
'రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సహాయం'
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టబోయే రైతు భరోసా యాత్ర నేపథ్యంలో.. గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పీసీసీ ఆర్ధిక సహాయం అందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. తనవంతుగా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగే నేతలంతా ఇదే విధంగా లక్ష రూపాయల చొప్పున విరాళాలు ఇవ్వాలని వీహెచ్ కోరారు. ఒక్కొ నియోజక వర్గం నుంచి 500 మంది కార్యకర్తలు రాహుల్ గాంధీ వెంట తరలి రావాలని వీహెచ్ సూచించారు.