మహాత్మగాంధీకి మోదీ, ప్రణబ్ నివాళులు Narendra modi, praban, kcr, narasimhan pays tribute to Mahatma Gandhi | Sakshi
Sakshi News home page

మహాత్మగాంధీకి మోదీ, ప్రణబ్ నివాళులు

Published Fri, Jan 30 2015 11:13 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

Narendra modi, praban, kcr, narasimhan pays tribute to Mahatma Gandhi

న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీకి జాతి ఘనంగా నివాళులు అర్పించింది. గాంధీజీ 67వ వర్థంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రి పారికర్ తదితరులు అంజలి ఘటించారు. గాంధీజీ సమాధి మీద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.  

మరోవైపు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా హూదరాబాద్లోని బాపూఘాట్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. అలాగే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు బాపూజీకి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement