P Sathasivam
-
జరిమానా చెల్లించిన గవర్నర్
రాజ్యాంగ పదవిలో ఉన్న కూడా రవాణా శాఖ అధికారులు తన వాహనానికి విధించిన జరిమానా చెల్లించారు కేరళ గవర్నర్ పి సదాశివం. వివరాల్లోకి వెళితే.. సదాశివం అధికారిక వాహనం మెర్సిడెస్ బెంజ్ కారు 10 రోజుల కిందట నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించింది. కౌడియర్ రోడ్డులో 55 కి.మీ వేగ పరిమితి ఉండగా.. గవర్నర్ వాహనం మాత్రం 80 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో గవర్నర్ లేకపోవడంతో డ్రైవర్ స్పీడ్‌గా వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి స్పీడ్ డిటెక్టర్ సెన్సార్లలో కారు అధిక వేగంతో వెళ్లినట్టు రికార్డయింది. దీంతో రవాణా శాఖ అధికారులు గవర్నర్ వాహనానికి 400 రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ వెంటనే ఆ ఫైన్ చెల్లించాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలతో ఆయన సెక్రటరీ రవాణా శాఖ కార్యాలయంలో జరిమానా చెల్లించారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందిస్తూ.. తొలుత గవర్నర్ వాహనానికి ఫైన్ విధించే అంశంలో వెనుకడుగు వేసినప్పటికి.. నిబంధనల ప్రకారం నడుచుకున్నామని తెలిపారు. గవర్నర్ చేసిన ఈ పని పలువురికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. -
ఈసారీ అధికారం మాదే
ముంబై : వరుసగా నాలుగో పర్యాయం కూడా తమనే ప్రజలు ఎన్నుకుంటారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో శని వారం ఆయన శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ఓ గాలి వీచింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, శాసనసభ ఎన్నికల ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య తే డా ఉంటుంది. ఎవరికి పగ్గాలను అప్పగించాలనే విషయం ప్రజలకు తెలుసు. వారు తెలివైన నిర్ణయం తీసుకుంటారు. మహారాష్ట్రను అభివృద్ధి విషయంలో మరింత బాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. అందువల్లనే ప్రజలను ఓట్లు వేయాల్సిందిగా కోరనున్నాం’ అని అన్నారు. అమిత్ షా డైరీ నిండా కోర్టు కేసుల తేదీలే కేరళ గవర్నర్‌గా పి.సదాశివన్‌ను నియమించడమేమిటని ఆయన ప్రశ్నించారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై కేసులు ఎత్తివేసినందుకు కృతజ్ఞతగానే ఆయనకు ఈ పదవిలో నియమిస్తున్నారనే వదంతులు షికార్లు చేస్తున్నాయన్నారు. ఈ క్విడ్‌ప్రోకోలో నిజమెంతనే విషయం తనకు కూడా తెలియదన్నారు. షా డైరీ నిండా కోర్టు కేసులకు సంబంధించిన తేదీలే ఉంటాయన్నారు. ఫిరాయింపుదారులంతా అవకాశవాదులే అనేకమంది ఎన్సీపీ నాయకులు, మాజీ మంత్రులు బీజేపీలో చేరుతున్నారు కదా అని ప్రశ్నించగా వారంతా అవకాశవాదులేనని పవార్ అన్నారు. అటువంటి వారి గురించి తానేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. రాష్ట్రాన్ని ఎవరూ విడదీయలేరు రాష్ట్రాన్ని ఏ శక్తీ విడదీయలేదని ఎవరూ విడదీయలేరని పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాయన్నారు. అవన్నీ అవాస్తవాలు అనంతరం ఎన్సీపీ నాయకుడు అజిత్‌పవార్ మాట్లాడుతూ రాష్ర్టంలో రూ. 11 లక్షల కోట్ల మేర కుంభకోణాలు జరిగాయంటూ అమిత్‌షా ఇటీవల చేసిన విమర్శలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలన్నారు. గుజరాత్లో ప్రారంభించారా? అనంతరం ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ భారత్‌లో త్వరలో బులెట్ రైలును ప్రవేశపెడతామని చెబుతున్న ప్రధాని మోడీ గుజరాత్లో మోనో లేదా మెట్రో రైలును ప్రారంభించారా అని ప్రశ్నించారు. -
సామాన్యుడి దగ్గరికే న్యాయం..
దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ఏర్పాటు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సుప్రీం చీఫ్ జస్టిస్ సదాశివం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొత్త లీగల్ ఎయిడ్ క్లీనిక్‌లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ పి.సదాశివం, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఆర్.ఎం.లోథా, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రానికి సంబంధించిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర హైకోర్టులో జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ జస్టిస్ జి.రోహిణి, లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సేన్‌గుప్తా మాట్లాడుతూ... ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి బదులు... స్థానికంగా సమస్యను పరిష్కరించడమే లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తరహాలోనే... ఈ క్లినిక్‌లు ఉంటాయన్నారు. న్యాయపరంగా ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా ప్రజలు ఇప్పటివరకు పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సి ఉండేదని... లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ద్వారా ఇక ఆ ఇబ్బంది ఉండదని జస్టిస్ సేన్‌గుప్తా తెలిపారు. ఈ క్లినిక్‌ల్లో పనిచేసేందుకు అవసరమైన వలంటీర్లను పూర్తిస్థాయిలో నియమిస్తామని... క్లినిక్‌ల ఏర్పాటు లక్ష్యాన్ని విజయవంతం చేయడంలో వారిదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి న్యాయవాదుల సేవలను సైతం వినియోగించుకుంటామన్నారు. పోలీస్స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయకపోవడంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని.. లీగల్ ఎయిడ్ క్లినిక్‌లతో ప్రజలకు ఇక ఆ ఇబ్బంది ఉండదని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం తదితరాలన్నీ ప్రజల ప్రాథమిక హక్కులని.. ఆ హక్కులకు భంగం కలిగితే ప్రజలు నేరుగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌లకు వెళ్లి న్యాయం పొందవచ్చునని వివరించారు. -
‘క్షమాభిక్ష’పై జాప్యం చేస్తే..
మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించవచ్చు: సుప్రీం కీలక తీర్పు 15 మంది ఖైదీల మరణశిక్ష జీవితఖైదుకు తగ్గింపు మానసిక అనారోగ్యంతో ఉన్న ఖైదీలకూ మరణశిక్ష సరికాదన్న బెంచ్ న్యూఢిల్లీ: మరణశిక్ష నేపథ్యంలో క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకుని సుదీర్ఘకాలంగా దానిపై నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఖైదీలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త. మరణశిక్ష పడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించే విషయమై నిర్ణయం తీసుకోవడంలో మితిమీరిన, కారణాల్లేని ప్రభుత్వ జాప్యం.. వారి శిక్షను తగ్గించేందుకు ప్రాతిపదిక కావచ్చునంటూ సుప్రీంకోర్టు చెప్పింది. మరణశిక్ష పడిన 15 మంది ఖైదీలు దాఖలు చేసిన 13 పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. ఈ మేరకు మంగళవారం మైలురారుు వంటి తీర్పు వెలువరించింది. తమ క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయంలో జరిగిన జాప్యాన్ని, తమ మానసిక వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే అడవిదొంగ వీరప్పన్ అనుచరులు నలుగురు సహా మొత్తం 15 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా సుప్రీం మార్చింది. మరణశిక్ష అమలులో సాగదీత... మృత్యువు నీడలో క్షమాభిక్షపై నిర్ణయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే సదరు నేరస్తులపై అమానవీయమైన రీతిలో ప్రభావం చూపుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న నేరస్తుల మరణశిక్షను కూడా ఖైదీ మానసిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని జీవితఖైదుకు తగ్గించవచ్చని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, శివకీర్తి సింగ్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. మరణశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వాధికారులకు కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. జీవించే హక్కుకు సంబంధించిన రాజ్యాంగంలోని 21వ అధికరణ ం కేవలం శిక్ష ప్రకటనతోనే ముగియడం లేదని, సదరు శిక్ష అమలు వరకు విస్తరించిందనే విషయం తెలిసిందేనని ధర్మాసనం పేర్కొంది. ఖైదీలకు సంబంధం లేని పరిస్థితుల కారణంగా జరిగే జాప్యం మరణశిక్ష తగ్గింపును తప్పనిసరి చేస్తోందని చెప్పింది. మార్గదర్శకాలు, తీర్పులోని ముఖ్యాంశాలు... హోం శాఖ గణాంకాల ప్రకారం సగటున ఒక్కో క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించేందుకు కేంద్రం 8 నుంచి 9 ఏళ్ల సమయం తీసుకుంటోంది. ఓ కేసులో అయితే ఏకంగా 14 ఏళ్ల సమయం తీసుకుంది. 1980 వరకు ఈ పిటిషన్లను కనిష్టంగా 15 రోజుల్లో, గరిష్టంగా 10 నుంచి 11 నెలల్లో పరిష్కరించారు. 1980-88 మధ్యకాలంలో కాలవ్యవధి గణనీయంగా పెరిగి సగటున నాలుగేళ్లకు చేరుకుంది. 1989-97 మధ్య ఇది సగటున ఐదు నెలలు తగ్గినా, మళ్లీ భారీ జాప్యం పునరావృతమైంది. క్షమాభిక్ష కోరడమన్నది ఖైదీలకున్న రాజ్యాంగపరమైన హక్కు. అది అధికారుల విచక్షణపై ఉండదు. క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవండంలో దీర్ఘకాల జాప్యం వారి ప్రాథమిక హక్కులను హరించడమే. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువేదీ లేదన్న కేంద్రం వాదన సరికాదు. భారతీయ శిక్షా స్మృతి లేదా ఉగ్రవాద వ్యతిరేక చట్టం దేనికింద శిక్ష పడినప్పటికీ శిక్ష తగ్గంచవచ్చు. రాష్ట్రపతి, గవర్నర్ల అధికారం.. ఏదో దయ, ప్రత్యేక హక్కుకు సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగపరమైన విధి. క్షమాభిక్ష పిటిషన్లను ఇన్ని రోజుల్లోగా పరిష్కరించాలని గవర్నర్లు లేదా రాష్ట్రపతికి నిర్దేశించలేం. రాష్ట్రపతికి సమయూన్ని నిర్ధారించలేనప్పటికీ సంబంధిత మంత్రిత్వ శాఖను మాత్రం.. జాప్యాన్ని నివారించే దిశగా నిబంధనలు పాటించాల్సిందిగా కచ్చితంగా కోరగలం. మరణశిక్ష పడినవారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురైతే ఆ విషయూన్ని ఖైదీల కుటుంబసభ్యులకు తప్పనిసరిగా తెలియజేయూలి. ఉరిశిక్ష పడిన ఖైదీలు సహా ఏ ఖైదీకీ ఏకాంతవాస శిక్ష అమలుచేయకూడదు. అది రాజ్యాంగ విరుద్ధం. క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన సమాచారం అందిన తర్వాత, ఉరిశిక్ష అమలు చేయడానికి మధ్య కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి. ఈ తీర్పు కర్ణాటకకు చెందిన 8 మంది కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. వీటిలో కలప స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు సైమన్, జ్ఞానప్రకాష్, బిలవేంద్ర, మిసకార మాదయ్యల కుటుంబాలు ఉన్నారుు. సైమన్ తదితరులు తమిళనాడులో 22 మంది కర్ణాటక పోలీసులను మందుపాతరతో హతమార్చిన కేసులో దోషులు. ఈ తీర్పుతో 20 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న వీరప్పన్ అనుచరులను విడుదల చేయూలని అతని భార్య ముత్తులక్ష్మి కోరారు. తాజా తీర్పు రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన సంతన్, మురుగన్, పెరారివలన్ సహా పలువురు మరణశిక్ష పడిన ఖైదీలకు సైతం శిక్ష తగ్గేందుకు మార్గం సుగమం చేసింది. -
మహిళా న్యాయవాదిపై న్యాయమూర్తి లైంగిక వేధింపులు
-
మహిళా న్యాయవాదిపై న్యాయమూర్తి లైంగిక వేధింపులు
క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని ఓ గదిలో తనను సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లైంగికంగా వేధించారని నవంబర్ 6 తేదిన ఇండియన్ జర్నల్ ఆఫ్ లా అండ్ సొసైటి బ్లాగ్ లో భాదితురాలు స్టెల్లా జేమ్స్ ఆరోపణలు చేశారు. తన తాత వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న న్యాయమూర్తి తనను శారీరకంగా హింసించారు అని బ్లాగ్ స్టెల్లా తెలిపింది. ప్రస్తుతం ఓ ఎన్జీవో సంస్థలో న్యాయవాదిగా పని చేస్తున్న స్టెల్లా ఇంటర్వ్యూను ఇటీవల లీగల్లీ ఇండియా పబ్లికేషన్ ప్రచురించింది.. తానేకాక మరో నలుగురు అమ్మాయిలు మరో నలుగురు న్యాయమూర్తిలతో వేధింపులకు గురయ్యారని.. ఆ విషయం తనకు తెలుసు అని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియచేయడంతో.. తన ప్రతిష్ట, కెరీర్ సందిగ్ధంలో పడింది అని తెలిపింది. తనపై ఓ న్యాయమూర్తి లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ ట్రైనీ న్యాయవాది స్టెల్లా జేమ్స్ చేసిన ఆరోపణలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం స్పందించారు. లైంగిక వేధింపుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటాం అని అన్నారు. ఉన్నతమైన వ్యవస్థకు తాను నేతృత్వం వహిస్తున్నాను. ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాను. స్టెల్లా ఆరోపణలలో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలుసుకుంటాను అని సదాశివం అన్నారు. స్టెల్లా ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటిని సదాశివం నియమించారు. -
తందూరీ కేసులో సుశీల్ శర్మకు జీవిత ఖైదు
నైనా సాహ్ని హత్య కేసులో సుశీల్ శర్మకు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారస్తూ సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన భార్య నైనా సాహ్ని హత్య కేసులో తనకు మరణశిక్ష విధించడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ కేసు ఈ ఏడాది ఆగస్టు13న సుప్రీం విచారించింది. అనంతరం ఆ కేసును ఆక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన నేత సుశీల్ శర్మ. ఆయన భార్య నైనా సాహ్ని. 1995లో నైనా సాహ్నిని హత్య చేశాడు. అనంతరం ఆమెను తన నివాసంలో తందూరీ చికెన్ తరహాలో కాల్చాడు. దాంతో సుశీల్ శర్మపై కేసు నమోదు అయింది. 2003లో భార్య హత్య కేసులో మరణశిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దాంతో ఆయన తన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని ఆయన సుప్రీంను ఆశ్రయంచిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్.వి.రమణ!
సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణను భారత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. రెండువారాల్లోగా ఈ మేరకు నియామకం జరగవచ్చని కేంద్ర న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ రమణ 1957 ఆగస్టు 27న కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. -
అసంపూర్తి నామినేషన్లను తిరస్కరించొచ్చు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు దాఖలుచే సే అసంపూర్తి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించవచ్చని, అందుకు ఆ అధికారికి సాధికారత ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానానికి ఎన్నికల సంఘం తెలియజేసింది. ‘నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులు అన్ని ఖాళీలనూ పూరించాలి. అవసరమైన చోట ‘నిల్’ లేదా ‘వర్తించదు’ అని పేర్కొనాలి. అలాకాకుండా ఖాళీలు వదిలేసినట్లైతే ఆ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించవచ్చు’ అని ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, న్యాయమూర్తి రంజనాప్రకాశ్ దేశాయ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనానికి సోమవారం ఈసీ తరఫు న్యాయవాది మీనాక్షీ అరోరా వివరించారు. నామినేషన్ పత్రాల్లో ఖాళీలను పూరించకుండా వదిలేయడమంటే.. అభ్యర్థి వాస్తవాలను దాచిపెట్టడం కిందకే వస్తుంద న్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో కీలక సమాచారాన్ని ఇవ్వకపోవడం రివాజుగా మారిం దంటూ రిసర్జెన్స్ ఇండియా అనే ఎన్జీవో 2008లో దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈసీ ఈ మేరకు వివరణనిచ్చింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడమనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సమాచారాన్ని దాచిపెట్టినా నామినేషన్ పత్రాల్ని తిరస్కరించరాదంటూ గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పిందంటూ కేంద్రం తరఫు న్యాయవాది ఎ.మరియపుథమ్ వాదించారు. దీంతో ముగ్గురు న్యాయమూర్తుల సమక్షంలోనే వాదనలు వింటామంటూ విచారణను జస్టిస్ సదాశివం మంగళవారానికి వాయిదావేశారు. అయితే నామినేషన్ పత్రాల్లో అసలు ఖాళీలు ఎందుకు ఉంచాలి? దీనిపై అభిప్రాయం ఏంటో తెలపాలంటూ కేంద్రాన్ని ఆదేశించారు. -
మగన్‌లాల్ ఉరిపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: కుటుంబ గొడవల కారణంగా తన ఐదుగురు కుమార్తెలను తలనరికి చంపిన ఓ వ్యక్తికి విధించిన ఉరిశిక్షను అమలుచేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశంలో ఉరిశిక్షను రద్దు చేయాలంటూ వచ్చిన అభ్యర్థనలపై నిర్ణయం తీసుకొనేవరకూ ఈ స్టే కొనసాగనుంది. 2010 జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని సెహోరా జిల్లాకు చెందిన మగన్‌లాల్ బరేలా అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలతో గొడవ కారణంగా.. ఆరేళ్లలోపు వయసున్న తమ ఐదుగురు కుమార్తెలను తలనరికి చంపేశాడు. దీంతో సెహోర్ జిల్లా ట్రయల్ కోర్టు బరేలాకు ఉరిశిక్ష విధించింది. తర్వాత మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలన్న నిందితుడి పిటిషన్లను మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలోనే కొట్టివేశాయి. బరేలాకు క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రపతి నిరాకరించారు. ఈ మేరకు జబల్పూర్ జైల్లో గురువారం ఉదయమే బరేలాకు ఉరిశిక్షను అమలుచేయాల్సి ఉంది. కానీ, దేశంలో ఉరిశిక్షలను రద్దు చేయడం కోసం పోరాడుతున్న ‘పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ (పీయూడీఆర్)’ సంస్థ సభ్యులు.. బుధవారం రాత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివంను ఆయన ఇంటివద్ద కలిసి బరేలా ఉరిశిక్ష అమలును వాయిదావేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీజే ఉరిశిక్ష అమలును ఒకరోజు వాయిదావేస్తూ.. బుధవారం అర్ధరాత్రి ఆదేశాలి చ్చారు. పీయూడీఆర్ సంస్థ వేసిన పిటిషన్‌పై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వివిధ కారణాల రీత్యా ఉరిశిక్షలను రద్దు చేయాలని, తగ్గించాలని కోరుతూ వచ్చి న పిటిషన్లతో దీనిని కూడా కలిపి విచారించాలని నిర్ణయించింది. -
యావజ్జీవ ‘మరణ’ శిక్ష?!
కామెంట్: దర్యాప్తులో, విచారణలో జాప్యం జరగలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచింది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. మరి...? మంగన్‌లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో! కాల్పనిక ప్రపంచంలోనే వింతలు ఉంటా యని అనుకుంటాం. కానీ జీవితంలోనే విం తలు ఉంటాయి. ఆశ్చర్యం గొలిపే సంఘ టనలు, భయంగొలిపే సంఘటనలు జీవితం లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకు ఉదా హరణ మంగన్‌లాల్ బరేలా ఉరిశిక్ష ఉదం తం. మృత్యువు దరిదాపుల్లోకి వెళ్లి తాత్కాలి కంగా బయటపడిన వ్యక్తి మంగన్‌లాల్.ఆగస్టు 8 గురువారం ఉదయం మంగల్ లాల్‌ని ఉరితీయడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జైలు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అతన్ని ఉరితీయడానికి సెహోర్ జిల్లా కోర్టు ‘బ్లాక్ వారెంట్స్’ జారీ చేసింది. జబల్ పూర్ జిల్లాలోని కేంద్ర కారాగారంలో అతడిని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పత్రి కల్లో వచ్చిన వార్తల ప్రకారం అజ్మల్ కసబ్‌ని ఉరి తీసిన తలారిని ఈ ఉరి తీయడానికి ఎం పిక చేశారు. అతను సోమవారం నాడు జబల్ పూర్ చేరుకున్నాడు. కష్టం కలుగకుండా అతని ఉరిశిక్ష అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. సరిగ్గా అతన్ని ఉరి తీయడానికి ఆరు గంటల ముందు ఉరిశిక్షని నిలిపివేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. గురువారం ఉదయం అతన్ని ఉరితీస్తా రన్న వార్త పత్రికల్లో చదివి మరణశిక్షని వ్యతి రేకించే న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తలుపు బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తట్టారు. ప్రజాహిత కేసుని దాఖలుచేసి ఉరిశిక్ష అమ లుని నిలిపివేయమని కోరారు. దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉరిశిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువా రం ఉదయం ప్రధాన న్యాయమూర్తి మొదటి కేసుగా ఈ కేసుని విచారించి ఉరిశిక్ష అమలు నిలుపుదలని పొడిగించారు. సుప్రీంకోర్టు ముందు ఇంకా విచారణలో ఉన్న ఇతర మర ణశిక్ష కేసులతో పాటు 2013, అక్టోబర్ 22న మంగన్‌లాల్ కేసును విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఆ కేసులతో పాటు అతని కేసుని విచారణ జరిపిన తరువాత మర ణశిక్ష అమలుచేస్తారు. మరణశిక్ష విధించడం లో జాప్యం జరిగిన కారణంగా ఆ కేసును యావజ్జీవశిక్షగా మార్చడానికి వీలుందా అనే అంశాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించాల్సి ఉంది. అంటే మరణశిక్ష కోసం లేదా జీవితఖైదు కో సం మంగల్లాల్ వేచి ఉండాల్సి ఉంటుంది. మంగన్లాల్కు మరణశిక్షను విధించడా నికి కారణం ఏమిటి? రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వ కుండా తిరస్కరించిన తరువాత ఉరి నిలిపి వేయడానికి కారణం ఏమిటి? మరణశిక్ష కోసం ఎంతకాలం వేచి ఉండాలి? ఈ ప్రశ్నల కి సమాధానాలను వెతికే ప్రయత్నం చేద్దాం. జమున (1 సంవత్సరం), లీల (3), ఆర్వా (4), సబిత (50), కున్వర్ (6)లను హత్య చేసిన వ్యక్తి మంగన్‌లాల్. అతనికి ఇద్దరు భార్యలు. ఈ పిల్లలు అతని ఇద్దరు భార్యల ద్వారా జన్మించిన సంతతి. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. దాన్ని అమ్మడానికి అతను ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని అతని సోదరులు, అతని ఇద్దరు భార్యలు విరమింపచేశారు. ఆ భూమి అమ్మే సి పిల్లల్ని ఎలా పోషిస్తావని కూడా వాళ్లు ప్రశ్నించారు. కోపగించుకున్న మంగన్‌లాల్ 2010, జూన్ 10/11 రాత్రి భోజనం చేయ లేదు. ఉదయం కూడా అతను భోజనం చేయ డానికి నిరాకరించాడు. అతని భార్యలు వ్యవ సాయ పనులకు వెళ్లిపోయిన తరువాత తన ఐదుగురు పిల్లలను అతను గొడ్డలితో దారు ణంగా నరికి చంపాడు. ఆ సంఘటన జరిగిన కొద్ది సేపటికి అతని ఇద్దరు భార్యలు ఇంటికి వచ్చి చూసి భయభ్రాంతులై కేకలు వేశారు. గుండెలు బాదుకున్నారు. వాళ్లను చంపడానికి అతను విఫలయత్నం చేశాడు. ఆ తరువాత అతను ఉరివేసుకొని చనిపోవడానికి ప్రయ త్నం చేశాడు. ఆ తాడుని కోసేసి అతని ప్రయ త్నాన్ని నిలిపివేశారు అతని భార్యలు. అతన్ని తాడుతో కట్టేసి పోలీసులకి అప్పగించారు. కేసుని విచారించిన సెహోర్ సెషన్స్ న్యాయ మూర్తి అతనికి మరణశిక్ష 2011, ఫిబ్రవరి 3న విధించి ధృవీకరణ కోసం మధ్యప్రదేశ్ హైకో ర్టుకు పంపించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసును విచారించి మరణశిక్ష ధృవీకరించింది. శిక్ష తగ్గించడానికి, శిక్షను అదేవిధంగా నిర్ధా రించడానికి గల కారణాలను పరిశీలించి మర ణశిక్షను హైకోర్టు ధృవీకరించింది. మృతుల వయస్సు, నేరం చేసిన విధానం, అత్యంత కిరాతకంగా చంపిన తీరు, ఎలాంటి పురికొల్పే కారణాలు లేకుండా కన్నపిల్లల్ని చంపిన తీరును, ఇతర అంశాలను గమనించి హైకోర్టు 2011, సెప్టెంబర్ 12న మరణశిక్షను ధృవీ కరించింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ప్రత్యే క అనుమతి అప్పీలును మంగన్‌లాల్ సుప్రీం కోర్టు ముందు దాఖలు చేశాడు. న్యాయ మూర్తులు హెచ్ఎల్ దత్తు, సి.కె.ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అప్పీలుకు అనుమతి ఇవ్వ కుండా 2012, జనవరిలో అప్పీలును కొట్టి వేసింది. ఆ తరువాత క్షమాభిక్ష ప్రసాదించమని రాష్ట్రపతికి మంగన్‌లాల్ దరఖాస్తు చేసుకు న్నాడు. మరణశిక్షను జీవితఖైదుగా మార్చ మని అతను తన దరఖాస్తులో వేడుకున్నాడు. అతని దరఖాస్తును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2013, జూలై 22న తిరస్కరించారు. ఆ తరు వాత అతనికి విధించిన ఉరిశిక్షను అమలు చేయమని సెషన్స్ కోర్టు బ్లాక్ వారెంట్స్‌ను జారీచేసింది. ఉరిశిక్ష సమాచారం పత్రికల్లో రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ముందు ఉరిశిక్ష అమలు నిలిపివేత కోరుతూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఉరిశిక్ష అమలుకు 6 గంటల ముందు ఆ శిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అతను ఉరిశిక్షకు అర్హుడా కాదా? ఉరి శిక్ష లు ఉండాలా వద్దా? వంటి వివాదాస్పద అంశాల జోలికిపోకుండా, సుప్రీంకోర్టు ముం దు ఉరిశిక్ష రద్దు పిటిషన్లో పీయూడీఆర్ లేవనెత్తిన అంశాలు ఏమిటి? ఈ నేపథ్యంలో జాప్యం ఎక్కడ జరిగిందో పరిశీలించాలి. నేరం జరిగింది. 2010, జూన్ 11న. సెషన్స్ కోర్టు తీర్పును ప్రకటించింది 2011, ఫిబ్రవరి 3న. హైకోర్టు మరణశిక్షను ధృవీకరిస్తూ తీర్పు చెప్పింది 2011, సెప్టెంబర్ 12న. సుప్రీంకోర్టు అతని అనుమతి అప్పీలును తిరస్కరించింది. 2012 జనవరిలో క్షమాభిక్ష విన్నపాన్ని రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ 2013, జూలై 22న తిర స్కరించారు. దర్యాప్తులో, విచారణలో జాప్యం జర గలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచిం ది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కోర్టుల్లో జాప్యానికి అనేక కారణాలు ఉంటాయి. మరి...? మం గన్లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో! - మంగారి రాజేందర్ జిల్లా జడ్జి, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్