సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు ప్రధాని మోదీ ముందుండి నాయకత్వం వహిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి పోరాటాన్ని కొనసాగించాలంటూ మోదీ చెప్పినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆదివారం ఆయన ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు.
‘రూ.18 వేల బొగ్గు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ డబ్బులతో రాజగోపాల్‌రెడ్డి రూ.150 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు రూ.4 వేలు పంచారు. టీఆర్‌ఎస్ రూ.5వేలిచ్చింది. ఇప్పుడు పోరాటం కొనసాగించాలని సాహిబ్ (మోదీ) చెప్తున్నారు. పోరాటం చేయడమంటే మరిన్ని మైనింగ్ కాంట్రాక్టులు, ఓటుకు ఎక్కువ డబ్బులు ఇవ్వడమా?’అని తన ట్వీట్‌లో మాణిక్యం ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment