Meets
-
పిన్నెల్లి ప్రజలకు YS జగన్ భరోసా
-
ముద్రగడ ఇంటిపై దాడి.. పరామర్శించిన YSRCP నేతలు
-
మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుకేశ్‌ను సన్మానించిన రజనీకాంత్, శివకార్తికేయన్ (ఫోటోలు)
-
రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్, మోదీతో భేటీ : హుందాగా, అందంగా కరీనా (ఫోటోలు)
-
సచిన్ టెండుల్కర్‌ను కలిసిన మనూ భాకర్ (ఫొటోలు)
-
రేణు దేశాయ్‌కు సారె పెట్టి సత్కరించిన మంత్రి (ఫోటోలు)
-
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక భేటీ జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో బుధవారం ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు.రుణాలు, డిపాజిట్ వృద్ధికి మధ్య అంతరం, లిక్విడిటీ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మోసాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు వంటి అనేక అంశాలు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బ్యాంకుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడం, సరిహద్దు లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచడం, ఆర్బీఐ ఆవిష్కరణ కార్యక్రమాలలో బ్యాంకుల భాగస్వామ్యం గురించి కూడా చర్చించారు.తమ పరిధిలోకి వచ్చే బ్యాంకులు, సంస్థల సీనియర్ మేనేజ్మెంట్తో తరచూ ఆర్బీఐ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజా సమావేశం జరిగింది. ఇంతకుముందు భేటీ ఫిబ్రవరి 14న జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, డిప్యూటీ గవర్నర్లు ఎం. రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం పలువురు నేతలు కలిశారు. ఎన్నికల ఫలితాలు, తదితర అంశాలపై వారితో వైఎస్ జగన్ చర్చించారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో కోలగట్ల వీరభద్రస్వామి, అదీప్‌రాజ్, పొన్నాడ సతీష్, సింహాద్రి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
అలవికాని హామీలు.. కాంగ్రెస్‌పై తరుణ్‌చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బండి సంజయ్ తొలిసారిగా తరుణ్ చుగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన తరుణ్ చుగ్.. ఆయనతో అరగంటకుపైగా ముచ్చటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని తరుణ్ చుగ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అరగంటకుపైగా చర్చించారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు. -
అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్ .. ఫొటోలు వైరల్
-
సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్న కల్పనా సోరెన్!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్పనా సోరెన్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం జార్ఖండ్‌లో జరిగిన ఘటన మాదిరిగానే ఢిల్లీలో కూడా జరిగిందని అన్నారు. తాను సునీతను కలుసుకునేందుకు వచ్చానని, ఆమె భాధ్యతలను కూడా పంచుకుంటానని అన్నారు. తాము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశామని కల్పనా సోరెన్ చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రం అరవింద్ కేజ్రీవాల్ వెంట ఉంటుందని, తాను కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ సోనియా గాంధీని కలవబోతున్నానన్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభకు హాజరవుతానన్నారు. #WATCH दिल्ली: झारखंड मुक्ति मोर्चा(JMM) नेता और पूर्व सीएम हेमंत सोरेन की पत्नी कल्पना सोरेन ने कहा, "जैसी घटना 2 महीने पहले झारखंड में हुई थी दिल्ली में भी वैसा ही कुछ हुआ है... मैं सुनीता केजरीवाल से मिलकर उनका दुख दर्द बांटने आई थी। हमने मिलकर प्रण लिया है कि इस लड़ाई को हमें… https://t.co/YzQ1M0Mktw pic.twitter.com/9JjhaVS7fR — ANI_HindiNews (@AHindinews) March 30, 2024 కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ ఇద్దరి పరిస్థితులు ఒకేలాంటివని విశ్లేషకులు అంటారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కల్పనా సోరెన్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా, అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసే వరకు సునీతా కేజ్రీవాల్ తన ఇంటికి, కుటుంబానికే పరిమితమయ్యారు. హేమంత్ సోరెన్-అరవింద్ కేజ్రీవాల్‌ల అరెస్ట్ తర్వాత కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్‌లు తదుపరి బాధ్యతలను స్వీకరించడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వారిద్దరూ ఈడీ రిమాండ్‌లో ఉన్న తమ భర్తలను కలుసుకుని వారికి ధైర్యాన్ని అందిస్తూనే, మరో వైపు పార్టీని ఐక్యంగా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. -
మేము కేసీఆర్ వెంటే ఉంటాం..పార్టీ మారే ఆలోచన మాకు లేదు..
-
విద్యకు సహకారం అందించండి
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్య క్రమాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యాపకుల బృందానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో హార్వర్డ్ వర్సిటీ అధ్యాపకబృందం గురువారం సీఎం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జనవరి 7 నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్íÙప్ (పీఎస్‌ఐఎల్–24) కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ బృందం రాష్ట్రానికి వచి్చంది. ఈ బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లో 10–12 తరగతులు చదువుతున్న 100 మంది విద్యార్థులతోపాటు 33 జిల్లాల ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాశ్, డాక్టర్ ఎండీ రైట్ పాల్గొన్నారు. -
గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి భట్టి
-
సీఎం జగన్ ను కలిసిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా
-
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ (ఫోటోలు)
-
కన్నడ సూపర్‌స్టార్‌ను కలిసిన టాలీవుడ్ హీరో నాని (ఫొటోలు)
-
Madhya Pradesh: ఆసక్తికర పరిణామం.. సీఎంను కలిసిన పీసీసీ చీఫ్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మాజీ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ కలిశారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి సోమవారం వచ్చిన కమల్‌నాథ్ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్.. కమల్‌నాథ్‌ను సాదరంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని సొంత చేసుకుంది. 230 స్థానాలకు గానూ ఏకంగా 163 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుంది. కాగా కమల్‌నాథ్ సారధ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది. #WATCH | Madhya Pradesh | State Congress president Kamal Nath meets Chief Minister Shivraj Singh Chouhan at his residence in Bhopal. The party registered a thumping majority in the state election, winning 163 of the total 230 seats. pic.twitter.com/CSTFecTjKC — ANI (@ANI) December 4, 2023 -
ఖర్గే, రాహుల్ గాం«దీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాం«దీతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. త్వరలోనే కూటమి నేతలంతా మరోసారి భేటీ కావాలని పవర్, ఖర్గే, రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. -
8న ప్రధాని మోదీతో బైడెన్ భేటీ
వాషింగ్టన్: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్ రానున్న అధ్యక్షుడు బైడెన్ ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ‘జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7వ తేదీన అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీకి చేరుకుంటారు. 8న ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతారు’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం రాత్రి బైడెన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్లో వివరించింది. 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర భేటీల్లో ఆయన పాల్గొంటారు. ఇతర జీ20 భాగస్వామ్య దేశాల నేతలతో ఆయన క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులను నిలువరించడం వంటి అంతర్జాతీయ అంశాల్లో ఉమ్మడి ప్రయత్నాలపై చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది. 10న వియత్నాంకు బయలుదేరి వెళతారని పేర్కొంది. -
ఇండియా కూటమి భేటీ.. ఈ అంశాలే ప్రధానంగా..
ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు 28 పార్టీలు ముంబయి వేదికగా జరుగుతున్న డిన్నర్ భేటీలో పాల్గొననున్నాయి. కూటమికి ఓ లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. దేశంలో బీజేపీకి ధీటుగా ఐక్యంగా పోరాడుతామని ప్రతిపక్ష పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి భేటీకి ముంబయికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను పార్టీ శ్రేణులు గణంగా ఆహ్వానిస్తున్నాయి. ఈ మేరకు బ్యాండ్ బాజాలతో సోనియా గాంధీని, రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. #WATCH | Congress supporters gathered outside Mumbai airport to welcome party leaders Sonia Gandhi and Rahul Gandhi They will attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA) here. pic.twitter.com/VAAdjcUP6d — ANI (@ANI) August 31, 2023 కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ముంబయికి చేరుకున్నారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi arrive at a hotel in Mumbai. Rahul Gandhi will hold a press conference shortly. pic.twitter.com/NXsA0IkdUD — ANI (@ANI) August 31, 2023 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ముంబయికి చేరుకున్నారు. మరికాసేపట్ల భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. #WATCH | Maharashtra | Congress national president Mallikarjun Kharge arrives in Mumbai for the meeting of the INDIA alliance. pic.twitter.com/FVNd2UTWGF — ANI (@ANI) August 31, 2023 ఇండియా కూటమి మూడో భేటీకి హాజరవడానికి జమ్మూ కశ్మీర్ పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముంబయి చేరుకున్నారు. కూటమి వర్థిల్లాలని నినదించారు. #WATCH | PDP Chief Mehbooba Mufti arrives in Mumbai to attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA) "Judega Bharat, Jeetega INDIA," says Mehbooba Mufti pic.twitter.com/qPA4sp0r5v — ANI (@ANI) August 31, 2023 ముంబయిలో జరగనున్న సమావేశానికి హాజరవడానికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. #WATCH | Delhi | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi leave from Delhi airport to attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA), in Mumbai. pic.twitter.com/StAcj1OOKX — ANI (@ANI) August 31, 2023 ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి 28 పార్టీల తరుపున 63 మంది నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో భేటీ కానున్నారు. కూటమికి ఓ జెండాను ఎంపిక చేయనున్నారు. పార్టీల మధ్య సమన్వయం చేయడానికి ఓ కమిటీని కూడా నియమించనున్నారు. పాట్నా, బెంగళూరు సమావేశాల తర్వాత ముంబయి వేదికగా మూడోసారి జరుగుతున్న నేటి భేటీ చివరిది కావడం గమనార్హం. అందుకే ఈ సమావేశంలోనే కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నితీష్ కుమార్, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు ముంబయికి చేరనున్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో నేటి డిన్నర్ భేటీ జరగనుంది. దేశంలో ప్రస్తుతం ఏర్పడుతున్న ఇండియా కూటమి రాజకీయ ప్రత్యామ్నాయంగా మారనుందని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. ఇండియా కూటమి భేటీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర బీజేపీ కూడా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో లోక్‌సభ సీట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: Jammu Kashmir: జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
సీఎం జగన్‌ను కలిసిన యూపీఎస్సీ(సీఎస్ఈ) ర్యాంకర్లు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యూపీఎస్సీ(సీఎస్ఈ) 2022 ర్యాంకర్లు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా యూపీఎస్ఈ ర్యాంకర్లను సీఎం జగన్ అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు. మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సీఎం సూచించారు. చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్ -
పెట్టుబడులతో రండి... అమెరికన్ కంపెనీలకు ప్రధాని పిలుపు
వాషింగ్టన్: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ అమెరికన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని పలు అగ్రగామి కంపెనీల సీఈవోలతో వాషింగ్టన్లో చర్చలు నిర్వహించారు. భారత సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని అమెరికన్ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీని కోరారు. టెక్నాలజీ ప్రాసెస్, ప్యాకేజింగ్ సామర్థ్యాల అభివృద్ధికి భారత్‌కు విచ్చేయాలని సెమీకండక్టర్ రంగంలో పనిచేసే ప్రముఖ సంస్థ అప్లయ్డ్ మెటీరియల్స్ సంస్థను ప్రధాని కోరారు. భారత్‌లోని సంస్థలతో సహకారానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అప్లయ్డ్ మెటీరియల్స్ సీఈ వో గ్యారీ డికర్సన్‌కు సూచించారు. భారత ఏవి యేషన్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ముఖ్య పాత్ర పోషించాలని జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో హెచ్ లారెన్స్‌కల్ప్‌తో భేటీ సందర్భంగా కోరారు. సుముఖంగా ఉన్నాం పరస్పర విజయానికి వీలుగా ప్రధాని మోదీ, భారత్‌లోని ప్రతి ఒక్కరితో కలసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. – గ్యారీ డికర్సన్, అప్లయ్డ్ మెటీరియల్స్ -
బసవరాజ బొమ్మైతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ...
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల రహస్య, బహిరంగ భేటీలో తాజాగా రాజకీయాల్లో కుతూహలానికి కారణమయ్యాయి. దావణగెరె కాంగ్రెస్ వృద్ధ నేత శామనూరు శివశంకరప్పని బీజేపీ నాయకుడు బసవరాజ బొమ్మై కలవడంపై అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. అదేరీతిలో డీసీఎం శివకుమార్‌తో బీజేపీ నేత రేణుకాచార్య భేటీ అయ్యారు. మరోవైపు కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉంటూ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాషాయనేతలు సీటీ రవి, ప్రతాపసింహా మండిపడడం రెండు పారీ్టల్లో కలకలం రేపింది. కర్ణాటక: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు రేణుకాచార్య బుధవారం బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ను భేటీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రేణుకాచార్య ఓడిపోయాక మౌనంగా ఉంటున్నారు. ఈ తరుణంలో డీకేని కలవడం రాజకీయ రంగంలో చర్చకు కారణమైంది. భేటీ తరువాత రేణుకాచార్య మీడియాతో మాట్లాడుతూ డీకే తనకు మంచి స్నేహితుడని, అందుకే కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు. హొన్నళ్లిలో జరిగే వ్యవసాయ మేళాకు ఆహా్వనించానన్నారు. కుమ్మక్కుపై వారినే అడగండి కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ, బీజేపీ సీనియర్‌నేత సీటీ రవి ఆరోపణలు చేసిన సమయంలో ఈ భేటీ జరగడం విశేషం. ఈ ఆరోపణలపై రేణుకాచార్య స్పందిస్తూ కుమ్మక్కుపై సీటీ రవి, ప్రతాపసింహనే అడగాలని, తనకు సమాచారం లేదని, ఏ అర్థంలో చెప్పారనేది తెలియదని అన్నారు. ప్రతాపసింహ, సీటీ రవి ఏమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ సీనియర్ నాయకులు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించటం గాని, ఆరోపణలు చేయటం గాని చేయటం లేదు. అనేక మంది సీనియర్ నాయకులు సీఎం సిద్దరామయ్యతో కుమ్మక్కయ్యారని ఎంపీ ప్రతాప్ సింహ, సీటీ రవి ఆరోపణలు చేశారు. రెండు పారీ్టల నాయకులు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బీజేపీ నాయకులను బెదిరింపులకు గురిచేశారని వారు ఆరోపించారు. అది మామూలు భేటీనే: బొమ్మై బీజేపీ మాజీ సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శామనూరు శివశంకప్పను రహస్యంగా భేటీ కావటంపై రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. దీనిపై బుధవారం బొమ్మై స్పందిస్తూ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. నా రాజకీయ వైఖరిలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన ట్విట్టర్లో అన్నారు. ఆయన తనకు బంధువు అని, తరచూ ఇళ్లకు వెళ్లి వస్తుంటామని, దీనికి రాజకీయాలు పూయడం సరికాదన్నారు. వారి మనమళ్లకు పెళ్లి సంబంధాల గురించి చర్చ జరిగింది, ఇందులో రాజకీయాల ప్రస్తావన లేదన్నారు. మరోవైపు శివశంకరప్ప స్పందిస్తూ ఎన్నికలు జరిగిననాటి నుంచి తాము కలవలేదు. అందుకే కలిశామన్నారు. మాకు బంధుత్వం ఉంది, కొన్ని విషయాలు చెప్పేందుకు సాధ్యపడదన్నారు. -
వృద్ధి అవకాశాల్లో భారత్ నెంబర్ వన్
న్యూఢిల్లీ: అమెరికా నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ– సిస్కో భారత్‌లో తన భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. రూటర్లు, స్విచ్‌ల వంటి ఉత్పత్తుల తయారీకి సంబంధించిన భారత ప్రణాళికలను చైర్మన్, సీఈఓ చక్ రాబిన్స్ ప్రకటించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలపై దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని పేర్కొంటూ, వచ్చే దశాబ్దపు వృద్ధి అవకాశాలకు సంబంధించి భారత్ మొదటి అవకాశంగా ఉందని అన్నా రు. తయారీ రంగానికి కేంద్రంగా భారత్ రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. బహుళ పథకా లు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ తయారీ కార్యకలాపాలు సిస్కో కాంట్రాక్ట్ తయారీదారుల ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. బిలియన్ డాలర్ల ఎగుమతులు సమీపకాలంలో జరుగుతాయని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తదితర సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం భౌగోళిక రాజకీయ భయాల నేపథ్యంలో టెక్ డిజిటలైజేషన్ వ్యూహాత్మక విలువ మందగించాలి. కానీ అలా జరక్కపోవడం హర్షణీయం. పైగా ఇది పురోగతి బాటన నడుస్తోంది. టెక్నాలజీకి సంబంధి ప్రతి దేశం సాధిస్తున్న విజయానికి ఇది సంకేతం. ► డిజిటలైజేషన్, 5జీ రోల్అవుట్, నైపుణ్య సామర్థ్యాలు, స్టార్టప్ వ్యవస్థ దీనిని బలపరిచే మౌలిక వ్యవస్థ భారత్‌కు కలిసివస్తున్న అంశాలు. ► భారత్ డిజిటలైజేషన్లో భారీగా పురోగమించింది. మహమ్మారి సమయంలో అలాగే తీవ్ర సవా ళ్ల సమయాల్లో డిజిటలైజేషన్లో దేశం పటిష్ట పురోగతిని సాధించింది. పురోగతి విషయంలో భారత్ ఆశయం చాలా స్పష్టంగా ఉంది. ఇది హర్షణీయ పరిణామం. ప్రధానమంత్రి, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు అనేక అంశాల గురించి మాట్లాడారు. తయారీ నుంచి నైపుణ్యత, సిస్కో కార్యకలాపాలు, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, 5జీ, సుస్థిర అభివృద్ధి వరకూ అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించడం జరిగింది. భారతదేశంలో తయారీ పురోగతి విషయంలో సహకారం ఇచ్చే విషయంలో మా నిబ ద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను. ► ఒక్క డిజిటలైజేషన్‌లోనే కాదు. భౌతికంగా మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్ దూసుకుపోతోంది. ► మేడిన్ ఇండియా సిస్కో ప్రొడక్టులు ఈ ప్రాంతానికి, యూరప్‌కు ఎగుమతి అవుతాయి. దేశంలో క్రమంగా మా వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తాం. ముఖ్యంగా 5జీ పై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రతి చోటకూ కనెక్టివిటీ హైస్పీడ్‌కు దోహపపడే అంశం ఇది. ► ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న ఉద్యోగాల కోత ఫలితాలు, పర్యవసానాలు మున్ముందు ఎలా మారతాయన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ భేటీ -
కాంగ్రెస్ బలం, బలహీనతలను ఠాక్రేకు వివరించా: జగ్గారెడ్డి
-
పరిష్కార సామర్థ్యం పెంచుకోండి
న్యూఢిల్లీ: సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేలా సామర్థ్యాలు పెంచుకోవాలని బాలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ విజేతలతో సమావేశమయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, వారికి ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. జీవితంలో ముందుకు వెళ్లడానికి తొలుత చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం ప్రారంభించాలని, ఆ పెద్ద సమస్యలను సైతం సులువుగా పరిష్కరించుకొనేలా సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా పెంపొందించుకోవాలని సూచించారు. చదరంగం ఆడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. కళలు, సంస్కృతి, పరిశోధనలు, ఆవిష్కరణలు, ఆధ్యాత్మికతను కెరీర్‌గా మార్చుకోవాలని చెప్పారు. బాల పురస్కార్ గ్రహీతల అనుభవాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. అవార్డు గ్రహీతలు పలు అంశాలపై మోదీ సలహాలు సూచనలు తీసుకున్నారు. బాల పురస్కారాలకు ఈసారి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 11 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు బాలలు, ఐదుగురు బాలికలు ఉన్నారు. బాల పురస్కార్ విజేతలు ఎం.గౌరవీరెడ్డి, కోలగట్ల అలనా మీనాక్షి తదితరుల ఘనతలను ప్రధాని మోదీ ట్విట్టర్లో ప్రశంసించారు. ‘పరీక్షా పే చర్చ’లో 38 లక్షల మంది! ప్రధాని మోదీ ఏటా స్వయంగా పాల్గొని, విద్యార్థులతో సంభాషించే ‘పరీక్షా పే చర్చ’ కోసం ఈ ఏడాది ఏకంగా 38 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి అధికంగా 15 లక్షల మంది పాల్గొనబోతున్నారు. 155 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. 27న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరుగనుంది. కొందరు స్టేడియంలో, మిగతావారు ఆన్లైన్లో పాల్గొంటారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనే విషయంలో మోదీ మార్గనిర్దేశం చేస్తారు. -
డీజీపీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన ఆధారాలను సీబీఐకి బదిలీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆ నలుగురు ఎమ్మెల్యేలతోపాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని కోరాం. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీని అపాయింట్ మెంట్ కోరితే తప్పించుకు తిరుగుతున్నారు. చీఫ్ సెక్రటరీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఉద్దేశపూర్వకంగా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు సీఎస్ వత్తాసు పలుకుతున్నట్లు కాంగ్రెస్ భావించాల్సి వస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల 12 నియోజకవర్గాల్లో సంక్రాంతి తరువాత కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. నాగర్ కర్నూల్లో దాడులకు నిరసనగా ఈ నెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాలపై స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తాం’’ అని ఆయన అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనపై కూడా డీజీపీకి ఫిర్యాదు చేశాం. ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై దూషణలు, దాడులకు దిగారు. గొంతుపై కాలు పెట్టి తొక్కి పరుష పదజాలంతో దూషించారు. ఇది ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్య అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మల్లు రవికి నోటీసులు -
చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్
-
సీఎం జగన్‌ను కలిసిన ఇన్ఫర్మేషన్ కమిషనర్లు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్.మహబూబ్ భాషా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ శామ్యూల్ జొనాథన్ బుధవారం కలిశారు. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ప్రమాణం చేసిన అనంతరం ఆర్ఎం. బాషా, శామ్యూల్ ఇరువురి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’ -
సీఎం జగన్‌ను కలిసిన క్రిబ్కో ఛైర్మన్ చంద్రపాల్ సింగ్ యాదవ్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రిబోకో ఛైర్మన్ చంద్రపాల్ సింగ్ యాదవ్ కలిశారు. డిసెంబర్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపనకు సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. రూ.300 కోట్లతో మొదటి దశ నిర్మాణ పనులు క్రిబోకో ప్రారంభించనుంది. డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏర్పాటుపై కూడా సీఎంతో క్రిబ్కో చైర్మన్ చర్చించారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. చదవండి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు. సీఎం ని కలిసిన వారిలో క్రిబ్కో వైస్ చైర్మన్ వల్లభనేని సుధాకర్ చౌదరి, క్రిబ్కో ఎండీ రాజన్ చౌదరి, మార్కెటింగ్ డైరెక్టర్ వీఎస్ఆర్ ప్రసాద్ ఉన్నారు. -
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి దంపతులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు రాజ్‌భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సీఎం జగన్ సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై పురోగతిని గవర్నర్ హరిచందన్‌కు వివరించారు. దాదాపు అరగంటకు పైగా వీరిరువురు సమావేశం అయ్యారు. రాజ్ భవన్లో ముఖ్యమంత్రిని స్వాగతించిన వారిలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఉప కమీషనర్ విశాల్ గున్ని, విజయవాడ నగర పాలక సంస్ధ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి తదితరులు ఉన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ బుధవారం కలిశారు. కొత్త రాష్ట్రమైనా, ఆర్థిక ఇబ్బందులున్నా.. కొవిడ్ మేనేజ్మెంట్ బాగా చేశారని సీఎంను జెన్నిఫర్ అభినందించారు. జీడీపీ గ్రోత్‌రేట్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉండటంపై ఆమె ప్రశంసించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని సీఎం పేర్కొన్నారు. చదవండి: ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
ప్రియాంకతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ.. మీటింగ్‌లో జరిగింది ఇదే..
సాక్షి, ఢిల్లీ: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రియాంక గాంధీతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితులపై చర్చించామని వివరించారు. ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తనను కలవమన్నారన్నారు. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై చర్చించామన్నారు. ఫంక్షన్ కారణంగా మొన్న సమావేశానికి రాలేకపోయానని చెప్పానని తెలిపారు. కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంక అన్నారని పేర్కొన్నారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, తాను కొన్ని సలహాలు ఇచ్చానని ఆయన తెలిపారు. చదవండి: బండి సంజయ్ పాదయాత్రపై సస్పెన్స్.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ.. -
ట్విటర్ ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: బిలియనీర్ వ్యాపారవేత్త, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌తన ట్విటర్ ఫాలోవర్, భారతదేశానికి చెందిన తన చిరకాల మిత్రుడిని సర్ప్రైజ్ చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నసాఫ్ట్వేర్ డెవలపర్ ప్రణయ్ పాథోల్‌ను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాథోల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (Radhakishan Damani: ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!) టెక్సాస్‌లో గిగాఫ్యాక్టరీలో మస్క్‌ను కలుసుకున్న ఒక పిక్‌ను ట్వీట్ చేశారు. “గిగాఫాక్టరీ టెక్సాస్‌లో మస్క్‌ను కలవడం చాలా గొప్ప విషయం. లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మీరు. ఇంతనిరాడంబరమైన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు’’ అంటూ తన అనుభవాన్ని షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది . 'డౌన్ టు ఎర్త్' అంటూ కామెంట్ చేసిన పలువురు నెటిజన్లు పాథోల్‌ను అభినందించారు. (Galaxy z flip 4 & Fold 4: డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..) ఇది ఇలా ఉంటే..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ అనే డ్రైవర్-హెల్ప్ఫీచర్స్ ధరను 15వేల డాలర్లు పెంచేసింది. వివాదాస్పద ఉత్పత్తి ధరను పెంచడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఉత్తర అమెరికాలోని కస్టమర్లకు పెంపుదల సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తుందని ఎలాన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. ప్రస్తుత దీని ధర 12వేల డాలర్లుమాత్రమే. It was so great meeting you @elonmusk at the Gigafactory Texas. Never seen such a humble and down-to-earth person. You're an inspiration to the millions 💕 pic.twitter.com/TDthgWlOEV — Pranay Pathole (@PPathole) August 22, 2022 -
ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్
Amitabh Bachchan Meets Stalwarts Of Cinema Prabhas Nani Nag Ashwin: మన ఫేవరేట్ హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఒక చిత్ర పరిశ్రమకు చెందిన మల్టీస్టారర్స్ కాకుండా వివిధ సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్ ఒకే చోట దర్శనమిస్తే. కన్నులకు ఆహా అనిపిస్తుంది. అలాంటి సంఘటన చోటుచేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చి అభిమానులకు కనులవిందు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలను రూపొందించింది వైజయంతీ మూవీస్. ఈ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ వేడుకలో అతిరథ సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, నాని, దుల్కర్ సల్మాన్, కె రాఘవేంద్ర రావు, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరందరు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వీరందరూ కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ బిగ్ బీ అమితాబ్ తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. వీరంతా కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ 'సినీ ప్రముఖులతో ఒక సాయంత్రం. సినిమా విశేషాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ రాసుకొచ్చారు. అలాగే ఈ వేడుకకు సంబంధించిన అనుభూతి గురించి ఆయన బ్లాగ్‌లో తెలిపారు. కాగా వైరలైన ఈ ఫొటోను నెటిజన్లు 'పాన్ ఇండియా పిక్'గా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్ బ్యానర్లోనే ప్రాజెక్ట్ కె తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. నాని ఇదే బ్యానర్లో వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాల్లో నటించాడు. 'మహానటి' సినిమాతో విజయం అందుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం 'సీతరామం' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఈ సంస్థలో వచ్చిన ఎన్నో హిట్ సినిమాలకు డైరెక్షన్ చేశారు. -
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించిన అంశాలివే..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 45 నిమిషాలకు పైగా ప్రధానితో సీఎం సమావేశమయయారు. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసికి గనులు కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలను ప్రధానికి సీఎం నివేదించారు. ఈ మేరకు వినతిపత్రాన్నికూడా అందించారు. చదవండి: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి 2014-15కు సంబంధించిన పెండింగ్ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల విషయంలో, డిస్కంల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ ప్యాకేజీ రూపంలో, వృద్ధులకు పెన్షన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్ కింద రాష్ట్రప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఈ అంశంపై వెంటనే దృష్టిసారించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని విద్యుత్‌పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని వెంటనే సెటిల్ చేయాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు. 2016–17 నుంచి 2018–19 వరకూ అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారు. గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావు. కోవిడ్ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని సీఎం కోరారు. చదవండి: జూలై 8, 9న వైఎస్సార్సీపీ ప్లీనరీ ‘‘సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించాలని కోరుతున్నాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా విడివిడిగా కాకుండా... మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రియింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చు చేసిన రూ.905.51 కోట్ల రూపాయలను చెల్లించలేదన్న సీఎం. ప్రాజెక్టుకోసం చేసిన ఖర్చును 15 రోజుల్లోగా చెల్లించేలా చూడాలని’’ సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని డీబీటీ పద్ధతిలో చేయాలని, దీనివల్ల చాలావరకు జాప్యాన్ని నివారించవచ్చంటూ సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగడానికి వీలుగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదటి స్పెల్‌లో నిధులు అడ్వాన్స్‌గా ఇస్తే.. వీటికి సంబంధించి 80శాతం పనులు పూర్తైన తర్వాత రెండో స్పెల్‌లో మిగిలిన నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలని సీఎం కోరారు. కేంద్ర రాష్ట్రానికి చెందిన సంబంధిత శాఖల అధికారులతో నీతి ఆయోగ్ సమావేశమై, ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న బియ్యం తక్కువగా ఇస్తున్నట్టు గుర్తించిందని, దీన్ని వెంటనే పునఃసమీక్షించాలని చెప్పిందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జాతీయ ఆహారభద్రతా చట్టం కింద ఇస్తున్న బియ్యంలో దేశంలో నెలకు 3 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని, ఇందులో రాష్ట్రానికి కేటాయింపులు చేస్తే సరిపోతుందంటూ నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. నెలకు 0.77లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలంటూ నీతిఆయోగ్ సిఫార్సును ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కూడా తక్కువ కేటాయింపులు ఉన్నాయన్న ముఖ్యమంత్రి.. దాదాపు 56 లక్షల కుటుంబాలు కవర్ కావడం లేదని, వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్రం భరిస్తోందంటూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. దీంతో జిల్లాల సంఖ్య 26కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 3 మెడికల్ కాలేజీలకే కేంద్రం అనుమతి ఇచ్చింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తంగా 26 జిల్లాలకు 14 మెడికల్ కాలేజీలు ఉన్నట్టు అవుతుంది. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలంటే.. మెడికల్ కాలేజీలు చాలా అవసరం. మిగిలిన 12 కాలేజీలకు అనుమతులు మంజూరుచేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విశాఖ సమీపంలోని భోగాపురంలో ఎయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గతంలో ఇచ్చిన క్లియరెన్స్ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మేరకు పౌరవిమానయానశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వగలరని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్ ఓర్‌సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి ఇనుపగనులు కేటాయించాలని కోరుతున్నాం. రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఈప్రాంతంలో ఆర్థిక ప్రగతికి స్టీల్‌ప్లాంట్ అన్నది చాలా అవసరం. ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఈ రంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. 16 చోట్ల బీచ్‌శాండ్ మినరల్స్ ప్రతిపాదనలను అందించాం. 14 చోట్ల అనుమతులు పెండింగులో ఉన్నాయి. ఏపీఎండీసీకి వీటిని కేటాయించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ?
చెన్నై సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భేటీ అయ్యారు. మంగళవారం (మే 24) ఉదయం ఇళయరాజా అనూహ్యంగా స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. ఇద్దరూ చాలా సేపు ము చ్చటించుకున్నారు. అనంతరం ఇళయరాజా తిరిగి బయలుదేరుతుండగా ఏదైనా పనిపై వచ్చారా స్వామి..? అని రజనీకాంత్ అడగగా ఏమీ లేదు జూన్ 2వ తేదీన కోయంబత్తూరులో సంగీత కచేరీ ఉందని, దీనికి సంబంధించి తన స్టూడియోలో రిహార్సల్స్ జరుగుతున్నాయని, ఒక్కడినే వెళుతున్నట్లు చెప్పారు. దీంతో రజనీకాంత్ తానూ వస్తానంటూ కారులో ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కొంచెం సేపు రిహార్సల్స్‌ను ఎంజాయ్ చేశారు. ఇంతకీ ఇళయరాజా సడన్‌గా రజనీకాంత్ ఇంటికి ఎందుకు వెళ్లారు? వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కాగా రజనీ కాంత్, ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 👇 పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. 11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు -
హైకోర్టు చీఫ్ జస్టిస్ మిశ్రాను కలిసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల భేటీ దృష్ట్యా సమావేశం అజెండాపై ఇరువురు చర్చించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు ఏప్రిల్ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతితో పాటు, పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయ సహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ-కోర్టులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటికి సంబంధించి రాష్ట్ర నుంచి నివేదించనున్న అంశాలపై ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చర్చించారు. హైకోర్టు ఉన్నత పరిపాలనా అధికారులు, రాష్ట ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా కలిశారు. నాల్కో, మిథానీ సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ (యూడీఏఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యుమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. రూ.5,500 కోట్లతో ఏర్పాటు కానున్న పరిశ్రమ, ఏడాదికి 60,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, రెండు నుంచి రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి కానుంది. చదవండి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ దాదాపు 750-1000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయాలని సీఎం సూచించగా, సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌తో భేటీ.. సజ్జల ఏమన్నారంటే..?
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రెండు గంటలకుపైగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇతర అంశాలపై చర్చించామన్నారు. మంత్రి వర్గంలో ఎవరు ఉండాలనేది పూర్తిగా సీఎం నిర్ణయం అన్నారు. అందులో ఎవరి ప్రమేయం ఉండదని, విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని సజ్జల అన్నారు. చదవండి: వాళ్ల కడుపు మంటకు మందే లేదు: సీఎం జగన్ -
కేసీఆర్‌ను కలిసిన రైతు ఉద్యమకారుడు రాకేష్ టికాయత్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేసీఆర్‌ను రైతు ఉద్యమకారుడు రాకేష్ టికాయత్ గురువారం కలిశారు. మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. భేటీ అనంతరం రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ, రైతు సమస్యలపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కిసాన్ ఎజెండా రూపొందించాల్సి ఉందని టికాయత్ పేర్కొన్నారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు బంధు పథకం చాలా బాగుంది. జాతీయ స్థాయిలో ఈ రైతు పథకాలు అమలు చేయాలి. రాజకీయ అంశాలు సమావేశంలో మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో రాజకీయ మార్పు ఇప్పుడు ఏమి చెప్పలేనని రాకేష్ టికాయత్ అన్నారు. -
సీఎం స్టాలిన్‌ను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
-
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ
సాక్షి, అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సజ్జల వివరించారు. సీఎం జగన్ ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటారని సజ్జల అన్నారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు. తమకు ఇంత కావాలని ఉద్యోగులు చెప్పడంలో తప్పు లేదని.. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని సజ్జల అన్నారు. పట్టు విడుపులు అటూ ఇటూ ఉండటం కామనేనన్నారు. పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశం: వెంకట్రామిరెడ్డి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను వివరించారని తెలిపారు. పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశముందన్నారు. ముఖ్యమంత్రితో రేపు సమావేశం ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్ సీఎంకు వివరిస్తామని వెంకట్రామిరెడ్డి అన్నారు. -
ప్రధాని మోదీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు. చదవండి: CM YS Jagan: నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు -
సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర బృందం, పనితీరుపై ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు తెలిపిన కేంద్ర బృందం.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను సీఎం జగన్‌కు కేంద్ర బృందం వివరించింది. కేంద్ర బృందం తరఫున కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఎన్ఎండీఏ సలహాదారు కునాల్ సత్యార్థి వివరాలు అందించారు. ఈ సందర్భంగా కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. 3 రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆ గ్రామాలను కూడా పరిశీలించామని, పశువులు చనిపోవడం, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు.. ల్లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం జగన్ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని, వీరంతా తమకు మంచి సహకారాన్ని అందించారన్నారు. ఇంకా ఆయనమాట్లాడుతూ.. ‘యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులు ఉన్నారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు. అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి. ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదు. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయి. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి. కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తీరందాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదు, అది చాలా రోజులు కొనసాగింది. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉంది. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది. కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికందుతున్న సమయంలో నీట పాలైంది. శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. వాటర్ స్కీములు కూడా దెబ్బతిన్నాయి. అన్నమయ్య నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడింది. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పనిచేశారు. విద్యుత్ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయి. అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. సహాయ కార్యక్రమాలకోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు. ఈ డబ్బును బాధితులను వెంటనే ఆదుకునేందుకు వాడుకున్నారు. అలాగే జేసీబీలు పెట్టి.. అవసరమైనచోట యుద్ధ ప్రాతిపదికిన పనులు చేపట్టారు. సహాయక శిబిరాలను తెరిచి ముంపు బాధితులను ఆదుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రశంసనీయం. వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగింది. వీలైనంత మేర ఆదుకోవడానికి మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని సత్యార్థి పేర్కొన్నారు. కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్ అయితే ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నంటున తేమ, ఇతరత్రా నిబంధనల విషయలో సడలింపులు ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగా కేంద్ర బృందంతో సీఎం జగన్.. ఇలాంటి విపత్తు హృదయవిదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనాల కోసం కేంద్ర బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంపై ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరారు. తాము పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదని స్పష్టం చేశారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో తమకు సమర్థవంతమైన వ్యవస్థ ఉందన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉందని, ప్రతి రైతు పంటకూడా ఇ–క్రాప్ అయ్యింది. సోషల్ ఆడిట్ కూడా చేయించాం. ఇ– క్రాప్‌కు సంబంధించి రశీదు కూడా రైతుకు ఇచ్చారు. నష్టపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను తమకు అందించాం. కోవిడ్ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయి. మామ ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారు. పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటాం. దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. వీలైనంత త్వరగా పెద్దమొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతాం. ఆటోమేటిక్ వాగర్ గేజ్ సిస్టంపైనా దృష్టిపెడతాం’ అని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్.రావత్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కే.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: AP: నష్టం అపారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన -
ఏపీ గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్ జగన్ దంపతులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు గురువారం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 1న జరిగే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా గవర్నర్‌ను సీఎం వైఎస్ జగన్ ఆహ్వానించారు. వివిధ రంగాలలో విశేష సేవలు చేసిన వారికి ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. ఈ కార్యక్రమం విజయవాడలో జరగనుంది. 50 మందికి పైగా ప్రముఖులకు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు. -
Lakhimpur Kheri Violence: నేడు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్
న్యూఢిల్లీ/లఖీమ్‌పూర్ ఖేరి: రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి లఖీమ్‌పూర్‌ఖేరి ఘటనపై వినతిపత్రం అందజేయనున్నారు. ఈ బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, లోక్‌సభ పార్టీ నేత అధిర్ రంజన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉంటారు. హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతికి పూర్తి వివరాలను అందజేస్తామని పార్టీ నేత వేణుగోపాల్ తెలిపారు. మంత్రి కుమారుడు రైతులపైకి వాహనం నడిపిన ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించి మంత్రి కుమారుడు ఆశిష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతిమ్ అర్దాస్‌లో పాల్గొన్న ప్రియాంక లఖీమ్‌పూర్‌ఖేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంతిమ ప్రార్థనలు జరిపేందుకు మంగళవారం టికోనియా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, బీకేయూ నేతలు రాకేశ్ తికాయత్, దర్శన్‌సింగ్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, ధర్మేంద్ర మాలిక్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. హింసాత్మక ఘటనలో అసువులు బాసిన రైతుల కుటుంబసభ్యులు కార్యక్రమ ంలో పాల్గొన్నారు. ప్రకటించిన విధంగానే, వేదికపై రాజకీయ పార్టీల నేతలెవరికీ చోటు కల్పించలేదు. కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రైతులకు అన్యాయం జరగనివ్వొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కొంతకాలంగా నెలకొన్న బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) సేకరణ సమస్యను పరిష్కరించాలని, తెలంగాణ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వానాకాలంలో వచ్చే దిగుబడిలో కనీసం 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీలో పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లి కలిశారు. వారు సుమారు గంటా 40 నిమిషాల పాటు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. వాస్తవానికి 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి 62.79 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకాగా.. 24.75 లక్షల టన్నులే తీసుకుంటామని ఇంతకుముందే కేంద్రం పేర్కొంది. మిగతా 38.04 లక్షల టన్నులను పచ్చి బియ్యం రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ఇద్దరూ ఈ నెల 1న కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో, 2న ఆ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండేతో చర్చించారు. ఈ సందర్భంగా అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ వరకు తీసుకొనేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. కానీ అధికారిక ఉత్తర్వులు రాలేదు. సీఎం కేసీఆర్ తాజా భేటీలో ఈ అంశాలను పీయూష్ గోయల్ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ నిల్వలు పేరుకుపోతున్నాయని, ఎఫ్‌సీఐ తీసుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని, రైస్ మిల్లులు మూతపడి ఉపాధిపై ప్రభావం చూపుతుందని వివరించినట్టు సమాచారం. ఇక వర్షాలు బాగుండటం, వరిసాగు విస్తీర్ణం పెరగడంతో వానాకాలంలో కేంద్రం తీసుకునే ధాన్యం కోటా పెంచాలని, ఈ సారి కనీసం 90 లక్షల టన్నులు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కేంద్రమంత్రితో భేటీలో సీఎంతోపాటు సీఎస్ సోమేశ్‌మార్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి కూడా ఉన్నారు. -
‘పాలమూరు’పై నీళ్లు చల్లొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వెనకబడిన ప్రాంతాలకు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం జీవధార అని.. ఆ ప్రాజెక్టును కొనసాగనివ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. కరువు తీర్చే ఈ ప్రాజెక్టు పనులను ఆపి.. ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లొద్దని విన్నవించారు. సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి (నారాయణపేట), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి (దేవరకద్ర)లతో కలిసి కేంద్రమంత్రితో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు ఎత్తిపోతల పథకంపైనే చర్చించినట్టు తెలిసింది. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ నెల 6వ తేదీనే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి చర్చించారు. 20 రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ కావడం గమనార్హం. కరువు పీడిత ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు.. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేం ద్రం గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుంది. పాలమూరు ఎత్తిపోతల పథకం అనుమతి పొందని ప్రాజెక్టుల జాబితాలో ఉండటంతో పనులు నిలిపేయాల్సి రానుంది. ఏపీ కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పాలమూరు పనులు కొనసాగించేందుకు అనుమతివ్వాలని సీఎం, ఎమ్మెల్యేలు కేంద్రమంత్రిని కోరారు. ‘‘పాలమూరు పూర్తిగా కరువు పీడిత ప్రాంతం. తాగు, సాగునీటి కొరతతో అల్లా డుతున్న ప్రాంతం. మాకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత అవసరమైన ప్రాజెక్టు. అది పూర్తయితే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు అనుమతులు ఇవ్వండి. పర్యావరణ అనుమతుల ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణను కూడా పూర్తిచేశాం. ప్రస్తుతం మాకు అనుమతి ఉన్న 299 టీఎంసీల వాటాలో నుంచే నీటిని వాడుకుంటాం. అంతకుమించి వాడుకోం. ట్రిబ్యునల్ తుది అవార్డుకు కట్టుబడి ఉంటాం. ట్రిబ్యునల్ కేటాయిం పులకు లోబడి నీటిని వాడుకుంటాం. దీనికి సంబంధించి ఏదైనా అండర్ టేకింగ్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేస్తాం..’’ అని కేంద్ర మంత్రికి వివరించారు. గెజిట్ అమలు, ఇతర అంశాలపైనా.. ఈ నెల 6న కలిసినప్పుడు చేసిన విన్నపాలను సీఎం కేసీఆర్ మరోసారి కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్ అమలును కొంతకాలం వాయిదా వేయాలని కోరారు. కృష్ణా జలాల పునః పంపిణీకి వీలుగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్ 3ని అనుసరించి కొత్త ట్రిబ్యునల్ వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తున్నందున.. కృష్ణాలో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీల నీటి వాటా వస్తుందని, దీనిని ఈ ఏడాదే కేటాయించాలని కోరారు. డీపీఆర్‌లను ఓకే చేయండి: గోదావరి నదిపై చేపట్టిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సీతారామ, తుపాకులగూడెం, చనాకా–కొరట, ముక్తేశ్వరం, చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్టు తదితర ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇప్పటికే సమర్పించామని వివరించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే ఆమోదించిన నీటి కేటాయింపుల మేరకే ఈ ప్రాజెక్టులను చేపట్టామని, త్వరితగతిన డీపీఆర్‌లను ఆమోదించాలని కోరారు. కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ను.. టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బి.వెంకటేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జల్‌జీవన్ మిషన్‌పై చర్చించాం: షెకావత్ తెలంగాణ సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శనివారం ట్వీట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో జల్‌జీవన్ మిషన్ ప్రభావవంతంగా అమలు కావాలని ఆకాంక్షిస్తున్నామని.. తెలంగాణకు సంబంధించి పలు అంశాలతోపాటు ఈ మిషన్‌పైనా చర్చించామని పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
-
యాదాద్రికి రండి..ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల మధ్య మంచి ముహూర్తం చేసుకుని ప్రారంభోత్సవం చేపడతామని.. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. శుక్రవారం సాయంత్రం ప్రధానితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వారు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పాలన, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి తగిన సాయం చేయాలని కోరుతూ.. పది అంశాలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. భేటీ అనంతరం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సీఎం హామీలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని తెలిపింది. మరోవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం కూడా కేసీఆర్, మోదీ సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భేటీ చిత్రాలను ట్వీట్ చేసింది. ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంచండి.. తెలంగాణ ఏర్పాటయ్యాక పాలన అవసరాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఉమ్మడి రాష్ట్రం నాటి జోనల్ వ్యవస్థ కారణంగా స్థానికులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు.. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించుకున్నాం. కొత్త జిల్లాలను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. రాష్ట్రంలో తొమ్మిది పోలీసు జిల్లాలు, రెండు పోలీసు కమిషనరేట్ల స్థానంలో.. 20 పోలీసు జిల్లాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. దీనికి అనుగుణంగా కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, కొత్త మల్టీజోన్లకు పోలీస్ ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది. అందువల్ల కనీసం 29 సీనియర్ డ్యూటీ పోస్టులు ఇస్తూ ప్రస్తుతమున్న 76 సీనియర్ డ్యూటీ పోస్టులను 105కు పెంచాలి. మొత్తంగా 139 మందిగా ఉన్న ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను 195కి పెంచాలి. పోలీసు పరిపాలన అవసరాల రీత్యా దీనిని ప్రత్యేక అంశంగా, అసాధారణ కేసుగా పరిగణించి ఆమోదించాలి. రెండు పారిశ్రామిక కారిడార్లు హైదరాబాద్– నాగపూర్, వరంగల్– హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలి. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా బలమైన ఆర్థిక పునాదిని సృష్టించడం, దీర్ఘకాలిక ప్రాజెక్టులతో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా>ం. ఢిల్లీ– ముంబై కారిడార్ తరహాలో హైదరాబాద్– నాగ్‌పూర్ మధ్య 585 కిలోమీటర్ల పొడవున పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. కీలక ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌ను, మల్టీమోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్‌గా ప్రతిపాదించిన నాగ్‌పూర్‌ను ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య రైల్వే, ఎక్స్‌ప్రెస్ హైవే అనుసంధానం ఉంది. ఇది పారిశ్రామిక కారిడార్‌కు తోడ్పడుతుంది. కారిడార్‌తో రోడ్డు, రైలు మార్గాలకు ఇరువైపులా 50 కిలోమీటర్ల వెడల్పున తక్షణ ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రల పరిధిలోని జనాభాలో 27 శాతం అంటే 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదే తరహాలో వరంగల్–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. నాగ్‌పూర్–హైదరాబాద్ రైలు మార్గం వరంగల్ వరకు ఉంది. జాతీయ రహదారి కూడా హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు అనుసంధానమై ఉంది. ఇవి కారిడార్‌కు తోడ్పడుతాయి. ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు స్థలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలకు ఢిల్లీలో అధికారిక భవనాలు ఉన్నట్టుగానే తెలంగాణకు కూడా ప్రత్యేక అధికారిక భవనం నిర్మించాల్సి ఉంది. ‘తెలంగాణ భవన్’ పేరిట భవనం నిర్మించుకునేందుకు ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలి. సడక్ యోజన కింద అదనపు నిధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 9, షెడ్యూల్ 13 ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ చెబుతోంది. అందువల్ల తెలంగాణలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)’ పథకం కింద అదనంగా నిధులు ఇవ్వాలి. నాలుగు వేల కిలోమీటర్ల రహదారులను మంజూరు చేయాలి. వీటి నిర్మాణాన్ని 3.75 మీటర్ల వెడల్పుతో కాకుండా.. 5.5 మీటర్లతో చేపట్టాలి. మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో బయటి ప్రాంతాల అనుసంధానాన్ని (కనెక్టివిటీని) పెంచేలా కేంద్రం చేపట్టిన రహదారుల నిర్మాణం భద్రతా దళాలకు ఉపయోగకరం. ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా చాలా కీలకం. ప్రస్తుతం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారి పనులకు కేంద్రం, రాష్ట్రం 60ః40 నిష్పత్తిలో నిధులు భరిస్తున్నాయి. జాతీయ భద్రత దృష్ట్యా మొత్తం 100 శాతం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలి. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ తెలంగాణలో ప్రధాన నగరాలకు నాణ్యమైన సాంకేతిక విద్యను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా కరీంనగర్లో పీపీపీ మోడల్లో ట్రిపుల్ ఐటీని స్థాపించాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ ఉత్తర తెలంగాణలోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఒకటి. అందువల్ల ట్రిపుల్ ఐటీని త్వరగా మంజూరు చేయాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించేలా ఉత్తర్వులు జారీ చేయాలి. ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూమిని, పీపీపీ విధానంలో కావాల్సిన నిధుల వాటాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఐటీ కంపెనీలు ఇందులో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహిస్తాం. గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, సెక్షన్ 94లోని షెడ్యూల్ 13(3) ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు మండలం జాకారంలో 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. విభజన చట్టం స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని గిరిజన విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలి. దీనికి కేంద్రం నుంచి త్వరగా నిధులు ఇవ్వాలి. విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకొనేలా కేంద్ర విద్యా శాఖను ఆదేశించాలి. హైదరాబాద్‌లో ఐఐఎం ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) ఉండాలనే ప్రణాళికలో భాగంగా కేంద్రం గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో కొత్త ఐఐఎంలను మంజూరు చేసింది. కానీ హైదరాబాద్‌లో ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ఉందన్న కారణంతో తెలంగాణకు మాత్రం కేటాయించలేదు. ఐఎస్బీలో భారీ ఫీజుల కారణంగా సాధారణ విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. అందువల్ల హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. దీనికి అవసరమైన భూమిని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ప్రాంగణంలో అందుబాటులో ఉంది. వరంగల్ టెక్స్టైల్ పార్క్‌కు రూ.1,000 కోట్లు టెక్స్టైల్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు వరంగల్ సమీపంలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ‘ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్స్టైల్ పార్క్’ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి ఎకరాలు సేకరించాం. అయితే పార్క్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,600 కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేశారు. రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా మంజూరు చేయాలి. దేశంలో పత్తి ఉత్పత్తలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. నైపుణ్యమున్న కార్మికులు, ముడిసరుకు లభ్యత వల్ల టెక్స్టైల్ రంగం వృద్ధికి అపారమైన అవకాశం ఉంది. దీనికి కేంద్రం తోడ్పాటు ఇవ్వాలి. కొత్తగా 21 నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. ప్రతి జిల్లాలో ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం రంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్(అర్బన్), నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ (రూరల్), జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి గ్రామీణ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు కావాల్సి ఉంది. గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఈ 21 నవోదయ విద్యాలయాలను వెంటనే మంజూరు చేయాలి. వీటికోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తులివీ... 1. తెలంగాణలో ఐపీఎస్‌ల సంఖ్యను 139 నుంచి 195కి పెంచండి. 2. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికారిక భవనం కోసం స్థలం కేటాయించండి. 3. హైదరాబాద్– నాగ్‌పూర్, వరంగల్– హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయండి. 4. గ్రామీణ సడక్ యోజన కింద అదనపు నిధులివ్వండి. 5. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 100 శాతం కేంద్ర నిధులతో రోడ్లు నిర్మించండి. 6. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయండి. 7. గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు చేయండి. 8. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయండి. 9. వరంగల్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇవ్వండి. 10. కొత్తగా 21 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయండి. చదవండి: KCR Delhi Tour: టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన -
నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ సంస్థాగత నిర్మాణం, దళితబంధు పథకంపై పార్టీ కార్యాచరణ, హుజూ రాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర కమి టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళవా రం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై.. ఈ ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మార్చి నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్‌లో పార్టీ అ«ధ్యక్షుడి ఎన్నిక ప్లీనరీ ఉంటుందని ప్రకటించారు. కానీ కోవిడ్ రెండో దశ, లాక్డౌన్ నేపథ్యంలో జాప్యం జరిగింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తిచేసి, పుస్తకాలను తెలంగాణ భవన్లో అందజేయాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశించింది. సభ్యత్వ నమోదు దాదాపు కొలిక్కి రావడంతో సంస్థాగత కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఈ మేరకు షె డ్యూల్ తేదీలను మంగళవారం జరిగే సమావేశంలో కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. అన్ని కమిటీల ను ప్రక్షాళన చేయాలని.. వివిధ కారణాల తో అధికార పదవులు దక్కనివారు, చురుకైన నేతలు, కార్యకర్తలతో సామాజిక సమతూకం పాటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. దళితబంధు పథకంపై కార్యాచరణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకం ఉద్దేశాలు, లక్ష్యాలను పార్టీ యంత్రాంగం ద్వారా బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక, రాష్ట్ర రాజకీయాల్లో విపక్షాల దూకుడు, కొత్త రాజకీయ శక్తుల ప్రభావంపైనా తన మనోగతాన్ని వెల్లడించే అవకాశముంది. ఇక జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ, ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తదితర అంశాలపైనా కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. -
డీజీపీని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసును త్వరితగతిన ఛేదించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రమ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు.. ఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను వివరించారు. ఓ హత్య కేసులో పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఘటన అనంతరం తమ కుటుంబంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డబ్బులకు అమ్ముడుపోయామంటు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారని, ఆ కారణంగా ఇంట్లో భోజనం కూడా చేయలేక పోతున్నామని వాపోయారు. అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీజీపీ స్పందిస్తూ.. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించారు. రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రమ్య కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఖతార్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ చర్చలు
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్–థానీతో శుక్రవారం సమావేశమయ్యారు. ఖతార్ రాజధాని దోహాలో ఈ భేటీ జరిగింది. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు, తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ విషయాన్ని జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. నాలుగు రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని భారత్‌కు తిరుగు ప్రయాణమైన ఆయన ఖతార్‌లో ఆగారు. కాబూల్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి తీసుకురావడమే లక్ష్యంగా భారత వాయు సేనకు చెందిన సీ–17 విమానం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. కాబూల్‌కు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సీ–17 ద్వారా 250 మంది భారతీయులను వెనక్కు తీసుకురావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద 400 మంది భారతీయులు అక్కడ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
వైరల్ : విజయ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ఎం.ఎస్. ధోనీ
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్‌కు టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ బీస్ట్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చెన్నైలోని గోకులం స్టూడియోలో దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అయితే ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ధోనీ సైతం అక్కడే షూట్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీంతో బీస్ట్ సినిమా సెట్‌ను సందర్శించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్ అవుతున్నాయి. లెజెండ్స్ ఇద్దరు ఇకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
సచివాలయం: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పీవీ సింధు
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పీవీ సింధు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. మీ ఆశీర్వాదంతో కాంస్యం సాధించానని సీఎం జగన్‌తో సింధు అన్నారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు. సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉంది.. ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎం జగన్ ఆశీర్వదించారని, ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకురావాలని కోరారని ఆమె తెలిపారు. ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్ గొప్ప విషయం అని పేర్కొన్నారు. నేషనల్స్‌లో గెలిచిన వారికి వైఎస్సార్ పురస్కార అవార్డులు ఇస్తున్నారన్నారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని.. త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పీవీ సింధు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాజీ మంత్రిని కలిసిన ప్రముఖ కన్నడ నటుడు
మైసూరు: మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్పను హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్ కలిశారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూరు వచ్చిన ఈశ్వరప్ప అల్పాహారం కోసం ఓ హోటల్‌కు వెళ్లిన సమయంలో అక్కడే ఉన్న శివరాజ్ కుమార్ ఈశ్వరప్పను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. -
కేంద్రమంత్రి గడ్కరీతో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి గడ్కరీతో వైఎస్సార్సీపీ ఎంపీలు సమావేశమయ్యారు. సబ్బవరం - నర్సీపట్నం- తుని మధ్య రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రైబల్ ఏరియాలో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.3 లక్షలు ఇవ్వాలి: ఎంపీ మాధవి ట్రైబల్ ఏరియాలో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.3 లక్షలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మాధవి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ, పీఎమ్ఏవై కింద 350 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ.1.8 లక్షలు సరిపోవడం లేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల నివాసిత ప్రాంతాల్లో దాన్ని రూ.3 లక్షలకు పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
సాక్షి, ఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్ సభాపక్ష నాయకులు మిథున్ రెడ్డి సారథ్యంలో ఎంపీల బృందం మంత్రితో సమావేశమయ్యారు. ఉపాధి పనుల బకాయిల విడుదలతో పాటు ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. ఈ మేరకు ఎంపీలందరూ సంతకాలు చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంత్రితో జరిపిన భేటీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 18.4 కోట్ల పని దినాలను కల్పించి దేశంలోనే అత్యధిక పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పిందని తెలిపారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 16.7 కోట్ల పని దినాలను కల్పించి కూలీల బడ్జెట్లో 83.5 శాతం వినియోగించుకుంది. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అత్యధిక ఉపాధి కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. 2006లో దేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ పథకం కింద ఉపాధి కల్పించింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నేపథ్యంలో ఉపాధి పనులకు ఏర్పడిన డిమాండ్ దృష్ట్యా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పేదలకు కనీసం ఒక కోటి పని దినాలు కల్పించాలని గత ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని తొమ్మిది జిల్లాల్లో విజయవంతగా చేరుకోగలిగినట్లు చెప్పారు. గ్రామీణ ఉపాధి పథకం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ పథకాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చొరవ తీసుకోవలసిందిగా విజయసాయి రెడ్డి మంత్రిని కోరారు. ఆ చర్యలలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పని దినాలను 100 నుంచి 150కి పెంచాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ ఖర్చును 20 లక్షల రూపాయలకు పెంచాలి. దీని వలన ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఉపయుక్తంగా ఉండే టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగు నీరు, క్రీడా సౌకర్యాల కల్పిన కోసం ఉపాధి పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 15 లక్షలకు పెంచాలి. మిగిలిన 5 లక్షల రూపాయలు ఐసీడీఎస్ వాటా కింద చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా సర్వే రాళ్ళు పాతే కూలీలకు వేతనాలను ఉపాధి పథకం కింద వినియోగించుకునేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పథకం కింద లేబర్ బడ్జెట్‌ను సవరించాలని కోరారు. కాఫీ తోటల పెంపకంతో గిరిజనులను ఆదుకోండి... ఉపాధి హామీ పథకం కింద గిరిజనులు కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని వలన ప్రధానంగా విశాఖపట్నం జిల్లా పాడేరులోని నిరుపేద గిరిజనులకు ఎంతో మేలు చేసినట్లువుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలలో రబ్బర్ తోటల పెంపకాన్ని ఉపాధి హామీ కింద చేర్చినట్లుగానే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు కాఫీ తోటల పెంపకాన్ని కూడా ఈ పథకం కింద చేర్చాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. -
సీఎం జగన్‌ను కలిసిన శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి.వెంకటేశ్వరన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డి.వెంకటేశ్వరన్‌ను సీఎం వైఎస్ జగన్ శాలువాతో సత్కరించారు. -
సోనియాతో కమల్‌నాథ్ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. పార్టీలో కమల్‌నాథ్ మరింత కీలకం కానున్నా రంటూ ఊహాగానాలు వెల్లువెత్తు తున్న సమ యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ప్రక్షాళన జరగా లంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతలు సహా అందరితోనూ కమల్‌నాథ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలున్న కమల్‌నాథ్‌తో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోనియా ప్రత్యేకంగా సమావేశం కావడం గమనార్హం. -
క్రికెటర్ నట్టూకు ఆ కమెడియన్ క్లోజ్ ఫ్రెండ్ తెలుసా?
చెన్నై: యువ క్రికెటర్ నటరాజన్‌ను హాస్యనటుడు యోగిబాబు సోమవారం కలిశారు. ఫిజియోథెరపీ కోసం బెంగళూరులో ఉన్న నటరాజన్‌ను కలిసిన యోగిబాబు ఆయనకు కుమారస్వామి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను నటరాజన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన మిత్రుడు యోగిబాబును కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో గుర్తిండిపోయే రోజని పేర్కొన్నాడు. -
సీఎం జగన్‌తో క్షత్రియ నేతల భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు క్షత్రియ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం వారు సీఎంతో భేటీ అయ్యారు. క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ పి.వి.సూర్యనారాయణరాజు, పాతపాటి సర్రాజు, కేకే రాజు, గాదిరాజు నారాయణరాజు తదితరులున్నారు. చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం భేటీ అయ్యారు. టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. గతంలో వుడా(విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చెల్లించిన రూ.219 కోట్లను వడ్డీతోసహా రీఫండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రీఫండ్ చేయాలని కేంద్రాన్ని విజయసాయిరెడ్డి కోరారు. చదవండి: కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం భేటీ అయ్యారు. మంత్రితో పాటు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఉన్నారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో నేషనల్ లా వర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో భారత్ నెట్ పనులు వేగవంతం చేయాలని అడిగామన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయాల్సిన అవసరం ఉందని.. ఏపీలో ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరామని తెలిపారు. అన్ని అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. చదవండి: రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ పోర్ట్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి -
కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
న్యూ ఢిల్లీ\అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎం జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. షెకావత్‌తో సీఎం జగన్ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. కాగా, రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం సీఎం జగన్.. ఈ రోజు(గురువారం) గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌లను కూడా సీఎం జగన్ కలవనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం తాడేపల్లి చేరుకుంటారు. చదవండి: ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ -
సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
-
సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. గురుమూర్తి వెంట డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, సంజీవయ్య తదితరులు ఉన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు పట్టంగట్టి తామంతా ఆయన వెంటే ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్ శాతం తగ్గిపోయినా వైఎస్సార్సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం. చదవండి: ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ నిన్ను నమ్మం బాబూ.. -
బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు.. దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.(చదవండి: ‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్) -
అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సుమారు గంటకుపైగా సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో వరద సాయం చేయాలని కేంద్రమంత్రిని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను అమోదించేలా సహకరించాలని విన్నవించారు. రెండవ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ (2వ ఆర్సీఈ) ప్రకారం 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకోసం అయ్యే రూ, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్ ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి... అమిత్ షాతో భేటీ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అధికార వికేంద్రీకరణ, ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళిక వేసుకున్నామని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసనరాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని చేస్తూ ఆగస్టులో చట్టంకూడా చేశామని ఈ సందర్భంగా అమిత్ షాకు గుర్తుచేశారు. హైకోర్టును కర్నూలుకు రీ లొకేట్ చేసేలా ప్రక్రియ ఆరంభించాలని, దీనికోసం నోటిఫికేషన్ జారీచేయాలని కోరారు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశం ఉందని ప్రస్తావించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల.. సమగ్ర భూ సర్వేకోసం ఉద్దేశించిన ఏపీ ల్యాండ్ టైటలింగ్ అథారిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. డిసెంబర్ 21న సమగ్ర సర్వే ప్రారంభమవుతుందన్న విషయాన్ని వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించడానికి తీసుకొచ్చిన దిశ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లులకు వెంటనే ఆమోదం పొందేలా ప్రక్రియను పూర్తిచేయాలంటూ అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కొత్తగా 16 మెడికల్ కళాశాలలను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, దీనికోసం ఇప్పటికే అభ్యర్థనలు పంపామని, వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ కాలేజీలు చాలా కీలమని హోంమంత్రికి వివరించారు. ఉపాథిహామీ పథకంలో భాగంగా పెండింగులో ఉన్న రూ.3,801.98 కోట్లను విడుదల చేయాలని కోరారు. -
జేపీ నడ్డాతో వివేక్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు గడ్డం వివేకానంద శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని తాజా రాజకీ యాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ చేపడుతున్న పలు కార్యక్రమాలను నడ్డాకు వివరించాను. సీఎం చేస్తున్న అవినీతిని వివరించాను. అన్ని ప్రాజెక్టుల్లో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వంపైన కేసీఆర్ తప్పుడు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అంటే ఆయనకు భయం పుడుతోంది. రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంగా అయిందని వివరించాను. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై జేపీ నడ్డాతో చర్చించాను..’ అని తెలిపారు. -
సోనియా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఢిల్లీలోని ఆమె నివాసంలో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను ఆమెకు వివరించినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుకుంటానని ప్రకటించడం, ఇటీవల కర్ణాటక తదితర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమించడం వంటి పరిణా మాల నేపథ్యంలో కోమటిరెడ్డి భేటీ ప్రాధా న్యత సంతరించుకుంది. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని, అధికార పార్టీని ఎదుర్కొనేందుకు త్వరితగతిన పీసీసీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. -
ఆస్ట్రేలియా ఎంపీతో కోమటిరెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ దేశానికి చెందిన ఎంపీ జూలీ ఇసాబెల్ బిషప్తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, భారత రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాలు, స్వరాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రజలు చూపిన తెగువ, రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తీరును కోమటిరెడ్డి ఆస్ట్రేలియా ఎంపీకి వివరించారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాలో ప్రభుత్వ శాఖల పనితీరు, ఆ దేశంలో జరుగుతున్న సంస్కరణల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. -
కుబ్రా కుటుంబానికి అండగా ఉంటాం
రాయదుర్గం: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురానికి చెందిన కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. కుబ్రా తల్లిదండ్రులు అబ్దుల్ అజీమ్, షాహిదా, సోదరుడు అబ్దుల్ ఖలీద్‌లను కలిశారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కుబ్రా కుటుంబానికి జీహెచ్ఎంసీ అం డగా ఉంటుంది. వైద్య ఖర్చులన్నీ భరిస్తాం. ఆమె ఆరో గ్య పరిస్థితిని డిప్యూటీ, జోనల్ కమిషనర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సర్జరీ తర్వాత డిశ్చార్జీ అయ్యాక 2 నెలలు పర్యవేక్షించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాం’అని అన్నారు. అందరికీ కృతజ్ఞతలు ‘పెయింటింగ్ చేస్తూ ఎంతో కష్టపడి నా ఇద్దరు పిల్లలను చదివించాను. నా కూతురు ప్రమాదంలో గాయపడటం మమ్మల్ని కలచివేసింది. మేం పేదోళ్లం. చికిత్సకయ్యే వ్యయాన్ని భరించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం, నగర మేయర్ భరోసా ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని కుబ్రా తండ్రి అన్నారు. ఆదుకునేందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. కుబ్రా తల్లిదండ్రులను కడప జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం పరామర్శించారు. రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో ఇద్దరు నేతలు హైదరాబాద్‌కు చెందిన బీబీజీ కంపెనీ ద్వారా అజీమ్‌కు ఆర్థిక సాయం చేశారు. -
‘మహారాష్ట్ర’లో మార్పేమీ లేదు!
ముంబై: ‘మహా’ ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివిధ పార్టీల నేతల వ్యాఖ్యల మాటెలా ఉన్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు మాత్రం పడటం లేదు. ముఖ్యమంత్రి పీఠం సహా అధికార పంపిణీ సమంగా జరగాలన్న తమ డిమాండ్ నుంచి శివసేన వెనక్కు తగ్గడంలేదు. అదే విషయాన్ని మంగళవారం శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు జరగాలంటే.. అధికారాన్ని సమంగా పంచుకోవడంపై బీజేపీ లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనన్నారు. శివసేన నేతనే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవుతాడని పునరుద్ఘాటించారు. సేన, బీజేపీల కూటమికి మెజారిటీ లభించినా.. రెండు పార్టీల మధ్య అధికార పంపిణీ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 24వ తేదీ నుంచి ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు, బీజేపీ నుంచి మంగళవారం ఒక ఆశావహ ప్రకటన వెలువడింది. ‘ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన శుభవార్త ఏ క్షణమైనా రావొచ్చు’ అని సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల భేటీ అనంతరం ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఆ భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ మాట్లాడుతూ.. శివసేన నుంచి సానుకూలమైన ప్రతిపాదన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బీజేపీతో, ఎన్డీయేతో శివసేన సంబంధాలు తెంచుకుంటేనే.. రాజకీయ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది. ఆరెస్సెస్ చీఫ్‌తో ఫడ్నవిస్ భేటీ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు పరిష్కారం లభించని నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యేందుకు మంగళవారం రాత్రి నాగపూర్ వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇరువురు ఏం చర్చించారనే విషయంలో ఆరెస్సెస్ వర్గాలు నోరు విప్పడం లేదు -
ఎగిరిపడే వాళ్లకు ఎన్నికలతోనే సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘మున్సిపల్ ఎన్నికలు ఈ నెలలో లేదా.. కోర్టు తీర్పు కొంత ఆలస్యమైతే వచ్చే నెలలో జరిగే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇతర ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వైవిధ్యంగా, భిన్నంగా ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అవతలి పార్టీ అభ్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఒక్క ఓటుతోనూ ఓడిన సందర్భాలున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి..’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఇన్‌చార్జీలుగా పనిచేసిన పార్టీ రాష్ట్ర నేతలు, నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ సోమవారం తెలంగాణభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించే దుర్మార్గులు పక్క పార్టీల్లో ఉన్నారు. విపక్ష పార్టీల నేతల తరహాలో బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల దుష్ప్రచారానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఎగిరిపడే వారికి ఎన్నికల ద్వారా సమాధానం చెప్పాలి’అని అన్నారు. బీజేపీది ఓవరాక్షన్.. ‘హుజూర్నగర్ ఎన్నికల్లో బీజేపీ ఓవరాక్షన్ చేసి.. నిన్న మొన్నటిదాకా బిల్డప్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల తర్వా తే హుజూర్‌నగర్‌లో ఎన్నికలు జరగాలని కోరుకుంది. హుజూర్నగర్ ఎన్నిక జరగకుండా బీజేపీ అడ్డుకునే ప్రయ త్నం చేసిందనే సమాచారం ఉంది. హుజూర్నగర్ ఉపఎన్నికతో బీజేపీ ప్రచార పటాటోపం బయటపడింది.’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలు గాలివాటమే అని తేలిపోవడంతో పాటు, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన బలమేమిటో ప్రజలు ఓట్లు వేసి మరీ తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థి సాధించిన ఓట్ల కంటే బీజేపీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. హుజూర్నగర్ ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలమేంటో తేలిపోయింది. స్వయానా టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. ప్రజాభిమానం ముందు ప్రతిపక్షాల ప్రచార ఆర్భాటం చిన్నబోయింది’అని వ్యాఖ్యానించారు. కారు గుర్తును పోలిన చిహ్నాలతో నష్టం ‘హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డికి 50వేలకు పైచిలుకు మెజారిటీ వచ్చేది. పార్టీ చిహ్నం కారు గుర్తును పోలిన ఇతర చిహ్నాలతో నష్టం జరిగింది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాం టి తప్పులు జరగకుండా పరిష్కారం చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెప్తున్నాం. హుజూర్నగర్ ప్రజల రుణం తీర్చుకునేందుకు, ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే సైదిరెడ్డిపై స్థానిక నేతలు ఒత్తిడి తేవాలి. అధికారం, దుర్వినియోగం కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్లోకి వస్తే తీసుకుని పార్టీని బలోపేతం చేయాలి’ అని కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్.. సంస్థాగత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు కృషి చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు. కంచుకోట కాదు.. కరుగుతున్న మంచుకొండ హుజూర్‌నగర్‌ను కాంగ్రెస్ కంచుకోట అంటూ మీడియా ప్రచారం చేసిందని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట.. అక్కడ కరుగుతున్న మంచుకొండ అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల విజయం సీఎం కేసీఆర్ నాయకత్వానికి, కేటీఆర్ వ్యూహానికి దక్కిన ఫలితంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అభివర్ణించారు. ‘కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభం, టీఆర్ఎస్ గెలిస్తే హుజూ ర్‌నగర్ ప్రజలకు లాభం అని కేటీఆర్ ఇచ్చిన నినాదానికి అక్కడి ప్రజలు ఓట్లేశారన్నారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత తెలంగాణభవన్‌లో కేటీఆర్ ఇచ్చిన విందు లో నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు, పార్టీ ఉప ఎన్నిక ఇన్చార్జీలు.. మొత్తం 300 మంది పాల్గొన్నారు. -
ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందే!
రియాధ్: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని భారత్, సౌదీ అరేబియాలు స్పష్టం చేశాయి. సోమవారం రాత్రి రియాధ్ చేరుకున్న మోదీ.. మంగళవారం సౌదీ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో పాటు ప్రభుత్వంలోని విద్యుత్, ఇంధన, కార్మిక, వ్యవసాయ, జల నిర్వహణ.. తదితర శాఖల మంత్రులతో సమావేశమై చర్చలు జరిపారు. సౌదీ రాజు సల్మాన్‌తో ప్రధాని మోదీ భేటీ అనంతరం ఆ వివరాలను భారత విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి టీఎస్ తిరుమూర్తి మీడియాకు వెల్లడించారు. ఆయిల్ అండ్ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. మోదీ పర్యటన సందర్భంగా.. ఆ రంగాలతో పాటు డ్రగ్స్ రవాణా నియంత్రణ, వైమానిక సేవల సంబంధ ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయన్నారు. రెండు దేశాలదీ ఒకే సమస్య ఉగ్రవాదంపై పోరు సహా భద్రతకు సంబంధించిన అంశాల్లో భారత్, సౌదీ అరేబియాల మధ్య సహకారం విజయవంతంగా ముందుకు సాగుతోందని స్థానిక పత్రిక ‘అరబ్ న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు. పొరుగు దేశాల కారణంగా రెండు దేశాలు ఒకేరకమైన భద్రతాపరమైన సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. ‘ఆసియా దేశాల్లో సౌదీ అరేబియా, భారత్‌లు తమ పొరుగు దేశాల నుంచి ఒకే రకమైన భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి’ అని మోదీ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలికి సంబంధించి ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. 2016లో తన పర్యటన సహా ఇరుదేశాల నేతల పర్యటనలతో బంధం మరింత దృఢమైందన్నారు. -
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన పీవీ సింధు
-
వివాదాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల యం ప్రగతి భవన్ ఈ సమావేశానికి వేదిక కానుంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గురువారం సాయంత్రమే వైఎస్ జగన్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రగతి భవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాల సంపూర్ణ వినియోగం, విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల బకాయిలు, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్డ్–9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన తదితర అపరిష్కృత అంశాలపై ఇద్దరు సీఎంలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేసీఆర్, జగన్‌లు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమై సుహృద్భావ వాతావరణంలో చర్చలు నిర్వహించి ఇచ్చిపుచ్చుకునే విధానంలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ, తెలంగాణ అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని, సాధ్యమైనంత త్వరగా విభజన వివాదాలను పరిష్కరించుకోవాలని సీఎంలిద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీకు కేటాయించిన భవనాలకు సంబంధించిన వివాదం పరిష్కృతమైన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన ఏపీ సచివాలయ, అసెంబ్లీ, ఇతర భవనాలను తెలంగాణ స్వాధీనం చేసుకుంది. పరస్పర చెల్లింపులూ జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89%, ఏపీకు 46.11% విద్యుత్ వాటాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడేళ్ల వరకు రెండు రాష్ట్రాలమధ్య విద్యుత్ వాటాల పంపకాలు జరిగాయి. పరస్పరం జరిగిన విద్యుత్ పంపకాలకు సంబంధించిన బిల్లులను ఇరు రాష్ట్రాలు ఒకరికి ఒకరు చెల్లించుకోవాల్సి ఉంది. ఇతర ఆర్థికపర వివాదాలు కలిపితే తెలంగాణ నుంచి రూ.5,200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గతంలో ఏపీ ప్రభుత్వం వాదించింది. ఈ బకాయిలను చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు దివాళ తీసినట్లు ప్రకటించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం జాతీయ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో కేసు సైతం వేసింది. అయితే, రెండు రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన వ్యవహారాలన్నింటినీ పరిష్కరించుకున్న తర్వాత తమకే ఏపీ నుంచి బకాయిలు రావాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదాల స్థితిగతులపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య తాజాగా జరగనున్న సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఈ సమావేశంలో కుదిరే అభిప్రాయం మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యంలు వచ్చే నెల 3న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. నీళ్లు, విద్యుత్ వివాదాలు కీలకం గోదావరి, కృష్ణా జలాల పంపకాలు, మిగులు జలాల సంపూర్ణ వినియోగంపైనే శుక్రవారం జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని అధికావర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపే అవకాశముంది. తెలంగాణలో పనిచేస్తున్న 1,152 మంది ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఇక్కడి విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేయడంతో దాదాపు ఐదేళ్ల కింద ప్రారంభమైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి పరిశీలనలో ఉంది. రిలీవైన ఉద్యోగుల్లో దాదాపు 583 మంది ఏపీకి వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వగా, మిగిలిన వారు తెలంగాణకు ఇచ్చారు. ఈ కేసులో తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకే రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో దాదాపు రూ.240 కోట్ల వరకు ఫీజులు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం సైతం దాదాపు ఇదే మొత్తంలో ఖర్చు చేసి ఉండొచ్చని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
17న తెలంగాణ, ఏపీ సీఎంల చర్చలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరో దఫా చర్చలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం దృష్ట్యా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశం మేరకు శాఖలవారీగా విభజన వివాదాల స్థితిగతులపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య కీలక విషయాల్లో వివాదాలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. గత ఐదేళ్లలో కొన్ని విషయాల్లో తీవ్ర వైరం కొనసాగింది. ఏపీ సీఎంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టాక ఉభయ రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఏపీ, తెలంగాణల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు పర్యాయాలు చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇరువురు సీఎంలు ఉండటంతో అత్యంత సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు సాగాయి. హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటివరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది. ఈ నెల 17న మళ్లీ రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానుండటంతో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. 17న నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 17న ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ నివాస గృహాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి ఆర్ అండ్ బీ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహవాస్తు పూజలు నిర్వహిస్తారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ నేరుగా విజయవాడకు బయలుదేరి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు. -
వ్యాపారుల్ని దొంగలన్నారు
న్యూఢిల్లీ: వ్యాపారులందరూ దొంగలేనని కాంగ్రెస్ పార్టీ అంటోందనీ, గత 70 ఏళ్ల ఆ పార్టీ పాలనలో వ్యాపారులకు అన్నీ అవమానాలే ఎదురయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ధరలు పెరగడానికి వర్తకులే కారణమని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆరోపించేవనీ, అయితే వాస్తవానికి ఆ పార్టీ మనుషులే వస్తువులను నల్లబజారుకు తరలించి ధరలు పెరిగేలా చేసేవారని మోదీ నిందించారు. ఢిల్లీలో పలువురు వ్యాపారులతో మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘వ్యాపారులను దొంగలు అంటూ కాంగ్రెస్ దుర్భాషలాడుతోంది. కానీ జాతిపిత మహాత్మా గాంధీ తాను వ్యాపారుల కులమైన బనియాకు చెందిన వాడినని గర్వంగా చెప్పేవారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులు వెన్నెముక. కానీ గతంలో వారికి లభించాల్సిన గౌరవం ఎన్నడూ దక్కలేదు. కష్టకాలంలో వ్యాపారులకు బాసటగా నిలిచింది బీజేపీ ప్రభుత్వమే’ అని అన్నారు. తనఖా లేకుండానే 50 లక్షల రుణం మళ్లీ ఎన్డీయే అధికారం చేపడితే వ్యాపారులకు ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50 లక్షల వరకు రుణాలిస్తామనీ, జీఎస్టీ వ్యవస్థలో నమోదైన సంస్థలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని మోదీ తెలిపారు. వ్యాపారులకు క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించడం, చిన్న దుకాణాలు నడుపుకునే వ్యక్తులకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు కొత్త చిల్లర వర్తక విధానాన్ని తెస్తామని మోదీ ప్రకటించారు. అలాగే జాతీయ వ్యాపారుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్ తమ ప్రభుత్వ కాలంలో 65 స్థానాలు మెరుగుపరుచుకుని 77వ ర్యాంకు పొందిన విషయాన్ని మోదీ గర్తుచేశారు. స్టార్టప్‌ల్లో 20 వేల కోట్లు పెడతాం.. తమ ఐదేళ్ల పదవీ కాలంలో పురాతన కాలం నాటి 1,500 చట్టాలను రద్దుచేసి వ్యాపారుల జీవితాలను, పనులను సరళతరం చేశామని మోదీ చెప్పారు. ‘వ్యాపారులు దోహదం చేయడం వల్లే ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చగలిగాం. వ్యాపారుల శ్రమ నన్ను ఆకట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ వికసించడానికి వారు సాయపడ్డారు’ అని మోదీ పేర్కొన్నారు. తమ పార్టీ గెలిస్తే యువతను వ్యాపారం వైపు ఆకర్షించేందుకు రూ. 20,000 కోట్లను స్టార్టప్ రంగంలో పెట్టుబడులుగా పెడతామని చెప్పారు. -
ఉద్ధవ్ ఠాక్రేతో ప్రశాంత్ కిశోర్ భేటీ
ముంబై: జనతాదళ్(యు) ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. సేన– బీజేపీ సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో చర్చించిన వివరాలను వెల్లడించేందుకు శివసేన నిరాకరించింది. ‘ఎన్డీఏలో భాగంగానే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మహారాష్ట్రలో మీతో కలిసి పనిచేయాలని ఉంది’ అంటూ ప్రశాంత్ కిశోర్ అంతకుముందు ట్విట్టర్లో పేర్కొనగా ఆయన్ను ముంబైలోని శివసేన కార్యాలయం ‘మాతోశ్రీ’కి ఆహ్వానిస్తూ శివసేన యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాకరే బదులిచ్చారు. ఉద్ధవ్, ప్రశాంత్ కిశోర్‌ల భేటీ ఫొటోలను ఆదిత్య థాకరే ట్విట్టర్లో ఉంచారు. శివసేన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు కేంద్రంలోనూ భాగస్వామిగా ఉంది. -
రాహుల్‌తో ఎంపీ కొండా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న సిద్ధాం తంతోపాటు సెక్యులరిజం నుంచీ టీఆర్ఎస్ దూరం గా వెళ్లిపోయిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల, ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక క్రమంగా వారికి దూర మవుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌ను విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, హరియాణాకు చెందిన ఎంపీ దీపేందర్‌సింగ్ హుడా పాల్గొన్నారు. 15 నిమిషాలు జరిగిన భేటీలో రాష్ట్రంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చి నెరవేర్చని ప్రాజెక్టులు, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని సమస్యలను రాహుల్‌కు ఆయన వివరించారు. కొండా రాకతో పార్టీ బలోపేతం... అనంతరం మీడియాతో కుంతియా మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీతో జట్టుకట్టడం లాంటి అనేక అంశాలపై టీఆర్ఎస్తో విభేదిస్తూ కొండా ఆ పార్టీని వీడారన్నారు. ఈ నెల 23న సోనియా, రాహుల్ సమక్షంలో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరతారని వెల్లడించారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వంపై ప్రస్తుతానికి రాహుల్ హామీ ఇవ్వలేదని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. విశ్వేశ్వర్‌రెడ్డి రాకతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. కేసీఆర్ వద్ద ఉన్న అనేకమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారేనని, వారంతా తమతో టచ్‌లో ఉన్నట్లు వివరించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నంత మాత్రానా టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కాబోదని, ఎంఐఎం కూడా బీజేపీ వంటి మతతత్వ పార్టీయేనని మీడియా ప్రశ్నకు బదులిచ్చారు. ముస్లిం ఓటు ఎంఐఎంకు వెళ్లాలి.. హిందూ ఓటు బీజేపీకి వెళ్లాలి.. అన్నది వారి అవగాహన అని అన్నారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకమైతే.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ తీర్మానాల సమయంలో ప్రతి విషయంలోనూ మద్దతెలా ఇచ్చారని ప్రశ్నించా రు. తెలంగాణలో 9 నెలల ముందుగానే ఎన్నికలు జరపాలన్నది ఓ పథకం ప్రకారం చేశారని, తద్వారా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్డీయేలో చేరా లన్నది టీఆర్ఎస్ వ్యూహమని అన్నారు. ప్రజలకు దూరమైన టీఆర్ఎస్... టీఆర్ఎస్ సైద్ధాంతిక మార్పులకు లోనైందని. అం దుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న అసలు సిద్ధాంతాన్ని, సెక్యులరిజాన్ని పక్కకు పెట్టిందన్నా రు. చేవెళ్ల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం రాహుల్‌ని కలిశానని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. వికారాబాద్‌ను శాటిలైట్ సిటీ చేస్తామని, తాండూరు సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని వీటన్నింటినీ నెరవేర్చాలని కోరా నన్నారు. రాష్ట్రంలోని సాగునీరు, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలపై భేటీలో చర్చించామన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత టీఆర్ఎస్ ప్రాథమిక ఓటర్లని, ప్రస్తుతం వీరంతా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పూర్తిగా సైద్ధాంతిక మార్పు కు లోనైందని, దీన్ని సహించలేకే పార్టీ వీడినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ చేయని వాటిని కాంగ్రెస్ ద్వారా సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి రాజీనామాపై స్పందిస్తూ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఇస్తానని పేర్కొన్నారు. మహేందర్‌రెడ్డితో నాలుగేళ్లుగా విభేదాలు.. మంత్రి మహేందర్‌రెడ్డితో వ్యక్తిగత విభేదాలు పార్టీలో చేరినప్పటి నుంచి ఉన్నాయని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దాని కోసమే అయితే ఇప్పుడు పార్టీ వీడాల్సిన అవసరం లేదని, ఆ పని నాలుగేళ్ల ముందే చేసేవాడినని తెలిపారు. చిన్నచిన్న వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడేవాడి ని కాదన్నారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో సీఎం మంచిగా ఉండేవారని, అందుకే పలు ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా తక్కువని, అదే కాంగ్రెస్‌లో ఆ వీలు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించగా, గురువారం నిర్వహించబోయే విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వివరిస్తానని చెప్పారు. -
ఆంటోనీతో భేటీ అయిన ఖమ్మం కాంగ్రెస్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్ బుధ వారం ఢిల్లీలో పార్టీ కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీని కలిశారు. జిల్లాలో మెజారిటీ సీట్లను పొత్తులో భాగంగా టీడీపీ, సీపీఐలకే కేటాయిం చారని, ఇతర నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్‌కు సేవచేస్తున్న వారిని విస్మరించారని తెలిపారు. దీనిపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, సీట్ల కేటాయింపులో అధిష్టానంతో తేల్చుకోవాలని కోరుతున్నారన్నారు. సమస్యను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరిస్తానని, అప్పటివరకు వేచిచూడమని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెం టు నియోజకవర్గం పరిధిలో బీసీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిరాహార దీక్షకు దిగారు. షాద్‌నగర్ నుంచి కడియంపల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవర కద్ర నుంచి ప్రదీప్‌గౌడ్‌లు దీక్షలో పాల్గొన్నారు. -
డ్రీమ్ గాళ్‌తో హాట్ గాళ్
ఎవరైనా సెలబ్రిటీని కలిసే అవకాశం వస్తే ఓ ఫొటోనో లేదా సెల్ఫీనో దిగడానికి ఆశపడతాం. సెలబ్రిటీలు కూడా తమకు నచ్చిన తారలను కలిస్తే? వాళ్లూ కచ్చితంగా అదే చేస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ హాట్ గాళ్‌గా యూత్‌ని ఆకర్షించారు. కానీ ఆమె ఈరోజు ఈ స్టేజ్‌కి రావడానికి గల కష్టం వెనక ఓ డ్రీమ్‌గాళ్ ఉన్నారట. ఆవిడే కరీనా కపూర్. ఇటీవల పాయల్‌కి తన డ్రీమ్గాళ్ని కలుసుకునే ఛాన్స్ దొరికింది. దాంతో వెంటనే కరీనాతో ఓ సెల్ఫీ దిగి ‘‘కల నిజమైంది. నా డ్రీమ్‌గాళ్ కరీనాను కలుసుకున్నాను. ఇది నెరవేరడానికి పదేళ్లు పట్టింది. నేను యాక్టర్ అవ్వడానికి కరీనానే కారణం. తను నాకు ఇన్స్పిరేషన్’’ అని అన్నారు. ∙కరీనాతో పాయల్ -
నీవు చల్లగుండాలయ్యా....
ఎండనక వాననక కాలినడకన జనం మధ్యలో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు పెద్దల ఆశీర్వాదాలందుతున్నాయి. పాదయాత్ర పొడవునా పెద్దలు తమదైన శైలిలో జగన్‌ను ఆశీర్వదిస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చున్నా చెల్లిపోయే జీవితం అయినా జనం కోసం కాలినడకన ముందుకు వస్తున్నారంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పాదయాత్రగా జగన్ జగ్గంపేట వైపు వెళ్తుండగా ఆటోలో కాలికి గాయమైన ఓ పెద్దాయన జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. రెండు చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న జగన్‌ను చూసిన పెద్దాయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. -
సోనియా గాంధీతో కమల్ భేటీ
-
రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం కేసీఆర్ భేటీ
-
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ
-
ముద్రగడకు పెరుగుతున్న మద్దతు
కిర్లంపూడికి తరలివచ్చిన పలువురు నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పద్మనాభం పిలుపు కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ స్వగృహానికి మంగళవారం తూర్పు ,పశ్చిమగోదావరి జిల్లాల నుండి భారీ సంఖ్యలో కాపు నాయకులు, మహిళలు, పలువురు అభిమానులు , ఎస్సీ, బీసీ కులాలకు చెందిన నాయకులు ముద్రగడ ఇంటికి భారీగా తరలివచ్చి ముద్రగడకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ముద్రగడ చేసే ఉద్యమానికి రిజర్వేషన్ సాధించే వరకు తమ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు కాపునాయకులు, మహిళా నాయకులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన కాపులను మహిళలను ఉద్ధేశించి ముద్రగడతో పాటు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, తోట రాజీవ్ , ఆరేటి ప్రకాశ్, గౌతు స్వామి, జీవీ రమణ, తుమ్మలపల్లి రమేష్ తదితరులు మాట్లాడుతూ కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల సమయంలోనూ, మేనిఫెస్టోలోనూ కాపులకు ఇచ్చిన హామీలనే తప్ప అదనంగా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ముద్రగడ పాదయాత్ర ఆగదని ఇచ్చిన హామీలను సాధించుకునే వరకు ఉద్యమం తీవ్రతరం చేయాలని కాపునాయకులకు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ముద్రగడను కలిసేందుకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, తణుకు, తూర్పు గోదావరి జిల్లా నుండి రాజోలు, కత్తిపూడి, గొల్లప్రోలు , రాయవరం , కొత్తపేట , కాకినాడ, కరప, ఉలిమేశ్వరం, విజయనగరం జిల్లా నుంచి భారీ సంఖ్యలో కాపు నాయకులు మహిళలు తరలివచ్చారు. ఆయన కలిసిన వారిలో మలకల చంటిబాబు, నర్సే సోమేశ్వరరావు, మాకా శ్రీనివాసరావు, గుండుబోగుల నాగు, మారిశెట్టి అజయ్, కొత్తపల్లి సుబ్బలక్ష్మి, పెన్నాడ సూరిబాబు, గౌతు సుబ్రహ్మణ్యం, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సంగిశెట్టి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబి, అడబాల శ్రీను, తోట బాబు, తూము చినబాబు, ఆడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
కంటి చూపు ఇప్పించండి
డిప్యూటీ సీఎంను వేడుకున్న బాధితులు న్యాయం చేస్తామని రాజప్ప హామీ పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్‌కు ఆదేశం శిబిరాల నిర్వహణలో ప్రభుత్వ వైద్యులు ఉండేలా ఆదేశాలు ఇచ్చేందుకు చర్యలు వేట్లపాలెం (సామర్లకోట) : పోయిన కంటి చూపు వచ్చేలా వైద్య పరీక్షలు చేయించాలని బాధితులు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను వేడుకున్నారు. బుధవారం వేట్లపాలెంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి రాజప్ప ఆ గ్రామ సర్పంచ్ వల్లూరి శేషవేణి స్వగృహం వద్ద లయన్స్ క్లబ్ ఆస్పత్రి నిర్వహించిన శస్త్ర చికిత్సల్లో చూపు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ నెల 4న సాక్షి దినపత్రిక ‘చీకటి నింపిన శస్త్ర చికిత్స’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు, రాజకీయ నాయకులు వారి వద్దకు వచ్చి పరిస్థితి తెలుసుకొంటున్నారు. ఈ సందర్భంగా కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న రామిశెట్టి సత్యవతి, కుప్పాల కృపారావు, చిట్టూరి సత్యనారాయణ, బావిశెటి రాంబాయి, గొడత రామకృష్ణ, బొండాడ సత్యానందం తమకు కంటి చూపు వచ్చేలా చేయాలని డిప్యూటీ సీఎం రాజప్పను వేడుకున్నారు. కంటి చూపు పోవడానికి గల కారణాలను గ్రామ ఉపసర్పంచ్ వల్లూరి శ్రీనివాసు రాజప్పకు వివరించారు. ఈ మేరకు బాధితులకు న్యాయం చేస్తామని రాజప్ప హామీ ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఏప్రిల్ 13న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి శిబిరంలో వేట్లపాలేనికి చెందిన వారు 10 మంది శస్త్ర చికిత్సలు చేయించుకున్నారని వారిలో 8 మందికి కళ్లు కనిపించడం లేదన్నారు. వారి సమస్యపై కాకినాడలోని ప్రభుత్వ వైద్యాధికారులతో చర్చించామని, బాధితులకు మెరుగైన వైద్యం చేయించి కంటి చూపు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా కలెక్టరును ఆదేశించామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు జరిగే సమయంలో సంబందిత ప్రభుత్వ వైద్యులు హాజరు కాక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. శిబిరాలు జరిగే సమయంలో ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా ఉండేలా ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి పాల్గొన్నారు. -
సీఎం అనుమతి తీసుకున్నట్టు ఆధారం చూపితే నేను తీసుకుంటా
– కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం –మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పరామర్శించిన ‘ముద్రగడ’ తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : ముఖ్యమంత్రి చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో అనుమతి తీసుకున్నట్టు ఆధారాలు చూపితే తానూ అనుమతి కోసం దరఖాస్తు చేస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం అన్నారు. గురువారం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. గరగపర్రు సంఘటన బాధాకరమని అన్నారు. అంబేడ్కర్‌ను ప్రపంచం మేధావిగా గుర్తించిందని మర్చిపోకూడదని అన్నారు. పాదయాత్రకు అనుమతి విషయమై ఆయన మాట్లాడుతూ సమాధానం ఇస్తూ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడని, ఆలాగే వైఎస్ రాజ శేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారని, సీపీఎం నాయకులు నారాయణ కూడా పాదయాత్రలు చేశారని వీరందరూ అనుమతి తీసుకొని చేశారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రజలకు అండగా ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన జీవి హర్ష కుమార్‌ను ముద్రగడ అభినందించారు. -
పాదయాత్రకు సీఎం అనుమతి తీసుకున్నట్టు ఆధారం చూపితే నేను తీసుకుంటా
– కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం –మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పరామర్శించిన ‘ముద్రగడ’ తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : ముఖ్యమంత్రి చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో అనుమతి తీసుకున్నట్టు ఆధారాలు చూపితే తానూ అనుమతి కోసం దరఖాస్తు చేస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం అన్నారు. గురువారం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. గరగపర్రు సంఘటన బాధాకరమని అన్నారు. అంబేడ్కర్‌ను ప్రపంచం మేధావిగా గుర్తించిందని మర్చిపోకూడదని అన్నారు. పాదయాత్రకు అనుమతి విషయమై ఆయన మాట్లాడుతూ సమాధానం ఇస్తూ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడని, ఆలాగే వైఎస్ రాజ శేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారని, సీపీఎం నాయకులు నారాయణ కూడా పాదయాత్రలు చేశారని వీరందరూ అనుమతి తీసుకొని చేశారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రజలకు అండగా ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన జీవి హర్ష కుమార్‌ను ముద్రగడ అభినందించారు. -
చిరునవ్వుతో రోగాలను జయించండి
కలెక్టర్ కార్తికేయమిశ్రా కేన్సర్ రోగులకు పరామర్శ మాధవపట్నం (సామర్లకోట) : రోగులకు చిరునవ్వే జీవితంలో వెలుగు నింపుతుందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. ప్రపంచ కేన్సర్ సర్వైవర్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రిలో రోగులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ చేయించుకునే సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. సూర్య గ్లోబుల్ ఆస్పత్రిలో మంచి వైద్యులు ఉన్నారని, రోగులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తనకు సమాచారం ఇచ్చి తగిన సహాయం పొందాలన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని, ఆపరేషన్లు చేయించుకున్న వారిని పరామర్శించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో ఆపరేషన్లు చేసిన ఆస్పత్రిగా పేరు పొందింది. దాంతో కలెక్టర్ సూర్య గ్లోబల్ హాస్పటల్‌ను సందర్శించారు. కేన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన పనిలేదని, నేడు అనేక మందులు వచ్చాయని కలెక్టరు సూచించారు. కేన్సర్ వ్యాధి రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హాస్పటల్ చైర్మన్ డాక్టర్ బీహెచ్పీఎస్ వీర్రాజు మాట్లాడుతూ గత 14 ఏళ్లలో 10 వేల మందిని కేన్సర్ వ్యాధి నుంచి విముక్తి చేయగా సుఖంగా జీవిస్తున్నారన్నారు. ఏటా కేన్సర్ సర్వైవర్స్డే సందర్భంగా వివిధద మండలాలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు వీర్రాజు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కేన్సర్ చికిత్స, నివారణార్థం ఆధునిక పరికరాలు కలిగి ఉన్నట్టు తెలిపారు. రేడియేషన్‌లో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొట్టమొదటి ‘ రేపిడ్ ఆర్క్’ అనే ఆధునిక యంత్రం ద్వారా రేడియేషన్ అందిస్తున్న ఏకైక హాస్పటల్‌గా గుర్తింపు పొందడం ఎంతో గర్వంగా ఉందని వీర్రాజు పేర్కొన్నారు. దాదాపు 50 వేల మందికి కేన్సర్‌పై అవగాహన కల్పించామన్నారు. కేన్సర్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా 85 శాతం రోగులకు చికిత్స అందిస్తున్నామని వివరిం చారు. కేన్సర్ చికిత్స కొస మెడికల్, సర్జికల్, రేడియేషన్ మూడు విభాగాలు కలిగిన పుల్ టైమ్ కన్సల్టెన్స్ ఉన్న హస్సటల్గా ఉభయ గోదావరి జిల్లాలో గుర్తింపు పొందిన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరు హస్పటల్లో సుమారు గంట సమయం వెచ్చించి ప్రతీ రోగిని వివరాలు అడిగి తెలుసుకు న్నందుకు వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు ఏవీ సురేష్, వై. ప్రశాంత్, నరసింహరెడ్డి, వై. స్వాతి, పీఆర్వో సురేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులతో భేటీ అయిన పళనిస్వామి
-
కిడ్నీరోగులకు వైద్యం కోసం మోదీకి వినతి
-
గవర్నర్‌తో ముగిసిన పళనిస్వామి భేటి
-
పన్నీర్‌తో భేటీ కానున్న స్టాలిన్
-
ప్రణబ్‌తో ఇండోనేషియా అధ్యక్షుడు భేటీ
-
మంత్రి కేటీఆర్‌తో అమెరికా డెలిగెట్స్ భేటీ
-
మరో అఖిలేశ్ వికెట్ ఔట్!
- సీఎం సన్నిహితుడిపై ఆరేళ్ల బహిష్కరణ - గవర్నర్‌ను కలిసిన అఖిలేశ్ లక్నో: కలహాలు లేవంటూనే.. యాదవ్ కుటుంబంలో అంతర్గతంగా తీవ్ర యుద్ధం జరుగుతోంది. బుధవారం యూపీ సీఎం అఖిలేశ్ సన్నిహితుడు, మంత్రి పవన్ పాండేను సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. దీనిపై సీఎం క్యాంపులో అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ రామ్‌నాయక్‌ను అఖిలేశ్ హుటాహుటిన కలసి 15 నిమిషాలు ఏకాంతంగా చర్చించడం యూపీ రాజకీయాల్లో కలకలం రేపింది. అఖిలేశ్ వర్గానికి దెబ్బే..: యూపీ సహాయ మంత్రి తేజ్‌నారాయణ్ పాండే(పవన్ పాండే)ను క్రమశిక్షణారాహిత్యం వల్ల పార్టీనుంచి ఆరేళ్లు బహిష్కరించారు. ఈ విషయాన్ని శివ్‌పాల్ తెలిపారు. రెండ్రోజుల క్రితం సీఎం అధికారిక నివాసంలో అశు మాలిక్ అనే ఎమ్మెల్సీని(అమర్‌సింగ్ వర్గం) పవన్ చెంపదెబ్బ కొట్టారు. అశు తనకు వ్యతిరేకంగా వార్తలు వేయిస్తున్నారంటూ అఖిలేశ్ ఆగ్రహంగా ఉన్నారు. పవన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా సూచించామని శివ్‌పాల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుకోసం ఆర్ఎల్డీ, కాంగ్రెస్‌లతో చర్చిస్తున్నట్లు శివ్‌పాల్ తెలపగా.. ఇంతవరకు అటువంటి చర్చలేం జరగలేదని కాంగ్రెస్ పేర్కొంది. గవర్నర్‌తో..: పవన్‌పై వేటు పడిన వెంటనే అఖిలేశ్.. గవర్నర్ రామ్‌నాయక్‌ను కలిశారు. ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారని, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు సమావేశమయ్యారని రాజ్‌భవన్, ఎస్పీ వర్గాలు తెలిపాయి. అయితే.. అసలు కారణం వేరని, తన అనుకూల ఎమ్మెల్యేల జాబితాను అడిగిన గవర్నర్‌కు జాబితా ఇచ్చి పరిస్థితిని వివరించేందుకే అఖిలేశ్ కలిశారనే ప్రచారం జరుగుతోంది. తనకింకా అసెంబ్లీలో మెజారిటీ ఉందని చెప్పుకునేందుకే భేటీ జరిగిందని తెలుస్తోంది. అంతకుముందు తన వర్గ యువనేతలు, కార్యకర్తలతో అఖిలేశ్ సమావేశమయ్యారు. పార్టీలో గొడవలు పక్కనపెట్టి.. రథయాత్ర, పార్టీ రజతోత్సవాలపై దృష్టి పెట్టాల న్నారు. సోషలిస్టు పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ములాయం ఢిల్లీ వెళ్లారు. శివ్‌పాల్‌కు అర్థమైంది!: తొలగించిన మంత్రులను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని అఖిలేశ్ ములాయంతో జరిపి భేటీలో చెప్పారు. దీంతో తనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాల్లేవని అర్థం చేసుకున్న శివ్‌పాల్.. తన అధికారిక వాహనాలను వెనక్కి ఇచ్చేశారు. -
గవర్నర్‌ను అఖిలేష్ ఎందుకు కలిశారు?
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీలో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. తమ కుటుంబం, పార్టీ ఐక్యంగా ఉందని పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, రాష్ట్ర పార్టీ నాయకుడు శివపాల్ యాదవ్ సమక్షంలో ప్రకటించి 24 గంటలు కూడా కాకముందే బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి తేజ్ నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేను పార్టీ నుంచి బహిష్కరించారు. ములాయం సింగ్ యాదవ్ అనుచరుడు, ఎమ్మెల్సీ ఆశు మాలిక్‌పై పార్టీ సమావేశంలో చేయిచేసుకున్నందుకుగాను పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ శివపాల్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. తాజా పరిణామం నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ హడావుడిగా రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్‌ను కలసుకోవడంతో పార్టీ చీలిపోతుందన్న ఊహాగానాలు మళ్లీ బయల్దేరాయి. పార్టీ చీలిపోతే అటు ములాయం, శివపాల్ యాదవ్ వర్గానికే కాకుండా ఇటు అఖిలేష్ యాదవ్ వర్గానికి కూడా కోలుకోని నష్టం జరుగుతోందని, అలాంటప్పుడు పార్టీపైనా ఆధిపత్యం కోసం అధికారం కోల్పోయే ప్రమాదాన్ని ఎవరు మాత్రం కొని తెచ్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీకి ఓ రూపు తీసుకొచ్చి అధికారం పీటంపై కూర్చోపెట్టడం వెనక ములాయం సింగ్ యాదవ్‌తోపాటు శివపాల్ యాదవ్ పాతికేళ్ల కృషి ఉంది. అలాంటి పార్టీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా తమ మీద ఉందని వారు భావిస్తున్నారు. అయితే పార్టీ పట్టింపులు, పంతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని అభివద్ధి పంథాలో నడిపించాలనే ఉద్దేశంతో అఖిలేష్ యాదవ్ వర్గం ముందుకు పోతోంది. ఈ తరుణంలో పార్టీ వృద్ధ నాయకులు తీసుకుంటున్న చర్యలు తమకు ప్రతిబంధకం అవుతున్నాయని ఆ వర్గం భావిస్తోంది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ములాయం, శివపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరగడంతో, రానున్న ఎన్నికల్లో ఈసారి తన ఆధ్వర్యంలోనే అభ్యర్థుల ఎంపిక జరగాలనే లక్ష్యంతో పార్టీపైనా అఖిలేష్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. యువతరం మద్దతు కలిగిన అఖిలేష్ వృద్ధతరమే దారికొస్తుందని భావించారు. కానీ రావడం లేదు. ఇరువర్గాలు ఒకరిపై, ఒకరు వేటు వేసుకుంటూనే ఉన్నాయి. నిజంగా పార్టీ విడిపోయినట్లయితే సమజ్‌వాది పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి అండగా నిలుస్తున్న యాదవులు, ముస్లింలు పార్టీకి దూరం అవుతారని, బీజేపీని అడ్డుకోవాలనే ఉద్దేశంలో ముస్లింలు బహుజన సమాజ్ పార్టీకి వెళతారని, యాదవ్‌లు బీజేపీవైపు వెళతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాహుల్‌తో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీతో తన వర్గం కలసి పోటీ చేస్తే రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని, అలా జరిగినట్లయితే తన పార్టీలో తాను తిరుగులేని యువనేత ఎదుగుతానని అఖిలేష్ భావిస్తున్నారు. అయినా ఆయన గవర్నర్‌తో ఎలాంటి చర్చలు జరిపారనే విషయంపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
గవర్నర్, సీఎం ఏకాంత చర్చలు
-
అమెరికా పర్యటనలో తొలిరోజు కేటీఆర్ బిజీబిజీ
-
జైట్లీ, ఉర్జిత్ పటేల్ భేటీ
న్యూఢిల్లీ: మానిటరీ పాలసి రివ్యూ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తో భేటీ అయ్యారు. అక్టోబర్ 4 న ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనున్న క్రమంలో గురువారం ఆర్థిక మంత్రిని కలిశారు. ఆర్బీఐ గవర్నర్ గా సెప్టెంబర్ 4న పదవీ బాధ్యతలు చేపట్టిన ఊర్జిత్ కు గవర్నర్ గా ఇదే తొలి ద్రవ్య విధాన సమీక్ష . దీంతో రాబోయే ద్రవ్య విధాన సమీక్షపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటీపై పటేల్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.ఆర్ధికవృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే లక్ష్యంతో 2015 నుంచి ఇప్పటివరకూ 150 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించింది. ఈ సారి రివ్యూలో కూడా వడ్డీ రేట్ల కోత వుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం గత వారం మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు నియామకాన్ని కూడా పూర్తిచేసింది. అయితే తాజా వడ్డీరేట్లను గవర్నర్ నిర్ణయిస్తారా..లేకఎంపీసీ కమిటీ నిర్ణయిస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల కేంద్ర బ్యాంకు అధిపతిగా పదోన్నతి పొందిన ఉర్జిత్ పటేల్ స్థానంలో ఆర్ బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ ఎంపిక కోసం కసరత్తు మొదలు పెట్టింది. ఈ పదవి భర్తీకి ఆర్థిక శాఖ దరఖాస్తులు కోరుతోంది. కనీసం 25 సంవత్సరాలు , 60 సంవత్సరాల గరిష్ట వయస్సు ఉండాలని, ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 21లోపు దరఖాస్తు చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం ప్రభుత్వం కార్యదర్శి లేదా సమానమైన స్థాయిలో అనుభవం సహా, ప్రభుత్వ పరిపాలనలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలని తెలిపింది. ప్రస్తుతం నలుగురు డిప్యూటీ గవర్నర్లకు గాను , ఆర్. మహాత్మా గాంధీ, ఎస్ ఎస్ ముంద్రా,ఎన్ ఎస్ .విశ్వనాథన్ ముగ్గురు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు. -
పతకవీరులను కలుసుకున్న మోదీ
-
మరోసారి మోదీ,ఒబామా భేటీ
-
ఆప్యాయత.. ఓదార్పు
బస్సు ప్రమాద బాధితులకు వై.ఎస్.జగన్ భరోసా బాధను విన్నవించుకున్న క్షతగాత్రులు సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పలు ప్రమాదాల్లో బాధితులను పరామర్శిస్తూ.. నేనున్నానంటూ వారికి భరోసా ఇస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. జిల్లాలో జరిగిన పలు ప్రమాద ఘటనల్లో మృత్యువాతపడిన వారి కుటుంబాలకు ఆయన ఆప్యాయతాను రాగాలను పంచారు. 2012, మార్చిలో కొత్తగూడెం మండలానికి చెందిన ఎల్.వి.రెడ్డి స్కూల్ బస్సు పెద్దవాగు వద్ద ప్రమాదానికి గురికాగా.. 8 మంది చిన్నారులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న జగన్.. చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు మార్చి 22న జిల్లాకు వచ్చారు. ఆ ప్రమాదంలో మృతిచెందిన వారంతా చండ్రుగొండ మండలానికి చెందిన చిన్నారులు కావడంతో ఆయన ప్రతి చిన్నారి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను ఓదార్చి.. అక్కున చేర్చుకున్నారు. చిన్నారుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్‌కు సైతం అదే రీతిన ఆదరణ లభించింది. ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో మృతిచెందిన పలువురు అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు సైతం 2010లో ఆయన జిల్లాకు వచ్చారు. పలు ప్రాంతాల్లో మృతిచెందిన వైఎస్ఆర్ అభిమానుల కుటుంబాలను పరామర్శించి.. ఓదార్చారు. వారి ఆప్యాయతానురాగాలను జగన్‌పై కురిపించి తమ ఇంటి బిడ్డగా భావించారు. తాజా ఘటనలోనూ... కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద సోమవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనలోనూ 10 మంది మృతిచెందగా.. 21 మంది గాయాలపాలయ్యారు. సంఘటన విషయం తెలుసుకున్న జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి తొలుత సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న అనంతరం ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. వారిని వివరాలు అడిగి తెలుసుకుంటూ.. గాయాలు ఎక్కడయ్యాయో.. వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకుంటూనే వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రతి క్షతగాత్రుడి బెడ్ వద్దకు వెళ్లి వారితోపాటు కూర్చుని.. చెరగని చిరునవ్వుతో పలకరిస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తమ వద్దకు వచ్చి స్వయంగా పలకరిస్తూ.. అందరినీ పరామర్శించడంతో క్షతగాత్రులు సైతం తమ బాధను మరిచిపోయి ఆయనకు తమ బాధను విన్నవించుకున్నారు. తమను ఆదుకోవాలని కోరిన క్షతగాత్రులకు అండగా ఉంటానని ఆయన భరోసానిచ్చారు. సంఘటన గురించి తెలుసుకుని వెంటనే స్పందించి తమ వద్దకు వచ్చి ఓదార్చడం పట్ల బాధితులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. -
బీసీసీఐ ప్రెసిడెంట్‌ను కలిసిన టీసీఏ ప్రతినిధులు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వాలని కో రుతూ రాష్ట్ర ప్రతినిధి బృందం సభ్యులు బుధవారం ఢిల్లీలో బీసీసీఐ (బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ అనురాగ్ సింగ్ఠాకూర్ను కలిశారు. ఈ సందర్భంగా గత 65 ఏళ్లుగా తెలంగాణ క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్‌కు వివరించినట్లు టీసీఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి తెలిపారు. ఈ మేరకు అనురాగ్‌సింగ్ సానుకూలంగా స్పందించి తెలంగాణ క్రికెటర్లను రంజిస్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌ను కలిసిన వారిలో టీసీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లపెల్లి జయపాల్, సభ్యులు వీరేష్, నరోత్తమరెడ్డి, చంద్రసేన్‌రెడ్డి, నయీం, శ్రావన్, మహేష్‌లు ఉన్నారు. -
ఏపీ సిఎస్‌ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
'సోలార్ మమ్మాస్' తో మోదీ భేటీ
ప్రధాని నరేంద్రమోదీ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా టాంజానియాలోని 'సోలార్ మమ్మాస్' తో భేటీ అయ్యారు. దారాస్ సలాస్ లోని అధ్యక్షభవనం సందర్శించిన అనంతరం ఆయన సౌర శక్తికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌర లాంతర్ల వినియోగం, మరమ్మత్తులపై అక్కడ శిక్షణ పొందిన మహిళలతో చర్చిచారు. టాంజానియా పర్యటనలో భాగంగా సోలార్ మామాస్ తో భేటీ అయిన నరేంద్ర మోదీ... వారి శిక్షణా కార్యక్రమాల్లోని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరు దేశాలకు చెందిన 30 మంది గ్రామీణ మహిళలు శిక్షణ పొందుతున్న శిబిరంలో సౌర లాంతర్ల వినియోగం, మరమ్మత్తులపై ఆరా తీశారు. భారత్ సహాయ సహకారాలతో సౌర విద్యుత్ ఉత్పత్తిపై 'సోలార్ మామాస్' శిక్షణ తీసుకుంటారు. ఆఫ్రికాలోని వివిధ దేశాలకు చెందిన సోలార్ ఇంజనీర్లకు అక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ శిక్షణ పొందుతున్న ఆఫ్రికన్ మహిళలను పలుకరించిన మోదీ... వారి నైపుణ్యాలు, సౌకర్యాలు వంటి అనేక విషయాలను గురించి వివరాలు తెలుసుకున్నారు. మోదీ సమావేశంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలు వారు తయారు చేసిన సోలార్ వస్తువులను మోదీకి చూపించారు. దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వారికి టాంజానియా లోని ప్రత్యేక కేంద్రంలో రాజస్థాన్ బేర్ ఫూట్ కళాశాల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. -
'ముద్రగడ ఉద్యమానికి అండగా ఉంటాం'
కాకినాడ: వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు శుక్రవారం కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించారు. మద్రగడ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన అన్నారు. చంద్రబాబుకు తల పొగరెక్కి, ఎవరినైనా అణచివేయాలని చూస్తున్నారని అంబటి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని తెలిపారు. ముద్రగడ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ముద్రగడ ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ర్టంలో పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. ఈ నెల 27 నుంచి ఏపీ నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడికి సచివాలయాన్ని,శాఖాధిపతులను తరలించి పరిపాలన కొనసాగించేందుకు చేపట్టిన చర్యలు , తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష, అనంతర పరిణామాలు తదితరాల గురించి గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. -
'భారత్‌లో పెట్టుబడులే మాకు ఆసక్తి'
న్యూఢిల్లీ: భారత్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నామని ఆస్ట్రియా విదేశాంగమంత్రి సెబాస్టియన్ క్రూజ్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ , ఆస్ట్రియా విదేశాంగ మంత్రి సెబాస్టియన్ క్రూజ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశం ద్వారా యూరప్‌తో తమ సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ ముందడుగు వేయనుందని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ, విద్యుత్, సహజవాయువుశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతో కూడా క్రూజ్ సమావేశం కానున్నారు. అనంతరం గురువారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను, ప్లాన్సీ ఇండియా మెటీరియల్ సంస్థ(మైసూర్)ను సందర్శించనున్నారు. ఈ సంవత్సరం జరగబోయే యూరోపియన్ యూనియన్(ఈయూ), ఇండియా సమావేశం, సమావేశ ప్రాముఖ్యతను గురించి మంగళవారం నాటి సమావేశంలో చర్చించారు. -
కాపు ఉద్యమంలో నిజాయితీ ఉంది: దాసరి
తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ప్రముఖ సినీ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం ఆయన కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పరామర్మించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... ముద్రగడ రాసిన లేఖకు చంద్రబాబు నాయుడు అప్పుడే స్పందించి ఉంటే..సమస్య ఇంత వరకూ వచ్చేది కాదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను కాపులు నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాపు ఉద్యమంలో నిజాయితీ ఉందని...చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం కాపు కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్లు ఇవ్వడంతో పాటు కాపులను బీసీల్లో చేర్చాలని దాసరి డిమాండ్ చేశారు. ముద్రగడతో ప్రభుత్వం జరిపిన చర్చల అనంతరం సోమవారం దీక్ష విరమించిన విషయం తెలిసిందే. -
అరేయ్ వెంకటేశం.. మనోళ్లందరినీ తీస్క రారా
చిన్ననాటి మిత్రులను ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్ ఫాంహౌస్‌కు రావాలంటూ ఆహ్వానం దుబ్బాక: ‘‘అరేయ్ వెంకటేశం.. మన దోస్తులందరినీ ఫామ్‌హౌస్‌కు తీస్క రారా.. అందరం కలసి సమావేశమవుదాం... నాయి, మీయి సాదకబాధకాలపై మాట్లాడుకుందాం’ అంటూ తన చిన్ననాటి మిత్రుడైన బొమ్మెర వెంకటేశంను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. సోమవారం మెదక్ జిల్లా దుబ్బాకకు వచ్చిన ఆయన బాలాజీ దేవాలయంలో జరిగిన పూర్వ మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువులను, చిన్ననాటి మిత్రులను సీఎం కలుసుకున్నారు. చిన్ననాటి మిత్రులతో కేసీఆర్ గంటపాటు సమావేశమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో వారంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. గురువులకు పాదాభివందనం చిన్నతనంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు సీఎం పాదాభివందనం చేశారు. పాఠశాల మిత్రులు, తన గురువులు.. ఇలా అందరినీ కలుసుకోవడం అపురూప ఘట్టమని సీఎం అన్నారు. తన క్లాస్మేట్ బొమ్మెర వెంకటేశం కనపడగానే ఆప్యాయంగా పలకరించారు. ‘బాగున్నావురా వెంకటేశ్...? పిల్లలేం చేస్తున్నరు? దోస్తులందరినీ నువ్వే ఫామ్‌హౌస్‌కు తీస్క రావాలె’ అని అన్నారు. చిన్ననాటి మిత్రులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను ఉన్నానన్న విషయాన్ని మరిచిపోవద్దంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ గురువులు గన్నె బాల్‌రెడ్డి, మిత్రులు రాజయ్య, నల్ల నాగరాజం, వెంకట్రాములు, అమ్మన చంద్రారెడ్డి, వేణుగోపాల్‌రావు, గుండెల్లి వెంకట్‌రెడ్డి, గోవిందం, సాయి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో కలియతిరుగుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాకలో తాను చదుకున్న పాఠశాలలో సోమవారం కలియతిరిగారు. చిన్ననాటి ఫొటోలను తిలకిస్తూ.. మిత్రులను పలకరిస్తూ మధురమైన గత స్మృతులను గుర్తుతెచ్చుకున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి దుబ్బాక వచ్చారు. తాను చదువుకున్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకోగానే పురోహితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ చిన్ననాడు చదివిన ప్రభుత్వ పాఠశాల, నూతనంగా నిర్మించే నమూనా భవనం, చిన్ననాటి తన ఫొటోలను కాసేపు తిలకించారు. అనంతరం దుబ్బాక బాలాజీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే సమీక్షా సమావేశానికి వెళ్లారు. -
ఏపీ ఎంపీలతో రైల్వే జీఎం సమావేశం
-
షారుక్ కుమారున్ని కలిసిన 'ఛోటా భీమ్'
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు అబ్రామ్ కోరిక నెరవేరింది. అబ్ రామ్‌కి ఎంతగానో ఇష్టమైన 'ఛోటాభీమ్' క్యారెక్టర్ సృష్టికర్త గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈఓ రాజీవ్ చిలకను తన నివాసంలో కలుసుకున్నాడు. రాజీవ్, షారుక్ కుమారుడి కోసం ఒక బొమ్మను గిఫ్ట్ గా తీసుకువచ్చాడు. పిల్లలు ఛోటా భీమ్ కార్యక్రమాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని షారుక్ తెలిపారు. మరోవైపు ఛోటా భీమ్ కార్యక్రమం పిల్లలు చూడవలసిన ఒక మంచి కార్యక్రమమని నటి కాజల్ కూడా ప్రశంసించారు. రాజీవ్ తదుపరి కార్టూన్ ప్రోగ్రామ్ 'చోటాభీమ్-హిమాలయన్ ఆడ్వెంచర్' జనవరి 8న విడుదల కానుంది. సరోగసి ద్వారా షారుఖ్ అబ్‌రామ్‌కు తండ్రి అయిన విషయం తెలిసిందే. చోటాభీమ్, మోగ్లీ కార్యక్రమాలంటే అబ్రామ్ కు ఎంతో ఇష్టమని ఇది వరకే షారుఖ్ తెలిపిన విషయం విధితమే. -
గవర్నర్‌ను కలిసిన TSPSC చైర్మన్
-
కుటుంబసభ్యులతో రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్
-
మా పూర్తి మద్దతు ఉంటుంది
-
అష్ర్ఫ్ ఘనితో భరత ప్రధాని మోదీ భేటీ
-
గవర్నర్ జీ.. గృహప్రవేశాలకు రండి
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభానికి రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్వయంగా కేసీఆర్ పలుమార్లు ఈ కాలనీని సందర్శించారు. ఈ ఇళ్ల గృహప్రవేశాలకు రావాలని గవర్నర్ నరసింహన్ ను ఆయన ఆహ్వానించారు. దాంతోపాటు ట్యాంక్ బండ్ మీద జరిగే బతుకమ్మ ముగింపు వేడుకలకు హాజరుకావాలని కూడా ఆయనను కోరినట్లు సమాచారం. అయితే ఐడీహెచ్ కాలనీ ఇళ్ల ప్రారంభోత్సవం, ఏపీ రాజధాని శంకుస్ధాపన కూడా ఓకే సమయంలో జరగనున్నాయి. ఏపీ రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రానున్నారు. మరి గవర్నర్ ఏ కార్యక్రమానికి హాజరు అవుతారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
గవర్నర్ నరసింహన్‌తో జగన్ భేటీ
-
విద్యుత్ ఉద్యోగుల సమస్య పైనా చర్చలు
-
దుబాయ్‌లోని భారతీయులతో మోదీ
-
రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ
-
రాష్ట్రపతి ప్రణబ్‌తో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: పది రోజుల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ గురువారం భేటీ అయ్యారు. మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన గవర్నర్.. దాదాపు అరగంట సేపు రాష్ట్రపతితో సమావేశమై మాట్లాడారు. అనంతరం రాష్ట్రపతిని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కలుసుకున్నారు. కాగా శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రచించిన ‘ఉనికి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగనుంది. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 5న యాదగిరిగుట్టకు: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ యాదగిరిగుట్ట పర్యటన ఖరారైంది. ఈనెల 5న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి గుట్టను సందర్శిస్తారు. లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రపతి వెంట ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ హరితహారం జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం కేసీఆర్ 5న ఉదయం కరీంనగర్ నుంచి పెద్దపల్లికి రోడ్డు మార్గంలో చేరుకోవాలి. కానీ మారిన షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ 5న ఉదయం హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడ కార్యక్రమం పూర్తవగానే హెలికాప్టర్లో నేరుగా పెద్దపల్లికి చేరుకొని హరితహారంలో పాల్గొంటారు. -
'గంటన్నర పాటూ చర్చించాం'
ఢిల్లీ: కేంద్ర హోం కార్యదర్శి ఎల్.సీ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గంటన్నర పాటు భేటీ అయ్యారు.అనంతరం విలేకరులతో కృష్ణారావు మాట్లాడుతూ..గవర్నర్ అధికారాలు, సెక్షన్ 8 పై చర్చించామని తెలిపారు. విభజనలోని షెడ్యూల్ 9,10 పై చర్చించామని చెప్పారు. -
మోదీతో మాణిక్ సర్కార్ భేటీ
న్యూఢిల్లీ: త్రిపురకు ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాలు అందించాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయానికి వచ్చిన మాణిక్ సర్కార్ అరగంటకుపైగా మోదీతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు అందించే ప్రత్యేక నిధులలో ఎలాంటి కోతలు విధించవద్దని, అలాంటి చర్యలు తమ రాష్ట్రాలపాటిట శాపంగా మారుతాయని వివరించారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఏడు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రాన్ని అభ్యర్థించాలని నిర్ణయించినట్లు మాణిక్ తెలియజేశారని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. ఎన్డీఏ సర్కారు ఈశాన్య రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నదని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ కనీసం అపాంయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్ సోమవారం వ్యాఖ్యనించిన నేపథ్యంలో ప్రధానితో త్రిపుర ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
వాళ్లిద్దరు ఒక్కటయ్యారు
సాక్షి, చెన్నై : రెండు వారాల క్రితం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, పీఎంకే యువజన నేత, ఎంపీ అన్భుమణిల మధ్య మాటల యుద్ధం బయలుదేరింది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. చివరకు అన్భుమణికి అర్హతలు లేవుఅని, ఆయన వ్యాఖ్యలు పట్టించుకోబోనంటూ స్టాలిన్ స్పందించడం రచ్చకెక్కింది. తన కు సంబంధించిన విద్యా, తదితర అన్నిరకాల అర్హతలతో కూడిన చిట్టాను అన్భుమణి విడుదల చేశారు. తన అర్హతలను పరిశీలించి చర్చకు రావాలని స్టాలిన్‌కు సవాల్ విసిరారు. తన ఇంట్లో గానీ, బయటగాని, ఎక్కడైనా సరే అర్హతల విషయంగా చర్చించుకుంద్దాం..రా..? అంటూ అన్భుమణి వ్యాఖ్యానించారు. ఆయన తీరుపై స్టాలిన్ స్పందించనప్పటికీ, డీఎంకే నాయకులు మాత్రం ఘాటుగానే విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మాటల వివాదం జఠిలం కావడంతో రెండు పార్టీల నాయకుల మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమన్నట్టుగా వ్యాఖ్యల దాడి బయలుదేరింది. ఈ పరిస్థితుల్లో తామెన్ని తిట్టుకున్నా, సవాళ్లు విసురుకున్నా, అవన్నీ ఆ సమయానికే పరిమితం.. శాశ్వతం కాదు, అని చాటుతూ, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న సామెతను గుర్తుచేస్తూ సోమవారం స్టాలిన్, అన్భుమణిలు ఏకం కావడం ఆ పార్టీ వర్గాల్ని ముక్కుమీద వేలు వేసుకునేలా చేసింది. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. నిన్నటి రోజు వరకు విమర్శలు గుప్పించుకున్న ఆ నేతలు ఇద్దరు గంటల వ్యవధిలో ఒక చోట చేరారు. ఇందుకు డీఎంకే అధినేత కరుణానిధి మనవడు అరుల్ నిధి వివాహ ఆహ్వాన పత్రికల పంపిణీ వేదిక అయింది. సోదరుడు ముక్కా తమిళరసు కుమారుడు అరుల్ నిధి వివాహ ఆహ్వాన పత్రికను అన్ని రాజకీయ పార్టీల నాయకులకు స్వయంగా ఎంకే స్టాలిన్ అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీల నాయకులు, ముఖ్యులను సోదరుడు ముక్కాతమిళరసుతో కలసి ఆహ్వానిస్తూ వస్తున్నారు. ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కూటమి ఏర్పాటుకు కొత్తఎత్తుగా ప్రచారం బయలు దేరింది. ఇదే, ఆహ్వాన పత్రిక, నిన్నటి శత్రువులను, తాజాగా మిత్రుల్ని చేసింది. మధ్యాహ్నం టీ నగర్‌లోని అన్భుమణి రాందాసు ఇంటికి సోదరుడితో కలసి స్టాలిన్ వెళ్లారు. స్టాలిన్ రాకతో వెలుపలకు వచ్చిన అన్భుమణి, పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, సీనియర్ నాయకుడు ఏకే మూర్తిలు చిరునవ్వులతో ఆహ్వానం పలికారు. పదిహేను నిమిషాలు ఆ ఇంట్లో భేటీ అయ్యారు. అన్భుమణి ఇంటికి స్టాలిన్ వెళ్లిన సమాచారంతో మీడియా ఉరకలు పరుగులు తీసింది. ఆహ్వాన పత్రిక అందజేసినానంతరం సవాళ్లు, విమర్శలు, ఆరోపణలు పక్కన పెట్టిన ఈ ఇద్ద రు నాయకులు మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ నాగరికత అంటే తమ కుటుంబాలదే అని చాటుకునే పనిలో పడ్డారు. ఇది డీఎంకే నాగరికత అని, తమిళ సంప్రదాయంఅని గుర్తుచేశారు. తాము ఈ సంప్రదింపుల్లో ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రాందాసు ఇంటి వివాహ వేడుకకు తమను ఇంటికి వచ్చి మరి ఆహ్వానించారని, అన్భుమణి సైతం వచ్చాని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా, తమ కుటుంబ వేడుకకు ఆహ్వానం పలుకుతున్నామని, అధినేత కరుణానిధి సూచనలతో మంగళవారం పీఎంకే అధినేత రాందాసును కలుస్తామని పేర్కొన్నారు. ఆర్కేనగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తారా..? అని ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించగా, ఎన్నికల తేదీ ప్రకటించనీయండి అప్పుడు చూసుకుందామని సమాధానం ఇచ్చారు. రాందాసుతో స్టాలిన్ ఆహ్వానం పత్రికల పంపిణీలో భాగంగా మంగళవారం స్టాలిన్ పీఎంకే అధినేత రాందాసు కలిశారు. తైలాపురం తోటలో రాందాసు ఆయన కలుసుకున్నారు. పి ఎంకే అధ్యక్షుడు జీకే మణి, రాందాసులతో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం వెలుపలకు వచ్చిన స్టాలిన్‌ను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కలుస్తారా..? అని మీడియా ప్రశ్నించగా, ముందు ఆమెను ఆ పార్టీ వాళ్లకు కలిసే ఛాన్స్ ఇవ్వనీయండి అని చమత్కరించారు. ముందుగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామిని స్టాలిన్ కలిశారు. ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. -
నీ తెగువ అమోఘం
కానిస్టేబుల్ దాడిలో గాయపడిన మహిళను అభినందించిన కేజ్రీవాల్ రాష్ట్రం నీ లాంటి పౌరులను కోరుకుంటుంది అవినీతిపై పోరాడే వారికి వెన్నంటే ఉంటాం న్యూఢిల్లీ: లంచం ఇవ్వకుండా కౌర్ చూపిన తెగువను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడిలో గాయపడిన రమన్జీత్ కౌర్‌ను ఆయన మంగళవారం కలిశారు. సెంట్రల్ ఢిల్లీలో సోమవారం ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ లంచం ఇవ్వనందుకు మహిళపై ఇటుకతో దాడి చేసిన సంగతి విదితమే. రాష్ట్రంలోని ప్రజలందరూ కౌర్లాగా ఉండాలన్నారు. అప్పుడే అవినీతిని అంతమొందించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ దాడిలో గాయపడిన తనకు సరైన చికిత్స అందించడం లేదని సీఎంకు ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆమెకు మెరుగైన చికిత్సనందించాలని అధికారులను ఆదేశించారు. ‘నిన్ను చూసి మేము గర్వపడుతున్నాం. మేము నీ వెన్నంటే ఉండి చేయగలిగినంత సాయం చేస్తాం. ఢిల్లీ నీ లాంటి పౌరులను కోరుకుంటుంది. అవినీతిని అంతమొందించేందుకు మనమంతా కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని కేజ్రీవాల్ అన్నారు. తమకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వలేదని, దీంతో సరైన వైద్యం అందించడం లేదని కౌర్ భర్త సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ విషయం తాను చూసుకుంటునాని, మెరుగైన చికిత్సనందించేలా ఆదేశాలిస్తానని సీఎం హామీనిచ్చారు. కౌర్‌కు మెరుగైన చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కేజ్రీవాల్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కౌర్, ఆమె భర్తను జైన్ కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్‌కు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ మహిళపై దాడి కేసులో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్‌కు ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మే 26 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి నరోత్తమ్ కౌశల్ ఆదేశాలు జారీ చేశారు. -
రాహుల్ దర్శనమిచ్చాడు
-
రాహుల్ దర్శనమిచ్చాడు..
న్యూఢిల్లీ: సుదీర్ఘ సెలవు తర్వాత రెండురోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పనిలో పడుతున్నట్టు కనిపిస్తోంది. శనివారం ఉదయం వివిధ రైతుసంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే రైతుర్యాలీకి సన్నాహకంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ రైతు ప్రతినిధులు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో భూసేకరణ సవరణ బిల్లుపై చర్చించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. బీజేపీ ప్రభుత్వ భూసేకరణ సవరణ బిల్లు, రైతు, పేద ప్రజల వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం కిసాన్ ఖేత్ మజ్దూర్ ర్యాలీ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకే రాహుల్ సుదీర్ఘంగా 57 రోజుల సెలవు తీసుకున్న తర్వాత 'ఎక్కడినుంచో' తిరిగి వచ్చారు. -
మోదీతో చంద్రబాబు భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఢిల్లీలోని మోదీ నివాసంలో ఏపీ బడ్జెట్ కేటాయింపులపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం. -
రజనీతో కార్తీ భేటీ
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయ పక్షాల నేతలు వరుసగా కలుసుకుంటూ రావడం చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తాజాగా రజనీతో భేటీ కావడంతో రాజకీయ వర్గాలు ఆంతర్యాన్ని వెతికే పనిలో పడ్డాయి. సాక్షి, చెన్నై : రజనీ కాంత్ ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలకు హాట్ కేకులా మారుతున్నారు. ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఆయనకు సీఎం అభ్యర్థిత్వాన్ని సైతం ఆఫర్ చేసింది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా రజనీ కాంత్ లేఖాస్త్రం సంధించడం బీజేపీ వర్గాల్ని కలవరంలో పడేసింది. జయలలితను పరామర్శిస్తూ రజనీ రాసిన లేఖ తో అన్నాడీఎంకే వర్గాలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ తమ వెంట ఉన్న రజనీ కాంత్, రానున్న ఎన్నికల్లోను తమకు మద్దతుగానే ఆయన వ్యవహరిస్తారన్న ఆశాభావం అన్నాడీఎంకేలో వ్యక్తమవుతోంది. ఈ లేఖాస్త్రం ఓ వైపు చర్చకు దారి తీసిన సమయంలో డీఎంకే నేతలు పలువురు రజనీని రెండు రోజుల క్రితం పరామర్శించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ వంతు వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు రజనీ కాంత్‌తో భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. కార్తీ భేటీ : మూడు నెలలుగా రజనీ కాంత్ లింగా చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. పది రోజుల క్రితం చెన్నైకు వచ్చిన ఆయన, లింగా చిత్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. దీంతో పోయెస్ గార్డెన్లో ఉన్న రజనీ కాంత్‌ను ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా అటు రాజకీయ వర్గాలు, ఇటు మిత్రులు కలుసుకుంటున్నారు. శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు, కాంగ్రెస్ నేత కాార్తీ చిదంబరం పోయేస్ గార్డెన్లో రజనీ కాంత్ ఇంటి మెట్లు ఎక్కారు. రజనీ కాంత్‌ను కలుసుకుని పుష్ప గుచ్ఛాలు అందజేశారు. కార్తీ వెంట మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. తన ఇంటికి వచ్చిన కార్తీతో చాలా సేపు రజనీకాంత్ మాటా మంతిలో మునిగారు. కార్తీ చిదంబరం నేతృత్వంలోని ఓ ట్రస్టు కార్యక్రమానికి రజనీ కాంత్‌ను ఆహ్వానించినట్టు సమాచారం. ఈ భేటీ గురించి కాంగ్రెస్ వర్గాల్ని కదిలించగా, కార్తీ చిదంబరం రజనీకాంత్‌ను కలిసిన మాట వాస్తవేమనని, అయితే, అది వ్యక్తిగతమేనంటున్నారు. చిదంబరం మద్దతుదారుల్ని కదిలించగా, రజనీ కాంత్, కార్తీ చాలా సేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని, అలాగే, కార్తీ ట్రస్టు నేతృత్వంలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజనీ కాంత్‌ను ఆహ్వానించి ఉన్నట్టు పేర్కొంటున్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌తో కయ్యం ఏర్పడ్డప్పుడు చిదంబరం సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏదైనా సాగేనా లేదా, ఈ భేటీ కేవలం మర్యాదేనా..? అన్న విషయమై ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. చిదంబరంపై ఆగ్రహం: ఓ వైపు రజనీ కాంత్‌తో కార్తీ చిదంబరం భేటీ అయితే, మరో వైపు చిదంబరంపై ఏకంగా కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం ప్రదర్శించాయి. ఆంగ్ల మీడియాకు చిదంబరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెహ్రు, ఇందిరా కుటుంబాలకు చెందని వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే సమయం వస్తుందని పేర్కొనడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యల్ని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు, ఎమ్మెల్యే విజయ ధరణిలు ఖండించారు. నెహ్రు, ఇందిర కుటుంబాలకు చెందిన వాళ్లు అధ్యక్షులుగా ఉండబట్టే పార్టీ బలంగా ఉందని, లేని పక్షంలో పార్టీలో ఐక్యత కొరవడి ఉండేదన్న విషయాన్ని చిదంబరం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ అయితే, చిదంబరం వ్యాఖ్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో ఆధిపత్యం లక్ష్యంగా కేంద్ర మాజీ మంత్రులు జీకే వాసన్, చిదంబరం మద్దతు గ్రూపుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విరక్తితో చిదంబరం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన మద్దతు దారులు పేర్కొనడం ఆలోచించాల్సిందే. -
ప్రధానితో ముగిసిన గవర్నర్ భేటి
-
ఆంతర్యమేమిటో!
బహిష్కరణకు గురైన అళగిరితో డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి దురై మురుగన్ భేటీ కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అళగిరికి మదురైలో పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టడం, మళ్లీ పోస్టర్ల యుద్ధం మొదలవడంతో డీఎంకే అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. సాక్షి, చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యల నెపంతో అధినేత ఎం కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరిపై సస్పెండ్ వేటు వేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్‌పై అళగిరి తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈనెల 30న జరిగే బర్త్‌డే వేడుకల అనంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోన్నారు. ఈ సమయంలో అళగిరితో దురై మురుగన్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. స్టాలిన్‌తో సన్నిహితంగా దురైమురుగన్ ఉండే వారు. పార్టీలో సీనియర్ నేతగా, ముఖ్య పదవిలో ఉన్న దురై మురుగన్ ఆదివారం కోట్టూరులో ప్రత్యక్షమయ్యారు. అక్కడి ఇంట్లో అళగిరితో ఆయన భేటీ అయిన సమాచారం డీఎంకే వర్గాల దృష్టికి చేరింది. ఈ ఇద్దరు భేటీ కావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది, ఇందులో ఆంతర్యం ఏమిటోనన్న అన్వేషణలో డీఎంకే వర్గాలు ఉన్నాయి. అయితే, వీరి భేటీ అంతా, మదురై పార్టీ చుట్టూ సాగినట్టు సమాచారం. ఇటీవల తొలగించిన నేతల గురించి, మళ్లీ మళ్లీ చేస్తూ ఉన్న వివాదాస్పద వ్యాఖ్యలపై దురై మురుగన్ సమీక్షించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం మదురైకు వెళ్లిన అళగిరి అక్కడి విమానాశ్రయంలో తాను ఓ అర్థంతో వ్యాఖ్యలు చేస్తే, మరో అర్థం వచ్చేలా మీడియాలో రాస్తున్నారని పేర్కొనడం గమనార్హం. బ్రహ్మరథం: చెన్నై నుంచి మదురైకు వచ్చిన అళగిరికి డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. విమానాశ్రయం నుంచి వందలాది వాహనాలు కాన్వాయ్‌గా అళగిరి ఇంటికి వెళ్లాయి. పార్టీ నాయకులు, అళగిరి మద్దతుదారులు గౌష్ బాషా, మన్నన్, బోసు, ఉదయకుమా ర్, జలాలుద్దీన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నాయకులు తరలి రావడం విశేషం. సోమవారం కూడా అళగిరి నివాసం మద్దతుదారులతో నిండింది. మీడియాతో మాట్లాడిన అళగిరి తన సత్తా ఏమిటో 30వ తేదీ తెలుస్తుందన్నారు. వచ్చింది గోరంత మద్దతుదారులేనని, కొండంత మద్దతుదారులను తన జన్మదినం రోజు చూడబోతున్నారని ప్రకటించారు. ప్రతి ఏటా తన జన్మదినాన్ని పేదల సంక్షేమార్థం జరుపుకోవడం జరుగుతోందని, ఈ ఏడాది అదే తరహాలో జరుపుకుంటామని, అరుుతే ఈ వేడుకకు ప్రత్యేకత సంతరించుకోనున్నదన్నారు. అయితే, తాను ఓ అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తుంటే, మీడియా మరో అర్థం చేసుకుని వార్తలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. తాను ఏ నిర్ణయాన్ని అయినా, సరే మద్దతుదారులతో చర్చించిన తర్వాతే తీసుకుంటానని స్పష్టం చేశారు. మళ్లీ పోస్టర్లు: అళగిరి సస్పెన్షన్‌కు వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు, ఆయన మద్దతుదారుల అత్యుత్సాహ పోస్టర్లు కూడా కారణమయ్యూయి. అళగిరిపై సస్పెన్షన్ వేటు పడటంతో మళ్లీ మద్దతుదారులు రెచ్చి పోతున్నారు. చెన్నై, మదురైలో పోస్టర్లు వెలిశాయి. తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ధైర్యవంతుడిగా, వీరుడిగా, కింగ్ మేకర్‌గా అళగిరిని పేర్కొంటూ వ్యాఖ్యల్ని అందులో పొందు పరిచారు. అళగిరి సతీమణి గాంధీ, తనయుడు దురై దయానిధి చిత్ర పటాల్ని సైతం ముద్రించడం గమనార్హం.