TS Congress: భట్టి విక్రమార్కపై వీహెచ్‌ సంచలన ఆరోపణలు | Congress Hanumanth Rao Sensational Comments On Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కోల్డ్‌ వార్‌.. భట్టి విక్రమార్కపై వీహెచ్‌ సంచలన ఆరోపణలు

Published Sun, Mar 10 2024 2:00 PM | Last Updated on Sun, Mar 10 2024 2:41 PM

Congress Hanumanth Rao Sensational Comments On Batti Vikramarka - Sakshi

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి జ్వాలలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీనియర్‌ నేత హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్‌ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, వీహెచ్‌ ఢిల్లీలో మీడియాతో​ మాట్లాడుతూ..‘భట్టి విక్రమార్క నాకు ఖమ్మం లోక్‌సభ సీటు రాకుండా చేస్తున్నారు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీని చేసింది నేనే. 

నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నాకు న్యాయం చేయాలి. నేను లోకల్‌ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్‌, రంగయ్య నాయుడు లోకలా?. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేసిన నాకు న్యాయం చేయండి. ఖమ్మం లోక్‌సభ సీటు నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తాను. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా?. బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా?. 

రాహుల్ గాంధీ న్యాయ్‌ యాత్ర, కుల గణన అంటున్నారు. రాహుల్ అయినా నాకు న్యాయం చేయాలి. ఖమ్మం నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తే నేను తప్పుకుంటాను. లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి నేనే అర్హుడిని. నేను పార్టీ కోసం పనిచేశాను. నేను చనిపోయే వరకు పార్టీలోనే ఉంటాను. చనిపోయిన తరువాత పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశాను. నా వయసు నాకు అడ్డంకి కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement