రాజ్ ఘాట్లో మహాత్ముడికి ఘన నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, త్రివిధ దళాధిపతులు రాజ్ ఘాట్లో నివాళులు అర్పించారు. గాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి, రెండు నిమిషాలపాటూ మౌనం వహించారు.
మరో వైపు హైదరాబాద్లో బాపూ ఘాట్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా రెండు నిమిషాల పాటూ మౌనం పాటించారు. వాహనదారుల కోసం అన్ని ట్రాఫిక్ సిగ్నల్లను 11 గంటలనుంచి రెండు నిమిషాలు రెడ్ సిగ్నల్ వేయడంతో ప్రయాణికులు కూడా అమరవీరులలకు నివాళులు అర్పించారు.