సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచుకుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2023
సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న
పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment