narasimhan
-
కేసీఆర్‌కు నరసింహన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: తుంటిఎముక మార్పిడి చికిత్స తరువాత హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులు కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తె లుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన అభివృద్ధి, అప్పటి గవర్నర్‌గా నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారం చర్చకు వచ్చిన సందర్భంలో కేసీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులకు పట్టువ స్త్రాలు సమర్పించి సంప్రదాయపద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. అంతకుముందు కేసీఆర్ నివాసానికి నరసింహన్ దంపతులు చేరుకోగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.తారకరామారావు సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ వెంట మాజీమంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు. -
స్టార్‌బక్స్ సీఈవోగా నరసింహన్
న్యూయార్క్: అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల జాబితా మరింతగా పెరుగుతోంది. తాజాగా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన డైరెక్టర్ల బోర్డులో కూడా చేరతారని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: 31 వేల మంది పైలట్లు కావాలి.. భవిష్యత్‌లో ఫుల్ డిమాండ్ మార్చి 23న జరిగే స్టార్‌బక్స్ వార్షిక షేర్‌హోల్డర్ల సమావేశానికి ఆయన సారథ్యం వహిస్తారు. కంపెనీ అధిక వృద్ధి బాటలో నడిపించేందుకు భాగస్వాములందరితో కలిసి పని చేయనున్నట్లు నరసింహన్ తెలిపారు. గత సీఈవో హొవార్డ్ షుల్జ్ స్థానంలో నరసింహన్ నియామకాన్ని స్టార్‌బక్స్ గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! పుణె విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన నరసింహన్ అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. బహుళజాతి దిగ్గజాలు మెకిన్సే అండ్ కంపెనీ, పెప్సీకో, రెకిట్ బెన్కిసర్ వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. నరసింహన్‌కు 30 ఏళ్ల పాటు కన్జూమర్ గూడ్స్ వ్యాపార విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ -
రాజ్‌భవన్.. నివురుగప్పిన నిప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నర్ల పాత్ర, ప్రభుత్వాలతో సంబంధాలకు సంబంధించిన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళిసై స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేసిన, ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్ మరొకరు లేరు. నాడు రామ్‌లాల్ నుంచి.. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడిగా రామ్‌లాల్ పేరును చెబుతుంటారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన గవర్నర్‌గా ఆయన చరిత్రకెక్కారు. తర్వాత కుముద్‌బెన్ జోషి గవర్నర్‌గా ఉన్నప్పుడూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదించి వార్తల్లో నిలిచారు. రాజ్‌భవన్‌లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. కొంతకాలం నాటి సీఎం ఎన్టీఆర్‌తో కుముద్‌బెన్ కోల్డ్‌వార్ సాగింది. నరసింహన్ హయాంలో.. ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా నరసింహన్ పనిచేసిన కాలంలో పలుమార్లు రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో నరసింహన్ కొంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల బాధ్యతలను కొంతకాలం చూసుకున్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై వివాదం తలెత్తినప్పుడు.. సెక్షన్–8 ప్రయోగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన మున్సిపల్ చట్టంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపారు. మార్పులు చేసి తీసుకెళితే ఆమోదించారు. ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా.. ప్రభుత్వం పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే, ఆయనకు తగిన అర్హతలు లేవంటూ తిప్పిపంపారు. మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర (ఉద్ధవ్‌ఠాక్రే సీఎంగా ఉండగా), కేరళ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పలు అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించి వివాదాస్పదులుగా నిలిచారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
కీలక నేతకు అన్నాడీఎంకే ఉద్వాసన.. ఎందుకిలా చేశారు?
తిరుత్తణి/తమిళనాడు: అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ సీనియర్ నేత నరసింహన్‌ను తొలగించారు. అన్నాడీఎంకేను ఎంజీఆర్ స్థాపించిన సమయం నుంచి ఆ పార్టీలో నరసింహన్ కొనసాగుతున్నారు. 1980లో విద్యార్థి దశలోనే తొలిసారిగా పళ్లిపట్టు అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి పళ్లిపట్టు, తిరుత్తణి ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పళ్లిపట్టులో అన్నాడీఎంకేకు జీవం పోసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంజీఆర్, జయలలిత అడుగుజాడల్లో పయనించారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2016లో తిరుత్తణి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో నరసింహనన్‌ను పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి పార్టీ అధిష్టానం తొలగించింది. బలమైన ప్రజా ఆదరణ ఉన్న నాయకుడిని పార్టీ వదులుకోవడంతో తిరుత్తణి నియోజకవర్గంలో అన్నాడీఎంకే డీలా పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. -
విషయం తెలియక వెళ్లాను
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు సందర్భంగా తనను ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదని వచి్చన వార్తలపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘గవర్నర్ వీడ్కోలు సమావేశానికి రావాల్సిందిగా నాకు ప్రగతిభవన్ నుంచి ఫోన్ వచి్చంది. అయితే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు చేయాల్సిన ఫోన్ నాకు పొరపాటున వచి్చనట్లుగా తర్వాత గుర్తించారు. ఆ విషయం తెలియక నేను ప్రగతిభవన్‌కు వెళ్లాను. మంత్రు లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం ఉండటంతో.. అదే సమయంలో వచి్చన మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ లోనికి వెళ్లి ఉంటారు. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఏమీలేదు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు’ అని ఆమె అన్నారు. -
రేపు గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు
-
అన్నివేళల్లో అందుబాటులో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చేందుకు గ్రూపు–1 అధికారులు అన్నివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకోవడానికి అధికారులు కృషి చేయాలని.. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంలో సానుభూతిని ప్రదర్శించాలన్నారు. బంగారు తెలం గాణ సాధనకు ఇది అత్యావశ్యకమని చెప్పారు. శుక్ర వారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో రాష్ట్ర గ్రూపు–1 సర్వీసు అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వాధికారులు ప్రజానుకూలంగా ఉండరనే భావన సమాజంలో ఉందని.. దానిని దూరం చేసేందుకు అధికారులు తమ విధి నిర్వహణలో ప్రజలతో మరింత మమేకమై పని చేయాలని సూచించారు. అన్ని వర్గాలకు సేవ చేయాలి.. బలమైన సామాజిక మాధ్యమాలు, శక్తివంతమైన పౌర సమాజం, జాగరూకతతో కూడిన ప్రజలున్న ప్రస్తుత పారదర్శక ప్రపంచంలో వ్యక్తిగత సామర్థ్యం, నిబద్ధత, ఇతర అంశాలు మరింత మెరుగుపర్చుకోవడం ద్వారా ప్రజానుకూల అధికారులుగా ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు. సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా బడుగులు, పేదలకు సేవ చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించా రు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కారణంగా అధికారులు ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా ఎదిగేందుకు కావాల్సిన అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. విధులకే పరిమితమవ్వొద్దు.. అధికారులు కేవలం తమ విధులకే పరిమితం కాకూడదని గవర్నర్ చెప్పారు. రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధి చెందేందుకు అధికారులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలన్నారు. స్వాగతోపన్యాసం చేసిన ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ బీపీ ఆచార్య మాట్లాడుతూ కొత్తగా గ్రూప్–1 సర్వీసుల్లో చేరిన అధికారులు రాష్ట్రాభివృద్ధికి తమను తాము పునరంకితం చేసుకునేలా ఫౌండేషన్ కోర్సును నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులకు గవర్నర్ సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన డీఎస్సీ నూకల ఉదయ్‌రెడ్డికి, రాతపరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన డీపీవో పేరిక జయసుధకు ఆయన జ్ఞాపికలు అందజేశారు. అలాగే యువ అధికారుల హౌస్ జర్నల్ సొసైటీ రూపొందించిన ‘సవ్వడి’జర్నల్ను, ఐఏఎస్ అధికారిణి రజనీ శేఖరీ సిబాల్ రచించిన ‘ఫ్రాగ్రెంట్ వర్డ్స్’పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. -
హైదరాబాద్‌లోని ఏపీ కార్యాలయాలు తెలంగాణకు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను చెరిసగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుంచి నడుస్తున్నందున హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ భవనాలను వాడుకోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. ఉపయోగంలో లేకపోవడం వల్ల భవనాలు పాడవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలను తమ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆదివారం గవర్నర్‌ను కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తమకు ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. కేసీఆర్ హర్షం గవర్నర్ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలే పరమావదిగా, స్నేహ భావంతో ముందడుగు వేయడం శుభపరిణామని పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు ప్రభుత్వాలు పని చేయాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతని కేసీఆర్ అన్నారు. -
మహిళలపై నేరాలను అరికట్టండి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు, హత్య లు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని, వెంటనే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రం సమర్పించింది. తెలంగాణలో 2015 నుంచి 2017 వరకు 1,024 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో చాలామంది అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని, మరికొందరిని హత్య చేస్తున్నారని గవర్నర్‌కు ఈ బృందం వివరించింది. హాజీపూర్ గ్రామంలో బాలికల వరుస హత్యల ఘటనలో ఆ గ్రామం నుంచి భువనగిరికి, భువనగిరి నుంచి హైదరా బాద్‌కు ప్రజారవాణా సౌకర్యం లేకపోవడంతో మర్రి శ్రీనివాస్‌రెడ్డి బాలికలకు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తెలిపింది. గవర్నర్‌ను కలసిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్, బీజేపీ మహిళా అధ్యక్షురాలు విజయ, మాధవి తదితరులు ఉన్నారు. -
మానవ మేధస్సును మించింది లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు చేసిన పరిశోధనలు దేశానికి ఉపయోగపడాలని అప్పుడే వారి చదువుకు సార్థకత లభిస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్, జేఎన్టీయూహెచ్ చాన్స్‌లర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. కూకట్‌పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో శుక్రవారం 8వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన గవర్నర్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలుగా మారవద్దని సూచించారు. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన సాంకేతిక వస్తువులు జీవితంలో సౌకర్యాలను సులభతరం చేస్తాయి కానీ మానవ మేధస్సుకు ప్రతి రూపాలు కాలేవని అన్నారు. మానవ మేధస్సును మించింది లేదని ఉద్ఘాటించారు. జేఎన్టీయూహెచ్కు ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని.. ఇది మనందరికీ గర్వకారణం అని అన్నారు. యూనివర్సిటీలోని ప్రయోగశాలలో నిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయని వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు నేర్చుకోవడం అనేది నిరంతర అభ్యాసంగా స్వీకరించాలని సూచించారు. సాంకేతికతను వినియోగించి ఆహార భద్రత, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణకు పరిశోధనలు సాగాలని కోరారు. ఆరోగ్య భద్రతా రంగంలోనూ పరిశోధనలు చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించేలా సాంకేతికత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టెక్నా లజీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతాయనడానికి సైబర్ టెర్రరిజం ఒక ప్రధాన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. సైబర్ టెర్రరిజం నుంచి ముప్పు ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన అన్నారు. ఈ ఏడాది పట్టాలు పొందిన వారు చేసిన పరిశోధనల వివరాలన్నింటినీ తనకు అందించాలని వైస్ చాన్స్‌లర్ ఎ.వేణుగోపాల్‌రెడ్డిని కోరారు. పీహెచ్డీ పట్టాల ప్రదానం.. మేనేజ్మెంట్ కోర్సెస్ ఇన్ క్రైమ్ అనే అంశంపై ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) జితేందర్ పీహెచ్డీ పూర్తి చేయడంతో ఆయనకు గవర్నర్ చేతుల మీదుగా పట్టాను అందించారు. ఈ స్నాతకోత్సవంలో 2017–18 సంవత్సరానికి గానూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన 42 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. అదే విధంగా 217 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాల విషయంలో విద్యార్థుల కుటుంబాల పక్షాన పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలను అవహేళన చేస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఈ అక్రమాల వ్యవహారంలో ముఖ్య మంత్రి ఎందుకు మంత్రిపై చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించింది. గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించింది. ఇంటర్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకునేలా స్పందించాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే ఇంటర్ స్థాయి పరీక్షల నిర్వహణ అనుభవం లేని గ్లోబరీనాకు ఎందుకు అప్పగించారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఫలితాల్లో తప్పిదాల వల్ల లక్షల మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని, 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేసేవరకు బీజేపీ పోరాటం ఆపదని తేల్చి చెప్పారు. ఇకపై విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇంత గొడవ నడుస్తున్నా వారం వరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవటం విడ్డూరమని, కనీసం ఇప్పటికైనా స్పందించినందుకు సంతోషమన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసేవరకు ఉద్యమం సాగుతుందని చెప్పారు. బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. తమ విన్నపాన్ని గవర్నర్ తీవ్రంగానే పరిగణించారన్నారు. పిల్లలూ ధైర్యంగా ఉండండి: దత్తాత్రేయ తమ విన్నపానికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యార్థులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, వారు ధైర్యంగా ఉండాలని సూచించారు. వెంటనే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇన్ని లక్షల మంది విద్యార్థుల మనోవేదనకు రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం కలచివేస్తోందన్నారు. ముఖ్యమంత్రి పాలన ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆమె ఎద్దేవా చేశారు. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న సీఎంకు ఒక్క క్షణం కూడా ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. పార్టీ నేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, రామచంద్రరావు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు. -
నాకు జరిగిన ఆశీర్వచనం రాష్ట్రానికి జరిగినట్లే..
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో తనకు జరిగిన ఆశీర్వచనం రాష్ట్రానికి జరిగినట్లేనని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. సుమారు గంట పాటు ఆలయంలో గడిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయంలో తనకు మంచి అనుభూతి కలిగిందన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు చతుర్వేద పఠనంతో తనను సంతోషింపజేశారని పేర్కొన్నారు. రాష్టŠట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని తాను కోరుకున్నానని తెలిపారు. గవర్నర్ వెళ్లే వరకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత మహేందర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, ఈఓ గీతారెడ్డి పాల్గొన్నారు. -
ప్రగతిపథంలో.. తెలంగాణ పరుగులు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంగా అన్ని బాలారిష్టాలను దాటుకొని తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు తీస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేస్తూ దూసుకెళ్తోందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా, జాతి నిర్మాణంలో చక్కటి పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, మరే రాష్ట్రంలోనూ సంక్షేమానికి ఇంత పెద్ద భారీగా నిధులను కేటాయించటం లేదన్నారు. ప్రభుత్వం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించే బృహత్తరమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, అంతర్రాష్ట్ర వివాదాలను అధిగమించి, అటవీ, పర్యావరణ అనుమతులన్నీ సాధించి శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగిస్తోందన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఈ వర్షాకాలం నుంచే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టుల నిర్మాణ æపనులు అనతికాలంలో పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. ఒక్క తెలంగాణలోనే... మిషన్ కాకతీయతో రాష్ట్రంలో వేలాది చెరువులు పునరుద్ధరణకు నోచుకుని కళకళ్లాడుతున్నాయన్నారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ వచ్చేనెల పూర్తవుతుందని నరసింహన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఒక్క తెలంగాణలోనే వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలతో తెలంగాణ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణమని.. రైతుబంధు ఏకంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకోవడాన్ని గవర్నర్ గుర్తుచేశారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ వర్గాల కోసం 542 రెసిడెన్షియల్ స్కూళ్ళను ప్రారంభించిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో కొత్తగా మరో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించబోతోందని గవర్నర్ ప్రకటించారు. ‘డబుల్ బెడ్రూం’వేగవంతం... పేదల నివాసాలు నివాసయోగ్యంగా, గౌరవ ప్రదంగా ఉండాలనే సదుద్దేశ్యంతో ఇప్పటికే 2.72 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. మెరుగైన రవాణా కోసం 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించిందని, రాష్ట్రం ఏర్పడే నాటికి 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, నేడు రాష్ట్రంలో 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతమున్న ఔటర్ రింగు రోడ్డు అవతల 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగు రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడంతోపాటు రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాలకు ఖచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని, పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు వచ్చేలా టీఎస్–ఐపాస్ చట్టం తీసుకొచ్చారని.. ఐటీ రంగంలో నూతన అన్వేషణలకు వేదికగా నెలకొల్పిన ‘టీ–హబ్’అంకుర సంస్థలకు అండగా నిలుస్తోందన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేసిందని, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 21 జిల్లాలకు తోడుగా త్వరలోనే నారాయణపేట, ములుగు జిల్లాలు కూడా అస్తిత్వంలోకి రాబోతున్నాయని చెప్పారు. అడవుల రక్షణ కోసం కలప స్మగ్మర్ల పై ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయించిందని, కాలుష్యమయంగా మారిన మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించిందని, కాళేశ్వరంతో మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని అనుసంధానం చేయాలని సంకల్పించిందని గవర్నర్ వివరించారు. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటును తెలంగాణ సాధిస్తోందని ఆయనవెల్లడించారు. అమర జవాన్లకు కేసీఆర్ నివాళి... అంతకుముందు పరేడ్ మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుగా ఆర్మీ రిజిస్టర్లో సంతకం చేశారు. అనంతరం భద్రతా దళాలు వెంటరాగా అమరజవాన్ల స్థూపం వద్దకు వెళ్లారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరసైనికులకు నివాళులర్పించారు. తర్వాత ప్రాంగణం వద్దకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుష్ఫగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగరేసి భద్రతా దళాల గౌరవవందనం స్వీకరించారు. -
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
-
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ఓటు భవిష్యత్తును నిర్ణయించే ఆయుధమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ఆయనతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 90 శాతానికి ఓటింగ్ పెరగాలని ఆకాం క్షించారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనాలి. సెలవున్నా పోలింగ్‌లో పాల్గొనకపోవడం ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటింది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. యువత తప్పక ఓటింగ్‌లో పాల్గొనాలి..’అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారని రజత్‌కుమార్‌ను గవర్నర్ ప్రశంసించారు. దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అభినందించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటింగ్ పెరిగేలా ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఓటును నమోదు చేసుకోవాలి: సీఈఓ అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించామని.. పోలింగ్ శాతం పెంచామని సీఈఓ రజత్‌కుమార్ చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని.. రిపోలింగ్ జరపాల్సిన పరిస్థితి రాలేదని తెలిపారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 4 వరకు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోలవుతుంటే.. జీహెచ్ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోలవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలున్నప్పటికీ జనాలు ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్.. అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆబ్కారీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, అదనపు సీఈఓ బుద్ధ ప్రకాశ్, జాయింట్ సీఈఓ అమ్రపాలికి అవార్డులను ప్రదానం చేశారు. -
‘యథా ప్రజా తథా రాజాలా ఉండాలి’
సాక్షి, విజయవాడ : కులం, మతం, డబ్బు ఓటుకు ప్రామాణికం కాకూడదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతీ ఒక్కరు ఎన్నికల్లో పాల్గొనాలి. సెలవు ఉన్నప్పటికీ పోలింగ్‌లో పాల్గొనకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న యువత తప్పక ఓటింగ్‌లో పాల్గొనాలి’ అని వ్యాఖ్యానించారు. ఓటుతో మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంలో భాగంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులకు గవర్నర్ గుర్తింపు కార్డులు అందజేశారు. ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేయడంతో పాటుగా ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రతిఙ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు సీఎస్ అనిల్ చంద్ పునీత, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబరు 1950 పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. ఓటు అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని... అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఓటరు నమోదుపై సందేహాల నివృత్తికై 1950 అనే టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
రేపు ప్రోటెం స్పీకర్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ బుధవారం ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చార్మినార్ స్థానం నుంచి గెలిచిన ముంతాజ్ అహ్మద్.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రోటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ అధ్యక్షతన గురువారం 11.30 గంటలకు కొత్త శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. రెండుగంటల పాటు కొనసాగే ఈ కార్యక్రమం తర్వాత.. మధ్యాహ్నం జూబ్లీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్‌లో శాసనసభ సభ్యులకు ప్రభుత్వం విందు ఏర్పాటుచేసింది. అనంతరం అదేరోజు.. స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ల స్వీకరణ జరపనున్నారు. జనవరి 18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన సభాకార్యక్రమాలు సాగుతాయి. స్పీకర్ అధ్యక్షతన శాసనసభ సలహా సంఘం (బీఏసీ) సమావేశమై ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంపై (19న) నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది. మొత్తంగా జనవరి 17 నుండి 20 వరకు శాసనసభ కార్యకలాపాలు జరగనున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశినాడు (జనవరి 17న) శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ప్రధాని, హోంమంత్రులతో గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను వారికి వివరించారు. ముందుగా ప్రధానిని అనంతరం రాజ్‌నాథ్ సింగ్‌ను కలసి ఏపీ, తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులపై నివేదించినట్టు సమాచారం. -
తెలంగాణ తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
-
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తరించాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో తలసేమియా విభాగాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో వైద్యులు, వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధులు ప్రాణాంతకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధితో మూడు నుంచి నాలుగు కోట్ల మంది బాధపడుతున్నారని తెలిపారు. ప్రముఖ నగరాల్లో కూడా ఈ వ్యాధి కనిపిస్తోందని తెలిపారు. పోలియో, స్మాల్పాక్స్ల్లా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో భారత వైద్యులకు మంచి గుర్తింపు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ యోజన పథకం కింద ఇప్పటికే ఆరు లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోగా, రూ.800 కోట్లు ఖర్చయిందని రాష్ట్రపతి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్య సమూహాల మధ్య ఒక అవగాహన కలిగించడం, వారికి సకాలంలో సలహాలు ఇచ్చి సమస్య పరిష్కారం చూపడం ఒక ముఖ్యమైన ఘట్టంగా తీసుకోవాలన్నారు. గిరిజన వర్గాలలో ముఖ్యంగా జన్యుపరమైన రక్త రుగ్మతలను నిర్మూలించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఆసుపత్రుల నుంచి ఆరోగ్యం–రక్షణ నిపుణులు, సమాజంలో స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేయాలని రాష్ట్రపతి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ అత్యంత ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం అవగాహన అవసరం : గవర్నర్ నరసింహన్ ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే గ్రామీణులంతా ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తలసేమియా తదితర వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు పెళ్లికి ముందే అందరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ఎంపీ బి.వినోద్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ బి.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
శాసన మండలి ప్రొరోగ్: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొరోగ్ చేయ డం వల్ల గత సెప్టెంబర్ 27న జరిగిన శాసనమండలి చివరి సమావేశంతో సెషన్ ముగిసింది. మళ్లీ గవర్నర్ నోటిఫికేషన్ జారీ తర్వాతే తదుపరి సెషన్ సమావేశాలు జరగనున్నాయి. -
గవర్నర్‌కు ఎమ్మెల్యేల జాబితా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను బుధవారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు సమర్పించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ముగిస్తున్నామని, రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు సైతం ముగిసిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. లక్షల ఓట్ల గల్లంతు అవాస్తవం.. ఓటర్ల జాబితాలో 24 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం లో అవాస్తవమని సీఈఓ అన్నారు. అంత మొత్తంలో ఓట్లు గల్లంతు జరిగితే ఓట్లు కోల్పోయిన వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒప్పుకునేవారు కాదని, ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య తలత్తేదన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొన్ని ఓట్లు గల్లంతు కావడం సహజమేనన్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల తొలగింపు కోసం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఏటా ప్రతి ఒక్కరూ తమ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలన్నారు. 2015 లో ప్రచురించిన ఓటర్ల జాబితాలో 2.81 కోట్ల ఓటర్లు ఉండగా, ఆ తర్వాత నిర్వహించిన జాతీయ ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా చనిపోయిన, చిరునామా మారిన 24 లక్షల ఓట్లను తొలగించామన్నారు. 2018లో మూడుసార్లు ఓటర్ల జాబితా సవరణ నిర్వహించగా, 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లను నమోదు చేశామన్నారు. ఓటర్ల తొలగింపునకు ముందు 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ ప్రతి ఓటరుకు స్థానిక బీఎల్ఓలు నోటీసులు జారీ చేశారన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2019లో భాగంగా ఓటర్ల నమోదు కోసం డిసెంబర్ 24 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 2018, డిసెంబర్ 31 నాటి కి 18 ఏళ్లు నిండే వ్యక్తులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తులూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మానవ తప్పిదాలతోనే ఈవీఎం సమస్యలు ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓటమిపాలయ్యామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ఆరోపణలను సీఈవో తోసిపుచ్చారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకు ఆస్కారం లేదన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు, సీసీటీవీ కెమెరాల నిఘా మధ్య ఈవీంలను భద్రపరిచామన్నారు. 100 శాతం వీవీప్యాట్ ఓట్లను లెక్కిం చాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తి ఆచరణలో సాధ్యం కాదన్నా రు. మానవ తప్పిదాలతో కౌంటింగ్ సమయంలో ఈవీఎంలతో రెండు రకాల సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్రంలోని 92 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్‌లో వేసిన ఓట్లను తొలగించకుండానే పోలిం గ్ను ప్రారంభించడంతో మాక్ పోలింగ్, అసలు పోలింగ్ ఓట్లు కలిసిపోయాయన్నారు. మాక్ పోలింగ్ తర్వాత సీఆర్సీ (క్లియర్ రిపోర్ట్ క్లోజ్) మీటను ప్రిసైడింగ్ అధికారులు నొక్కడం మరిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల ఓట్లను పరి గణనలోకి తీసుకున్నామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ‘పోల్ ఎండ్’ మీట నొక్కకపోవడంతో రెండు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను కౌంటింగ్ రోజు తెరుచుకోలేదన్నారు. స్థానిక అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ‘పోల్ ఎండ్’ మీటను నొక్కిన తర్వాత ఈ ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిం చామని, ఆ తర్వాత ఆ ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్ ఓట్ల సంఖ్యతో సరి చూసుకున్నామన్నారు. ఈ రెండు సందర్భాలోనూ వాస్తవంగా పోలైన ఓట్లతో వీవీ ప్యాట్ ఓట్ల సంఖ్యతో సరిపోయాయన్నారు. ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 88 టీఆర్ఎస్, 19 కాం గ్రెస్, 7 ఎంఐఎం, 2 టీడీపీ, చెరొక బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి పేర్లతో జాబితాను ఇందులో పొందుపరిచింది. -
రాజ్‌భవన్‌కు ప్రజాకూటమి నేతలు
సాక్షి, హైదరాబాద్ : ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా తమదే అధికారం అని టీఆర్ఎస్, ప్రజాకూటమి నేతలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నప్పటికీ హంగ్ ఏర్పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు తెరవెనుక మంతనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీర్ఎస్కు మద్దతునిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడంతో ప్రజాకూటమి నేతలు అప్రమత్తమయ్యారు. సోమవారం గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా జానారెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మాకే అవకాశం ఇవ్వాలి.. అత్యధిక స్థానాల్లో గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇవ్వాలని ప్రజాకూటమి నేతలు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. కూటమి భాగస్వామ్య పక్షాలను ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూటమి నేతలు గవర్నన్‌కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డామని కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలు పేర్కొన్నారు. అన్ని పార్టీలు కలిసి కామన్ మినిమ్ ప్రోగ్రామ్ ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. -
గవర్నర్‌కు అవమానం
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ను అగౌరవపరిచే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించారు. సంప్రదాయబద్ధంగా మంత్రివర్గ విస్తరణ చేయాలనుకున్నప్పుడు సీఎం స్వయంగా గవర్నర్ వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పి చర్చించడం ఆనవాయితీ. స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి అమరావతికి వచ్చిన గవర్నర్‌ను స్వయంగా ఆహ్వానించాల్సివుంది. కానీ ఈ రెండు ఆనవాయితీలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారు. ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న విషయంపై చంద్రబాబు నేరుగా వెళ్లి గవర్నర్‌తో చర్చించకుండా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుండి అధికారుల ద్వారా రాజ్‌భవన్‌కు లేఖద్వారా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు కొత్తగా ఇద్దరు మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఆదివారం ఉదయం విజయవాడ నగరానికి వచ్చారు. ఆయన బస చేసిన చోటుకు ముఖ్యమంత్రి వచ్చి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే ఉండవల్లికి స్వయంగా తీసుకెళ్లాల్సివుంది. కానీ చంద్రబాబు మంత్రి పుల్లారావును గవర్నర్ వద్దకు పంపి అవమానకరంగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి నివేదిక కోరడాన్ని తప్పుపట్టిన టీడీపీ, ఆయనపై నేరుగా విమర్శలు గుప్పించింది. గవర్నర్‌ను బీజేపీ ఏజెంటుగా మంత్రులు, టీడీపీ నాయకులు ఆరోపించగా, చంద్రబాబు సైతం ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ గురించి ఆయనకు సీఎం నేరుగా చెప్పలేదు. ఇలా చేయడం ద్వారా చంద్రబాబు గవర్నర్‌పై తన అసంతృప్తిని, నిరసనను తెలిపినట్లు అనుకూల మీడియా రోజంతా ఊదరగొట్టింది. గతంలో గవర్నర్ పలుసార్లు అమరావతికి వచ్చినప్పుడు చంద్రబాబు స్వయంగా ఆయన బస చేసిన చోటుకు వెళ్లి ఆహ్వానం పలికి తీసుకెళ్లారు. ఇపుడు గవర్నర్‌కు ఆహ్వానం పలకడానికి రాకపోవడం ఆనవాయితీకి తిలోదకాలివ్వడమేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య రక్షణకని పలు రాష్ట్రాలు తిరుగుతున్న చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన గవర్నర్‌ను మాత్రం అవమానించడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. గవర్నర్‌ను అవమానించడం ద్వారా రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం, తదనంతర పరిణామాలతోపాటు తిత్లీ తుపాను, రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. -
గెలుపునకు ప్రతీక దీపావళి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక దీపావళి పండుగ అని ఆయన పేర్కొన్నారు. శాంతికి, మత సామరస్యానికి, సమాజ నిర్మాణానికి దీపావళి పండుగ ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ దీపావళి వారి జీవితాల్లో కోటి కాంతులు వెదజల్లాలని ఆయన ఆకాంక్షించారు. ‘వచ్చే దీపావళి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే’ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ రాష్ట్ర ప్రజల్లో సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఏడాది దీపావళి పండుగ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే జరుగుతుందని అన్నారు. -
గవర్నర్‌కు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేని విచారణ సంస్థతో దర్యాప్తు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. (గవర్నర్‌కు లేఖ అందిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు) తనపై జరిగిన ఈ భీకరమైన హత్యాయత్యాన్ని ముఖ్యమంత్రి, డీజీపీ తక్కువ చేసి మాట్లాడటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల దర్యాప్తుపై అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. దర్యాప్తు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలతో సాధ్యం కాదన్నారు. ఈమేరకు వైఎస్ జగన్ రాసిన లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం గవర్నర్‌ను కలిసి అందజేసింది. లేఖలో వివరాలు.. గౌరవనీయులు గవర్నర్ నరసింహన్‌గారికి, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న ప్రమాదకరమైన పరిణామాలను మీ దృష్టికి తెస్తున్నా. అక్టోబర్ 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో మధ్యాహ్నం 12.40 గంటలకు గుర్తు తెలియని దుండగుడు నాపై హత్యాయత్నం చేశాడు. సెల్ఫీ ఫోటో తీసుకోవాలనే నెపంతో నాకు అతి దగ్గరగా వచ్చి మెరుపు వేగంతో పదునైన ఆయుధంతో నా గొంతు కోయాలని ప్రయత్నించాడు. తక్షణం తేరుకున్న నేను ఆత్మరక్షణ కోసం నా ఎడమ భుజాన్ని అడ్డు పెట్టడంతో ఆ పదునైన ఆయుధం నా భుజంలోకి 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతుకు దిగింది. అనంతరం దుండగుడిని పట్టుకుని అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. విమానాశ్రయంలో డ్యూటీ డాక్టర్ నాకు ప్రథమ చికిత్స చేశారు. నాపై జరిగిన హత్యాయత్నం వార్తలు రాష్ట్రంలో తీవ్రమైన పరిణామాలకు దారి తీసే అవకాశాలున్నాయని అంచనా వేశా. నేను సురక్షితంగా ఉన్నానని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పి వారిని శాంతంగా ఉండేలా చేయడం నా తక్షణ కర్తవ్యంగా భావించా. వెంటనే రక్తంతో తడిసిన చొక్కాను అక్కడిక్కడే మార్చుకుని తగినంత మేరకు ప్రథమ చికిత్స చేయించుకుని మరో చొక్కా ధరించి షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం1.05 గంటలకే విమానం ఎక్కి హైదరాబాద్ బయలు దేరా. హైదరాబాద్ చేరుకున్న తరువాత నన్ను తదుపరి చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్‌కు తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు గాయం లోతు పరీక్షించి శస్త్రచికిత్స చేసి 9 కుట్లు వేశారు. ఏవైనా విషపూరిత పదార్థాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి నా రక్త నమూనాలను పరీక్షలకు పంపారు. నాపై జరిగిన హత్యాయత్నంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తు ముందస్తు నిర్థారణ ప్రకారం, లోపభూయిష్టమైన రీతిలో సాగుతోంది. దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగానే విచారణ పూర్తి కాకముందే ఒక అసంపూర్ణమైన ఆలోచనకు వచ్చి ఈ మొత్తం సంఘటన నేను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ సీపీలో జరిగిన అంతర్గతంగా కుట్రగా చిత్రీకరించింది. నాపై దాడి జరిగిన కొద్ది సేపటికే డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ దుండగుడు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే నాపై దాడి చేసినట్లుగా చెప్పారు. దాడి పూర్వాపరాలను సరిగ్గా అంచనా వేయకుండా కేవలం టీడీపీ సర్కారు ప్రయోజనాలకు అనుగుణంగా ఇలాంటి తొందరపాటు ప్రకటన చేశారు. ఈ దిగ్భ్రాంతికరమైన హత్యాయత్యాన్ని చాలా చిన్నదిగా తగ్గించి చూపే యత్నం జరిగింది. నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే ఇదంతా ఒక పథకం ప్రకారం అంతర్గతంగా రూపొందించుకున్నదని, ఎన్నికల్లో సానుభూతి కోసమేనని అధికారులు, టీడీపీ నేతలు పత్రికా ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఇది దర్యాప్తు గతిని పూర్తిగా తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో, ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి దుష్ట పన్నాగంతో చేసిందే తప్ప మరొకటి కానే కాదు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నాపైనా, వైఎస్సార్సీపీ పైనా చౌకబారు వ్యాఖ్యలు చేశారు. దుండగుడి వద్ద లభించిందని చెబుతున్న లేఖ ద్వారా అతడు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడని వెల్లడైందని, నిందితుడి ఇంట్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనలు పూర్తిగా నిరాధారమైనవి. డీజీపీ చేసిన వ్యాఖ్యలకు ఇవి మద్దతు చేకూర్చేలా ఉన్నాయి. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చేపట్టిన విచారణ పూర్తి అనుచితమైన రీతిలో ఒక నిర్థారణకు వచ్చి, ముందుగానే నిర్ణయించుకున్న విధంగా సాగుతోందనేది తేటతెల్లం అవుతోంది. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రే దురదృష్టకరమైన రీతిలో ఈ ఘటన అంతా వైఎస్సార్ సీపీ అంతర్గతంగా రచించుకున్న క్రూరమైన పథకమంటూ దర్యాప్తును నీరుగార్చడానికి గట్టి ప్రయత్నమే చేశారు. వైఎస్సార్సీపీపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేయాలన్న దురుద్దేశంతో, పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయాలన్న కుటిల నీతితో ఇలాంటి ఆరోపణలకు దిగారు. దీన్ని ‘ఆపరేషన్ గరుడ’ అంటూ సృష్టించిన ఒక స్క్రిప్టుతో ముడిపెట్టి, రాష్ట్రంలో పరిస్థితులను అస్థిరపరిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్–బీజేపీ కుట్ర పన్నినట్లు ఆరోపించారు. న్యాయసూత్రాల ప్రకారం నిష్పాక్షికమైన విచారణకు బాధితులు అర్హులు. ఏ విచారణ అయినా నిష్పాక్షికంగా, వివక్షకు తావులేకుండా ఉండాలి. సరైన సాక్ష్యాలను సేకరించడం, ముందస్తు నిర్ధారణకు రాకుండా సవ్యమైన దర్యాప్తు జరపడం నిష్పాక్షిక విచారణలో కీలక అంశాలు. నాపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి నిందితుడికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వద్ద పలు ఆధారాలున్నా కేసును నీరుగార్చే దిశగా విచారణ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతున్న తీరు సాధారణ పౌరుల్లోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా జరుగుతున్న ప్రేరేపిత దర్యాప్తుపై తీవ్ర అభ్యంతరాలున్న నేపథ్యంలో మీరు (గవర్నర్) తక్షణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేని దర్యాప్తు సంస్థకు ఈ కేసు విచారణను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అప్పుడు మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది.’’ భవదీయుడు – వైఎస్ జగన్మోహన్రెడ్డి. -
తుపాన్ బాధితులను కేంద్రం ఆదుకోవాలి: పవన్
సాక్షి, హైదరాబాద్ : తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుపాను బాధితులను కేంద్ర ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ తుపాను ముందు పరిస్థితిని, తర్వాత పరిస్థితిని ఆడియో రూపంలో గవర్నర్‌కు అందించామన్నారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం సరిపోవడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బృందం తక్షణమే రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని, ఏ మూలకు వెళ్లినా సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని పవన్ తెలిపారు. కిలో మీటర్ల దూరం కాలి నడకన తిరిగి పరిస్థితిని అంచనా వేశామన్నారు. తమ నివేదికను గవర్నర్‌కు అందజేశామని, దానిని కేంద్రానికి పంపుతామని గవర్నర్ చెప్పారన్నారు. మత్య్సకారులను ప్రత్యేక సాయం చేయాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ దాటవేశారు. శవాలపై పేలాలు ఏరుకుంటారా? -
2025 నాటికి టీబీ లేని ఇండియాగా మార్చండి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని 2025 నాటికి టీబీ లేని ఇండియాగా తీర్చిదిద్దాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన టీబీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ‘టీబీ సీల్ సేల్’ప్రచార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ ఎంతో ప్రమాదకరమైన వ్యాధి అని న్నారు. టీబీ ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదన్నారు. కాబట్టి దీనిపై విస్తృ్తతమైన పరిశోధనలు జరపాలని వైద్యులను కోరారు. ఒక్కోసారి సాధారణ ఎక్స్‌రేతో క్షయను గుర్తించలేమని, అందుకోసం ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుందన్నారు. క్షయ రోగి నిత్యం మందులు వాడాలని, బలవర్థకమైన పోషక పదార్థాలు తీసుకోవాలని సూచించారు. గ్రామా ల్లోనే కాకుండా పట్టణాల్లోనూ టీబీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామసభలు పెట్టి ప్రజ ల్లో చైతన్యం పెంచాలని కోరారు. పలువురికి అవార్డులు.. తెలుగు రాష్ట్రాల్లో టీబీ సీల్స్‌ను పెద్ద ఎత్తున విక్రయించిన సంస్థలు, వ్యక్తులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. మొదటి ఉత్తమ బహుమతిని గుంటూ రు జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ అరుణ్‌కుమార్ క్రాంతి మహం తికి గవర్నర్ అందజేశారు. రెండో ఉత్తమ బహుమతి మహబూబ్‌నగర్ జిల్లా టీబీ అసోసియేషన్‌కు దక్కింది. ఈ బహుమతిని ఆ జిల్లాకు చెందిన ప్రతినిధికి అందజేశారు. విశాఖపట్నానికి చెందిన కేజియా మహంతికి కూడా అవార్డును ప్రదానం చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చలే ప్రధానం ప్రజాస్వామ్యంలో వాదనలు, చర్చలు, నిర్ణయాలు ముఖ్యమైనవని గవర్నర్ నరసింహన్ అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థపై శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన శ్రీలంక అధికారుల బృందం.. బుధవారం నియానాగే మామని జయవర్దనే నేతృత్వంలో గవర్నర్‌తో ప్రత్యేక భేటీ అయింది. వీరికి తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు స్వాగతం పలికారు. -
కేసీఆర్ తొత్తులా గవర్నర్: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంలా లేదని, కేసీఆర్ ఇంకా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌కు మద్దతు పలికేలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని, మెట్రో రైల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ టీఆర్ఎస్ నేతలా వ్యవహరించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు, రేవంత్ రెడ్డిపై ఈడీ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించా రు. -
ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులు బుధవారం వేర్వేరుగా కలిశారు. గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలసిన కేసీఆర్.. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం గవర్నర్ ఆదేశాల మేరకు సీఎస్ ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ జితేందర్, ఐజీ సంజయ్‌కుమార్‌జైన్ బృందం ఆయనను కలిసింది. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై అధికారులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. మావోయిస్టు పార్టీ ఏపీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీని ఆదేశించారు. అభ్యర్థుల ప్రచారానికి ఇబ్బంది కలగకుండా బందోబస్తు చర్యలు తీసుకోవాలని, రాజకీయ నేతల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. -
‘మానవత్వానికి మాయని మచ్చ’
సాక్షి, అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చని, ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి.. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మావోయిస్టుల దాడి పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి చెందడం పట్ల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
ఎల్బీనగర్–అమీర్‌పేట్ మెట్రో నేడే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతా చోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ బస్ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇరానీ చాయ్.. లాడ్‌బజార్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యులతో కలసి శనివారం పాతబస్తీలోని పలు పర్యాటక కేంద్రాలను సందర్శించారు. ముందుగా చార్మినార్ కట్టడాన్ని తిలకించిన గవర్నర్, భవన అందాలకు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనను ట్రస్టీ శశికళ సన్మానించారు. అనంతరం లాడ్‌బజార్‌లో గాజుల దుకాణాలకు వెళ్లి సందడి చేశారు. అక్కడి నుంచి సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శించి అం దులోని చారిత్రాత్మక వస్తువులను తిలకించారు. అనం తరం చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించారు. గవర్నర్ రాకతో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అల్జీమర్స్‌పై అవగాహన అవసరం: గవర్నర్
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో మనుషుల జ్ఞాపకశక్తి తగ్గుతోందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని పినిక్స్ ఎరీనాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవెరథాన్ (బృహత్ జాగృతికరణ)ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడటం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోతున్నారన్నారు. అవసరమైనంత వరకే టెక్నాలజీని వాడాలని సూచించారు. ప్రస్తుతం ఇండియాలో 40 లక్షల మంది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ వ్యాధి వారి దగ్గరి కుటుంబీకులు 12 లక్షల మందిపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. బంధిత రాజకీయ విధానాలను రూపొందించడానికి భారతదేశంలో ఇది ఒక ఆరోగ్య ప్రధానమైన విషయంగా పరిగణించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజుకు 50 మంది రోగులకు పైగా పరీక్షించగల సామర్థ్యంతో డెమోన్షియా కేర్ సెంటర్‌ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ, బెంగళూర్‌లోని నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ సంయుక్తంగా స్థాపించినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ పాపారావు తెలిపారు. అల్జీమర్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు వివిధ సేవలు, విపత్తు, అత్యవసర పరిస్థితులలో సహాయాన్ని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ అని చెప్పారు. -
త్యాగానికి ప్రతీక మొహర్రం!
సాక్షి, హైదరాబాద్: మానవజాతి సుగుణాల్లో అత్యున్నతమైన త్యాగానికి మొహర్రం ప్రతీక అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. దైవ విశ్వాసంకోసం జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణత్యాగాన్ని ముహర్రం గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. మంచితనం, త్యాగానికి పర్యాయపదం మొహర్రం అన్నారు. ముహర్రంను స్ఫూర్తిగా తీసుకుని ఇస్లాంకు మూలమైన మానవతావాదానికి పునరంకితమవుదామని గవర్నర్ పిలుపునిచ్చారు. త్యాగనిరతికి పునరంకితం కావాలి: కేసీఆర్ ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మొహర్రంను స్ఫూర్తిగా తీసుకుని నిజాయితీ, సత్ప్రవర్తన, న్యాయం, మానవత్వం, త్యాగనిరతికి ప్రతి ఒక్క రూ పునరంకితం కావాలని సీఎం తన సందేశంలో కోరారు. -
24 నుంచి ఎల్బీనగర్ - అమీర్‌పేట్ మెట్రో పరుగులు
సాక్షి, హైదరాబాద్: నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్– అమీర్‌పేట్ మెట్రో ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న (సోమవారం) మధ్యాహ్నం 12.15కి ఎల్బీనగర్–అమీర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరై మెట్రో రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె.జోషి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్.రెడ్డిలతో కలసి బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆహ్వానపత్రం అందించారు. ఇప్పటికే నగరంలో నాగోల్– అమీర్‌పేట్– మియాపూర్ (30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో నిత్యం సుమారు 80 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో రద్దీ లక్షకుపైగానే నమోదవుతోంది. ఈ మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. నవంబర్‌లో అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మెట్రో.. అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉండే ఎల్బీనగర్– అమీర్‌పేట్– మియాపూర్ (29 కి.మీ) మార్గంలో నిత్యం సుమారు లక్ష మందికి పైగానే మెట్రో జర్నీ చేసే అవకాశం ఉంటుందని హెచ్ఎంఆర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో అమీర్‌పేట్– హైటెక్‌సిటీ మార్గంలోనూ మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నట్లు తెలిపాయి. కాగా ఎంజీబీఎస్– ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో మెట్రో పనులు మరో ఏడాది ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పార్కింగ్ అవస్థలు తప్పవు.. ఎల్బీనగర్– అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్ల వద్ద ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేసుకునేందుకు అవసరమైన పార్కింగ్ స్థలాలు అందు బాటులో లేవు. దీంతో ప్రయాణికులకు పార్కిం గ్ అవస్థలు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయా స్టేషన్ల వద్ద మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తిరిగి సమీప కాలనీలు, బస్తీల్లో ని తమ నివాసాలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్లచేసుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెట్రో చార్జీలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న సిటిజన్లకు ఇది అదనపు భారంగా పరిణమించనుంది. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా సీఎం గురువారం గవర్నర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరి మధ్య రాజకీయ, పరిపాలనపరమైన అంశాలు చర్చకు వచ్చాయని, డిసెంబర్‌లోపు ఎన్నికలు జరిగే అవకాశముందని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యేల భేటీ... అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్న మంత్రి కేటీఆర్ వినాయక చవితి నేపథ్యంలో రెండురోజులు ఈ ప్రక్రియకు విరామం ఇచ్చారు. టికెట్ దక్కిన తాజా మాజీ ఎమ్మెల్యేలు పలువురు శుక్రవారం కేటీఆర్‌ను కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కోనేరు కోనప్ప, చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, చెన్నమనేని రమేశ్‌బాబు, కల్వకుంట విద్యాసాగర్‌రావు తదితరులు కేటీఆర్‌ను కలిసి ప్రచారాంశాలపై చర్చించారు. వీలైనంత త్వరగా తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేయాలని వారికి మంత్రి సూచించారు. -
రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ప్రతిపక్షాలు గవర్నర్‌ను డిమాండ్ చేశాయి. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయన్న నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఓటర్ల జాబితా తయారవుతున్న సమయంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటాన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఉత్తమ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు కె. జానారెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆ పార్టీ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, కె. సాంబశివరావు తదితరులు ఉన్నారు. గవర్నర్‌ను కలిశాక ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చట్టాలకు పాతర తెలంగాణలో చట్టాలకు కేసీఆర్ పాతరేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. కేసీఆర్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అంతిమంగా ప్రజలే కేసీఆర్‌కు ఘోరీ కడుతారు. – చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వ్యతిరేకత పెరుగుతోందనే ముందస్తుకు... ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను కొనసాగిస్తే ఆయన అరాచకాలకు, ఎన్నికల అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉంది. ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించే ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. తద్వారా దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.– కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు మోదీ, కేసీఆర్ ప్రజాహక్కుల్ని కాలరాస్తున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయన్న నమ్మకం లేదు. ప్రధాని మోదీతోపాటు కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఓటర్ల జాబితా సిద్ధమవుతున్న తరుణంలో ముందస్తు ఎన్నికలంటూ అసెంబ్లీని రద్దు చేసి కొత్త ఓటర్లు ఓటేయకుండా కేసీఆర్ అడ్డుపడ్డారు. ఎన్నికల సంఘం ప్రకటించాల్సిన షెడ్యూల్‌ను కేసీఆర్ ప్రకటించారంటేనే కేంద్రంతో కలసి ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారని అర్థమవుతోంది. హైదరాబాద్ జంట నగరాల్లో ఓటర్లను అకారణంగా తొలగించారు. కేసీఆర్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటారు. 2004లోనే కేసీఆర్‌తోపాటు మంత్రి హరీశ్‌రావుపై దొంగ పాస్‌పోర్టు కేసులు నమోదైనా చర్యలు ఎందుకు తీసుకోలేదు. పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన దామోదర రాజనర్సింహను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. పోలీసుల బెదిరింపులకు భయపడం. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు. – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఇష్టారాజ్యంగా సీఎం నిర్ణయాలు ఐదేళ్లు పాలించాలని ప్రజలు టీఆర్ఎస్కు అధికారమిస్తే కేసీఆర్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టుతున్నారు. రాజ్యాంగ సంస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ నయా పెత్తందారీ అవతారమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత సృష్టించే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌ను వెంటనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తొలగించాలి. రాష్ట్రంలో ఎన్నికలు సవ్యంగా సాగాలంటే రాష్ట్రపతి పాలన విధించడమే శరణ్యం. – ఎల్. రమణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు -
‘తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించండి’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను అఖిల పక్షం నేతలు మంగళవారం కలిశారు. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌ను కొనసాగించొద్దని కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ పార్టీల నాయకులు గవర్నర్‌ను కోరారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర పతి పాలన విధించాలని గవర్నర్‌ను విపక్షాలు కోరాయి. రాజీవ్ శర్మ బ్రోకరా? : ఉత్తమ్ కుమార్ రెడ్డి మోదీ, కేసీఆర్, ఎన్నికల కమిషన్ కలిసి తెలంగాణ ప్రజల హక్కును కాలరాసేలా నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎలా జరగాలో కూడా కేసీఆర్ ముందే షెడ్యూల్ విడుదల చేశారన్నారు. ఓటర్ లిస్టులో 20 లక్షల ఓట్లు తగ్గించి వాటిని సవరించకుండా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. 6న గవర్నర్‌ను కలిసిన తరువాత కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాను అని చెప్పారని, ఆన్ రికార్డ్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో కూడా మాట్లాడానని చెప్పారన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున రాజీవ్ శర్మ ఎన్నికల కమిషన్‌ను ఎలా కలుస్తారు, ఆయన ఏమైనా బ్రోకరా అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం : కోదండ రామ్ ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని గవర్నర్‌ను కలిశామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్ అన్నారు. ఓటర్ల పేర్లు ఓటర్ లిస్ట్‌లో గల్లంతయ్యాయన్నారు. వినాయక చవితి, దసరా పండుగలలో ప్రజలు బిజీగా ఉంటారు అందువల్ల ఓటరు నమోదు కార్యక్రమం సరిగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా కేసీఆర్ పాలన : ఎల్ రమణ తెలంగాణలోని రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని టీటీడీపీ అధ్యక్ష్యుడు ఎల్ రమణ అన్నారు. ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని కేసీఆర్ చెప్పడం చూస్తే కేంద్రంతో కుమ్మక్కై,రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. సచివాలయానికి రాకుండా పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీజేఎస్, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలు కలిసి రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతి పాలనను విధించమని కోరుతామని పేర్కొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగడానికి వీలు లేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణలో పాలన : చాడ వెంకట్ రెడ్డి తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి 100 సీట్లు గెలుస్తామంటున్నారని, మోదీతో కలిసి ఎన్నికల షెడ్యూల్ కూడా కేసీఆర్ ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. రేపు కేసీఆర్ తను అనుకున్నది చేయడానికి ఎంతమంది పైన కేసులు పెట్టడానికైనా వెనకాడరన్నారు. కేసీఆర్‌పై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఏమాత్రం స్పందించలేదన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. నవంబర్‌లో ఎన్నికలు రావడానికి అనేక అక్రమాలు చేస్తున్నారని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకునేలా కూడా ఆలోచిస్తామన్నారు. -
అధికార దుర్వినియోగం కాకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ప్రభుత్వం పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తీసుకునే హడావుడి నిర్ణయాలపై సమీక్షించాలని కోరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు గురువారం సాయంత్రం గవర్నర్‌ను కలిశారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో ప్రజల హక్కులను, ప్రతిపక్ష పార్టీల స్వేచ్ఛను కాపాడాలని కోరామన్నారు. ఓటరు జాబితా సవరణలో 2019 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఈ ముందస్తు వల్ల ఓటు హక్కు పొందలేని పరిస్థితి నెలకొందని, ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రభుత్వానికి 9 నెలల గడువున్నా రద్దు చేసి, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలనుకుంటున్నారని, ఈ విషయంలో తమకున్న అనుమానాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరించారని, ఇప్పుడలా జరగకుండా చూడాలని కోరామన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పనులను చేయించుకునే అవకాశం ఉందని.. అలా జరగకుండా చూడాలని గవర్నర్‌కు విన్నవించామని ఎంపీ దత్తాత్రేయ చెప్పారు. -
భోగాపురం టెండర్ల రద్దు వెనుక అవినీతి
సాక్షి, అమరావతి: భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దు వెనుక భారీ అవినీతి భారీ అవినీతి దాగి ఉందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణకుమార్‌రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు మాలతిరాణిలతో కూడిన బృందం గురువారం విజయవాడలోని ఓ హోటల్లో బసచేసిన గవర్నర్‌ను కలసి ఈ మేరకు మూడు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రప్రభుత్వానికి ఎక్కువ భాగస్వామ్య వాటాతోపాటు ప్రభుత్వం కేటాయించే భూమికి ఏటా ఐదున్నర కోట్ల రూపాయలను లీజుగా కూడా చెల్లిస్తామని ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టెండర్లు దాఖలు చేసిందని, అయితే అంతకన్నా తక్కువ వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చి, భూమికి ఎటువంటి లీజు ఇవ్వడానికి ఆసక్తి చూపని జీఎంఆర్ సంస్థకు ప్రయోజనం కలిగించడానికి సీఎం చంద్రబాబుకున్న ఉద్దేశాలు ఈ టెండర్ల రద్దులో స్పష్టంగా తెలిసిపోతున్నాయని ఇందులో పేర్కొన్నారు. కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనకూడదని నిబంధన విధించడాన్ని వారు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. పీడీ ఖాతాల కుంభకోణం, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకం, అమరావతి బాండ్ల వ్యవహారంలో అవకతవకలు, అవినీతి గురించి కూడా వారీ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రబాబే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయ టెండర్ల విషయంలో అధికార టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 125 ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తూ, విమానయాన రంగంలో అపార అనుభవముండి.. తక్కువ ధర ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎ.ఎ.ఐ) టెండర్లను రద్దు చేసి జీఎంఆర్ సంస్థకు అవకాశమిచ్చారని వారు తెలిపారు. సరైన కారణాలు చెప్పకుండా టెండర్లను రద్దు చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాదని కేవలం స్వప్రయోజనాల కోసం స్వయంగా సీఎం చంద్రబాబే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు వివరించారు. అంతేగాక కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనరాదని నిబంధన విధించారని, దీన్నిబట్టి ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుకున్నట్టు విదితమవుతోందని పేర్కొన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు పాలనలో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాల గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్లను రద్దుచేసి ప్రభుత్వం కొత్త స్కాంకు తెరతీసిందని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కట్టడానికి ప్రభుత్వరంగ సంస్థ ఏఏఐ ముందుకొస్తే ఎందుకు టెండర్లు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనరాదని ఆంక్షలు పెట్టడంలో చంద్రబాబు ఉద్దేశమేంటన్నారు. టెండర్ల రద్దుపై కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఎక్కువ అప్పులు చేసి.. ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారు జీవీఎల్ నరసింహారావు విలేకరులతో మాట్లాడుతూ పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరగా.. దీనిపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నానని నరసింహన్ తమతో చెప్పారని తెలిపారు. ఇంకా అదనంగా సమాచారముంటే ఇవ్వాలని కోరారన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పీడీ ఖాతాలను తెరిచి జవాబుదారీతనం లేకుండా వాటిద్వారా డబ్బులు ఖర్చు చేసి రూ.53 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని జీవీఎల్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమరావతి బాండ్ల పేరుతో అప్పులు తేవడం రాజధాని అభివృద్ధికోసం కాదని, అవినీతికోసమే అప్పులు తెచ్చారని ఆయన ఆరోపించారు. ఎక్కువ అప్పులు తెచ్చి ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
షెడ్యూల్ కంటే ముందే..
సాక్షి, హైదరాబాద్ : నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయా? అసెంబ్లీ రద్దుకు ఈ సెప్టెంబర్‌లోనే సిఫారసు చేసే అవకాశముందా? గత రెండ్రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను, ఆ దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వేస్తున్న అడుగులను చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సహచరులతో సీఎం జరిపిన సుదీర్ఘ భేటీ అనంతరం గురువారం వడివడిగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలవడం, మంత్రి కె.తారక రామారావు ఢిల్లీలోనే ఉండి పలు కీలక భేటీలు జరుపుతుండటం రాజకీయవర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. దీనికితోడు శుక్రవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం పూర్తి కాగానే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ తన మనోగతాన్ని ఎవరికీ వెల్లడించకపోయినా.. జరుగుతున్న పరిణామాలు, ఈ వరుస సమావేశాలు ఎన్నికల మూడ్‌లోకి తీసుకుపోయే విధంగానే ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నాలుగు రాష్ట్రాలతోపాటు.. మంత్రులతో జరిగిన సమావేశంలో.. ఎన్నికలు ఫలానా సమయంలో జరుగుతాయని సీఎం చెప్పనప్పటికీ.. సన్నద్ధంగా ఉండాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. శాసనసభ రద్దుచేయాలా? వద్దా? చేయాల్సి వస్తే ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలి? అన్నదానిపై సర్వాధికారాలను మంత్రులు సీఎంకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం రాజకీయ వర్గాల్లో, పార్టీల్లో హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంట్, శాసనసభ్యులతో కీలకమైన సమావేశం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక రోజు ముందుగా గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిసి తాజా పరిణామాలను వివరించడం రాజకీయంగా వేడిని రగిల్చింది. మంత్రివర్గ సహచరులతో జరిపిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను తెలపడంతోపాటు షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్న తన ఆలోచనను వివరించారని సమాచారం. సెప్టెంబర్‌లో శాసనసభను రద్దు చేయడం ద్వారా.. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటూ తామూ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హుటాహుటిన ఢిల్లీకి.. ‘ముందస్తు’ అంచనాలకు తగ్గట్టుగా అటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ గురువారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘రాష్ట్ర ప్రభుత్వం షెడ్యుల్ కంటే కాస్త ముందుగా.. ఆ నాలుగు రాష్ట్రాలతోపాటు ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయంతో ఉంది. అదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఈసీ దృష్టికి తెచ్చారు. దానికి అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సమకూర్చుకోవడం, ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభించడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాచారం ఇచ్చింది. అయితే, ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తే ఆటోమెటిక్‌గా ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను మేం ఇప్పటికే ప్రారంభించాం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఈసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇటు మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీలో మకాం వేశారు. కేంద్ర పెద్దలతోపాటు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు కొందరితో ఆయన భేటీలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వడివడిగా ప్రారంభాలు.. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలను కూడా అనుకున్న దాని కంటే ముందే ప్రారంభించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయింది. ముఖ్యంగా మిషన్ భగీరథతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సెప్టెంబర్‌లోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. రైతుబంధు పథకం కింద రాష్ట్రంలోని రైతాంగానికి ఇస్తున్న ఎకరాకు రూ.4 వేల సాయాన్ని కూడా సభ రద్దు కంటే ముందే మరోసారి అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడం గమనార్హం. మంత్రివర్గ సభ్యులతో సమావేశం కాకముందు సెప్టెంబర్ 2న నిర్వహించాలనుకున్న ప్రగతి నివేదన సభను విరమించుకుంటారనే వాదనలు వినిపించాయి. అయితే, అందుకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను యథాతథంగా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్‌లో నిర్వహించే ఈ సభకు కనీసం 25 లక్షల మందిని సమీకరించాలని మంత్రులకు మార్గనిర్దేశనం చేశారు. దీంతో ఈ సభ నుంచే కేసీఆర్ అధికారికంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారనే విషయం స్పష్టమవుతోంది. 2019 జనవరి నాటికి కొత్త ప్రభుత్వం! నాలుగు రాష్ట్రాలతో పాటే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ రద్దుకు సెప్టెంబర్‌లోనే సిఫారసు చేస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకు అనుగుణంగా అక్టోబర్ నెలలో రాష్ట్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేసి నవంబర్ నెల నుంచే ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ నిమగ్నమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే అదే నెల చివరి వారం... లేదంటే జనవరి మొదటి వారంలో ఎన్నికలు జరపవచ్చు. మొత్తంమీద 2019 జనవరి చివరి నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. -
1,917 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి 2016–17కి సంబంధించిన సంస్థ వార్షిక నివేదికను అందజేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా 40,921 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిచ్చిందని, 93 నియామక ప్రకటనలు, 28 శాఖాపర, ఆర్ఐఎంసీ, సీఏఎస్ ప్రకటనలు కలిపి మొత్తం 121 ప్రకటనలు జారీ చేశామన్నారు. ఇప్పటివరకు 128 గ్రూప్–1 పోస్టులు, 36,076 ఇతర పోస్టులు కలిపి మొత్తం 36,204 పోస్టుల భర్తీకి ప్రకటనలిచ్చామని తెలిపారు. 12,749 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని తెలిపారు. 20,360 పోస్టులకు సంబంధించిన ఫలితాల ప్రకటనల జారీ/ నియామక పరీక్షల తర్వాతి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 3,095 పోస్టులకు సంబంధించిన నియామక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని, 1,917 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేయాల్సి ఉందన్నారు. 2,343 పోస్టుల నియామక ప్రకటనలను టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకుందన్నారు. -
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ఆరోగ్యకర వాతావరణానికి కృషి చేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. ప్రముఖ పర్యావరణవేత్త వనజీవి రామయ్య, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎన్టీవీ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరిస్తూ మంగళవారం రాజ్‌భవన్ ఆవరణలో ఆయన మొక్కలను నాటారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, గవర్నర్ సలహాదారు ఎ.పి.వి.ఎన్. శర్మ, ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ దంపతులు, ఉప కార్యదర్శి ఎం.కృష్ణ, విద్యాసాగర్ కూడా మొక్కలను నాటారు. -
మిషన్ భగీరథ: గవర్నర్‌కు నివేదించిన కేసీఆర్
-
మిషన్ భగీరథకు అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత నీటి సరఫరా ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామా ల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి కొంత సమయం కావాలని ఆయన గవర్నర్ నరసింహన్‌కు నివేదించారు. సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమై తాజా పరిపాలన విశేషాలు, రాజకీయ పరిణామాలపై చర్చిం చారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు కోసం అక్కడి స్థలాన్ని అప్పగించాలని కేంద్రం ఇటీవల రాష్ట్రానికి లేఖ రాసిందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రైతు బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చేస్తున్న ఏర్పాట్లను గవర్నర్‌కు వివరించారు. వచ్చే నెలలో కొత్తగా ఏర్పాటుకానున్న 68 మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ సభ్యత్వాన్ని పునరు ద్ధరించాలంటూ తామిచ్చిన తీర్పును అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు... ఈ కేసులో అవసరమైతే న్యాయశాఖ కార్యదర్శితోపాటు అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటిసులు జారీ చేస్తామని హెచ్చరించడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను సీఎం గవర్నర్‌కు తెలియజేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లోని ఆస్తులను పంచాలని ఆ చట్టంలో ఎక్కడా లేదని కేంద్ర హోంశాఖ గత శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపట్ల ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న 10వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉందని ఆయన గవర్నర్‌కు తెలియజేశారు. -
ఆగస్టు 8న వీసీలతో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని పరిస్థితులు, అక్కడి సమస్యలు, గతేడాది తీసుకున్న నిర్ణయాల అమలుపై గవర్నర్ నరసింహన్ సమీక్షించనున్నారు. వచ్చే నెల 8న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉదయం 10:30 గంటలకు వైస్ చాన్స్లర్లతో సమీక్ష సమావేశం ఉంటుంది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో కామన్ అకడమిక్ కేలండర్ అమలు తదితర అంశాలపై గవర్నర్ సమీక్షించనున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు, బడ్జెట్ సద్వినియోగపర్చుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, అధ్యాపకుల భర్తీ, పీహెచ్డీ ప్రవేశాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా నిధుల సమీకరణపై చర్చించనున్నారు. కొత్త కోర్సుల ప్రవేశం, ఇన్నోవేషన్, పరిశోధన ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అనుబంధ కాలేజీల్లో రెగ్యులర్ తనిఖీలు, హాస్టళ్లలో బయటి వ్యక్తుల నివాసం, అకడమిక్ కౌన్సిళ్ల ఏర్పాటు వంటి అంశాలపై గవర్నర్ సమీక్షించనున్నారు. -
టీడీపీ, కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకోవద్దనే..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, పరిపాలన అంశాలను గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, తదనంతర పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్టు సమచారం. అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో పాల్గొనకుండా టీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరైన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఆచరణ సాధ్యం కాదని తెలిసినా టీడీపీ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. టీడీపీ, కాంగ్రెస్‌ల రాజకీయ వ్యూహంలో చిక్కుకోవద్దన్న ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు గవర్నర్‌తో సీఎం అన్నట్టు తెలిసింది. ఇలాంటి మూస రాజకీయాలతో ప్రయోజనం ఉండదనే గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికి రక్షిత తాగునీటి సరఫరా ప్రారంభిస్తామని, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని గవర్నర్‌కు తెలిపారు. రైతుబంధు పథకానికి అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న ప్రశంసలు, ఆగస్టు 15న ప్రారంభించనున్న రైతు జీవిత బీమా పథకాల విశేషాలను వివరించారు. కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్ భవ జీవిత బీమా పథకం మార్గదర్శకాల్లో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు గవర్నర్‌కు తెలిపారు. సమాచార హక్కు కమిషనర్లుగా రాజా సదారాం, బుద్ధా మురళీ నియామకాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కూడా గవర్నర్‌తో సీఎం చర్చించారు. వరుసగా రెండో ఆదివారం గవర్నర్‌తో కేసీఆర్ భేటీ కావడం విశేషం. సీజేని కలిసిన సీఎం గవర్నర్ నరసింహన్‌తో భేటీకి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
రుణాల పంపిణీలో తాత్సారం వద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు తాత్సారం చేయొద్దని గవర్నర్ నరసింహన్ అన్నారు. రుణాల పంపిణీ సకాలంలో జరిగితేనే పంటలసాగు ప్రక్రియ సులభతరమవుతుంద న్నారు. సూచించారు. గురువారం ఇక్కడ నాబార్డ్ కార్యాలయంలో జరిగిన 37వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో నాబార్డు కీలకపాత్ర పోషిస్తోందన్నారు. మహిళ, గిరిజన రైతులను ప్రోత్సహించాలని, ఆ మేరకు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు నీటిపారుదల ప్రాజెక్టులకు భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నా వ్యవసాయ అభివృద్ధికి అదేస్థాయిలో ప్రోత్సాహకాల రూపంలో ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని, వీటిని క్షేత్రస్థాయిలో రైతాంగానికి తెలియజేయాలని, ఆమేరకు నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వాడకాన్ని పెంచాలని, దీంతో తక్కువ సమయంలో అధిక దిగుబడి సాధించవచ్చని, ఖర్చు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయన్నారు. నీటి గొడవలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే వ్యవసాయ పురోగతి వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ పి.రాధాకృష్ణన్, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాషలోనే మాట్లాడాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడిని మాన్యుడిగా మార్చేది విశ్వవిద్యాలయమేనని తెలుగు విశ్వవిద్యాలయ చాన్స్‌లర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన తెలుగు విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవానికి ఆయన హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మాతృభాష అందరూ నేర్చుకోవాలని, మాతృభాషలోనే మాట్లాడాలని అన్నారు. విదేశీయులు మాతృభాషలోనే మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తారని, మాతృభాషలో మాట్లాడటానికి సిగ్గు పడకూడదని తెలిపారు. తెలుగు వర్సిటీ నుంచి పట్టాలు పొందిన విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి గ్రామాలకు వెళ్లి.. అక్కడి ప్రజలకు మన సాహిత్యం, సంస్కృతి, లలిత కళలు, వారసత్వ సంపద గురించి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులందరికీ సామాజిక సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. స్వచ్ఛత అభియాన్ కింద కాలనీలను దత్తత తీసు కుని పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విదేశీయుల నుంచి యోగా గురించి తెలుసుకుంటున్నామని, మన సంస్కృతి గురించి మనమే తెలుసుకుని ఆచరిస్తే మంచిదన్నారు. ఈ సందర్భంగా స్నాతకోత్సవ ముఖ్య అతిథి ఆచార్య రవ్వా శ్రీహరిని గవర్నర్ సత్కరించారు. -
గవర్నర్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. -
రేపు రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆది వారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట ల వరకు రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫి క్ చీఫ్ అనిల్‌కుమార్ సూచించారు. ఇఫ్తార్ విందు కు హాజరయ్యే వారి వాహనాలకు రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ స్టేషన్, మెట్రో రెసిడెన్సీ–నాసర్ స్కూల్ మధ్య, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా పార్కింగ్ ప్రాంతాలు కేటాయించామన్నారు. -
సాయంత్రం వేళ.. సరదా సరదాగా!
హైదరాబాద్: మండు వేసవిలో నిండుకుండలా ప్రాజెక్టు... పరిసరాల్లో పచ్చదనం.. ఆహ్లాదపర్చే వాతావరణం... పరవశింపజేసే ప్రకృతి.. సాయంత్రం వేళ సరదాగా బోటింగ్... వెరసి గవర్నర్ దంపతులు ముగ్ధు లయ్యారు. వికారాబాద్ జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం సాయంత్రం సరదాగా బోటింగ్ చేశారు. రెండు వేర్వేరు బోట్లలో ప్రాజెక్టును చుట్టివచ్చారు. బోట్ ఎక్కబోతూ పట్టుతప్పిన గవర్నర్‌ను సేఫ్టీగార్డ్స్ పట్టుకుని బోట్లో కూర్చోబెట్టారు. దాదాపు 15 నిమిషాలపాటు బోటింగ్ చేశారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రోత్సాహంతో జేకేఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బోటింగ్‌పై గవర్నర్ దంపతులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కోట్‌పల్లి అందాలను చూపించిన సేఫ్టీగార్డ్స్‌కు రూ.4 వేల చెక్కు అందజేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయా లని కలెక్టర్‌కు సూచించారు. ప్రాజెక్టు వద్ద 500 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారని జేకేఎంఆర్ ఫౌండే షన్ కో ఆర్డినేటర్ రాములు గవర్నర్‌కు వివరించారు. పురుషులు, మహిళాసేఫ్టీగార్డ్స్‌ను వేర్వేరుగా గవర్నర్ పిలిచి వారి ఉపాధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించాలని, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలను ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం సేఫ్టీగార్డ్స్‌తో కలసి గ్రూప్‌ఫొటో దిగారు. తిరిగి వెళ్తూ మండలం లోని గడ్డమీది గంగారం రైతులతో ముచ్చటిం చి పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంత పద్మనాభస్వామి దర్శనం నరసింహన్ దంపతులు అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శుక్రవారం ఏకాదశి కావడంతో ఉదయం స్వామివారి సాలగ్రామ రూప దర్శనం చేసుకునే అవకాశముందని తెలిసింది. -
‘గవర్నర్‌ను వెంటనే మార్చాలి’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను వెంటనే మార్చాలని మాజీమంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచిన కొత్త గవర్నెర్‌ను ఎందుకు నియమించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడచినా గవర్నర్‌ను మార్చకపోవడం ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా ఇంతకుముందు కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. నరసింహన్‌ను మార్చాలని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు కోరిన సంగతి విదితమే. కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతున్నారు. -
ఏపీకి పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ : నటుడు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ నరసింహన్ అని సినీ హీరో శివాజీ విమర్శించారు. గురువారం గుంటూరులో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో శివాజీ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అలాగే మనకంటే ముందు 25 మంది పార్లమెంటు సభ్యులు పోరాడాలని, ఎంపీలు తమ స్వార్థం కోసం నాటకాలాడుతున్నారని.. పార్లమెంటు జరగకుండా చేస్తే సగం విజయం సాధించినట్లేనని శివాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టి వెంక య్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారని, మన రాష్ట్రానికి సంబంధించి ఏమడిగినా వెంకయ్య నాయుడికి కోపం వస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక హోదా లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరని శివాజీ అన్నారు. -
గవర్నర్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ప్రజలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశ సమగ్రతకు చిహ్నమని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన కేసీఆర్.. నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. వారం రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలను, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ వివరాలను ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇక మార్చి 12 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా వారు చర్చించినట్లు సమాచారం. అయితే శనివారం సీఎం కేసీఆర్ జన్మదినం. కానీ గవర్నర్ నరసింహన్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వెళుతున్నారు. దీంతో కేసీఆర్ శుక్రవారం రాత్రే గవర్నర్‌ను కలిశారని.. నరసింహన్ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుమించి భేటీకి ప్రాధాన్యత లేదని పేర్కొన్నాయి. గవర్నర్ తిరిగి ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంటారని వెల్లడించాయి. -
గవర్నరా? టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గవర్నర్ నరసింహన్ ప్రశంసిస్తున్నారంటే ఆయన గవర్నరా? లేక టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడా? అనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పీఏసీ (రాజకీయ వ్యవహారాల మండలి) సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగం అపహా స్యం అవుతున్నా గవర్నర్ పట్టించుకోకపోగా సీఎం చంద్రబాబు ప్రశంసించడం విస్మయం కలిగిస్తోందన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చాలా చేస్తున్నారు కనుక ఇక రాష్ట్ర ప్రజలే ప్రభుత్వానికి చేయాల్సి ఉందని గవర్నర్ చెబుతున్నారంటే ఆయన టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కనిపిస్తున్నారన్నారు. -
దేశ భవిష్యత్తు ఓటర్లపైనే
సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తు ఓటర్లపైనే ఉంటుందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. ఓటర్లంతా బాధ్యతతో తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నరసింహన్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడే ఓటు హక్కును పరిశీలించుకోవడం, కొత్తగా ఓటరు నమోదుకు శ్రీకారం చుట్టడం సరికాదన్నారు. అర్హులంతా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ఉత్తమ ప్రభుత్వం తయారవుతుందని, ఫలితంగా ప్రపంచంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మారుతుందన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారికే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ఎలక్షన్ రోజు సెలవు సందర్భంగా టీవీల ముందు కూర్చోకుండా ఓటు హక్కుపై మిగతావారికి అవగాహన కల్పించాలని, వారితో ఓటు వేయించాలని సూచించారు. దేశంలోని ఓటర్లలో 40 శాతానికిపైగా యువకులే ఉన్నార న్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని దీనికి ప్రధాన కారణం నగర ఓటర్లలో నిర్లిప్తతే అన్నారు. ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ రాజసదారాం అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణను సమర్థవంతంగా, ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేశామన్నారు. ఓటర్ల జాబితా సవరణలో మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామన్నారు. వివిధ సమస్యలు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించారని ముఖ్య ఎన్నికల అధికారి అనూప్‌సింగ్ ప్రశంసించారు. పలువురికి ప్రత్యేక పురస్కారాలు.. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు తదితర సేవలను సమర్థవంతంగా అందించినందుకుగాను ఉత్త మ జిల్లా ఎన్నికల అధికారులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి తదితరులకు గవర్నర్ ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా ఉత్తమ రిజిస్ట్రేషన్ అధికారులుగా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ డి.జయరాజ్ కెనడి, నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి, ఖమ్మం ఆర్డీవో పూర్ణచందర్రావు, వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్, కరీంనగర్ ఆర్డీవో రాజుగౌడ్‌లతో పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సామ్రాట్ అశోక్, ఏఎంసీ జయంత్, జయప్రకాష్‌లకు కూడా ప్రత్యేక అవార్డులను అందజేశారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవార్డులు అందజేశారు. -
గవర్నర్‌పై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ పదవికే వన్నె తెచ్చిన తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై కాంగ్రెస్ నీచ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని వ్యతిరేకించి అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రధాన విధిగా పెట్టుకుందని మండిపడ్డారు. గవర్నర్ పదవిని రబ్బర్ స్టాంప్‌గా మార్చి, రాజ్భవన్లను తమ రాజకీయాలకు అడ్డాగా మార్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయిలో గవర్నర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. గవర్నర్ల వ్యవస్థ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. గవర్నర్లను తమ ఏజెంట్లుగా మార్చుకొని గిట్టని ప్రభుత్వాలను బర్తరఫ్ చేయించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. -
గవర్నర్ ఆహ్వానం తిరస్కరించిన నారాయణ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకావాలంటూ గవర్నర్ నరసింహన్ పంపిన ఆహ్వానాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తిరస్కరించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకాలేనని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ అంటే వ్యక్తిగతంగా తనకు గౌరవమేనని, కానీ ఆ హోదాలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు అసంతృప్తిగా ఉన్నాయని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
గవర్నర్ పదవికే కళంకం: చాడ
కరీంనగర్ రూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును గవర్నర్ నరసింహన్ పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా ఆయన పదవికే కళంకం తెచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అత్యున్నతమైన గవర్నర్ పదవిలో ఉన్న నరసింహన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గవర్నర్‌కు ప్రజలపై ప్రేమ ఉంటే సిరిసిల్లలోని చేనేత కార్మికులు, నేరెళ్ల బాధితులను పరామర్శించాలని కోరారు. -
రాజ్యాంగాన్ని మలినం చేశారు
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని పొగిడిన గవర్నర్ నరసింహన్, తాను ఉంటున్న రాజ్‌భవన్ పేరును టీఆర్ఎస్ కార్యాలయంగా మారుస్తారా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి గాంధీభవన్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజ్యాం గ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ హోదాను కించపరిచే విధంగా వ్యవహరించి ఒక పార్టీపై పొగడ్తలు కురిపించడం ద్వారా రాజ్యాంగాన్ని మలినం చేశారని ఆరోపించారు. బి.ఆర్.అంబేడ్కర్ పేరుతో నాటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు మార్చిన విష యం గవర్నర్‌కు కనిపించలేదా అని భట్టి ప్రశ్నించారు. మొత్తం 38వేల కోట్లతో రూపకల్పన చేసిన ప్రాజెక్టుకు అప్పటికే 10వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కేవలం 28వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి 80 వేల కోట్ల వ్యయానికి పెంచారన్నారు. 50 వేల కోట్లు ఎవరికి పోతున్నాయో గవర్నర్‌కు అర్థం కాలేదా అని భట్టి ప్రశ్నించారు. డీపీఆర్ గురించి మాట్లాడకుండా, వ్యయం పెంపును ప్రశ్నించాల్సిన బాధ్యతలను గవర్నర్ విస్మరించడమే కాకుండా సీఎం కేసీఆర్‌ను, హరీశ్‌ను పొగడటంలో రహస్యం ఏమిటని ప్రశ్నించారు. పేరు మార్చి వ్యయం పెంచారు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ 1,500 కోట్లతో పూర్తయ్యేవని, వాటికి సీతారామ ప్రాజెక్టు అనే పేరు మార్చి 10వేల కోట్లకు వ్యయాన్ని పెంచా రని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడే గవర్నర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని భట్టి ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచడంద్వారా ప్రజలపై లక్షకోట్ల అదనపు భారం పడుతుందని, ఈ పెరిగిన భారం ఎవరిపై పడుతుందో ప్రశ్నించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు. ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే గవర్నర్ పొగడటంతో అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. గవర్నర్ టీఆర్ఎస్ ఏజెంటుగా పనిచేస్తున్నాడన్నారు. ఈ ప్రాజెక్టుల అవినీతిలో గవర్నర్‌కు భాగస్వామ్యం ఉన్నట్టేనని వీహెచ్ ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రాజె క్టు వ్యయం, నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం, ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వం తీరు గురించి గవర్నర్ ఎందు కు మాట్లాడలేదని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదో గవర్నర్ తెలుసుకోవాలన్నారు. -
కేసీఆర్ ఏజెంట్లా గవర్నర్: జీవన్‌రెడ్డి
ధర్మారం(ధర్మపురి): రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోటుపాట్లను గాలికొదిలి సీఎం కేసీఆర్‌కు ఏజెంట్లా మాట్లాడారని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం చెరువుకట్ట నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందాలనే తాపత్రయం తప్ప గవర్నర్‌కు వేరే ఉద్దేశం లేదన్నారు. గవ ర్నర్ పదవి కాలం ముగుస్తున్నందున రాజ్యసభ సీటు పొందాలనే ఆశతోనే పొగుడుతున్నాడన్నారు. అవసరమైతే టీఆర్ఎస్లో చేరాలే కానీ గవర్నర్ పదవిని అగౌరవపరచ రాదన్నారు. -
‘రాజ్‌భవన్‌ను టీఆర్ఎస్ భవన్ అంటారేమో’
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఉమ్మడి కరీంనగర్లో మాట్లాడిన మాటలు గవర్నర్ హోదాను, పదవిని కించపరిచినట్లున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు మీద పెట్టిన ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లి.. ఆ పేరును ఎందుకు తీసేశారని ప్రశ్నించకపోవడం విచారకరమన్నారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రారంభించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గవర్నర్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖరరావు అని, హరీశ్‌రావును కాళేశ్వరరావు అని గవర్నర్ అభివర్ణించారని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే రేపు రాజ్‌భవన్‌ను టీఆర్ఎస్ భవన్ అంటారేమోనన్న బాధ కలుగుతుందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా కాళేశ్వరం పూర్తయ్యేదన్నారు. ఇతర పార్టీల వారిని టీఆర్ఎస్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి రాజ్యాంగాన్ని గవర్నర్ అవమానపరిచారని, ఇప్పుడు ప్రభుత్వానికి వంత పాడుతున్నారని విమర్శించారు. -
ఏపీలో కొత్త రాజకీయాలు
-
‘నాలా’ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూ వినియోగ మార్పిడి (నాలా) చట్ట సవరణ బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. శాసనసభ, శాసనమండలి గత నెలలో ఆమోదించి పంపిన నాలా బిల్లుపై గవర్నర్ గురువారం సంతకం చేశారని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వర్గాలు ధ్రువీకరించాయి. నాలా రుసుము తగ్గింపు, నిబంధనల సవరణపై ఆర్డినెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం పంపిన ప్రతిపాదనలపై గవర్నర్ పలు సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా పునఃపరిశీలించాలంటూ ఫైల్ వెనక్కి పంపటం తెలిసిందే. అయితే దీన్ని పట్టించుకోకుండా, సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్డినెన్స్ ఫైల్‌ను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అవే అంశాలతో చట్టసభల్లో బిల్లు ఆమోదించింది. రాజకీయ విమర్శలవల్లే గవర్నర్ లేఖ: తెలంగాణలో నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ చట్టసభలు ఆమోదించిన నాలా బిల్లును మాత్రం పక్కనపెట్టటం వివక్షకు నిదర్శనమంటూ బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు విమర్శలు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విష్ణుకుమార్‌రాజుతో సీఎం చంద్రబాబే ఈ విమర్శలు చేయించినట్లు రాజ్‌భవన్‌కు వేగులు చేరవేశారు. తనపై రాజకీయ విమర్శలపై కలత చెందిన నరసింహన్ కొందరు ఉన్నతాధికారులతోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీఎంకు లేఖ రాసిన గవర్నర్: ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాలా ఆర్డినెన్స్, బిల్లు విషయాల్లో జరిగిన పరిణామాలను విశదీకరిస్తూ గవర్నర్ నేరుగా సీఎం చంద్రబాబుకే లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిల్లుపై గవర్నర్ గురువారం సంతకం చేశారు.గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో త్వరలో నాలా సవరణ ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో విశాఖపట్నం, విజయవాడలో నాలా రుసుము 5 నుంచి 2 శాతానికి, మిగిలిన చోట్ల 9 నుంచి 3 శాతానికి తగ్గనుంది. ఆరోపణల్లో నిజం లేదు: రాజ్‌భవన్ వర్గాలు: తెలంగాణ ప్రభుత్వం పంపిన నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ చట్టసభలు ఆమోదించిన బిల్లును పక్కన పెట్టారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ‘అసలు తెలంగాణ సర్కారు నుంచి నాలా బిల్లు ఇప్పటివరకూ రాజ్‌భవన్‌కే రాలేదని తెలిపాయి. -
మనస్పర్ధలు సర్దుకుంటాయ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏర్పడిన మనస్పర్ధలు త్వరలోనే సర్దుకుంటాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే విభేదాల్లాంటివే ఇవికూడా.. వాటిని పైకి చెప్పనవసరంలేదని వ్యాఖ్యానిం చారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన ఆయన తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టిసారించామని త్వరలోనే అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. రాజ్భవన్లను ప్రజలకు మరింత చేరువ చేయడంపై హోం శాఖకు పలు సూచనలు చేసినట్టు తెలిపారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా.. అపార్థాలతో బంధాలను విడగొట్టుకోలేమన్నారు. ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి గవర్నర్ తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధానితో అరగంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు తెలిసింది. కేంద్రం ఇచ్చిన అనుమతులతో తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్యలు లేవని నివేదించారు. -
ఇసుక మాఫియాను అరికట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిపోయిన ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని గవర్నర్ నరసింహన్‌ను టీపీసీసీ కోరింది. ఇసుక మాఫియా, దౌర్జన్యాలు, కిందిస్థాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న బెదిరింపులు, భూగర్భ జలాలపై ప్రభావం, పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ముఖ్య నేతలు డి.కె.అరుణ, సర్వే సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, సంపత్‌కుమార్, దాసోజు శ్రవణ్, దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, జి.వినోద్‌రెడ్డి, నేరెళ్ల శారద తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఇసుక లారీలు, ట్రాక్టర్ల కింద సామాన్యులు చనిపోతున్నా పట్టించుకోకుండా మాఫియా ఆగడాలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉత్తమ్ వివరించారు. కామారెడ్డి జిల్లాలో బోయిని సాయిలు అనే వ్యక్తి ఇసుక ట్రాక్టర్ కింద చనిపోయాడని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన గవర్నర్.. సాయిలు మృతికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని కామారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రూ. వేల కోట్ల దోపిడీ ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదని, అంతా మాఫియా చేతుల్లో ఉందని, 20 వేలకు దొరికే ఇసుక ఇప్పుడు 60 వేలకు పెరిగిందని కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి పెరిగిన ఆదాయాన్ని చూపిస్తూ సామాన్యులను వేధిస్తున్న ఇసుక మాఫియా.. రూ.వేల కోట్లు కొల్లగొడుతోందని వివరించారు. వర్గీకరణ కోసం దీక్ష చేస్తానంటే అనుమతించకపోవడంతో మంద కృష్ణ తన కార్యాలయంలోనే దీక్షకు సంకల్పించాడని, అయినా పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. హత్య కేసు నమోదు చేయాలి: ఉత్తమ్ కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాంలో బోయిని సాయిలు మరణానికి కారణమైన కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఇసుక మాఫియా చేతిలో సామాన్యులు హతమవుతుంటే.. ట్వీటర్లు, అంతర్జాతీయ సదస్సులు, అవార్డులు అంటూ తిరుగుతున్న మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అడ్డూఅదుపూ లేకుండా చేస్తున్న ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, పర్యావరణం దెబ్బతింటుం దన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం శాంతియుతంగా, గాంధేయ మార్గంలో ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ, ఇసుకతో రూ.600 కోట్ల ఆదాయం వస్తోందని చెబుతున్న ప్రభుత్వం.. సామాన్య ప్రజలకు ఏ రేటుకు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇసుక కాంట్రాక్టర్లు సామాన్యులకు ధరలు పెంచి, ప్రభుత్వానికి తక్కువ ధర చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో గోదావరిని ఇసుక మాఫియా తోడేస్తోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తలాక్‌పై కేసీఆర్ వైఖరేంటి?: షబ్బీర్ ట్రిపుల్ తలాక్‌పై సీఎం కేసీఆర్ తన వైఖరి చెప్పాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. త్రిపుల్ తలాక్ బిల్లులో లోపాలున్నాయని, ఎన్డీయే భాగస్వా మ్య పక్షాలు కూడా అభ్యంతరాలు చెబుతున్నాయని తెలిపారు. ఒక్క టీఆర్ఎస్ మాత్రం వాకౌట్ చేసిందని, ఈ బిల్లుకు సవరణ చేయా లో వద్దో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్తో పొత్తు ఉం టుందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చెప్పారని, టీఆర్ఎస్ వైఖరి చూసిన తర్వాత కూడా పొత్తు ఉంటుందా లేదా చెప్పాలన్నారు. -
గవర్నర్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యా రు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించటంతో పాటు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు దర్బార్ హాల్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ వేడుకలకు అధికారులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చి గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇన్చార్జి వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే కీలకమని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తాన్ని ఖర్చు చేస్తోందన్నారు. ఆ తర్వాత స్థానాల్లో నీటిపారుదల, విద్యుత్ రంగాలు ఉన్నాయన్నారు. గురువారం దాదాపు 40మంది ప్రవాస భారతీయులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తోన్న ‘నో ఇండియా ప్రోగ్రాం’ (భారత్‌ను తెలుసుకుందాం)లో భాగంగా ఈ బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా నరసింహన్ బృంద సభ్యులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ మేరకు రెండు ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలను దత్తత తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ విద్య, వైద్యం, ఆరోగ్యం, సురక్షిత తాగునీరు కల్పించేందుకు వ్యవసాయ విద్యార్థులు ముందుకు రావాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. విద్యార్థులకు తరగతి బోధన కన్నా క్షేత్రస్థాయి విజ్ఞానంపై శిక్షణ కల్పించాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. డిగ్రీలు పొందిన విద్యార్థులు సమాజ అభ్యున్నతికి పాటుపడాలని, అలా జరగనప్పుడు వాటికి ఫలితం ఉండదని చెప్పారు. గ్రామాల్లో ప్రజల అభివృద్ధి, వారి జీవన ప్రమాణాల పెంపు కోసం విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని కోరారు. వ్యవసాయ, ఉద్యాన విభాగాలు కలసి పనిచేయాలి.. వ్యవసాయ, ఉద్యాన విభాగాలు సమన్వయంతో కలసి పనిచేయాలని, వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు. దీనిపై సీఎంతో చర్చిస్తానని గవర్నర్ పేర్కొన్నారు. రైతుకు తన భూమే జీవితమని, ఒకసారి పంట విఫలమైతే అతని జీవితం కకావికలం అవుతోందన్నారు. రైతులకు అవసరమైన సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. గ్రామాల్లో దారిద్య్రరేఖకు దిగువన జీవించే వారి పరిస్థితి మెరుగుపడాలని ఆకాంక్షించారు. పంటకు సరైన ధర వచ్చే వరకు నిల్వ వసతి కల్పించాలని.. అప్పుడే వ్యాపారులతో చర్చించి రైతు సరైన ధర పొందుతాడని అన్నారు. ప్రయోగశాలలో జరుగుతోన్న పరిశోధన ఫలాలు రైతుల పొలాలకు అందించడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభినందించారు. గ్రామీణ భారత జీవనచిత్రాన్ని మార్చాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పేదరికం లేని తెలంగాణ సమాజమే తన కల అని, అందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం తన వంతు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి: ఐకార్ డైరెక్టర్ వ్యవసాయంలో భవిష్యత్ వ్యాపారవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. ఐదో డీన్స్ సిఫార్సులకు అనుగుణంగా దేశంలో వ్యవసాయ పట్టభద్రులను వారు స్వతహాగా బతకడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించేవారిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థులకు రైతుల వద్ద ఆగ్రో పరిశ్రమల్లోనూ నైపుణ్యాలు కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐకార్ పరిశోధన కేంద్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా దేశంలో ఆహారధాన్యాల దిగుబడి గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా నీటి వనరుల సమర్థ వినియోగం జరుగుతోందన్నారు. అనంతరం 2014 నుంచి 2016 వరకు యూనివర్సిటీ ప్రగతి నివేదికను వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు సమర్పించారు. విద్యార్థులకు పట్టాలు.. కార్యక్రమంలో 319 మంది పీజీ, పీహెచ్డీ, 790 మంది డిగ్రీ విద్యార్థులకు గవర్నర్ పట్టాలు ప్రదానం చేశారు. 17 మందికి బంగారు పతకాలు అందిం చారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఎం.శ్రావణి 5, దివ్యశ్రీ 3 బంగారు పతకాలు సాధించారు. అగ్రికల్చర్ ఫ్లాంట్ పాథాలజీకి చెందిన ప్రసాద్ 3 బంగారు పత కాలు సాధించారు. -
ఉగ్రభూతాన్ని మట్టుబెట్టే‘లా’ చేయండి
అంతర్జాతీయ న్యాయ పండితుల సదస్సులో ఉప రాష్ట్రపతి మానవ హక్కుల రక్షణకు న్యాయ నిపుణులు చర్యలు తీసుకోవాలి: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాలకు పెను భూతంగా మారిన ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అంతర్జాతీయ న్యాయ నిపుణులు కఠిన చట్టాలు రూపొందించాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉగ్ర వాదానికి కుల, మతాలు లేవని.. రాజకీయా లకు అతీతంగా, కలసికట్టుగా దేశాలన్నీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కేయాలని విజ్ఞప్తి చేశారు. మానవ జాతికి తొలి శత్రువైన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే చట్టాలకు న్యాయ కోవిదు లంతా సిఫార్సు చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ సంస్థ 78వ సమావేశాలను వెంకయ్య ప్రారంభించారు. 1873లో బెల్జియంలో 11 మంది అంతర్జాతీయ న్యాయవాదులతో ప్రారంభమైన సంస్థ సమావేశా లు తొలిసారి భారత్‌లో జరుగుతున్నాయి. వారంపాటు జరగనున్న ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి 60 మంది న్యాయ కోవిదులు హాజరయ్యారు. సదస్సు సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, శాంతి, సమానత్వం, మానవ హక్కుల రక్షణ, అభివృద్ధి కోసం సూచనలు చేస్తూనే వాటికి అవరోధంగా ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా న్యాయ నిపుణులు మేధోమథనం చేయాలన్నారు. ఏ దేశ ప్రభుత్వ ప్రలోభాలకు లోనవకుండా ఉన్నందునే 1904లో అంతర్జాతీయ న్యాయ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని.. ఆ స్ఫూర్తితోనే ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు కృషి చేయాలని కోరారు. పురాణ కాలంలోనే ధర్మ పాలన ధర్మబద్ధ పాలన రామాయణ, మహాభారత కాలాల నుంచే దేశంలో ఉందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా చెప్పే న్యాయమే ధర్మమని వెంకయ్య అన్నారు. వసుదైక కుటుంబ విధానమూ పురాణ కాలం నాటిదేనని, కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ‘ప్రభుత్వం–పాలన–న్యాయం’ గురించి ఏనాడో చెప్పారన్నారు. ‘రిఫామ్– పర్ఫామ్– ట్రాన్స్ఫామ్’ ప్రస్తుత భారత ప్రభుత్వ విధానమన్నారు. ‘నేనూ లా చేసినా ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం జైల్లో పెట్టడంతో లాయర్ కాలేకపోయాను’ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయులు నాగేంద్రసింగ్, నీలకంఠశాస్త్రి చేసిన న్యాయ సేవలు, ఇప్పుడు అంతర్జాయతీ సముద్ర జలాలపై పెమ్మరాజు శ్రీనివాసరావు (పీఎస్ రావు) చేస్తున్న కృషిని వెంకయ్య కొనియాడారు. పుట్టుకతోనే మానవ హక్కులు: గవర్నర్ మనిషి పుట్టు్టకతోనే మానవ హక్కులొస్తా యని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఆ హక్కుల రక్షణకు న్యాయ నిపుణులు చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆ ర్ ప్రభుత్వం భూమి, ఇతర చట్టాలపై న్యాయ సంస్కరణలు తీసుకొస్తోందని రాష్ట్ర న్యాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ న్యాయ నిపుణులు హాజరైన ఈ సమావేశం మంచి సిఫార్సులు చేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ కోరారు. అంతర్జాతీ య న్యాయపర అంశాలపై తొలిసారి ప్రైవేట్, పబ్లిక్ రంగాలు కలసి పనిచేస్తున్నాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా (జెనీవా) అధ్యక్షుడు పీఎస్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నల్సార్ వర్సిటీ వైస్ చాన్సలర్ ఫైజాన్ ముస్తాఫా, రిజిస్ట్రార్ వి.బాలకిట్టారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫరూక్, రామసుబ్బారెడ్డిలను నామినేట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, ఆర్.రెడ్డప్పరెడ్డిల పదవీకాలం ముగియడంతో.. వారి స్థానంలో ఫరూక్, సుబ్బారెడ్డిలు నామినేట్ అయ్యారు. -
హరితహారంలో భాగస్వాములు కావాలి: దత్తాత్రేయ
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో కలసి గ్రీన్‌డే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పిలు పునిచ్చారు. ‘హరిత పాఠ శాల– హరితతెలంగాణ’ నినాదంతో విద్యా శాఖ నిర్వహిస్తున్న గ్రీన్‌డేను శని వారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో కలసి ఆయన రాజ్‌భవన్ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. విద్యార్థు లను చిన్నప్పటి నుంచే మొక్కలు నాటేలా ప్రోత్స హించాలని, మొక్కలు నాటడమే కరువుకు సరైన పరిష్కారమని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఈసారి రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ఇందులో వంద కోట్ల మొక్కలు అటవీ ప్రాంతంలో, 120 కోట్లు ఇతర ప్రాంతాల్లో, 10 కోట్లు హైదరాబాద్‌లో నాటాలని నిర్ణయించామన్నారు. మొక్కలు నాటడంతో పాటు హరితహారం, పర్యావర ణంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీ విజేతలకు ఆగస్టు 15న అవార్డులు అందిస్తామని కడియం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
చిత్రం.. అద్భుతం
-
నీటి వినియోగంపై అవగాహన పెంచుకోవాలి
పంట కుంటల నిర్మాణంతో సత్ఫలితాలు గవర్నర్ నరసింహన్ గార్లదిన్నె : నీటి వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని, తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే పండ్లతోటల పెంపకాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. మంగళవారం ఆయన గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో పంటకుంటల నిర్మాణాలు, మల్చింగ్, బిందు, తుంపర సేద్యం ద్వారా అంజూర, చీనీ తోటల సాగును పరిశీలించారు. గార్లదిన్నె మండల ఆరోగ్య కేంద్రంలో ఫిజోమీటరు పనితీరును పరిశీలించారు. జిల్లాలో భూగర్భజలాల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా ముకుందాపురం గ్రామానికి చెందిన ఎన్.పద్మావతి పొలంలో నిర్మిస్తున్న పంట కుంటను చూశారు. మస్టర్‌ను పరిశీలించి. అక్కడున్న కూలీలను పేరుతో పిలుస్తూ పంటకుంటల ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. వీటిని ఎన్నిరోజులుగా తవ్వుతున్నారని, రోజుకు ఎంతకూలి వస్తోందని సుబ్బలక్ష్మి అనే ఉపాధి కూలీని అడిగారు. ఆరు వారాలుగా తవ్వుతున్నామని, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కొంత తక్కువ కూలి వచ్చినా ఇప్పుడు రోజుకు సరాసరి రూ.195లు లభిస్తున్నట్లు ఆమె వివరించారు. రామాంజినేయులు అనే ఉపాధి కూలీతో గవర్నర్ మాట్లాడుతూ ఏమి చదువుకున్నావని అడిగారు. తాను చదువుకోలేదని చెప్పగా.. రాత్రి బడి ద్వారా విద్యను అందించాలని అధికారులకు సూచించారు. ఇది కాక ఇతర ఏ పనులు చేస్తావని అడగ్గా.. 150 ఉపాధి పని దినాలు పూర్తి కావడంతో ఇతర పనులకు వెళుతున్నానన్నారు. తాను నేత కార్మికుడినని, ఆ పని గిట్టుబాటు కాకపోవడంతో ఉపాధి పనులకు వెళ్తున్నానని రామచంద్ర అనే వ్యక్తి తెలిపారు. ధర్మవరం పట్టుచీరలు ప్రఖ్యాతి గాంచినవని, ప్రభుత్వ సబ్సిడీ రుణాల ద్వారా లబ్ధి పొంది చేనేత వృత్తిని కొనసాగించాలని సూచించారు. అనంతరం బాలాజీ అనే రైతు సాగు చేస్తున్న అంజూర పంట పొలాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ డీడీ సుబ్బరాయుడు మాట్లాడుతూ సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద అంజూర సాగును ప్రోత్సహిస్తున్నట్లు గవర్నర్‌కు వివరించారు. జిల్లాలో పండ్లతోటల ఉత్పత్తులు 40 లక్షల మెట్రిక్ టన్నులు వస్తున్నాయని, తద్వారా రూ.5,266 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. రూ.6,200 కోట్లను సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రైతులకు సూచనలు, సలహాలను అందించి అధిక దిగుబడి సాధించేందుకు కృషి చేయాలని నరసింహన్ సూచించారు. ఆ తర్వాత బిందు, తుంపర సేద్యం ద్వారా మల్చింగ్ విధానంలో చీనీ, కళింగర సాగుచేస్తున్న రవిచంద్రారెడ్డి అనే రైతు పొలాన్ని గవర్నర్ సందర్శించారు. జిల్లాలో మూడేళ్లుగా 15 వేల హెక్టార్లలో మల్చింగ్ విధానంలో పంటలను సాగు చేస్తున్నారని ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు గవర్నర్‌కు వివరించారు. డ్రిప్ ద్వారా మందులు, ఎరువులను ఇస్తుండటంతో 50–60 శాతం ఆదా చేయగలుగుతున్నారని తెలిపారు. జిల్లాలో 27,358 హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం కల్పించామని, రాష్ట్రంలోనే అనంత ప్రథమస్థానంలో ఉందని చెప్పారు. అక్కడే ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం నీరు–ప్రగతి కింద పంటకుంటలను తానే ప్రారంభించానని గుర్తు చేశారు. కరువు రహిత జిల్లాగా మార్చేందుకు పంట కుంటలు ఎంతో దోహదపడతాయన్నారు. రైతులు ఒకేరకమైన పంటలను కాకుండా ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్, అనంతపురం ఆర్డీఓ మాలోల, ఎస్పీ రాజశేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్‌కు ఘన స్వాగతం
అనంతపురం న్యూసిటీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం అనంతపురం చేరుకున్నారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, మేయర్ స్వరూప, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్‌లు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్‌కు మేయర్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. కాసేపటికి మంత్రి పరిటాల సునీత గవర్నర్‌కు పుష్పగుచ్చానందించారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నేటి పర్యటనిలా.. గవర్నర్ నరసింహన్ మంగళవారం గార్లదిన్నె మండలం ముకుందాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 నుంచి ‘పంట సంజీవని’ ఫారంపాండ్ పనులను పరిశీలిస్తారు. 10 నుంచి 10.30 గంటల వరకు మల్చింగ్ పద్ధతిలో సాగుచేసిన పంటలను పరిశీలిస్తారు. 10.30 నుంచి 11 గంటల వరకు బిందు, తుంపర సేద్యం ద్వారా వినూత్నంగా సాగు చేసిన పండ్ల తోటలను సందర్శిస్తారు. 11 నుంచి 11.45 గంటల వరకు గార్లదిన్నెలో భూగర్భ జలాలను కొలిచే ఫిజో మీటర్లను పరిశీలిస్తారు. 11.45 గంటలకు గార్లదిన్నె నుంచి అనంతపురం బయలుదేరుతారు. 12 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహం చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు బయలుదేరుతారు. -
నరసింహన్‌తో ఒరిగిందేమీ లేదు
కేంద్ర హోం మంత్రికి వీహెచ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ నరసింహన్ వల్ల గత ఏడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదని, ఆయన పదవీ కాలం పొడిగింపును పునఃసమీక్షించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శనివారం లేఖ రాశారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉన్న నరసింహన్ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది పోయి.. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పాల్ప డుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు వంతపాడుతున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. నరసింహన్ పదవీ కాలాన్ని పొడిగిస్తే ఏపీ, తెలంగాణలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నా గవర్నర్ చర్యలు తీసుకోకపోగా.. పార్టీ ఫిరాయించిన వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు విస్మరించిందని, రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదని, మద్దతు ధర లేక ఆందోళన చేపట్టిన మిర్చి రైతులను గూండాలుగా చిత్రీకరించి జైల్లో పెడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నా గవర్నర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆలయాలు సందర్శించడానికే గవర్నర్ సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవ డం లేదన్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారన్నారు. ఆయన పదవీ కాలం పొడిగింపును సమీక్షించి.. కొత్త గవర్నర్‌ను నియమించాలని కోరారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లందరినీ వెనక్కి పిలిచి.. నరసింహన్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారని వీహెచ్ ప్రశ్నించారు. -
కట్ పేస్ట్ పీహెచ్డీలెందుకు?
► మహాత్మాగాంధీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ ► పరిశోధనల్లో నాణ్యత పెరిగినప్పుడే సమాజానికి ప్రయోజనం ► కళాశాలలు వ్యాపార దృక్పథంతో పనిచేయడం మంచిది కాదు ► విద్యార్థి దశలో సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచాలి సాక్షి, నల్లగొండ : విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘యూనివర్సిటీల్లో ఒక్కొక్కరు 25–30 పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఒక్కో గైడ్ వందలాది మందితో పీహెచ్‌డీలు చేయిస్తున్నారు. ఇవన్నీ కట్ అండ్ పేస్ట్ పీహెచ్డీలే. గూగుల్, టాగుల్, ఇతర ఫన్నీ వెబ్సైట్లలో చూసి రాసుకుంటున్నారు. ఈ కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలతో సమాజానికి ఏం ఉపయోగం? విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో నాణ్యత పెరిగినప్పుడే సమాజానికి ప్రయోజనం ఉంటుంది. పరిశోధనలు, ఆవిష్కరణలు సుస్థిర భారతదేశ నిర్మాణానికి దోహదపడాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం నల్లగొండలో జరిగిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై గోల్డ్ మెడలిస్టులు, టాపర్స్‌కు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధనార్జన కోసమే విద్య అనే భావన నుంచి యువత బయటకు రావాలని, తాము సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచడం ద్వారా సమాజంలో విలువలు పెంచేందుకు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. కళాశాలలు ఎన్ని ఉన్నాయి, విద్యార్థులెంత మంది చదువుకుంటున్నారనేది ప్రధానం కాదని, విద్యలో ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదే ముఖ్యమని, ఈ అంశంపై విశ్వవిద్యాలయాలు ఎక్కువ దృష్టిసారించాలని ఆయన కోరారు. ‘కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనేది యాజమాన్యాలు ఆలోచించుకోవాలని, వ్యాపార దృక్పథంతో పనిచేయడాన్ని కళాశాలల యాజమాన్యాలు మానుకోవాలని హితవు పలికారు. కళాశాలలు ఇదే రీతిలో పనిచేస్తే ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలు రావని, వచ్చే ఏడాది నుంచి ఉగాది కానుకలేమీ ఉండవని అన్నారు. సమాజంలోని ›ప్రతి వ్యక్తి తనకు ఆహార, వైద్య, ఇంధన, గృహ, సాధారణ భద్రతల గురించి ఆలోచిస్తాడని, అవన్నీ అందించే విద్యను, విద్యార్థులను సమాజానికి అందించే కృషి విశ్వవిద్యాలయాల్లో జరగాలని అభిప్రాయపడ్డారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో అధ్యాపకుల కృషి కీలకమైనదని పేర్కొన్నారు. ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి భారతీయుడిగా గర్వించాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏది చేయాలన్నా విదేశీయులు చెపితేనే చేస్తున్నామని, యోగా, ప్రాణాయామం లాంటి కార్యక్రమాల్లో కూడా మనం విదేశాలను అనుసరిస్తున్నామని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో లేనిది ఏమీ లేదని, సమాజానికి అవసరమైన అన్ని బోధనలూ వాటిలోనే ఉన్నాయన్నారు. దేశ సాంస్కృతిక చరిత్ర గురించి కూడా భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌చాన్సలర్ మామిడాల జగదీశ్‌కుమార్ మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణల వల్లే సమాజానికి ప్రయోజనం ఉంటుందని, విశ్వవిద్యాలయాల్లో జరిగే కృషి కూడా ఆ దిశలో ఉండాలని కోరారు. దేశంలో 800 వర్సిటీలుంటే అందులో 60శాతం విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఆశించినంతగా లేవని, మొత్తం 40వేల కళాశాలల్లో 90శాతం కళాశాలల్లోనూ ఆదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంపదను సృష్టించడంలో, గ్రామీణ విద్యార్థులను ఇముడ్చుకోవడంలో వర్సిటీలు విఫలమవుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు తమ పనితీరును కనీసం సమీక్షించుకోవడం లేదని, సామాజిక విలువలను పెంపొందించే విద్యను అందించాలన్న దృక్ఫథం కొరవడిందని అన్నారు. విశ్వవిద్యాలయాలకు నిధులివ్వడం లేదని, గ్లోబల్ యూనివర్శిటీలతో పోలిస్తే మన విశ్వవిద్యాలయాల్లోని పరిశోధనాలయాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదని, అయినా ఉన్న దాంట్లోనే మంచి ఫలితాలు రాబట్టే కృషి విశ్వవిద్యాలయాల్లో జరగాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, గవర్నర్ పర్యటన సందర్భంగా వర్సిటీలో సౌకర్యాల కొరతపై కొందరు విద్యార్థులు యూనివర్సిటీ మెయిన్‌గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందే పోలీసులు ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉదయం కొంత ఉద్రిక్తత నెలకొని గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు, ఇటు యూనివర్సిటీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
స్పెషల్ ఫోర్త్ ఎస్టేట్ విత్ గవర్నర్
-
మళ్లీ గవర్నర్‌గా నరసింహన్!
-
మళ్లీ గవర్నర్‌గా నరసింహన్!
సమాచారమిచ్చిన కేంద్ర హోంమంత్రి సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా కొనసా గనున్నారు. తాత్కా లికంగా ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. నరసింహన్ ప్రస్తుత పదవీకాలం మంగళవా రంతో ముగియడంతో.. ఆయనను కొనసాగి స్తారా, కొత్త గవర్నర్‌ను నియమిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే మంగళవారం సాయంత్రం 4.35 గంటలకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గవర్నర్ నరసింహన్‌తో ఫోన్లో మాట్లాడి.. ఇరు రాష్ట్రాల గవర్నర్‌గా తిరిగి కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందిం చినట్లు తెలిసింది. అనంతరం కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ మహర్షి సైతం నరసింహన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. దీనిపై రాష్ట్రపతి భవన్‌కు సమాచారం పంపించి అధికా రికంగా ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర çహోం శాఖ వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే కొద్దినెలల పాటు గవర్నర్‌గా కొనసాగిస్తారా, లేక మరో విడత మొత్తంగా పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న దానిపై ఉత్తర్వులు వెలువడిన అనంతరం స్పష్టత రానుంది. -
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
విశాఖపట్నం: సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం శనివారం వేకువజామున కన్నులపండువగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సింహాద్రి అప్పన్నకు తొలిపూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గవర్నర్ నరసింహన్, తితిదే తరుఫున ఈవో సాంబశివరావు అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ‘శ్రీరామ నవమి’ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని వారు ఆకాంక్షించారు. లోక కల్యాణమే పరమావధిగా సాగిన శ్రీరాముడి పాలనే ఆదర్శమన్నారు. -
2న గవర్నర్ రాక
ఏలూరు (మెట్రో) : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆదివారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 2న ఉదయం 11.30 గంట లకు విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు ద్వారకా తిరుమల వస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ద్వారకా తిరుమల నుంచి హెలికాప్టర్లో గన్నవరం చేరుకుంటారు. -
శ్రీవారిని దర్శించుకున్న నరసింహన్
తిరుమల: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద గవర్నర్ దంపతులకు టీటీడీ అధికారులు, వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
పానకాలస్వామిని దర్శించుకున్న గవర్నర్
మంగళగిరి(గుంటూరు జిల్లా): గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళగిరిలోని పానకాలస్వామిని దర్శించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన గవర్నర్ సతీసమేతంగా మంగళగిరి వెళ్ళి పానకాలస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగత పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు. -
రాజ్‌భవన్ సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభం
హైదరాబాద్ : రాజ్‌భవన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన స్టాఫ్ క్వార్టర్లను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. గవర్నర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ బొంతు రామ్మెహన్ తదితరులు పాల్గొన్నారు. రూ. 98 కోట్లతో రాజ్‌భవన్ స్టాఫ్క్వార్టర్లు, ప్రభుత్వ పాఠశాల భవనం, పోలీస్ బ్యారెక్స్, సమావేశ మందిరం వంటి వసతుల నిర్మాణాలు చేపట్టారు. -
రేపే రెండు రాష్ట్రాల పంచాయితీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాలపై బుధవారం ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో పంచాయితీ జరుగనుంది. ఇందులో ప్రధానంగా సచివాలయం, నివాస భవనాల అప్పగింతపై చర్చించనున్నారు. వీటితోపాటు షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, కోర్టు తీర్పుల అమలుపైనా మాట్లాడాలని ఏపీ పట్టుబట్టనుంది. ఏపీ తరఫున యనమల రామకృష్ణుడు, అచ్చెం నాయుడు, కాలువ శ్రీనివాస్ తోపాటు ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు పెండింగ్ సమస్యలపై నోట్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
రేపే పంచాయితీ..
‘విభజన’సమస్యలపై గవర్నర్ సమక్షంలో చర్చలు - రాజ్‌భవన్‌లో సమావేశం.. హాజరుకానున్న - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల స్థాయి కమిటీలు - అపరిష్కృత సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు - సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రతివారం సమావేశాలు - నరసింహన్‌తో కేసీఆర్ ముందస్తు భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య విభజన వివాదాల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వం వహించనున్నారు. గవర్నర్ సమక్షంలో తొలిసారిగా ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయి కమిటీలు బుధవారం రాజ్‌భవన్‌లో సమావేశమై చర్చలు జరపనున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య పీటముడిలా తయారైన సమస్యలన్నింటి పైనా దృష్టి సారించనున్నారు. అన్ని అంశాలూ ఓ కొలిక్కి వచ్చేదాకా ప్రతీ వారం ఈ కమిటీలు సమావేశం కానున్నాయి. సమావేశాలకు ఎజెండా తోపాటు, వివిధ సంస్థల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాలు తొలిసారిగా ఒకే వేదికపై అభిప్రాయా లను పంచుకోబోతున్నాయి. సచివాలయం, ప్రభుత్వ భవనాలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజన, జల జగడాలు, విద్యుత్ ఉద్యోగుల విభజన సహా అన్ని ప్రధాన సమస్యలూ సమావేశాల ఎజెండా కానున్నాయి. కేంద్ర హోం శాఖ పరిష్కరించాల్సిన 9, 10 షెడ్యూల్ అంశాలను కూడా ఇక్కడే పరిష్కరించుకోవాలని ఇరు4 రాష్ట్రాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. భవనాల అప్పగింతే కీలకం! ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ అమరావతికి తరలిపోతున్న నేపథ్యంలో... సచివాలయంతో సహా హైదరాబాద్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. విభజనకు ముందు రాష్ట్రపతి పాలన సమయంలో విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాల పంపకంపై గవర్నర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో... అనుకున్న సమయం కంటే ముందే ఏపీ కార్యాలయాలను అమరావతికి తరలించే ప్రక్రియ మొదలైంది. దీంతో హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయి. సరైన నిర్వహణ లేక అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే అభిప్రాయమూ వస్తోంది. పలు చోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను ఏపీ అధికారులు అద్దెకు ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ శాఖలు కొన్ని తమ కార్యకలాపాల కోసం అదనపు భవనాలు, స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ భవనాలను తమకు స్వాధీనం చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. వీటితోపాటు రాబోయే రోజుల్లో జరిగే సమావేశాల ఎజెండాను సైతం బుధవారం నాటి భేటీలో నిర్ణయించనున్నారు. హైదరాబాద్‌లో స్థలం కోసం ఏపీ పట్టు విభజన తర్వాత తమకు వాటాగా వచ్చే ఆస్తుల జాబితా, వాటి విలువలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలను తయారు చేసుకున్నట్లు సమాచారం. అలా వచ్చే భవనాలు, ఆస్తుల విలువ సుమారు రూ.50 వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆ మొత్తానికి పరిహారంగా హైదరాబాద్ శివార్లలో భూములు కేటాయిస్తే... ఆస్తుల విభజనకు బేషరతుగా సమ్మతించి ఒప్పందం కుదుర్చుకోవాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. తెరపైకి కొత్త సచివాలయం ప్రభుత్వ భవనాల అప్పగింత చర్చలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మార్చి తరవాత పాత సచివాలయం కూల్చి వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో నిధులు సైతం కేటాయించనున్నట్లు సమాచారం. ఒకే బ్లాక్‌గా 6 అంతస్తుల్లో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి రూ.300 కోట్ల వ్యయంతో ఆర్ అండ్ బీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గవర్నర్‌తో కేసీఆర్ ముందస్తు భేటీ గవర్నర్ వద్ద సమావేశాల కోసం తెలంగాణ తరఫున మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేకానందతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అటు ఏపీ కూడా ఆ రాష్ట్ర మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాస్‌లతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీల భేటీలో సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం కేసీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముందస్తుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విభజన సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. -
దేశానికే ఆదర్శం
రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ - కోటి ఎకరాల సాగు లక్ష్యంగా ప్రభుత్వం కృషి - సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్ల కేటాయింపు - మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుత ప్రాజెక్టులు - విద్యుత్ రంగంలో మంచి పురోగతి సాధించాం - రికార్డు స్థాయిలో హరితహారం చేపట్టాం - పాలనను ప్రజల చెంతకు చేర్చేలా కొత్త జిల్లాల ఏర్పాటు - బంగారు తెలంగాణ దిశగా ముందుకెళుతున్నాం - కలసికట్టుగా పనిచేస్తేనే సుఖశాంతులు లభిస్తాయని వ్యాఖ్య - సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా వేడుకలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రజలు ఆనందంగా ఉండేందుకు, మెరుగైన జీవనాన్ని గడిపేందుకు తగిన పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. అతి తక్కువ వయసున్న తెలంగాణ.. బంగారు తెలంగాణగా రూపుదిద్దుకునే లక్ష్యంతో వడివడిగా ముందుకు వెళుతోందని.. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో నేను, నీవు అనే పదాలకు తావులేదని... మనమంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఆశించిన అభివృద్ధి, సుఖ శాంతులు లభిస్తాయయని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... కోటి ఎకరాలను సాగులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, భక్త రామదాసు వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టింది. ఇందుకోసం ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.25 వేల కోట్లు కేటాయించింది. కాళేశ్వరాన్ని వేగంగా పూర్తి చేయడం కోసం మహారాష్ట్రతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.42 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా 2018 నాటికి 25 వేల గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తయితే మరో మూడు దశాబ్దాల వరకు తాగునీటికి ఇబ్బందులు ఉండవు. రైతాంగానికి మేలు చేకూర్చే వినూత్న కార్యక్రమం మిషన్ కాకతీయ. సుమారు 45,600 చెరువులకు పునరుద్ధరించడమే దీని లక్ష్యం. నీతి ఆయోగ్ కూడా దీనిని ప్రశంసించింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు మంచి పురోగతిని కనబర్చాయి. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించేందుకు వీలు కలిగింది. మిగులు విద్యుత్ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సోలార్, థర్మల్ ప్రాజెక్టులను చేపట్టింది. రాష్ట్రంలో అడవుల శాతాన్ని 25 నుంచి 33శాతానికి పెంచేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టాం. గతేడాది జూలై 11న ఒకేరోజు 29 లక్షల మొక్కలు నాటడం రికార్డుగా నిలిచింది. పేద వర్గాల వారికి సమాజంలో సమున్నత గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం 36 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఏటా రూ.4,900 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎటువంటి ఆదరవులేని ఒంటరి మహిళలను ఆదుకునేందుకు నెలకు రూ.1,000 చొప్పున పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. గత డిసెంబర్లో ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో నిర్మించిన డబుల్ ఇళ్లలో సామూహికంగా గృహప్రవేశం కూడా జరిగింది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఒక్కొక్కరికి రూ.51 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ముస్లింలు, ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యాపార కార్యకలాపాలు సులభంగా నిర్వహించే వీలున్న రాష్ట్రంగా.. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ప్రపంచబ్యాంకు నుంచి గుర్తింపు పొందింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో దేశంలోనే నంబర్‌వన్ స్థానం దక్కింది. టీఎస్–ఐపాస్ విధానంతో రాష్ట్రానికి సుమారు 3 వేల పరిశ్రమలు, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 2లక్షల మందికి ఉపాధి లభించింది. పాలనను ప్రజలకు చేరువ చేస్తామన్న హామీ మేరకు 21 కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నగదు రహిత లావాదేవీల్లో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ స్ఫూర్తిగా నిలిచింది. సిద్ధిపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఇబ్రహీంపూర్ గ్రామం వంద శాతం నగదు రహిత లావాదేవీలను సాధించింది. హైదరాబాద్ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెట్రోరైలు ఈ ఏడాది పరుగులు పెట్టే అవకాశముంది. రాష్ట్రంలో పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యాదాద్రి, వేములవాడ, జోగులాంబ, భద్రాద్రి, ధర్మపురి, బాసర ఆలయాలను మరిన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది. ఐటీలో పురోభివృద్ధికి ప్రభుత్వం ఐసీటీ విధానాలను అమలు చేస్తోంది. ఐటీ రంగంలో జాతీయ సగటుకన్నా 3 శాతం అధిక వృద్ధితో తెలంగాణ 16 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రంలో అనేక పథకాలు ప్రజాసంక్షేమం దిశగా అమలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. అమర జవాన్లకు కేసీఆర్ నివాళులు గణతంత్ర వేడుకల సందర్భంగా పరేడ్గ్రౌండ్స్లోని అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద సీఎం కేసీఆర్ పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. గణతంత్ర వేడుకల్లో మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని, జోగురామన్న, చందూలాల్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పద్మారావు, సీఎస్ ఎస్పీసింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా తమ మీడియా కవరేజీ కోసం ప్రదేశం ఎంపికలో కార్యక్రమ నిర్వాహకులు నిర్లక్ష్యం చూపారంటూ.. మీడియా ప్రతినిధులు గవర్నర్ ప్రసంగం సమయంలో నిలబడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఆకట్టుకున్న కవాతు గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన సైనిక, పోలీసు బృందాల కవాతు ఆకట్టుకుంది. రాష్ట్ర పోలీసులతో పాటు ఒడిశా, జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చిన పోలీసు బృందాలు, కొన్ని సైనిక వాయిద్య బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బృందాలకు గవర్నర్ నరసింహన్ ట్రోఫీలను, జ్ఞాపికలను అందజేశారు. సీనియర్ విభాగంలో సిక్త్ జమ్మూ కశ్మీర్ (47వ బ్రిగేడ్) సైనిక బృందం ప్రథమ స్థానంలో నిలవగా, 18వ డోగ్రా రెజిమెంట్ (76 బ్రిగేడ్) బృందం రెండో స్థానంలో నిలిచింది. జూనియర్ విభాగంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలవగా.. ఎన్సీసీ బాలికల బృందం రెండో స్థానంలో నిలిచింది. వేడుకలలో పాల్గొన్న ఒడిశా రాష్ట్ర పోలీసు బృందానికి ప్రత్యేక అభినందన ట్రోఫీని అందజేశారు. కవాతులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విద్యార్థుల బృందం, తెలంగాణ రాష్ట్ర మౌంటెయిన్ పోలీస్, ఎన్సీసీ బాలుర బృందం, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం, తెలంగాణ స్పెషల్ పోలీస్ 4వ బెటాలియన్, భారత వైమానిక దళం పాల్గొన్నాయి. -
28న గవర్నర్ రాక
కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్శింహ¯ŒS ఈ నెల 28వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 7.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఉదయం 8.40 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కాకినాడ ఆర్అండ్బీ అతిథిగృహానికి 9.40 గంటలకు చేరుకుని తదుపరి 9.50కు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి బయల్దేరి 10 గంటలకు కాకినాడలోని కుసుమ సత్య కాన్వెన్ష¯ŒS హాలుకు చేరుకుని 11 గంటల వరకు రోటరీ డిస్ట్రిక్ట్ 3020 సదస్సులో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి 11.20 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి 2.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళతారు. ఏర్పాట్లపై సమీక్షించిన జేసీ–2 గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి సమీక్షించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని ఆదేశించారు. జిల్లాలో గవర్నర్ పర్యటనను ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని, పర్యటన ప్రాంతాలలో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో రాజమండ్రి ఇ¯ŒSచార్జి సబ్ కలెక్టర్ ఎం.జ్యోతి, కాకినాడ ఆర్డీఓ బీఆర్ అంబేడ్కర్, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ సీఎస్ఎ¯ŒS మూర్తి, ఏఆర్ డీఎస్పీ వి.ఎస్.వాసన్, సమాచార శాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్, కాకినాడ సిటీ తహసీల్దార్ జి.బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు?
గవర్నర్‌తో సీఎం భేటీ... సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదేనెల 16 లేదా 17న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. శనివారం సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ తో రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు, ఇటీవలే ముగిసిన శాసనసభ శీతాకాల సమావేశ వివరాలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలను కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. -
రేపు గవర్నర్ నరసింహన్ పుట్టపర్తి రాక
పుట్టపర్తి టౌన్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శనివారం పుట్టపర్తికి రానున్నట్లు రెవెన్యూ అధికారులు గురువారం తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకుంటారన్నారు. మూడు గంటల పాటు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గడిపి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడి నుంచి ఆయన బయలు దేరుతాయని వారు తెలిపారు. -
అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి
-
అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి పౌరుడి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గవర్నర్ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులకు అందుబాటులో ఉండనున్నారని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
కందాతో ఒరేయ్ అని పిలిపించుకోవడం ఇష్టం
► గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య ► కందా రాసిన ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబెల్స్’ పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా నిజమైన కర్మయోగి అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. సివిల్ సర్వెంట్‌గా తన జీవితంలో ఎదురైన అనుభవాలతో కందా రాసిన ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబ్బెల్స్’ పుస్తకాన్ని మంగళవారమిక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)లో గవర్నర్ ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోహన్ కందా, తాను సివిల్ సర్వీసెస్‌లో(1968) ఒకే బ్యాచ్‌కు చెందిన వారమని చెప్పారు. మోహన్ కందా సబ్ కలెక్టర్‌గా, తాను ఎస్పీగా ఒంగోలు జిల్లాలో కలిసి పనిచేసి ఎన్నో సమస్యలను సమన్వయంగా పరిష్కరించామన్నారు. జ్ఞానీ జైల్‌సింగ్ నుంచి అబ్దుల్ కలాం వరకు విభిన్నమైన వ్యక్తిత్వం, లక్షణాలు కలిగిన పలువురు నాయకుల వద్ద పనిచేసిన మోహన్ కందా వారందరి మన్ననలు పొందారన్నారు. ‘‘మోహన్ తో గౌరవనీయ గవర్నర్ అని కాకుండా.. అప్పటిలాగే ఒరేయ్ వినరా.. ఒరేయ్ ఉండరా.. అని పిలిపించుకోవడమే నాకు సంతోషంగా ఉంటుంది. మోహన్ వ్యవసాయంపైనా విశేషమైన పట్టు సాధించారు. ఏదైనా విషయాన్ని ఇతరులకు వివరించేటపుడు ఒక కథతో మొదలెట్టడం మోహన్ లో అందరికీ బాగా నచ్చే విషయం. మా ఇద్దరికీ పొగడ్తలంటే ఇష్టం ఉండదు. పుస్తకావిష్కరణలో ఏమని పొగడాలో చెప్పమని అడిగితే.. ‘పొగిడేందుకు ఏమీ లేదు’ అని మోహన్ చెప్పారు’’ అని గవర్నర్ అన్నారు. కనీస అవసరాలపై దృష్టి ఏదీ: కందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న నేతలందరూ తనకంటే చిన్నవారేనని, నేతలంతా పెద్ద ఆలోచనలు చేస్తేనే గొప్ప పనులు సాధ్యమవుతాయని మోహన్ కందా అన్నారు. పెద్దపెద్ద ప్రాజెక్ట్‌లు, రాజధాని నగరాలను నిర్మిస్తామని చెబుతున్న నాయకులు.. ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటై రెండున్నరేళ్లు గడిచినందున మరో రెండున్నరేళ్లలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు, పసిపిల్లలకు పౌష్టికాహారం, మహిళలకు భద్రత, ప్రజారోగ్యం.. తదితర సదుపాయాల కల్పన కోసమైతేనే తనను కలవాలని నేతలకు చెప్పాలని గవర్నర్‌కు సూచించారు. నేటి తరానికి మార్గదర్శి ఆస్కీ డైరెక్టర్ పద్మనాభయ్య మాట్లాడుతూ.. మోహనరసింహన్ కందా రాసిన పుస్తకం నేటి తరం బ్యూరోక్రాట్లకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. చేపట్టిన బాధ్యతలను బరువుగా కాకుండా క్రీడాస్ఫూర్తితో నిర్వహించడం ఎలాగో మోహనరసింహన్ కందాను చూసి నేర్చుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మోహనరసింహన్ కందా పనిచేసినప్పటి నాయకుల, అధికారుల పాత్రలు, రోజువారీ జీవితంలో సామాన్యులతో జరిగిన సంఘటనల సమాహారమే ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబ్బెల్స్’ అని వివరించారు. లైఫ్ త్రూ ఎ హైదరాబాదీస్ లుకింగ్ గ్లాస్ ట్యాగ్లైనరసింహన్ తో మోహనరసింహన్ కందా రాసిన ఈ పుస్తకాన్ని కోల్‌కతాకు చెందిన సంపత్ పబ్లికేషన్ ప్రచురించింది. కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
అసెంబ్లీ సమావేశాలు, నగదురహిత లావాదేవీలపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. 14వ తేదీ తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు సంబంధించిన షెడ్యూలును ఒకటీరెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. సమావేశాల షెడ్యూలుకు ముందుగా గవర్నర్ అనుమతితో నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు గత నెలలో కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపడుతున్న చర్యలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. -
గవర్నర్‌తో టీఎస్పీఎస్సీ చైర్మన్ భేటీ
⇒ గ్రూప్-2 పరీక్ష ఏర్పాట్లపై వివరణ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో కలసి మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను చక్రపాణి మర్యాద పూర్వకంగా కలిశారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో చేపడుతున్న నియామకాల ప్రక్రియను వివరించారు. ముఖ్యంగా గ్రూప్-2 పరీక్ష కోసం చేసిన ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని గవర్నర్‌కు వివరించారు. -
70వ వసంతంలోకి గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం 70వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయన తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజ్‌భవన్‌లో బంధువులు, సన్నిహితుల మధ్య ఈ వేడుకలను జరుపుకోనున్నారు. 2009లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన పుట్టినరోజును హైదరాబాద్‌లోనే జరుపుకుంటున్నారు. -
గవర్నర్‌ను కలిసిన కేసీఆర్
హైదరబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. దీపావళి సందర్భంగా కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీరు పలు అంశాలపై సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అంతకుముందు రాజ్ భవన్లో గవర్నర్ దంపతులు ప్రజాదర్బర్ నిర్వహించారు. ప్రజాదర్బార్‌లో భాగంగా సాధారణ ప్రజలను కలుసుకున్న గవర్నర్ దంపతులు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఇద్దరు సీఎంలు కలిసి చక్కదిద్దుకుంటారన్నారు. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
ఏపీ ఆఫీసులు ఖాళీ చేయాలి
-
ఏపీ ఆఫీసులు ఖాళీ చేయాలి
► గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం కేసీఆర్ ► కొత్త సచివాలయ నిర్మాణం దృష్ట్యా తరలింపు ► పత్యామ్నాయ ఆవాసం కల్పిస్తామంటూ సీఎస్ లేఖ ► తాత్కాలిక సచివాలయంగా బూర్గుల భవన్? ► శాఖల తరలింపునకు మరిన్ని భవనాల పరిశీలన సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్చించారు. కొత్త సచివాలయాన్ని ప్రస్తుతమున్న చోటే నిర్మించే ఆలోచనను ఆయనతో పంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆయన దాదాపు అరగంటసేపు సమావేశమయ్యారు. సచివాలయ నిర్మాణంతో పాటు భూ సేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌పైనా ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పాలన సౌలభ్యానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితరాలపైనా చర్చ జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణానికి నవంబర్‌లో పునాది రాయి వేయాలని సీఎం భావిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కార్యాలయాలన్నిటినీ తాత్కాలికంగా మరో చోటికి తరలించటం అనివార్యమైంది. ఇదే ప్రాంగణంలో ఏపీకి చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. కొత్త నిర్మాణానికి వీలుగా వాటిని సైతం ఖాళీ చేయించాలని, వాటికి తాత్కాలికంగా మరో చోట వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే ఇది విభజనతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావటంతో ముందస్తుగా విషయాన్ని గవర్నర్‌కు సీఎం నివేదించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో ఉన్న భవనాలను ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయ భవనాలను సమకూరుస్తామని ప్రతిపాదిస్తూతెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది. దీంతోపాటు భూ సేకరణకు సంబంధించి ప్రస్తుతమున్న జీవోలకు బదులు చట్టం తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ రూపంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గవర్నర్‌తో భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రత్యామ్నాయ భవనాల పరిశీలన సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం సచివాలయానికి దగ్గరగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను పరిశీలించారు. సీఎం కార్యాలయంతో పాటు కీలక విభాగాలను ఇందులోకి మార్చే అవకాశాలను సమీక్షించారు. దీంతోపాటు అరణ్య భవన్, ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయం, జలసౌధ, హిమాయత్‌నగర్‌లోని గృహ నిర్మాణ శాఖ భవన్‌లోకి సంబంధిత శాఖలను తరలించాలని నిర్ణయించారు. మిగతా శాఖల కార్యాలయాలను బీఆర్కే భవన్‌లోని ఏయే బ్లాక్‌లకు తరలించాలనే ప్రణాళికను రూపొందిస్తున్నారు. -
'ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగించాలి'
-
'ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగించాలని కోరుకుంటున్నా'
హైదరాబాద్ : నేడు జరగుగుతున్న పోలీస్ మారథాన్ రన్ దేశానికే ఆదర్శమని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఫస్ట్ ఇండియన్ పోలీస్ మారథన్ మెమోరియల్ రన్‌ను నరసింహన్ ప్రారంభించారు. అనంతరం నరసింహన్ మాట్లాడుతూ... ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ రన్లో డీజీపీ అనురాగ్ శర్మ, పోలీసు ఉన్నతాధికారులతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రన్లో యువతి, యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు ఉండాలి
♦ గవర్నర్ నరసింహన్ వెల్లడి ♦ లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి ♦ తరచూ ఉప ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం ♦ అక్రమాలపై ఏసీబీ చట్టం కింద విచారణ చేయాలి ♦ ఎన్నికల కమిషనర్ల సదస్సులో సూచనలు సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ అంశంపై పరిశీలన జరపాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు(రైట్ టు రీకాల్)ను ఓటర్లకు కల్పించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రధానంగా ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను వినియోగించడంతో పాటు ఓటర్లను ఆధార్‌కార్డుతో అనుసంధానం జరిపితే ఈ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. తరచూ ఉప ఎన్నికల నిర్వహణతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, ఏటా రెండు సార్లు.. జనవరి, జూలై నెలల్లో మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ల 24వ అఖిలభారత స్థాయి సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరముందన్నారు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమని అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.. ఎన్నికల్లో అక్రమాలు, ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేం దుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఎన్నికలు జరిగిన ప్రతిసారి పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయని, కొన్నాళ్లకు అందరూ దీన్ని మరిచిపోతున్నారన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం బలహీనంగా ఉండడంతో ఎన్నికల కేసులు నీరుగారిపోతున్నాయన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు వీలు కల్పించేలా చట్ట సవరణ జరగాలన్నారు. నేర చరిత్ర గలవారు, కింది కోర్టుల్లో శిక్ష పడిన వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా చేయాలన్నారు. పోలింగ్‌కు 3 వారాల ముందే అభ్యర్థులు, వారి అనుచరులు ఆయా నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని, కేవలం మీడియా ద్వారానే ప్రచారం చేసే విధంగా కొత్త విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సూచించారు. వీటి వల్ల ఎన్నికల్లో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. ఎన్నికల సందర్భంగా తప్పుడు ఫిర్యాదులు చేసేవారిపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమాకాంత్‌రెడ్డి, ప్రస్తుత కమిషనర్ వి.నాగిరెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించారని గవర్నర్ ప్రశంసించారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని భారత ఎన్నికల సంఘం కమిషనర్ అచ్యుత్‌కుమార్ జ్యోతి తెలిపారు. కొత్త రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఢిల్లీ, ఛండీగఢ్‌ల ఎన్నికల అధికారి రాకేశ్ మెహతా, ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్. రమేశ్ కుమారత్ పాల్గొన్నారు. -
బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం, గవర్నర్
లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద భారత జాతిపిత మహాత్మా గాంధీజీకి తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి మహేందర్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. -
ఈ రాజకీయాలతో చదవలేం
గవర్నర్‌కు ఘంటసాల సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల లేఖ రాజకీయాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఏకరువు ‘సాక్షి’ చేతికి చిక్కిన లేఖ విజయవాడ కల్చరల్ : నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో జరుగుతున్న రాజకీయాలతో తాము చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇ.సి.ఎల్.నరసింహన్‌కు లేఖ రాశారు. కళాశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమకు విద్యాభిక్ష పెట్టాలని ఆ లేఖలో వేడుకున్నారు. ఆ లేఖ ‘సాక్షి’ చేతికి చిక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు మంచి పేరు ఉంది. వేలాది మంది నృత్య కళాకారులు, సంగీత కోవిదులను ప్రపంచానికి అందించిన ఘనత ఈ కళాశాల సొంతం. సంగీత ప్రపంచ రారాజు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వంటి ప్రముఖులు కళాశాల ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పారు. దురదృష్టవశాత్తూ రెండేళ్లుగా సంగీత కళశాలలో అధికార పార్టీ నాయకులు తిష్టవేసి సాంస్కృతిక, భక్తి కార్యక్రమాల పేరుతో కళాశాల ప్రతిష్టను దిగజార్చారు. చివరకు అధిపత్య పోరులో దాడులు, హత్యాయత్నం కేసుల వరకూ తీసుకెళ్లారు. రెండేళ్లు ఓపికపట్టిన విద్యార్థులు తాజాగా తమ కళాశాలలో మరో కార్యక్రమం నిర్వహించేందుకు అధికార పార్టీ నాయకులు చర్యలు చేపట్టిన నేపథ్యంలో సంగీత కళాశాల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు సంగీత కళాశాలలో నెలల తరబడి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏకాగ్రత కుదరడంలేదు. కళాశాల పని దినాల్లో కారిడార్‌లో అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. ముఖ్యంగా బాలికలమైన మేం భయంతో వణికిపోతున్నాం. గతంలో కళాశాలలో ప్రయివేటు కార్యక్రమాలు జరిగినప్పుడు పేరెంట్స్ కమిటీ ద్వారా కళాశాల ప్రిన్సిపాల్‌కు, సంబంధిత అధికారులకు విన్నవించుకున్నాం. భవిష్యత్‌లో జరుగకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ పరిస్థితిలో మార్పులేదు సరికదా ఇంకా దారుణంగా తయారైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైన కార్యక్రమాలు జరుగకూడదని నింధనలు చెపుతున్నా రాజకీయ నాయకులు పూజల పేరుతో కళాశాలలో ప్రవేశిస్తున్నారు. రాజకీయ నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టడం, బహిరంగంగా తిట్టుకోవటం వల్ల సంగీత కళాశాల ప్రతిష్ట దిగజారుతోంది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాలయం సంగీత కళాశాలలోనే పనిచేస్తోంది. అయితే సంచాలకుడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. గతంలో కళాశాలలో జరుగుతున్న కార్యక్రమంలో కళాకారుల ప్రవేశం ఉండేది. కొద్దికాలంగా రాజకీయ నాయకులు మతపరమైన కార్యక్రమాలు చేస్తూ కళాశాల ప్రతిష్టను దిగజారుస్తున్నారు. సంగీత కళాశాలలో జరుగుతున్న కార్యక్రమాల వల్ల సంగీతం, నృత్యం అభిరుచి ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు పంపడానికి భయపడుతున్నారు. సంగీత కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. సంగీత కళాశాల రక్షణగా ఉన్న గోడను కూల్చివేశారు. గతంలో సంగీత కళాశాలకు రాజకీయ నాయకులు లేని కమిటీ ఉండేది. కళాశాలోని కార్యక్రమాలను పర్యవేక్షించేది. ఇప్పుడు ఆ కమిటీ లేకపోవడం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు లేని కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దయజేసి రాజకీయ నాయకుల ప్రవేశం నుంచి కళాశాలను కాపాడాలి. -
ప్రజలు, ప్రభుత్వానికి వారథికండి
♦ సివిల్స్ ట్రైనీ అధికారులకు గవర్నర్ పిలుపు ♦ ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఫౌండేషన్ శిక్షణను ప్రారంభించిన నరసింహన్ సాక్షి, హైదరాబాద్: సామాజిక, ఆర్థిక అసమానతలకు పరిష్కారం చూపగ లిగే సామర్థ్యం సివిల్ సర్వీసెస్ అధికారులకే ఉంటుం దని, కొత్తగా సర్వీసులోకి వచ్చిన అధికారులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా పనిచేయాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై 15 వారాల శిక్షణ నిమిత్తం ఇక్కడి ఎంసీఆర్హెచ్ఆర్డీకి వచ్చిన 120 మంది ట్రైనీ అధికారులకు సోమవారం ఫౌండేషన్ శిక్షణను గవర్నర్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలను సమాజానికి దూరమైన వ్యక్తులకూ అందించాల్సిన బాధ్యత మీదే. సమాజం మీపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడమే మీ ముందున్న పెద్ద సవాల్’’ అని గవర్నర్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే సాధారణ ప్రజలకు అధికారులు కొంత సమయాన్ని కేటాయించాలని...లేకుంటే అధికారులు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. అధికారులు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించినంత కాలం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగులకైనా, అధికారులకైనా ప్రభుత్వమిచ్చే జీత భత్యాలు సరిపోతాయని, జీవితాన్ని గడిపేందుకు అవి నీతికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. పోలీసు అధికారులు మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. అన్ని సర్వీసులూ ముఖ్యమైనవేనన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ డెరైక్టర్ జనరల్ వీకే అగ్రవాల్ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను ఇష్టపూర్వకంగా నేర్చుకొని సమాజం, దేశానికి మేలు జరిగేలా పనిచేయాలని ట్రైనీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కోర్సు సమన్వయకర్త అనితా బాలకృష్ణ, అదనపు కో ఆర్డినేటర్ ఆర్.మాధవి, అక డమిక్ అడ్వైజర్ విజయశ్రీ, జనరల్ మేనేజర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో బుధవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆగస్టు 7వ తేదీన జరిగే మెదక్ జిల్లా గజ్వేల్ లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించనున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు అదే రోజున నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రధాని పర్యటనలో భాగంగా తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను వరంగల్‌లో నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొనే అవకాశం ఉంది. -
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
ఎంసెట్ లీకేజీ అంశంపై రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను టి.కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఎంసెట్ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులైన విద్యావైద్య శాఖ మంత్రులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్లను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా అవినీతిని సహించనని చెప్పే సీఎం ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణ, మాగం రంగారెడ్డి తదితరనేతలు ఉన్నారు. -
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ర్టంలో పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. ఈ నెల 27 నుంచి ఏపీ నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడికి సచివాలయాన్ని,శాఖాధిపతులను తరలించి పరిపాలన కొనసాగించేందుకు చేపట్టిన చర్యలు , తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష, అనంతర పరిణామాలు తదితరాల గురించి గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. -
గవర్నర్‌ను కలిసిన లంబాడి హక్కుల నేతలు
హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు అయ్యేలా చూడాలని లంబాడి హక్కుల సమితీ గురువారం గవర్నర్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుతోపాటు ఒన్ ఆఫ్ 70 యాక్ట్టు వంటి వాటిని వెంటనే అమలు అయ్యేలా చూడాలని వారు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన బృందంలో గిరిజన నేతలు బలరాం నాయక్, రవీంద్రనాయక్, బెల్లానాయక్ ఉన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా పలు హామీలు మ్యానిఫెస్టోలో పొందు పరిచిన సంగతి తెలిసిందే. వాటిని అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. ఈ క్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నేతలు గవర్నర్‌ను కలిశారు. -
నీటి విషయంలో కలిసి ముందుకెళ్దాం: కేసీఆర్
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు మంచిది కాదనీ, నీటి విషయంలో కలిసి ముందుకెళ్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గురువారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎ కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 15 లక్షల జనాభాకు అనుగుణంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పారు. 2018 తర్వాత తెలంగాణలో మంచినీటి కొరత ఉండదన్నారు. 2020 తర్వాత కరువు అనే మాట తెలంగాణ రాష్ట్రంలో వినపడదని తెలిపారు. 2024 కల్లా తెలంగాణ బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లకు చేరుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను సోమవారం ఆయన కలువనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ఈ పర్యటనలో ఆయన కేంద్రానికి వివరించనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు సైతం ఈ పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. -
పట్టాభి రాముడు
భద్రాచలంలో కనులపండువగా పట్టాభిషేకం సాక్షి, ప్రతినిధి ఖమ్మం: భద్రాద్రిలో కోదండ రామయ్య మహా పట్టాభిషేకం కనులపండువగా జరిగింది. శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. గవర్నర్ నరసింహన్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా రామాలయంలోని యాగశాలలో ఉదయం చతుస్థానార్చన హోమం నిర్వహించారు. పూజల అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరిప్రదక్షిణగా మిథిలా స్టేడియానికి తీసుకెళ్లారు. వేడుకలో భాగంగా స్వామివారికి ముందుగా ఆరాధన జరిపారు. విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేన పూజ నిర్వహించారు. పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యహవచనం గావించారు. కలశాలలోని చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థ జలాలతో ప్రాంగణాన్ని ప్రోక్షణ చేసి, అభిషేకానికి వీలుగా కలశ స్థాపన చేశారు. రామదాసు కాలం నాటి బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి కిరీట ధారణ చేశారు. అనంతరం ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యకు పట్టాభిషేకం చేశారు. ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి భద్రాచలంలో జరిగే మహాపట్టాభిషేకం విశిష్టతను భక్తులకు వివరించారు. శ్రీరాముడు లోక కల్యాణం కోసం చేసిన త్యాగాన్ని వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలన్నారు. పట్టాభిషేకం అనంతరం పుణ్య జలాలను భక్తులపై చల్లారు. తగ్గిన భక్తుల సంఖ్య పట్టాభిషేక మహోత్సవానికి భక్తుల సంఖ్య బాగా తగ్గింది. సుమారుగా 3 వేల మంది భక్తులు హాజరై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కల్యాణం మరుసటి రోజున స్వామివారికి నిర్వహించే పట్టాభిషేకంపై తగిన రీతిలో ప్రచారం చేయకపోవటంతో కల్యాణానికి వచ్చిన భక్తులంతా అదే రోజున వెళ్లిపోయారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. భక్తులు లేక మిథిలా స్టేడియంలోని సెక్టార్లన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. గవర్నర్ ప్రత్యేక పూజలు పట్టాభిషేక ఉత్సవానికి గవర్నర్ నరసింహన్ ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రామాలయంతోపాటు లక్ష్మీతాయారు అమ్మవారు, భద్ర మహర్షి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, సతీష్‌బాబు, టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు సత్యనారాయణరెడ్డి, జగన్మోహన్ , ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు. -
'కరవుపై చర్యలు తీసుకోండి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని టీ-బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. కరవుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గవర్నర్‌కు నివేదికను అందజేశారు. -
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాజ్‌భవన్‌లో భేటీ ఆయ్యారు. కేసీఆర్ కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. ఈ నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. నూతనంగా టీఆర్ఎస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో పాటు ప్రస్తుత మంత్రుల్లో కొందరి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. నూతనంగా ఏర్పాడ్డ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించే అవకాశం కూడా ఉంది. మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ ఇప్పటికే తన సన్నిహితులతో చర్చించారని... దీనికి సంబంధించి కసరత్తు పూర్తిచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రుల తీరుపై వచ్చిన ఫిర్యాదులను, అవినీతి ఆరోపణలను కూడా కేసీఆర్ పరిశీలించినట్టు తెలుస్తోంది. -
స్వామి వారి సేవలో నరసింహన్
తిరుమల: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల ఆలయంలో మంగళవారం నిర్వహించిన శుద్ధి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోడలు, ప్రాకారాలకు తిరుమంజనం మిశ్రమాన్ని పూస్తూ, నీటిపైపు చేతపట్టి శుద్ధి చేస్తూ స్వామిసేవలో ఉత్సాహంగా గడిపారు. హోదాలో ప్రథమ పౌరుడైనా ఎలాంటి దర్పం ప్రదర్శించరు. సంప్రదాయానికి నిలువెత్తుగా నిదర్శనం గవర్నర్ నరసింహన్. ప్రత్యేకించి ఆలయ సందర్శనలో ఆచార, వస్త్ర సంప్రదాయాన్ని ఆయన కచ్చితంగా పాటిస్తుంటారు. వంశపారంపర్యంగా ఆచరించే ద్వాదశ పుండ్రాళ్లు (12 తిరునామాలు) ధరిస్తారు. పైవస్త్రం లేకుండా సంప్రదాయ కీపాస్ (పంచెకట్టు) ధరిస్తారు. మోములో చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తారు. మంగళవారం కూడా అదే సంప్రదాయంతోపాటు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. వయసు ఏడు పదులుదాటినా యువకులతో పోటీ పడుతూ తల నుంచి కాళ్ల వరకు పడిన మిశ్రమంతోనే ఇలా ఆలయం వెలుపలకు వచ్చి ‘బాగున్నారా..’ అంటూ అందరినీ నవ్వుతూ పలుకరించారు మన గవర్నర్ నరసింహన్. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సమావేశాల చివరి రోజు గురువారం శాసనసభలో సాగునీటిప్రాజెక్టులపై నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ వివరాలను సీఎం కేసీఆర్ గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. 2016-17కి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం కోసం గవర్నర్‌కు సమర్పించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా హర్‌ప్రీత్‌సింగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఐటీ పాలసీ ఆవిష్కరణకు రావాలని గవర్నర్‌కు ఆహ్వానం ఏప్రిల్ 4న జరగనున్న నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కె.తారకరామారావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని ఈ మేరకు ఆహ్వానించినట్లు తెలిసింది. -
'డబ్బే ముఖ్యం కాదు'
విజయవాడ : గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు ఉండే చిరునవ్వు భవిష్యత్తులో రోగులను చూసేటప్పుడు కూడా ఉండాలని వైద్యులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.... డబ్బే ముఖ్యం కాదని వైద్యులకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. వైద్యులను రోగులు దేవుళ్లుగా భావిస్తారని తెలిపారు. వారి నమ్మకాలను వమ్ము చేయవద్దు అంటూ వైద్యులకు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లాలంటే సామన్య ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేయాలని పట్టా తీసుకున్న వైద్యులను అర్థిస్తున్నానని గవర్నర్ నరసింహన్ అన్నారు. -
ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు?
► యాదాద్రి లక్ష్మీనరసింహుడి కల్యాణం ఆలస్యంపై గవర్నర్ నరసింహన్ ఫైర్ ► సమయం ఎందుకు పాటించడం లేదంటూ ఆలయ ఈవోపై మండిపాటు ► సమయం ప్రకారం జరపరా అంటూ ఆగ్రహం ► మాంగళ్య ధారణ పూర్తవకముందే అర్ధంతరంగా హైదరాబాద్‌కు తిరుగుపయనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఎప్పుడూ భక్తిశ్రద్ధలతో, దైవ కార్యక్రమాలను తు.చ. తప్పకుండా పాటించే గవర్నర్.. సతీసమేతంగా లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. యాదగిరీశుడి కల్యాణం ముహూర్త సమయాని కన్నా ఆలస్యంగా జరుగుతుందన్న కారణంతో ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని, కొంతసేపు కూర్చుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది! అసలేమైందంటే..? గవర్నర్ నరసింహన్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు గురువారం రాత్రి 8:30 గంటలకు సతీసమేతంగా యాదాద్రికి వచ్చారు. కల్యాణం జరిగే మండపంలో ఆశీనులై పెళ్లి తంతును తిలకించారు. అయితే, ముహూర్తం ప్రకారం స్వామి వారి ఉరేగింపు 9:45 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ 18 నిమిషాలు ఆలస్యంగా 10:03 నిమిషాలకు వచ్చింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవో గీతారెడ్డిని ఆలస్యం ఎందుకు అయిందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరికొందరు ప్రజాప్రతినిధులు రావాల్సి ఉందని, అందుకే పావుగంట ఆలస్యంగా కల్యాణం నిర్వహిస్తున్నామని ఈవో బదులిచ్చినట్టు సమాచారం. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్ట ప్రకారం చేయడానికి ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు? అన్నీ సమయం ప్రకారం ఎందుకు జరపడం లేదు? అని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఈవో గీత వెంటనే పూజాది కార్యక్రమాలను ప్రారంభించాలని అర్చకులకు సూచించారని తెలుస్తోంది. ఎవరో రావాలన్న ఆలోచనతో స్వామివారి కల్యాణాన్ని ఆలస్యంగా చేస్తున్నారనే కారణంతో నరసింహన్ తన సతీమణితో కలిసి 10:45 గంటల సమయంలో కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లే సమయానికి మాంగళ్య ధారణ కార్యక్రమం కూడా పూర్తి కాకపోవడం, పెళ్లికి వచ్చిన దుస్తులతోనే ఆయన వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లిన తర్వాత 40 నిమిషాలకు అంటే 11: 25 నిమిషాలకు స్వామి వారి కల్యాణ ఘట్టం ముగియడం గమనార్హం. రాయగిరి కట్ట మీద ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద తన వాహనశ్రేణిని ఆపిన గవర్నర్ అక్కడ దుస్తులు మార్చుకుని హైదరాబాద్ వెళ్లినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. -
రాష్ట్రంలో అభివృద్ధి రెపరెపలు
అన్ని రంగాల్లో పురోగమిస్తోంది: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ‘‘పేదరికం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. సమాజంలోని బడుగు బలహీన వర్గాల్లోని నిరుపేదల సమ్మిళిత అభివృద్ధినే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుంది. పారదర్శక, సమర్థవంతమైన పాలన ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు స్థాయి వరకు చేరుతాయని ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోంది. అందుకే ఇక్కడి విధానాలు, కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి..’’ అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. గడిచిన 21 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎంచుకున్న లక్ష్యాలు ప్రాధామ్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం చేసుకోవటంతో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించిందని అన్నారు. ఆచరణాత్మక దృక్పథంతోపాటు రాజ నీతిజ్ఞతను ప్రదర్శించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నిర్ణీత సమయం 11 గంటల కంటే ఐదు నిమిషాల ముందే సభ ప్రారంభమైంది. 25 నిమిషాల పాటు ప్రసంగించిన గవర్నర్.. ‘‘ప్రజాప్రతినిధులు అంకిత భావంతో ఆచరణాత్మక కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ మార్గదర్శకంగా ఉండాలి..’’ అనే సందేశంతో ముగించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.. అన్ని రంగాల్లో పురోగతి అన్ని రంగాల్లోనూ రాష్ట్రం పురోగతిని సాధించింది. కొత్త పథకాలు, విధానాలతో దేశంలోనే అగ్రగామిగా నిలబడేందుకు కృషి చేస్తోంది. జాతీయ వృద్ధి రేటు 8.6 శాతం కాగా.. ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 2015-16లో 11.7 శాతానికి చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఇదో ముఖ్యమైన మైలురాయి. 2016-17లో జీఎస్డీపీలో 15 శాతం అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా ఎంచుకుంది. జాతీయ తలసరి ఆదాయం రూ.93,231 తో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15లో రూ.1,29,182 నుంచి రూ.1,43,023కు పెరిగే అవకాశముంది. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న కల్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలకు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర తరగతులకు విస్తరించనుంది. మైనారిటీలకు కొత్తగా 70 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మానవీయ కోణంలో ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని కాలేజీ విద్యార్థులకు విస్తరించనుంది. టీఎస్ఐపాస్ భేష్.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. ఎనిమిది నెలల వ్యవధిలో ప్రముఖ కార్పొరేట్ గ్రూపుల యూనిట్లతోపాటు వందకుపైగా యూనిట్లకు అనుమతులిచ్చింది. కొత్తగా మూడు ఏరోస్పేస్ పార్కులను ఏర్పాటు చేయనుంది. ఫార్మాసిటీ ఏర్పాటు దిశగా పురోగతి సాధించింది. వచ్చే ఏడాది మెదక్‌లో ఎన్ఐఐజెడ్ (జాతీయ పెట్టుబడి, తయారీ జోన్) ఒకటో దశ ప్రారంభం కాబోతోంది. వరంగల్‌లో భారీ జౌళి పార్కు, జౌళి రంగంలో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. నగరం వైపు ఐటీ దిగ్గజాల చూపు కొత్త ఐసీటీ విధానంతో ప్రపంచ ఐటీ దిగ్గజాలు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. నాలుగు అత్యున్నత ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత హైదరాబాద్‌లో భారీ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాయి. యువతకు ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి వీలుగా ప్రభుత్వం టీ-హబ్, తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్ (టాస్క్)లను ఏర్పాటు చేసింది. దేశంలోనే అత్యంత అనుకూల పారిశ్రామిక గమ్యస్థానంగా తెలంగాణ ఉద్భవిస్తోంది. 2015-16లో రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం 11 శాతానికిపైగా పురోభివృద్ధి సాధించింది. జిల్లాల్లోనూ షీ టీమ్స్ శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం పోలీసు శాఖను ఆధునీకరించింది. హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రపంచ శ్రేణి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. 2014తో పోలిస్తే 2015లో నగరంలో నేరాల రేటు 14 శాతం మేర తగ్గింది. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు హైదరాబాద్‌లో ప్రవేశపెట్టిన షీ టీమ్‌లను జిల్లాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 108 ఇక మరింత పటిష్టంగా ఆరోగ్యరంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులను సమకూర్చనుంది. హైదరాబాద్‌లో నాలుగు కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రారంభించనుంది. 108 పథకానికి ఆధునిక ప్రాణ రక్షణ పరికరాలున్న మరిన్ని వాహనాలను చేర్చి పటిష్టపరచనుంది. 2016 సంవత్సరాన్ని నవజాత శిశువుల సంవత్సరంగా ప్రకటించిన ప్రభుత్వం శిశు మరణాల రేటు (ఐఎంఆర్)ను తగ్గించే చర్యలు ప్రారంభించింది. గ్రామ పంచాయతీలకు సాధికారత కల్పించేందుకు గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభించింది. పచ్చదనం, పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ‘స్వచ్ఛ భారత్’ చేపట్టబోతోంది. కొత్తగా 15,000 కి.మీ. రోడ్లు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు ఫోర్ లైన్ల రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు డబుల్ లైన్ల రోడ్లు, 358 కొత్త వంతెనలతో సహా మొత్తం 15,000 కిలోమీటర్ల పొడవు రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 1,650 కి.మీ.ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చింది. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పేదలు గౌరవప్రదంగా జీవించేందుకు, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు సింగిల్ బెడ్రూం గృహాల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అర్హులైన కుటుంబాలన్నింటికీ డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారి వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. పది జిల్లాల్లో ఇప్పటికే 60 వేల గృహాలను మంజూరు చేసింది. 2016-17లో జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో మరో లక్ష ఇళ్లను నిర్మించనుంది. ప్రతి ఇంటికీ నల్లా నీరు ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించే మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 6,100 గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు నీటి సరఫరా లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి ఫైబర్ కేబుల్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానం చేయనుంది. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. మొదటి దశలో ఆరు వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండో దశలో 9 వేల చెరువుల పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాదితో 75 శాతం రుణమాఫీ.. రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రుణమాఫీకి దశలవారీగా బ్యాంకులకు రూ.17,500 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాదితో 75 శాతం రుణమాఫీ పూర్తవుతుంది. వ్యవసాయ యంత్రాలకు, పరికరాలకు 50 శాతం సబ్సిడీ సమకూరుస్తోంది. సూక్ష్మసేద్యం సబ్సిడీని అన్ని వర్గాల రైతులకు ఒక హెక్టారు నుంచి అయిదు హెక్టార్లకు విస్తరించింది. పాలీహౌస్ ద్వారా కూరగాయలు, పూల సాగును ప్రోత్సహిస్తోంది. దీనికి 75 శాతం సబ్సిడీ సమకూరుస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతుల పాలీహౌజ్ వినియోగాన్ని పెంచేందుకు 95 శాతం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన అయిదు శాతాన్ని సబ్‌ప్లాన్ నుంచి సాయంగా అందిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యానవన పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు వీలుగా తెలంగాణ ఉద్యానవన అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాదికల్లా నిరంతర విద్యుత్ అంతరాయం లేని, నాణ్యమైన విద్యుత్‌ను అందించటం అద్భుతమైన విజయం. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 2016-17లో నిరంతర విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఉత్తమమైన సౌర విధానాన్ని రూపొందించింది. రాబోయే మూడేళ్లలో స్థాపిత సామర్థ్యాన్ని 23,912 మిలియన్ యూనిట్లకు తెచ్చే అభ్యుదయ కార్యక్రమం చేపట్టింది. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన భూమి, క్లియరెన్స్‌లు పొందే ప్రక్రియ కొనసాగుతోంది. కోటి ఎకరాలకు నీరే లక్ష్యం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఉద్దేశించిన భారీ సాగునీటి ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర వివాదాలు, అటవీ అనుమతుల సమస్యలతో కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీలైనంత త్వరలో కోటి ఎకరాలకు పైగా సాగు నీటిని అందించే లక్ష్యం ఎంచుకుంది. ప్రతి రైతు పొలానికి నీటిని అందించాలనే సంకల్పం సాగునీటి రంగంలో మైలురాయిగా నిలుస్తుంది. మారిన అవసరాలకు అనుగుణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు, మల్లన్నసాగర్, కొండా పోచమ్మ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది. -
'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసినా ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డిలు ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.... గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీపై ప్రస్తావనే చేయలేదన్నారు. వృద్ధిరేటు విషయంలో ప్రభుత్వం గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతుంటే దాని గురించి ఒక్క ముక్క మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వామని వారు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 14న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
విద్యార్థులతో ముచ్చటించిన గవర్నర్ నరసింహన్
రాజాం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో పర్యటిస్తున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాల, జీఎంఆర్ కేర్ ఆస్పత్రిను సందర్శించారు. జీఎంఆర్ ఐటీ కళాశాలలో విద్యార్థులతో నరసింహన్ కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన వెంట జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో పాటు అధికారులు ఉన్నారు. -
విశాఖ చేరుకున్న రాష్ట్రపతి
విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్లు విశాఖపట్నం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్‌లు ప్రణబ్ ముఖర్జీకి ఘనస్వాగతం పలికారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింథియా నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు వాహనాలను నిషేధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఆంక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
జూన్ నాటికి విద్యా సంస్థల్లో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి (జూన్) స్కూళ్ల నుంచి మొదలుకొని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు అన్నింటిలో వసతులు కల్పించడంతోపాటు నియామకాలను పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలసి విద్యా కార్యక్రమాలను వివరించారు. రూ. 1,500 కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామన్నారు. యూనివర్సిటీల్లో వైస్చాన్స్లర్ల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఈ నెలాఖరు కల్లా నియామకాలు పూర్తవుతాయన్నారు. పాఠశాలల్లో సరిపడ ఉపాధ్యాయులను నియమించేందుకు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీకి చర్యలు చేపడుతున్నామన్నారు. జూనియర్ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌కు చర్యలు చేపడుతున్నామన్నారు. సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని గవర్నర్‌కు నివేదించారు. -
రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు
-
రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి : గవర్నర్
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు రెండు దేశంలోనే ముందుండాలని ఆయన కోరుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌ను స్వయంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. -
ముగిసిన శీతాకాల విడిది.. ఢిల్లీకి బయల్దేరిన ప్రణబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప్రణబ్ రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్‌బేస్‌లో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు, మంత్రులు హకీంపేటకు చేరుకుని ఘనంగా ఆయనకు వీడ్కోలు పలికారు. వీరిలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన మనమడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పలువురు ప్రజాప్రతినిధులున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు ప్రణబ్ హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. 10 రోజుల పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి గౌరవార్థం మెన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేయగా, నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ తేనీటి విందును ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయుత మహాచండీయాగంలో పాల్గొనేందుకు వెళ్లగా.. ఆ సమయంలో యాగశాలలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రణబ్ హెలికాప్టర్లో వెనుదిరిగిన విషయం విదితమే. -
రేపటి నుంచి శీతాకాలం విడిదిలో రాష్ట్రపతి
శుక్రవారం నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర ప్రతి ప్రణబ్ ముఖర్జి తన శీతాకాల విడిదిలో బస చేయనున్నారు. ఏటా శీతాకాలంలో కొద్ది రోజుల పాటు.. హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో రాష్ట్రపతి బస చేయడం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18 తేదీ ఉదయం రాష్ట్ర పతి సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో కర్ణాటక లో పర్యటిస్తారు. కర్ణాటక పర్యటనలో భాగంగా గుల్బర్గాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక రెండో స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. అదే రోజు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ భవనాన్ని ప్రారంభించిన జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరుసటి రోజు బిషప్ కాటన్ బాలుర పాఠశాల 150వ వార్షికోత్సవానికి హాజరు కానున్నారు. తర్వాత స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కి శంఖుస్థాపన చేయనున్నారు. 25న భీమవరంలో టీటీడీ ఏర్పాటు చేసిన వేద పాఠశాల ను ప్రారంభించనున్నారు. 27న ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. అదే రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న ఆయత చండీ యాగంలో పాల్గొంటారు. 29న రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. కాగా రాష్ట్ర పతి పర్యటనలో చివరి రోజు.. డిసెంబర్ 30న రాష్ట్ర పతి సీనియర్ అధికారులు, రాష్ట్ర మంత్రులు, జర్నలిస్టులకు విందు ఇవ్వనున్నారు. కాగా.. ఇప్పటికే సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్ర పతి నిలయం.. ప్రణబ్ ముఖర్జి పర్యటన కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిలటరీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తైయ్యాయి. -
గవర్నర్‌ను కలిసిన కేసీఆర్ దంపతులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్‌కు వెళ్లి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తలపెట్టిన ఆయత చండీ మహా యాగంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను కేసీఆర్ దంపతులు ఆహ్వానించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఈ నెల 23 నుండి 27 వరకు కేసీఆర్ చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం విజయవాడకు వెళ్లిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి యాగానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
కోటప్పకొండలో గవర్నర్ ప్రత్యేక పూజలు
నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండలో వెలసిన శ్రీత్రికోటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నరసరావుపేట శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యలమండలో డంపింగ్ యార్డును ప్రారంభించిన అనంతరం అక్కడ ఉన్న డ్వాక్రా మహిళలతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు. -
రోగులకు నరకం చూపుతున్నారు
- రోగుల విషయంలో ‘కార్పొరేట్’ తీరు బాధాకరం: గవర్నర్ - అనవసర పరీక్షలు, చికిత్సలపై సీరియస్ - మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు - బతికుండగానే రోగికి నరకం చూపుతున్నారు - చిన్న సమస్యతో వెళ్తే నన్ను కూడా వదల్లేదు - వైద్య ఖర్చుల నియంత్రణకు నేనే చొరవ తీసుకుంటా - కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రత్యేకంగా భేటీ అవుతా - క్యాన్సర్ కేర్ ఇండియా-15 సదస్సులో వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: ‘‘రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చులు చూస్తుంటే భయమేస్తోంది. ఆర్థిక స్తోమత లేక చాలామంది వైద్యానికి దూరమవుతున్నారు. అనేకమంది రోగుల మృతికి ఇదే కారణం. కొందరు వైద్యులు సంపాదనే ధ్వేయంగా పని చేస్తున్నారు. బ్రెయిన్‌డెడ్ అయి, వ్యక్తి ఇక బతకడని తెలిసినా కూడా వైద్యం పేరుతో బిల్లులు వసూలు చేస్తున్నారు’’ అంటూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో రోగుల పట్ల కార్పొరేట్ ఆస్పత్రులు అనుసరిస్తున్న తీరు చూస్తే బాధగా ఉందన్నారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన‘అఖిల భారత క్యాన్సర్ కేర్-2015’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చికిత్సల పేరుతో రోగులను దోచుకుంటున్న వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగి బాధను అర్థం చేసుకునేందుకు కూడా వైద్యులు ప్రయత్నించడం లేదని, మనసు విప్పి మాట్లాడేందుకు కనీస సమయం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రోగి బాధను పూర్తిగా వినకుండానే వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఇటీవల నేను ఓ చిన్న సమస్యతో ఓ ఆస్పత్రికి వెళ్తే నలుగురు వైద్యులు నాకు టెస్టులన్నీ చేశారు. ఎక్స్‌రే కూడా తీశారు. తీరా ఏమీ లేదని తేల్చారు. అవసరం లేకపోయినా టెస్టులు రాస్తూ రోగులకు బతికుండగానే నరకం చూపుతున్నారు’’ అన్నారు. వైద్య సేవల్లో పారదర్శకత కోసం ఆస్పత్రి ఖర్చులపై కామన్ చార్ట్ ఏర్పాటు చే యాల్సిందిగా ఆస్పత్రులను తాను అనేకసార్లు కోరినా ఇప్పటిదాకా ఒక్కరూ స్పందించలేదంటూఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న చికిత్స వ్యయాన్ని నియంత్రించేందుకు తానే స్వయంగా చొరవ తీసుకుని కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. సంపాదనంతా ఆస్పత్రి ఖర్చులకే రాష్ట్రంలో వైద్యవిధానం బాగా లేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. సగటు మనిషి సంపాదనలో ఎక్కువ శాతం ఆస్పత్రి ఖర్చులకే అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆస్పత్రులు, వైద్యుల దృక్పథం మారాల్సిన అవసరముందన్నారు. ‘‘పలు ఆస్పత్రులు రాజకీయ నేతలకు, వీఐపీలకు వైద్య ఖర్చుల్లో రాయితీ ఇస్తున్నాయి. అదేదో నిరుపేద రోగులకు ఇస్తే బాగుంటుంది. చాలామంది వైద్యులు హైదరాబాద్‌ను తమ సొత్తుగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పేదలకు సేవచేయకుండా ఇక్కడే ఉంటున్నారు. ఇది చాలా బాధాకరం. వైద్యులు తాము పాటిస్తున్న నైతిక నియమావళిని సమీక్షించుకోవాల్సిన అవసరముంది. రోగుల దృష్టిలో వైద్యులు దైవంతో సమానం. వారి బాధను అర్థం చేసుకొని, బతుకుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత వైద్యులదే’’ అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్, టీబీ, మధుమేహం వంటి వ్యాధుల నిర్మూలనకు ప్రతి కార్పొరేట్ ఆస్పత్రీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఇందుకు కేటాయించాలని సూచించారు. ‘‘ఆస్పత్రులు తమ వైద్య సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రి ఒక్కో జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించాలి’’ అని సూచించారు. సదస్సులో క్యాన్సర్ కేర్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జేకే సింగ్, జనరల్ సెక్రటరీ రేణుసైగల్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి సీఈవో ఆర్పీ సింగ్, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ టీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
సలహాలివ్వడం జర్నలిస్టుల బాధ్యత
-
శ్రీవారి సేవలో గవర్నర్
గవర్నర్ నరసింహన్ గురువారం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత పుష్కరిణిలో పుణ్యజలాన్ని ప్రోక్షణం చేసుకుని భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం కులశేఖరపడి నుండి పచ్చకర్పూరపు వెలుగులో గర్భాలయ మూలమూర్తి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి పాదాలపై ఉంచిన పట్టు శేష వస్త్రాన్ని అర్చకులు గవర్నర్‌కు బహూకరించారు. అనంతరం నరసింహన్ వకుళమాతను దర్శించుకుని హుండీలో కానులు సమర్పించారు. - సాక్షి, తిరుమల -
చంద్రబాబును కలిసిన జయప్రద
విజయవాడ: సినీనటి జయప్రద సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. క్యాంప్ కార్యాలయంలో ఆమె...చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే తన కుమారుడు సిద్ధార్థ వివాహానికి రావాల్సిందిగా జయప్రద ఈ సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించారు. కాగా నిన్న ఆమె...రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివాహ పత్రిక అందచేశారు. కాగా హైదరాబాద్ కు చెందిన ప్రవల్లికా రెడ్డితో సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఇక సిద్ధార్ధ్ హీరోగా తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్ కాగా అందులో అతడి సరసన. హన్సిక కథానాయికగా నటించింది. -
'రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో వెలిగిపోవాలి'
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో వెలిగిపోవాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. బుధవారం రాజభవన్లో గవర్నర్ నరసింహన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ... ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతలు గుర్తించి ముందుకు సాగాలన్నారు. యూనివర్శిటీల్లో విద్యా ప్రమాణాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. వీసీలుచ ఛాన్సలర్ల నియామకం చాలా చిన్న విషయమన్నారు. -
మంచో, చెడో విభజన జరిగిపోయింది : నరసింహన్
హైదరాబాద్ : నిత్యం ఆనందంగా ఉండటమే నా ఆరోగ్య రహాస్యం అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. బుధవారం రాజభవన్లో గవర్నర్ నరసింహన్ జన్మదిన వేడుకులు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నరసింహన్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ విషయాన్ని అయినా మనసులోకి తీసుకోనని అన్నారు. పని ఒత్తిడి ఎంత ఉన్న శరీరంపై పడకుండా చూసుకుంటానని చెప్పారు. నిజాయితీ, చిత్తశుద్ధితో గవర్నర్‌గా విధులు కొనసాగిస్తున్నానని తెలిపారు. మంచో, చెడో కాని రాష్ట్ర విభజన జరిగిపోయింది... ఈ విభజనను అందరూ అంగీకరించాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఎవరైనా ఆగ్రహంతో నాపై విమర్శులు చేస్తే వాటిని పట్టించుకోనన్నారు. అయితే హైదరాబాద్‌లో ఓటర్ల తొలగింపు తన పరిధిలోకి రాదని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని తెలిపారు. అలాగే యూనివర్శిటీల వీసీల నియామకం సజావుగా జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. -
గన్నవరం చేరుకున్న నరసింహన్
విజయవాడ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నరసింహన్ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి చేరుకున్నారు. -
'గవర్నర్ గారు శంకుస్థాపనకు రండి'
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానపత్రిక అందజేశారు. ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు.. గవర్నర్‌ను ఆహ్వానించారు. అంతకుముందు చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ నెల 22న గుంటూరులో రాజధాని శంకుస్థాపన జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. -
గవర్నర్, కేసీఆర్‌లతో భేటీ కానున్న చంద్రబాబు
-
గవర్నర్, కేసీఆర్‌లతో భేటీ కానున్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావులతో సమావేశం కానున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబు.. నరసింహన్, కేసీఆర్‌లను ఆహ్వానించనున్నారు. చంద్రబాబు వీరిద్దరికీ ఆహ్వాన పత్రికలు అందజేస్తారు. ఈ నెల 22న ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
రేపు గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆదివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో సమావేశంకానున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా గవర్నర్‌ను ఆహ్వానించనున్నారు. చంద్రబాబు ఆహ్వాన పత్రికను.. గవర్నర్‌కు అందజేయనున్నారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కూడా చంద్రబాబు స్వయంగా కలసి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు. -
'గాంధీ జయంతి' కి రండి
గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న గాంధీ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానిం చారు. గురువారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, రైతు ఆత్మహత్యలపై సభలో చర్చ, తీసుకున్న నిర్ణయాల గురించి గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది. -
నరసింహన్‌తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. చైనా పర్యటన ముగించుకుని ఇటీవల నగరానికి తిరిగొచ్చిన కేసీఆర్ మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసినట్టు సమాచారం. చైనా పర్యటన విశేషాలతో పాటు రాష్ట్ర విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. -
‘ఉల్లి’తో తీరనున్న తగువు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ లొల్లిని త్వరలో ఉల్లి తీర్చబోతుందట. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీర్చలేని రెండు రాష్ట్రాల తగువును ఉల్లి ఎలా తీరుస్తుందనుకుంటున్నారా...! రెండు రాష్ట్రాల నడుమ ప్రధాన తకరారు అయిన ఎంట్రీ ట్యాక్స్ వివాదం ఇప్పుడు ఓ కొలిక్కి రానుందట. ఇరు రాష్ట్రాలు ఎంట్రీ ట్యాక్స్ వివాదంపై కౌంటర్ సిగ్నేచర్ ఒప్పందం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయట. తకరారు పరిష్కారానికి అసలు కారణం ఉల్లి కొరతేనని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత కారణంగా తెలంగాణ నుంచి ఏపీకి ఉల్లి కోసం లారీలు అధిక సంఖ్యలో వెళుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు అధిక సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి లారీలు వెళుతున్నాయి. సరిహద్దు దాటేందుకు తెలంగాణ లారీలు ఏపీ రవాణా శాఖకు రూ.6 వేలు చెల్లించాల్సి వస్తుంది. ఈ భారం ఉల్లి వినియోగదారులపై మోపుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఎంట్రీ ట్యాక్స్ విషయంలో కౌంటర్ సిగ్నేచర్ విధానం పాటిద్దామని ప్రతిపాదించింది. ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే ఎంట్రీ ట్యాక్స్ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కేంద్రానికి, గవర్నర్‌కు ఫిర్యాదులు చేసినా లాభం లేని లొల్లి ఉల్లితో తీరబోతోంది. ప్రభుత్వాలు పడగొట్టిన చరిత్ర ఉన్న ఉల్లికి ప్రభుత్వాల్ని కలిపే శక్తి కూడా ఉందన్న మాట. రెండు రాష్ట్రాలు అవగాహనతో ముందుకెళితే అక్టోబర్ నుంచి రెండు రాష్ట్రాల ప్రధాన వివాదం ఎంట్రీ ట్యాక్స్ కొలిక్కి వస్తుంది. -
గవర్నర్ మార్పుకు రంగం సిద్ధం !
-
ఇ.ఎస్.ఎల్.నరసింహన్ రాయని డైరీ
వదిలి వెళ్లడమా? వదిలించుకుని వెళ్లడమా? రెండూ గౌరవమే. రెండోది మరింత గౌరవం. వదిలి వెళ్లాలంటే మోదీజీ చెవిలో ఎవరైనా ఊదాలి... ‘ఇంకా ఎన్నాళ్లు ఆ నరసింహన్’ అని! సంఘ్ పరివార్‌లో సమర్థులకు కొదవా?! ఈపాటికి ఊదే ఉంటారు. ఆయనా వినే ఉంటారు. గవర్నర్‌ని మార్చడానికి టూ థర్డ్ మెజారిటీ అవసరం లేదు. ఆర్డినెన్సులు, ఇంపీచ్‌మెంట్‌లు, రెఫరెండమ్‌లు అక్కర్లేదు. ఒకవేళ అవి ఉన్నా, మోదీజీ వంటి రాజనీతిజ్ఞులు కిందామీద పడే అగత్యం లేదు. ఇక్కడ తీసి అక్కడ పెట్టడమే. బహుశా బిహార్ ఎన్నికలయ్యాక.. అక్టోబర్లోనో, నవంబర్లోనో ఇక్కడి తీసి అక్కడ పెడతారేమో మోదీజీ. తియ్యడం ఆయనకు పెద్ద పని కాదు. అలాగని పెట్టడ మూ చిన్న పనేం కాదు. ఒకరిద్దరున్న పరివారం కాదు కదా బీజేపీ అండ్ కో. టైమ్ పడుతుంది. అంతవరకు ఆగి వెళ్లడమా? అంతకు ముందే వెళ్లిపోవడమా? నేను వదిలి వెళ్లినా, వదిలించుకుని వెళ్లినా చంద్రబాబు సంతోషిస్తాడు. చంద్రశేఖర్రావూ సంతోషిస్తాడు. ఆయన మంత్రులూ సంతోషిస్తారు. ఈయన మంత్రులూ సంతోషిస్తారు. మంత్రులు, ముఖ్యమంత్రులు సంతోషంగా ఉండాల్సిందే. కానీ వాళ్ల సంతోషం కోసం రాష్ట్ర గవర్నర్ సంతోషాన్ని హరిస్తామంటే ఎలా?! అలుగుతారు. ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీడియాకు స్టేట్మెంట్లు ఇస్తారు. నాతో మాత్రం ముక్క మాట్లాడరు. రెండు వైపుల పదునైన కత్తిలాంటి గవర్నర్ పోస్టు... వీళ్ల దెబ్బకి రెండు పడవల మీది ప్రయాణం అయింది. పౌరుడికి గానీ, ప్రథమ పౌరుడికి గానీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే సరిపోయిందా? వినేవాళ్లు ఉండొద్దా? చంద్రబాబు వినడు, చంద్రశేఖర్రావూ వినడు. కేసీఆర్‌కి ఫేవర్‌గా ఉన్నానని చంద్రబాబు అనుమానం. చంద్రబాబుతో ఫ్రెండ్లీగా ఉంటున్నానని కేసీఆర్ అభ్యంతరం. హైదరాబాద్ ఇద్దరిదీ అని, గవర్నర్ ఇద్దరివాడు అని వీళ్లకు గుర్తున్నట్టు లేదు! రాజ్‌భవన్‌కి ఆయనొస్తే ఈయన రాడు. ఈయనొస్తే ఆయన రాడు. వచ్చినా, నా మొహం చూస్తుంటారు తప్ప మొహమొహాలు చూసుకోరు! పిల్లలా? ముఖ్యమంత్రులా? ఇండిపెండెన్స్ డే ‘ఎట్-హోమ్’కి ఇద్దరూ డుమ్మా కొట్టారు. కోపాలుంటే మాత్రం సంప్రదాయాల్ని మర్చిపోతామా? ఢిల్లీ నుంచి అజిత్ దోవల్ ఫోన్ చేశాడు. ఐపీఎస్‌లో నా బ్యాచ్‌మేట్. ‘ఏంటి గురూ... ఏదో వింటున్నా’ అన్నాడు. ‘ఏం విన్నావ్?’ అన్నాను. ‘కొత్త గవర్నర్ వస్తాడంట’ అన్నాడు. నవ్వాను. తిరుమల బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ఉంటాయి. ఫ్యామిలీని తీసుకుని రారాదూ’ అన్నాను. అజిత్ వస్తే అటు కనకదుర్గమ్మ నవరాత్రులకూ వెళ్లి రావచ్చు. తెలంగాణ మూవ్మెంట్ ఉన్నంత కాలం ‘ఈ గవర్నర్ యాంటీ తెలంగాణ’ అన్నారు తెలంగాణ నాయకులు. తెలంగాణ వచ్చాక, ‘ఈ గవర్నర్ యాంటీ ఆంధ్రా’ అంటున్నారు ఆంధ్రా నాయకులు. ఎక్కడైనా గవర్నర్ పాలన ఉంటుంది. ఇక్కడేమిటో యాంటీ గవర్నర్ పాలన! -మాధవ్ శింగరాజు