సాక్షి, హైదరాబాద్: హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు పోయాయని.. ప్రధాని మోదీ ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ హమీలపై వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నిస్తానన్నారు. ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో రెండు హమీలు అమల్లోకి తెచ్చామని, మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. సమరోత్సహంతో కార్యకర్తలు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలంటూ ఖర్గే పిలుపునిచ్చారు.
సమస్యలు ఎదురైనప్పుడు మోదీ ఏదో ఒక ఇష్యూతో డైవర్ట్ చేస్తుంటారని.. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో మోదీ దిట్ట అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ, షా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసే కుటిల రాజకీయం చేస్తుంటారు. ఈడీ,ఐటీ, సీబీఐలను ఉసిగొలిపి.. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు ఎవరూ భయపడరు. కేసీఆర్ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదు.. కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారు’’ అంటూ ఖర్గే దుయ్యబట్టారు.
‘‘ఒకసారి పాకిస్తాన్ బూచీ చూపిస్తారు.. మరోసారి దేవుడ్ని వాడుకుంటారు. మోదీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయాయి. సామాన్యుల ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్ న్యాయ యాత్ర చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి పార్టీని గెలిపించాలి’’ అని ఖర్గే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అలా మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులొస్తాయ్: కిషన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment