సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి.. నీస్థాయిని నీవు తగ్గించుకుంటున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీహెచ్.. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్‌ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారు. అలాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు?. వారిని పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదు. ఆయన తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నారు.’’ అంటూ ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డిని తాను కలిసి ఇవన్నీ చెబుతామంటే తనకు సమయం ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్లు మన వైపు వస్తున్నారు. కాంగ్రెస్ కేడర్‌కు న్యాయం చేయకుండా మన వారిపై కేసులు పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. బీఆర్ఎస్ హయాంలో తాము ఎక్కడకు వెళ్లినా కేసులు పెట్టారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీటిని ఎత్తివేయాలి. రేవంత్ రెడ్డి ఒకవైపు కాకుండా రెండువైపుల వినాలి. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగవద్దనేది తన ఉద్దేశ్యమని వీహెచ్ అన్నారు.
ఇదీ చదవండి: కవిత మేనల్లుడి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
Comments
Please login to add a commentAdd a comment