
‘కన్యాశుల్కం’ నాటకం గుర జాడను అత్యుత్తమ నాటక రచ యి తగా తెలుగు సాహిత్యంలో నిలిపింది. ఈ నాటకాన్ని ‘జగన్నాథ విలాసినీ సభ’ 1892 ఆగస్టులో మొదట ప్రదర్శించింది. కన్యాశు ల్కంలో ప్రధానమైన సమస్య సుబ్బి పెళ్లి తప్పించటం! ఆడవాళ్లకి ఏ ఆలోచనాశక్తి లేదని, చులకనగా వారిని చూసే నాటి సమాజంలో మహిళలను ధైర్యవంతులుగా చిత్రించి మహిళల చరిత్రను పునర్లిఖించారు గురజాడ.
సుబ్బమ్మ లేక సుబ్బి ఈ కథకి మూలం. నాటకంలో ఎక్కడా కనిపించదు. వెంకమ్మ – కృష్ణరాయపురం అగ్రహారీ కుడు అగ్నిహోత్రావధాన్ల భార్య. బుచ్చమ్మ-అగ్ని హోత్రావ ధాన్ల పెద్ద కూతురు, వితంతువు. మీనాక్షి - రామచంద్రా పురం అగ్రహారీకుడు లుబ్ధావధాన్ల కుమార్తె, వితంతువు. మధురవాణి–విజయనగరానికి చెందిన వేశ్య. పూట కూళ్ళమ్మ విజయనగరంలో పూట కూళ్ళిల్లు నడిపే వితంతువు. వెంకమ్మ అన్నగారు కరటక శాస్త్రి. ఇతడు కృష్ణరాయ పురం అగ్రహారంలో ఉన్న చెల్లెలి ఇంటికి వచ్చినపుడు సుబ్బి పెళ్ళి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఇష్టంలేనివెంకమ్మ అన్న కరటకశాస్త్రిని ఈ సంబంధం తప్పించమని వేడుకుంటుంది. ఎలాగైనా మేనకోడలు పెళ్లి తప్పించాలని పథకాన్ని రూపొందిస్తాడు అతడు.
మధురవాణిది నాటకంలో కీలకమైన పాత్ర. ఆమె వేశ్య. విజయనగరంలో ఉండే మధురవాణి కారణాంతరాల చేత రామచంద్రపురం అగ్రహార నివాసి, ఊరి కరణం రామప్ప పంతులి ఇంటికి చేరుతుంది. సుబ్బితో పెళ్లి ఖాయం చేసు కున్న లుబ్ధావధాన్లు రామచంద్రపుర వాసి. రామప్పపంతులు నయవంచకుడని ఆమె తొంద ర్లోనే కనిపెట్టేసింది. స్వతహాగా ఎదుటివారికి సాయం చెయ్యాలనే సద్బుద్ధి కలి గిన మధురవాణి... లుబ్ధావధాన్ల పెళ్లి రామప్ప పంతులు కుదిర్చాడని తెలిసిన వెంటనే ‘ఈ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను’ అంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలైంది.
కరటకశాస్త్రి తన ప్రణాళిక అమలు చెయ్యటానికి రామప్ప పంతులు ఇంటికి వస్తాడు. అక్కడ మధుర వాణిని చూసి తన మేనకోడలి పెళ్లి తప్పించమని కోరతాడు. ఆమె అంగీకరించి కొన్ని సలహాలు ఇస్తుంది. తన ‘కంటె’ని పెళ్లిలో పెళ్లికూతురికి పెట్టటానికి కూడా ఒప్పుకుంటుంది. ఆడవేషంలో ఉన్న కరటకశాస్త్రుల శిష్యుడు మహేష్‌ని ఇచ్చి పెళ్ళి జరిపించి, తద్వారా సుబ్బి పెళ్లి ఆపటంలో మధురవాణి చాకచక్యాన్ని ప్రదర్శించింది. తర్వాత లుబ్ధావధా న్లను పెళ్లి చేసుకున్న మహేష్...మధురవాణి దగ్గరకు వచ్చి ఆమె ‘కంటె’ ఆమెకి ఇచ్చేస్తాడు. మధురవాణి ఆడపిల్ల వేషంలో ఉన్న మహేష్‌కు దాసరి వేషం వేసి ఊరు దాటిస్తుంది.
‘కంటె’ కోసం రామప్ప పంతుల్ని ఇబ్బంది పెట్టడంతో అతడే హెడ్ కానిస్టేబుల్‌తో లుబ్ధావధాన్ల మీద ఖూనీ కేసు పెట్టిస్తాడు. ఈ వ్యవహారంలో లుబ్ధావధాన్లను కేసునుంచి బయట పడెయ్యడానికి మధురవాణి, సౌజన్యా రావు పంతులు ఇంటికి వెళుతుంది. అదే సమయంలో గిరీశం కూడా ఆ ఇంటికి వస్తాడు. బుచ్చమ్మని లేవదీసుకు పోయిన గిరీశం అంతటితో తృప్తిపడక లుబ్ధావధాన్ల ఆస్తి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వచ్చాడు. గిరీశం నిజస్వరూపం తెలుసుకున్న సౌజన్యా రావు పంతులు బుచ్చమ్మను పూనాలో విడోస్ హోవ్‌ుకు పంపే ఏర్పాట్లు చేస్తాడు. నాటకంలో మీనాక్షి పాత్ర కూడా ముఖ్యమైనదే. ముసలి తండ్రి పెళ్లి కరటకశాస్త్రి శిష్యుడు మహేశంతో జరి పించటంలో సిద్ధాంతికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఒక రాత్రివేళ రామప్ప పంతులితో తమ ఇంట్లో తండ్రికి దొరికిపోతుంది. తండ్రి బయటికి గెంటేస్తాడు. ఈ చర్యకి మీనాక్షి ఏమీ జంకకుండా ‘‘... ఈ జన్మలో ఈ ఇంట్లో అడు గుపెట్టను’’ అంటూ రామప్ప పంతు లుతో వెళ్లిపోతుంది.
ఇక గంపెడు చాకిరీ చేస్తూ నెత్తిన ముసుగేసుకుని జీవి తాన్ని గడుపుతున్న బుచ్చమ్మ ఆలోచనాశక్తి, తెంపరితనం ఉన్న మహిళ. బుచ్చమ్మకి గిరీశం తన కళ్లముందు నిలిపిన రంగుల లోకం... అందరి ముత్తయిదువలలాగ జీవించాలనే ఆశని కల్గించింది. ఇంకో పక్క గిరీశం తన ఈ నిర్ణయం వల్ల ముసలాడితో చెల్లెలి పెళ్లి ఆగిపోతుందని నచ్చ చెప్పాడు. ధైర్యంగా ఆమె గిరీశంతో అగ్ని హోత్రావధాన్ల కళ్లుగప్పి వెళ్లి పోయింది. విజయనగరంలో పూటకూళ్ల ఇల్లు నడుపుకునే పూటకూళ్లమ్మ ఇంట్లో పనీపాటూ చేసు కుంటూ, ఆకతాయిగా తిరిగే మాయలాడు గిరీశం... ఆమెని మోసగించినందుకు అతడిని చీపురు తీసుకుని వెంటబడు తుంది. దానితో కృష్ణరాయ పురం అగ్రహారం వెంకటేశంతో చేరతాడు గిరీశం. లుబ్ధా వధాన్లకి వరసకి తమ్ముడైన గిరీశం: సుబ్బిని పెళ్లి చేసు కోవద్దంటూ లుబ్ధావధాన్లకి అర్థం అయ్యేటట్లు, భయ పెడుతూ ఉత్తరం రాస్తాడు. కాబట్టి సుబ్బి పెళ్లి ఆపటంలో పూటకూళ్లమ్మ కూడా తెలీకుండానే పెద్దసాయం చేసింది. గిరీశం కృష్ణరాయపురం చేరేటట్టు చేసింది.
కన్యాశుల్కం నాటకం సుబ్బి కొరకే, సుబ్బికోసమే నడి చింది. చెప్పాలంటే అదృశ్యంగా కథ నడిపింది సుబ్బే. తలా ఒక చెయ్యివేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నది మహిళా శక్తి! అదే గురజాడ మహిళలకు చూపిన వెలుగుదారి.
డా. తుర్లపాటి రాజేశ్వరి
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార విజేత
Comments
Please login to add a commentAdd a comment