Andhra Pradesh CM YS Jagan Sri Rama Navami Wishes To Telugu People - Sakshi
Sakshi News home page

మాట ఇస్తే తప్పని నైజం.. రామరాజ్యమే స్ఫూర్తిదాయకం: సీఎం జగన్‌

Published Wed, Mar 29 2023 7:26 PM | Last Updated on Thu, Mar 30 2023 2:33 PM

Cm Ys Jagan Srirama Navami Wishes Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గం. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని ట్వీట్‌లో పేర్కొన్నారాయన. 

అంతకు ముందు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘‘నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు.

భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement