న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాం«దీతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు.
దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. త్వరలోనే కూటమి నేతలంతా మరోసారి భేటీ కావాలని పవర్, ఖర్గే, రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment