
బెత్లెహాం కళకళ
బెత్లెహాం: క్రిస్మస్ సందర్భంగా బెత్లెహాం భక్తులతో కళకళలాడుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది భక్తులు క్రీస్తు జన్మదిన వేడుక కోసం పట్టణానికి చేరుకున్నారు. క్రీస్తు పుట్టినట్లు భావిస్తున్న చర్చ్ ఆఫ్ నేటివిటీ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి సంబరాలు, భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుంటున్నారు. గత ఏడాది పాలస్తీనియన్లు ఇజ్రాయెలీలపై కత్తులతో దాడులు చేయడంతో బెత్లెహాం వేడుకలకు కాస్త ఆటంకం కలిగింది. ఈసారి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోపక్క.. జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన ట్రక్కు దాడి నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. జర్మనీ, ఇటలీ తదితర దేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రణబ్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘క్రిస్మస్ ఆనంద సమయాన భారతీయులందరికీ శుభాకాంక్షలు. ఈ ఉత్సాహం మన హృదయాల్లో ప్రేమ, కరుణ నింపాలి.’ అని ప్రణబ్ సందేశమిచ్చారు.