
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ‘శ్రీరామ నవమి’ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని వారు ఆకాంక్షించారు. లోక కల్యాణమే పరమావధిగా సాగిన శ్రీరాముడి పాలనే ఆదర్శమన్నారు.