![starbucks new ceo laxman narasimhan takes his seat - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/22/starbucks.jpg.webp?itok=UCFPCdM_)
న్యూయార్క్: అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల జాబితా మరింతగా పెరుగుతోంది. తాజాగా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన డైరెక్టర్ల బోర్డులో కూడా చేరతారని సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: 31 వేల మంది పైలట్లు కావాలి.. భవిష్యత్‌లో ఫుల్ డిమాండ్
మార్చి 23న జరిగే స్టార్‌బక్స్ వార్షిక షేర్‌హోల్డర్ల సమావేశానికి ఆయన సారథ్యం వహిస్తారు. కంపెనీ అధిక వృద్ధి బాటలో నడిపించేందుకు భాగస్వాములందరితో కలిసి పని చేయనున్నట్లు నరసింహన్ తెలిపారు. గత సీఈవో హొవార్డ్ షుల్జ్ స్థానంలో నరసింహన్ నియామకాన్ని స్టార్‌బక్స్ గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది.
ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు!
పుణె విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన నరసింహన్ అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. బహుళజాతి దిగ్గజాలు మెకిన్సే అండ్ కంపెనీ, పెప్సీకో, రెకిట్ బెన్‌కిసర్ వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. నరసింహన్‌కు 30 ఏళ్ల పాటు కన్జూమర్ గూడ్స్ వ్యాపార విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉంది.
ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment