Pranab
-
ర్యాప్ న మ హా
మనసులోని భావాలను వచన కవిత్వంలో సూటిగా చెప్పొచ్చు. పదునైన వచన కవిత్వానికన్నా పదునైనది ర్యాప్. తీవ్ర భావోద్వేగాలను సైతం ర్యాప్‌లో సున్నితంగా, అదే సమయంలో శక్తిమంతంగా చూపించవచ్చు. అంతటి శక్తిమంతమైన ర్యాప్‌తో ప్రణవ్ చాగంటి ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంటున్నాడు. ర్యాప్ పాడుతూ యువతకు తెలుగును పరిచయం చేస్తున్నాడు. న, మ అక్షరాలతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు అక్షరాల ర్యాప్‌ను సృష్టించాడు. తనలో నిద్రాణంగా ఉండిపోయిన భావాలను బయటకు తీసుకురావడానికి ర్యాప్ తనను ఎంచుకుంది అంటున్న 29 ఏళ్ల ఈ హైదరాబాద్ ర్యాపర్ గురించి అతడి మాటల్లోనే..! నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగాన్వేషణలో ఉన్న సమయంలో మా చుట్టాలాయన ఒకరు వచ్చి, ‘నేవీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ అవకాశాలు ఉన్నాయి. చేరిపో, మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని చెప్పారు. నాకు అమ్మని వదిలి ఉండటం ఇష్టం లేదు. అయినా ఇంట్లో వారి బలవంతం మీద రెండేళ్లు నేవీలో చేరాను. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అవ్వడం వల్ల చాలాసేపు సముద్రం మీదే ఉండవలసి వచ్చేది. నౌక పోర్టులోకి వచ్చినా కొద్దిగంటల్లోనే మళ్లీ బయలుదేరిపోతుంది. . ఇంజనీరింగ్ చదివానన్న మాటే గానీ చిన్నప్పటి నుంచీ నాకు సంగీతమంటే చాలా ఇష్టం. భాషాభేదం లేకుండా అన్ని పాటలు వినేవాడిని. కానీ నౌకలో ఆ అవకాశం దొరికేది కాదు. అమ్మానాన్నలకు, సంగీతానికి దూరంగా ఉండటం నా మనసుకి నచ్చలేదు. అందుకే ఆ ఉద్యోగంలో ఉండలేక వచ్చేశాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండటం నా నైజం. ఒక లైన్ రాయగానే, ఏదో ఒక పాట రాయొచ్చుగా అనుకుంటాను. నా మైండ్ క్షణం కుదురుగా ఉండేది కాదు. రచన, సంగీతం.. వీటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేది. కదిలించిన యాసిడ్ ఘటన ఢిల్లీలో 2004లో జరిగిన ఒక యాసిడ్ దాడి దేశంతోపాటు నన్నూ కదిలించేసింది. ప్రేమను ఒప్పుకోకపోతే యాసిడ్ దాడి చేయడమేంటి?! మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనుకున్నాను. ఎమోషనల్‌గా షేక్ అయ్యాను. ఆ భావాన్ని ఎలా బయటపెట్టాలో ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. పెద్దవాడినయ్యాక పాటల రూపంలో నాలోని ఉద్వేగాలను బయటకు తీసుకురావడం ప్రారంభించాను. ‘ఆవేదన’ అనే ర్యాప్‌గా ఆ యాసిడ్ దాడి గురించి నా ఎమోషన్ బయటకు వచ్చింది. నాలో ఏదో తెలియని రిలీఫ్. ఆ తరవాత నిర్భయ గురించి రాయడానికి నాలో ఆవేశం కట్టలు తెంచుకుని వచ్చింది. అప్పటికి నా భాష మెరుగైంది. తెలుగు భాష గొప్పదనం గురించి కూడా నలుగురికీ చెప్పాలనిపించింది. ఆ ప్రయత్నంగానే న, మ అక్షరాలతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు అక్షరాల ర్యాప్‌ను సృష్టించాను. దానికి ‘దివ్యాక్షరి’ అని పేరు పెట్టాను. – డా. వైజయంతి పురాణపండ -
బ్రిడ్జ్‌లో జయకేతనం
ఏషియాడ్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడాంశం ‘బ్రిడ్జ్’లో భారత్ స్వర్ణం గెల్చుకుంది. శనివారం పురుషుల పెయిర్ ఈవెంట్ ఫైనల్లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి భారత్ జోడీ ప్రణబ్ బర్దన్, శివ్‌నాథ్ సర్కార్ 384 పాయింట్లు స్కోరు చేశారు. ప్రత్యర్థి చైనా జంట లిగ్జిన్ యాంగ్, గాంగ్ చెన్ 378 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. ఇండోనేసియా (374 పాయింట్లు), హాంకాంగ్ (373 పాయింట్లు) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ విజయంతో 60 ఏళ్ల బర్దన్... అత్యంత పెద్ద వయసులో పతకం గెలిచిన భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. అతడి సహచరుడు శివ్‌నాథ్ వయసు 56 ఏళ్లు కావడం విశేషం. మరోవైపు మిక్స్డ్ పెయిర్ ఫైనల్లో భారత్ జంట బాచిరాజు సత్యనారాయణ, కిరణ్ 333 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయింది. బ్రిడ్జ్‌లో మన దేశానికి ఒక స్వర్ణం (పురుషుల పెయిర్), రెండు కాంస్యాలు (పురుషుల టీమ్, మిక్స్డ్ టీమ్) లభించాయి. జూద క్రీడ కాదు... అందరూ భావించినట్లు బ్రిడ్జ్ జూద క్రీడ కాదని... నైపుణ్యం, అదృష్టం కలగలిసిన ఆట అని అంటున్నారు బర్దన్. చెస్లాగానే మేధో క్రీడ అని, దానికంటే మరింత చాలెంజింగ్ అని అభివర్ణిస్తున్నారు. అందరికీ మొదటి సెట్ కార్డులే వస్తాయి కాబట్టి, పరిస్థితిని అర్ధం చేసుకుని ఆడినవారే విజేతగా నిలుస్తారని చెబుతున్నాడు. ఇది అన్ని వయసుల వారు ఆడే క్రీడ అని శివ్‌నాథ్ సర్కార్ వ్యాఖ్యానించారు. ఫైనల్ ముందు రాత్రి తాను నిద్ర పోలేదని, ఉదయం కేవలం పండ్లు మాత్రమే తీసుకుని బరిలో దిగానని సర్కార్ చెప్పడం విశేషం. -
ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుపై శివసేన కొత్త వాదన
-
మంచి మనుషులను తయారు చేయాలి!
విద్యాసంస్థలకు ప్రణబ్ సూచన పురూలియా: మారుమూల ప్రాంతాల్లో స్థానికులు ఏర్పాటుచేసే విద్యాసంస్థలు.. ప్రెసిడెన్సీ కాలేజీ, ద హిందూ స్కూల్ వంటి ప్రముఖ విద్యాలయాల స్థాయికి ఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లోని ‘ఝాల్దా సత్యభామ విద్యాపీఠ్’ వందేళ్ల వ్యవస్థాపక వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్ని ప్రసంగించారు. విద్యాసంస్థలు తెలివైన విద్యార్థులతోపాటు.. సమాజ రూపురేఖలు మార్చే మానవత్వం ఉన్న మంచి మనుషులను తయారుచేయాలన్నారు. -
బెత్లెహాం కళకళ
బెత్లెహాం: క్రిస్మస్ సందర్భంగా బెత్లెహాం భక్తులతో కళకళలాడుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది భక్తులు క్రీస్తు జన్మదిన వేడుక కోసం పట్టణానికి చేరుకున్నారు. క్రీస్తు పుట్టినట్లు భావిస్తున్న చర్చ్ ఆఫ్ నేటివిటీ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి సంబరాలు, భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుంటున్నారు. గత ఏడాది పాలస్తీనియన్లు ఇజ్రాయెలీలపై కత్తులతో దాడులు చేయడంతో బెత్లెహాం వేడుకలకు కాస్త ఆటంకం కలిగింది. ఈసారి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోపక్క.. జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన ట్రక్కు దాడి నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. జర్మనీ, ఇటలీ తదితర దేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రణబ్ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘క్రిస్మస్ ఆనంద సమయాన భారతీయులందరికీ శుభాకాంక్షలు. ఈ ఉత్సాహం మన హృదయాల్లో ప్రేమ, కరుణ నింపాలి.’ అని ప్రణబ్ సందేశమిచ్చారు. -
మంత్రుల జోక్యం ఎక్కువే!
♦ వడ్డీరేట్లు తగ్గించాలని ఒత్తిడి చేసేవారు ♦ తగ్గించనందుకు డిప్యూటీ గవర్నర్లు బలయ్యారు ♦ వారి పదవీకాలం పొడిగించమన్నా... చేయలేదు ♦ ప్రణబ్, చిదంబరం ఇద్దరూ ఇలాగే చేశారు ♦ దేశీ చర్యల వల్లే రూపాయి పడిందన్నా వినలేదు ♦ రాజన్ ప్రతిష్ఠ వల్లే రూపాయి కోలుకుంది ♦ నాకు ఆర్థిక వ్యవస్థే ముఖ్యం; ‘చీర్లీడర్’కాదల్చుకోలేదు ♦ ‘హూ మూవ్డ్ మై ఇంట్రస్ట్ రేట్’ పుస్తకంలో డాక్టర్ దువ్వూరి సుబ్బారావు ముంబై: వడ్డీ రేట్లకు, కరెన్సీకి... తద్వారా ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేది రిజర్వు బ్యాంకు. అలాంటి రిజర్వు బ్యాంకు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం మితిమీరితే..! దాన్ని స్వతంత్రంగా వ్యవహరించనివ్వకపోతే..!! తన విషయంలో అదే జరిగిందన్నారు ఆర్బీఐ మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు. తాను గవర్నర్‌గా ఉన్న సమయంలో వడ్డీరేట్లు తగ్గించాలంటూ నాటి ఆర్థిక మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం తనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు. తాను అలా చేయకపోవటం వల్ల ఏం కోల్పోవాల్సి వచ్చిందో కూడా వివరించారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన 2008లో ఆర్బీఐ గవర్నరుగా సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు. 2013 సెప్టెంబర్ 4వరకూ ఐదేళ్లు కొనసాగారు. ఇండియా సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడారంటూ ప్రశంసలూ పొందారు. తాజాగా ఆయన ‘‘హూ మూవ్డ్ మై ఇంట్రస్ట్ రేట్’ అనే శీర్షికతో ఒక పుస్తకం రాశారు. 352 పేజీల ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలివీ... డిప్యూటీలు బలైపోయారు!! అధిక వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించేవారు. దీనివల్ల వృద్ధి ఆగిపోతుందన్నది వారి అభిప్రాయం. ఇది తరచూ బహిరంగంగానే చెప్పేవారు. వడ్డీ రేట్లు తగ్గించాలని నన్ను ఒత్తిడి చేసేవారు. ఈ ఒత్తిడి వివిధ రకాలుగా ఉండేది. డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఉషా థోరట్ పదవీకాలాన్ని పొడిగించాలని నాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి నేను సిఫారసు చేశాను. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నపుడు సుబీర్ గోకర్ణ్కూ ఇలాగే సిఫారసు చేశాను. కానీ రెండు సందర్భాల్లోనూ తిరస్కరణే ఎదురైంది. వడ్డీ రేట్లు తగ్గించనందుకు వారిచ్చిన బహుమానమని నాకు అర్థమైంది. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసమే ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవాలి. దీన్లో ఎందుకు రాజీ పడాలన్నది నా లాజిక్. ఒత్తిళ్లకు లొంగిపోయి ‘చీర్ లీడర్’ కాదలచుకోలేదు. సెంట్రల్ బ్యాంక్ మాటే శక్తివంతం... సెంట్రల్ బ్యాంక్ మాటే ఎంతో శక్తివంతమనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. 2001 నవంబర్ 9న ట్విన్ టవర్స్‌పై తీవ్రవాదులు దాడి జరిపాక ద్రవ్య లభ్యతకు ఎలాంటి సమస్యా రాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ చేసిన ఒకే ఒక్క ప్రకటన అమెరికా, అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించింది. 2012 ఏప్రిల్‌లో యూరో పతనం తప్పదన్నపుడు... ‘ఏది ఏమైనా యూరో పతనాన్ని అడ్డుకుంటాం’ అని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ మారీ డ్రాఘీ చేసిన ప్రకటన ఎంతో సానుకూలత చూపింది. యూరో నాయకుల సదస్సులు, సమావేశాల కన్నా డ్రాఘీ హామీ వల్లే యూరో నిలబడింది. సంక్షోభ సమయాల్లోనే కాదు. ప్రతి సందర్భంలోనూ సెంట్రల్ బ్యాంక్‌ల పారదర్శకత, క్రియాశీలత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతుంటాయి. ముందస్తు గెడైన్స్ చాలా కీలకం... ఆర్థిక అంశాలపై ముందస్తు అంచనాలివ్వటమనేది పరపతి విధానం ఆధునీకరణకు నేను తీసుకున్న చర్యల్లో కీలకం. ఇది ఒకరకంగా సవాలే. ఎందుకంటే ఈ గెడైన్స్‌పై ఆధారపడి మార్కెట్ అంచనాలన్నీ రూపుదిద్దుకుంటాయి. 6-8 పేజీల ఈ షార్ట్ పేరాగ్రాఫ్ డాక్యుమెంట్ కోసం ఎంతో నైపుణ్యం ప్రదర్శించాలి. ఏ చిన్న తేడా జరిగినా ఆర్బీఐ తన హామీలను నెరవేర్చదన్న ధోరణి నెలకొంటుంది. ఇది ఆందోళన కలిగిస్తుంది. నేనో విషయం చెబుతా. 2011 అక్టోబర్-డిసెంబర్ మధ్య వడ్డీ రేటు బాగా ఎక్కువనే అభిప్రాయాలుండేవి. అయినా తగ్గించలేదు. తదుపరి చర్యల్లో రేటు తగ్గించే వీలుందని సూచించాం. అయితే అధిక ద్రవ్యోల్బణం వల్ల 2012 జనవరి పాలసీ సమీక్షలో ఇది సాధ్యం కాలేదు. దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నా.... తొలి సంకేతాలకు అనుగుణంగా వ్యవహరించలేదన్న విమర్శలొచ్చాయి. గెడైన్స్ ఒక్కటే కాక... దానిపైనా గెడైన్స్‌ను మార్కెట్ కోరుకుంటోందని అర్థమైంది. పాలసీలో వాడే ప్రతి పదమూ కీలకమే. రాజన్ ‘పరపతి’ రూపాయికి రక్ష... 2013 మధ్య నాటికి రూపాయి భారీగా పడిపోయింది. అయితే ఆ తర్వాత రూపాయి స్థిరపడ్డానికి నా వారసుడిగా వచ్చిన రఘురామ్ రాజన్ ప్రతిష్టే దోహదపడింది. ఆయన నియామకం మార్కెట్లలో విశ్వాసాన్ని కూడా నింపింది. రూపాయి బలహీనతకు అమెరికా ఉద్దీపనల ఉపసంహరణలు కాకుండా దేశీయ అంశాలే కారణమని నేను నాటి ఆర్థికమంత్రి చిదంబరానికి పలు సందర్భాల్లో చెప్పా. బంగారం వంటి ఉత్పాదకత లేని దిగుమతులతో కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరుగుతోందని చెప్పా. కానీ రూపాయి పతనానికి దేశీయ అంశాలే కారణమన్న నా వాదనను చిదంబరం అంగీకరించలేదు. దేశీయ వ్యవస్థాగత అంశాలపై దృష్టి పెట్టడం కన్నా... అంతర్జాతీయ పరిణామాలకు రూపాయి బలహీనతలను ముడిపెడితే రాజకీయంగా సౌలభ్యంగా ఉంటుందని ఆయన భావించి ఉండొచ్చన్నది నా సందేహం. ఎన్ఆర్ఐ డిపాజిట్ల ద్వారా విదేశీ మారకద్రవ్య నిల్వల్ని పెంచటం వంటి చర్యల్లో రాజన్‌కు, నాకు పూర్తి ఏకాభిప్రాయం ఉంది. తగిన గణాంకాలు లేకపోతే..? ఏ నిర్ణయమైనా అందుబాటులోని గణాంకాల ప్రాతిపదికనే తీసుకుంటారు. అవి సరిగా లేకుంటే తప్పుడు నిర్ణయాలు తప్పవు. ఒకసారి ప్రకటించిన గణాంకాలను తరచూ సవరించటమనేది మరో సమస్య. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షకు కీలకమైన పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు ఇదే తీరులో ఉండడం కరెక్టు కాదు. ఇది ద్రవ్యోల్బణం కట్టడిలో ప్రతికూలత కలిగిస్తుంది. ప్రతి పేజీలో మేథో మెరుపు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు ప్రజ్ఞాపాటవాలు, నిజాయితీలతో ఐదేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్‌గా సేవలందించారు. ఆయన మేథో పరిపూర్ణత పుస్తకంలోని ప్రతి పేజీపై మెరుస్తోంది. - పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి 2008లో ఆర్బీఐ గవర్నర్‌గా... 2008 సెప్టెంబర్‌లో ఆర్బీఐ 22వ గవర్నర్‌గా బాధ్యతల స్వీకారం 2009 మార్చి... రెపోరేటు 5 శాతంకన్నా దిగువకు 2011 సెప్టెంబర్... పదవీకాలం మరో రెండేళ్లు పెంపు 2012 ఏప్రిల్... వృద్ధి లక్ష్యంగా రేట్ల కోతకు శ్రీకారం 2013 సెప్టెంబర్... ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతల విరమణ రెపో రేటు 13 సార్లు పెంపు. 10 సార్లు తగ్గింపు.. రికార్డు రాజన్ పదవీ విరమణ సమయంలో ఈ పుస్తకం వచ్చింది -
స్వల్ప ప్రమాదానికి గురైన రాష్ట్రపతి కాన్వాయ్..
డార్జలింగ్ః రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం ఎదురైంది. ఉదయం బగ్దోగ్రా నుంచి ఢిల్లీ విమానం ఎక్కేందుకు బయల్దేరిన రాషప్ట్రపతి కాన్వాయ్ 30 కిలోమీటర్లు ప్రయాణించగానే ప్రమాదానికి గురైంది. సొనాడా ప్రాంతానికి చేరగానే కాన్వాయ్ లోని మూడో వాహనం రోడ్డునుంచి జారి పక్కకు పడిపోయింది. ప్రమాదంలో ఆరుగురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ విమానం ఎక్కేందుకు బగ్దోగ్ రానుంచి బయల్దేరిన రాష్ట్రపతి కాన్వాయ్ కి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. విమానం ఎక్కేందుకు రాష్ట్రపతి బయల్దేరిన కొద్ది సేపటికి సొనాడో ప్రాంతానికి రాగానే అక్కడ కొండ చెరియలు విరిగి పడటంతో కాన్వాయ్ లోని మూడో వాహనం జారి పక్కకు పడిపోయింది. ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, రాష్ట్రపతితోపాటు మిగిలిన సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం.. ఢిల్లీలో జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రాష్ట్రపతితోపాటు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిలో రాష్ట్రపతి చీఫ్ సెక్యూరిటీ అధికారి ఏపీ సింగ్ ఉన్నారు. భారీ వర్షాలు, మంచు కారణంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు రాష్ట్రపతి ప్రయాణానికి హాజరు కాలేకపోవడంతో ఆయన రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్రపతి కార్యాలయానికి చెందిన సైనిక సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సురక్షిత ప్రాంతానికి తరలించడంతోపాటు, అక్కడి ఆపరేషన్ ను మమతా బెనర్జీ దగ్గరుండి పర్యవేక్షించినట్లు ఆమె ప్రెస్ సెక్రెటరీ వేణు రాజమణి తెలిపారు. సహాయక చర్యల్లో పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా సహాయపడ్డారు. -
ఉగ్రపోరులో అండగా ఉంటాం: ప్రణబ్
న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆదేశానికి ఎల్లప్పుడూ మద్ధతుగా ఉంటామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గురువారం కాబుల్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ ప్రణబ్ ఆదేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి సందేశాన్ని పంపారు.ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రనిర్మూలనకు ఇండియా అఫ్ఘన్ తో భుజం భుజం కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉందని స్ఫష్టం చేశారు. నిన్న ఆదేశంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై జరిపిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
విమాన విలాసం.. అదరహో..!
ఆకాశాన్ని రంగుల తోరణాలతో అలంక రించినట్టుగా.. విను వీధిలో లోహ విహంగాల విహారం. విస్తుగొలిపే విన్యాసాల సమాహారం. విభిన్న రూపాలు... అత్యాధునిక సౌకర్యాలు... వినూత్న ఆవిష్కరణలు... దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ సైతం ముచ్చటపడేలా... అచ్చెరువొందేలా చేశాయి. ఇదీ బేగంపేట విమానాశ్రయంలో సాగుతున్న ‘ఇండియా ఏవియేషన్-2016’ ప్రత్యేకత. బుధవారం ఏవియేషన్ షో ప్రారంభం అదిరింది. దేశ ప్రథమ పౌరుడి రాకతో బేగంపేట విమానాశ్రయం మురిసిపోయింది. స్వదేశీ, విదేశీ ప్రతినిధులతో కళకళలాడింది. రాజహంసల రాచఠీవిని చూసి సందర్శకులు ముగ్దులయ్యారు. విమానయాన ప్రదర్శన అనుభూతుల్ని పదిలపరుచుకునేందుకు సెల్ఫీలు క్లిక్ మనిపించారు. ‘వినువీధి వీరుల’ గగుర్పాటు విన్యాసాల్ని ఉత్కంఠతో తిలకించారు. బుధవారం మొదలైన ఈ ఎగ్జిబిషన్ మరో నాలుగురోజుల పాటు జరగనుంది. గగన విన్యాసం మార్క్ జెఫర్స్ బృందం ఆకాశంలో చేసిన విన్యాసాలను సందర్శకులు ఉత్కంఠతో వీక్షించారు. అంతవరకు ఎగిరిన విమానం భూమివైపునకు అతివేగంగా దూసుకువచ్చేలా చేసిన విన్యాసం వీక్షకుల్ని అబ్బురపరిచింది. ఈ షో గురువారం నుంచి ఈ నెల 20 వరకు ఉదయం 11.35 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్ కు ప్రణబ్ ముఖర్జీ!
డెహ్రాడూన్ః రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తరాఖండ్ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్ లోని స్వామీ రామ్ హిమాలయన్ విశ్వవిద్యాలయంలో జరుగబోయే స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఉత్తరాఖండ్ డోయ్వాలా కొండప్రాంతంలోని స్వామి రామ్ హిమాలయ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1న స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోజు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య కార్యక్రమంలో పాల్గోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఏప్రిల్ 1న రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన సన్నాహాలపై బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో నిర్వహించిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఛీఫ్ సెక్రెటరీ శత్రుఘ్న సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశాధ్యక్షుడి ఉత్తరాఖండ్ సందర్శనకు సంబంధించిన భద్రతా చర్యలపై కూడ సమీక్షించారు. -
ఊతమిచ్చే దేశాల్ని బహిష్కరించాలి
ఉగ్రవాదంపై ప్రణబ్ పిలుపు జైపూర్: ఉగ్రవాదాన్ని దేశ విధానంలో భాగంగా ప్రోత్సహించే లేదా మద్దతిచ్చే దేశాలను ప్రపంచం బహిష్కరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. తద్వారా పరోక్షంగా పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూ.. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం ఉండవని.. ఉగ్రవాదం అనేది క్యాన్సర్ అని, బలమైన కత్తితో శస్త్రచికిత్స చేసి తొలగించాలన్నారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్నీ ప్రపంచం తిరస్కరించాలన్నారు. ఇండియా ఫౌండేషన్ సంస్థ రాజస్తాన్ ప్రభుత్వంతో కలసి మంగళవారం జైపూర్‌లో ఏర్పాటు చేసిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సును రాష్ట్రపతి ప్రారంభించి ప్రసంగించారు. అమెరికాపై 9/11 ఉగ్రవాద దాడులు కీలకమైన పరిణామంగా అభివర్ణిస్తూ.. అప్పటి నుంచీ అనుసరించిన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాల గెలుపోటముల నుంఇచ పాఠాలు నేర్చుకోవాలని ప్రణబ్ సూచించారు. -
5 చట్టాలకు రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదం
-
కుటుంబసభ్యులతో రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్
-
వేదాల ప్రచారంతో శాంతి పరిడవిల్లుతుంది
-
ప్రణబ్, మోదీలతో భేటీ కానున్న సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విడిగా భేటీ కానున్నారు. గూగుల్ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా భారత్‌కు వస్తున్న సుందర్ పిచాయ్ బుధవారం మీడియాతో మాట్లాడతారు. తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలుసుకుంటారు. గురువారం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ క్యాంపస్‌లో విద్యార్థులతో కొంత సమయం గడుపుతారు. ఆ తరవాత మోదీతో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతితో సమావేశమవుతారు. పిచాయ్ ఈ పర్యటనలో భాగంగా కొత్త ఆవిష్కరణలు ప్రకటించవచ్చని సమాచారం. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ ఆగస్ట్‌లో గూగుల్ సీఈవోగా నియమితులైన విషయం తెలిసిందే. -
రక్షణమంత్రితో గవర్నర్ సమావేశం
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తో సమావేశమయ్యారు. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్‌ను కలిసిన ఆయన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అలాగే హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షితో గవర్నర్ దాదాపు గంటన్నరపాటు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీని అన్ని విధాలా ఆదుకోండి
- ప్రత్యేక హోదా ఇవ్వండి.. రాష్ట్రపతికి జగన్ విజ్ఞప్తి - వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయండి - పోలవరాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలి - పట్టిసీమను నిలిపివేయమని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలి - రాజధాని పేరుతో పంటపొలాలను గుంజుకున్నారు - ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి - నూతన రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించాలి - పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించాలి - రెండు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు నిధులు ఇవ్వాలి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్సార్సీపీ విజ్ఞప్తిచేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో కూడిన బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ఆ వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ.. - ఐదేళ్లపాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హామీ ఇచ్చారు. దీనిని అమలుచేయాలని నాటి ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని కూడా ఆదేశించింది. కానీ ఈ దిశగా ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. - అపాయింటెడ్ డే నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అందేవరకు ఈ రెవెన్యూ లోటును భర్తీచేసేందుకు వీలుగా 2014-15 సాధారణ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చట్టంలో హామీ ఇచ్చారు. అయితే రెవెన్యూ లోటు భర్తీ కోసం కేంద్రం ఇటీవల రూ. 500 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. కొత్త రాష్ట్రం సమస్యలను ఇది ఎంతమాత్రం తీర్చలేదు. అందువల్ల వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయగలరు. అయితే ఐదేళ్లపాటు రెవెన్యూలోటు గ్రాంట్లను రూ. 22 వేల కోట్ల మేర ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసును ఆమోదించినందుకు ధన్యవాదాలు. - చట్టప్రకారం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లో భాగంగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ.. చాలా స్వల్ప మొత్తంలో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున కేటాయించారు. ప్రకాశం జిల్లా వంటి తక్కువ తలసరి ఆదాయం ఉన్న ఇతర జిల్లాలకు కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. - పోలవరం జాతీయ ప్రాజెక్టును విభజన అనంతరం మూడేళ్లలో కేంద్రమే నిర్మాణం పూర్తిచేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం అంతుపట్టని అంశం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు రెండో చాప్టర్ క్లాజ్-7లో పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చిన వెంటనే.. కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్రలకు ఉంటుందన్న నిబంధన ఉంది. అలాగే 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని పోలవరం నుంచి కృష్ణాకు మళ్లిస్తే.. అధికంగా మళ్లించిన నీటిని మూడు రాష్ట్రాలకు అదే దామాషాలో పంచాలన్న నిబంధనలు ఉన్నాయి. దీనివల్ల గోదావరి నుంచి చుక్క నీరు మళ్లించకముందే రాష్ట్రం 70 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పట్టిసీమ లిఫ్ట్ నుంచి కృష్ణా నది వరకు ఎక్కడా నీటి నిల్వకు అవకాశం లేదు. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా... టెండర్లలో నిబంధనలు మార్చేసి తన వారికే టెండర్లు దక్కేలా చేసింది. ఎక్కువగా కోట్ చేసిన మొత్తాన్ని బోనస్‌గా పేర్కొంది. పట్టిసీమకోసం భారీగా ప్రజాధనం వృథాచేయడానికి బదులుగా.. పోలవరాన్ని మూడేళ్లలో పూర్తిచేయాలి. సాంకేతికంగా ఆచరణ సాధ్యం కాని పట్టిసీమ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతున్నాం. - రాజధాని అవసరాలకు డీగ్రేడెడ్ అటవీ భూములను డీనోటిఫై చేస్తానని చట్టం ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణ విధానం ద్వారా రాజధానిని నిర్మించేందుకు బహుళ పంటలు సాగయ్యే, కెనాల్ తదితర సాగునీటి వసతి ఉన్న దాదాపు 30 వేల ఎకరాలను సేకరిస్తోంది. అదే జిల్లాలో వేలాది ఎకరాల డీగ్రేడెడ్ అటవీ భూములు ఉన్నప్పటికీ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్‌లోని పలు ప్రయివేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 10 వేల ఎకరాలను ఉచితంగా ఆ కంపెనీలకు కట్టబెడతారట. దీనికి ప్రతిఫలంగా ఆ కంపెనీలు ఉచితంగా రాజధాని నిర్మించి ఇస్తాయట. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అటు చట్ట సభల్లో గానీ, ఇటు బయటగానీ చర్చించే ందుకు నిరాకరిస్తోంది. ఇప్పటివరకు సామాజిక ప్రభావ అధ్యయనం కూడా జరగలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి. ళి కొత్త రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు అవసరమవుతాయన్న విషయాన్ని చట్టంలో చెప్పలేదు. కేంద్రం ఏమేర ఇస్తుందన్న విషయం పేర్కొనలేదు. ఎప్పటిలోగా విడుదల చేస్తుందో చెప్పలేదు. విభజనను మేం కోరుకోకపోయినా, మా తప్పేమీ లేకపోయినా మేం రాజధాని కోల్పోయినందున కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం వచ్చే ఐదేళ్లపాటు ఇతోధికంగా సాయం చేయాల్సిన అవసరం ఉంది. అయితే 2015-16 కేంద్ర సాధారణ బడ్జెట్లో కేంద్రం ఈ దిశగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. దయచేసి నూతన రాజధాని నిర్మాణానికి భారీమొత్తంలో నిధులు కేటాయించేలా చూడాలని కోరుతున్నాం. - చట్టప్రకారంగా పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించడంలో భాగంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 15 శాతం అదనపు డిప్రిసియేషన్, 15 శాతం పెట్టుబడి అలవెన్స్‌ను ప్రకటించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి సరిపోవు. అందువల్ల హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను మాకు కూడా ప్రకటించేలా చూడండి. - పన్ను ప్రోత్సాహకాలను కేవలం వెనకబడిన జిల్లాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఉపయోగంలేదు. 974 కి.మీ. పొడవు గల కోస్తాతీరం వెంట అంతర్జాతీయ స్థాయి గల ఓడరేవులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేవారు నౌకాశ్రయాలకు సమీపంలోనే తమ పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. అందువల్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రకటించేలా చూడండి. - కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ, విజయవాడ మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడం వంటి అంశాలను చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే చిత్తూరు జిల్లాలోని ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ మన్నవరం ప్రాజెక్టును కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చూడండి. - రెండు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాల్సిన విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు ఇతోధికంగా నిధులు కేటాయించి సత్వర నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోండి. -
రాష్ట్రపతిని కలిసిన అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ..రాష్ట్రపతి భవన్లో కలిశారు. నేడు పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. దాంతో బడ్జెట్ వివరాలను రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ఆర్థిక మంత్రి ...రాష్ట్రపతిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన...ప్రణబ్‌ను కలిశారు. అనంతరం అరుణ్ జైట్లీ పార్లమెంట్‌కు బయల్దేరారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
మహాత్మగాంధీకి మోదీ, ప్రణబ్ నివాళులు
న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీకి జాతి ఘనంగా నివాళులు అర్పించింది. గాంధీజీ 67వ వర్థంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రి పారికర్ తదితరులు అంజలి ఘటించారు. గాంధీజీ సమాధి మీద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. మరోవైపు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా హూదరాబాద్లోని బాపూఘాట్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. అలాగే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు బాపూజీకి నివాళులు అర్పించారు. -
బరిలోకి ప్రణబ్, షీలాల తనయులు
ఎన్నికల అరంగేట్రం సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమార్తె లతికా దీక్షిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శర్మిష్ట ముఖర్జీ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి, లతికా దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. గ్రేటర్ కైలాష్ నుంచి..శర్మిష్ట ముఖర్జీ గ్రేటర్ కైలాష్ నుంచి పార్టీ తనకు టికెట్ ఇచ్చినట్లయితే పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మరొకరికి టికెట్ ఇచ్చినా తాను ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమని కూడా ఆమె చెప్పారు. పార్టీకి గ్రేటర్ కైలాష్ సీటు గెలిచిపెట్టడమే తన ఉద్దేశమని ఆమె అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ గెలిచారు. ఆయన బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రాను ఓడించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నుంచి మాజీ మేయర్లు ఆర్తీ మెహ్రాకు గానీ, సరితా చౌదరికి గానీ టికెట్ ఇవ్వవచ్చు. సౌరభ్ భరద్వాజ్‌కే మళ్లీ టికెట్ ఇవ్వనున్నట్లు ఆప్ ఇదివరకే ప్రకటించింది. పలు ఉద్యమాల్లో .. శర్మిష్ట ముఖర్జీ ఈ సంవత్సరమే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు, ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అలంకరణ కోసం కేటాయించిన పార్కులలో తమకు ఆడుకునే హక్కు ఉందని డిమాండ్ చేస్తూ దక్షిణ ఢిల్లీలోని పిల్లలు ప్రారంభించిన గివ్ బ్యాక్ అవర్ ప్లేగ్రౌండ్స్ ఉద్యమానికి కూడా ఆమె చేయూత నందిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి లతికా దీక్షిత్.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నియోజకవర్గం నుంచి షీలాదీక్షిత్ కుమార్తె లతికా దీక్షిత్ సయ్యద్‌ను నిలబెట్టాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న లతికా దీక్షిత్‌ను ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆమె సోదరుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఒప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం కూడా ఈ నియోజకవర్గం నుంచి లతికా దీక్షిత్‌ను నిలబెట్టడానికి సముఖంగా ఉందని అంటున్నారు. లతికా పిన్న వయస్కురాలు అయినప్పటికీ షీలాదీక్షిత్‌కు కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సత్సంబంధాల కారణంగా న్యూఢిల్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి మళ్లీ పోటీ చేస్తారని ఆప్ అంటుండగా, తాను కూడా న్యూఢిల్లీ నుంచే పోటీ చేస్తానని ఆప్ తిరుగుబాటు నేత, లక్ష్మీనగర్ మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ప్రకటించారు. -
నార్వేతో 13 ఒప్పందాలు
ఓస్లో: ద్వైపాక్షిక సంబంధాల పెంపునకు భారత్, నార్వేలు రక్షణ, విద్య తదితర రంగాల్లో 13 ఒప్పందాలపై మంగళవారం సంతకాలు చేశాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని భారత బృందం నార్వే పర్యటనలో వీటిని కుదుర్చుకున్నాయి. భారత్‌లో నూతన ప్రభుత్వం తలపెట్టిన మేకిన్ ఇండియా (భారత్‌లో తయారీ) కార్యక్రమంలో భాగం కావాలని నార్వే కంపెనీలను ఈ సందర్భంగా ప్రణబ్ ఆహ్వానించారు. రైల్వే, రహదారులు, పోర్టులు, విద్యుత్, కమ్యూనికేషన్ల రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పిలుపునిచ్చారు. -
రాష్ట్రపతి, స్పీకర్‌తో టీ సభాపతుల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు శాసన సభ కార్యదర్శి సదారాం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కంటే ముందు వీరు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కూడా కలిశారు. వీరితో పాటు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత, జి.నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాంనాయక్, బీబీ పాటిల్, బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, శాసనసభ్యుడు ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రుడు, వేణుగోపాలాచారి ఉన్నారు. రాష్ర్టంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సభా సాంప్రదాయాలపై అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌కు మధుసూదనాచారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. దీంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించి సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ర్టపతితో భేటీ సందర్భంగా తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను స్పీకర్ బృందం వివరించింది. ఈ సందర్భంగా ప్రణబ్ స్పందిస్తూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో ఎదురయ్యే సమస్యలను అర్థంచేసుకుని ముందుకు సాగుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు. ఇటీవల జూబ్లీహాల్లో జరిగిన శాసనమండలి సమావేశాల గురించి మండలి చైర్మన్ స్వామిగౌడ్ వివరించగా.. ఆ భవనానికి ఉన్న చారిత్రక విశేషాలను, ఆ భవనంతో తనకున్న అనుబంధాన్ని రాష్ర్టపతి గుర్తు చేసుకున్నారు. -
రేపు రాష్ట్రపతి, ప్రధానితో కేసీఆర్ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఆయన ఢిల్లీలో పలువురు ప్రముఖులను కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. తొలుత ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమవుతారు. మధ్యాహ్నం తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలను కేసీఆర్ కలుస్తారు. -
నా పాలన తెరిచిన పుస్తకం
జాతినుద్దేశించి చివరి ప్రసంగంలో మన్మోహన్ ప్రధాని పదవికి రాజీనామా పదేళ్ల భారాన్ని దించుకుంటూ నిష్ర్కమణ ప్రజా తీర్పును మేమంతా గౌరవించాల్సిందే అంతిమ తీర్పు కన్నా ముందు దానికే తలొంచాలి ఇంత గొప్ప దేశానికి సేవ చేయడంనా అదృష్టం నా వంటి సామాన్యుడిని ప్రధానిని చేసింది ప్రజా సేవకు శాయశక్తులా ప్రయత్నించా నా పదేళ్ల పాలనలో దేశం బలోపేతమైంది మీ ప్రేమ, సానుభూతులను మోసుకెళ్తున్నా ఉద్వేగభరితంగా మాట్లాడిన మన్మోహన్ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు న్యూఢిల్లీ: లాంఛనం ముగిసింది. పదేళ్లుగా పంటి బిగువున మోస్తూ వస్తున్న భారాన్ని మన్మోహన్సింగ్ (81) ఎట్టకేలకు దించుకున్నారు. ప్రధాని పదవికి శనివారం రాజీనామా చేశారు. తొలి సిక్కు ప్రధాని అన్న రికార్డుతో పాటు స్వతంత్ర భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత అసమర్థ, నిస్సహాయ ప్రధాని అన్న దుష్కీర్తిని కూడా మూటగట్టుకుని భారంగా నిష్ర్కమించారు. వరుసగా రెండుసార్లు ప్రధానిగా పూర్తి పదవీకాలాన్ని ముగించుకున్న ఆయన శనివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి సంక్షిప్తంగా వీడ్కోలు ప్రసంగం చేశారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నెహ్రూ తర్వాత వరుసగా అత్యధిక కాలం పాటు ప్రధానిగా కొనసాగిన ఘనత సాధించిన మన్మోహన్, ‘ప్రధానిగా చివరిసారిగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ఏమన్నారంటే... పునాదులు పటిష్టమయ్యాయి ‘‘పదేళ్ల క్రితం నాకు అప్పగించిన బాధ్యతలను శ్రద్ధే తన పనిముట్టుగా, సత్యమే దారిచూపే దీపంగా భావిస్తూ స్వీకరించాను. నేను నిత్యం సరైన పనులే చేయాలని ఆ సందర్భంగా ప్రార్థించాను. పదవీ బాధ్యతలను పరిత్యజిస్తున్న ఈ వేళ, మనందరికీ దైవమిచ్చే అంతిమ తీర్పు కంటే ముందు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ప్రజాభిప్రాయమనే కోర్టు ముందు తలొంచాల్సి ఉంటుంది. నా తోటి పౌరులారా! మీరిచ్చిన తీర్పును అందరమూ గౌరవించాలి. తాజాగా ముగిసిన ఎన్నికలు మన ప్రజాస్వామ్య తంత్రపు పునాదులను మరింతగా పటిష్టపరిచాయి. నావి సాదాసీదా మూలాలు నావి అత్యంత సాదాసీదా మూలాలు. దేశ విభజన తాలూకు భారాన్ని మోసిన దురదృష్టవంతుడైన పిల్లాడిని. అలాంటి వ్యక్తిని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిన గొప్పదనం మన దేశానిది. ఇంత గొప్ప దేశానికి సేవ చేయగలగడం నాకు దక్కిన అతి గొప్ప గౌరవం. ఇంతకంటే నేను కోరదగింది మరొకటేమీ లేదు, ఉండబోదు. దీన్ని నేనెప్పటికీ తీర్చుకోలేని రుణంగా, నాకు దక్కిన అపురూప గౌరవంగా నిత్యం సగర్వంగా గుర్తుంచుకుంటా. నా పనితీరుతో గర్విస్తున్నా మీనుంచి నిరంతరం అందుకున్న ప్రేమ, సానుభూతి ఈ వీడ్కోలు వేళ నా జ్ఞాపకాల్లో మెదులుతున్నాయి. నా జీవితమే కాదు, ప్రధానిగా నా పదవీకాలం కూడా ఓ తెరిచిన పుస్తకమని చాలాసార్లు చెప్పాను. దేశానికి సేవ చేసేందుకు నిరంతరం శాయశక్తులా కృషి చేశాను. గత పదేళ్ల కాలాన్ని ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే ఎన్నో విజయాలు, సాఫల్యాలు కన్పిస్తున్నాయి. వాటిని చూసి గర్విస్తున్నాను. గత దశాబ్ద కాలంలో దేశం అన్ని రంగాల్లోనూ ఎంతో బలోపేతమైంది. ఈ విజయం తాలూకు ఘనత పూర్తిగా మీదే. మరింత అభివృద్ధి సాధించడానికి అపారమైన అవకాశాలెన్నో మన ముందున్నాయి. అందుకు మనమంతా సమష్టిగా కృషి చేయాలి. మన దేశానికి అద్భుత భవిష్యత్తుందన్న నమ్మకం నాకుంది. సంప్రదాయం-ఆధునికత, భిన్నత్వంలో ఏకత్వం వంటి సుగుణాలను మేళవించడం ద్వారా మన దేశం ప్రపంచానికే దారి చూపగలదు. తిరుగులేని ఆర్థిక శక్తిగా ప్రపంచ పటంలో భారత్ గణనీయమైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. రాబోయే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధించాలని, దేశాన్ని మరింత విజయపథంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను. జైహింద్’’ రాష్ట్రపతితో మన్మోహన్ భేటీ రాజీనామా లేఖ సమర్పణ కొత్త ప్రభుత్వం వచ్చేదాకా కొనసాగండి మన్మోహన్‌ను కోరిన ప్రణబ్ దాదా న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్సింగ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. తన అధికార నివాసమైన 7, రేస్‌కోర్స్ రోడ్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. తనతో పాటు తన మంత్రివర్గ రాజీనామా లేఖను కూడా ప్రణబ్‌కు అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా వారందరినీ బాధ్యతల్లో కొనసాగాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రణబ్, మన్మోహన్ పరస్పరం పుష్పగుచ్ఛాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మన్మోహన్ మంత్రివర్గంలో ప్రణబ్ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖల బాధ్యతలు నిర్వర్తించడం తెలిసిందే. ఇద్దరూ కొద్దిసేపు పాటు కరచాలనం చేస్తూ, సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉద్విగ్నభరిత వాతావరణంలో గడిపారు. ప్రణబ్ కార్యదర్శి ఒమితా పాల్‌తో పాటు రాష్ట్రపతి భవన్ సిబ్బంది అందరికీ మన్మోహన్ వీడ్కోలు తెలిపి వెనుదిరిగారు. ప్రణబ్ రాష్ట్రపతి భవన్ ప్రాంగణం బయటిదాకా వచ్చి మరీ మన్మోహన్‌ను సాగనంపడం విశేషం! -
విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం
-
మళ్లీ రాష్ట్రపతి పాలన వైపు ఆలోచన
-
మీ ఆశీస్సులుండాలి: రాష్ట్రపతితో కేసీఆర్
-
రాష్ట్రపతి పాలనా? కొత్త ప్రభుత్వమా?
-
ఎటువంటి సందర్భంలో రాష్ట్రపతిపాలన విధిస్తారు?
-
రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రం
-
దాదా సూచనలు
-
ప్రణబ్‌తో భేటీ కానున్న చంద్రబాబు
-
రాష్ట్రపతిని విమర్శించొచ్చు: చంద్రబాబు
-
పావగడలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం
వైద్య శాఖ ఉద్యోగి ఇంట్లో రూ.3.60 లక్షల విలువైన బంగారు నగల దోపిడీ = అచ్చ తెలుగులో మాట్లాడిన దొంగలు = బాధితులు చెప్పిన ఆనవాళ్ల మేరకు దొంగల ఊహా చిత్రాలు రూపొందించిన పోలీసులు పావగడ, న్యూస్‌లైన్ : పావగడలో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో అలంకార థియేటర్ ఎదురుగా ఉన్న విద్యానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కాలనీలోని హెల్త్ అసిస్టెంట్ రవిచంద్ర కుమార్ ఇంట్లోకి జొరబడి సుమారు రూ.3.60 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై శనివారం పోలీసులు, బాధితుల తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి రవిచంద్రకుమార్, భార్య నాగకీర్తి, అతని తల్లి గంగమ్మ, పదేళ్లలోపున్న కుమారులు ప్రణబ్, ప్రణీత్ నిద్రపోయారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దుండగులు గేటు తాళాలు పగులగొట్టి కాంపౌండ్ లోపలకు వచ్చి, మెయిన్ డోర్‌కున్న లాక్‌ను బండరాయితో ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వారు మేల్కొనే సరికే డ్రాయర్లతో ఉన్న ముగ్గురు లోపలకు వచ్చేశారు. ‘మీకు ఎలాంటి హాని తలపెట్టం.. బంగారు నగలు, డబ్బు ఇవ్వండి’ అంటూ కత్తితో బెదిరించారు. ప్రాణ భయంతో రవిచంద్ర కుమార్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వగా, అతని భార్య తన ఒంటిపై ఉన్న బంగారు నగలను ఇచ్చేసింది. తర్వాత గంగమ్మ మెడలోని మాంగల్యం సరం, ముత్యాల సరం, చెవిలో కమ్మల్ని దుండగులు కాజేశారు. వారిని ఒక గదిలో బంధించి, డబ్బు కోసం ఇంట్లోని బీరువాలో వెదుకుతుండగా, గంగమ్మ కేకలు వేసింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. స్థానికుల సమాచారంతో సీఐ భానుప్రసాద్, ఎస్ఐ అశోక్‌కుమార్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దొంగల ఆచూకీ కోసం చుట్టుపక్కల భారీగా గాలించారు. తుమకూరు నుంచి జాగిలాలను రప్పించగా, అవి ఇంటి నుంచి కొంతదూరం పట్టణం వైపు వెళ్లి తిరిగొచ్చేశాయి. వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. కాగా దోపిడీ దొంగలు 25-30 ఏళ్ల లోపు ఉన్న వారేనని, వారు అచ్చ తెలుగులో మాట్లాడారని, ఇంటి బయట కూడా మరో దొంగ కాపలా ఉన్నాడని బాధితులు పోలీసులకు వివరించారు. ఏఎస్పీ లక్ష్మణ్, మధుగిరి సబ్ డివిజన్ డీఎస్పీ గురుస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులు దొంగల రూపురేఖలను చెప్పిన మేరకు వారి ఊహా చిత్రాలను పోలీసులు రూపొందించారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భానుప్రసాద్ తెలిపారు. -
రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు
-
నేడు అనంతపురంలో రాష్ట్రపతి పర్యటన
-
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
-
రాష్ట్రాల విభజనను విజ్ణ్జ్తతో వ్యవహరించాలి
-
నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక
-
మండేలాకు ప్రణబ్ నివాళి
-
అగ్నిగుండంలా మారిన రాష్ట్రం:విజయమ్మ
-
యావజ్జీవ ‘మరణ’ శిక్ష?!
కామెంట్: దర్యాప్తులో, విచారణలో జాప్యం జరగలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచింది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. మరి...? మంగన్‌లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో! కాల్పనిక ప్రపంచంలోనే వింతలు ఉంటా యని అనుకుంటాం. కానీ జీవితంలోనే విం తలు ఉంటాయి. ఆశ్చర్యం గొలిపే సంఘ టనలు, భయంగొలిపే సంఘటనలు జీవితం లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకు ఉదా హరణ మంగన్‌లాల్ బరేలా ఉరిశిక్ష ఉదం తం. మృత్యువు దరిదాపుల్లోకి వెళ్లి తాత్కాలి కంగా బయటపడిన వ్యక్తి మంగన్‌లాల్.ఆగస్టు 8 గురువారం ఉదయం మంగల్ లాల్‌ని ఉరితీయడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జైలు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అతన్ని ఉరితీయడానికి సెహోర్ జిల్లా కోర్టు ‘బ్లాక్ వారెంట్స్’ జారీ చేసింది. జబల్ పూర్ జిల్లాలోని కేంద్ర కారాగారంలో అతడిని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పత్రి కల్లో వచ్చిన వార్తల ప్రకారం అజ్మల్ కసబ్‌ని ఉరి తీసిన తలారిని ఈ ఉరి తీయడానికి ఎం పిక చేశారు. అతను సోమవారం నాడు జబల్ పూర్ చేరుకున్నాడు. కష్టం కలుగకుండా అతని ఉరిశిక్ష అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. సరిగ్గా అతన్ని ఉరి తీయడానికి ఆరు గంటల ముందు ఉరిశిక్షని నిలిపివేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. గురువారం ఉదయం అతన్ని ఉరితీస్తా రన్న వార్త పత్రికల్లో చదివి మరణశిక్షని వ్యతి రేకించే న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తలుపు బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తట్టారు. ప్రజాహిత కేసుని దాఖలుచేసి ఉరిశిక్ష అమ లుని నిలిపివేయమని కోరారు. దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉరిశిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువా రం ఉదయం ప్రధాన న్యాయమూర్తి మొదటి కేసుగా ఈ కేసుని విచారించి ఉరిశిక్ష అమలు నిలుపుదలని పొడిగించారు. సుప్రీంకోర్టు ముందు ఇంకా విచారణలో ఉన్న ఇతర మర ణశిక్ష కేసులతో పాటు 2013, అక్టోబర్ 22న మంగన్‌లాల్ కేసును విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఆ కేసులతో పాటు అతని కేసుని విచారణ జరిపిన తరువాత మర ణశిక్ష అమలుచేస్తారు. మరణశిక్ష విధించడం లో జాప్యం జరిగిన కారణంగా ఆ కేసును యావజ్జీవశిక్షగా మార్చడానికి వీలుందా అనే అంశాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించాల్సి ఉంది. అంటే మరణశిక్ష కోసం లేదా జీవితఖైదు కో సం మంగల్లాల్ వేచి ఉండాల్సి ఉంటుంది. మంగన్లాల్కు మరణశిక్షను విధించడా నికి కారణం ఏమిటి? రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వ కుండా తిరస్కరించిన తరువాత ఉరి నిలిపి వేయడానికి కారణం ఏమిటి? మరణశిక్ష కోసం ఎంతకాలం వేచి ఉండాలి? ఈ ప్రశ్నల కి సమాధానాలను వెతికే ప్రయత్నం చేద్దాం. జమున (1 సంవత్సరం), లీల (3), ఆర్వా (4), సబిత (50), కున్వర్ (6)లను హత్య చేసిన వ్యక్తి మంగన్‌లాల్. అతనికి ఇద్దరు భార్యలు. ఈ పిల్లలు అతని ఇద్దరు భార్యల ద్వారా జన్మించిన సంతతి. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. దాన్ని అమ్మడానికి అతను ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని అతని సోదరులు, అతని ఇద్దరు భార్యలు విరమింపచేశారు. ఆ భూమి అమ్మే సి పిల్లల్ని ఎలా పోషిస్తావని కూడా వాళ్లు ప్రశ్నించారు. కోపగించుకున్న మంగన్‌లాల్ 2010, జూన్ 10/11 రాత్రి భోజనం చేయ లేదు. ఉదయం కూడా అతను భోజనం చేయ డానికి నిరాకరించాడు. అతని భార్యలు వ్యవ సాయ పనులకు వెళ్లిపోయిన తరువాత తన ఐదుగురు పిల్లలను అతను గొడ్డలితో దారు ణంగా నరికి చంపాడు. ఆ సంఘటన జరిగిన కొద్ది సేపటికి అతని ఇద్దరు భార్యలు ఇంటికి వచ్చి చూసి భయభ్రాంతులై కేకలు వేశారు. గుండెలు బాదుకున్నారు. వాళ్లను చంపడానికి అతను విఫలయత్నం చేశాడు. ఆ తరువాత అతను ఉరివేసుకొని చనిపోవడానికి ప్రయ త్నం చేశాడు. ఆ తాడుని కోసేసి అతని ప్రయ త్నాన్ని నిలిపివేశారు అతని భార్యలు. అతన్ని తాడుతో కట్టేసి పోలీసులకి అప్పగించారు. కేసుని విచారించిన సెహోర్ సెషన్స్ న్యాయ మూర్తి అతనికి మరణశిక్ష 2011, ఫిబ్రవరి 3న విధించి ధృవీకరణ కోసం మధ్యప్రదేశ్ హైకో ర్టుకు పంపించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసును విచారించి మరణశిక్ష ధృవీకరించింది. శిక్ష తగ్గించడానికి, శిక్షను అదేవిధంగా నిర్ధా రించడానికి గల కారణాలను పరిశీలించి మర ణశిక్షను హైకోర్టు ధృవీకరించింది. మృతుల వయస్సు, నేరం చేసిన విధానం, అత్యంత కిరాతకంగా చంపిన తీరు, ఎలాంటి పురికొల్పే కారణాలు లేకుండా కన్నపిల్లల్ని చంపిన తీరును, ఇతర అంశాలను గమనించి హైకోర్టు 2011, సెప్టెంబర్ 12న మరణశిక్షను ధృవీ కరించింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ప్రత్యే క అనుమతి అప్పీలును మంగన్‌లాల్ సుప్రీం కోర్టు ముందు దాఖలు చేశాడు. న్యాయ మూర్తులు హెచ్ఎల్ దత్తు, సి.కె.ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అప్పీలుకు అనుమతి ఇవ్వ కుండా 2012, జనవరిలో అప్పీలును కొట్టి వేసింది. ఆ తరువాత క్షమాభిక్ష ప్రసాదించమని రాష్ట్రపతికి మంగన్‌లాల్ దరఖాస్తు చేసుకు న్నాడు. మరణశిక్షను జీవితఖైదుగా మార్చ మని అతను తన దరఖాస్తులో వేడుకున్నాడు. అతని దరఖాస్తును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2013, జూలై 22న తిరస్కరించారు. ఆ తరు వాత అతనికి విధించిన ఉరిశిక్షను అమలు చేయమని సెషన్స్ కోర్టు బ్లాక్ వారెంట్స్‌ను జారీచేసింది. ఉరిశిక్ష సమాచారం పత్రికల్లో రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ముందు ఉరిశిక్ష అమలు నిలిపివేత కోరుతూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఉరిశిక్ష అమలుకు 6 గంటల ముందు ఆ శిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అతను ఉరిశిక్షకు అర్హుడా కాదా? ఉరి శిక్ష లు ఉండాలా వద్దా? వంటి వివాదాస్పద అంశాల జోలికిపోకుండా, సుప్రీంకోర్టు ముం దు ఉరిశిక్ష రద్దు పిటిషన్లో పీయూడీఆర్ లేవనెత్తిన అంశాలు ఏమిటి? ఈ నేపథ్యంలో జాప్యం ఎక్కడ జరిగిందో పరిశీలించాలి. నేరం జరిగింది. 2010, జూన్ 11న. సెషన్స్ కోర్టు తీర్పును ప్రకటించింది 2011, ఫిబ్రవరి 3న. హైకోర్టు మరణశిక్షను ధృవీకరిస్తూ తీర్పు చెప్పింది 2011, సెప్టెంబర్ 12న. సుప్రీంకోర్టు అతని అనుమతి అప్పీలును తిరస్కరించింది. 2012 జనవరిలో క్షమాభిక్ష విన్నపాన్ని రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ 2013, జూలై 22న తిర స్కరించారు. దర్యాప్తులో, విచారణలో జాప్యం జర గలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచిం ది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కోర్టుల్లో జాప్యానికి అనేక కారణాలు ఉంటాయి. మరి...? మం గన్లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో! - మంగారి రాజేందర్ జిల్లా జడ్జి, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్ -
ప్రణబ్‌కు రాష్ట్రపతిగా ఏడాది పూర్తి