AICC president
-
అండగా ఉన్నోళ్లనే అక్కున చేర్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ భావజాలానికి కట్టుబడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీకోసం నిలబడిన వ్యక్తులను ప్రోత్సహించాలని, కష్ట సమయాల్లో పార్టీని వీడిన నేతలను దూరం పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ‘పార్టీకి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి. కష్ట సమయాల్లో పారిపోయే బలహీనులకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను తొందరపడి చేర్చుకుంటారు. మనం అలాంటి వ్యక్తులను దూరం పెడదాం’ అని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జీలతో ఖర్గే సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికలపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘పార్టీని బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతంం చేసే బాధ్యతను ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు తీసుకోవాలి. ఈ పని కోసం మీరే బూత్‌కు వెళ్లాలి. కష్టపడి పనిచేయాలి. కార్మికులతో సంభాషించాలి. పార్టీ విభాగాలతో చర్చించాలి. సంస్థ పునర్ నిర్మాణంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ని భాగస్వామ్యులను చేయండి’’ అని ఖర్గే సూచించారు. ‘‘రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ, భవిష్యత్తు ఎన్నికల ఫలితాలకు ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జీలే బాధ్యత వహించాలి. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సమయంలో మన పార్టీ మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడమో లేక ఆ పేరును మరో బూత్‌లోకి మార్చడమో చేస్తున్నారు. ఈ రిగ్గింగ్‌ను ఎలాగైనా మనం ఆపాలి’’ అని ఖర్గే పిలుపునిచ్చారు. -
మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం వివరించారు. ఈ అంశాలపై నిర్వహించే సభలకు రావాలని ఖర్గేను ఆహ్వానించారు.కాగా, నిన్న (గురువారం) హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సుమారు ఐదుగంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు తదితర అంశాలపై చర్చించారు.ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!సూర్యాపేటలో కులగణన సభకు రాహుల్ గాంధీని, మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వ్యయం చేస్తున్న అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని నిధులిచ్చారనే అంశాన్ని కూడా భట్టి ఇందులో వివరించినట్టు సమాచారం. -
ఆ విషయంలో మోదీ దిట్ట.. ప్రధానిపై ఖర్గే నిప్పులు
సాక్షి, హైదరాబాద్: హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు పోయాయని.. ప్రధాని మోదీ ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ హమీలపై వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నిస్తానన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో రెండు హమీలు అమల్లోకి తెచ్చామని, మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. సమరోత్సహంతో కార్యకర్తలు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలంటూ ఖర్గే పిలుపునిచ్చారు. సమస్యలు ఎదురైనప్పుడు మోదీ ఏదో ఒక ఇష్యూతో డైవర్ట్ చేస్తుంటారని.. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో మోదీ దిట్ట అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ, షా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసే కుటిల రాజకీయం చేస్తుంటారు. ఈడీ,ఐటీ, సీబీఐలను ఉసిగొలిపి.. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు ఎవరూ భయపడరు. కేసీఆర్ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదు.. కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారు’’ అంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘ఒకసారి పాకిస్తాన్ బూచీ చూపిస్తారు.. మరోసారి దేవుడ్ని వాడుకుంటారు. మోదీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయాయి. సామాన్యుల ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్ న్యాయ యాత్ర చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి పార్టీని గెలిపించాలి’’ అని ఖర్గే పేర్కొన్నారు. ఇదీ చదవండి: అలా మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులొస్తాయ్: కిషన్‌రెడ్డి -
లోక్‌సభ ఎన్నికలపై ఏఐసీసీ కీలక సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఏఐసీసీ గురువారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, రాష్ట్రాల ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో దాదాపు మూడు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రానున్న లోక్‌సభ ఎన్నికలు, రాహుల్ చేపట్టనున్న ‘భారత్ న్యాయ్ యాత్ర’పై కాంగ్రెస్ హైకమాండ్ చర్చించింది. ఏఐసీసీ సమావేశం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించడమే తమ ఎజెండా అని తెలిపారు. భారత్ న్యాయ్ యాత్ర కోసం సిద్ధం కావాలని సూచించారు. ఇండియా కూటమితో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా 8 నుంచి 10 భారీ బహిరంగ సభలు సంయుక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మేనిఫెస్టో కమిటీ కూడా ఆ దిశగా పనిచేస్తోందన్నారు. ‘పగలు రాత్రి కష్టపడితేనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించగలుగుతాం. మనం బలహీనంగా ఉన్న సీట్లను గుర్తించాలి. చరిత్రలో తొలిసారిగా 146 మంది ఎంపీలను అప్రజాస్వామిక పద్ధతిలో సస్పెండ్ చేశారు. క్రిమినల్ లా బిల్లులు, టెలికమ్యూనికేషన్ బిల్లు, CEC బిల్లు వంటి బిల్లులు చర్చ లేకుండా ఆమోదించారు’ అని పేర్కొన్నారు. -
Rajasthan Elections 2023: రాజస్థానీలకు కాంగ్రెస్ ఏడు గ్యారంటీలు
అనుప్‌గఢ్, రాజస్థాన్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలను ప్రకటించింది. రాజస్థాన్‌లోని అనుప్‌గఢ్‌లో సోమవారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ ఏడు హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ సామాజిక పథకాలతోపాటు ఆర్థిక సాధికారత దిశగా ఇప్పుడు ప్రకటించిన ఏడు గ్యారంటీలు రాష్ట్రంలో అసమానతలను తొలగించి రాజస్థాన్‌ను మరింత సంపన్నంగా మారుస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ఖర్గే ప్రకటించిన గ్యారంటీల్లో ప్రధానంగా గృహ లక్ష్మి యోజన హామీ కింద కుటుంబంలో మహిళా పెద్దకు ఏటా రూ. 10వేలు, గౌధన్ పథకం కింద పాడి రైతుల నుంచి కిలోకు రూ.2 చొప్పున చెల్లించి ఆవు పేడ కొనుగోలు, ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల పంపిణీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం విద్య, రూ.500 కంటే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ హామీలను మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అంతకుముందు హనుమాన్‌గఢ్‌లో ప్రచార ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ దేశంలో భారీ మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలను నిర్మించిన ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను విస్మరించడంపై ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. దేశంలో పెద్ద డ్యామ్‌ల నుంచి ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల వరకు అన్నింటినీ కాంగ్రెస్సే నిర్మించిందన్నారు. కాంగ్రెస్ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. -
ఆయన వెళ్లడానికి రెడీ.. ప్రజలు పంపడానికి రెడీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తాము ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వెళితే.. ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు ముందే చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారని, ఆయనను సాగనంపడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. ఎలాగూ సీఎం కేసీఆర్ కూడా రిటైర్మెంట్ రోజులొచ్చాయని, ప్రజలు ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటానని అంటున్నారని చెప్పారు. కేసీఆర్‌కు బై బై, టాటా చెప్పి సాగనంపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి తెలంగాణ ఇస్తే కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చుని, రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను టీపీసీసీ నేతలతో కలసి ఖర్గే ఆవిష్కరించారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాం. ఈ మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుంది. మా పార్టీ నేతలంతా ఐక్యంగా ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోను అమలు చేస్తారు. ఎలాంటి సందేహం అవసరం లేదు. అధికారం కాంగ్రెస్‌కే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అనేక తప్పులు చేసింది. కొంతకాలం కిందటి వరకు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఎన్నికల సమయంలో స్వరం తగ్గించారు. బీఆర్ఎస్ను దేశమంతటా విస్తరిస్తానని చెప్పిన కేసీఆర్.. మహారాష్ట్ర వరకు వెళ్లారు. మోదీ వద్దనడంతో ఆగిపోయారు. మోదీ, కేసీఆర్ కలసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కర్ణాటకకు వచ్చి చూడండి కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడం లేదంటూ కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మేమిచి్చన గ్యారంటీలన్నీ అమలవుతున్నాయి. కావాలంటే వచ్చి చూసుకోండి. దేవుడి పేరు మీద ఓట్లడిగే పార్టీ మహిళలకు ఏమీ చేయలేకపోయింది. అదే కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో.. చాలా మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించి దేవాలయాలు దర్శించుకుంటున్నారు. అమలు చేయకుంటే.. కేబినెట్లో మార్పు! ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఖర్గే.. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మీ వల్ల కావడం లేదని, కేబినెట్లో వేరే వాళ్లని తీసుకోవాలని నేను చెప్పాల్సి వస్తుంది’’అని పేర్కొన్నారు. దమ్ముంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తేవాలి ప్రధాని మోదీ చెప్పినవేవీ అమలు కావు. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ అంతే. ఎస్సీల్లోని మాదిగ, మాల ఉపకులాలకు ఏమేం కావాలో అన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచి్చంది. దేశంలో ఎవరికి ఏం కావాలో అన్నీ చేసేది కాంగ్రెస్ పారీ్టనే. మా పార్టీ అమలు చేసే సమయంలో మోదీ పుట్టి కూడా ఉండరు. కానీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చి పదేళ్లయింది. ఎస్సీ వర్గీకరణ చేస్తానంటే ఇన్ని రోజులు ఆయనను ఆపిందెవరు? మోదీ ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి చేయలేదు. ఇప్పుడు వర్గీకరణ విషయంలోనూ మోదీ చెప్పేది చేయరు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, పూర్తి మెజార్టీ కూడా ఉంది. దమ్ముంటే ఎస్సీ వర్గీకరణపై రేపే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేయాలి..’’అని ఖర్గే సవాల్ చేశారు. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది: రేవంత్ ఎన్నికల మేనిఫెస్టో రూపంలో తాము తెలంగాణ ప్రజలకు హామీ పత్రం ఇస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించి, నమ్ముకున్న వారికి ద్రోహం చేస్తూ పరిపాలించడంతో.. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాకపోగా మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పదేళ్లు కేసీఆర్‌కు అవకాశమిచ్చారని, ఈసారి కాంగ్రెస్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోందని, సునామీ సృష్టించబోతోందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం వస్తుంది: భట్టి తెలంగాణ సంపదను ప్రజలకు పంచిపెట్టాలనే ఆలోచనతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఇది తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీల హయాంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా మేనిఫెస్టో తయారు చేశామని, తెలంగాణ ప్రజల బంగారు భవిష్యత్తుకు ఇది బాట వేస్తుందని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. సీనియర్ నేతలు వీహెచ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, జెట్టి కుసుమకుమార్ తదతరులు పాల్గొన్నారు. -
నేడు తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పర్యటన
-
ఖర్గే, రాహుల్ గాం«దీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాం«దీతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. త్వరలోనే కూటమి నేతలంతా మరోసారి భేటీ కావాలని పవర్, ఖర్గే, రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. -
కర్ణాటక సీఎం అభ్యర్థిపై ఖర్గే క్లారిటీ
బెంగళూరు: కాంగ్రెస్ నాయకుల సమష్టి కృషి వల్లే కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారీ మెజార్టీ అందించిన కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠపైనా మీడియా ఆయన్ని ఆరా తీసింది. ఎవరిని ఎంపిక చేస్తారని ప్రశ్నించింది. అతిముఖ్యమైన ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను అధిష్టానమే నిర్ణయిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. ‘‘కర్ణాటక ఎన్నికల్లో ప్రజాస్వామ్యానిదే విజయం. అధికారం డబ్బు, ప్రభావం పని చేయలేదు. బీజేపీ దృష్టంతా కర్ణాటక మీదే పెట్టింద’’ని అన్నారాయన. అలాగే.. కర్ణాటకలో ప్రచారం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగాలేకపోయినా పార్టీ కోసం వచ్చి ప్రచారం చేశారని గుర్తు చేశారు. మేం గెలిచాం. ఇప్పుడు చేయాల్సిన పనులపై దృష్టి పెడతాం. ఎవర్నీ కించపరచాలని అనుకోవడం లేదు. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాం. అన్ని హామీలు నెరవేర్చుతాం. అని ఖర్గే అన్నారు. ఇదిలా ఉంటే రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే సీఎం ఎంపికపై ఓ స్పష్టత రావొచ్చని సమాచారం. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే
శివాజీనగర: కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తరువాతే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి, హైకమాండ్ చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం తమ సంప్రదాయం కాదని చెప్పారు. సోమవారం చిక్కమగళూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రిని ప్రకటించాలన్న బీజేపీ సవాల్‌పై స్పందిస్తూ తమ పార్టీలో కులాల వారీగా సీఎంను ప్రకటించడం లేదన్నారు. బీజేపీలో అవినీతి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు విసుగెత్తారని, అదే ఇతరులపై చిన్న ఆరోపణ వస్తే వెంటనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తారని ఆరోపించారు. -
విగ్రహాలు కాదు.. దళితులకు చేసిందేమిటి..?
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌తో కలసి నెహ్రూ పనిచేశారు. రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారు. నాడు కాంగ్రెస్ తెచి్చన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారు. –ఖర్గే సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘‘ఒకరు 20 అడుగులు, మరొకరు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ పేద దళితులకు చేసిందేమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయి. కేవలం ప్రకటనలు చేస్తే సరిపోదు. పేద దళితుల కోసం చేసిందేమిటో చెప్పాలి..’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. నేటి ప్రభుత్వాలు భావ ప్రకటనా స్వేచ్ఛను, హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో జరిగిన ‘జైభారత్ సత్యాగ్రహ సభ’లో మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితుల పేరు చెప్పి మోసం.. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ దళితుల పేరు చెబుతూ మోసం చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఇవ్వకుండా దళితులను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక దళితుల కోసం ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేవలం పేపర్లలో ప్రకటనలు ఇస్తే సరిపోదన్నారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. భావ ప్రకటన స్వేచ్ఛను, హక్కులను హరిస్తున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశానికి ఎంతో సేవ చేసిందని.. కానీ ఆగమేఘాలపై రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రతిపక్షాలపై కక్షగట్టలేదన్నారు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బలహీనపర్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మీరు చేసిందేంటో చెప్పండి.. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారని, నాడు చేసిన కాంగ్రెస్ తెచి్చన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారని, అమిత్‌షా హోంమంత్రి అయ్యే అవకాశం వచి్చందని ఖర్గే చెప్పారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌తో కలిసి నెహ్రూ పని చేశారని, రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు దేశానికి చేసినదేమిటో చెప్పాలన్నారు. దేశ సేవలో వారి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. పైగా ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. అదేమీ చేయకపోగా ఎయిర్‌పోర్టులు, రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో ప్రైవేటీకరణతో నేడు ఉద్యోగాల సంఖ్య 40వేలకు తగ్గిందని చెప్పారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రేవంత్‌రెడ్డి, భట్టి పాదయాత్రలు చేపట్టారన్నారు. -
ఉత్తర తెలంగాణలోని 20 అసెంబ్లీ సీట్లపై కాంగ్రెస్ ఫోకస్
-
Manickam Tagore: చక్కదిద్దలేక.. స్వచ్ఛందంగా..!
సాక్షి, హైదరాబాద్: మాణిక్యం ఠాగూర్.. కాంగ్రెస్ రాష్ట్రాల ఇన్చార్జుల జాబితాలో పాపులర్ అయిన పేరు ఇది. తెలంగాణ ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ మూడు కొట్లాటలు, ఆరు తగాదాలన్నట్టుగా నిత్యం వార్తల్లో నిలిచింది. 2020 సెప్టెంబర్‌లో బాధ్యతలు తీసుకున్న ఆయన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకునే వరకు ప్రతిరోజూ ఏదో ఒక తలనొప్పితోనే సతమతమయ్యారు. పార్టీ నేతలను సమన్వయం చేయలేక, పరిస్థితులను చక్కదిద్దలేక, అధిష్టానానికి ఏం చెప్పాలో అర్థం కాక నానా అవస్థలు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత ఈ తలనొప్పులు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టడం, తెలంగాణ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలగడం చర్చనీయాంశమయ్యింది. ఆయన రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పుకుంటారని, కొత్త ఇన్చార్జి వస్తారనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. విఫల ఇన్చార్జిగా మిగిలిపోతానని..! రాష్ట్ర పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించేందుకు మాణిక్యం ఠాగూర్ విముఖత వ్యక్తం చేయడం వెనుక పలు కారణాలున్నాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పారీ్టలోని కయ్యాలు తన వ్యక్తిగత కెరీర్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. తాను ఇన్చార్జిగా వచ్చిన తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ వైఫల్యం తనకు చుట్టుకుంటే తానో విఫల ఇన్చార్జిగా మిగిలిపోతాననే ఆందోళన ఆయన రాష్ట్ర పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దలేకపోయానని అధిష్టానం భావిస్తే సంస్థాగతంగా కూడా తనకు ఇబ్బంది అవుతుందని భావించే వారని మాణిక్యంతో సన్నిహితంగా ఉన్న నేతలు వెల్లడించారు. దీనికి తోడు లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నా.. తన సొంత నియోజకవర్గమైన విదురకు సమయం ఇవ్వలేకపోతున్నానని, కోరుకున్న విధంగా తమిళనాడు పీసీసీ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను నియోజకవర్గానికి వెళ్లిపోతానని ఆయన చెప్పేవారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. -
పీసీసీ చీఫ్‌పై ఇన్ని ఫిర్యాదులా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌పై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి సీనియర్లు, ఇతర నేతల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. దీనికి కారణాలేంటని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఇన్చార్జి కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీం జావేద్‌లకు సూచించారు. పార్టీ సీనియర్లతో రేవంత్‌కు ఉన్న అభిప్రాయభేదాలు, సమన్వయలేమిని వెంటనే పరిష్కరించేలా నేతలందరితో మాట్లాడాలని మార్గదర్శనం చేశారు. పార్టీ వీడే అవకాశం ఉన్న నేతలతో ప్రత్యేకంగా చర్చించి వారి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం వెంటనే చేపట్టాలని ఆదేశించారు. బుధవారం ఢిల్లీలో మాణిక్యం ఠాగూర్ సహా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, మునుగోడు ఉప ఎన్నిక, మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజు నోటీసులు, రేవంత్‌పై వస్తున్న వరుస ఫిర్యాదులపై చర్చించారు. ముఖ్యమైన అంశాల్లో సీనియర్ల అభిప్రాయాన్ని గౌరవించకపోవడం, సామాన్య కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, భూముల వ్యవహారాలకు సంబంధించిన అంశాలు మినహా ఇతర ప్రజా సంబంధిత సమస్యలపై పోరాటం చేయకపోవడం వంటి అంశాలపై ఫిర్యాదు చేశారని.. వీటిని సరిదిద్దే బాధ్యతను మీరు తీసుకోవాలంటూ ఖర్గే సూచించారు. అసంతృప్త నేతలను గుర్తించండి మర్రి శశిధర్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ వీడే అవకాశం ఉన్నా... పీసీసీ చీఫ్ సహా ఇతర రాష్ట్ర నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడంపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీనియర్లు ఎవరైనా అసంతృప్తితో ఉంటే, అలాంటి వారిని ముందే గుర్తించి చర్చలు జరపాలని.. అధిష్టానం దృష్టికి ఆయా అంశాలను తీసుకురావాలని పేర్కొన్నారు. పార్టీలో అసంతృప్తి పెరిగితే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అవకాశాలు పెరుగుతాయని, వీటిని కట్టడి చేసే చర్యలు ముందుగానే తీసుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యల విషయంలో తొందరపాటు వద్దని, ఆచితూచి నిర్ణయం తీసుకుందామని ఖర్గే చెప్పారని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏవిధంగా సమాయత్తం కావాలి? శ్రేణులను ఏ విధంగా కాపాడుకోవాలి? తదితర అంశాలపై అనుసరించాల్సిన ప్రణాళికలను ఖర్గే సూచించారు. ఇదీ చదవండి: రామోజీ మీ టూరిజానికి ఆ భూములే కావాలా?: సీపీఎం -
పగ్గాలు చేపట్టిన ఖర్గే
న్యూఢిల్లీ: సహచర నాయకుడు శశిథరూర్‌ను ఓడించి ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పదవిలో కొనసాగుతున్న తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (75) ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు లాంఛనంగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ‘‘అధ్యక్ష బాధ్యతల బరువు నేటితో దిగిపోయింది. నాకు చాలా ఊరటగా ఉంది’’ అంటూ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు! మార్పు సహజమంటూ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడారు. కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో పాటు పార్టీ అగ్ర నేతలంతా పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైనట్టు ఖర్గేకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఒక మామూలు కార్యకర్త కుమారుడైన అతి సాధారణ కార్యకర్తను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ కుటుంబం మొత్తానికీ కృతజ్ఞతలు. ఇది గొప్ప గౌరవం. నిరంతరం కష్టించి పని చేస్తా. ప్రతి కార్యకర్తకూ గొంతుకగా మారతా. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ నాయకత్వాన్ని పెంపొందిస్తా’’ అని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఖర్గేను సోనియా స్వయంగా అధ్యక్ష కార్యాలయంలోకి తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. తన పక్క కుర్చీలో కూర్చోవాల్సిందిగా ఖర్గే కోరగా సున్నితంగా తిరస్కరించారు. ‘భయపడొద్దు’ నినాదంతో ముందుకు తన ముందున్న సవాళ్ల గురించి పూర్తి అవగాహన ఉందని ఖర్గే అన్నారు. పార్టీగా కాంగ్రెస్‌కు ఇది కష్టకాలమేనని అంగీకరించారు. అయితే కార్యకర్తలు తమలో ఉన్న భయాలను పారదోలితే ఎంతటి సామ్రాజ్యమైనా వారిముందు మోకరిల్లుతుందన్నారు. రాహుల్ ఇచ్చిన ‘భయపడొద్దు’ నినాదం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో బీజేపీని ఓడించేందుకు నేతలు, కార్యకర్తలూ స్వరశక్తులూ ధారపోయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో 50 శాతం పదవులను 50 ఏళ్లలోపు వయసు వారికే ఇవ్వడం వంటి నిర్ణయాలతో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను సంపూర్ణంగా అమలు చేసి సమూల మార్పులు తేవాల్సి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై కళ్లు మూసుకుంటూ ఆశ్రిత పెట్టుబడిదారీ మిత్రులకు సర్వం దోచిపెడుతోందని మండిపడ్డారు. ‘‘గాడ్సేను దేశభక్తునిగా, గాంధీని దేశద్రోహిగా చిత్రిస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి సంఘ్ పరివార్ రాజ్యంగం తెచ్చే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. ఈ అబద్ధాలను బట్టబయలు చేసి, మోసాలను ఎండగట్టి, విద్వేష ప్రచారాలను తుత్తునియలు చేసి తీరతామన్నారు. పార్టీని ఖర్గే మరింత పటిష్టపరుస్తారని, స్ఫూర్తిదాయకంగా నడుపుతారని సోనియా విశ్వాసం వెలిబుచ్చారు. ఇంతకాలం తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఓటమిని మాత్రం ఎన్నడూ అంగీకరించలేదని అన్నారు. దేశ ప్రజాస్వామిక సూత్రాలకే పొంచి ఉన్న పెను ముప్పును దీటుగా ఎదుర్కోవడం ఇప్పుడు పార్టీ ముందున్న పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే ఈ కాలంలో సోనియా మాత్రం స్వార్థరహితంగా పార్టీని ముందుకు నడిపారంటూ ఖర్గే కొనియాడారు. సునాక్‌కు సోనియా లేఖ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ను సోనియా అభినందించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమంటూ ఆయనకు లేఖ రాశారు. ఆయన హయాంలో ఇరు దేశాల సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. ఆఫీస్ బేరర్ల రాజీనామాలు... 47 మందితో స్టీరింగ్ కమిటీ 47 మందితో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని నూతన అధ్యక్షుడు ఖర్గే నియమించారు. కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ ఏర్పాటయ్యేదాకా దాని బాధ్యతలను ఖర్గే సారథ్యంలోని ఈ కమిటీ చూస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా, రాహుల్‌తో పాటు గత సీడబ్లు్యసీ సభ్యుల్లో అత్యధికులకు కమిటీలో చోటు దక్కింది. ప్రియాంక, ఏకే ఆంటోనీ, అంబికా సోని, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా, దిగ్విజయ్‌సింగ్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు కమిటీలో ఉన్నారు. సీడబ్లు్యసీ ప్రత్యేక ఆహ్వానితుల్లో మాత్రం ఎవరికీ చోటు దక్కలేదు. కొత్త టీములను ఏర్పాటు చేసుకునేందుకు ఖర్గేకు వీలు కల్పిస్తూ అంతకుముందు సీడబ్లు్యసీ సభ్యలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు తదితర ఆఫీసు బేరర్లంతా ఆయనకు లాంఛనంగా రాజీనామాలు సమర్పించారు. అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికను ఆమోదించేందుకు వచ్చే మార్చిలో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశముంది. ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో గుజరాత్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. -
కాంగ్రెస్‌లో ఖర్గే మార్క్.. సీడబ్ల్యూసీ కనుమరుగు!
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. తొలి రోజే తన మార్క్‌ను చూపించేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అంతర్గత మార్పులకు నాంది పలుకుతూ.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సహా మొత్తం 47 మందితో స్టీరింగ్ కమిటీని నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో ఈ స్టీరింగ్ కమిటీ పని చేయనుంది. బుధవారం ఉదయమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు రాజీనామా చేశారు. ‘సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీలు, ఇంఛార్జులు తమ రాజీనామాలను కాంగ్రెస్ అధ్యక్షుడికి అందించారు.’ అని తెలిపారు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్. ప్లీనరీ సెషన్ నిర్వహించే వరకు స్టీరింగ్ కమిటీ కొనసాగనుందని, తదుపరి ఏఐసీసీ(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) సెషన్లో వర్కింగ్ కమిటీ కొత్త సభ్యులను ఎన్నుకోనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కాంగ్రెస్ కొత్త సారథిగా ఖర్గే.. అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సోనియా.. -
సోనియా ఎప్పుడూ పదవులు ఆశించలేదు: ఖర్గే
-
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణస్వీకారం
-
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖర్గే..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర నాయకులు హాజరయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు.. సోనియా, రాహుల్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోనియా కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను ఖర్గేకు అప్పగించారు. అనంతరం మాట్లాడుతూ ఖర్గే ఎంతో అనుభవం ఉన్న నాయకుడని కొనియాడారు సోనియా. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మరింత ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖర్గే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమిస్తారని పేర్కొన్నారు. ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. పార్టీలోని అందరి సహకారం తనకు చాలా అవసరమని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ ఏనాడు పదవులు ఆశించలేదని కొనియాడారు. ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని ఖర్గే చెప్పారు. అలాగే అధికార బీజేపీపై విమర్శలు గిప్పించారు ఖర్గే. కమలం పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌పై ఖర్గే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర నేతగా ఆయన అరుదైన ఘనత సాధించారు. జగ్జీవన్ రామ్ తర్వాత ఆ పదవి చేపట్టిన రెండో దళిత నేతగా నిలిచారు. చదవండి: నికార్సైన కాంగ్రెసోడా.. మునుగోడుకు రా! -
శశి థరూర్‌కు షాక్.. ‘ఓటింగ్ అక్రమాల’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు శశి థరూర్ వర్గం ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ అంశంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసుదన్ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే..శశి థరూర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మిస్త్రీ. మీకు రెండు ముఖాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము మీ అభ్యర్థనను స్వీకరించాము. కానీ, మీరు మీడియా ముందుకు వెళ్లి కేంద్ర ఎన్నికల అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని తెలియజేసేందుకు మా ముందు మీకు ఒక ముఖం ఉంది. మాపై ఈ ఆరోపణలన్నీ చేసిన మీడియాలో వేరే ముఖం ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను.’అని శశి థరూర్ తరఫు చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్‌కు సమాధానం పంపించారు మిస్త్రీ. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలుడుతున్న క్రమంలో పోలింగ్ ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ బుధవారం మధుసుదన్ మిస్త్రీకి లేఖ రాశారు థరూర్ పోలింగ్ ఏజెంట్. నాలుగు రకాల ఫిర్యాదులను అందులో పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులకు అనధికారిక సీల్స్ వేయటం, పోలింగ్ బూతుల్లో వేరే వ్యక్తులు ఉండటం, ఓటింగ్ జరుగుతున్న క్రమంలో అక్రమాలు, పోలింగ్ షీట్లు లేకపోవటం వంటి అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో శశి థరూర్‌కు 1,072 ఓట్లు రాగా.. మల్లికార్జున్ ఖర్గేకు 7,897 ఏట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా! -
AICC అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం
-
‘నియంతృత్వ శక్తులపైనే పోరాటం’.. బీజేపీ లక్ష్యంగా ఖర్గే విమర్శలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. గడిచిన 20 ఏళ్ల కాలంలో గాంధీయేతర తొలి అధ్యక్షుడిగా నిలిచారు. పార్టీ ప్రెసిడెంట్‌గా తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఖర్గే.. పార్టీలో అంతర్గతంగా నిర్వహించే ఎన్నికలు పార్టీని బలోపేతం చేస్తాయన్నారు. కార్యకర్తల అంచనాలకు తగ్గట్లుగా పని చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేశారు ఖర్గే. ‘ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎన్నికలు నిర్వహించటం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. శశి థరూర్‌కు నా కృతజ్ఞతలు, అలాగే నా శుభాకాంక్షలు. నాపై పోటీ చేశారు. నన్ను కలిసి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. శశి థరూర్‌తో కలిసి పని చేస్తాం. రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. సోనియా గాంధీకి నా కృతజ్ఞతలు. ఆమె జీవితం మొత్తం పార్టీకోసమే వెచ్చించారు. ఆమె నాయకత్వంలో పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.’అని పేర్కొన్నారు ఖర్గే. మరోవైపు.. బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు ఖర్గే. మతాల పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసి పోరాడతామన్నారు. ‘పార్టీలో ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనేది ఏమీ ఉండదు. అందరం కలిసి పని చేస్తాం. మేమంతా కలిసి కట్టుగా మతతత్వ వేషధారణలో ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేస్తున్న నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడతాం.’అని పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన ఖర్గే.. అక్టోబర్ 26న బాధ్యతలు చేపట్టనున్నారని పార్టీ ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. ఇదీ చదవండి: 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. మల్లికార్జున ఖర్గే ఘన విజయం -
ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా మప్పన్న మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు 7వేలకు పైగా ఓట్లు(7,897 ఓట్లు) పోల్ కాగా.. శశిథరూర్‌కు పది శాతం ఓట్లు(1072 దాకా) పోలయ్యాయి. చెల్లని ఓట్లు 416. దీంతో 6,822 ఓట్ల భారీ మెజార్టీతో ఖర్గే గెలుపొందినట్లు సమాచారం. సుమారు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు, అదీ గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కావడం విశేషం. 80 ఏళ్ల వయసున్న మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక ఖర్గే విజయంపై మరో అభ్యర్థి శశిథరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
‘నేను అధ్యక్షునిగా నెగ్గితే సీడబ్ల్యూసీకి ఎన్నికలు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైతే పార్టీని సంస్కరణల బాట పట్టిస్తానని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రకటించారు. ‘పార్టీ నియమావళిలోని ప్రతి నిబంధననూ అమలుచేస్తా. కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహిస్తా. పాతికేళ్లకుపైగా చేష్టలుడిగిన పార్లమెంటరీ బోర్డ్‌కు పునర్వైభవాన్ని తీసుకొస్తా. నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరిస్తా. పార్టీకి క్షేత్రస్థాయిలో మూలస్తంభాలైన పధాధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెడతా. ఉదయ్‌పూర్ తీర్మానాలను అమల్లోకి తెస్తా’ అని బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను సంస్కరణవాదిని. పార్టీని నడిపే విధానంలో వైవిధ్యం చూపిస్తా. 2024లో బీజేపీని ఢీకొట్టి ఓడించేలా కాంగ్రెస్‌ను పటిష్టపరుస్తా’ అన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ -
అన్నీ రూమర్లే..సోనియా నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు: ఖర్గే
లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడుతున్నారు. అయితే, అధిష్ఠానం తరపు అభ్యర్థి, అంతర్గతంగా సోనియా గాంధీ సపోర్టు మల్లికార్జున్ ఖర్గేకు ఉందంటూ కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఖర్గే పేరును స్వయంగా సోనియా గాంధీనే సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అవి అన్నీ వదంతులేనని తీవ్రంగా ఖండించారు మల్లికార్జున్ ఖర్గే. సోనియాజీ తన పేరును సూచించలేదని, అంతర్గతంగా తనకు సోనియా నుంచి ఎలాంటి మద్దతు లేదని పేర్కొన్నారు. ‘అధ్యక్ష పదవికి నా పేరును సోనియా గాంధీ సూచించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పలేదు. గాంధీ కుటుంబ నుంచి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనటం, అభ్యర్థులకు మద్దతు తెలపటం వంటివి చేయరని ఆమె స్పష్టంగా చెప్పారు. కొందరు కాంగ్రెస్ పార్టీ, సోనియా, నన్ను అప్రతిష్ఠపాలు చేసేందుకు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనబోనని, ఎవరికీ మద్దతు తెలపనని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9300 మంది సభ్యులు అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకుంటారు. మెజారిటీ వచ్చిన వారు అధ్యక్ష పదవి చేపడతారు.’ అని తెలిపారు ఖర్గే. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సరిగా లేవని, మోదీ, అమిత్ షా రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం కుంటుపడుతోందని విమర్శించారు ఖర్గే. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై పోరాడేందుకు తగిన శక్తి కావాలని, కాంగ్రెస్ ప్రతినిధుల సిఫారసు మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పోటీ చేయాలని ఒక్కరోజు ముందు చెప్పారు: ఖర్గే -
‘పోటీ చేయాలని ఒక్కరోజు ముందు చెప్పారు’
పట్నా: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలని తనకు కేవలం నామినేషన్ వేయడానికి 18 గంటల ముందు చెప్పారని పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం చెప్పారు. బహుశా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష పగ్గాలు చేపట్టొద్దని రాహుల్ భావించడం వల్లే తనను పోటీ చేయమన్నారని అభిప్రాయపడ్డారు. ‘కానీ రాహుల్ సారథ్యం పార్టీకి చాలా అవసరమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆయన సెంటిమెంట్లను గౌరవిస్తా’ అని చెప్పుకొచ్చారు మల్లికార్జున ఖర్గే. తాను అధ్యక్షుడినైతే పార్టీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలే తొలి ప్రాథమ్యంగా ఉంటుందన్నారు. ఈ ఎన్నికను పార్టీ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించారు. ఎంపీ శశిథరూర్ కూడా అధ్యక్ష ఎన్నిక బరిలో దిగడం తెలిసిందే. ఇదీ చదవండి: Bharat Jodo Yatra: రోడ్డుపైనే రాహుల్ పుషప్స్ -
‘రిమోట్ కంట్రోల్’ అనడం వారిని అవమానించడమే: రాహుల్ గాంధీ
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారు ఎవరైనా ‘రిమోట్ కంట్రోల్’ గాంధీలదేనన్న విమర్శలు వస్తున్నాయి. భారత్ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీని ఈ అంశంపై ప్రశ్నించగా.. ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులకూ సమాజంలో వారికంటూ ఓ స్థానం ఉంది. ప్రజలను అర్థం చేసుకోగలిగే దృక్పథం, ప్రజల పట్ల అవగాహన ఉంది. అలాంటి వ్యక్తులను ఉద్దేశించి రిమోట్ కంట్రోల్ అనడం అంటే వారిని అవమానించడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. మరోవైపు.. యాత్రలో తానొక్కడినే పాల్గొనడం లేదని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలతో విసిగిన లక్షల జనం భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల కోసం ఈ యాత్ర కాదని, భాజపా- ఆరెస్సెస్ తీసుకొస్తున్న విభజన నుంచి ప్రజలను ఐక్యం చేయడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, వికేంద్రీకరణ విద్యావిధానం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ‘భారత్ అనేది రాష్ట్రాల సమూహం. దాని అర్థం మన భాషలు, రాష్ట్రాలు, సంప్రదాయాలకు సమానంగా ముఖ్యమైన స్థానం ఉంటుంది. అదే మన దేశ స్వభావం. హింస, విద్వేషాలను వ్యాప్తి చేయటం దేశ వ్యతిరేక చర్య. ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టేవారికి వ్యతిరేకంగా మేము పోరాడతాం.’ అని తెలిపారు. LIVE: Shri @RahulGandhi addresses media amid Karnataka leg of the #BharatJodoYatra. https://t.co/9yyDUrZwuZ — Congress (@INCIndia) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
చివరి రోజు ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై థరూర్ ట్వీట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు శశి థరూర్. తనకు ఎదురయ్యే సవాళ్ల నుంచి తానెప్పుడూ వెనక్కి తగ్గబోనని, పోటీలో చివరకు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పార్టీలోని ఇద్దరు సహచరుల మధ్య జరుగుతున్న స్నేహపూర్వక పోటీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. శశి థరూర్ నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కాల్స్ రావటం ఆశ్చరానికి గురి చేసింది. వారు ఢిల్లీ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. అయితే.. అవన్నీ అవాస్తవం. నా జీవితంలో ఇంతవరకెప్పుడూ సవాళ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. తగ్గను కూడా. ఇది పోరాటం. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న స్నేహపూర్వక పోటీ. ఇందులో నేను చివరి వరకు పోరాడాలి. నేను పోటీలో ఉన్నా. అక్టోబర్ 17న హాజరై ఓటు వేయాలని కోరుతున్నాను. రేపటి కోసం, థరూర్ కోసం ఆలోచించండి’ - శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ నామినేషన్లకు చివరి రోజైన అక్టోబర్ 8న థరూర్ ఈ వీడియో పోస్ట్ చేయడంతో అధ్యక్ష పదవికి పోలింగ్ ఖాయమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి థరూర్‌తో పాటు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ అనివార్యమైంది. అక్టోబరు 17న ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 9వేల మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన ఖర్గేకు ఎక్కువమంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. Surprised to get calls saying that “sources in Delhi” claim that I have withdrawn! I am on this race till the finish. #ThinkTomorrowThinkTharoor pic.twitter.com/zF3HZ8LtH5 — Shashi Tharoor (@ShashiTharoor) October 8, 2022 ఇదీ చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను -
పోటీ అక్కర్లేదన్నా పట్టుబట్టాడు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అందరి ఆమోదంతో ఒకే అభ్యర్థి ఉంటే బాగుంటుందని, ఎన్నిక ఏకగ్రీవం కావాలని అభిలషించానని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో తన నివాసంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఖర్గే పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. ‘సర్వామోదంతో, పోటీ లేకుండా ఒక్కరినే పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని నా ప్రతిపాదన. అదే విషయాన్ని శశిథరూర్‌కు చెప్పా. నాతో ఆయన విబేధించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నిక మంచిది అని థరూర్ వాదించారు. తానూ బరిలో దిగుతానని చెప్పారు’ అని ఖర్గే మీడియాకు వెల్లడించారు. ‘ఒక వేళ పార్టీ చీఫ్‌గా ఎన్నికైతే గాంధీల కుటుంబం ఇచ్చే అమూల్యమైన సలహాలను పరిగణనలోకి తీసుకుంటా. నేనేమీ గాంధీలు బలపరిచిన అధికారిక అభ్యర్థిని కాదు. ఇప్పుడు పార్టీలో జీ–23 అంటూ ఎలాంటి అసంతృప్త నేతల కూటమి లేదు. అందరం కాంగ్రెస్ నాయకులమే. ఆర్ఎస్ఎస్–బీజేపీని సమష్టిగా ఎదుర్కొంటాం ’అని ఖర్గే స్పష్టంచేశారు. ‘నేను పార్టీలో ఎవరిపైనో పోటీకి దిగలేదు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగమే ఈ పోటీ. పార్టీలో సమూల మార్పులు ఉన్నపళాన జరగవు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. పార్టీపై గాంధీలు గుత్తాధిపత్యం చేస్తారనే బీజేపీ ఆరోపణను ఖర్గే తిప్పికొట్టారు. ‘కాంగ్రెస్‌లో ఎన్నికల ప్రాధికార వ్యవస్థ ఉంది. ఓటింగ్ హక్కులున్నాయి. బీజేపీలో అలాంటిదేమీ లేదు. బీజేపీలో ఎన్నికలు జరిగాయా? జేపీ నడ్డాను ఎన్నుకున్నదెవరు? ఆ పార్టీలో డెలిగేట్స్ ఎంతమంది?’ అని ఖర్గే ప్రశ్నించారు. థరూర్ బహిరంగ చర్చ ప్రతిపాదనను తిరస్కరించారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
బహిరంగ చర్చకు సిద్ధం.. అప్పుడే ఎవరేంటో తెలుస్తుంది
న్యూఢిల్లీ: ఘన చరిత గల కాంగ్రెస్ పార్టీకి తదుపరి అధ్యక్షులు ఎవరనే అంశంలో ఇరు అభ్యర్థుల మధ్య ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చాసమరానికి తాను సిద్ధమని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ తన మనసులో మాట బయటపెట్టారు. ఇటీవల తీవ్ర ఉత్కంఠ రేపిన బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సారథి, దేశ ప్రధాని రేసులో రిషి సునాక్, లిజ్ ట్రస్ నేరుగా పలుమార్లు చర్చావేదికలపై బలాబలాలు ప్రదర్శించిన నేపథ్యంలో అదే మాదిరి పోటీని థరూర్ కోరుకోవడం విశేషం. ఆదివారం థరూర్ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ సమర్థవంతమైన నాయకుడిగా నన్ను నేను ఎప్పుడో రుజువు చేసుకున్నా. దాదాపు మూడు దశాబ్దాలు ఐక్యరాజ్యసమితిలో కీలకమైన పలు పదవుల్లో బాధ్యతలు నెరవేర్చా. భారత్‌లో రాజకీయ ప్రస్థానానికొస్తే.. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిని. మొదలుపెట్టిన ఐదేళ్లలోనే 20 రాష్ట్రాల్లో పదివేల మందికిపైగా ఇందులో క్రియాశీలక సభ్యులయ్యారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండున్నర వారాల వ్యవధి ఉంది. ఇంత తక్కువ టైమ్‌లో అందరు 9,000 మంది ప్రతినిధులను కలవడం కష్టం. అదే అభ్యర్థుల బహిరంగ చర్చలు జరిగితే ఎవరి సత్తా ఏమిటో ఇట్టే తెలుస్తుంది’ అని అన్నారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే ఆదివారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. తాను ఎవరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి పోటీ చేయట్లేదని, పార్టీ సీనియర్ నేతలు, యువనేతలు కోరడం వల్లే బరిలోకి దిగినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడే తన లక్ష్యమన్నారు. అలాగే తన వెనుక గాంధీ కుటుంబం ఉందని వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. గాంధీలు ఎవరికీ మద్దతు ప్రకటించలేదని చెప్పారు. ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతాయని పేర్కొన్నారు. జీ-23నేతలు మాత్రం తనకే మద్దతు తెలిపారని వివరించారు. ఒక్కరికి ఒకే పదవి ఉండాలనే పార్టీ నిబంధనను గౌరవిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ సమర్పించిన రోజే రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి తాను రాజీనామా చేసినట్లు ఖర్గే వెల్లడించారు. ఒకేవేళ ఈయన అధ్యక్షుడిగా గెలిస్తే 136ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తొలి దళిత నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. ఖర్గే గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాదని, తాను గెలిస్తేనే సంస్కరణలు తీసుకొస్తానని శశిథరూర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఖర్గే స్పందించారు. ఎవరు గెలిచినా పార్టీలో సంస్కరణల కోసం సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే బీజేపీపై విమర్శలు గుప్పించారు ఖర్గే. కమలం పార్టీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. మరోవైపు ఖర్గేకు మద్దతుగా ఆయన కోసం ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవులకు గౌరవ్ వల్లభ్, దీపిందర్ హుడా, నజీర్ హుస్సేన్ రాజీనామా చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖర్గే విజయం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. చదవండి: శుక్రవారం నామినేషన్.. శనివారం రాజీనామా -
కాంగి‘రేసు’.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపైనే అందరి దృష్టి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గాంధీ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉండడంతో పోటీ అనివార్యమైంది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది నాలుగోసారి.1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక అన్నిసార్లు ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. ఈ సారే అధ్యక్ష ఎన్నికకు పోటీ జరుగుతోంది. ఎన్నిక ప్రక్రియ సాగేదిలా.. కాంగ్రెస్ పార్టీ నియమావళిలోని సెక్షన్ గీVఐఐఐ ప్రకారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే సంస్థాగతంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు స్వతంత్రంగా వ్యవహరించే సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (సీఈఏ) ఏర్పాటు చేశారు. గుజరాత్ మాజీ ఎంపీ మధుసూదన్ మిస్ట్రీ ప్రస్తుతం సీఈఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దీని ఆధ్వర్యంలోనే అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. పార్టీ ఎలక్టోరల్ కాలేజీలో 9 వేల మందికి పైగా ప్రతినిధులు ఉన్నారు. వీరందరికీ ఓటు వేసే హక్కు ఉంది. పార్టీలో ప్రతినిధుల్ని ఎన్నుకొనే ప్రక్రియ కూడా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్న బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పీసీసీ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. పీసీసీ ప్రతినిధులు ఏఐసీసీ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. వీరితో పాటు పీసీసీ అధ్యక్షులుగా కనీసం ఒక సంవత్సరం పదవిలో ఉన్న వారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించే ఏఐసీసీ సభ్యులు, పార్టీ ఎమ్మెల్యేలు, పీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ ప్రతినిధులుగానే ఉంటారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు తప్పనిసరిగా పార్టీలో ప్రతినిధి అయి ఉండాలి. పార్టీ ప్రతినిధుల్లో 10 మంది వారిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక ఇద్దరు పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ఒక్కరే ఉంటే వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరిగాయంటే ► 1950లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆచార్య కృపలాని, పురుషోత్తమ్ దాస్ టాండన్ మధ్య గట్టి పోటీ జరిగింది. అప్పట్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మద్దతునిచ్చిన కృపలాని ఓడిపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుచరుడిగా ముద్ర పడిన టాండన్ అధ్యక్షుడయ్యారు. టాండన్‌కు 1,306 ఓట్లు వస్తే, కృపలానీకి 1,092 ఓట్లు వచ్చాయి. ► ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో 47 ఏళ్ల తర్వాత ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. 1997లో జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. సీతారామ్ కేసరి, శరద్ పవార్, రాజేశ్ పైలట్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో సీతారాం కేసరి బంపర్ మెజార్టీ సాధించారు. మహారాష్ట, యూపీ మినహాయించి అన్ని రాష్ట్రాల యూనిట్లు కేసరికే జై కొట్టారు. కేసరికి 6,224 ఓట్లు వస్తే, పవార్‌కు 882, పైలెట్‌కు 354 ఓట్లు వచ్చాయి. ► 2000లో కూడా అధ్యక్ష ఎన్నిక జరిగింది. సోనియాగాంధీపైన జితేంద్ర ప్రసాద సవాల్ విసిరారు. ప్రసాద ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సోనియాకు 7,400 ఓట్లు లభిస్తే జితేంద్ర ప్రసాదకి 94 ఓట్లు వచ్చాయి. ► 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అధ్యక్ష ఎన్నిక అనివార్యంగా మారింది. 75 ఏళ్లలో 16 మంది అధ్యక్షులు ఈ 75 ఏళ్లలో 40 ఏళ్లపాటు గాంధీ కుటుంబమే పార్టీని నడిపించింది.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌కి 16 మంది అధ్యక్షులైతే వారిలో అయిదుగురు గాంధీ కుటుంబానికి చెందినవారే. నలుగురు తెలుగువాళ్లు పట్టాభి సీతారామయ్య, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, పీవి నరసింహారావు అధ్యక్షులుగా వ్యవహరించారు. 1947లో ఆచార్య కృపలాని, 1948–49లో పట్టాభి సీతారామయ్య ఆ తర్వాత టాండన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ 1951–55 వరకు, ఆ తర్వాత యూఎన్ ధేబర్ పగ్గాలు చేపట్టారు. 1959లో ఇందిరతొలిసారి అధ్యక్షురాలయ్యారు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కామరాజ్, నిజలింగప్ప, జగజ్జీవన్ రామ్, శంకర్ దయాళ్ శర్మ, దేవకాంత్ బారువా అధ్యక్షులుగా ఉన్నారు. 1978–1984 సంవత్సరాల మధ్యలో ఇందిర మళ్లీ పగ్గాలు చేపట్టారు. ఇందిర హత్యానంతరం రాజీవ్ గాంధీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి 1991 వరకు ఉన్నారు. రాజీవ్ హత్యానంతరం పీవీ నరసింహారావు పగ్గాలు చేపట్టి 1996 వరకు కొనసాగారు. 1996–98 మధ్య సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఉన్నారు. 1998లో అధ్యక్షురాలైన సోనియా 19 ఏళ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2017–2019 కాలంలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019 నుంచి సోనియా కొనసాగుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు : అక్టోబర్ 8 పోలింగ్ తేదీ : అక్టోబర్ 17 ఫలితాల ప్రకటన : అక్టోబర్ 19 – నేషనల్ డెస్క్, సాక్షి -
సోనియా ఆశీస్సులతో.. కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు చివరి క్షణంలో అనూహ్యమైన మలుపు తిరిగింది. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్థానంలోకి సోనియా గాంధీ కుటుంబానికి విధేయుడు, దక్షిణాది దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే వచ్చిచేరారు. సోనియా ఆశీస్సులతో ఆయన అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఖర్గేతోపాటు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి అందజేశారు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ పోటీలో చివరకు ముగ్గురు మిగిలారు. అభ్యర్థిగా మల్లికార్గున ఖర్గే పేరును అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పూనియా, ఏకే ఆంటోనీ, పవన్‌కుమార్ బన్సల్, ముకుల్ వాస్నిక్‌తోపాటు జి–23 గ్రూప్‌లోని ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ ప్రతిపాదించారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఖర్గే వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కనిపించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆయన విజయం ఖాయమేనని స్పష్టమవుతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు శశి థరూర్ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. నామినేషన్ల కార్యక్రమానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. వాస్తవానికి ఈ ఎన్నికలో పోటీ చేయడానికి దిగ్విజయ్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్ పత్రాలను సైతం పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేయబోతున్నానని గురువారం ప్రకటించారు. ఇంతలోనే పార్టీ అధిష్టానం వ్యూహం మార్చేసింది. దళిత నాయకుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో దిగ్విజయ్ వెనక్కి తగ్గారు. తాను పోటీ చేయడం లేదని విస్పష్టంగా ప్రకటించారు. నామినేషన్లకు గడువు శుక్రవారం ముగిసింది. అక్టోబర్ 17న జరుగనున్న ఎన్నికలో ఓటు వేయడానికి 9,100 మందికిపైగా ప్రతినిధులను అర్హులుగా గు ర్తించారు. అక్టోబర్ 19న ఫలితాలను ప్రకటిస్తారు. ఖర్గేకు సీనియర్ల మద్దతు: గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికలో ఖర్గేకు మద్దతు ఇవ్వాలని పార్టీ సీనియర్లంతా కలిసి నిర్ణయించారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. తన మద్దతు ఖర్గేకే ఉంటుందని తెలిపారు. పోటీలో ఎవరు నిలిచినప్పటికీ ఎన్నిక పూర్తయ్యాక అసలు విజేత కాంగ్రెస్సేనని అన్నారు. పార్టీలో మార్పు కోసమే నా పోరాటం: ఖర్గే కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పు కోసం తాను పోరాడుతానని, నేతలు, కార్యకర్తలంతా మద్దతివ్వాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికలో తనకు ఓటు వేసి గెలిపించాలని పార్టీ డెలిగేట్లను కోరారు. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి తనను ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాల్యం నుంచే కాంగ్రెస్‌తో తనకు అనుబంధం ఉందని, పార్టీ ఆదర్శాలను కాపాడుకోవడానికి మరింత ఉధృతంగా పోరాడుతానని అన్నారు. కాంగ్రెస్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు మల్లికార్గున ఖర్గే అని సీనియర్ నేత ప్రమోద్ తివారీ కొనియాడారు. మార్పు కావాలనుకుంటే నాకు ఓటేయండి: థరూర్ కాంగ్రెస్‌కు ఖర్గే ‘భీష్మ పితామహుడు’ అని శశి థరూర్ ప్రశంసించారు. భారత్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్‌కు సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఖర్గే, తాను ప్రత్యర్థులం, శత్రువులం కాదని.. తమ మధ్య స్నేహపూర్వక పోటీ జరగబోతోందని చెప్పారు. ఖర్గే పట్ల తనకు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి తనకు ఒక విజన్ ఉందని ఉద్ఘాటించారు. ఖర్గే ‘యథాతథ స్థితి కొనసాగింపు నాయకుడేనని’ అన్నారు. పార్టీలో యథాతథ స్థితి కొనసాగాలనుకుంటే ఖర్గేకు, మార్పు కావాలనుకుంటే తనకు ఓటు వేయాలని థరూర్ పిలుపునిచ్చారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోబోనని తేల్చిచెప్పారు. 12 రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు తనకు మద్దతుగా సంతకాలు చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసి, దేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్న అశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం ప్రత్యక్షం గానీ, పరోక్షంగా గానీ ఎవరికీ మద్దతు ఇవ్వబోదని అన్నారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు బెంగళూరు: సోలిల్లాదా సర్దార(ఓటమి తెలియని నాయకుడు)గా స్వరాష్ట్రం కర్ణాటకలో పేరుగాంచిన మల్లికార్జున ఖర్గే(80) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలో విజయం సాధిస్తే కర్ణాటక నుంచి ఎస్.నిజలింగప్ప తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడైన రెండో నేతగా రికార్డుకెక్కుతారు. అలాగే బాబూ జగ్జీవన్ రామ్ తర్వాత పార్టీ అధ్యక్షుడైన రెండో దళిత నాయకుడిగా మరో రికార్డు సృష్టిస్తారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన ఖర్గే 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కార్మిక నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1969లో కాంగ్రెస్‌లో చేరారు. తొలుత గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటకలోని గుర్మిత్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మొదటిసారిగా గుల్బర్గా నుంచి లోక్‌సభకు పోటీ చేసి, విజయం సాధించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభంజనంలోనూ భారీ మెజార్టీతో గెలిచారు. 2014 నుంచి 2019 దాకా లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. 2019లో తొలిసారిగా ఓటమి చవిచూశారు. 2020 జూన్‌లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎగువసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రిగా సేవలందించారు. ఖర్గేకు కర్ణాటక సీఎం అయ్యే అవకాశం పలుమార్లు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆయన 1942 జూలై 21న బీదర్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బీఏ, న్యాయ శాస్త్రం అభ్యసించారు. 1968 మే 13న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రస్తుతం కర్ణాటక ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా పనిచేశారు. -
Sakshi Cartoon 01-10-2022
పెద్దల మాట గౌరవించి ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నానని తెలియజేస్తున్నాను! -
కాంగ్రెస్‌లో గాంధీల స్థానంపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సీనియర్ నేత శశి థరూర్. అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో పోటీ పడనున్నారు. ఈ క్రమంలో గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు శశి థరూర్. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమేనని పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు అంశాలపై మాట్లాడారు థరూర్. అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయటాన్ని సోనియా గాంధీ స్వాగతించారని, తమ కుటుంబం తటస్థంగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు థరూర్ చెప్పారు. తాను సోనియా గాంధీ ఆమోదం కోసం ఆమెను కలవలేదని, అయికే.. వారి అధికారిక వైఖరి ఏంటని తెలుసుకునేందుకే భేటీ అయినట్లు చెప్పారు. ‘మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, మేము ఎల్లప్పుడూ ఏకాభిప్రాయంతో పనులు చేస్తాం, మాకు వదిలివేయండి, సరైన వ్యక్తిని కనుగొంటాము అని ఆమె చెప్పలేదు. దానికి విరుద్ధంగా.. ఎన్నికలు పార్టీకి మంచిదని నమ్ముతానన్నారు. నీవు పోటీ చాయాలనుకుంటే.. స్వాగతిస్తా అన్నారు. అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ ఉండరని చెప్పారు. ఈ పోటీ కేవలం సహచరుల మధ్య జరుగుతోన్న పోరు మాత్రమే. నాకు 14 ఏళ్ల అనుభవం ఉంది. అన్ని రకాలుగా పోటీకి అర్హుడినే. నా అభ్యర్థిత్వంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ’ అని తెలిపారు శశి థరూర్. పార్ట చీఫ్ కోసం పోటీ పడుతోన్న ఏ అభ్యర్థి అయినా.. గాంధీ కుటుంబీకుల చేతిలో కీలుబొమ్మగా మారతారా? అని ప్రశ్నించగా.. ‘కాంగ్రెస్‌లో గాంధీల స్థానం.. పార్టీ డీఎన్ఏతో వారికున్న అవినాభావ సంబంధాలు గొప్పవని నేను కచ్చితంగా నమ్ముతాను. వారి నుంచి, వారి వారసత్వం నుంచి మనల్ని మనం వేరు చేసే ప్రశ్నే లేదు. వారు క్రీయాశీలకంగా వ్యవహరించొద్దని భావిస్తే.. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు.’ అని పేర్కొన్నారు థరూర్. మరోవైపు.. రాహుల్ గాంధీ ఇప్పటికీ పార్టీ ఇంఛార్జ్‌గానే కనిపిస్తారని తెలిపారు. అలాగే.. తాను జీ-23 తరఫున అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవటం లేదని స్పష్టం చేశారు. నాకు కేవలం 23 మంది కాదు, 9,100 మంది మద్దతు కావాలంటూ తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్ -
Sakshi Cartoon 30-09-2022
-
‘మా మధ్య ఫ్రెండ్లీ పోటీనే’.. డిగ్గీ రాజాతో పోరుపై థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు, మీటింగ్‌లతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముందు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ముందు వరుసలో ఉంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, దిగ్విజయ్ సింగ్‌లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్ష పోటీపై ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇరువురు నేతలు ఆలింగనం చేసుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు శశి థరూర్. ‘ఇది ప్రత్యర్థుల మధ్య జరిగే పోటీ కాదు.. సహచరుల మధ్య జరిగే స్నేహపూర్వక పోటీ’ అని పేర్కొన్నారు. శశిథరూర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. శశి థరూర్ వ్యాఖ్యాలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీ మతత్వత శక్తులకు వ్యతిరేకంగా జరుగుతోందని, తాము ఇరువురు గాంధీయన్, నెహ్రూవియన్ భావజాలాలను నమ్ముతామని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై శశిథరూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. ఇరువురు నేతలు తమ నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. అధ్యక్ష పోటీలో నిలిచేందుకు నామినేషన్ పత్రాలను శశిథరూర్.. వారం రోజుల క్రితమే తీసుకోగా.. దిగ్విజయ్ సింగ్ గురువారం తీసుకున్నారు. Received a visit from @digvijaya_28 this afternoon. I welcome his candidacy for the Presidency of our Party. We both agreed that ours is not a battle between rivals but a friendly contest among colleagues. All we both want is that whoever prevails, @incIndia will win!✋🇮🇳 pic.twitter.com/Df6QdzZoRH — Shashi Tharoor (@ShashiTharoor) September 29, 2022 I agree @ShashiTharoor we are fighting the Communal Forces in India. Both believe in the Gandhian Nehruvian Ideology and shall fight them relentlessly come what may. Best wishes. @INCIndia @RahulGandhi @priyankagandhi @Jairam_Ramesh https://t.co/5KHn6P8Yug — digvijaya singh (@digvijaya_28) September 29, 2022 ఇదీ చదవండి: Congress President Elections: పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్ -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో తాజాగా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికలో దిగ్విజయ్ బరిలోకి దిగడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సోనియా గాంధీ బుధవారం సీనియర్ నాయకుడు, పార్టీకి విధేయుడైన ఏకే ఆంటోనీతో సమావేశయ్యారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థిపై గంటన్నరకు పైగా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానంపై ప్రదర్శించిన ధిక్కార వైఖరి పట్ల సోనియాకు గెహ్లాట్ ఫోన్లో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక తన హస్తం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అది దిగ్విజయ్ వ్యక్తిగత నిర్ణయం దిగ్విజయ్ సింగ్ సాధ్యమైనంత త్వరగా ఢిల్లీకి చేరుకుంటారని, శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో పార్టీ నాయకత్వం ప్రమేయం లేదని వెల్లడించాయి. దిగ్విజయ్ ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నానని ఆయన ఇటీవలే తేల్చిచెప్పారు. అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో దిగేందుకు పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) సిద్ధమని ఆయన సన్నిహితుడొకరు బుధవారం చెప్పారు. అధ్యక్ష బరిలో దిగేందుకు తనకు ఆసక్తి లేదని సీనియర్ నేత కమల్‌నాథ్ మరోసారి స్పష్టం చేశారు. తన దృష్టంతా ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందన్నారు. -
పార్టీ అధ్యక్ష బరిలో అందుకే నిలవటం లేదు: కమల్‌నాథ్
భోపాల్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఎంత మంది ఉండనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ క్రమంలో సోనియా గాంధీతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భేటీ కావటం పలు ఊహాగానాలకు తావిచ్చింది. కమల్‌నాథ్ సైతం పోటీలో నిలువనున్నారని వినబడింది. అయితే.. తనకు అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని.. తన దృష్టి అంతా వచ్చే ఏడాది జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడం వల్లే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్ పరిణామాలతో కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన భోపాల్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీతో మాట్లాడి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరాను. అప్పుడే ఈ గందరగోళానికి తెరపడుతుందని చెప్పాను. పార్టీలో పరిణామాలు సంక్లిష్టంగా మారుతున్నాయని కూడా ఆయనకు వివరించాను. అయితే, అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రాహుల్ సుముఖంగా లేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలనుకోవడంలేదు గనకే ఎన్నికలు జరుగుతున్నాయి. ‘ అని తెలిపారు కమల్‌నాథ్. మరి జేపీ నడ్డా ఎలాంటి ఎన్నిక జరగకుండానే భాజపా అధ్యక్షుడయ్యారు కదా అని విమర్శలు చేశారు. ఎన్నికల విషయం పక్కనబెడితే.. నడ్డాను అధ్యక్షుడిని చేసే ముందు భాజపా 10మంది నేతల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని కమల్‌నాథ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు మీరెందుకు పోటీ చేయట్లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లి సోనియాతో చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించారు కమల్‌నాథ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 నెలల సమయం ఉందని.. ఈ సమయంలో తాను మధ్యప్రదేశ్‌ను వదిలిపెట్టబోనన్నారు. ఒకవేళ తాను అధ్యక్ష పదవి చేపడితే తన దృష్టంతా మధ్యప్రదేశ్ వైపు ఉండదని.. ఆ పరిస్థితి తనకు ఇష్టంలేదని స్పష్టంచేశారు. అందుకే అధ్యక్ష బాధ్యతలు తీసుకొనేందుకు తాను సిద్ధంగా లేనట్టు స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్ నుంచి తన దృష్టిని వేరే వైపు పెట్టదలచుకోలేదన్నారు. ఆయన్నే అడగండి.. ఏఐసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరైనా తొలుత త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపైనే దృష్టిపెట్టాల్సి ఉంటుందని కమల్‌నాథ్ సూచించారు. అలాగే, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. ఈక్రమంలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేస్తారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదన్నారు. శశిథరూర్ నామినేషన్ గురించి ప్రస్తావించగా.. ఆయనతో చర్చించానని.. ఎన్నికలు ఉన్నందునే ఆయన నామినేషన్ వేయాలనుకొంటున్నారన్నారు. దిగ్విజయ్ సింగ్ పోటీచేసే అవకాశం ఉందా? అని అడగ్గా.. ఆయనకు ఇష్టం ఉందో లేదో దిగ్విజయ్‌నే అడగాలని సమాధానమిచ్చారు. రాజస్థాన్‌లో ఏర్పడిన పరిస్థితులకు గెహ్లాట్‌కు క్లీన్ చిట్ ఇస్తారా అని అడగగా.. ఆ రాష్ట్ర విషయాల్లో తాను కలుగజేసుకోబోనని, మధ్యప్రదేశ్‌పైనే తన దృష్టంతా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో డిగ్గీ రాజా.. ఏం జరుగుతుందో చూద్దాం!
భోపాల్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే రేసులో సీనియర్ నేత శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉండనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఆయన సైతం ఉన్నారని, గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దిగ్విజయ్ సింగ్ పోటీలో నిలుస్తారా? లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో.. స్పష్టతనిచ్చారు సింగ్. భోపాల్‌లో ఓ విలేకరి ప్రశ్నించగా పలు విషయాలు వెల్లడించారు. ‘ఈ విషయంపై నేను ఎవరితోనూ చర్చించలేదు. పోటీలో నిలిచేందుకు అధిష్టానం అనుమతి ఇవ్వాలని కోరలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. నేను పోటీ చేస్తానా? లేదా అనేది నాకే వదిలేయండి.’ అని విలేకరుల సమావేశంలో తెలిపారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మద్దతు ఎమ్మెల్యేలు సుమారు 80కిపైగా రాజీనామాలు సమర్పించటం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలనే డిమాండ్లు సైతం వచ్చాయి. కానీ, ఆయన పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొనటం చేయటం గమనార్హం. మరోవైపు.. అశోక్ గెహ్లాట్ రేసు నుంచి తప్పుకుంటే దిగ్విజయ్ సింగ్‌కే అవకాశాలు ఉన్నాయని పార్టీలో వినిపిస్తోంది. ఇదీ చదవండి: ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు -
Rajasthan Congress crisis: కాంగ్రెస్‌లో ఎడారి తుఫాన్
ఎస్.రాజమహేంద్రారెడ్డి: చిన్న చిన్న సమస్యలను సంక్లిష్టం చేసి పీకల మీదికి తెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇదే! ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలతో రాజస్తాన్ రాజకీయాలు ముడిపడటం.. వైరి వర్గాలు తెగేదాకా లాగడం కాంగ్రెస్ పార్టీ గందరగోళ వ్యవహార శైలికి తాజా మచ్చుతునక. ఆదిలోనే తప్పటడుగు... కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ఎంచుకోవడం వెనక ఉన్న అజెండాను సరైన రీతిలో స్పష్టీకరించడంలోనే అధిష్టానం తప్పటడుగు వేసింది. దాంతో ఆదిలోనే హంసపాదులా నామినేషన్లకు ముందే ఎడారిలో తుపానును తలపిస్తూ పరిస్థితి చేయిదాటిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజస్తాన్ రాజకీయాల్లో చాపకింద నీరులా ఉన్న అసంతృప్తి జ్వాలను చల్లార్చేందుకు అధిష్ఠానం చేసిన ప్రయత్నం వికటించింది. అనుభవజ్ఞుడైన గెహ్లాట్‌కు జాతీయ అధ్యక్ష పదవి ఆశచూపి యువ సచిన్ పైలట్‌ను సీఎంగా చేయాలన్నది పార్టీ పెద్దల యోచన. అప్పుడు ఇద్దరికీ సమ న్యాయం చేసినట్టవుతుందని అధిష్టానం భావించింది. కానీ ఇదే విషయాన్ని గెహ్లాట్‌కు స్పష్టంగా చెప్పే విషయంలో అధిష్టానంతో పాటు అగ్ర నాయకులు మీనమేషాలు లెక్కపెట్టి అనవసర ఊహాపోహలకు తావిచ్చారు. రాజస్తాన్‌ను వదలడం సుతరామూ ఇష్టంలేని గెహ్లాట్‌కు ఇది రుచించలేదు. తప్పదంటే తన సన్నిహితునికే సీఎం పదవి కట్టబెట్టాలన్నది ఆయన ఆలోచన. దాంతో గెహ్లాట్ బల ప్రదర్శనకు దిగారు! అస్పష్టత... అయోమయం రాజస్తాన్ రాజకీయ యవనికపై ఆదివారం జరిగిన హైడ్రామా అటు అధిష్టానాన్నీ, ఇటు గెహ్లాట్‌నూ ఇరుకున పెట్టింది. రాజీనామాల వరద ఇద్దరినీ పీకల్లోతు ముంచేసింది. హైకమాండ్ హైకమాండే గనుక ఏం చేసినా చెల్లుతుంది. గెహ్లాట్ పరిస్థితే ఎటుకాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది. అధ్యక్ష పదవిని హుందాగా అంగీకరించి, అనుచరులను సముదాయించి అధిష్టానం మాట జవదాటకుండా ఒప్పించగలిగితే తప్ప గెహ్లాట్ ఇప్పుడు రాజకీయ కుర్చీలాటలో ఏ కుర్చీ దొరక్క కిందపడిపోవాల్సి వస్తుందనేది నిపుణుల అంచనా. గెహ్లాట్‌ను కేవలం మధ్యేమార్గంగా అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారే తప్ప నిజానికి కాంగ్రెస్‌లో సీనియర్లకు, అనుభవజ్ఞులకు కొదవలేదు. చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ నుంచి సుశీల్ కుమార్ షిండే దాకా చాలామంది ఉన్నారు. అధిష్టానం చెబితే బరిలోకి దిగడానికి వీరంతా సిద్ధంగానే ఉన్నారు. వరుస తప్పిదాలు... కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బహుముఖ పోరు అనివార్యమైన పక్షంలో గాంధీల ఆశీస్సులు లేకుండా గెలవడం అసాధ్యమని అందరికీ తెలుసు. అంతేగాక అధిష్టానం చల్లని చూపు ఎవరిపై ఉంటే వారివైపే రాజస్తాన్ ఎమ్మెల్యేలు ఉండటమూ తప్పనిసరే. ఈ నేపథ్యంలో గెహ్లాట్ గనక అధిష్టానం అసంతృప్తికి లోనయితే సీఎం పదవికి దూరం కావాల్సి వస్తుంది. దాదాపు ఐదు దశాబ్దాల కింద కాంగ్రెస్‌తో జతకట్టిన గెహ్లాట్ తన రాజకీయ జీవితంలో ఏనాడూ హైకమాండ్‌ను ధిక్కరించలేదు. పార్టీ కష్టకాలంలోనూ విధేయతను స్పష్టంగా చాటుకున్నారు. కాంగ్రెస్ రాజకీయంగా 2014 నుంచి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నప్పటికీ సీనియర్లకు, విధేయులకు సమున్నత రీతిలో అన్ని అవకాశాలు కల్పించింది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను, విధేయులను కోల్పోయింది కూడా! కానీ పంజాబ్‌లో దెబ్బతిన్న తర్వాత కూడా అధిష్టానం తీరు మార్చుకోకపోవడం దాని కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేసే పరిణామమే. రాజస్తాన్ రాజకీయ పరిస్థితిని అనవసరంగా చేయి దాటనిచ్చి, ఇప్పుడు దిద్దుబాటుకు దిగడమే ఇందుకు తార్కాణం. ఈ ఎపిసోడ్లో తప్పంతా 10–జన్‌పథ్‌దేనన్నది కొందరి వాదన. సీనియర్ నాయకుల్లో జవాబుదారీతనం లేకపోవడం పెద్ద మైనస్‌పాయింటని మరికొందరి వాదన. రాజస్తాన్ విషయంలోనైతే ఇది మరీ కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఆదివారం పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాకు ముందు అందరినీ సీఎల్పీ సమావేశానికి తీసుకొచ్చేలా గెహ్లాట్‌కు నచ్చజెప్పడంలో ఖర్గే, మాకెన్ విఫలమయ్యారు. భేటీకి పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్ గైర్హాజరయ్యారు. ఇంత గందరగోళం మధ్య ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను దారిలోకి తెచ్చేందుకు క్రమశిక్షణ మార్గదర్శకాలు జారీ చేయడంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వైఫల్యం ఆశ్చర్యకరం. రాజీనామాలు జరిగిన ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఆయన గనక పరిస్థితిని చాకచక్యంగా చక్కబెట్టి ఉంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. ఎమ్మెల్యేలకు వారి ఇష్టాయిష్టాలను వెల్లడించే స్వేచ్ఛ ఎప్పుడైనా ఉంటుంది. కానీ వారిని సముదాయించే పాత్రను నిర్వర్తించడంలో సీనియర్ల వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. పైగా, ఇంత జరిగినా అధిష్టానం మనోగతం మేరకు ఎమ్మెల్యేలను ఏకతాటిపై నడిపించడంలో విఫలమైన గెహ్లాట్‌కు గానీ, పీసీసీ చీఫ్‌కు గానీ కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఎలా ముగుస్తుందో...! రాజస్తాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే పైలట్‌ను రాజస్తాన్ సీఎంగా చూడాలన్నది అధిష్టానం ప్రధానోద్దేశం. ఒకరకంగా ఇది గతంలో చేసిన తప్పును చాలా ఆలస్యంగా సరిద్దుకునే ప్రయత్నమే. పైలట్ 2014 నుంచి నాలుగేళ్లు పీసీసీ చీఫ్‌గా పార్టీని సజావుగా నడిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. దాంతో ఆయన్నే సీఎం చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆ సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గెహ్లాట్‌కు సీఎం పదవి దక్కింది. అంటే తెర వెనక ఎంత లాబీయింగ్ జరిగిందో ఊహించుకోవచ్చు. రెండు ముక్కల్లో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే పైలట్ నేరుగా రాహుల్ నివాసానికి వెళ్లి కలిస్తే గెహ్లాట్ అదే సమయంలో అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. అలా మొదలైన లాబీయింగ్ తారస్థాయికి చేరింది. చివరికి అహ్మద్ పటేల్ మాటే చెల్లింది. గెహ్లాట్ సీఎం అయ్యారు. పైలట్ వంటి యువకున్ని సీఎం చేయాలని భావించిన రాహుల్ ఆ తర్వాత గెహ్లాట్ వైపు మొగ్గడంగమనార్హం. సోనియా, ప్రియాంక ఒత్తిడి మేరకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పైలట్ అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ తప్పిదాన్ని ఇప్పుడు దిద్దుకునేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పైగా గెహ్లాట్ సారథ్యంలో వెళ్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్డం కష్టమని సర్వేల్లోనూ తేలింది. దాంతో పైలట్‌కే రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. -
‘అదే జరిగితే.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు పంజాబ్ తరహా ఓటమి’
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అశోక్ గెహ్లాట్ తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి రావటంపై రాజస్థాన్‌లో తీవ్ర సంక్షోభానికి దారి తీసిన సంగతి తెలిసింది. గెహ్లాట్ సీఎంగా ఉండాలని ఆయన మద్దతుదారులు 80 మందికిపైగా తమ రాజీనామాను స్పీకర్ సీపీ జోషికి అందించారు. రాజీనామాలు అందించేందుకు ముందు ఎమ్మెల్యేలు సమావేశమైన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు గెహ్లాట్ మద్దతు ఎమ్మెల్యేలు. ఈ వీడియోలో.. కాంగ్రెస్ హైకమాండ్‌ను ధరివాల్ హెచ్చరిస్తున్నట్లు వినబడుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్‌ను తొలగిస్తే.. పార్టీకి తీరని నష్టం జరుగుతుందని, పంజాబ్‌లో మాదిరిగా ఘోర ఓటమి తప్పదని పేర్కొన్నారు. ‘అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం ఎలాంటి రెండు పదవులు అనుభవిస్తున్నారని హైకమాండ్‌లోని ఎవరైనా చెప్పగలరా? ప్రస్తుతం సీఎం పోస్ట్‌ను వదులుకోవాలని ఎందుకు అడుగుతున్నారు? ఆయన రెండో పదవి పొందినప్పుడు దాని గురించి మాట్లాడతాం. ఇలాంటి కుట్ర కారణంగానే పంజాబ్‌ను కోల్పోయాం. ఇప్పుడు రాజస్థాన్‌ను కోల్పోయే అంచున ఉన్నాం. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్‌ను తొలగిస్తే ఓటమి తథ్యం.’ అని పేర్కొన్నారు ధరివాల్. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు 80 మంది స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆదివారం అందించారు. గెహ్లాట్ స్థానంలో సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేయాలని హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆందోళన చెందారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని రాహుల్ గాంధీ ఇటీవలే స్పష్టం చేసిన క్రమంలో అధ్యక్ష పదవి కోసం గెహ్లాట్ సీఎం పదవిని వదులుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు -
ఈ ఎన్నికల సారం ఏమిటి?
కాంగ్రెస్ పార్టీ తన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీల పరంగా ఇది నిస్సందేహంగా సానుకూలాంశం. మిగతాపార్టీల కన్నా ముందుచూపుతో వేస్తున్న అడుగు. కానీ ఇది ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్నది సందేహం. ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉండి, అధ్యక్షుడి ఎన్నిక తప్పకపోతే, ఢిల్లీలోని అధిష్ఠానం ఫలానా వ్యక్తిని ఎంచుకోవాలంటూ తాను కోరుకుంటున్న అభ్యర్థిని సూచిస్తూ రాష్ట్రాలకు సందేశం పంపుతుందా? ఇలా జరిగే అవకాశాన్ని నిరోధించే అధికారం తనకు లేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెబుతున్నారు. మరి స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికను నిర్వహించడం ఇలాగేనా? ఇది విజేత విశ్వసనీయతను పలుచన చేయడం కాదా? కాబట్టి అధ్యక్ష ఎన్నిక భారతదేశానికి చెందిన పురాతన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందా అన్నదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. వాటిని బట్టే ఈ ఎన్నిక విషయంలో మనం తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు వేయడం మొదలైపోయింది. సెప్టెంబర్ 30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఒకరికి మించి అభ్యర్థులు పోటీ పడినట్లయితే, అధ్యక్ష ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. 19వ తేదీన ఫలితాన్ని ప్రకటి స్తారు. ఈ అధ్యక్ష ఎన్నిక భారతదేశానికి చెందిన పురాతన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందా అన్నదే కీలకమైన ప్రశ్న. వామపక్షాన్ని మినహాయిస్తే, కాంగ్రెస్ చేపట్టిన ఈ ప్రయత్నం నిస్సందేహంగా ఇతర రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుచూపుతో కూడిందనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ తన సొంత రాజ్యాంగం అవసరాలను నెరవేర్చనుందా లేదా వాటినుంచి తప్పించుకుంటుందా? పునాదిలోనే లోపం మొదటగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అధ్య క్షుడిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోవడమే. ఇందులో అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఉంటారు. పార్టీ రాజ్యాంగం నిర్దేశించినట్లుగా, ఈ ఎలక్టోరల్ కాలేజీని మండల (సమితి) స్థాయి కాంగ్రెస్ కమిటీలు (బ్లాక్ కాంగ్రెస్ కమిటీ–బీసీసీ) ఎన్నుకుని ఉండాలి. లేదా కాంగ్రెస్ శాసనసభా పక్ష ప్రతినిధులు ఎన్నుకుని ఉండాలి. ఇదే ఇప్పుడు సమస్య. ఎందుకంటే పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్–11 ఎ (ఎ) 1 చెప్పినట్లుగా, ప్రతి మండల స్థాయి కాంగ్రెస్ కూడా రహస్య బ్యాలెట్ ద్వారా ఒక పీసీసీ ప్రతినిధిని ఎన్నుకోవలసి ఉంటుంది. అలాంటి ప్రతినిధే పీసీసీలో సభ్యుడై ఉండాలి. అలాగే శాసనసభా పక్షం తప్పక తమ ప్రతినిధులను ఎన్నుకోవలసి ఉంటుందని ఆర్టికల్–11 ఎ (ఇ) నిర్దేశించింది. అయితే ఈ రెండు ప్రకరణలలో దేన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. ఏకాభిప్రాయం ఎంత నిజం? ఒక అండమాన్ నికోబార్ దీవులు మినహా, ప్రతి ఇతర మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ కూడా తన ప్రతినిధిని ఏకాభిప్రాయంతో, ఏకగ్రీవంగా ఎన్నుకుంటుందని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రధాన కార్యదర్శులు వారిని నామినేట్ చేయడానికి ప్రయత్నించారు. అలాగే శాసనసభ పక్షాలు కూడా తమ ప్రతినిధిని అలాగే ఎన్నుకుంటాయని చెబుతూనే, పార్టీ సీనియర్ కార్యనిర్వా హకులు వారిని నియమిస్తారని కూడా మిస్త్రీ సూచిస్తున్నారు. ఏకాభిప్రాయంతో, ఏకగ్రీవంగా ప్రతినిధులను ఎన్నుకుంటారు కాబట్టి వారి కోసం ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం లేదనీ, కాబట్టే ప్రతినిధుల ఎన్నికలు నిర్వహించమనీ మధుసూదన్ మిస్త్రీ స్పష్టపరిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఎన్నిక అవసరమని చెబుతున్నప్పుడు ఏకాభిప్రాయం అనేది ఆ ప్రమాణాన్ని పాటించడం లేదు. ఏకాభిప్రాయం అనేది బహిరంగంగా లేదా రహస్యంగా ఆదే శాల ద్వారా కిందిస్థాయి వరకూ చేరుతుంది. ఉదాహరణకు ‘ఢిల్లీ’ లోని నాయకత్వం ఒక నిర్దిష్ట వ్యక్తిని కావాలని కోరుకుంటే, ఏకాభిప్రాయాన్ని దానికి అనుగుణంగా మలుస్తారు. పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనే! ఇప్పుడు, బీసీసీ స్థాయిలో ఏం జరుగుతుందో, అదే పీసీసీ స్థాయిలో కూడా పునరావృతమవుతుంది. అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) స్థాయిలోనూ జరుగుతుంది. పీసీసీ చీఫ్‌లను నియ మించేందుకు, ఏఐసీసీ ప్రతినిధులను నామినేట్ చేయడానికి నూతన కాంగ్రెస్ అధ్యక్షుడికి అధికారం కల్పిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు తీర్మానాలు చేస్తాయి. మరోసారి ఇది పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించ డమే అవుతుంది. రాజ్యాంగంలో రూపొందించిన నియమాలు పీసీసీలు తమ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏఐసీసీని ఎంచుకోవడంలో కూడా ఇదే నిజం కావాలి. ఇక కీలకమైన వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులను ఏఐసీసీ సభ్యులు ఎన్నుకుంటున్నందున మీకు ఆ వివరాలు కూడా చెప్ప నివ్వండి. ఇతర విభాగాల సభ్యులకు తోడుగా... ఆర్టికల్–13 ఎ (ఎ) ప్రకారం– ఒక్కసారి మాత్రమే ఓటు బదిలీ చేయగలిగే వ్యవస్థకు అనుగుణంగా దామాషా ప్రాతిపదికన... తమలోని సభ్యులను తామే ఎన్నుకున్న పీసీసీ సభ్యుల సంఖ్యలో ‘ఎనిమిదో వంతు’ సభ్యులు ఏఐసీసీలో ఉంటారు. కానీ ఈ ప్రక్రియ జరగనప్పుడు, ఏఐసీసీ సభ్యులను కాబోయే అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. అంటే వీరు కీలక వర్కింగ్ కమిటీకి చెందిన 12 మంది సభ్యు లను ఎన్నుకోవడం అనేది రిగ్గింగ్ జరిగినట్లుగా భావించాల్సి ఉంటుంది. చేసింది సరిపోదు! కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఫలితం ఏమిటి? కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి స్వేచ్ఛాయుతమైన, న్యాయ బద్ధమైన ఎన్నిక జరగవచ్చు కానీ ఎలక్టోరల్ కాలేజీని సరిగా ఎన్నుకోకపోయి ఉండవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఎన్నుకునే విభాగాన్ని నామినేట్ చేస్తారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం వీరిని ఎన్ను కోవాలి. కాబట్టి పార్టీ అంతర్గత ప్రజాస్వామికీకరణతో ముగియాల్సిన ప్రక్రియ బాధాకరంగా దాన్ని ఎంతమాత్రమూ పాటించకపోవడంతో ముగిసిపోతుంది. ఇతర పార్టీల ఆచరణ కంటే ఈ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ ఎక్కువే చేసివుండొచ్చు. అయినా కూడా ఆ పార్టీ రాజ్యాంగం కోరుకుంటున్న దానికంటే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. విశ్వసనీయత ఎంత? ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడని కొన్ని ప్రశ్నలను మీకు మీరే సంధించుకోండి. నిబంధనలకు అను గుణంగా మీరు వ్యవహరించకపోతే మీ రాజ్యాంగానికి అర్థం ఏమిటి? మండల, జిల్లా, ప్రదేశ్ కమిటీ స్థాయుల్లో ముందస్తుగా ఎన్నికలు నిర్వ హించవలసిన ప్రక్రియను పాటించకపోయినట్లయితే, కొత్త అధ్యక్షు డిని ఎన్నుకోవడంలో అర్థం ఏముంది? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక తప్పకపోతే, ఢిల్లీలోని అధిష్ఠానం ఫలానా వ్యక్తిని ఎంచుకోవాలంటూ తాను కోరుకుంటున్న అభ్యర్థిని సూచిస్తూ సందేశం పంపుతుందా? ఇలా జరిగే అవకాశాన్ని నిరోధించే అధికారం తనకు లేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెబుతున్నారు. మరి స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికను నిర్వ హించడం ఇలాగేనా? ఇది విజేత విశ్వసనీయతను పలుచన చేయడం లేదా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనున్నందున ఈ అంశాలను మదిలో ఉంచుకోండి. అధ్యక్ష ఎన్నిక ఎంత అర్థవంతంగా జరుగు తుందో చెప్పడానికి ఇదొక మార్గం మరి! వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
30న శశి థరూర్ నామినేషన్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ ఎంపీ శశి థరూర్ సెప్టెంబర్ 30న నామినేషన్ వేసే అవకాశముంది. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను థరూర్ ప్రతినిధి స్వీకరించారు. ఆయన దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా సంతకాలు సేకరిస్తారని సమాచారం. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో థరూర్ తలపడనున్నారు. పోటీలో అశోక్ గెహ్లాట్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్ సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే! -
Sakshi Cartoon 23-09-2022
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది మేడం! ఒక్క రాహుల్‌కి తప్ప అందరికీ అధ్యక్షులవ్వాలని ఉందని..! -
రాహుల్‌కే అధ్యక్ష బాధ్యతలు.. టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌గాంధీ చేపట్టాలని టీపీసీసీ కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ నూతన ప్రతినిధుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మా నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ముఖ్యనేతలు వి.హనుమంత రావు, షబ్బీర్‌అలీ, గీతారెడ్డి, మధు యాష్కీ, దామోదర రాజనర్సింహ, అంజన్‌కుమార్, మహేశ్‌కుమార్‌గౌడ్ బలపరిచారు. దీంతో పాటు పీసీసీ నూతన కార్యవర్గం, ఏఐసీసీ సభ్యులు, ఏఐసీసీ కార్యవర్గ నియామక బాధ్యతలను సోని యాకు అప్పగిస్తూ మరో తీర్మానం చేశా రు. ఈ తీర్మానాన్ని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, వి.హనుమం తరావు బలపరిచారు. ఏఐసీసీ తరఫు రిటర్నింగ్ అధికారిగా కేరళకు చెందిన ఎంపీ రాజమోహన్ ఉన్నతన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఛత్తీస్‌గఢ్ నేత రాజ్భగేల్లు హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయింది: ఉన్నతన్ ప్రతినిధుల సమావేశం తర్వాత గాంధీభవన్‌లో రాజ్ భగేల్, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, హర్కర వేణుగోపాల్‌లతో కలిసి ఉన్నతన్ మీడి యాతో మాట్లాడారు. పీసీసీ నూతన కార్యవర్గం, ఇతర నియామకాల బాధ్య తను సోనియాకు అప్పగించడంతో పీసీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. తీర్మానాలను జాతీయ ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి అందజేస్తామని తెలిపారు. కాగా, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను సోనియా లేదా రాహుల్ తీసుకోకుంటే ఇతర నేతలు పోటీకి వస్తే తాము కూడా నామినేషన్లు వేయాలనే చర్చ సీనియర్ నేతల్లో జరుగుతోంది. -
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో రాహుల్ గాంధీ ఉన్నారా?
చెన్నై: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. గాంధీ కుటుంబంపై కొందరు సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన దరిమిలా.. బయటి వాళ్లకు అవకాశం దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. రాహుల్ గాంధీ ఈ రేసులో ఉన్నారా? లేదా? అనే ప్రశ్న ఆయనకే ఎదురైంది. భారత్ జోడో యాత్రలో పాల్గొంట్నున రాహుల్ గాంధీకి మీడియా నుంచి అధ్యక్ష ఎన్నికల గురించి ప్రశ్న ఎదురైంది. ‘‘నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది పార్టీ ఎన్నికలు (పదవికి) జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఏం చేయాలో నేనో నిర్ణయంపై ఉన్నా. అందులో ఎలాంటి గందరగోళం లేదు’’ అని ఆయన తెలిపారు. తద్వారా అధ్యక్ష ఎన్నికలకు తాను దూరంగా లేననే సంకేతాలను అందించారు ఆయన. అందమైన దేశంలో ఈ రెండు మూడు నెలలు యాత్ర చేపట్టడం ద్వారా పరిస్థితులను అర్థం చేసుకునేందుకు నాక్కూడా ఓ అవకాశం దొరుకుతుంది. కొన్ని విషయాలపై పూర్తి స్థాయి అవగాహనతో సమర్థంగా రాటుదేలగలను అని ఆయన పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నవంబర్17వ తేదీన పోలింగ్ జరగనుంది. రెండు రోజుల తర్వాత కౌంటింగ్ చేపట్టి.. ఫలితం ప్రకటిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30 తేదీల మధ్య నామినేషన్ల ప్రక్రియ నడుస్తుంది. గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని, పార్టీ కుదేలుకు కారణం రాహుల్ గాంధీనే అంటూ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు సీనియర్ల కాంగ్రెస్‌ను వీడడం.. దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆషామాషీ కాదు -
మార్పునకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా?
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక వ్యవస్థేనని ప్రముఖ ఎన్నికల పండితులు నొక్కి చెబుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల సర్వే కూడా అదే చెబుతోంది. 2014లో మోదీ ఆధికారంలోకి వచ్చాక తమ ఆర్థిక స్థితి దిగజారిపోయిందనో, ఏమీ మారలేదనో అత్యధిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని కూడా ఎంతోమంది అంటున్నారు. తమ ఆర్థిక పరిస్థితి పట్ల ప్రజల్లో ఇంతటి తీవ్ర నిరాశాభావం దేశంలో రానున్న మార్పును సంకేతిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతుందా? గాంధీ కుటుంబేతర నాయకుడికి అధ్యక్ష పగ్గాలు అప్పజెబుతుందా? ఒకవేళ అప్పజెప్పినా స్వేచ్ఛగా పనిచేయగలిగే వీలు కల్పిస్తుందా? వీటన్నింటికీ ఆశావహ సమాధానాలు దొరికితే గనక, ఈ కొత్త అధ్యక్షుడి హయాంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగితే భారీ రాజకీయ మార్పు సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పు ఆ పార్టీకే కాకుండా దేశానికే ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చేసిన నాటకీయ రాజీనామా ఇప్పటికే సాగుతున్న ప్రక్రియను మరింత ముందుకు నెడుతుందా? మన ప్రజాస్వామ్యానికి కీలకమలుపు తీసుకురానున్న కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గణనీయమైన మార్పు అవకాశం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. రెండు వాస్తవాల వల్ల ఇది ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తమ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కృత నిశ్చయంతో ఉంది. ఈ పోటీలో సోనియాగాంధీ కుటుంబీకులు ఎవరూ పోటీ చేయడం లేదు. కాబట్టి దీని ప్రతిఫలంగా ఒక ఉత్తేజ కరమైన, విశ్వసనీయమైన, బహుశా జనరంజకమైన జాతీయ ప్రతిపక్షం ఆవిర్భవించడాన్ని మనం చూడవచ్చా? బహుశా నేను ఈ విషయంలో రెండు ఊహలపై ఆధారపడు తున్నాను. మొదటిది: స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఎవరైనా ఈ ఎన్నికలో పోటీ చేయడానికి రంగం సిద్ధమవు తోంది. ఇది ఎన్నికలపరంగా ప్రతిభకు, రాజకీయ సున్నితత్వానికి, విస్తృతమైన బహిరంగ ప్రజా నివేదనకు ఆస్కారమిస్తోంది. పైగా బీజేపీని సవాలు చేయగల గొప్ప వక్తను బహూకరించడమే కాదు... భారతీయ ఓటరుకు అర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని కూడా ప్రతిపాదిస్తోంది. రెండు: అధ్యక్షుడిగా గెలిచే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో తాను ఆలోచిస్తున్న విధంగా సమూల మార్పులు చేసే స్వేచ్ఛను కలిగి ఉంటారు కూడా! అదే సమయంలో గాంధీలు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాకుండా నూతన అధ్యక్షుడికి ప్రోత్సాహం, మద్దతు అందించే స్థానంలో ఉంటారు. గులామ్ నబీ ఆజాద్ రాజీనామా తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మాత్రమే బతికి బట్ట కడుతుంది. అయితే నా వివేకం సూచిస్తున్న సానుకూల అవకాశాలతో పోలిస్తే నా అంచనాలు తప్పు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉండ వచ్చు కూడా! అదేమంటే గాంధీయేతర అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ చక్కగా ఎంపిక చేసుకోవచ్చు కానీ, గాంధీ కుటుంబం ఆయనకు స్వేచ్ఛగా పనిచేయగల, మాట్లాడగల, వ్యూహాన్ని మార్చివేయగల స్వాతంత్య్రాన్ని ఇస్తుందా? అలాగే తాను కోరుకుంటున్న పొత్తుల కోసం ప్రయత్నించే స్వాతంత్య్రాన్ని ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు, మన ప్రజాస్వామ్య శ్రేయస్సు రీత్యానే కాకుండా దేశ భవి ష్యత్తు కోసం కూడా గాంధీ కుటుంబం అలాంటి అవకాశం ఇస్తుందని మాత్రమే నేను ఆశించగలను. 2024 ఎన్నికల్లో బీజేపీ దెబ్బతినగలదని సూచించడానికి గణనీ యమైన సాక్ష్యం ఉందని చెబుతున్నాను. సమర్థుడైన, బాధ్యతా యుతమైన అధ్యక్షుడి నాయకత్వం కింద పునరుజ్జీవం పొందే కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల ఫలితాన్నే నిర్ణయించగలిగేలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలదు. ‘ఇండియా టుడే’ ఇటీవలే నిర్వహించిన ‘జాతి మనోగతం’ సర్వే నుంచి దీనికి సరైన సాక్ష్యం లభిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి భారత ప్రజల తీవ్ర ఆందోళనను, వేదనను కూడా ఈ తాజా సర్వేప్రతిబింబించింది. మనలో మెజారిటీ ప్రజలకు ఇదే ప్రస్తుతం విలువైన అంశంగా ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సమస్యలే అని 69 శాతం మంది గుర్తించారు. దేశ పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుందనీ, లేదా కనీసం మెరుగుపడదనీ ఈ పోల్‌లో పాల్గొన్న వారిలో 57 శాతం మంది నమ్ముతున్నారు. పరిస్థి తులు మెరుగవుతాయని నమ్ముతున్న వారికంటే మెరుగుపడవని నమ్మే వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక తమ ఆర్థిక స్థితి దిగజారిపోయిందని, లేక ఏమీ మారలేదని 67 శాతం మంది చెప్పారు. తమ పరిస్థితి మోదీ వచ్చాక మెరుగుపడిందని 28 శాతం మంది మాత్రమే చెప్పారు. పైగా దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉందని, లేదా ఎంతో కొంత తీవ్రమైన స్థితిలో ఉందని 73 శాతం మంది భావించారు. ఇందులో 56 శాతం మంది అయితే నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అలాగే తమ కుటుంబ ఆదాయం తగ్గిపోయిందని లేదా మెరుగుపడలేదని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ వివరాలను గమనించినట్లయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత బలహీనమైన స్థితిలో ఉందని కనిపించడం లేదా? బహుశా మన అత్యంత గౌరవనీయులైన (మాజీ) ఎన్నికల పండితుడు యోగేంద్ర యాదవ్ చెబుతున్నదాన్ని బట్టి సందేశం చాలా స్పష్టంగా ఉంది. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఆర్థిక వ్యవస్థేనని ముమ్మార్లు ఆయన నొక్కి చెప్పారు. తమ ఆర్థిక భవిష్యత్తు గురించి సాంప్రదాయికంగానే భారతీయులు చాలా ఆశావహ దృక్పథంతో ఉంటారు. కానీ తమ ఆర్థిక పరిస్థితి పట్ల ఇంత తీవ్ర నిరాశాభావం దేశంలో రానున్న మార్పును సంకేతిస్తోందనీ, వ్యూహాత్మకంగా సరైన రీతిలో నిర్వహించగలిగితే దేశంలో భారీ రాజకీయ మార్పునకు ఇది దారి తీస్తుందనీ మనం గ్రహించవచ్చు. అయితే, దేశంలో రెండో నాటకీయ మార్పు కూడా ఇప్పటికే చోటు చేసుకుందని ‘ఇండియా టుడే’ పోల్ సూచిస్తోంది. అదేమిటంటే ఈసారి మోదీ ప్రభుత్వ ప్రజాస్వామిక విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. భారత్‌లో ప్రస్తుత ప్రజాస్వామ్య స్థితి గురించి మీరేమనుకుంటున్నారు అని ‘ఇండియా టుడే’ పోల్‌లో ప్రశ్నించి నప్పుడు– 48 శాతం మంది ప్రమాదకరంగా ఉందని నమ్ముతుం డగా, 37 శాతం మంది ప్రజాస్వామ్యానికి ప్రమాదమేమీ లేదని చెప్పారు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడుతోందని నమ్మేవారి సంఖ్య ఈ సంవత్సరం జనవరి నుంచి దాదాపు 10 శాతం పెరిగింది. అదే సమయంలో ప్రజాస్వామ్యం చక్కగా ఉందని చెప్పినవారి సంఖ్య దాదాపు 20 శాతం పడిపోయింది. ఈరోజు మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనో, లేదనో చెబుతున్న వారి మధ్య ఆంతరం ఆశ్చర్యకరంగా 11 శాతం మాత్రమే. మరోసారి చెబుతున్నాను, విశ్వసనీయుడైన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు పార్టీని ఈ అంశంపైనే నిర్మించగలడు. పైగా మరో విషయం గుర్తుపెట్టుకోవలసి ఉంది. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలో అతడు గెలిచి, అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఉండే పార్టీకి ప్రాతినిధ్యం వహించగలిగితే, అది అతడి స్థానాన్ని మరింతగా బలపర్చగలదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఈ అవకాశం మరీ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే రానున్న 20 నెలల కాలంలో మోదీ, బీజేపీ తమ పట్ల ప్రజల్లో ఉంటున్న ఈ వ్యతిరేక అవగాహనను మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించవచ్చు. కాబట్టి పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడే గాంధీలు పక్కకు తొలగి, వారి వారసుడికి పూర్తి అవ కాశాలను కల్పించి తీరాలి. బహుశా, కేవలం బహుశా, ఆజాద్ నిష్క్ర మణ వల్ల గాంధీ కుటుంబం ఇది చేస్తుందనే నమ్మకం కలిగిస్తోంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇలాగే బద్ధకంగా, నిస్తేజంగా ఉంటూ, కష్టాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు.. 28న సీడబ్ల్యూసీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ తేదీలను ఖరారు చేయడానికి ఈ నెల 28, ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ వైద్య పరీక్షలకు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడినుంచే ఆమె వర్చువల్‌గా భేటీలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వెల్లడించారు. సోనియా వెంట రాహుల్, ప్రియాంక విదేశాలకు వెళ్లారు. దీంతో ఇతర పార్టీ నాయకులు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరవుతారు. రాజస్థాన్ సీఎం రాజేశ్ గెహ్లాట్ తదుపరి అధ్యక్షుడని ప్రచారం జరిగింది. గెహ్లాట్ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేలా చివరి నిముషం వరకు రాహుల్‌కి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తామన్నారు. రాహుల్ అధ్యక్షుడు కాకపోతే ఎంతో మంది నిరాశ నిస్పృహలకు లోనై ఇంటికే పరిమితం అవుతారని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా వినిపిస్తున్న పేర్లలో కమల్‌నాథ్, కె.సి. వేణుగోపాల్, మీరా కుమార్, కుమారి సెల్జా ఉన్నారు. ఇదీ చదవండి: Sonia Gandhi: అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. ఆయన ఏమన్నారంటే? -
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్?
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ విముఖత చూపుతున్న నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే.. గాంధీ కుటుంబీకులే అధ్యక్ష పదవి చేపట్టాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఈ తరుణంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టాలని సోనియా గాంధీ సూచించినట్లు వార్తలు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఆ వార్తలను కొట్టిపారేశారు అశోక్ గెహ్లాట్. ‘ఈ విషయాన్ని నేను మీడియా ద్వారానే వింటున్నా. దీని గురించి నాకు తెలియదు. నాకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నా.’ అని గుజరాత్ పర్యటన సందర్భంగా విలేకరులతో వెల్లడించారు గెహ్లాట్. అయితే.. అశోక్ గెహ్లాట్‌తో సోనియా గాంధీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారని, పార్టీ బాధ్యతలను చేపట్టాలని సూచించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. సెప్టెంబర్ 20న పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. అయితే, ఆ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తన ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల ఆ పదవిలో కొనసాగలేనని సోనియా గాంధీ చెబుతున్నారు. ఈ క్రమంలో గాంధీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఇటీవల దీనిపై అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల సెంటిమెంట్లను రాహుల్ గాంధీ అర్థం చేసుకుని పార్టీ పదవిని స్వీకరించాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ వల్లే సజీవంగా ప్రజాస్వామ్యం .. 32 ఏళ్లలో ఏ పదవీ చేపట్టని కుటుంబం అది! -
రాహుల్ గనుక కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించకపోతే..
ఢిల్లీ/జైపూర్: షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 20వ తేదీన పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకుని తీరతామన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అథారిటీ ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. మూడు, నాలుగు రోజుల్లో అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ పేరే ప్రధానంగా వినిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి, సెంటిమెంట్‌ను ఆయన గౌరవించి.. బాధ్యతలు చేపట్టాలి అని గెహ్లాట్ పేర్కొన్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ గనుక పార్టీ ప్రెసిడెంట్ కాకుంటే.. పరిణామాలు చాలా ప్రతికూలంగా మారతాయి. కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి పేరుకుపోతుంది. చాలామంది ఇళ్లలోనే ఉండిపోతారు. మేమంతా(సీనియర్లను ఉద్దేశించి) ఇబ్బంది పడతాం. కాబట్టి, సెంటిమెంట్‌ను గౌరవించి తనంతట తానుగా ఆయన ఈ పదవికి స్వీకరిస్తే మంచిది అని గెహ్లాట్ మీడియాతో వెల్లడించారు. #WATCH | If Rahul Gandhi does not become the party president, it will be a disappointment for the Congressmen across the country. He should understand the sentiments of Congress workers and accept this post...: Congress leader and Rajasthan CM Ashok Gehlot, in Jaipur yesterday pic.twitter.com/5lZq7H1vSS — ANI (@ANI) August 23, 2022 గాంధీ కుటుంబమా? కాదా? అనే ఇక్కడ సమస్య కాదు. పార్టీ అధ్యక్ష పదవిని ఆయనకే అప్పగించాలని చాలామందే కొరుకుంటున్నారు. ఇది ఏకగ్రీవ అభిప్రాయం. ఆయన అంగీకరిస్తేనే మంచిది. గత 32 ఏళ్లుగా ఆ కుటుంబ నుంచి ఎవరూ కూడా ప్రధాని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి.. ఇలా ఎలాంటి పదవి చేపట్టలేదు. అలాంటిది మోదీగారికి ఆ కుటుంబం అంటే ఎందుకు భయం పట్టుకుందో అర్థం కావడం లేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 75 ఏళ్ల భారతంలో ఏం జరగలేదని వ్యాఖ్యానిస్తున్నాడో అర్థం కావడం లేదు. ప్రతీ ఒక్కరూ కాంగ్రెస్‌నే ఎందుకు టార్గెట్ చేసుకుని.. విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు అని గెహ్లాట్ పేర్కొన్నారు. దేశం- కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటి కావడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అన్ని మతాలకు, వర్గాలకు చెందిన పార్టీ కావడమే మరో కారణం అని రాజస్థాన్ ముఖ్యమంత్రి తెలిపారు. 75 ఏళ్ల భారతంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచింది. కాబట్టే ఇప్పుడు మోదీ దేశానికి ప్రధాని, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారంటూ చురకలు అంటించారు గెహ్లాట్. ఇదీ చదవండి: కశ్మీర్లో స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్ -
Prashant Kishor: పీకే అలాంటి ప్రతిపాదనేం చేయలేదు
ఢిల్లీ: జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ నాయకత్వం విషయంలోనూ పలు కీలక సూచనలు చేశాడని, ప్రియాంక గాంధీ వాద్రాను అధ్యక్ష బరిలో నిలపాలని అధిష్టానంతో చెప్పాడంటూ.. కథనాలు జాతీయ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందించారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకత్వం గురించి ప్రతిపాదనేం చేయలేదని చిదంబరం స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. చాలా నెలలు కష్టపడి ఆయన(పీకేను ఉద్దేశిస్తూ) డాటా సేకరించారు. దానిపై ఆయన విశ్లేషణ.. ఆకట్టుకునేలా ఉంది. ఆ ప్రతిపాదనల్లో కొన్నింటిని కచ్చితంగా ఆచరించాలనే ఉద్దేశంతో పార్టీ ఉంది కూడా’ ఆయన చిదంబరం స్పష్టం చేశారు. అయితే.. కాంగ్రెస్ నాయకత్వ సమస్యపై పీకే తన ప్రజెంటేషన్‌లో ప్రస్తావించలేదు. అధ్యక్ష అభ్యర్థిగా ప్రియాంక పేరు ప్రతిపాదించిన విషయం నేను వినలేదు. అది నిజం కాదు కూడా. ఓ వర్గం మీడియా దానిని తెర పైకి తీసుకొచ్చింది. నాయకత్వ సమస్య పార్టీ అంతర్గత విషయం. ఏఐసీసీనే దానిని పరిష్కరిస్తుంది. ఆగష్టు చివరినాటికి ఎన్నికలతో ఆ సమస్య పరిష్కారం కావొచ్చు అని చెప్పారు. ఇక పార్టీ చేసిన ప్రతిపాదనను నిరాకరించిన విషయంపై పీకేను మళ్లీ వివరణ ఏమీ కోరలేదని, బహుశా ఆయన రాజకీయ వ్యూహకర్తగానే కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నాడేమోనని చిదంబరం అభిప్రాయపడ్డారు. అంతేకానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఐ-పీఏసీ(Indian Political Action Committee)(ప్రశాంత్ కిషోర్ స్థాపించిన కన్సల్టెన్సీ) చేసుకున్న ఒప్పందం వల్లే పీకే, కాంగ్రెస్‌లో చేరలేదన్న వాదనలో అర్థం లేదని చిదంబరం పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కారణం ఇదే- ప్రశాంత్ కిషోర్ -
సోనియానే మా లీడర్: గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా పార్టీ క్రియాశీలక వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సీనియర్లు.. మళ్లీ అధిష్టానానికి దగ్గరవుతున్నారు. శుక్రవారం సాయంత్ర జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. జీ-23గా పిల్చుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ రెబల్స్ నేతలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల చేదు ఫలితాలపై గరం గరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆపై వరుస భేటీలతో హీట్ పెంచిన సీనియర్లు ఎట్టకేలకు చల్లబడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం 10, జనపథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీతో భేటీ సంతృప్తికరంగా సాగిందని వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై అభిప్రాయాల్ని పంచుకునేందుకే ఆమెతో భేటీ అయినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని, ప్రతిపక్షాలను ఓడించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆయన అన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలంతా సోనియా గాంధీ నేతృత్వంలో ముందుకు సాగేందుకు సుముఖంగా ఉన్నారని, కొన్ని సలహాలు మాత్రం ఆమెతో పంచుకున్నామని’’ ఆజాద్ వెల్లడించారు. The meeting with Sonia Gandhi was good. All members of the Congress party decided unanimously that she should continue as the president, we just had some suggestions that were shared: Congress leader Ghulam Nabi Azad after meeting party president Sonia Gandhi pic.twitter.com/OSSsZqekqw — ANI (@ANI) March 18, 2022 ఇదిలా ఉండగా.. బుధ, గురువారాల్లో ఆజాద్ నివాసంలో కాంగ్రెస్ రెబల్స్ జీ-23 భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో అందరినీ కలుపుకుని పోవాలని, భావసారుప్యత ఉన్న పార్టీలతో చర్చించాలని హైకమాండ్‌కు సీనియర్లు సూచించినట్లు సమాచారం. మరోవైపు గాంధీలు తప్పుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. -
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభంపై రచ్చ
-
గాంధీలదే కాంగ్రెస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు స్వరాలతో రేగిన ప్రకంపనలు పాలపొంగు మాదిరి చప్పున చల్లారిపోయాయి. పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనువైన పరిస్థితులు రాగానే ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలని, అందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని... అప్పటిదాకా పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని ఆ తీర్మానంలో సీడబ్ల్యూసీ పెద్దలంతా స్పష్టంచేశారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలు కూడా వినిపించాయి. పార్టీలో మార్పులు కోరుతూ సీనియర్లు లేఖ రాసిన సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడగా... సమావేశంలో ఉన్న గులాం నబీ ఆజాద్ కూడా అదే రీతిలో స్పందించారు. సమావేశం బయట ఉన్న కపిల్ సిబల్ కూడా బహిరంగంగా ట్వీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితులు మారిపోయి తాత్కాలికంగానైనా అంతా ఒక్క చేతికిందికి వచ్చేశారు. ఉదయం నుంచి హైడ్రామా.. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తొలుత సోనియా గాంధీ తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. క్రియాశీలకంగా ఉండే, పూర్తి సమయం కేటాయించే అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ ఆగస్టు మొదటివారంలో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ తదితర 23 మంది నేతలు రాసిన లేఖపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ లేఖ రాగానే పార్టీలో మార్పుల గురించి చర్చించేందుకు సోనియాగాంధీ ఈనెల 20న పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చ ప్రారంభించేందుకు వీలుగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో 52 మంది పాల్గొన్నారు. ఒక్క తరుణ్ గొగోయ్ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలూ వినిపించాయి. లేఖ రాసిన సమయం, సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. లేఖ రాసినవారు బీజేపీతో కుమ్మక్కయ్యారని కూడా ఆయన ఒకదశలో వ్యాఖ్యలు చేసినట్లు తెలియవచ్చింది. దీనికి గులాం నబీ ఆజాద్ ఘాటుగా స్పందిస్తూ బీజేపీతో కుమ్మక్కయినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. సోనియా గాంధీ ప్రారంభ ఉపన్యాసం అయ్యాక సీనియర్ నేతలు మన్మోహన్సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ మాట్లాడుతూ... సీనియర్ల లేఖను తప్పుపట్టారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని మన్మోహన్సింగ్ ఆకాంక్షించారు. లేఖ రాసిన వారిపై ఆయా నేతలు విమర్శలు గుప్పించారు. కొత్త పార్టీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని, అందుకు వర్చువల్ ఏఐసీసీ సెషన్ నిర్వహించాలని పి.చిదంబరం సూచించారు. సందర్భాన్ని తప్పుపట్టిన రాహుల్ గాంధీ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... లేఖపై సంతకం చేసిన వారిని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా లేఖ రాసిన సమయాన్ని, సందర్భాన్ని తప్పుపట్టారు. సోనియాగాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రాజస్తాన్‌లో పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. దీనికి సంబంధించి సమావేశం పూర్తికాకముందే బయటకు లీకులు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఒక వార్తా సంస్థ చేసిన ట్వీట్ దుమారం రేపింది. లేఖ రాసిన వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ మండిపడ్డారంటూ ఆ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌కు కపిల్ సిబల్ ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని ఆయన ట్వీట్ చేశారు. మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. పార్టీలో ఒకరితోనొకరు గొడవ పడడానికి బదులు మోదీ పాలనపై కలసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలికంగా సద్దుమణిగాయా? పార్టీలో, సమావేశంలో ధిక్కార స్వరాలు వినిపించాయనడానికి పార్టీ నేతలు చేసిన ట్వీట్లు చాలు. రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్లో ‘పార్టీ్టలో ఒకరినొకరు కొట్టుకునే కంటే మోదీ పాలనపై కలిసికట్టుగా పోరాడాలి’ అన్న వ్యాఖ్య అంతర్గత పోరు నిజమేనన్న సంకేతాన్నిస్తోంది. అలాగే తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని, రాహుల్‌ని అనలేదని, ఇతర కాంగ్రెస్ నేతలను మాత్రమే అన్నానని ఆజాద్ చేసిన ట్వీట్ కూడా సమావేశంలో జరిగిన వాడీవేడిని బయటపెడుతోంది. ఇక బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ అన్నట్టుగా వార్తలు వెలువడడంతో సిబల్ వెంటనే స్పందించి ట్వీట్ చేయడం కూడా అంతర్గత పోరుకు సంకేతమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అంతర్గత పోరు బహిరంగం కావడం, ఒక దశలో పార్టీలో దాదాపు 400 మంది సీనియర్లు మూకుమ్మడి రాజీనామాలు చేయబోతున్నారని ప్రచారం కావడంతో రాహుల్ గాంధీ స్వయంగా సిబల్‌తో మాట్లాడారు. తాను అలా అనలేదని చెప్పడంతో సిబల్ వెంటనే ట్వీట్ తొలగించారు. అలాగే లేఖ రాసిన వారిలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన వారు ఆజాద్, ఆనంద్ శర్మ ఇద్దరే. సమావేశంలో వీరి వైఖరిని అహ్మద్ పటేల్ తదితరులు తీవ్రంగా ఆక్షేపించారు. లేఖను తయారు చేసింది ఆనంద్ శర్మే అని ఆరోపించినట్టు కూడా తెలిసింది. నేతలంతా చివరికి లేఖ రాసిన వ్యక్తుల్ని కాకుండా సందర్భాన్ని తప్పుపడుతూ గాంధీ కుటుంబానికి విధేయత ప్రకటించారు. అలాగే రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కూడా కోరారు. మరోవైపు సమావేశం వెలుపల, వివిధ ప్రాంతాల్లో రాహులే అధ్యక్షుడు కావాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చివరకు ఏఐసీసీ సెషన్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగేవరకు సోనియానే చీఫ్‌గా కొనసాగాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ధిక్కార స్వరం వినిపించిన వారు కూడా ఈ తీర్మానంలో భాగం కావటంతో తాత్కాలికంగా పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పాలి. సమావేశం చివరలో సోనియా ‘మనది పెద్ద కుటుంబం. భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రజల కోసం కలిసి పోరాడాలి. సంస్థాగత అంశాలు ఎప్పుడైనా పరిష్కరించుకోవచ్చు..’అని ప్రకటించినట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ తర్వాత లేఖ రాసిన సీనియర్లు కొందరు గులాంనబీ ఆజాద్ నివాసంలో భేటీ అయ్యారు. కపిల్ సిబల్, శశిథరూర్, ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీలు హాజరైన వారిలో ఉన్నారు. బలహీనపరచడాన్ని అనుమతించలేం: సీడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్టీ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సంస్థాగతంగా మార్పులు చేపట్టడానికి సోనియాకు అధికారాన్ని కట్టబెట్టింది. సోనియా, రాహుల్‌ల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. పార్టీని, నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాలో, బాçహాటంగా చర్చించకూడదని, వాటిని పార్టీ వేదికలపైనే లేవనెత్తాలని కోరింది. సుమారు 7 గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలికి రాసిన లేఖపై సీడబ్ల్యూసీ లోతుగా చర్చించి ఈ తీర్మానాలు చేసింది. వేలాది మంది ప్రాణాలను తీసిన కరోనా మహమ్మారి, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పేదరికం, చైనాతో ఉద్రిక్తతలు వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తమ స్వరం వినిపించారు. ఈ దిశగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయత్నాలను పార్టీ మరింత బలోపేతం చేయాలి’ అని తీర్మానంలో సీడబ్ల్యూసీ పేర్కొంది. గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ట్వీట్ మీటింగ్ ఒకవైపు సాగుతుండగానే ఆజాద్ ఒక ట్వీట్ చేశారు. ‘మీడియాలోని ఒక వర్గం తప్పుగా అన్వయించింది. మేం ఆ లేఖ బీజేపీతో కుమ్మక్కై రాసినట్టు నిరూపించాలని రాహుల్‌ను ఉద్దేశించి నేను అన్నట్టుగా తప్పుగా అన్వయించింది. నేను భేటీలో ఏమన్నానంటే.. నిన్న కొందరు కాంగ్రెస్ వ్యక్తులు మేం బీజేపీతో కుమ్మక్కయి లేఖ రాశామని అన్నారు. అది చాలా దురదృష్టకర సంఘటన. ఈ ఆరోపణను నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నాను’ అని ట్వీట్ చేశారు. సోనియానే కొనసాగాలి పార్టీ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీనే కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గట్టిగా కోరారు. సీడబ్ల్యూసీ భేటీలో కేసీ వేణుగోపాల్, సోనియాగాంధీల అనంతరం మన్మోహన్ ప్రసంగించారు. నూతన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే పూర్తిస్థాయి ఏఐసీసీ సమావేశాలు జరిగేవరకు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని ఆయన సోనియాను కోరారు. నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్లు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది దురదృష్టకరమన్నారు. ‘హైకమాండ్ బలహీనమయితే, కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుంది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, సోనియా గాంధీ కొనసాగనట్లయితే.. అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించాలని మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కోరారు. సీనియర్లు రాసిన లేఖ కన్నా.. ఆ లేఖలోని అంశాలు క్రూరంగా ఉన్నాయని ఆంటోనీ విమర్శించారు. అందుకే ఆ ట్వీట్‌ను తొలగించా!: సిబల్ రాహుల్ గాంధీని ఘాటుగా విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ఆ తరువాత సీనియర్ నేత కపిల్ సిబల్ తొలగించారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యారన్న వ్యాఖ్య తాను చేయలేదని రాహుల్ గాంధీ స్వయంగా తనతో చెప్పారని, అందువల్ల ఆ ట్వీట్‌ను తొలగిస్తున్నానని సిబల్ వివరణ ఇచ్చారు. ‘బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ అంటున్నారు. రాజస్తాన్ హైకోర్టులో కాంగ్రెస్ తరఫున జరిపిన పోరాటంలో విజయం సాధించాం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో పార్టీ తరఫున విజయవంతంగా పోరాడాం. 30 ఏళ్లలో ఏ అంశంపైన కూడా బీజేపీకి మద్దతిస్తూ ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. అయినా, బీజేపీతో కుమ్మక్కయ్యామని అంటున్నారు’అని తొలగించిన ఆ ట్వీట్లో సిబల్ పేర్కొన్నారు. పూర్తి సమయం పని చేసే నాయకత్వం ప్రస్తుతం పార్టీకి అవసరమని పేర్కొంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో సిబల్ కూడా ఒకరు. నెహ్రూ– గాంధీ కుటుంబం నుంచి ఐదుగురు ► ఇతరులు 13 మంది ► స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సోనియాగాంధీ సిద్ధమయ్యారు. రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉన్నారని సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదోన్నతికి ప్రియాంకా గాంధీ సిద్ధంగా లేరని అంటున్నారు. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు వస్తారా? కాలమే తేల్చాలి. ఇప్పటికైతే సోనియాను కొనసాగాల్సిందిగా సీడబ్ల్యూసీ తీర్మానించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే... ఇప్పటిదాకా కాంగ్రెస్‌కు 18 మంది అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో నెహ్రూ– గాంధీ కుటుంబానికి చెందిన ఐదుగురే దాదాపు 40 ఏళ్లు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్‌లు అధ్యక్షులుగా పనిచేశారు. అందరికంటే అత్యధికకాలం పార్టీని నడిపింది సోనియా గాంధీనే. ఇప్పటిదాకా ఆమె 20 ఏళ్లు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు 13 మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. వారు... జేబీ కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్ టాండన్, యు.ఎన్.ధేబర్, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్, ఎస్.నిజలింగప్ప, జగ్జీవన్ రామ్, శంకర్‌దయాళ్ శర్మ, డి.కె.బరూహ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, పి.వి.నరసింహారావు, సీతారాం కేసరి. -
కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగనున్న సోనియా
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ పదవీకాలాన్ని మరికొంత పొడిగిస్తారనే ప్రచారంపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగిసేవరకూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా అధ్యక్షుడి ఎంపిక ఇంకా పూర్తికానందున పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె పదవీకాలం పొడిగింపు సాంకేతిక అనివార్యం మాత్రమేనని తెలిపింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు తమ పార్టీ సమాచారం అందించిందని వెల్లడించింది. కరోనా కట్టడికి మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్నందున నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు విఘాతం ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతూవస్తోంది. 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో పార్టీ చీఫ్‌గా రాహుల్ గాంధీ వైదొలగిన సంగతి తెలిసిందే. పార్టీ చీఫ్‌గా కొనసాగాలని కాంగ్రెస్ శ్రేణులు కోరినా రాహుల్ దిగిరాకపోవడంతో సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్ట్ 9న తాత్కాలిక చీఫ్ బాధ్యతలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కట్టబెట్టింది. సోమవారంతో తాత్కాలిక చీఫ్‌గా సోనియా గడువు ముగుస్తుండటంతో గడువు పొడిగింపు అనివార్యమైంది. సోనియా నియామకం అనంతరం మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అనంతరం కోవిడ్-19 వ్యాప్తితో నూతన అధ్యక్షుడి ఎన్నికలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నూతన అధ్యక్షుడి ఎంపిక త్వరలో పూర్తవుతుందని, అప్పటివరకూ సోనియా గాంధీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతారని ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వి తెలిపారు. మరోవైపు పార్టీని ముందుకునడిపేందుకు రాహుల్ గాంధీయే సరైన నేతని ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. చదవండి : ఆ పదవికి రాహులైతేనే బెస్ట్ -
‘పార్టీకి ప్రియాంకే దిక్సూచీ’
భోపాల్ : కాంగ్రెస్ చీఫ్‌గా ప్రియాంక గాంధీయే సరైన ఎంపిక అని మధ్యప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్‌గా వైదొలిగిన నేపథ్యంలో పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడంగమనార్హం. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పోరాట పటిమ కలిగిన ప్రియాంక గాంధీ వంటి మెరుగైన నేత అవసరమని వర్మ పేర్కొన్నారు. బీజేపీని దీటుగా ఎదుర్కొని పార్టీని ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడవేసే సామర్థ్యంఆమెకు ఉందని అన్నారు. తమ కుటుంబం నుంచి పార్టీ నాయకత్వాన్ని ఎవరూ స్వీకరించాలని రాహుల్ కోరుకోవడం లేదనే వార్తలను ప్రస్తావిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా కాంగ్రెస్‌ను ఊహించలేమని అన్నారు. రాహుల్ పార్టీకి సలహాదారుగా ఉండి, గతంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దే పాత్రను పోషించాలని వర్మ సూచించారు. -
రాహుల్ బాటలో మరో కీలకనేత గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ వైదొలిగిన మరుసటి రోజు అసోం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మరో కీలక నేత హరీష్ రావత్ ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అసోంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించిన హరీష్ రావత్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ పనిచేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని లోక్‌సభ ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థానాలకు గాను, కేవలం మూడింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకొంది. దీంతో హరీష్ రావత్ అస్సాం ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నట్లు గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తానే బాధ్యుడినని పేర్కొంటూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. తన రాజీనామాను తక్షణమే ఆమోదించి తదుపరి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు రాసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టేవరకూ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా మోతీలాల్ వోరాను కాంగ్రెస్ పార్టీ నియమించింది. -
రాహుల్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు రాహుల్. మీరు మంచి ఆరోగ్యంతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా’అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు. తొలుత రాహుల్ యూపీఏ చైర్పర్సన్, తన తల్లి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో గడిపారు. రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు ఉన్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. బిహార్‌లో మెదడువాపు వ్యాధితో దాదాపు 120 మంది చిన్నారులు మరణించిన నేపథ్యంలో ఈసారి రాహుల్ పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయలేదని పార్టీ కార్యకర్తలు వెల్లడించారు. -
‘కాంగ్రెస్ చీఫ్‌గా దళిత నేత’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ చీఫ్‌గా కొనసాగేందుకు విముఖత చూపుతున్న రాహుల్ గాంధీ తదుపరి అధ్యక్షుడిగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతను ఎంపిక చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూచించారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని సీనియర్ నేతలు రాహుల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన అందుకు సిద్ధంగా లేరని, వీలైనంత త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గాంధీ కుటుంబానికి చెందని నేతను పార్టీ చీఫ్‌గా ఎంపిక చేయాలని రాహుల్ కోరుతుండటంతో ప్రియాంక గాంధీకి సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదని సీడబ్ల్యూసీ సభ్యుడు, అసోం మాజీ సీఎం తరుణ్ గగోయ్ పేర్కొన్నారు. పార్టీ చీఫ్‌గా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ సూచించడంతో సమర్ధుడైన నేతను వెతికే పనిలో కాంగ్రెస్ సీనియర్లు నిమగ్నమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డీఎంకే చీఫ్ స్టాలిన్, జేడీఎస్ కుమారస్వామి తదితరులు కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలని రాహుల్‌ను కోరుతున్నా అందుకు ఆయన సిద్ధంగా లేరు. -
ఏపీతో నాది కుటుంబ సంబంధం
సాక్షి, అనంతపురం: ‘‘నాన్నమ్మ కాలం నుంచి ఆంధ్రప్రదేశ్‌తో మా కుటుంబానికి కేవలం రాజకీయ సంబంధమే కాకుండా కుటుంబ సంబంధం ఉంది’’ అని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాహుల్‌గాంధీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. కళ్యాణదుర్గం పట్టణ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అయితే ఆయన షెడ్యూలు కన్నా గంట ఆలస్యంగా 4 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. దీంతో ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో వచ్చిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన రాకముందు వేదికపైనున్న కాంగ్రెస్ పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు అభ్యర్థులతో పాటు వివిధ అసెంబ్లీ అభ్యర్థులు ప్రసంగించారు. కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. రాహుల్‌గాంధీ ప్రసంగానికి ముందు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధిని కోరుకుంటున్న వ్యక్తి రాహుల్ అన్నారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి కూతురు అమృతావీర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ ఇక్కడికి వచ్చారని, మళ్లీ ప్రధాని అయిన తర్వాత కళ్యాణదుర్గం రావాలని కోరారు. నీళ్ల కోసం ఇబ్బందులు రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సబాస్థలికి కనీసం నీటిప్యాకెట్లను కూడా అనుమతించలేదు. గంటలపాటు ఎదురుచూసిన ప్రజలు తీవ్ర దాహంతో అల్లాడిపోయారు. ఎండలో బందోబస్తులో ఉన్న పోలీసులు, చివరికి కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులు కూడా తాగునీళ్లకు ఇబ్బందులు పడ్డారు. కనీసం కూర్చోవడానికి చైర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మీడియాప్రతినిధులు రెండు గంటలపాటు నిలుచునే ప్రోగ్రాం కవర్ చేశారు. పాపం రఘువీరా కళ్యాణదుర్గం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘువీరారెడ్డికి ఓట్లు వేయాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ అభ్యర్థించకపోవడంతో రఘువీరా బిక్కమొహం వేశారు. దాదాపు 35 నిముషాలు ఆంగ్లంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ మాటలను... రఘువీరారెడ్డి తెలుగులో అనువాదం చేశారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించాలని కోరారు తప్ప కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డిని గెలిపించాలని రాహుల్ కోరలేదు. రాహుల్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. క్వాటర్ బాటిల్.. కర్ణాటక జనం కళ్యాణదుర్గం: ఎన్ని...వ్యూహాలు రచించినా...ఆదరణ లభించలేదు. ఓటు బ్యాంకు పెరగలేదు. తాయిలాలతో ఎర చూపినా బలం పుంజుకోలేదు. చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచార సభకు తీసుకువచ్చి కాంగ్రెస్‌కు బలముందని, ప్రత్యేకించి రఘువీరారెడ్డికి జనాదరణ ఉందని చాటుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు పడరాని పాట్లు పడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదటిసారిగా కళ్యాణదుర్గం వస్తుండటంతో భారీ జనసమీకరణచేయాలని భావించారు. అయితే స్వచ్ఛందంగా జనం వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో రఘువీరారెడ్డి భారీగా డబ్బు ఖర్చు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఒక్కో వ్యక్తికి క్వాటర్ బాటిల్ మద్యం, బిర్యానీలు, రూ.200 కూలీ ముట్టజెప్పి జనాన్ని తీసుకువచ్చారు. మరోవైపు కర్ణాటకలోని పరుశురాంపురం, చెళ్ళికెర, చిత్రదుర్గం, జాజూరు తదితర ప్రాంతాల స్థానిక కాంగ్రెస్ నాయకులు భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఉదయం నుంచి పలు వాహనాల్లో శెట్టూరు మీదుగా కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి రావడం కనిపించింది. అందువల్లే రాహుల్ సభ ఆవరణలో వందలాది కర్ణాటక వాహనాలు కనిపించాయి. వచ్చిన వారంతా కన్నడలో మాట్లాడటం కనిపించింది. అయినా ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి తగ్గట్టుగా జనం రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
11,12 తేదీల్లో దుబాయిలో రాహుల్ పర్యటన
గల్ఫ్ డెస్క్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 11, 12 తేదీలలో దుబాయిలో పర్యటించనున్నారు. దుబాయి క్రికెట్ స్టేడియంలో గల్ఫ్ ఎన్నారైలతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ,ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షు సి.వ్యాస్ గతకొన్ని రోజులుగా దుబాయిలో ఉండి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాశ్చ) కన్వీనర్ మన్సూర్ పల్లూర్ రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, అన్ని గల్ఫ్ దేశాల నుంచి ఎన్నారైలు ఇందులో పాల్గొంటారని పీసీసీ ఎన్నారై సెల్ దుబాయి కన్వీనర్ ఎస్.వేణురెడ్డి తెలిపారు. -
నల్లగొండకు శ్రీరాంసాగర్ నీళ్లు : రాహుల్‌గాంధీ
సాక్షిప్రతినిధి, సూర్యాపేట/కోదాడ : ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ కుటుంబానికి సంపూర్ణ సంపద చేకూరింది. కానీ తెలంగాణ ప్రజలకు నైరాశ్యమే మిగిలింది. మీ సంపన్న కుటుంబం మినరల్ వాటర్ తాగుతున్నారు. కానీ నల్లగొండ ప్రజలకు మాత్రం ఫ్లోరైడ్ నీళ్లు సరఫరా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టును ఆధునికీకరించి ఉమ్మడి నల్లగొండ ప్రజలకు నీళ్లిస్తాం. గతంలో నల్లగొండ వచ్చిన కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకున్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదే ఆస్పత్రిని తిరిగి ప్రారంభిస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు. ఆస్పత్రి హామీలను మీరు నెరవేర్చలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండలో 100 పడకల ఆస్పత్రిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తుంది’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓవైపు కేసీఆర్‌ను నిప్పులు చెరుగుతూనే మరోవైపు ఉమ్మడి నల్లగొండ గురించి ప్రస్తావించారు. బుధవారం కోదాడలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, హుజుర్నగర్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ అభ్యర్థి పద్మావతిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాకు వచ్చి జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పారని, ఆయన దాదాపు ప్రతి జిల్లాకు పోయి దత్తత తీసుకుంటామంటున్నారని, కానీ కేసీఆర్ దత్తత తీసుకోవాల్సింది జిల్లాలను కాదని, తెలంగాణలోని రైతులు, యువత, తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణంæ చేసుకున్న వారి కుటుంబాలను అని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేశారని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేసీఆర్ హామీని నెరవేర్చలేదని, వీరందరినీ.. కేసీఆర్ దత్తత ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బడ్జెట్లో 20శాతం నిధులు యువకుల విద్యోన్నతి కోసం, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల కోసం వెచ్చిస్తామన్నారు. అన్ని మండలాల్లో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని తెలిపారు. దేశానికి నష్టం కలిగిస్తున్న మోదీ, కేసీఆర్ బంధనాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నామని, కాంగ్రెస్ పార్టీ, మిగిలిన పార్టీలతో కలిసి రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీని కూడా ఇంటికి పంపిస్తామన్నారు. సెల్‌ఫోన్, మైక్, దుస్తులు.. ఇలా అన్నింటిపైనా మేడ్ ఇన్ చైనా అని ఉంటుందన్నారు. మా లక్ష్యం ప్రతి వస్తువుపైనా మేడ్ ఇన్ తెలంగాణ.. మేడ్ ఇన్ నల్లగొండ అని ఉండాలన్నారు. కోదాడ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలి : చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఇంటికి పంపించాలని, 7న పోలింగ్, 11న కౌంటింగ్.. ఇప్పుడున్న సీఎం ఈనెల 11 తర్వాత మాజీ సీఎంగా ఉంటాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించేలా తీర్పు ఇవ్వాలని, కోదాడ చరిత్రలో ఇది చిరస్థాయిగా మిగిలిపోవాలన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో కోదాడలో పద్మావతిరెడ్డి గెలవబోతున్నారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కలిశామని దేశంలో, రాష్ట్రంలో కలిశామంటే ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నారు. అందుకే రెండు పార్టీలు కలిసి ప్రజాకూటమిని సమర్థిస్తున్నామన్నారు. కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టాలి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టాలని, అది కోదాడ నుంచే ప్రారంభం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాలలో తాను, తనభార్య ఉన్నామని, నియోజకవర్గ ప్రజలనే తమ పిల్లలుగా భావించి నిస్వార్థంగా సేవలందిచామని, ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అదే రోజు రైతుల రుణాలు 2 లక్షల రూపాయలను ఏక మొత్తంగా రద్దు చేస్తామని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని, దానిలో భాగంగా 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. భార్య, భర్తలు ఇద్దరికి 2 వేల రూపాయల ఫించన్‌తోపాటు ఫించన్ వయస్సును 58 సంవత్సరాలకు తగ్గిస్తామని హమీ ఇచ్చారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు :సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి రాష్ట్రంలో నిరంకుశ, అహంకారపూరిత పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించడానికి మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. కేసీఆర్‌కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు. దేశంలో మత రాజకీయాలను చేస్తున్న బీజేపీకి అన్ని విధాల టీఆర్ఎస్ మద్దతు నిస్తుందన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం మతో న్మాదాన్ని రెచ్చగొడుతుందని, దానికి టీఆర్ఎస్కు లంకె ఉందని, అక్బరుద్దీన్ ఎన్నికల సభలో మా ట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి అయినా తనముందు తలవంచాల్సిందేనని బహిరంగ వ్యాఖ్యలు చేస్తే కనీసం వాటిని ఖండించే ధైర్యం కూడా కేసీఆర్‌కు లేదని అన్నారు. ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సి. కుంతియా, ఎంపీ కేశినేని నాని, ఏఐసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు. -
నేరడిగొండలో రాహుల్ సభ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం పలకాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నేరడిగొండలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి 2లక్షలకు పైగా జనాన్ని సమీకరించాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం అనే రీతిలో సభను నిర్వహించాలని పీసీసీ నుంచి ఆదిలాబాద్ డీసీసీకి ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం నేరడిగొండలో సభ నిర్వహణను నిర్ధారించిన ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అనంతరం నిర్మల్‌లో ఉమ్మడి జిల్లా నాయకులతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. నేరడిగొండ సభ ద్వారా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో రాహుల్‌గాంధీ స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేలా సభను నిర్వహించాలని ముఖ్య నేతలు జిల్లాల నాయకులకు స్పష్టం చేశారు. నేరడిగొండలో బహిరంగ సభ కోసం స్థలాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ అనిల్‌కుమార్ చదును చేయిస్తున్నారు. పీసీసీ నుంచి సమన్వయకర్తలు రాహుల్‌గాంధీ పాల్గొనే బహిరంగ సభ కోసం నియోజకవర్గాల వారీగా పీసీసీ నుంచి సమన్వయకర్తలను నియమించారు. పార్టీ సీనియర్ నాయకులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ మండల, నియోజకవర్గ నాయకులకు జన సమీకరణ బాధ్యతలు అప్పగిస్తారు. నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులు జనాన్ని సమీకరిస్తారు. బోథ్ నుంచే 50వేల జనం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం బోథ్ పరిధిలోని నేరడిగొండలో నిర్వహించనున్న ఈ సభకు స్థానికంగా ఉన్న తొమ్మిది మండలాల నుంచే కనీసం 50వేల మందిని సమీకరించాలని నేతలు నిర్ణయించారు. నేరడిగొండ, బోథ్, గుడిహత్నూరు, తలమడుగు, బజార్హత్నూరు, భీంపూర్, తాంసి, సిరికొడ, తలమడుగు, ఇచ్చోడలలో ఒక్కో మండలం నుంచి 10వేలకు తగ్గకుండా జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. ఏ గ్రేడ్ కింద ఐదు సెగ్మెంట్లు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాలను ఏ–గ్రేడ్ గా నిర్ణయించారు. జన సమీకరణలో ఈ ఐదు సెగ్మెంట్లదే కీలక పాత్ర. లక్షన్నర జనాన్ని ఈ నియోజకవర్గాల నుంచి తీసుకురావాలని యోచిస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ఐదు సెగ్మెంట్లలో ఒక్కో చోట నుంచి 10వేలకు తక్కువ కాకుండా జనాలను సమీకరిస్తారు. సభకు జనాన్ని తరలించేందుకు వాహనాలకు సంబంధించి కూడా నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, సమన్వయకర్తతో సమన్వయం చేసుకొని సభకు వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళిక రూపొందించారు. పొన్నం ప్రభాకర్ ప్రత్యక్ష పర్యవేక్షణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ నేరడిగొండ సభకు సంబంధించి ప్రత్యక్ష పర్యవేక్షణ జరుపనున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పొన్నం డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. సోమవారం ఆయన నేరడిగొండకు వచ్చి నాయకులతో సమావేశమై సభా ఏర్పాట్లు పర్యవేక్షించున్నారు. వాహనాలకు సంబంధించి కూడా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, బోస్‌రాజు కూడా సభకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. -
దామోదరం వంటి నేతల స్ఫూర్తితో పార్టీకి పునర్జీవం
కర్నూలు(అర్బన్): నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన దివంగత దామోదరం సంజీవయ్య వంటి నేతల స్ఫూర్తితో కాంగ్రెస్‌కు పునర్జీవం తీసుకొస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశానికి ప్రధానిగా పీవీ నరసింహారావు, రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని అందించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని కొనియాడారు. తిరిగి అలాంటి నాయకులను తయారు చేసేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. ఈ ప్రాంతం నుంచే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ అభివృద్ధిని కాంక్షించి అప్పట్లో ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ ఐదేళ్లు ప్రత్యేకహోదా కల్పించాలని తీర్మానం చేస్తే, కాదు .. పదేళ్లు ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టిందని గుర్తు చేశారు. అయితే..నేడు ఆ పార్టీ ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకాన్ని ఏపీకి ప్రత్యేకహోదా ఫైలుపైనే పెడతామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని, బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రజలంటే మోదీకి ఏమాత్రమూ గౌరవం లేదన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. మాజీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోని పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు పాలనలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. ఉన్న జాబులు కూడా పోతున్నాయన్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. రైతులు ఒక ఎకరాకు నీరు పెట్టుకోవాలన్నా అధికార పార్టీ నేతలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టుకు కూడా నీరు అందుతుందని, గుండ్రేవుల రిజర్వాయర్, సిద్ధేశ్వరం అలుగు పూర్తవుతాయని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ అహమ్మద్ అలీఖాన్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్‌చాందీ, సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, కొప్పుల రాజు, పల్లంరాజు, సాకే శైలజానాథ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇన్నాళ్లకు గుర్తొచ్చారా?! కాంగ్రెస్ నాయకులకు ఇన్ని రోజులకు దామోదరం సంజీవయ్య గుర్తుకు వచ్చారా అని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపాడు గ్రామంలోని సంజీవయ్య ఇంటిని సందర్శించారు. దామోదరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పలకరించారు. హైదరాబాద్, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సంజీవయ్య కుటుంబ సభ్యులను రాహుల్ పర్యటన సందర్భంగా పిలిపించారు. ఈ నేపథ్యంలో దామోదరం కుటుంబ సభ్యుల్లో ఒకరైన మోహన్‌దాసు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ నేతలకు సంజీవయ్య గుర్తుకు రావడం సంతోషంగా ఉందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం కర్నూలు పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని బైరెడ్డి కన్వెన్షన్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. శ్రావణ్, హరికృష్ణ, ప్రియాంక, సౌభాగ్య, జుబేర్ అహ్మద్, సకినా సోలోమైక్, భవ్యశ్రీ, తదితర 15 మంది విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ వెనుకబాటుతనం నిర్మూలన అవినీతి నిర్మూలన, మహిళల రక్షణ, జీఎస్టీ ఇబ్బందులు, పెట్రోల్,డీజిల్ ధరల నియంత్రణ, ఏపీ, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు..తదితర ప్రశ్నలను విద్యార్థులు అడిగారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. చైనా ఒక్క రోజులోనే సుమారు 50,000 ఉద్యోగాలు సృష్టిస్తోందని, అదే మన దేశంలో 450 ఉద్యోగాలను మాత్రమే సృష్టించుకోగలుగుతున్నామని వివరించారు. కేవలం 10 నుంచి 15 మంది బడా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పారిశ్రామిక రంగం ఉండటంతోనే ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. ఇది మారాలని, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థి«క వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఒక విద్యార్థి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడని, ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. వీహెచ్‌కు కోపమొచ్చింది! కర్నూలు (టౌన్): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు (వీహెచ్)కు కోపమొచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది అడ్డుకోవడంతో చిర్రెత్తిన ఆయన తనకు రెస్పెక్ట్ ఇవ్వడంలేదంటూ అసహసం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మంగళవారం కర్నూలు నగరానికి విచ్చేశారు. విద్యార్థులతో ముఖాముఖి, పెద్దపాడులో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ఇంటి సందర్శన వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కిసాన్ ఘాట్‌లో కోట్ల సమాధిని సందర్శించి..నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కోసం వీహెచ్ గంట ముందే అక్కడికి చేరుకున్నారు. అయితే.. కిసాన్ఘాట్లోకి వెళ్లే వారి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇక్కడికి మీడియాను సైతం అనుమతించలేదు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వీహెచ్ మాట్లాడుతూ ‘ఎస్పీజీ సిబ్బంది లోపలికి పంపించలేదు. కారణం అడిగితే నా పేరు లేదంటున్నార’ని వాపోయారు. అక్కడే ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులు ఈ సమస్యను రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుపోయారు. కొద్ది సేపటి తరువాత ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో లోపలికి పంపించారు. కోట్ల ఇంటికి విచ్చేసిన రాహుల్‌తో పాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నేత తులసిరెడ్డిని సైతం ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. అలా వచ్చి... ఇలా వెళ్లి. రాహుల్ పర్యటన హడావుడిగా సాగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు కోట్ల సమాధిని సందర్శించి, అక్కడే రైతులతో ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది. అయితే.. మూడు గంటలకు వచ్చిన రాహుల్ ఐదు నిమిషాల వ్యవధిలోనే కోట్ల సమాధిని సందర్శించి, రైతులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కిసాన్ ఘాట్ నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా కారు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఎదురుగా ఉన్న నర్సింగ్ కళాశాల సిబ్బంది, విద్యార్థినులు చేతులూపడంతో వారి వద్దకు వెళ్లి పలకరించారు. సభా ప్రాంగణానికి చేరుకునే ముందు డీసీసీ కార్యాలయం వద్ద సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేశారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం ఆత్మహత్య చేసుకున్న ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన విద్యార్థి మహేంద్ర కుటుంబ సభ్యులకు బహిరంగ సభ వేదికగా రాహుల్ చేతుల మీదుగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. -
గుజరాత్లో ఓడినా.. రాహుల్ హీరోనే!
సాక్షి, న్యూఢిల్లీ : నువ్వా-నేనా అన్న రీతిలో ఎన్నికల ప్రచారం.. బీజేపీ-కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ విమర్శలు.. వెరసి గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. తిరిగి పాగా ఎగరవేయాలని కమలం.. రెండు దశాబ్దాల తర్వాత జెండా ఎగరవేయాలని హస్తం పార్టీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ తరుణంలో గుజరాత్ ఎన్నికల ఫలితాలు.. రాహుల్ పగ్గాలపై నేపథ్యంలో ఎలాంటి ప్రభావం చూపుతాయి? అన్నది చూద్దాం. గుజరాత్ ఎన్నికల ప్రచారం మొదలయిన సమయంలో పటీదార్ నేత హర్దిక్ పటేల్ బీజేపీకి ముఖ్య ప్రత్యర్థిగా కనిపించాడు. కానీ, ఎప్పడైతే ప్రచార పర్వం ఊపందుకుందో క్రమక్రమంగా హర్దిక్ తెర వెనక్కి వెళ్లిపోయి.. రాహుల్ గాంధీ వైపునకు అందరి చూపు మళ్లింది. పోటాపోటీ ప్రచారం.. మోదీ అండ్ బీజేపీపై రాహుల్ సహేతుక విమర్శలతో అది ముందుకు సాగింది. గెలిచినా.. ఓడినా... ఒకవేళ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే అది ఖచ్ఛితంగా రాహుల్ విజయమే అవుతుంది. ఎందుకంటే కురువృద్ధ పార్టీ తరపున ముందుండి ప్రచారం నిర్వహించింది ఒకే ఒక్కడు కాబట్టి. రైతులు, వ్యాపారస్థులు, గిరిజనులు ఇలా అన్ని వర్గాల వారితో ముఖాముఖి, సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకుంటూ వారితో రాహుల్ మమేకం అయ్యాడు. సోషల్ మీడియాలో కూడా ప్రధాని విధానాలను ఎండగడుతూ ముందుకు సాగాడు. ఈ తరుణంలో గుజరాత్ గెలుపు కాంగ్రెస్‌కు మనోధైర్యం నింపటం ఖాయం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీదే గెలుపని కోడై కూస్తున్న వేళ.. నిజంగానే కాంగ్రెస్ ఓడిపోతే రాహుల్ నాయకత్వానికి మచ్చగా మిగిలిపోదా? అంటే.. అలాంటిదేం ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు ఏంటంటే... 2012 ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 9 శాతం ఓట్లు తక్కువగా పోల్ అయ్యాయి. కానీ, ఈసారి కాంగ్రెస్‌కు అనుకూలంగా కాస్త ఓటింగ్ శాతం పెరిగిందని సర్వేలే చెబుతున్నాయి. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ లో కాంగ్రెస్ దూసుకుపోవటం ఖాయమన్న సంకేతాలు అందించాయి. అదే జరిగితే బీజేపీకి ఊహించని రీతిలో పెద్ద దెబ్బే తగులుతుంది. రాహుల్ మేనియా.. బీజేపీలో భయం నరేంద్ర మోదీ గుజరాత్‌కు 12 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. గుజరాత్ మోడల్ కు తానే కారణమంటూ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు స్వయంగా ఇప్పుడు ఆయనే ప్రజల్లోకి వెళ్లటం ఒకరకంగా రాహుల్ కారణంగానే అన్న సంకేతాలు అందించాయి. పైగా మోదీ తీవ్ర విమర్శలకు దిగిన తరుణంలో.. రాహుల్ మాత్రం చాలా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా.. కేవలం ప్రజా సమస్యలపైనే ప్రభుత్వాలను నిలదీశాడు. ఆలయ దర్శన విషయంలోనూ వచ్చిన విమర్శలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఎన్నికలకు ముందు కమలం నేతలు, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగిపోవటం.. తొలిసారి సోషల్ మీడియా ప్రచారం ద్వారా కాంగ్రెస్ పార్టీ హైలెట్ కావటం.. తదితర పరిణామాలు కమలాన్ని కలవరపాటుకు గురిచేశాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. ఓడినా... భవిష్యత్తులో రాహుల్ దూకుడుకు కళ్లెం వేయటం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాంగ్రెస్ అధ్యక్షుడు.. ఆ రికార్డు రాహుల్‌ది కానేకాదు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ పేరిట ఓ రికార్డు నమోదయ్యిందన్న వార్తపై ఎట్టకేలకు స్పష్టత లభించింది. 47 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ చిన్న వయసులో అధ్యక్షుడు అయ్యాడంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రికార్డులను పరిశీలిస్తే.. ఆ రికార్డు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పేరిట ఉంది. 35 ఏళ్లకే ఆజాద్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1923లో కాకినాడలో నిర్వహించిన సమావేశంలో మహ్మద్ అలీ జవహార్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే అదే ఏడాది ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తిరిగి ఆజాద్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటికీ ఆయన వయసు 35 ఏళ్లు మాత్రమే. ఆ విషయం రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఇక రాహుల్ కుటుంబంలో కూడా ఆ ఘనత సాధించింది కూడా ఆయన కానేకాదు. 1929 లాహోర్ సమావేశంలో జవహార్‌లాల్ నెహ్రూను అధ్యక్షుడిగా ఎన్నుకోగా.. అప్పటికీ ఆయన వయసు 40 ఏళ్లు. పోనీ స్వాతంత్ర్యం తర్వాత రికార్డు చూసుకున్నా 41 ఏళ్లకే రాజీవ్ గాంధీ (1985లో) ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన్న కాంగ్రెస్ యువ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు మాత్రం రాహుల్ గాంధీకి దక్కకుండా పోయింది. -
కుమారికి.. రాహుల్ గాంధీ
సాక్షి, చెన్నై: కన్యాకుమారిలో ఓఖి బాధితుల్ని పరామర్శించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రాహుల్‌గాంధీ వెళ్తున్నారు. గురువారం ఆయన పర్యటన సాగనుండడంతో కుమరిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓఖి ప్రళయ తాండవానికి కన్యాకుమారి సర్వం కోల్పోయిన విషయం తెలిసిందే. కడలిలోకి వెళ్లిన వందలాది మంది జాలర్ల జాడ కాన రాలేదు. ఆదుకుంటామన్న భరోసాను ప్రభుత్వం ఇచ్చినా బాధితులు మాత్రం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కేంద్రం తరఫున రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలందరూ బాధితుల్ని పరామర్శించి ఓదార్చి వచ్చారు. ఈనేపథ్యంలో కొద్ది రోజులుగా గుజరాత్ ఎన్నికల బిజీగా ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం కుమరిలో పర్యటించేందుకు నిర్ణయించారు. నేడు రాక : ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో పర్యటించనుండడంతో కాంగ్రెస్ వర్గాలు ఆయన దృష్టిలో పడేందుకు సిద్ధమయ్యాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కుమరికి బుధవారమే తరలి వెళ్లారు. అయితే, పార్టీ వర్గాలతో ఎలాంటి పలకరింపులకు అవకాశం లేకుండా, కేవలం బాధిత ప్రాంతాల్లో పర్యటించే విధంగా రాహుల్ కుమరికి వచ్చేందుకు నిర్ణయించారు. ఆ మేరకు తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కుమరి తూత్తురులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఉదయం 11గంటల సమయంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన పర్యటన సాగనుంది. తొలుత చిన్నదురైలో బాధితుల్ని పరామర్శించనున్నారు. ఆ తదుపరి పంట పొలాలు, జాలర్ల గ్రామాల్లో ఆయన పర్యటన సాగనుంది. అలాగే, జాలర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యే విధంగా రాహుల్ పర్యటనను రూపొందించారు. రాహుల్ పర్యటనతో కుమరిని నిఘా నీడలోకి తెచ్చారు.ఆయన పర్యటన సాగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. తిరునల్వేలి, తూత్తుకుడిల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దించారు. కడలిలోకి వెళ్లిన వారిలో 662 మంది జాలర్ల జాడ ఇంత వరకు కాన రాలేదని, వారి మీద ఆశలు సన్నగిల్లుతున్నట్టు జాలర్ల కాంగ్రెస్ అధ్యక్షుడు గుణనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో బాధితుల్ని ఆదుకోవాలని నినదిస్తూ బుధవారం జాలర్ల కాంగ్రెస్ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. -
11న రాహుల్ పట్టాభిషేక ప్రకటన
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ఉపసంహరణ గడువు 10వ తేదీతో ముగియనుంది. రాహుల్ నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు 11వ తేదీన ప్రకటించనున్నారు. దీంతోపాటు గుజరాత్ ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో జరుగుతుంది. ఈ సమావేశంలోనే ఏఐసీసీ ప్లీనరీ తేదీని నిర్ణయిస్తారు. ప్లీనరీకి నెల ముందుగానే నోటీసులు జారీ చేస్తారు. ప్లీనరీలో రాహుల్ ఎన్నికను లాంఛనంగా ప్రకటిస్తారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీకీ ఎన్నికలు జరుపుతారు. ఈ కమిటీలో ఉండే 20 మందిలో పది మందిని నామినేట్ చేస్తారు. మిగతా వారిని ఏఐసీసీ ప్రతినిధులు ఎన్నుకుంటారు. పార్టీలో నూతనోత్సాహం నింపేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే రాహుల్ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సంక్రాంతి తర్వాత.. రాష్ట్రాల స్థాయిలో పీసీసీలు, డీసీసీలను పునర్వ్యవస్థీకరిస్తారని తెలుస్తోంది. చాలా రాష్ట్రాల పీసీసీలు అంతర్గత కలహాలతో నిస్తేజంగా, నామమాత్రంగా మారాయని, 2014 ఎన్నికల తర్వాత ఏఐసీసీ కూడా సంస్థాగతంగా బలహీనపడిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఫిర్యాదులతో తనను కలిసిన కొందరు నేతలతో రాహుల్.. సోనియా మేడమ్ వద్దకు వెళ్లండని చెబుతుండగా.. సోనియా వద్దకు వెళ్లిన వారికి కూడా రాహుల్‌ను కలవండనే సమాధానం ఎదురైంది. దీంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో చాలా పీసీసీలు ఉన్నాయి. ఇన్నాళ్లూ.. ఇలాగే కాలం గడిచినా ఇకపై పరిస్థితి మారుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమస్యలను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించటంతోపాటు, అందరినీ కలుపుకుని పోగల నేత రాహుల్ అని అంటున్నారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవటంతో రాష్ట్ర విభాగాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఇదే సమయంలో సీనియర్ నేతలకు సముచితస్థానం కల్పిస్తారని భావిస్తున్నారు. యువ నేతలకు ప్రోత్సాహం, సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూ రాహుల్ పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏఐసీసీ నుంచి వైదొలుగుతున్న సోనియా గాంధీ ఇకపై యూపీఏ సారథ్య బాధ్యతలను చేపడతారని భావిస్తున్నారు. భాగస్వామ్య పక్షాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
ఒకే ఒక్కడు.. ఇక మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపిక ఏకగ్రీవమైంది. గడువు నిన్నటితోనే ముగియటం.. ఇప్పటిదాకా ఒకే ఒక్క నామినేషన్ రావటంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ పేరును ప్రకటించటమే మిగింది. రాహుల్‌కి మద్దతుగా మొత్తం 89 నామినేషన్లు వచ్చాయి. అవన్నీ పరిశీలించి సహేతుకంగానే ఉన్నాయని ఎంపీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం రామచంద్రన్ తెలిపారు. ఈ మేరకు అధికారికంగా స్క్రూటినీ నివేదికను విడుదల చేసింది. ఏ క్షణమైన రాహుల్ ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీని 19 ఏళ్లుగా (పదేళ్లపాటు యూపీఏ పాలనతో కలిపి) నడుపుతున్న అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి రాహుల్ పగ్గాలు స్వీకరించబోతున్నారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైనప్పటినుంచీ రాహుల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలపై అడపాదడపా చర్చ జరిగినా.. చివరకు దేశంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారటం, 2019 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీ కీలక బాధ్యతలు అందుకోనున్నారు. యువరాజు నాయకత్వంలో.. ఇటీవలి కాలంలో వరుస ఓటములతో కుదేలైన పార్టీకి తిరిగి పునర్వైభవం వస్తుందని పలువురు యువ, సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
అధ్యక్షుడిగా రాహుల్.. సాయంత్రమే ప్రకటన?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించే తరుణం ఆసన్నమైంది. కాసేపటి క్రితం (సోమవారం ఉదయం) ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్, పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీ పేరును ప్రస్తుత అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేత మన్మోహాన్ సింగ్ ప్రతిపాదించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న పోలింగ్, 19న ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా పోటీ లేకపోవటంతో ఈ సాయంత్రమే రాహుల్ పేరును అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. నాలుగు సెట్ల రాహుల్ నామినేషన్ పత్రాలపై 40 మంది నేతలు సంతకాలు చేయగా.. రాహుల్‌ను ప్రతిపాదిస్తూ 93 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతీ రాష్ట్రం నుంచి ఆయనకు మద్దతుగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడి పదవిలో కొనసాగుతుండగా.. నెహ్రూ కుటుంబం నుంచి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన జాబితాలో రాహుల్ చేరబోతున్నాడు. ఇక అత్యధిక కాలం ఏఐసీసీ అధ్యక్షురాలిగా పని చేసిన రికార్డు సోనియా గాంధీ(దాదాపు 20 ఏళ్లు) పేరిట ఉంది. ఒకవేళ నేడు కుదరకపోతే 11వ తేదీన రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. నామినేషన్ వేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన మోసినా కిద్వై, షీలా దీక్షిత్ లాంటి కురువృద్ధ నేతలతో రాహుల్ కాసేపు ముచ్చటించారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి సరైన వ్యక్తి అని ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. పలువురు సీనియర్ నేతలు రాహుల్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. As Congress VP Rahul Gandhi files his nomination for the post of Congress President, senior leaders of the INC family send their best wishes and express why he is the perfect leader. #IndiaWithRahulGandhi @capt_amarinder pic.twitter.com/X2JCzc1ejT — Congress (@INCIndia) December 4, 2017 As Mr Rahul Gandhi files his nomination, I wish him the very best as Congress President. #IndiaWithRahulGandhi — P. Chidambaram (@PChidambaram_IN) December 4, 2017 Have no doubt that we will make tremendous strides under your unifying & progressive leadership @OfficeOfRG! Wish you the very best! Look forward to undertaking this journey of building an India of energy, opportunity & unity with you. #IndiawithRahulGandhi — Jyotiraditya Scindia (@JM_Scindia) December 4, 2017 -
గాంధీ, బోస్‌ల మధ్యే తప్పలేదు
సాక్షి, న్యూఢిల్లీ : గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పజెప్పే ప్రయత్నాలు ఓవైపు కొనసాగుతుండగానే... మరోవైపు పార్టీ ఓ ప్రకటన చేసింది. అధ్యక్ష పదవి కోసం నిర్వహించే ఎన్నికల్లో రాహుల్‌తో ఎవరైనా పోటీ పడొచ్చని పేర్కొంది. గాంధీ వారసత్వంలోనే పార్టీ కొనసాగుతుందా? అన్న అనుమానాలు వద్దు. అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో ఉంది. అందుకే కీలక పదవుల కోసం ఎవరైనా పోటీ పడొచ్చు అని ఏఐసీసీ ప్రతినిధి రణ్‌దీప్ సుజ్రేవాలా తెలిపారు. పైగా కాంగ్రెస్‌లో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా పోటీలు కూడా జరిగాయన్న విషయాలను ఆయన ప్రస్తావించారు. గతంలో ఓసారి సోనియా గాంధీతో.. దివంగత నేత జితేంద్ర ప్రసాద్ పోటీ పడ్డారని రణ్‌దీప్ గుర్తు చేశారు. ఇందిరా గాంధీ ఆశయాల మేరకు ప్రజాస్వామ్య సవాళ్ల నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ తప్పించుకోలేదన్న రణ్‌దీప్.. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరిపై ఒకరు పోటీకి దిగారన్న విషయాన్ని ఉటంకించారు. అయితే ప్రస్తుతం అందరు నేతలు సూచించే ఏకైక పేరు రాహుల్ గాంధీయేనని, ప్రజాస్వామ్య బద్ధంగా ఆ పదవికీ ఆయన అన్ని విధాల అర్హుడని సూర్జేవాలా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోపు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించి రాహుల్ గాంధీకి అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఏఐసీసీ శ్రేణులు చెబుతున్నాయి. -
సోనియా కసరత్తు!
టెన్ జన్‌పథ్‌కు నేతలు అధ్యక్ష పదవికి నువ్వా..నేనా ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ కసరత్తులు చేపట్టి ఈనెల ఆరో తేదీలోపు ముగించాలని నిర్ణయించినట్లు సమాచారం. టెన్ జన్‌పథ్ నుంచి పిలుపు వస్తుండడంతో క్యూకట్టే పనిలో టీఎన్‌సీసీ నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక ఢిల్లీకి చేరడంతో ఆ పదవిని ఆశిస్తున్న వాళ్లంత దేశ రాజధానికి పయనమయ్యారు. టీఎన్‌సీసీ పదవికి ఈవీకేఎస్ ఇలంగోవన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లో గట్టి పోటీ ఏర్పడింది. ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసర్, ఎమ్మెల్యే, వ్యాపార వేత్త వసంతకుమార్, కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్, మాజీ ఎమ్మెల్యే పీటర్ అల్ఫోన్స్‌లతో పాటు పలువురు రేసులో నిలబడ్డారు. అయితే చివరకు పై నలుగురి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉన్నది. ఈవీకేఎస్ మద్దతు దారులు మాత్రం పీటర్ అల్ఫోన్స్‌కు పగ్గాలు అప్పగించాలన్న నినాదంతో గురువారం ఢిల్లీకి చేరారు. తొలుత రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం టెన్ జన్‌పథ్‌కు ఈవీకేఎస్ మద్దతుదారుడు శివరామన్ నేతృత్వంలో ఇరవై జిల్లాల అధ్యక్షులు చేరుకున్నారు. అక్కడ అధినేత్రి సోనియాగాంధీతో ఈవీకేఎస్ మద్దతు దారులు భేటీ అయ్యారు. ఈవీకేఎస్ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలను వివరించారు. సమష్టి నాయకత్వంతో ముందుకు సాగేందుకు ఆయన ప్రయత్నించిరు. కానీ గ్రూపు నేతలు సాగించిన రాజకీయాలను అధినేత్రి సోనియాకు వారు వివరించి వచ్చారు. వీరి భేటీ అనంతరం పీటర్ అల్ఫోన్స్ సోనియాగాంధీతో గంటకు పైగా సమావేశం కావడం గమనార్హం. సాయంత్రం మరో మారు పీటర్ భేటీ కావడంతో అధ్యక్ష పదవి ఆయనకు దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇక, తమకు టెన్ జన్‌పథ్ నుంచి పిలుపు వస్తుందన్న ఎదురు చూపుల్లో తిరునావుక్కరసర్, వసంతకుమార్, సుదర్శన నాచ్చియప్పన్ ఉన్నారు. వసంతకుమార్, సుదర్శన నాచ్చియప్పన్ చడీ చప్పుడు కాకుండా బుధవారం సోనియా గాంధీని కలిసినట్టు సమాచారం. అయితే, మరో మారు తమకు పిలుపు వస్తుందన్న ఆశతో వారు ఢిల్లీలోనే ఉన్నారు. ఇక, మాజీ ఎమ్మెల్యే గోపినాథ్‌ను సైతం సోనియా గాంధి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. అధ్యక్ష ఎంపిక మీద కసరత్తుల్లో పడ్డ అధినేత్రి, గ్రూపుల నేతలందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేరీతిలో ఆ పదవికి అర్హుడ్ని ఎంపిక చేసేందుకు నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల ఆరో తేదీలోపు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడ్ని నియమించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, సోనియా దృష్టి పీటర్ వైపుగా ఉండగా, రాహుల్ మాత్రం తిరునావుక్కరసర్‌కు పగ్గాలు అప్పగించే దృష్టితో ఉన్నారని , వీరిలో ఎవర్నీ ఆ పదవి వరిస్తుందో ఆరో తేదీ వరకు వేచి చూడాల్సిందేనని పేర్కొంటున్నారు. -
ఓటమిపై నివేదికలివ్వండి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణాలేమిటో తెలియజేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను ఆదేశించారు. పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను వివరిస్తూ సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. అయితే, మరోవైపు ఓటమికి గల కారణాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రత్యేక నివేదిక అందజేయాలని ఎన్నికల్లో ఓటమిపాలైన తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని నిజాంక్లబ్‌లో జి.వివేక్, పొన్నం ప్రభాకర్, రాజయ్య, అంజన్‌కుమార్, సురేష్ షెట్కార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సోనియాగాంధీని కలిసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ఇటీవలి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున బృందాలను పంపించాలని పొన్నాల లక్ష్మయ్య డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. కాగా, నెహ్రూ-గాంధీ కుటుంబాలకు సంబంధించి ఏ చిన్న కార్యక్రమం జరిగినా హడావుడి చేసే కాంగ్రెస్ నేతలు... బుధవారం రాజీవ్‌గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి మినహా నాయకులెవరూ హాజరుకాలేదు. కార్యకర్తలు కూడా పదుల సంఖ్యలో మాత్రమే వచ్చారు. -
సోనియాతోనే తెలంగాణ కల సాకారం
- విశ్వాసానికి.. విశ్వాసఘాతుకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు - టీఆర్ఎస్ది కుటుంబ పాలన - ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జనగామ, న్యూస్‌లైన్ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయతోనే 60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం జనగామలో రోడ్ షో చేపట్టారు. కాలనీల్లో కార్యకర్తలతో కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం జనగామలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదుపరి జరుగుతున్న తొలి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవన్నారు. తెలంగాణ ప్రజలు విశ్వాసం గల వారని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు. విశ్వాసానికి.. విశ్వాసఘాతుకానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ వాదులు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరముందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని.. తెలంగాణ ఏర్పాటు అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట తప్పారని అన్నారు. ఇద్దరు ఎంపీలున్న కేసీఆర్‌తో తెలంగాణ రాలేదన్నారు. టీఆర్ఎస్ది కుటుంబ పాలన అని ఆరోపించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని తెలిసినా సోని యా ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. అందుకోసం ఆమె రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యను, భువనగిరి ఎంపీ అభ్యర్థినైన తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పొన్నాలకు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న వాదనలో వాస్త వం లేదన్నారు. నిత్యం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో బీసీ సీఎం అనడం పెద్ద డ్రామా అన్నారు. దమ్ముంటే సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తానని బాబు చెప్పాలన్నారు. లక్ష ఇజ్జత్ పాస్‌లతో రికార్డు దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఇజ్జత్(ట్రైన్) పాస్‌లు జారీ చేస్తే అందులో తన భువనగిరి నియోజకవర్గ పరిధిలోనే లక్ష పాసులు ఉన్నాయని అన్నారు. ఇది రికార్డు అన్నారు. అదేవిధంగా తన ఎంపీ నిధులు సరిపోకుంటే ప్రతీ గ్రామంలో సొంత ఖర్చులతో బోర్లు వేయించి తాగునీటిని అందించానని అన్నారు. తెలంగాణ కోసం 2009 నుంచి అలుపెరుగనిపోరాటం చేశానని చెప్పారు. ఎంపీగా మళ్లీ భారీ మెజారిటీతో గెలుపొందుతానని కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన వెంటనే భువనగిరి నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తానని అన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న సమస్య ల పరిష్కారానికి చర్యలు చేపడుతానని పేర్కొన్నారు. జనగామ, భువనగిరి, ఆలేరు రైల్వేస్టేషన్లను మరింత ఆధునీ కరించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తానన్నారు. సమావేశంలో మహేందర్‌రెడ్డి, వేమల్ల సత్యనారాయణరెడ్డి, కొమ్ము నర్సింగారావు, గుర్రపు బాలరాజు పాల్గొన్నారు. -
పార్టీ విలీనమైతే.. మేం ఏమైపోవాలి?
పార్టీ విలీనం వార్తలపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు సమావేశమైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తున్న పార్టీవర్గాలు.. కాంగ్రెస్‌లో విలీనం లేదా పొత్తు వార్తలను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. కోట్లు ఖర్చు పెట్టిన తాము ఏమై పోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు. ఈ నేపథ్యంలో సోనియా, కాంగ్రెస్ ముఖ్యనేతలు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్‌తో కేసీఆర్ జరిపిన చర్చల వివరాలను ఆయన సన్నిహితుల వద్ద ఆరా తీస్తున్నారు. టీఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తల గురించి పదేపదే పార్టీ ముఖ్యనేతలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిల్లు మినహా విలీనం లేదా ఇతర అంశాలపై కేసీఆర్ చర్చించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉండదని, పొత్తు మాత్రమే ఉండే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అరుునప్పటికీ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిలు వారి మాటలు నమ్మడం లేదు. సోనియా, ఇతర కాంగ్రెస్ పెద్దలను కేసీఆర్ ఒంటరిగా కలవడాన్ని టీఆర్ఎస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఇప్పటిదాకా ఎంతోమంది జాతీయ నాయకులను కలసినప్పుడు లేని రహస్యం కాంగ్రెస్ పెద్దలను కలసినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గ ఇన్చార్జిల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు పార్టీ కోసం వెచ్చించాం. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చాం. ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతామని ఆశించాం. ఇప్పుడు పార్టీని విలీనం చేస్తే కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న ఒకరిద్దరికి తప్ప మిగిలినవారికి అవకాశాలు ఉంటాయా?’ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పార్టీకి కష్టకాలంలో మేం పెద్దవాళ్లమే. కేసీఆర్ తిరిగే పరిస్థితి లేనప్పుడు మేం కావాల్సి వచ్చింది. ఎక్కడున్నా వెంటనే రమ్మని కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు బతిమిలాడి మరీ పిలుచుకున్నరు. ఇప్పుడేమో మాతో పనేలేకుండా పోయింది. ఇంటికి పోతే ఈసడించుకుంటున్నరు’ అని టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న పార్టీ నేతలు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.