సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ సీనీయర్ నేత వీహెచ్ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దూమారం రేపుతున్నాయి. వీహెచ్ వ్యాఖ్యలపై పార్టీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ వ్యాఖ్యలపై కార్యదర్శి బోస్‌రాజును ఠాగూర్ నివేదిక కోరారు. దీంతో హనుమంతరావు వ్యాఖ్యలు, పేపర్ క్లిప్పింగ్స్‌ను బోస్‌రాజు ఠాగూర్‌కు పంపించారు. ఈ క్రమంలో వీహెచ్‌కు నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా టీపీసీసీ చీఫ్ ఎంపిక నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన రగడ..
అభిప్రాయ సేకరణలో తను ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి చేరకుండా ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అడ్డుకున్నాడని వీహెచ్ విమర్శించారు. ఆయన అధిష్టానానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని, ప్యాకేజీకి అమ్ముడుపోయాడని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చదవండి: రేవంత్‌కన్నా నాకే క్రేజ్ ఎక్కువ ఉంది..
Comments
Please login to add a commentAdd a comment