Ajmal Kasab
-
కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్‌ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు. అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా
థానే: జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఇందుకు నాటి 26/11 ముంబై ఉగ్రదాడులే ఉదాహరణ అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముంబై దాడుల్లో దోషిగా తేలి, మరణశిక్ష పడిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ వడ్డించిందని నడ్డా ఆరోపించారు.మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో ఉదాశీన వైఖరి అవలంబించిందని నడ్డా ఆరోపించారు. 26/11 దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నారు. అయితే ఉరీ, పుల్వామా ఉగ్రదాడుల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ప్రశంసనీయమైనవని నడ్డా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగంలోని ఏబీసీ కూడా అర్థం కావడం లేదని నడ్డా ఎద్దేవా చేశారు. రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించదనే విషయం రాహుల్‌కు తెలియనట్లున్నదన్నారు. ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో రాజ్యాంగ ప్రతులను చూపిస్తూ, ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ కోరుకుంటున్నదని ఓటర్లకు చెప్పడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీ బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. తెలంగాణ, కర్నాటకలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా రద్దు చేసి, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ ఎప్పుడూ ఎవరిపైనా వివక్ష చూపలేదని నడ్డా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం! -
Shashi Tharoor: కర్కరే మృతిపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్‌చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఆర్ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు. ‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్చేసిన గన్‌లోని బుల్లెట్‌తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు. శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్‌లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్‌కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్ఎస్ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్‌లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్‌చేయడంతో ఆయనపై ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు. -
రియాను దారుణంగా వేధిస్తున్నారు..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తికి సంబంధించి మీడియాలో రోజు ఏదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నటి స్వరా భాస్కర్ రియాకు మద్దతుగా నిలిచారు. మీడియా మంత్రగత్తెను వేటాడే విధంగా రియాను వేధిస్తుందని విమర్శించారు. ఉగ్రవాది కసబ్ విషయంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్వరా ట్వీట్ చేశారు. ‘కసబ్ విషయంలో కూడా మీడియా ఇలా ప్రవర్తించలేదు. కానీ రియా చక్రవర్తి విషయంలో మాత్రం దారుణంగా ప్రవర్తిస్తోంది. ఆమెకు సంబంధించిన విషపూరిత కథనాలతో ప్రజలను రెచ్చగొడుతుంది. భారతీయ మీడియాతో పాటు ఇలాంటి విషపూరిత కథనాలను ప్రొత్సాహిస్తున్నందుకు మనం కూడా సిగ్గు పడాలి’ అంటూ స్వరా ట్వీట్ చేశారు. (చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’) I don’t think even #Kasab was subjected to the kind of witch-hunt on media.. & media trial that #RheaChakrobarty is being subjected to! Shame on Indian Media.. Shame on us for being a toxic voyueristic public consuming this poisonous hysteria.. #RheaDrugChat #SushantSinghRajput — Swara Bhasker (@ReallySwara) August 26, 2020 నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి తన కుమారిడికి విషం ఇచ్చి చంపేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి సీబీఐ సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్ధ్ పితానీని ప్రశ్నించింది. -
కసబ్‌ను గుర్తుపట్టిన ఆ ‘హీరో’ ఫుట్‌పాత్‌పై..
ముంబై: భారత్‌పై విద్వేషం పెంచుకున్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన ఉగ్రదాడులు దాదాపు అందరికీ గుర్తుండే ఉంటాయి. 2008లో నవంబర్ 26న 10 మంది దేశ వాణిజ్య రాజధానిలో చొరబడి కాల్పులకు తెగబడిన ఘటనలో దాదాపు 166 మంది చనిపోయారు. ఈ మారణకాండకు కారణమైన ఉగ్రవాదుల్లో ప్రాణాలతో పట్టుబడింది కసబ్ మాత్రమే. 26/11 ముంబై దాడుల్లో కీలకమైన కసబ్‌ను గుర్తుపట్టి.. ఆ కేసులో సాక్షిగా ఉన్న హరిశ్చంద్ర శ్రీవార్ధంకర్ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అరవై ఏళ్ల వయస్సులో ముంబైలోని ఫుట్‌పాత్‌పై అచేతనంగా పడి ఉన్న ఆయనను డీన్ డిసౌజా అనే ఓ షాపు ఓనర్ చేరదీసి.. స్వచ్చంద సంస్థకు అప్పగించారు. కసబ్, అబూ ఇస్మాయిల్ కామా ఆస్పత్రి వద్ద జరిపిన కాల్పుల్లో బులెట్ దెబ్బతిన్న హరిశ్చంద్రను ఇంటికి తీసుకువెళ్లడానికి.. అతడి కుటుంబం ఇష్టపడటం లేదని.. అందుకే ఆయనను ఆశ్రమానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. (దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే) ఈ విషయం గురించి డిసౌజా స్నేహితుడు, ఐఎంకేర్స్ అనే ఎన్జీవో నడుపుతున్న గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘శ్రీవార్ధంకర్ మేము ఇచ్చిన ఆహారం తినడం లేదు. ఆయనకు స్నానం చేయించి.. జుట్టు కత్తిరించాం. తనలో తానే మాట్లాడుకుంటున్నారు. ఆయన మాటల్లో హరిశ్చంద్ర, బీఎంసీ, మహాలక్ష్మి అనే పదాల ఆధారంగా బీఎంసీ కాలనీకి వెళ్లి ఆరా తీయగా... శ్రీవార్ధంకర్ సోదరుడు ఆయనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముంబై దాడుల ఘటనలో కీలక సాక్షిగా ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు కళ్యాణ్‌లో ఉన్నట్లు తెలిపారు. (ఆ షరతుకు ఒప్పుకుంటేనే తరలిస్తాం!) ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాం. లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీవార్ధంకర్ కొడుకుకు ప్రత్యేక పాస్ జారీ చేసి ఆయనను తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించారు. అయితే శ్రీవార్ధంకర్‌ను మాతో పాటే ఉండనివ్వమని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ఉగ్రవాదికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన హీరో శ్రీవార్ధంకర్‌ను సాయం చేసేందుకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. తలపై గాయం కూడా ఉంది. ఆయనకు చికిత్స చేసేందుకు సహకరించండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీసిన విషయం తెలిసిందే. -
సంచలన ‘ఆత్మకథ’
కీలక స్థానాల్లో పనిచేసి పదవులనుంచి తప్పుకున్న వారు రాసే పుస్తకాలకు మంచి గిరాకీ ఉంటుంది. వారు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సంచలనాత్మకమైన ఘటనలు జరిగుంటే ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ తదితరులు రాసిన ఆత్మకథలు చెప్పుకోదగ్గ వివాదం రేపాయి. ఇందులో సంజయ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఆధారంగా అదే పేరుతో చలనచిత్రంగా కూడా వచ్చింది. కనుక ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా ‘లెట్ మీ సే ఇట్ నౌ’ పేరిట వెలు వరించిన గ్రంథం అందరిలోనూ ఆసక్తి కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ముంబై నగరం ఒకప్పుడు మాఫియా డాన్ల అడ్డా. వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను, సినీ నటుల్ని బెదిరించి డబ్బులు గుంజడం, మాట విననివారిని కిడ్నాప్ చేయడం, నేర సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం పోరాటాలు అక్కడ నిత్యకృత్యం. 2008 నవంబర్ 26న ముంబై నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడి 173మంది పౌరులను పొట్టనబెట్టుకున్న ఘటన వీటన్నిటినీ తలదన్నింది. కన్నకూతురు షీనా బోరాను పథకం ప్రకారం రప్పించి, తన భర్తతో కలిసి ఆమెను పొట్టనబెట్టుకున్న ఇంద్రాణి ముఖర్జీ ఉదంతం కూడా అక్కడిదే. ఇలాంటి మహానగరంలోని పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా, ప్రత్యేకించి పోలీస్ కమిషనర్‌గా పని చేసిన రాకేష్ ఆత్మ కథ రాశారంటే ఆసక్తి అత్యంత సహజం. పైగా రాకేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా వున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి అశోక్ కామ్టే భార్య వినీత తన భర్త మరణానికి రాకేష్ వ్యవహరించిన తీరే కారణమని ఆరోపించారు. ఆ రోజు పోలీస్ కంట్రోల్ రూం ఇన్చార్జిగా వున్న రాకేష్ సరిగా మార్గదర్శకత్వం చేయనందువల్లే అశోక్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలయ్యారని ఒక పుస్తకంలో ఆమె చెప్పారు. అప్పట్లో రాకేష్ ఈ ఆరో పణలు కొట్టి పారేసినా తాజాగా ఆ ఎపిసోడ్ గురించి ఈ పుస్తకంలో ఏం రాసి వుంటారన్నది చూడా ల్సివుంది. అలాగే రాకేష్‌ను పదవీ విరమణకు చాలా ముందుగానే పోలీస్ కమిషనర్ పదవినుంచి తప్పించడం అప్పట్లో సంచలనం రేపింది. దాంతోపాటు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఆయన కలవడం పెను వివాదమైంది. ఇంత నేపథ్యంవున్న రాకేష్ పుస్తకం రాశారంటే చదవకుండా ఎలావుంటారు? అయితే ఈ ఆత్మకథలో ఇతరత్రా అంశాలకంటే ఉగ్రవాది కసబ్ గురించి ఆయన చెప్పిన అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దాని చుట్టూ వివాదం రాజేసేందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ప్రయత్నించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరేలు రెండూ కసబ్ పేరును దినేశ్ చౌధరి అని మార్చి, నకిలీ ఐడీ కార్డు సృష్టించి, అతనితో కాషాయ రంగు తాడు కట్టించి, మారణాయుధాలిచ్చి ఉగ్రవాద దాడులకు పంపాయని రాకేష్ తెలిపారు. పీయూష్ గోయెల్ అభ్యంతరమల్లా ఈ సంగతి ఇన్నాళ్లూ ఎందుకు దాచివుంచారన్నదే. అందుకాయన రాకేష్‌తోపాటు అప్పటి యూపీఏ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందన్నది గోయెల్ అనుమానం. వాస్తవానికి ఈ సమాచారం కొత్తదేమీ కాదు. ఆ దాడి జరిగిన మరుసటి రోజునుంచే ఉగ్రవాదుల గురించి, వారి పన్నాగాల గురించి పుంఖానుపుంఖాలుగా కథ నాలు వెలువడ్డాయి. కసబ్‌ను ప్రశ్నించే క్రమంలో వెల్లడైన అంశాలన్నీ మీడియాలో అప్పట్లోనే ప్రము ఖంగా వచ్చాయి. ఉగ్రవాదుల వద్ద హైదరాబాద్, బెంగళూరు కళాశాలల్లో చదువుకుంటున్నట్టు దొంగ గుర్తింపు కార్డులుండటం, వాటిపై హిందువుల పేర్లు వుండటం పాత కథే. ఉగ్రవాద దాడులకు పథక రచన చేసింది ఐఎస్ఐ కనుక, దాడులు చేసేది భారత్‌లో కనుక తమ సంగతి బయట పడకుండా వుండటం కోసం, దర్యాప్తు సంస్థలను పక్కదోవ పట్టించేందుకు, అయోమయం సృష్టిం చేందుకు ఇదంతా చేసివుంటారని సులభంగానే గ్రహించవచ్చు. ఇలాంటివి బయటపడినప్పుడు వెల్లడించడానికి ప్రభుత్వాలకు అభ్యంతరం ఎందుకుంటుంది? రాకేష్ మారియా కూడా దాన్ని తొలి సారి బయటపెడుతున్నట్టు ప్రకటించలేదు. కసబ్‌ను తానే స్వయంగా ప్రశ్నించారు గనుక, దర్యా ప్తును పక్కదోవ పట్టించే పన్నాగంతో ఐఎస్ఐ ఏమేం చేసిందో చెప్పడానికి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాణాలకు తెగించి కసబ్‌ను సజీవంగా పట్టుకున్న కానిస్టేబుల్ గురించి కూడా రాకేష్ ప్రస్తావించారు. కసబ్ సజీవంగా పట్టుబడకపోయివుంటే పాకి స్తాన్ కుట్రను రుజువు చేయడం కష్టమయ్యేది. దేశంలో అంతక్రితమూ, ఆ తర్వాత అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. వీటన్నిటిలో పాకిస్తాన్ ప్రమేయం వున్న సంగతి తెలుస్తూనే వున్నా అందుకు అవసరమైన పక్కా సాక్ష్యాలివ్వడం సాధ్యపడలేదు. ముంబై మహానగరం ఆర్థిక రాజధాని కనుక ఉగ్రవాదుల దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే నగర పోలీసులు వారిని మట్టు బెడతారని పాకిస్తాన్ ఊహించింది. కానీ పాక్ అంచనాలకు భిన్నంగా అనుకోకుండా కసబ్ పోలీసులకు చిక్కాడు. ఒకప్పుడు తాము ఇష్టపడే నేతలు లేదా సెలబ్రిటీలు రాసిన ఆత్మకథల కోసం జనం ఆసక్తి కనబరిచేవారు. వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది వుంటుందన్న భావనే అందుకు కారణం. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పదవీకాలంలో వివాదాస్పదులుగా పేరు తెచ్చుకున్నవారు రాసినా, ఆత్మకథల్లో వివాదాల ప్రస్తావనవున్నా వాటికి పఠితలు అధికంగానే వుంటున్నారు. ఈ పుస్తకంలో రాకేష్ తన తదనంతరం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అహ్మద్ జావేద్, మరో పోలీస్ అధికారి దేవేన్ భారతిల గురించి చేసిన ప్రస్తావనలు ఇప్పుడు ముంబై పోలీసుల్లో కాక పుట్టిస్తున్నాయి. తన గురించి వున్నవీ లేనివీ రాశారని జావేద్ అంటున్నారు. ఏదేమైనా మారియా పుస్తకం విడుదలైన రోజే కావలసినంత వివాదం రేపింది. -
'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైంది. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్‌ను చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లలో దేశంలో మరణశిక్షలు అమలు చేసిన వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 400 మందికి కోర్టులు మరణశిక్షలు విధించగా అందులో కేవలం ఒక శాతం మందికి మాత్రమే శిక్షలు అమలైనట్టు జాతీయ నేర విభాగం (ఎన్సీఆర్బీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: నిర్భయ దోషులకు 22న ఉరి మరణశిక్ష కేసుల్లో దాదాపు 1200 మందికి అది ఆ తర్వాత జీవిత ఖైదుగా మారింది. నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ఎన్సీఆర్బీ గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కోర్టులో సుదీర్ఘకాల విచారణ, రాష్ట్రపతి అభ్యర్థనలు కారణంగానే శిక్షల అమలులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచింది నలుగురికి మాత్రమే. బాలికపై అత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ధనుంజయ్, ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్, పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన అఫ్జల్ గురు, 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబుదాడులకు కారకుడైన యాకూబ్ మెమన్‌లకు మాత్రమే గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచారు. ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరితీస్తే ఈ సంఖ్య 8కి పెరుగునుంది. -
‘అమితాబ్ కోసం వస్తే 26/11 దాడుల్లో ఇరికించారు’
ముంబై : ‘నేను అమితాబ్ బచ్చన్‌కి పెద్ద ఫ్యాన్‌ని.. ఆయన బంగ్లా చూడటానికి ఇండియా వచ్చాను. కానీ ‘రా’ అధికారులు నా పాస్ పోర్ట్ లాక్కుని నన్ను అరెస్ట్ చేశారు’.. ఇవి కరుడు కట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కోర్టు ముందు చెప్పిన కట్టుకథ. ముంబై 26/11 ఉగ్ర దాడులు జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ దాడి తాలుకా గాయం నేటికి పచ్చిగానే ఉంది. దాదాపు 166 మంది అమాయకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. యావత్ దేశాన్ని భయకంపితం చేసిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. అయితే వీరిలో అజ్మల్ కసబ్ మాత్రమే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు. ఉగ్రదాడుల తరువాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు కసబ్‌ని విచారించిన నాటి పోలీసు అధికారి రమేష్ మహలే. ముంబై 26/11 దాడుల కేస్ విచారణాధికారిగా నియమితులయ్యారు మహలే. అప్పటి విషయాలను తల్చుకుంటూ.. ‘కసబ్ చాలా తెలివిగలవాడు. పోలీసులను బురిడి కొట్టి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలు సేకరించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే అబద్దాలు చెప్పడం కసబ్ ప్రవృత్తి. కానీ నేర విచారణ విభాగంలో నాది దాదాపు 25 ఏళ్ల అనుభవం. నేను రాకేష్ మరియా, దేవెన్ భార్తి వంటి అనుభవజ్ఞులైన అధికారులతో కలిసి పని చేశాను. ఆ అనుభవం నాకు 26/11 కేసు విచారణ సమయంలో బాగా ఉపయోగపడిందంటూ చెప్పుకొచ్చారు మహలే. ‘పోలీసుల ముందు తన నేరాన్ని ఒప్పుకోవడానికి ముందు కసబ్ పలు అసాధరణమైన అబద్దాలు చెప్పాడు. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చాక అతడి అబద్దాలు మరింత ముదిరాయి. కోర్టులో ఏకంగా అమితాబ్ బచ్చన్ పేరును వెల్లడించాడు. తాను అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానినని తెలిపాడు. కేవలం బిగ్‌బీ నివాసం చూడటం కోసమే తాను ఇండియా వచ్చానని.. కానీ రా అధికారులు తన మీద తప్పుడు కేసు నమోదు చేశారంటూ కసబ్ కోర్టులో ఆరోపించాడు. రా అధికారులు తన దగ్గరకు వచ్చి తన పాస్‌పోర్టును లాక్కుని.. చించివేశారని.. తరువాత తనను 26/11 దాడులు జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చారని తెలిపాడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారంటూ’ కసబ్ వాదించాడని మహలే గుర్తు చేసుకున్నారు. ‘అయితే కసబ్ చెప్పేవన్ని అబద్దాలే. వాటన్నింటికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఏకే 47 తుపాకీ పట్టుకుని ఛత్రపతి శివాజీ టర్మినల్ దగ్గర నిల్చున్న కసబ్ ఫోటో అక్కడ ఉన్న సీసీటీవీలతో పాటు.. జర్నలిస్ట్‌ల దగ్గర కూడా ఉంది. దాంతో కసబ్ వాదనలు ఏ కోర్టులో నిలవలేదు. ఆ తరువాత నెమ్మదిగా కసబ్ ఈ దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించడం ప్రారంభించాడు. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. ‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’.. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ ఉరితీసే ముందు అజ్మల్ కసబ్ చివరి మాటలివి. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి 2008 నవంబరు 26న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. -
వాళ్లను షూట్ చేయాలి: కర్ణాటక గవర్నర్
సాక్షి, బెంగళూరు: పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ వర్ధంతి నిర్వహించేవారిని కాల్చి చంపాలని కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా బెంగళూరులో వ్యాఖ్యానించారు. కసబ్ లాంటి ఉగ్రవాదులు, దేశద్రోహులను పట్టుకున్న మూడ్రోజుల్లోనే ఉరిశిక్ష వేయాలన్నారు. భద్రతలో పటిష్టంగా ఉన్న ఇజ్రాయెల్ లాంటి దేశమే అభివృద్ధిచెందుతుందని పేర్కొన్నారు. భారత్‌లో పరిస్థితులు వేరని అన్నారు. ‘ కొందరు కసబ్ వర్ధంతి నిర్వహిస్తున్నారు. వారిని తుపాకీతో కాల్చి మృతదేహాలు దొరక్కుండా చేయాలి’ అని అన్నారు. -
పాక్ నుంచి కసబ్ గ్యాంగ్ ఎలా వెళ్లింది..?
లాహోర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్ధావరాలపై భారత సైన్యం వ్యూహాత్మక దాడులు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత.. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటూ పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల ఒత్తిడి.. తదితర అంశాల నడుమ 26/11 ముంబై దాడుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకొనబోతోంది. విచారణను ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తోన్న పాక్.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలోనైనా ఈ కేసుకు సహేతుకమైన ముగింపు పలుకుతుందనే ఆశాభావం లేనప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ముంబై దాడుల విచారణ నిమిత్తం పాక్ (ఇస్లామాబాద్) యాంటీ టెర్రరిస్టు కోర్టు (ఏటీసీ) ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి న్యాయ కమిషన్ గురువారం (అక్టోబర్ 6న) కరాచీ పోర్టుకు వెళ్లనుంది. లష్కరే తాయిబా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ సహా 10 మంది కరాచీ పోర్టు నుంచి ముంబైకి వెళ్లేందుకు వినియోగించిన 'అల్ ఫౌజ్' బోటును న్యాయ కమిషన్ పరిశీలించనుంది. ఆ తర్వాత కసబ్ గ్యాంగ్ పాక్ నుంచి ముంబైకి ఎలా వెళ్లిందో తగిన సాక్ష్యాధారాలు జోడించి కోర్టుకు సమర్పించనుంది. కసబ్, అతని అనుచరులు కరాచీ పోర్టులో సంచరించినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులను సైతం న్యాయ కమిషన్ ప్రశ్నించనుంది. ఉగ్రవాదులు వినయోగించిన మూడు బోట్లను అధికారులు కరాచీ షిప్ యార్డులో భద్రపర్చారు. ఏటీసీ కోర్టు జడ్జి నేతృత్వంలోని న్యాయ కమిషన్ లో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ), రక్షణ శాఖల అధికారులేకాక కొందరు న్యాయాధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. కసబ్ గ్యాంగ్ ముంబైకి ఎలా వచ్చిందంటే.. పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రకారం.. (ముంబై దాడులకు సంబందించిన కొన్ని ఫొటోలు)ముంబైలో మారణహోమం సృష్టించాలనే లక్ష్యంతో 2006, నవంబర్ 23న లష్కరే తాయిబాకు చెందిన 10 మంది సుశిక్షిత ఉగ్రవాదులు ఏకే 47 రైఫిళ్లు, ఇతర మారణాయుధాలతో కరాచీ పోర్టు నుంచి మూడు బోట్ల ద్వారా భారత జలాల్లోకి ప్రవేశించారు(వీటిలో అల్ ఫౌజా అనే బోటును తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్నారు). మార్గం మధ్యలో చేపల వేటకు వినియోగించే మరో బోటును స్వాదీనం చేసుకుని, అందులోని నలుగురిని హతమార్చారు. బోటు నడిపే వ్యక్తిని బంధించి తమను ముంబై తీరానికి తీసుకెళ్లాల్సిందిగా బెదిరించారు. తీరా తీరాన్ని చేరాక ఆ వ్యక్తిని కూడా చంపేసి నవంబర్ 26నదక్షిణ ముంబైలోకి అడుగుపెట్టారు. మొత్తం ఎనిమిది చోట్ల విధ్వంసం సృస్టించిన ఉగ్రవాదులు 172 మందిని పొట్టనపెట్టుకున్నారు. మరో 300 మందిని గాయపర్చారు. ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒక్కడే పోలీసులకు చిక్కగా, మిగతా తొమ్మిది మందిని ఎన్ఎస్ జీ కమాండోలు మట్టుపెట్టారు. భారత్ సమర్పించిన ఆధారాలుతోపాటు అమెరికా,ఇతర అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు పాకిస్థాన్ ఎట్టకేలకు ముంబై దాడుల కేసు విచారణను ప్రారంభించింది. ముంబై దాడుల సూత్రధారి లష్కరే తాయిబా ఆపరేషన్స్ చీఫ్ జకీఉర్ రహమాన్ లఖ్వీ తోపాటు మరో ఆరుగురిని నిందితులుగా చేర్చి, అరెస్టు చేసింది. కాగా లఖ్వీ మాత్రం కొద్దిరోజులకే బెయిల్ పై విడుదలయ్యాడు. మళ్లీ అరెస్టయ్యి గత ఏడాది జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవ్వరికీ కనిపించకుండాపోయాడు. ప్రస్తుతం లఖ్వీ గుర్తుతెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నాడని సమాచారం. ఎనిమిదేళ్లుగా సాగుతోన్న విచారణలో ప్రాసిక్యూషన్ పలు నివేదికలను సమర్పిస్తున్నప్పటికీ, సరైన సాక్ష్యాధారాలు లేనందున పాక్ కోర్టులు వాటిని కొట్టిపారేస్తూనేఉన్నాయి. ఈ బోటు పరిశీలన కూడా అలాంటిదే అవుతుందా లేదా వేచిచూడాలి. -
‘భద్రత’కు లేదు భరోసా..
సాక్షి, ముంబై: 26/11 ఘటన జరిగి బుధవారంతో ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ఆ ఘటన తాలూకు జ్ఞాపకాలు ముంబైవాసులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ముంబైలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబైకర్లు ఇప్పటికీ తాము పూర్తి భద్రత కలిగి ఉన్నామనే భావనకు రాలేకపోతున్నారు. పాక్ ప్రేరేపిత ముష్కరులు పదిమంది 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిపిన మారణహోమంలో 166 మంది మృత్యువాత పడగా మరో 300 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసులు, ఇతర రక్ష క దళాలు కలిసి 9 మంది ముష్కరులను హతమార్చగా అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతడిని యెరవాడ జైల్లో 2012లో ఉరితీశారు. అయితే ముష్కరుల ఘటన నేపథ్యంలో ముంబైలో తిరిగి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. నగరవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక భద్రతా దళం ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వాటిని సంపూర్ణంగా అమలు చేయకపోవడం గమనార్హం. పేరు ఘనం.. కాంట్రాక్ట్ వేతనం .. ముష్కరుల దాడి అనంతరం జాతీయ భద్రత దళం (ఎన్ఎస్జి) మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భద్రత దళాన్ని 2010 ఏప్రిల్‌లో ప్రారంభించింది. 250 మందితో మొదలైన ఈ దళంలో ఇప్పుడు 2,500 మంది కమాండోలు ఉన్నారు. వీరికి ప్రత్యేక పోలీసు అధికారులుగా గుర్తిస్తున్నారు. ముంబైలోని మెట్రో, మోనో మార్గాలోని అన్ని రైల్వేస్టేషన్లు, మహాలక్ష్మి మందిరం, ఓఎన్జిసి, ఐఐటి-పవాయి, సెబీ కార్యాలయాలు, జెఎన్పిటిలతోపాటు రాష్ట్రం లోని ప్రముఖ సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి వాటివద్ద ఈ దళానికి చెందిన కమాండోలను మోహరిస్తున్నారు. అయితే వీరికి మౌలిక సదుపాయాల కల్పనలో గాని, ఆయుధాల విషయంలో గాని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరికి పాత ఆయుధాలు అప్పగించడంతో అత్యాధునిక ఆయుధాలతో దాడులకు దిగే ముష్కరులను ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నగా మారిం ది. అలాగే ప్రత్యేక పోలీసు అధికారులు హోదా ఇచ్చిన వీరికి స్థాయికి తగ్గట్టుగా ఏవి లభించడంలేదు. ముఖ్యంగా దళంలోని కమాండోలకు లభించేగౌరవ వేతనం రూ. 10,400 మినహా ఎలాంటి అలవెన్స్ (బత్తాలు) ఇవ్వడంలేదని తెలిసింది. వీరందరూ ఇప్పటికీ 11 నెలల కంట్రాక్ట్పైనే పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు అధికారులకు మాత్రం కనీస వేతనం రూ. 50 వేల వరకు అందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థా లేదా ప్రైవేటా...? మహారాష్ట్ర భద్రత దళం ప్రభుత్వ సంస్థనా లేదా ప్రైవేట్ సంస్థనా అనేది స్పష్టం కావడంలేదు. భర్తీ మాత్రం పోలీసుల భర్తీ ప్రక్రియ మాదిరిగానే నిర్వహిస్తున్నారు. కాని వీరిని కంట్రాక్ట్ కార్మికులుగా పరిగణిస్తున్నారు. దీంతో ఈ కమాండోలలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అసలు మేము ప్రభుత్వ ఉద్యోగులమా..? లేదా ప్రైవేట్ ఉద్యోగులమా అనేది తెలియడంలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగంలో చేరాలంటూ అనేక మంచి ఉద్యోగాలను వదిలి వస్తే ఇక్కడ సరైన సదుపాయాలు లేకుండా తాము పనిచేయాల్సి వస్తోందని ఓ కమాండో తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఏదీ.. ఘటన అనంతరంలో నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లతోపాటు వివిధ సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని 2008లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో 6 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదన అమలులో మాత్రం నత్తనడక నడుస్తోంది. ఈ ఆరేళ్ల కాలంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటిని అమర్చారు. మరోవైపు వీటి ఏర్పాటుకు ప్రస్తుతం సుమారు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. దీంతో ప్రభుత్వం వీటి ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తోంది. సామాన్యుల్లో సన్నగిల్లుతున్న నమ్మకం.. నగర భద్రతపై సామాన్య పౌరులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం తాము అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తే ఉగ్రవాద దాడుల నుంచి నగరవాసులను సురక్షితంగా కాపాడగలుగుతామని అంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా.. ఎక్కడైనా.. అపరిచితులు అనుమానంగా సంచరిస్తున్నట్లు కనిపించినా..లేదా రైళ్లు, బస్సులు, ఇతర ప్రయాణ వాహనాల్లో ఎవరైనా బ్యాగులు, బాక్సులు వంటివి వదిలేసి వెళ్లిపోయినట్లు అనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారమివ్వాలని వారు కోరుతున్నారు. -
24న సాక్షుల విచారణ
ముంబై : నగరంలో 2008 నవంబర్ 26వ తేదీన జరిగిన తీవ్రవాదుల దాడి కేసుకు సంబంధించి భారత్‌లోని సాక్షులను 8 మంది సభ్యులుగల పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 24న విచారించనుంది. సాక్ష్యాలను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి పి.వై.లడేకర్ నమోదు చేయనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఘటనలో పట్టుబడిన పాక్ తీవ్రవాది అజ్మల్కసబ్ వాంగ్మూలాన్ని నమోదుచేసిన నగర న్యాయమూర్తి, కేసులో ముఖ్య నేరపరిశోధన అధికారి రమేష్ మెహలే, సెక్యూరిటీ దళాల చేతిలో హతులైన 9 మంది పాక్ తీవ్రవాదుల పోస్టుమార్టం నిర్వహించిన ఇద్దరు డాక్టర్లు పాక్ జ్యుడీషియల్ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పనున్నారు. కమిషన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. మొదటిసారి 2012 మార్చిలో కమిషన్ భారత్‌ను సందర్శించింది. అయితే అప్పుడు సాక్షులను విచారించేందుకు కమిషన్‌కు భారత్ అనుమతి ఇవ్వకపోవడంతో అప్పటి నివేదికను పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు వస్తున్న కమిషన్‌లో నూతన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తోపాటు పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు సంబంధించిన ఇద్దరు అధికారులు ఉన్నారు. కమిషన్ సభ్యులకు వారం పాటు పనిచేసే వీసాను బుధవారం ఇచ్చార ని, వీరు వాఘా సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తారని అధికారులు తెలిపారు. ఈ కేసులో భారత్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నిఖమ్ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఉజ్వల్ నిఖమ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఈ కేసుకు సంబంధించిన సాక్షులను విచారించేందుకు భారత్ తిరస్కరించందన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత్ సాక్షులను విచారించేందుకు పాక్ కమిషన్ సభ్యులు వస్తున్నారని చెప్పారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఏడుగురు నిందితులపై విచారణ జరుగుతోంది. ఇందులో లష్కరే-ఇ-తోయిబా కమాండర్ జాకీర్ రెహ్మాన్ లక్వీ కూడా ఉన్న సంగతి విదితమే. ఈ కేసు విచారణ భారత్‌లో విచారణ పూర్తయ్యింది. నిందితుడు అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష విధించి అమలు చేసింది కూడా. అయితే పాక్‌లో మాత్రం కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసును వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా రెండు దేశాలమధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల నిఖమ్తో పాటు భారత్ ప్రతినిధి బృందం పాకిస్థాన్‌ను సందర్శించి అక్కడి అధికారులతో సమీక్షించారు. అప్పటి ఒప్పందం మేరకు పాక్ జ్యుడీషియల్ కమిషన్ సభ్యులకు భారత్ సాక్షులను విచారించేందుకు అంగీకరించారు. కాగా గత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఉగ్రవాదులు హతమార్చిన క్రమంలో కమిషన్ భారత్ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటివరకు పాక్ కమిషన్ సభ్యుల పర్యటన వివిధ కారణాల వల్ల మూడుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24న సభ్యులు భారత్‌ను సందర్శించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. -
కీచకులకు ఉరే సరి
నిర్భయ కేసులో వాదనలు పూర్తి దోషులకు మరణశిక్ష విధించాలన్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శుక్రవారం శిక్ష ఖరారు చేయనున్న కోర్టు న్యూఢిల్లీ: డిసెంబర్ 16 ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురికీ మరణశిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును కోరారు. దీనిని అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ దోషులైన ముఖేష్(26), వినయ్‌శర్మ(20), పవన్‌గుప్తా(19), అక్షయ్‌ఠాకూర్(28)లకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో అత్యంత క్రూరమైన వారి ప్రవర్తన చూస్తే.. వారిలో పరివర్తన వచ్చే అవకాశమే లేదని స్పష్టమవుతోందని చెప్పారు. డిఫెన్స్ లాయర్లు మాత్రం వారికి క్షమాభిక్ష పెట్టాలని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా శిక్ష ఖరారుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నలుగురు దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్ 16న జరిగిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులు దోషులే అని మంగళవారం సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, ఆధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు తదితర 13 అభియోగాల్లో నిందితులను దోషులుగా నిర్ధారించింది. సుదీర్ఘ వాదనలు: బుధవారం ఉదయం సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్భయ కేసులో దోషులకు శిక్ష ఖరారుపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాన్ కృష్ణన్, ముఖేష్, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా, అక్షయ్‌ఠాకూర్ తరఫున డిఫెన్స్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ నేరం అత్యంత రాక్షసమైనదే కాక, వారి ప్రవర్తన అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా ఉందని దయాన్ కృష్ణన్ గుర్తు చేశారు. ఇటువంటి మనుషుల్లో పరివర్తన వస్తుందని భావించడానికి అవకాశమే లేదన్నారు. వీరంతా నిస్సహాయురాలైన యువతిపై అత్యాచారం చేసి, హత్య చేశారని, తనను ప్రాణాలతో విడిచిపెట్టాలని బాధితురాలు కోరినా ఆరుగురు నిందితుల్లో ఎవరూ కనికరం చూపలేదని చెప్పారు. అందువల్ల దీనిని అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ.. దోషులుగా తేలిన నలుగురికి మరణశిక్ష విధించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వారు మద్యం మత్తులో ఉన్నారు..: డిఫెన్స్ న్యాయవాదులు దోషుల తరఫు న్యాయవాదులు వాదనలు ప్రారంభిస్తూ.. నేరం జరిగిన సమయంలో పవన్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ ఘటన అప్పటికప్పుడు జరిగినది తప్ప ప్రణాళిక ప్రకారం జరిగింది కాదన్నారు. అక్షయ్ నిరపరాధని, రెండు నెలల క్రితమే అతను ఢిల్లీ వచ్చాడని తెలిపారు. వీరికి మరణశిక్ష విధిస్తే దేశంలో అత్యాచారాలు ఆగిపోతాయా అని ప్రశ్నించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. కోర్టు విచారణ ముగిసిన తర్వాత దోషుల తరఫున వాదించిన ఇద్దరు న్యాయవాదులపై కోర్టు కాంప్లెక్స్‌లోనే ఆందోళనకారులు దాడి చేశారు. రేపిస్టులకు ఉరి శిక్ష వేయాలి: బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను చంపిన రేపిస్టులకు మరణ శిక్ష విధించాల్సిందే అని నిర్భయ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వారికి జీవించే హక్కు లేదని చెప్పారు. నిర్భయ కేసులో నలుగురికీ మరణశిక్ష తప్పదన్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలపై ఈ కేసులో దోషి అయిన ముఖేష్ తరఫున ఆయన న్యాయవాది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. -
యావజ్జీవ ‘మరణ’ శిక్ష?!
కామెంట్: దర్యాప్తులో, విచారణలో జాప్యం జరగలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచింది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. మరి...? మంగన్‌లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో! కాల్పనిక ప్రపంచంలోనే వింతలు ఉంటా యని అనుకుంటాం. కానీ జీవితంలోనే విం తలు ఉంటాయి. ఆశ్చర్యం గొలిపే సంఘ టనలు, భయంగొలిపే సంఘటనలు జీవితం లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకు ఉదా హరణ మంగన్‌లాల్ బరేలా ఉరిశిక్ష ఉదం తం. మృత్యువు దరిదాపుల్లోకి వెళ్లి తాత్కాలి కంగా బయటపడిన వ్యక్తి మంగన్‌లాల్.ఆగస్టు 8 గురువారం ఉదయం మంగల్ లాల్‌ని ఉరితీయడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జైలు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అతన్ని ఉరితీయడానికి సెహోర్ జిల్లా కోర్టు ‘బ్లాక్ వారెంట్స్’ జారీ చేసింది. జబల్ పూర్ జిల్లాలోని కేంద్ర కారాగారంలో అతడిని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పత్రి కల్లో వచ్చిన వార్తల ప్రకారం అజ్మల్ కసబ్‌ని ఉరి తీసిన తలారిని ఈ ఉరి తీయడానికి ఎం పిక చేశారు. అతను సోమవారం నాడు జబల్ పూర్ చేరుకున్నాడు. కష్టం కలుగకుండా అతని ఉరిశిక్ష అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. సరిగ్గా అతన్ని ఉరి తీయడానికి ఆరు గంటల ముందు ఉరిశిక్షని నిలిపివేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. గురువారం ఉదయం అతన్ని ఉరితీస్తా రన్న వార్త పత్రికల్లో చదివి మరణశిక్షని వ్యతి రేకించే న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తలుపు బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తట్టారు. ప్రజాహిత కేసుని దాఖలుచేసి ఉరిశిక్ష అమ లుని నిలిపివేయమని కోరారు. దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉరిశిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువా రం ఉదయం ప్రధాన న్యాయమూర్తి మొదటి కేసుగా ఈ కేసుని విచారించి ఉరిశిక్ష అమలు నిలుపుదలని పొడిగించారు. సుప్రీంకోర్టు ముందు ఇంకా విచారణలో ఉన్న ఇతర మర ణశిక్ష కేసులతో పాటు 2013, అక్టోబర్ 22న మంగన్‌లాల్ కేసును విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఆ కేసులతో పాటు అతని కేసుని విచారణ జరిపిన తరువాత మర ణశిక్ష అమలుచేస్తారు. మరణశిక్ష విధించడం లో జాప్యం జరిగిన కారణంగా ఆ కేసును యావజ్జీవశిక్షగా మార్చడానికి వీలుందా అనే అంశాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించాల్సి ఉంది. అంటే మరణశిక్ష కోసం లేదా జీవితఖైదు కో సం మంగల్లాల్ వేచి ఉండాల్సి ఉంటుంది. మంగన్లాల్కు మరణశిక్షను విధించడా నికి కారణం ఏమిటి? రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వ కుండా తిరస్కరించిన తరువాత ఉరి నిలిపి వేయడానికి కారణం ఏమిటి? మరణశిక్ష కోసం ఎంతకాలం వేచి ఉండాలి? ఈ ప్రశ్నల కి సమాధానాలను వెతికే ప్రయత్నం చేద్దాం. జమున (1 సంవత్సరం), లీల (3), ఆర్వా (4), సబిత (50), కున్వర్ (6)లను హత్య చేసిన వ్యక్తి మంగన్‌లాల్. అతనికి ఇద్దరు భార్యలు. ఈ పిల్లలు అతని ఇద్దరు భార్యల ద్వారా జన్మించిన సంతతి. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. దాన్ని అమ్మడానికి అతను ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని అతని సోదరులు, అతని ఇద్దరు భార్యలు విరమింపచేశారు. ఆ భూమి అమ్మే సి పిల్లల్ని ఎలా పోషిస్తావని కూడా వాళ్లు ప్రశ్నించారు. కోపగించుకున్న మంగన్‌లాల్ 2010, జూన్ 10/11 రాత్రి భోజనం చేయ లేదు. ఉదయం కూడా అతను భోజనం చేయ డానికి నిరాకరించాడు. అతని భార్యలు వ్యవ సాయ పనులకు వెళ్లిపోయిన తరువాత తన ఐదుగురు పిల్లలను అతను గొడ్డలితో దారు ణంగా నరికి చంపాడు. ఆ సంఘటన జరిగిన కొద్ది సేపటికి అతని ఇద్దరు భార్యలు ఇంటికి వచ్చి చూసి భయభ్రాంతులై కేకలు వేశారు. గుండెలు బాదుకున్నారు. వాళ్లను చంపడానికి అతను విఫలయత్నం చేశాడు. ఆ తరువాత అతను ఉరివేసుకొని చనిపోవడానికి ప్రయ త్నం చేశాడు. ఆ తాడుని కోసేసి అతని ప్రయ త్నాన్ని నిలిపివేశారు అతని భార్యలు. అతన్ని తాడుతో కట్టేసి పోలీసులకి అప్పగించారు. కేసుని విచారించిన సెహోర్ సెషన్స్ న్యాయ మూర్తి అతనికి మరణశిక్ష 2011, ఫిబ్రవరి 3న విధించి ధృవీకరణ కోసం మధ్యప్రదేశ్ హైకో ర్టుకు పంపించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసును విచారించి మరణశిక్ష ధృవీకరించింది. శిక్ష తగ్గించడానికి, శిక్షను అదేవిధంగా నిర్ధా రించడానికి గల కారణాలను పరిశీలించి మర ణశిక్షను హైకోర్టు ధృవీకరించింది. మృతుల వయస్సు, నేరం చేసిన విధానం, అత్యంత కిరాతకంగా చంపిన తీరు, ఎలాంటి పురికొల్పే కారణాలు లేకుండా కన్నపిల్లల్ని చంపిన తీరును, ఇతర అంశాలను గమనించి హైకోర్టు 2011, సెప్టెంబర్ 12న మరణశిక్షను ధృవీ కరించింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ప్రత్యే క అనుమతి అప్పీలును మంగన్‌లాల్ సుప్రీం కోర్టు ముందు దాఖలు చేశాడు. న్యాయ మూర్తులు హెచ్ఎల్ దత్తు, సి.కె.ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అప్పీలుకు అనుమతి ఇవ్వ కుండా 2012, జనవరిలో అప్పీలును కొట్టి వేసింది. ఆ తరువాత క్షమాభిక్ష ప్రసాదించమని రాష్ట్రపతికి మంగన్‌లాల్ దరఖాస్తు చేసుకు న్నాడు. మరణశిక్షను జీవితఖైదుగా మార్చ మని అతను తన దరఖాస్తులో వేడుకున్నాడు. అతని దరఖాస్తును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2013, జూలై 22న తిరస్కరించారు. ఆ తరు వాత అతనికి విధించిన ఉరిశిక్షను అమలు చేయమని సెషన్స్ కోర్టు బ్లాక్ వారెంట్స్‌ను జారీచేసింది. ఉరిశిక్ష సమాచారం పత్రికల్లో రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ముందు ఉరిశిక్ష అమలు నిలిపివేత కోరుతూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఉరిశిక్ష అమలుకు 6 గంటల ముందు ఆ శిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అతను ఉరిశిక్షకు అర్హుడా కాదా? ఉరి శిక్ష లు ఉండాలా వద్దా? వంటి వివాదాస్పద అంశాల జోలికిపోకుండా, సుప్రీంకోర్టు ముం దు ఉరిశిక్ష రద్దు పిటిషన్లో పీయూడీఆర్ లేవనెత్తిన అంశాలు ఏమిటి? ఈ నేపథ్యంలో జాప్యం ఎక్కడ జరిగిందో పరిశీలించాలి. నేరం జరిగింది. 2010, జూన్ 11న. సెషన్స్ కోర్టు తీర్పును ప్రకటించింది 2011, ఫిబ్రవరి 3న. హైకోర్టు మరణశిక్షను ధృవీకరిస్తూ తీర్పు చెప్పింది 2011, సెప్టెంబర్ 12న. సుప్రీంకోర్టు అతని అనుమతి అప్పీలును తిరస్కరించింది. 2012 జనవరిలో క్షమాభిక్ష విన్నపాన్ని రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ 2013, జూలై 22న తిర స్కరించారు. దర్యాప్తులో, విచారణలో జాప్యం జర గలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచిం ది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కోర్టుల్లో జాప్యానికి అనేక కారణాలు ఉంటాయి. మరి...? మం గన్లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో! - మంగారి రాజేందర్ జిల్లా జడ్జి, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్