తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్తో కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. వేములవాడ నుంచి కేసీఆర్ నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు.