న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ తేదీలను ఖరారు చేయడానికి ఈ నెల 28, ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ వైద్య పరీక్షలకు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడినుంచే ఆమె వర్చువల్‌గా భేటీలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వెల్లడించారు.
సోనియా వెంట రాహుల్, ప్రియాంక విదేశాలకు వెళ్లారు. దీంతో ఇతర పార్టీ నాయకులు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరవుతారు. రాజస్థాన్ సీఎం రాజేశ్ గెహ్లాట్ తదుపరి అధ్యక్షుడని ప్రచారం జరిగింది. గెహ్లాట్ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేలా చివరి నిముషం వరకు రాహుల్‌కి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తామన్నారు. రాహుల్ అధ్యక్షుడు కాకపోతే ఎంతో మంది నిరాశ నిస్పృహలకు లోనై ఇంటికే పరిమితం అవుతారని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా వినిపిస్తున్న పేర్లలో కమల్‌నాథ్, కె.సి. వేణుగోపాల్, మీరా కుమార్, కుమారి సెల్జా ఉన్నారు.
ఇదీ చదవండి: Sonia Gandhi: అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. ఆయన ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment