తెలంగాణ సీఎం ప్రమాణస్వీకార ఏర్పాట్లు .. అప్‌డేట్స్‌ | Congress, Telangana Politics And Revanth Reddy Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

Revanth Reddy Live Updates: తెలంగాణ సీఎం ప్రమాణస్వీకార ఏర్పాట్లు .. అప్‌డేట్స్‌

Published Wed, Dec 6 2023 8:45 AM | Last Updated on Wed, Dec 6 2023 8:35 PM

Congress And Telangana Politics Live Updates - Sakshi

Live Updates..

రేవంత్‌ సీఎం.. ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద సంబరాలు

  • ముఖ్యమంత్రిగా గురువారం సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
  • ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సంబురాలు
  • ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్‌, బాణసంచా కాల్చి సంబరాలు



మీ అందరి ఆశీస్సులతో ప్రమాణం చేయబోతున్నా: రేవంత్‌రెడ్డి

  • ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ తెలంగాణ ప్రజలకు ఆహ్వానం
  • సీఎల్పీ నేత ఎనుముల రేవంత్‌రెడ్డి పేరిట ప్రకటన విడుదల
  • హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణం
  • తెలంగాణ ప్రజలకు అభినందనలు
  • విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడింది తెలంగాణ
  • మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది
  • మీ అందరి ఆశీస్సులతో డిసెంబరు 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నా
  • ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం




హైదరాబాద్‌కు టీ కాంగ్‌ సీనియర్లు

  • తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన పలువురు సీనియర్‌ నేతలు
  • సీఎం పదవి కోసం చివరిదాకా కొనసాగిన ఆశావహుల ప్రయత్నాలు
  • తామూ రేసులో ఉన్నామంటూనే.. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటనలు
  • ఏఐసీసీ పెద్దలను కలిసి తమ పేర్లను పరిశీలించాలని విన్నపాలు
  • మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో రేవంత్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు
  • మంత్రి వర్గ కూర్పుపై నిన్న రాత్రి, ఇవాళ రేవంత్‌ కసరత్తులు
  • రేపే ప్రమాణం కావడంతో హైదరాబాద్‌కు తిరుగు పయనం
  • రేవంత్‌ వెంట మాణిక్‌రావ్‌ ఠాక్రే కూడా హైదరాబాద్‌కే
  • రేవంత్‌ బయల్దేరిన కాసేపటికే నగరానికి సీనియర్లు కూడా 
  • హైదరాబాద్ బయలుదేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి





ఎల్బీ స్టేడియం వద్ద భారీగా ఏర్పాట్లు

  • తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
  • రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వేదికగా ఎల్బీ స్టేడియం
  • స్టేడియంలో భారీ ఏర్పాట్లు
  • మొత్తం మూడు వేదికలు
  • ప్రధాన వేదికపైనే  సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం
  • వేదిక ఎడమ వైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక
  • కుడి వైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక
  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
  • గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్‌కు ఘన స్వాగతం
  • అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ
  • తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ
  • ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు
  • స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు
  • స్డేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు


ఇబ్బందుల్లేకుండా చర్యలు.. స్టేడియం వద్ద సీఎస్‌ సమీక్ష

  • ఎల్బీ స్టేడియంలో రేపు జరిగే సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్‌ శాంతకుమారి
  • సాయంత్రం సీఎస్‌ వెంట డీజీపీ రవిగుప్తా కూడా
  • ఉదయం సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎస్‌, డీజీపీ
  • సాయంత్రం మరోసారి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇద్దరు
  • వచ్చే అతిథులు పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్‌ ఆదేశం




ఠాక్రేతో ముగిసిన రేవంత్‌రెడ్డి భేటీ

  • హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఎక్కేముందు ఏఐసీసీ నుంచి రేవంత్‌కు పిలుపు
  • హుటాహుటిన వెనక్కి వెళ్లిన రేవంత్‌
  • తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతో భేటీ
  • ఏఐసీసీ కార్యాలయంలోని మహారాష్ట్ర సదన్‌లో గంటపాటు చర్చ
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన రేవంత్‌
  • రేవంత్‌తో పాటు హైదరాబాద్‌కు ఠాక్రే?
  • రేపు రేవంత్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేయనున్న పలువురు
  • రేపు తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్‌
     


     

తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ?

  • 1. సీఎం - రేవంత్ రెడ్డి
  • 2. డిప్యూటీ సీఎం -   భట్టి విక్రమార్క
  • 3. దామోదర రాజనర్సింహ ( మాదిగ)
  • 4. గడ్డం వివేక్ ( మాల)
  • 5.సీతక్క( ఎస్టీ)
  • 6. పొన్నం ప్రభాకర్(గౌడ్)
  • 7. కొండా సురేఖ ( పద్మశాలి)
  • 8. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి
  • 9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • 10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి
  • 11. మల్ రెడ్డి రంగారెడ్డి 
  • 12. తుమ్మల నాగేశ్వర రావు ( ఖమ్మం)
  • 13. దుద్దిల్ల శ్రీధర్ బాబు( బ్రాహ్మణ)
  • 14. షబ్బీర్ ఆలీ 
  • 15. జూపల్లి కృష్ణారావు 
  • 16. శ్రీహరి ముదిరాజ్ 
  • 17. వీర్లపల్లి శంకర్ (ఎంబీసీ)
  • స్పీకర్ :  రేవూరి ప్రకాశ్ రెడ్డి / శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

  • ప్రజలంతా ఎల్బీ స్టేడియంలోప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం
  • ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చింది

మాణిక్‌రావు ఠాక్రేతో రేవంత్‌రెడ్డి భేటీ

  • మహారాష్ట్ర సదన్‌లో సమావేశం
  • రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంపై చర్చ

రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్‌

  • రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్‌
  • గత రాత్రి సీఎం ప్రకటన తర్వాత హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీకి 
  • డీకే శివకుమార్ నిన్న అర్ధరాత్రి దాదాపు గంటన్నర పాటు రేవంత్‌ చర్చలు  
  • ఈ ఉదయం నుంచి  వరుసగా కాంగ్రెస్‌ పెద్దల్ని కలుస్తూ వచ్చిన రేవంత్‌
  • రేపటి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందజేత
  • మంత్రి వర్గ కూర్పుపైనా చర్చించిన ఏఐసీసీ
  • పార్లమెంట్‌కు వెళ్లి పలువురు ఎంపీలను కలిసిన రేవంత్‌
  • స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపిన ఎంపీలు
  • ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు రిట్నర్‌
  • కాసేపటి కిందట హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సైతం చేరుకున్న రేవంత్‌
  • హైకమాండ్‌ నుంచి రేవంత్‌కు పిలుపు
  • హుటాహుటిన ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఏఐసీసీ కార్యాలయానికి వెళ్తున్న రేవంత్‌రెడ్డి
  • ఎందుకు పిలిచారో అని కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ
     

300 అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం

  • రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
  • ప్రమాణ స్వీకారానికి.. 300 మంది అమరవీరుల కుటుంబాలకు టీ పీసీసీ ఆహ్వానం
  • మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులకు కూడా 
  • ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు.. రేవంత్‌ భావోద్వేగ వ్యాఖ్యలు
  • కాంగ్రెస్‌ విజయం అమరవీరులకు అంకితమని ప్రకటన



సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్

  • 8వ గేట్ నుంచి ముఖ్యమంత్రి ఎంట్రీ 
  • గ్రౌండ్ కేపాసిటీ మొత్తం 80 వేల మందికి అవకాశం 
  • స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు
  • సీసీటీవీ కెమెరాలతో బందోబస్త్ 
  • ఎల్‌ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు
  • ఢిల్లీ నుంచి వస్తున్న నేతలకు భద్రత కట్టుదిట్టం
  • దాదాపు లక్షమంది స్టేడియానికి వచ్చే అవకాశం
  • ట్రాఫిక్ పోలీసులు సూచించిన స్థలాల వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి

ముగిసిన రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన

  • ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ బయల్దేరిన రేవంత్‌రెడ్డి
  • రేపు మధ్యాహ్నాం తెలంగాణ సీఎంగా ప్రమాణం
  • ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • పలు పార్టీల అగ్రనేతలు, రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, సినీ.. క్రీడా రంగ ప్రముఖులకు ఆహ్వానం
  • రేవంత్‌తో పాటు రేపు మంత్రులుగా ప్రమాణం చేయనున్న ఆరుగురు
  • స్పీకర్‌ ఎన్నిక తర్వాత మిగిలిన కేబినెట్‌ ఎంపిక

రేపు ఆరుగురి ప్రమాణం?

  • మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో మల్లగుల్లాలు
  • వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అవుతున్న రేవంత్‌రెడ్డి
  • రేవంత్‌తో ప్రమాణం చేసేది ఆరుగురే?
  • ఒక డిప్యూటీ సీఎం , ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం
  • ​స్పీకర్‌ ఎవరనేది తేలాక.. మరోసారి మంత్రి వర్గ విస్తరణ



ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

  • హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నాం: డీజీపీ రవిగుప్తా
  • ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం
  • ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు
  • సుమారు లక్ష మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు: డీజీపీ రవిగుప్తా
  • ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది
  • మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు


ఎవరికి వారే..
 

  • తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం అందరి ప్రయత్నాలు
  • అధిష్టానంపైనే ఆశలు పెట్టుకున్న సీనియర్లు
  • నిన్న సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందన్న ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌
  • కాంగ్రెస్‌ నాయకులంతా కలిసి పని చేయాలన్న ఖర్గే
  • డీకే శివకుమార్‌ను కలిసి మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
  • అధిష్టానమే మంత్రి పదవుల్ని నిర్ణయిస్తుందన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • మంత్రి పదవిపై ఆశతో ఉన్న ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


రేవంత్‌కు రాహుల్‌ అభినందనలు

  • తెలంగాణ కాబోయే సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌ గాంధీ అభినందనలు
  • తెలంగాణలో ఇచ్చిన హామీల్ని  కాంగ్రెస్‌ నెరవేరుస్తుంది
  • రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యయుత పాలన అక్కడి ప్రజలకు అందుతుంది


రేవంత్‌ ప్రమాణ స్వీకారానికి వాళ్లకు ఆహ్వానం 

  • డిసెంబర్‌ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
  • మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తెలంగాణ సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్‌
  • ఏర్పాట్లు చేస్తున్న ఆర్‌ అండ్‌​ బీ అధికారులు
  • ఎల్బీ స్టేడియంలో సీఎస్‌, డీజీపీ, జీహెచ్‌ఎంసీతోపాటు ఇంటటెలిజెన్స్‌ అధికారులు
  • ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, భద్రత పర్యవేక్షణ
  • ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులు
  • ఇప్పటికే పలువురిని వ్యక్తిగతంగా ఆహ్వానించిన రేవంత్‌
  • తెలంగాణ అమర వీరుల కుటంబానికి ఆహ్వానం కూడా
     

మంచి పాలన అందిస్తాం: డీకేఎస్‌

  • ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరిన డీకే శివకుమార్‌
  • తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో డీకేఎస్‌ కీలక పాత్ర
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్‌ పరిశీలకుడిగా బాధ్యతలు.. ప్రచారంలో పాల్గొన్న డీకేఎస్‌
  • సీఎల్పీ భేటీ వివరాలను అధిష్టానానికి తెలియజేశా: డీకేఎస్‌
  • తెలంగాణ ప్రజలు మాకు అధికారం అప్పగించారు: డీకేఎస్‌
  • వాళ్లకి మంచి పాలన అందిస్తాం: డీకేఎస్‌
  • రేపు హైదరాబాద్‌కు రానున్న డీకేఎస్‌
  • రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేఎస్‌
  • హై కమాండ్ కు నివేదిక అందించాము.
  • హై కమాండ్ సీఎం అభ్యర్థి పై నిర్ణయం తీసుకున్నారు.
  • అధిష్టానానికి అన్ని అంశాలను వివరించాం
  •  ఇకపై  అధిష్టానమే నిర్ణయాలను తీసుకుంటుంది.

రేవంత్‌ రాజీనామా వాయిదా?

  •  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి 
  • తెలంగాణ అసెంబ్లీ ఎ‍న్నికల్లో కొడంగల్‌ నుంచి గెలుపు
  • సీఎం పదవి దక్కడంతో ఎంపీ పదవికి రాజీనామా
  • అయితే రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్‌
  • సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఎంపీ పదవికి  రాజీనామా చేయనున్న రేవంత్?
  • రేపు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేయనున్న రేవంత్‌

డీకే శివకుమార్‌ను కలిసిన శ్రీధర్‌బాబు

  • డీకే శివకుమార్‌ను కలిసిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు
  • మర్యాదపూర్వకంగా డీకే శివకుమార్‌ను కలిశా
  • కాంగ్రెస్‌ అధిష్టానం మేరకు నడుచుకుంటాం
  • మంత్రి పదవిని కాంగ్రెస్‌ అధిష్టానం ఇస్తే తీసుకుంటాను 
  • ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశాను 
  • కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం


తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు నా కల: బండ్ల గణేష్‌

  • ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన బండ్ల గణేష్‌
  • తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు నా కల
  • నేను చెప్పినట్లు జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. 
  • ప్రమాణ స్వీకారోత్సవం ఏడోతేదీ అని చెప్పడంతో సంతోషించాను. 
  • రేవంత్‌ పార్టీని ముందుకు తీసుకెళ్లిన విధానం ప్రజలకు నచ్చింది. 

రాజ్‌భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

  • రాజ్‌భవన్‌కు టీకాంగ్రెస్‌ నేతలు
  • గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన మల్లు రవి, మహేష్‌ కుమార్‌ గౌడ్‌
  • సీఎల్పీ నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నట్టు తెలిపిన నేతలు
  • 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖ గవర్నర్‌కు అందజేత
  • రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ ప్రమాణం చేస్తారని గవర్నర్‌కు తెలిపిన నేతలు
     

రేవంత్‌ రాజీనామా

  • రేవంత్‌ రెడ్డి పార్లమెంట్‌కు వెళ్లారు
  • ఈ సందర్భంగా ఎంపీ స్థానానికి రేవంత్‌ రాజీనామా చేశారు. 
  • అలాగే, పార్లమెంటులో ఎంపీలను కలిసిన రేవంత్ రెడ్డి
  • రూమ్‌ నెంబర్-66లో పలు పార్టీల ఎంపీలతో సమావేశమైన రేవంత్
  • రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు

రేపు రజినీ ఉద్యోగ నియామకంపై రేవంత్‌ సంతకం

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని హామీ
  • దివ్యాంగురాలు రజినీకి హామీ ఇచ్చిన రేవంత్‌
  • ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రజినీకి పిలుపు. 
  • రేపు రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్న రేవంత్‌. 
     

అధిష్టానం నిర్ణయానానికి కట్టుబడాలి: కాంగ్రెస్‌ నేతలు

  • సాక్షి టీవీతో  బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 
  • సీఎం పదవి ఎవరైనా ఆశించడంలో తప్పులేదు 
  • కానీ అందరూ అధిష్టానం  నిర్ణయానికి కట్టుబడి ఉండాలి
  • ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే  లక్ష్యం  
  • సాక్షి టీవీతో  షబ్బీర్ అలీ..
  • ఏఐసీసీ అగ్రనేతలను రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు  
  • పూర్తి స్థాయి మంత్రి వర్గం ఉంటుందా లేదా అనే సమాచారం లేదు 
  • అలాంటి చర్చ ఇప్పుడు జరగలేదు 
  • ప్రజలకు సుస్థిర పరిపాలన అందిస్తాము. 

సోనియా, రాహుల్‌, ప్రియాంకతో రేవంత్‌ భేటీ

  • కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీతో రేవంత్‌ సమావేశం
  • సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించిన రేవంత్‌

రేవంత్‌ ప్రమాణ స్వీకారంలో స్వల్ప మార్పు

  • సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం టైమ్‌లో స్వల్ప మార్పు.
  • రేవంత్‌ రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 


ఎల్బీ స్టేడియంలో సీఎస్‌, డీజీపీ పర్యవేక్షణ

  • సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చేరుకున్న సీఎస్‌ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా.
  • ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్‌, డీజీపీ
  • ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించిన డీజీపీ
     

ఎన్నికల్లో ఓడిన వారికి కేబినెట్‌లో చోటు..
►కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం
►ఎన్నికల్లో టిక్కెట్‌ త్యాగం చేసిన వారికి, ఓడిన సీనియర్‌ నేతలకు మంత్రి మండలిలో చోటు కల్పించేందుకు టీకాంగ్రెస్‌ కసరత్తు
►టిక్కెట్‌ త్యాగం చేసిన చిన్నారెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి, అద్దంకి దయాకర్‌తో పాటు ఓడిన షబ్బీర్‌ అలీ, జీవన్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్న ఏఐసీసీ

ఖర్గేతో రేవంత్‌ భేటీ..

  • కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన రేవంత్‌ భేటీ
  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌ భేటీ
  • ప్రమాణస్వీకారోత్సవానికి ఖర్గేను ఆహ్వానించిన రేవంత్‌

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ..

  • ఢిల్లీ పర్యాటనలో భాగంగా బిజీగా రేవంత్‌ రెడ్డి
  • ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ అయ్యారు. 

రేవంత్ నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు..

  • తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద  పోలీస్ ఆంక్షలు
  • ఇంటివద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు 
  • రేవంత్ నివాసం వద్ద భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్న పోలీస్ అధికారులు
  • రేవంత్ నివాసం నుండి బయటకు వచ్చే రూట్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది
  • రేవంత్ నివాసం వద్ద చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండటంతో తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది 
  • సీఎల్పీ నేత, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి 200 మీటర్ల దూరంలోనే బారీకేడ్లు వేసి ఆంక్షలు
  • ఇప్పటికే రేవంత్ నివాస పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఇంటెలిజెన్స్ పోలీసులు.

కాసేపట్లో ఖర్గేతో రేవంత్‌ భేటీ..

  • ఈరోజు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్న రేవంత్
  • ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్న రేవంత్
  • మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించనున్న రేవంత్

నేడు సోనియా గాంధీని కలవనున్న రేవంత్‌

  • నేడు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలవనున్న రేవంత్ రెడ్డి
  • రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్న రేవంత్
  • డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్‌తో కలిసి క్యాబినెట్‌పై కసరత్తు చేయనున్న రేవంత్
  • క్యాబినెట్ కూర్పు కసరత్తులో పాల్గొననున్న ఉత్తమ్, భట్టి

9న తెలంగాణ కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ

  • డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ
  • అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేయనున్న కాంగ్రెస్‌
  • అంతకు ముందే కొలువు దీరనున్న తెలంగాణ కేబినెట్‌
  • డిసెంబర్‌ 7వ తేదీనే ప్రమాణం చేయనున్న రేవంత్‌రెడ్డి
  • రేవంత్‌తో పాటు మరికొందరు మంత్రులుగా కూడా!
  • ఆరు గ్యారెంటీలపై కృతజ్ఞత సభలో కీలక ప్రకటన చేసే అవకాశం

►కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డిని ఎంపిక చేశామని, ఈ నెల 7న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రకటించింది. 

►తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరు ఉంటారన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రెండు రోజుల పాటు అనేక తర్జనభర్జనలు, సంప్రదింపులు జరిపి, నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది.

►ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు. గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రి పదవుల అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ సుపరిపాలన అందించబోతోందని.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement