మీడియాతో మాట్లాడుతున్న వీహనుమంతరావు
సాక్షి, మెదక్‌జోన్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశాడని ఏఐసీసీ కార్యదర్శి వీహనుమంతరావు ధ్వజమెత్తారు. శుక్రవారం మెదక్ పట్టణంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు తొలి ముఖ్యంత్రిని దళితుడిని చేయనందుకు తల ఎప్పుడు నరుక్కుంటావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో కేసీఆర్ ఆడని అబద్ధమే లేదన్నారు. కేటీఆర్ సైతం తండ్రి లాగ నీచ సంస్కృతితో తిడుతున్నాడని మండిపడ్డాడు. 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలను చూసి చలించిపోయిన తల్లి సోనియా గాంధీ పార్టీకి ఎంతనష్టం జరిగినా సరేనంటూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు.
దళితులకు 3 ఎకరాల భూములు, కేజీ టూ పీజీ నిర్భంద విద్య, ఇంటికో ఉద్యోగం అంటూ మాయ మాటలు చెప్పి అధికా రంలోకి వచ్చాడన్నారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శులు బట్టి జగపతి, సుప్రభాత్‌రావు, సీనియర్ నాయకులు చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ మట్లాడుతూ.. అధికార ంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని గొప్పలు చెప్పిన స్థానిక మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎందుకు మాట నిలబెట్టుకోలేక పోయిందో ప్రజ లు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతా నికి చెందాల్సిన సింగూరు నీటిని అక్రమంగా కేసీఆర్ కొడుకు నియోజకవర్గమైన సిరిసిల్లలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించారని మండిపడ్డారు. ఇక్కడి పంటపొలాలను ఎండబెట్టిన పద్మాదేవేందర్‌రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
నిరుపేదలకు డబుల్ బెడ్రూం కట్టిస్తామని చెప్పి రూ. 10 కోట్లు వెచ్చించి కొంపల్లిలో మాత్రం తాను ఇంద్రభవనం లాంటి ఇళ్లు కట్టుకుంటుం దని విమర్శలు గుప్పించారు. మాజీ ఎంపీ విజ యశాంతి కృషితో రైల్వేలైన్‌తో పాటు జిల్లాకు మెడికల్ కాలేజిని తెస్తే హరీశ్‌రావు దాన్ని సిద్దిపేట జిల్లాకు తరలిస్తుంటే పద్మాదేవేందర్‌రెడ్డి కళ్లప్పగించి చూసిందే తప్పా అడ్డుకున్న పాపాన పోలేద ని మండిపడ్డారు. ఏళ్ల తరబడి రోడ్ల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నా అడిగే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం రాకుంటే కేసీఆర్ కుటుంబం అడుక్కు తినేది..
నర్సాపూర్: సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కుతినేదని వీహెచ్ అన్నారు. మొదట రాష్ట్రమిచ్చిన సోనియాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ఆయన చేపట్టిన ఇందిర విజయ రథం యాత్ర శుక్రవారం రాత్రి నర్సాపూర్‌కు చేరుకుంది. ఈ సందర్బంగా ఆయన స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో.. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటే లేని తప్పు, కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చిందా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరహార దీక్ష చేయలేదని, గ్లూకోజ్‌లు పెట్టుకుని మోసం చేశాడని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి భర్త దివంగత వాకిటి లక్ష్మారెడ్డి తనకు మంచి మిత్రుడని విహెచ్ గుర్తు చేశారు.
లక్ష్మారెడ్డి ఆశయాల సాధనకు అనుగుణంగా సునీతారెడ్డి పేద ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారికి అండగా ఉంటుందని ఆయన కొనియాడారు. పోలీసులు కేసీఆర్ చెప్పినట్లుగా చేస్తూ వారికి మితి మీరి వ్యవహరించి తమకు ఇబ్బందులు కలిగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి వారి పని పడతామని వీహెచ్ హెచ్చరించారు. పేద ప్రజల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి టీఆర్‌ఎస్‌కు లేదని మాజీ మంత్రి సునీతారెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, మహెందర్‌రెడ్డి,లలిత, సత్యనారాయణగౌడ్, మల్లేశ్, చిన్న ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.
బస్సు పైకి పిలవలేదని నిరసన
మెదక్‌జోన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి వీ హన్మంతరావు శుక్రవారం నాడు మెదక్‌లో ప్రచారం నిర్వహించారు. ఆయన రాగానే కొంత మంది కాంగ్రెస్ నాయకులకు బస్‌పైకి పిలిచారు. దీంతో తమను పైకి పిలవలేదని మామిళ్ల ఆంజనేయులు, మేడి మధుసుదన్‌రావు, గూడూరి ఆంజనేయులుతో పాటు మరికొందరు నాయకులు నిరసన తెలుపుతూ స్టేజిపైకి రాలేదు. పార్టీలో ఏళ్ల నుంచి ఉంటున్న తమను పిలవకుండా పార్టీ సభ్యత్వం లేని వారిని పైకి పిలిచి మమ్ములను కించ పరిచరంటూ పక్కనే ఉన్న పెట్రోల్ పంపు వద్ద ఆగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment