సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణను భారత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. రెండువారాల్లోగా ఈ మేరకు నియామకం జరగవచ్చని కేంద్ర న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ రమణ 1957 ఆగస్టు 27న కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు.
సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్.వి.రమణ!
Published Thu, Aug 15 2013 2:47 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement