగాంధీని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కావాలనే కలవకుండా ఒక సెక్షన్ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంపై హైకమాండ్ ఆలోచన చేయాలన్నారు. తనకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వారని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఓటమిపై రివ్యూ ఎందుకు చేయరని నిలదీశారు. రేవంత్ మాస్ లీడర్ అయితే, గ్రేటర్లో 48 సీట్లు తీసుకొని 2 స్థానాలు మాత్రమే గెలిచిందని ఎద్దేవా చేశారు. ఆయన టీడీపీని ఖతం పట్టించి, కాంగ్రెస్‌లో పడ్డారని ఎద్దేవా చేశారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు చరిత్ర చూస్తారు కానీ రేవంత్ చరిత్ర ఎందుకు చూడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమని పిలిచి మాట్లాడాలని అన్నారు. లేదని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే... తమ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించారు. ‘మీడియా, సోషల్ మీడియాతోనే రేవంత్ లీడర్ అయ్యాడు. పీసీసీ విషయంలో సమాచారం ఉన్నందుకే మాట్లాడుతున్నాను. అభిప్రాయ సేకరణలో నేను ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి చేరకుండా ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అడ్డుకున్నాడు. ఆయన అధిష్టానానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ప్యాకేజీకి అమ్ముడుపోయాడు. రేవంత్ తమ్ముడు.. దళితుల భూమి కబ్జా చేస్తే మీడియా ఎందుకు రాయదు. రేవంత్ మీడియాను పార్టీ హైకమాండ్‌ను మేనేజ్ చేస్తున్నాడు. రేపటి నుంచి టీఆర్ఎస్ తెలంగాణ వ్యతిరేకిని పీసీసీ చీఫ్ చేశారని ప్రచారం చేస్తుంది. మేం ఆయనను కలవడానికి జైలుకు పోవాలా. ఈ వాస్తవాలను వివరిస్తూ లెటర్ రాసినా. మాస్ లీడర్ అయితే కొడంగల్‌లో రేవంత్ ఎందుకు ఓడిపోయాడు. మూడు రోజుల నుంచి నా ఫోన్‌ను మాణిక్కం ఠాగూర్ ఎత్తడం లేదు. బీసీగా ఉన్న డీ శ్రీనివాస్ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేశాడు. అలాంటి వ్యక్తికి ఇవ్వాలి’ అని సూచించారు. గతంలో ఎంఐఎంతో పొత్తు పెట్టించాడని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్నోడికి ఇవ్వమంటరా అని మండిపడ్డారు. కొందరు పైసలకు అలవాటు పడి భజన చేస్తున్నారని, రేవంత్ వద్ద పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దీనిపై సీబీఐకి లేఖ రాస్తాననని అన్నారు. రేవంత్ ఊరికి పోయి ఆయన చరిత్ర బయటికి తీస్తానని సవాల్ విసిరారు. చివరిసారి అడుతున్నానని.. తామంటే లెక్కలేదా.. పీసీసీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పీసీసీ పదవి రెడ్డిలకు ఇవ్వాలనుకుంటే అసలైన రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క పదవి నుంచి తీస్తారని అంటున్నారు. ఆయన్ను ఎందుకు తీస్తారు అని వీహెచ్ ప్రశ్నించారు. ఇవాళ ఉదయం కూడా పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క అందరితో మాట్లాడినట్లు తెలిపారు. -
సీఎం కేసీఆర్ ఎటువైపు
సాక్షి, వరంగల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై దేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల పక్షమా, బీజేపీ వైపా తేల్చుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు సూచించారు. చట్టాలకు వ్యతిరేకంగా హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న వీహెచ్‌ను జనగామ జిల్లా పెంబర్తి బైపాస్ వద్ద అడ్డుకున్నారు. అంతలోనే సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు వస్తుండటంతో ఆయనను లింగాలఘణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వీహెచ్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై భారత్ బంద్‌లో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నా, సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే మార్పు వచ్చిందన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేకశారు. హన్మకొండలో విద్యార్థులు చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను అరెస్టు చేయడమేమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, రైతులకు న్యాయం జరిగే వరకు ప్రాణాలర్పించైనా పోరాడుతామని అన్నారు. కాగా పోలీసు స్టేషనులో వీహెచ్‌ను కాంగ్రెస్ నాయకులు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, లింగాజీ, ఎండీ అజీజ్, విజయ్‌మనోహార్, బిక్షపతి, భృగుమహర్షఙ, రాజిరెడ్డి తదితరులు కలవగా, అనంతరం ఆయనను సొంత పూచీకత్తుపై పోలీసులు పంపించారు. -
మేం గిట్లా జేస్తే కేసీఆర్ సీఎం అయ్యేటోడా..!
లింగాలఘణపురం : ‘రాష్ట్రంలో నేడు అప్రజాస్వామిక పాలన సాగుతోంది.. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే తలంపుతో అడుగడుగునా అరెస్టులు చేస్తున్నారు.. ఇదేం ప్రజాస్వామ్యం’ అని మాజీ ఎంపీ హన్మంతరావు అన్నారు. వరంగల్ నగరం ఉర్సు ప్రాంతంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు హన్మంతరావు మంగళవారం హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో జనగామ –నెల్లుట్ల బైపాస్‌లోని నెల్లుట్ల శివారున ఆయనను పోలీసులు అరెస్టు చేసి లింగాలఘణపురం స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్లో హన్మంతరావు విలేకరులతో మాట్లాడుతూ.. జ్యోతీరావుఫూలే విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారు.. ఎవరు చేశారు.. దుండగులా.. రాజకీయ పార్టీలా అనే విషయాన్ని తెలుసుకుని అదే ప్రాంతంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను వెళ్తుంటే అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజాభిప్రాయం ఎప్పుడు తీసుకుంటావంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తమను మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయడంలేదని, అధికార పార్టీ నాయకులు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళుతున్నారని, వారికి ఏ ఆంక్షలు లేవన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డికి ఏమైనా రాజ్యసభ మెంబర్ ఇస్తానని అన్నాడా.. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. మేం గిట్లా జేస్తే కేసీఆర్ సీఎం అయ్యేటోడా..? తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్లపై వంటావార్పు, అనేక రకాల ఉద్యమాలు చేస్తే ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఆపలేదు.. గిట్ల చేస్తే కేసీఆర్ సీఎం అయ్యేటోడా అంటూ హన్మంతరావు ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దళితుడు చనిపోతే వెళ్లనీయరు ఇదెక్కడి న్యాయమని అన్నారు. తమను ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తున్నారని, అలా కాకుండా ఇంట్లో నుంచి వెళ్లకుండా జైళ్లల్లో పెట్టండి.. అప్పుడు ఏ లొల్లీ ఉండదని చెప్పారు. ప్రతిపక్షాన్ని లెక్కచేయకుండా పాలన సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని అన్నారు. హన్మంతరావుతో పాటు మరికొందరిపై కేసులు ఇదిలా ఉండగా మాజీ ఎంపీ హన్మంతరావును ఉదయం 10.30 గంటలకు జనగామ సీఐ మల్లేశ్‌యాదవ్, స్థానిక ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి సాయంత్రం నాలుగు గంటలకు సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆయనతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శివతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. హన్మంతారావు సుమారు నాలుగున్నర గంటలు పోలీసుస్టేషన్లోనే ఉండడంతో గీసుకొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమాల్ షరీఫ్, ధర్మపురి శ్రీనువాసు, నరేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ విజయ్‌మనోహర్, ఎంపీటీసీ బిక్షపతి తదితరులు ఆయనను కలిసి మద్దతు తెలిపారు. -
దక్షిణాది రాష్ర్టాల నుంచి ఆ గౌరవం పీవీకే దక్కింది
సాక్షి, హైదరాబాద్ : పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు శుక్రవారం ఇందిరాభవన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య , షబ్బీర్ అలీ, కమిటీ చైర్మన్ గీతారెడ్డి, వీహెచ్ హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే దేశాన్ని పాలించే స్థాయికి పీవీ ఎదిగారని కొనియాడారు. ఒక సామాన్యుడు సైతం ప్రధాని కావచ్చనే విషయాన్ని పీవీని చూసి స్ఫూర్తి పొందాలన్నారు. ఒక తెలుగువ్యక్తికి అంతటి గోప్ప స్థాయి కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి పీవీకి దక్కిన గౌరవం మరెవరికి దక్కలేదని, సోనియాగాందీ సలహామేరకు ఏఐసీసీ ఆమోదంతో పీవీ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. పీవీ ప్రధాని పదవి చేపట్టాక దేశ ఆర్థిక సంస్కరణలు పీవీకి ముందు ఆయన తర్వాత అనేలా ఉన్నాయని పేర్కొన్నారు. ('పుట్టుక నుంచి చనిపోయే వరకు పీవీ కాంగ్రెస్ వాది') 24వ శతాబ్ధంలో రాజీవ్‌గాంధీ ఆలోచనలకు రూపకల్పన చేసింది పీవీ అని వీహెచ్ హన్మంతరావు అన్నారు. సొంత గూటి నుంచే పీవీకి గట్టి పోటీ ఉండేదన్నారు. 'పీవీని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం జరిగింది. మా అధ్యక్షుడు మాటకు గౌరవం ఇచ్చి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం లేదు. కొందరు ఆయన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరి వల్లా కాదు. మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. పీవీ ఆశించినట్లు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి' అని వీహెచ్ అన్నారు. తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహారవు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన ఘనత భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (హ్యాపీ బర్త్‌డే తారక్: సీఎం జగన్) -
కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
-
పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతల ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14లోగా పంజాగుట్టలో విగ్రహాన్ని ప్రతిష్టించనట్లయితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు, మాజీ ఎంపీలు ధర్నాకు దిగారు. సీనియర్ నేత వీహెచ్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మల్లు రవి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అడ్డుపడి ఆయన విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం అవమానకరం. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీఎం చర్యలు తీసుకోవాలి. పంజాగుట్టలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలి. లేదంటే మా పోరాటం మరింత ఉధృతమవుతుంది’’ అని పేర్కొన్నారు. -
‘దేశం ఎటుపోయినా పర్వాలేదు కానీ..’
సాక్షి, ఖమ్మం : మహారాష్ట్రలో బీజేపీ అనుసరిస్తున్న పద్ధతి అప్రజాస్వామికమైనదని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో ఇటువంటి గవర్నర్‌ను చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా పనిచేశారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందన్నారు. దేశం ఎటుపోయినా పర్వాలేదు కానీ, తాము మాత్రం అధికారంలో ఉండాలని బీజేపీ కోరుకుంటోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కోర్టులో కేసు దాఖలైనందును తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, శివసేన, ఎన్పీపీ పార్టీలు కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
మమ్మల్ని విస్మరిస్తే రాజీవ్‌గాంధీ కాంగ్రెస్ పార్టి పెడతా
-
కేసీఆర్ అహంకారం సగం తగ్గింది : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఇంతవరకు బాధితకుటుంబాలను ప్రభుత్వం పరామర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ తన నియోజక వర్గంలో కార్యకర్త చనిపోతే వెళ్లి పాడే మోసిందని గుర్తు చేశారు. మరి, నీకు ఓట్లు వేసిన హజీపూర్ ప్రజలకు నువ్వు ఏం చేశావంటూ కేసీఆర్‌పై వీహెచ్ ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు 26 మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌కు ఎలాంటి బాధ లేదన్నారు. ఫలితాలతో కేసీఆర్‌కు అహంకారం సగం తగ్గిందన్నారు. కేసీఆర్‌కు గర్వం పూర్తిగా తగ్గించాలని తిరుపతి దేవుడిని మొక్కుతున్నానని తెలిపారు. వారం లోపు కేసీఆర్ హజీపూర్కు వెళ్లి అక్కడ బాధితులను ఆదుకోవాలని, లేకపోతే మరోసారి ఆ ఊరికి వెళ్లి రోజంతా దీక్ష చేస్తానని హెచ్చరించారు. -
కేసీఆర్ మోసకారి
సాక్షి, మెదక్‌జోన్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశాడని ఏఐసీసీ కార్యదర్శి వీహనుమంతరావు ధ్వజమెత్తారు. శుక్రవారం మెదక్ పట్టణంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు తొలి ముఖ్యంత్రిని దళితుడిని చేయనందుకు తల ఎప్పుడు నరుక్కుంటావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో కేసీఆర్ ఆడని అబద్ధమే లేదన్నారు. కేటీఆర్ సైతం తండ్రి లాగ నీచ సంస్కృతితో తిడుతున్నాడని మండిపడ్డాడు. 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలను చూసి చలించిపోయిన తల్లి సోనియా గాంధీ పార్టీకి ఎంతనష్టం జరిగినా సరేనంటూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. దళితులకు 3 ఎకరాల భూములు, కేజీ టూ పీజీ నిర్భంద విద్య, ఇంటికో ఉద్యోగం అంటూ మాయ మాటలు చెప్పి అధికా రంలోకి వచ్చాడన్నారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శులు బట్టి జగపతి, సుప్రభాత్రావు, సీనియర్ నాయకులు చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ మట్లాడుతూ.. అధికార ంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని గొప్పలు చెప్పిన స్థానిక మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎందుకు మాట నిలబెట్టుకోలేక పోయిందో ప్రజ లు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతా నికి చెందాల్సిన సింగూరు నీటిని అక్రమంగా కేసీఆర్ కొడుకు నియోజకవర్గమైన సిరిసిల్లలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించారని మండిపడ్డారు. ఇక్కడి పంటపొలాలను ఎండబెట్టిన పద్మాదేవేందర్‌రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం కట్టిస్తామని చెప్పి రూ. 10 కోట్లు వెచ్చించి కొంపల్లిలో మాత్రం తాను ఇంద్రభవనం లాంటి ఇళ్లు కట్టుకుంటుం దని విమర్శలు గుప్పించారు. మాజీ ఎంపీ విజ యశాంతి కృషితో రైల్వేలైన్‌తో పాటు జిల్లాకు మెడికల్ కాలేజిని తెస్తే హరీశ్‌రావు దాన్ని సిద్దిపేట జిల్లాకు తరలిస్తుంటే పద్మాదేవేందర్‌రెడ్డి కళ్లప్పగించి చూసిందే తప్పా అడ్డుకున్న పాపాన పోలేద ని మండిపడ్డారు. ఏళ్ల తరబడి రోడ్ల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నా అడిగే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం రాకుంటే కేసీఆర్ కుటుంబం అడుక్కు తినేది.. నర్సాపూర్: సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కుతినేదని వీహెచ్ అన్నారు. మొదట రాష్ట్రమిచ్చిన సోనియాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ఆయన చేపట్టిన ఇందిర విజయ రథం యాత్ర శుక్రవారం రాత్రి నర్సాపూర్‌కు చేరుకుంది. ఈ సందర్బంగా ఆయన స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో.. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటే లేని తప్పు, కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చిందా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరహార దీక్ష చేయలేదని, గ్లూకోజ్‌లు పెట్టుకుని మోసం చేశాడని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి భర్త దివంగత వాకిటి లక్ష్మారెడ్డి తనకు మంచి మిత్రుడని విహెచ్ గుర్తు చేశారు. లక్ష్మారెడ్డి ఆశయాల సాధనకు అనుగుణంగా సునీతారెడ్డి పేద ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారికి అండగా ఉంటుందని ఆయన కొనియాడారు. పోలీసులు కేసీఆర్ చెప్పినట్లుగా చేస్తూ వారికి మితి మీరి వ్యవహరించి తమకు ఇబ్బందులు కలిగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి వారి పని పడతామని వీహెచ్ హెచ్చరించారు. పేద ప్రజల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి టీఆర్ఎస్కు లేదని మాజీ మంత్రి సునీతారెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, మహెందర్‌రెడ్డి,లలిత, సత్యనారాయణగౌడ్, మల్లేశ్, చిన్న ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు. బస్సు పైకి పిలవలేదని నిరసన మెదక్‌జోన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి వీ హన్మంతరావు శుక్రవారం నాడు మెదక్‌లో ప్రచారం నిర్వహించారు. ఆయన రాగానే కొంత మంది కాంగ్రెస్ నాయకులకు బస్‌పైకి పిలిచారు. దీంతో తమను పైకి పిలవలేదని మామిళ్ల ఆంజనేయులు, మేడి మధుసుదన్‌రావు, గూడూరి ఆంజనేయులుతో పాటు మరికొందరు నాయకులు నిరసన తెలుపుతూ స్టేజిపైకి రాలేదు. పార్టీలో ఏళ్ల నుంచి ఉంటున్న తమను పిలవకుండా పార్టీ సభ్యత్వం లేని వారిని పైకి పిలిచి మమ్ములను కించ పరిచరంటూ పక్కనే ఉన్న పెట్రోల్ పంపు వద్ద ఆగిపోయారు.