ఉగ్రవాదాన్ని దేశ విధానంలో భాగంగా ప్రోత్సహించే లేదా మద్దతిచ్చే దేశాలను ప్రపంచం బహిష్కరించాలని...
ఉగ్రవాదంపై ప్రణబ్ పిలుపు
జైపూర్: ఉగ్రవాదాన్ని దేశ విధానంలో భాగంగా ప్రోత్సహించే లేదా మద్దతిచ్చే దేశాలను ప్రపంచం బహిష్కరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. తద్వారా పరోక్షంగా పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూ.. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం ఉండవని.. ఉగ్రవాదం అనేది క్యాన్సర్ అని, బలమైన కత్తితో శస్త్రచికిత్స చేసి తొలగించాలన్నారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్నీ ప్రపంచం తిరస్కరించాలన్నారు. ఇండియా ఫౌండేషన్ సంస్థ రాజస్తాన్ ప్రభుత్వంతో కలసి మంగళవారం జైపూర్‌లో ఏర్పాటు చేసిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సును రాష్ట్రపతి ప్రారంభించి ప్రసంగించారు.
అమెరికాపై 9/11 ఉగ్రవాద దాడులు కీలకమైన పరిణామంగా అభివర్ణిస్తూ.. అప్పటి నుంచీ అనుసరించిన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాల గెలుపోటముల నుంఇచ పాఠాలు నేర్చుకోవాలని ప్రణబ్ సూచించారు.