తందూరీ కేసులో సుశీల్ శర్మకు జీవిత ఖైదు
నైనా సాహ్ని హత్య కేసులో సుశీల్ శర్మకు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారస్తూ సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన భార్య నైనా సాహ్ని హత్య కేసులో తనకు మరణశిక్ష విధించడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ కేసు ఈ ఏడాది ఆగస్టు13న సుప్రీం విచారించింది. అనంతరం ఆ కేసును ఆక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన నేత సుశీల్ శర్మ. ఆయన భార్య నైనా సాహ్ని. 1995లో నైనా సాహ్నిని హత్య చేశాడు. అనంతరం ఆమెను తన నివాసంలో తందూరీ చికెన్ తరహాలో కాల్చాడు. దాంతో సుశీల్ శర్మపై కేసు నమోదు అయింది. 2003లో భార్య హత్య కేసులో మరణశిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దాంతో ఆయన తన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని ఆయన సుప్రీంను ఆశ్రయంచిన సంగతి తెలిసిందే.