మహిళా న్యాయవాదిపై న్యాయమూర్తి లైంగిక వేధింపులు
క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని ఓ గదిలో తనను సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లైంగికంగా వేధించారని నవంబర్ 6 తేదిన ఇండియన్ జర్నల్ ఆఫ్ లా అండ్ సొసైటి బ్లాగ్ లో భాదితురాలు స్టెల్లా జేమ్స్ ఆరోపణలు చేశారు. తన తాత వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న న్యాయమూర్తి తనను శారీరకంగా హింసించారు అని బ్లాగ్ స్టెల్లా తెలిపింది.
ప్రస్తుతం ఓ ఎన్జీవో సంస్థలో న్యాయవాదిగా పని చేస్తున్న స్టెల్లా ఇంటర్వ్యూను ఇటీవల లీగల్లీ ఇండియా పబ్లికేషన్ ప్రచురించింది.. తానేకాక మరో నలుగురు అమ్మాయిలు మరో నలుగురు న్యాయమూర్తిలతో వేధింపులకు గురయ్యారని.. ఆ విషయం తనకు తెలుసు అని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియచేయడంతో.. తన ప్రతిష్ట, కెరీర్ సందిగ్ధంలో పడింది అని తెలిపింది.
తనపై ఓ న్యాయమూర్తి లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ ట్రైనీ న్యాయవాది స్టెల్లా జేమ్స్ చేసిన ఆరోపణలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం స్పందించారు. లైంగిక వేధింపుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటాం అని అన్నారు. ఉన్నతమైన వ్యవస్థకు తాను నేతృత్వం వహిస్తున్నాను. ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాను. స్టెల్లా ఆరోపణలలో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలుసుకుంటాను అని సదాశివం అన్నారు. స్టెల్లా ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటిని సదాశివం నియమించారు.