
వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హేవళంబి సంవత్సరం అందరి ఇంటా సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
తెలుగు సంవత్సర తొలి పండగ.. అందిరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపి ఆనందం తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
మీకు మీ కుటుంబానికి శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 29 March 2017