కందాతో ఒరేయ్ అని పిలిపించుకోవడం ఇష్టం
► గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య
► కందా రాసిన ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబెల్స్’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా నిజమైన కర్మయోగి అని గవర్నర్ నరసింహన్
వ్యాఖ్యానించారు. సివిల్ సర్వెంట్‌గా తన జీవితంలో ఎదురైన అనుభవాలతో కందా రాసిన ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబ్బెల్స్’ పుస్తకాన్ని మంగళవారమిక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)లో గవర్నర్ ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోహన్ కందా, తాను సివిల్ సర్వీసెస్‌లో(1968) ఒకే బ్యాచ్‌కు చెందిన వారమని చెప్పారు. మోహన్ కందా సబ్ కలెక్టర్‌గా, తాను ఎస్పీగా ఒంగోలు జిల్లాలో కలిసి పనిచేసి ఎన్నో సమస్యలను సమన్వయంగా పరిష్కరించామన్నారు.
జ్ఞానీ జైల్‌సింగ్ నుంచి అబ్దుల్ కలాం వరకు విభిన్నమైన వ్యక్తిత్వం, లక్షణాలు కలిగిన పలువురు నాయకుల వద్ద పనిచేసిన మోహన్ కందా వారందరి మన్ననలు పొందారన్నారు. ‘‘మోహన్ తో గౌరవనీయ గవర్నర్ అని కాకుండా.. అప్పటిలాగే ఒరేయ్ వినరా.. ఒరేయ్ ఉండరా.. అని పిలిపించుకోవడమే నాకు సంతోషంగా ఉంటుంది. మోహన్ వ్యవసాయంపైనా విశేషమైన పట్టు సాధించారు. ఏదైనా విషయాన్ని ఇతరులకు వివరించేటపుడు ఒక కథతో మొదలెట్టడం మోహన్ లో అందరికీ బాగా నచ్చే విషయం. మా ఇద్దరికీ పొగడ్తలంటే ఇష్టం ఉండదు. పుస్తకావిష్కరణలో ఏమని పొగడాలో చెప్పమని అడిగితే.. ‘పొగిడేందుకు ఏమీ లేదు’ అని మోహన్ చెప్పారు’’ అని గవర్నర్ అన్నారు.
కనీస అవసరాలపై దృష్టి ఏదీ: కందా
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న నేతలందరూ తనకంటే చిన్నవారేనని, నేతలంతా పెద్ద ఆలోచనలు చేస్తేనే గొప్ప పనులు సాధ్యమవుతాయని మోహన్ కందా అన్నారు. పెద్దపెద్ద ప్రాజెక్ట్‌లు, రాజధాని నగరాలను నిర్మిస్తామని చెబుతున్న నాయకులు.. ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటై రెండున్నరేళ్లు గడిచినందున మరో రెండున్నరేళ్లలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు, పసిపిల్లలకు పౌష్టికాహారం, మహిళలకు భద్రత, ప్రజారోగ్యం.. తదితర సదుపాయాల కల్పన కోసమైతేనే తనను కలవాలని నేతలకు చెప్పాలని గవర్నర్‌కు సూచించారు.
నేటి తరానికి మార్గదర్శి
ఆస్కీ డైరెక్టర్ పద్మనాభయ్య మాట్లాడుతూ.. మోహనరసింహన్ కందా రాసిన పుస్తకం నేటి తరం బ్యూరోక్రాట్లకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. చేపట్టిన బాధ్యతలను బరువుగా కాకుండా క్రీడాస్ఫూర్తితో నిర్వహించడం ఎలాగో మోహనరసింహన్ కందాను చూసి నేర్చుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మోహనరసింహన్ కందా పనిచేసినప్పటి నాయకుల, అధికారుల పాత్రలు, రోజువారీ జీవితంలో సామాన్యులతో జరిగిన సంఘటనల సమాహారమే ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబ్బెల్స్’ అని వివరించారు. లైఫ్ త్రూ ఎ హైదరాబాదీస్ లుకింగ్ గ్లాస్ ట్యాగ్‌లైనరసింహన్ తో మోహనరసింహన్ కందా రాసిన ఈ పుస్తకాన్ని కోల్‌కతాకు చెందిన సంపత్ పబ్లికేషన్ ప్రచురించింది. కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.