యావజ్జీవ ‘మరణ’ శిక్ష?! | Supreme court stays death penalty of Maganlal Barela guilty of beheading 5 daughters | Sakshi
Sakshi News home page

యావజ్జీవ ‘మరణ’ శిక్ష?!

Published Thu, Aug 8 2013 11:57 PM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

యావజ్జీవ ‘మరణ’ శిక్ష?! - Sakshi

యావజ్జీవ ‘మరణ’ శిక్ష?!

కామెంట్: దర్యాప్తులో, విచారణలో జాప్యం జరగలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచింది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. మరి...? మంగన్‌లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో!
 
 కాల్పనిక ప్రపంచంలోనే వింతలు ఉంటా యని అనుకుంటాం. కానీ జీవితంలోనే విం తలు ఉంటాయి. ఆశ్చర్యం గొలిపే సంఘ టనలు, భయంగొలిపే సంఘటనలు జీవితం లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకు ఉదా హరణ మంగన్‌లాల్ బరేలా ఉరిశిక్ష ఉదం తం. మృత్యువు దరిదాపుల్లోకి వెళ్లి తాత్కాలి కంగా బయటపడిన వ్యక్తి మంగన్‌లాల్.ఆగస్టు 8 గురువారం ఉదయం మంగల్ లాల్‌ని ఉరితీయడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జైలు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
 
  అతన్ని ఉరితీయడానికి సెహోర్ జిల్లా కోర్టు ‘బ్లాక్ వారెంట్స్’ జారీ చేసింది. జబల్ పూర్ జిల్లాలోని కేంద్ర కారాగారంలో అతడిని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పత్రి కల్లో వచ్చిన వార్తల ప్రకారం అజ్మల్ కసబ్‌ని ఉరి తీసిన తలారిని ఈ ఉరి తీయడానికి ఎం పిక చేశారు. అతను సోమవారం నాడు జబల్ పూర్ చేరుకున్నాడు. కష్టం కలుగకుండా అతని ఉరిశిక్ష అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. సరిగ్గా అతన్ని ఉరి తీయడానికి ఆరు గంటల ముందు ఉరిశిక్షని నిలిపివేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. గురువారం ఉదయం అతన్ని ఉరితీస్తా రన్న వార్త పత్రికల్లో చదివి మరణశిక్షని వ్యతి రేకించే న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తలుపు బుధవారం రాత్రి 10.30 గంటల  ప్రాంతంలో తట్టారు. ప్రజాహిత కేసుని దాఖలుచేసి ఉరిశిక్ష అమ లుని నిలిపివేయమని కోరారు.
 
 దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉరిశిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువా రం ఉదయం ప్రధాన న్యాయమూర్తి మొదటి కేసుగా ఈ కేసుని విచారించి ఉరిశిక్ష అమలు నిలుపుదలని పొడిగించారు. సుప్రీంకోర్టు ముందు ఇంకా విచారణలో ఉన్న ఇతర మర ణశిక్ష కేసులతో పాటు 2013, అక్టోబర్ 22న మంగన్‌లాల్ కేసును విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఆ కేసులతో పాటు అతని కేసుని విచారణ జరిపిన తరువాత మర ణశిక్ష అమలుచేస్తారు. మరణశిక్ష విధించడం లో జాప్యం జరిగిన కారణంగా ఆ కేసును యావజ్జీవశిక్షగా మార్చడానికి వీలుందా అనే అంశాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించాల్సి ఉంది. అంటే మరణశిక్ష కోసం లేదా జీవితఖైదు కో సం మంగల్‌లాల్ వేచి ఉండాల్సి ఉంటుంది. మంగన్‌లాల్‌కు మరణశిక్షను విధించడా నికి కారణం ఏమిటి? రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వ కుండా తిరస్కరించిన తరువాత ఉరి నిలిపి వేయడానికి కారణం ఏమిటి? మరణశిక్ష కోసం ఎంతకాలం వేచి ఉండాలి? ఈ ప్రశ్నల కి సమాధానాలను వెతికే ప్రయత్నం చేద్దాం.
 
 జమున (1 సంవత్సరం), లీల (3), ఆర్వా (4), సబిత (50), కున్వర్ (6)లను హత్య చేసిన వ్యక్తి మంగన్‌లాల్. అతనికి ఇద్దరు భార్యలు. ఈ పిల్లలు అతని ఇద్దరు భార్యల ద్వారా జన్మించిన సంతతి. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. దాన్ని అమ్మడానికి అతను ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని అతని సోదరులు, అతని ఇద్దరు భార్యలు విరమింపచేశారు. ఆ భూమి అమ్మే సి పిల్లల్ని ఎలా పోషిస్తావని కూడా వాళ్లు ప్రశ్నించారు. కోపగించుకున్న మంగన్‌లాల్ 2010, జూన్ 10/11 రాత్రి భోజనం చేయ లేదు. ఉదయం కూడా అతను భోజనం చేయ డానికి నిరాకరించాడు. అతని భార్యలు వ్యవ సాయ పనులకు వెళ్లిపోయిన తరువాత తన ఐదుగురు పిల్లలను అతను గొడ్డలితో దారు ణంగా నరికి చంపాడు. ఆ సంఘటన జరిగిన కొద్ది సేపటికి అతని ఇద్దరు భార్యలు ఇంటికి వచ్చి చూసి భయభ్రాంతులై కేకలు వేశారు. గుండెలు బాదుకున్నారు. వాళ్లను చంపడానికి అతను విఫలయత్నం చేశాడు. ఆ తరువాత అతను ఉరివేసుకొని చనిపోవడానికి ప్రయ త్నం చేశాడు. ఆ తాడుని కోసేసి అతని ప్రయ త్నాన్ని నిలిపివేశారు అతని భార్యలు.
 
 అతన్ని తాడుతో కట్టేసి పోలీసులకి అప్పగించారు. కేసుని విచారించిన సెహోర్ సెషన్స్ న్యాయ మూర్తి అతనికి మరణశిక్ష 2011, ఫిబ్రవరి 3న విధించి ధృవీకరణ కోసం మధ్యప్రదేశ్ హైకో ర్టుకు పంపించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసును విచారించి మరణశిక్ష ధృవీకరించింది. శిక్ష తగ్గించడానికి, శిక్షను అదేవిధంగా నిర్ధా రించడానికి గల కారణాలను పరిశీలించి మర ణశిక్షను హైకోర్టు ధృవీకరించింది. మృతుల వయస్సు, నేరం చేసిన విధానం, అత్యంత కిరాతకంగా చంపిన తీరు, ఎలాంటి పురికొల్పే కారణాలు లేకుండా కన్నపిల్లల్ని చంపిన తీరును, ఇతర అంశాలను గమనించి హైకోర్టు 2011, సెప్టెంబర్ 12న మరణశిక్షను ధృవీ కరించింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ప్రత్యే క అనుమతి అప్పీలును మంగన్‌లాల్ సుప్రీం కోర్టు ముందు దాఖలు చేశాడు. న్యాయ మూర్తులు హెచ్‌ఎల్ దత్తు, సి.కె.ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అప్పీలుకు అనుమతి ఇవ్వ కుండా 2012, జనవరిలో అప్పీలును కొట్టి వేసింది.
 
 ఆ తరువాత క్షమాభిక్ష ప్రసాదించమని రాష్ట్రపతికి మంగన్‌లాల్ దరఖాస్తు చేసుకు న్నాడు. మరణశిక్షను జీవితఖైదుగా మార్చ మని అతను తన దరఖాస్తులో వేడుకున్నాడు. అతని దరఖాస్తును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2013, జూలై 22న తిరస్కరించారు. ఆ తరు వాత అతనికి విధించిన ఉరిశిక్షను అమలు చేయమని సెషన్స్ కోర్టు బ్లాక్ వారెంట్స్‌ను జారీచేసింది. ఉరిశిక్ష సమాచారం పత్రికల్లో రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ముందు ఉరిశిక్ష అమలు నిలిపివేత కోరుతూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఉరిశిక్ష అమలుకు 6 గంటల ముందు ఆ శిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
 అతను ఉరిశిక్షకు అర్హుడా కాదా? ఉరి శిక్ష లు ఉండాలా వద్దా? వంటి వివాదాస్పద అంశాల జోలికిపోకుండా, సుప్రీంకోర్టు ముం దు ఉరిశిక్ష రద్దు పిటిషన్‌లో పీయూడీఆర్ లేవనెత్తిన అంశాలు ఏమిటి? ఈ నేపథ్యంలో జాప్యం ఎక్కడ జరిగిందో పరిశీలించాలి. నేరం జరిగింది. 2010, జూన్ 11న. సెషన్స్ కోర్టు తీర్పును ప్రకటించింది 2011, ఫిబ్రవరి 3న. హైకోర్టు మరణశిక్షను ధృవీకరిస్తూ తీర్పు చెప్పింది 2011, సెప్టెంబర్ 12న. సుప్రీంకోర్టు అతని అనుమతి అప్పీలును తిరస్కరించింది. 2012 జనవరిలో క్షమాభిక్ష విన్నపాన్ని రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ 2013, జూలై 22న తిర స్కరించారు. దర్యాప్తులో, విచారణలో జాప్యం జర గలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచిం ది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కోర్టుల్లో జాప్యానికి అనేక కారణాలు ఉంటాయి. మరి...? మం గన్‌లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో!
 
 - మంగారి రాజేందర్
 జిల్లా జడ్జి, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్,
 ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement