Starbucks
-
నెలకు రూ.260 కోట్ల జీతం: ఎవరీ సీఈఓ తెలుసా?
ఎక్కువ జీతాలు తీసుకునే సీఈఓలు ఎవరంటే? టక్కున చెప్పే సమాధానం.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్. అయితే వీరి కంటే ఎక్కువ జీతం తీసుకున్న ఓ వ్యక్తి ఒకరున్నారని బహుశా.. కొంతమందికి తెలిసుండకపోవచ్చు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన జీతం ఎంత? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.యాపిల్, గూగుల్ చీఫ్‌లు ఒక్కొక్కరు దాదాపు 75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 646 కోట్లు) ప్యాకేజ్ తీసుకుంటారు. కానీ ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks) సీఈఓ 'బ్రియాన్ నికోల్'(Brian Niccol) మాత్రం ఏకంగా 96 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం తీసుకుంటున్నారు. అంటే ఆయన జీతం సుమారు రూ. 827 కోట్లు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.గత ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో కంపెనీలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ నికోల్.. జీతంలో దాదాపు 94 శాతం స్టాక్ అవార్డుల నుంచి వచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన కంపెనీలో చేరిన నెల రోజుల తరువాత 5 మిలియన్ డాలర్ల సైన్ ఆన్ బోనస్ కూడా పొందారు. దీంతో అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓలలో నికోల్ ఒకరుగా నిలిచారు.సెప్టెంబర్ 2024లో నికోల్ బాధ్యతలు తీసుకున్నప్పుడు.. కంపెనీ ఆయన వార్షిక వేతన ప్యాకేజీ విలువ సుమారు 113 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే సీఈఓగా చేరిన కేవలం నాలుగు నెలల్లో 96 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు. గత ఏడాది స్టార్‌బక్స్ వరుస నష్టాలను చవి చూసిన సమయంలో.. సంస్థ భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగించి, ఆ స్థానంలో నికోల్‌ను నియమించింది.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
‘భారత్ మార్కెట్‌కు కట్టుబడి ఉన్నాం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఒకటైన భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు కట్టుబడి ఉన్నామని కేఫె చెయిన్ సంస్థ టాటా స్టార్‌బక్స్ వెల్లడించింది. భారత్ నుంచి స్టార్‌బక్స్ నిష్క్రమిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 76 నగరాల్లో 470 పైచిలుకు స్టోర్స్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించింది. టాటా గ్రూప్‌లో ఎఫ్ఎంసీజీ విభాగమైన టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్), అమెరికాకు చెందిన స్టార్‌బక్స్ కార్పొరేషన్ కలిసి జాయింట్ వెంచర్‌గా టాటా స్టార్‌బక్స్‌ను ఏర్పాటు చేశాయి. నిర్వహణ వ్యయాలు భారీగా ఉండటం, నష్టాలు పెరిగిపోతుండటం, మార్కెట్లో చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా స్టార్‌బక్స్ భారత్ నుంచి నిష్క్రమించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.ఇదీ చదవండి: సోలారే సోబెటరూ..రెస్టారెంట్ బ్రాండ్స్ క్విప్‌నకు సైన్యూఢిల్లీ: రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్(గతంలో బర్గర్ కింగ్ ఇండియా) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల జారీ(క్విప్) చేపట్టనుంది. తద్వారా రూ. 500 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి ఈక్విటీ షేర్లు లేదా క్విప్‌నకు వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలియజేసింది. 2024 ఉద్యోగులకు షేర్ల కేటాయింపు(ఇసాప్)నకు సైతం బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా అర్హులైన డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులకు స్టాక్ ఆప్షన్లను జారీ చేయనున్నట్లు వివరించింది. ఇసాప్‌లో భాగంగా దాదాపు 1.05 కోట్ల ఆప్షన్స్‌ను గరిష్టంగా ఆఫర్ చేసే వీలున్నట్లు తెలియజేసింది. -
మూడు రోజులకు ఒక టాటా స్టార్‌బక్స్
ముంబై: టాటా కన్జ్యూమర్, స్టార్‌బక్స్ జాయింట్ వెంచర్ కంపెనీ టాటా స్టార్‌బక్స్ (కాఫీ ఔట్లెట్స్) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రతి మూడు రోజులకు ఒక కొత్త స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. 2028 నాటికి దేశవ్యాప్తంగా తమ నిర్వహణలోని స్టోర్లను 1,000కి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. స్థానిక భాగస్వాములకు నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించడం, కొత్త స్టోర్ల ప్రారంభంతో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడం, ప్రపంచవ్యాప్తంగా స్టార్‌బక్స్ కస్టమర్లు భారత కాఫీ రుచులను ఆస్వాదించేలా ప్రోత్సహించడం తమ విధానంలో భాగంగా ఉంటాయని వెల్లడించింది. ఇరు సంస్థలు 2012లో చెరో సగం వాటాతో కూడిన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 పట్టణాల్లో 390 స్టోర్లను నిర్వహిస్తూ, 4,300 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2028 నాటికి వెయ్యి స్టోర్ల లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తామని, ఎయిర్పోర్టుల్లోనూ స్టోర్లను ప్రారంభిస్తామని, ఉద్యోగుల సంఖ్యను 8,600కు పెంచుకుంటామని ప్రకటించింది. మహిళలకు శిక్షణ ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్అండ్బీ) పరిశ్రమలో కెరీర్ కోరుకునే మహిళలకు వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నట్టు టాటా స్టార్‌బక్స్ ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలో స్టోర్లలో పనిచేస్తూనే నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న తొలి ఎఫ్అండ్బీ కంపెనీ తమదేనని పేర్కొంది. -
వైజాగ్‌లో స్టార్‌బక్స్.. నోరూరించే మెనూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాఫీ విక్రయాల్లో ఉన్న టాటా స్టార్‌బక్స్ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో స్టోర్‌ను తెరిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థ కేంద్రాలున్న నగరాల సంఖ్య 45కు చేరుకుంది. ఏపీలో ఇప్పటికే కంపెనీకి విజయవాడలో ఔట్లెట్ ఉంది. టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో 2012లో భారత్‌లో ప్రవేశించిన స్టార్‌బక్స్‌కు దేశవ్యాప్తంగా 350 స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్‌లో అనుకూలమైన ఎంపికల శ్రేణిని టాటా స్టార్‌బక్స్ పరిచయం చేస్తోంది. కొత్త పిక్కో కప్ సైజుతో సహా, కాఫీ ప్రియులకు ఫేవరెట్ పానీయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫిల్టర్ కాఫీ, మసాలా చాయ్, ఏలకుల చాయ్, మిల్క్‌షేక్‌లు, శాండ్విచ్లను ఆకర్షణీయమైన ఆఫర్లతో అందిస్తోంది. -
బంఫర్ ఆఫర్ అంటే ఇదే! జాబ్ నుంచి తీసేసినందుకు రూ.210 కోట్లు వచ్చాయ్
వాషింగ్టన్: జాతివివక్ష నెపంతో తనను జాబ్ నుంచి తొలగించారని ఓ ఉద్యోగిని వేసిన కేసులో ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉద్యోగినికి 25.6 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.210కోట్లు) చెల్లించాలని ఫెడరల్ జ్యూరీ సంస్థను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్స్ అనే మహిళ పని చేస్తున్న దుకాణంలో ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. కాసేపటి తర్వాత వారిలో ఒకరు దుకాణంలోని వాష్‌రూంని వాడుకుంటామని ఆమెను అడిగారు. అయితే స్టోర్‌లో ఏమి కొనుగోలు చేయన కారణంగా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. అయితే తాము వ్యాపారం పని మీద ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నామని వాళ్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్టోర్ సిబ్బంది.. వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని సూచించగా.. అందుకు వారిద్దరూ నిరాకరించారు. చివరికి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడం.. అది కాస్త వైరల్ కావడంతో తీవ్ర నిరసనకు దారితీసింది. ఆ ఆందోళనలు సద్దుమణిగేలా చేసేందుకు సంస్థ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రీజినల్ మేనేజర్ షానన్ ఫిలిప్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించి.. దుకాణ మేనేజర్‌ను మాత్రం విధుల్లోనే ఉంచింది. రీజినల్ మేనేజర్ శ్వేత జాతీయురాలు కాగా, మేనేజర్ నల్ల జాతీయుడు కావడం గమనార్హం. శ్వేతజాతీయురాలినైన తనపై జాతి వివక్ష ప్రదర్శించి శిక్షించారంటూ ఆమె 2019లో స్టార్‌బక్స్‌పై దావా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యూజెర్సీలోని ఫెడరల్ జ్యూరీ.. స్టార్‌బక్స్ సంస్థకు 25.6 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది. చదవండి: ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం! -
అంబానీ Vs టాటా: కొత్త వ్యాపారంలోకి అంబానీ, నటి సారా సందడి!
సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. గతంలో ఎన్నడూ చూడని వేగంతో ఇటీవలి కాలంలో రిలయన్స్ గ్రూప్ అనేక కొత్త వ్యాపారాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా రిలయన్స్ బ్రిటిష్ కాఫీ షాప్ ప్రెట్ ఎ మ్యాంగర్‌ను దేశానికి తీసుకురావడం ద్వారా టాటాతో పోటీకి సౌ అంటోంది. దీనికి సంబంధించి బ్రిటీష్ శాండ్విచ్ అండ్ కాఫీ చైన్ 'ప్రెట్ ఎ మాంగర్' తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ బ్రిటిష్ కాఫీ భాగస్వామ్యంలో ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో మేకర్ మ్యాక్సిటీలో ప్రీట్ ఎ మ్యాంగర్ తన తొలి అవుట్లెట్ ప్రారంభమైంది. ప్రెట్ ఎ మేంగర్ షాప్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పాల్గొన్నారు. ముంబై షాప్ 2,567 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద డైనింగ్ స్పేస్‌తో ఉన్న ప్రెట్ ఐకానిక్ స్టోర్ లాంచింగ్‌పై సారా కాఫీ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. కాఫీ అంటే చాలా ఇష్టమని నాన్నతో కలిసి లండన్‌లోని ప్రెట్ స్టోర్‌ని చాలాసార్లు సందర్శించాను ఇపుడిది మన దేశానికి రావడం ఆనందంగా ఉందని పేర్కొంది. (లేఆఫ్స్ ఆందోళనల మధ్య: గూగుల్ సీఈవో షాకింగ్ వేతనం) రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యం కోసం గత ఏడాది బ్రిటిష్ యజమానితో డీల్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 ప్రీట్ ఎ మాంగర్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. తొలి ఏడాదిలోనే పది 'ప్రెట్ ఎ మ్యాంగర్' స్టోర్లను ప్రారంభించనున్నామని రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. రిలయన్స్ బ్రాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దర్శన్ మెహతా, యూకే బ్రాండ్ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ప్రాధాన్యతలు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం ప్రెట్ బ్రాండ్‌ను రిలయన్స్ ద్వారా లాంచ్ చేయడం ఆనందమని బృందంతో ప్రెట్ ఎ మాంగర్ సీఈవో పనో క్రిస్టౌ తెలిపారు. చాలా కాలంగా ఇండియాకు రావాలనేది లక్ష్యం. ముంబైలో తొలి స్టోర్‌ను లాంచ్ చేయడం తమ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలలో ఒక మైలురాయని చెప్పారు. యుఎస్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ దేశంలో తన తొలి రెండు స్టోర్లను ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ప్రెట్ ఎ మ్యాంగర్స్ ఇండియన్ స్టోర్‌ను ప్రారంభించడం విశేషం. టిమ్ కుక్ ఇండియా టూర్లో భాగంగా ముంబైలోని ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల ఆంటిలియాని ఇంటిని కూడా సందర్శించారు. కాగా 1986లో లండన్‌లో ప్రారంభమైన ప్రెట్ ఎ మాంగర్ యూఏ, అమెరికా హాంకాంగ్, ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, సింగపూర్ జర్మనీతో సహా దేశాల్లో దాదాపు 550 దుకాణాలను నిర్వహిస్తోంది. అలాగే టాటా స్టార్‌బక్స్‌కు 30 నగరాల్లో 275 స్టోర్లున్నాయి. 50 శాతం వాటాతో అమెరికన్ కాఫీ చైన్నునిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాటాలు కొత్తగా రికార్డు స్థాయిలో 50 స్టోర్లను ప్రారంభించారు. 2025 నాటికి దేశీయ కాఫీ మార్కెట్ 4.2 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. -
స్టార్‌బక్స్ సీఈవోగా నరసింహన్
న్యూయార్క్: అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల జాబితా మరింతగా పెరుగుతోంది. తాజాగా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన డైరెక్టర్ల బోర్డులో కూడా చేరతారని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: 31 వేల మంది పైలట్లు కావాలి.. భవిష్యత్‌లో ఫుల్ డిమాండ్ మార్చి 23న జరిగే స్టార్‌బక్స్ వార్షిక షేర్‌హోల్డర్ల సమావేశానికి ఆయన సారథ్యం వహిస్తారు. కంపెనీ అధిక వృద్ధి బాటలో నడిపించేందుకు భాగస్వాములందరితో కలిసి పని చేయనున్నట్లు నరసింహన్ తెలిపారు. గత సీఈవో హొవార్డ్ షుల్జ్ స్థానంలో నరసింహన్ నియామకాన్ని స్టార్‌బక్స్ గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! పుణె విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన నరసింహన్ అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. బహుళజాతి దిగ్గజాలు మెకిన్సే అండ్ కంపెనీ, పెప్సీకో, రెకిట్ బెన్కిసర్ వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. నరసింహన్‌కు 30 ఏళ్ల పాటు కన్జూమర్ గూడ్స్ వ్యాపార విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ -
ఒక్క డాలర్ కోసం జైలు పాలయ్యాడు.. అదీ భార్య వల్ల!
వాషింగ్టన్: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్‌బక్స్ అనే కాఫీ స్టోర్ తన భార్యకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్‌లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే. ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. రిచర్డ్ ఎంగెల్(61) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్మోండ్లోని ఈస్ట్ మెమోరియల్ రోడ్లో ఉన్న స్టార్‌బక్స్ కాఫీ స్టోర్‌కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్‌కి వెళ్లి తనకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్ ఇవ్వడం కుదరదని స్టోర్ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్‌తో గొడవ పడ్డాడు ఎంగెల్. తన భార్యకు రావాల్సిన రీఫండ్‌ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్‌పై ఉన్న టిప్ జార్‌ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్. అయితే, ఆ టిప్ జార్లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఎంగెల్ను అనుసరించిన స్టోర్ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఎంగెల్ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నా..! -
మన కాఫీ, దోసెకు ఆయన కూడా ఫిదా
వైరల్: ఖరీదైన కాఫీని అంతే హంగులున్న కప్‌తో సిప్‌చేస్తూ..ఆ ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే!. సోషల్ మీడియాలో బిల్డప్ రాయుళ్ల వేషాలు ఇలాగే ఉంటాయి. అయితే.. ఆ ఖరీదైన కాఫీ వెనుక ఉన్న వ్యక్తే.. సాదాసీదా వ్యవహారంతో వార్తల్లో నిలిస్తే!. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఖరీదైన కాఫీ వ్యవహారం స్టార్‌బక్స్ గురించి!. ప్రపంచంలోనే ఖరీదైన కాపీ దుకాణాల్లో ఒకటి. అలాంటి స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సెయిగ్ల్ భారత్‌కు వచ్చారు. అంతేకాదు.. బెంగళూరులో ఓ హోటల్‌ను సందర్శించడమే కాదు.. అక్కడి రుచులను ఆస్వాదించారు కూడా. బెంగళూరులో చాలాకాలంగా విద్యార్థి భవన్ ఫేమస్. 1943లో ఓ చిన్ని హోటల్‌గా మొదలైంది అది. ఇప్పుడది బెంగళూరులో అత్యంత ఫేమస్ హోటల్లో ఒకటి. అక్కడికి విచ్చేశారు జెవ్ సెయిగ్ల్. అంతేకాదు.. ఆ హోటల్లో జనాలు ఎగబడి తినే మసాలా దోసెను, ఫిల్టర్ కాఫీని ఆస్వాదించారు కూడా. ఆపై అక్కడి గెస్ట్ బుక్‌లో.. తన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని సియాటెల్‌కు మోసుకెళ్తానంటూ బుక్‌లో రాశారాయన. అమెరికా వ్యాపారవేత్త అయిన జెవ్ సెయిగ్ల్.. 1971లో స్టార్‌బక్స్‌ను స్థాపించిన వాళ్లలో ఒకరు. ఆపై వైఎస్ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. 2022 గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కోసం ఆయన బెంగళూరు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మన ఫిల్టర్ కాఫీ, మసాలా దోసెలకు ఆయన ఫిదా అయ్యారు. చైనీస్, పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బానిసలవుతున్న ఈ తరం.. మన ఆహారపు అలవాట్ల వైపు మళ్లాలంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Vidyarthi Bhavan (@vidyarthibhavan) -
స్టార్‌బక్స్ సీఈవో లక్ష్మణ్ నరసింహన్ జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీనిపై ఆనంద్ మహీంద్రా లాంటి పలువురు వ్యాపార దిగ్గజాలు భారతీయ బిజినెస్ లీడర్స్ సురక్షితమైన, ప్రతిభావంతమైన వారుగా పాపులర్ అతున్నారని వ్యాఖ్యానించారు. ఇది చదవండి : Laxman Narasimhan:స్టార్‌బక్స్ సీఈవో ఇన్స్పైరింగ్ జర్నీ..ఫిదా అవ్వాల్సిందే! 2023 ఏప్రిల్ నుంచి సీఈవోగా పూర్తి బాధ్యతలను స్వీకరించనున్న లక్ష్మణ్ నరసింహన్ వార్షిక మూల వేతనంగా 1.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10 కోట్లు) తీసుకుంటారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్టార్‌బక్స్ పేర్కొంది. అలాగే సుమారు 12 కోట్ల రూపాయల బోనస్‌తో పాటు 9.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 73 కోట్లు) విలువైన ఈక్విటీ గ్రాంట్‌ను కూడా అందుకుంటారు. 2023 ఆర్థిక సంవత్సరం నుండి, 13.6 మిలియన్ డాలర్లకు (రూ. 107 కోట్లకు పైగా) సమానమైన వార్షిక ఈక్విటీ అవార్డును పొందనున్నారు. కాఫీతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చివేసిన సాటిలేని మేటి కంపెనీ ఎదిగిన స్టార్‌బక్స్‌లో చేరడం సంతోసంగా ఉందని నరసింహన్ ప్రకటించారు. నిబద్ధతతో సేవలందిస్తూ ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకునే బ్రాండ్ స్టార్‌బక్స్ అని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న, మారుతున్న, డిమాండ్స్ తీర్చడానికి మరింత బలమైన భవిష్యత్తు పెట్టుబడులు పెడుతున్న కీలక సమయంలో దిగ్గజ కంపెనీ స్టార్‌బక్స్‌లో చేరడం గౌరవంగా భావిస్తానన్నారు. -
పోలీసుల నిర్వాకం.. గర్భిణి ఖైదీకి గర్భస్రావం, పరిహారంగా రూ. 3 కోట్లు
Pregnant Inmate Suffered Miscarriage As Cops Stopped At Starbucks: అమెరికాలో ఆరెంజ్ కౌంటీ జైలులో ఉన్న మహిళా ఖైదీకి పోలీసుల నిర్లక్ష్యం కారణంగా గర్భస్రావం అయ్యింది. దీంతో కోర్టు బాధిత మహిళకు పరిహారంగా రూ. 3 కోట్లు చెల్లించమని జైలు అధికారులను ఆదేశించింది. వాస్తవానికి 2016లో సదరు మహిళా ఖైదీ 28 ఏళ్ల సాండ్రా క్వినోన్స్కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైంది. ఐతే ఆమె ఆ బెయిల్ నియమాలను ఉల్లంఘించడంతో జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. అదే సమయంలో ఆమె గర్భవతి. ఐతే ఆమెకు ఒక రోజు ఉమ్మనీరు లీకవ్వడంతో తన పరిస్థితి బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లండని పోలీసులను వేడుకుంది. కానీ పోలీసులు ఆమె పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా గర్భవతి అని కనికరం లేకుండా ... ఇంతటి ఎమర్జెన్సీ టైంలో ఒక కాఫీ హోటల్ వద్ద కారుని చాలాసేపు ఆపేశారు. కనీసం అంబులెన్స్‌కి కూడా కాల్ చేయలేదు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా... ఆమె తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. దీంతో సదరు మహిళా ఖైదీ తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కింది. బాధితురాలి తరుఫు న్యాయవాది నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె పట్ల పోలీసులు కావాలనే ఉదాసీనతగా వ్యహరించారని కోర్టుకి తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కి కాల్ చేయలేదని రెండు గంటల ఆలస్యం కారణంగా అత్యంత విలువైన మాతృత్వపు భాగ్యాన్ని పొందలేకపోయిందని చెప్పారు. దీంతో కోర్టు జైలు సూపర్వైజర్స్ని బాధిత ఖైదీ క్వినోన్స్‌కు సుమారు రూ. 3 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీనికి జైలు సూపర్ వైజర్లు అంగీరించారు గానీ అందుకు సదరు బాధితురాలు కూడా అంగీకరిస్తేనే ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఖరారు అవుతుందని కూడా స్పష్టం చేసింది. తొలుత సదరు మహిళా ఖైదీ పిటీషన్ని అక్టోబర్ 2020లో ఫెడరల్ కోర్టు కొట్టేసింది, కానీ అప్పీల్ కోర్టు గతేడాది ఈ కేసును తిరిగి పునరుద్ధరించి ఈ తీర్పును వెల్లడించింది. (చదవండి: పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి... 937 మంది మృతి) -
ఓ సీఈవో వేడుకోలు: ఆఫీస్‌కు రండయ్యా!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఇంటి వద్ద నుంచి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆఫీస్‌కు రావాలంటూ సీఈవోలు సైతం ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా స్టార్ బక్స్ సీఈవో హోవార్డ్ షుల్జ్ వ్యవహరిస్తున్నారు. బాబ్బాబు మీకు దణ్ణం పెడతా. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు..ఆఫీస్‌కు రావాలని ఉద్యోగుల్ని ప్రాధేయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం బిజినెస్ వరల్డ్‌లో ఆసక్తికరంగా మారింది. వాషింగ్స్టన్లో జరిగిన న్యూయ్యార్క్ టైమ్స్ డీల్ బుక్ పాలసీ ఫోరమ్ కార్యక్రమంలో స్టార్ బక్స్ సీఈవో హోవార్డ్ షుల్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఉద్యోగుల్లారా..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు. ఆఫీస్‌కు వచ్చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్. కావాలంటే చెప్పండి మోకాళ్లపై నిల్చుంటా, లేదంటే పుషప్స్ చేస్తా. కానీ మీరు మాత్రం తప్పకుండా ఆఫీస్‌కు రావాల్సిందే'నని అన్నారు. నేను ఫెయిల్ అయ్యాను ఉద్యోగులు మాత్రం ఆఫీస్‌కు వచ్చేందుకు సుముఖంగా లేరు. నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.వారు(ఉద్యోగులు) వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆఫీస్‌కు రావాలని అనుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగులు పనితీరు స్టార్ బక్స్ సంస్థ ఉద్యోగుల జాబ్స్ రోల్స్‌ను బట్టి కొంత మందిని హైబ్రిడ్ వర్క్‌లో పనిచేయిస్తుంది. ప్రత్యేకమైన లొకేషన్లకు చెందిన ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్క్, హైబ్రిడ్ వర్క్ పని చేస్తున్నారు. అయితే టెస్లాతో పాటు ఇతర సంస్థల తరహాలో స్టార్ బక్స్ సైతం ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపునిస్తుంది. ఉద్యోగులకు వార్నింగ్ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ రిటర్న్ టూ ఆఫీస్ పాలసీకి జై కొడుతున్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాదు కూడదు అంటే జీతాల్లో కోత విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయంలో ఏ మాత్రం మొహమాటం ఉండదని ఖరాకండీగా చెప్పిన విషయం తెలిసిందే. కానీ విచిత్రంగా స్టార్ బక్స్ సీఈవో ఉద్యోగుల్ని ఆఫీస్‌కు ఈతరహా పిలుపు నివ్వడం సోషల్ మీడియాలో చర్చాంశనీయమైంది. -
ఈ ఫొటో మమ్మల్ని కలచివేసింది!
లండన్ : ‘మనిషన్న జంతువు ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తోంది’ అంటూ కోర్టులు మొట్టికాయలు వేసినా మనుషుల తీరు మాత్రం మారడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పడేస్తూ భూగ్రహం మీద ఉన్న ఇతర జీవజాతులను ప్రమాదంలోకి నెడుతున్నారు. యునైటెడ్ కింగ్డంలోని డోనా నూక్ నేచర్ రిజర్వులో అప్పుడే పుట్టిన ఓ సీల్ పప్(సముద్ర జీవి సీల్ పిల్ల) గాజు సీసాతో ఆడుకుంటున్న ఫొటో ఇందుకు తార్కాణంగా నిలిచింది. పర్యావరణాన్ని మానవుడు కలుషితం చేస్తున్న తీరును మరోసారి కళ్లకు కట్టింది. నేచర్ ఫొటోగ్రాఫర్ డాన్ థర్లింగ్ రెండు వారాల క్రితం ఫేస్బుక్లో షేర్ చేసిన సీల్ పప్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ మనుషులు ఇలా ఎందుకు చేస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ భూగ్రహానికి మనం విలువ ఇవ్వనక్కర్లేదా?’అంటూ డాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ అలాంటి బాటిళ్లు ఇంకా అక్కడే ఉంటే సీల్ పప్ వంటి అద్భుతమైన, అరుదైన జంతువుల మనుగడ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించాడు. కాగా ఈ ఫొటోలో సీల్ పప్.. గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ బాటిల్‌తో కనిపించడంపై ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. తమ సంస్థ బాటిల్ కారణంగా సీల్ పిల్లకు ఎలాంటి హాని జరగలేదనే ఆశిస్తున్నామంది. ఈ మేరకు స్టార్‌బక్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ...’ఈ ఫొటో మమ్మల్ని ఎంతగానో కలచివేసింది’ అని విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లింకోల్నిషైర్ వైల్‌్డలైఫ్ ట్రస్టును సంప్రదించి చెత్త నిర్వహణ దిశగా చేపట్టే చర్యలకు తమవంతు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు బదులుగా లింకోల్నిషైర్ వైల్‌్డలైఫ్ ట్రస్టు స్టార్‌బక్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. ట్రస్టు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ సముద్ర జలాల్లో చెత్త పేరుకుపోవడం జాతీయ సమస్యగా పరిణమించింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వాలు చెబుతున్నా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవలే ఇటువంటి ఫొటోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చనిపోయిన పిల్ల తాబేలు కడుపులో నుంచి సుమారు 104 ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. పిల్లలకు జన్మనివ్వడానికే బయటికి.. ప్రపంచంలో మొత్తం ముప్ఫై మూడు రకాల సీల్స్ ఉన్నాయి. మగ సీల్‌ను ‘బుల్’, ఆడ సీల్‌ను ‘కౌ’ అంటారు. ఇవి సంవత్సరానికో బిడ్డను కంటాయి. ఈ పిల్లను పప్ అంటారు. పిల్లలను నెల రోజుల పాటు వాటిని సాకి, తరువాత స్వేచ్ఛగా వదిలేస్తాయి. సీల్స్ జీవితంలో చాలాభాగం నీటిలోనే గడుపుతాయి. పిల్లలకు జన్మనివ్వడానికి, చర్మం విడవాల్సినప్పుడు (సంవత్సరానికోసారి) మాత్రమే నేలమీద కాస్త ఎక్కువసేపు ఉంటాయి. ఆక్సిజన్ని పీల్చుకోవడం కోసం ఇవి ఒక్కోసారి రెండేసి గంటలపాటు ఊపిరి తీసుకోకుండా నీటి అడుగున నిశ్చలంగా ఉండిపోతాయి. నీటిలో అన్నీ స్పష్టంగా చూడగలిగే విధంగా వీటి కంటి నిర్మాణం ఉంటుంది. వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. నీటిలో పడవ లేదా ఓడ వెళ్తున్నప్పుడు, అదేంటో తెలుసుకోవాలని ఇవి చాలా సేపు ఫాలో అవుతాయట. ఆడ సీల్స్ వేరే గ్రూపుగా, మగవి వేరే గ్రూపుగా ఏర్పడి మరీ షికార్లు చేస్తాయట. మగ గ్రూపును పాడ్ అని, ఆడ గ్రూపును హారెమ్ అని అంటారు. సీల్స్ చర్మం అడుగున ఒక మందమైన పొరలాగా కొవ్వు ఉంటుంది. దానివల్ల అవి ఎంతటి శీతలాన్నయినా తట్టుకోగలవు. ఇవి నీటిలో ఉండే వాటిని, నీటి ఉపరితలం మీద ఉన్నవాటిని ఒకేసారి స్పష్టంగా చూడగలుగుతాయట. సీల్స్ ప్రధాన ఆహారం చేపలు. కొన్ని కిలోమీటర్ల దూరంలో చేప ఉన్నా ఇవి పసిగట్టేస్తాయి. క్షణాల్లో వెళ్లి వాటిని పట్టేసేంత షార్ప్‌గా ఉంటాయి. తిండి కోసం వేయి అడుగుల లోతుకైనా వెళ్తాయి. సీల్స్ ఒంటి నుంచి తీసిన కొవ్వుతో నూనెను తయారు చేస్తారు. నల్ల సీల్ చర్మానికి చాలా డిమాండ్ ఉంటుంది. దానితో బట్టలు తయారు చేస్తారు. వీటి కోసమే విపరీతంగా వేటాడటంతో... సీల్స్ సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం సముద్రం కలుషితమవుతుండటంతో వాటి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువవుతున్నాయంటూ జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డ్రీమర్లకు సపోర్టుగా టెక్ దిగ్గజాలు
వాషింగ్టన్: చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లి స్థిరపడిన వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డ్రీమర్ల కోసం ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన డీఏసీఏ కార్యక్రమాన్ని ట్రంప్ రద్దు చేయడంతో, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వాషింగ్టన్లో ఓ దావా దాఖలైంది. దీనికి పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తోంది. వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన అన్ని కంపెనీలు ఈ దావాకు మద్దతిస్తున్నాయి. 15 సంప్రదాయ ప్రజాస్వామ్య రాష్ట్రాలు, కొలంబియా జిల్లాకు చెందిన అటార్నీస్ జనరల్ ఈ దావాను దాఖలు చేశారు. చాలామంది డ్రీమర్లు.. 16 ఏళ్ల కంటే చిన్నవయసులోనే దేశానికి వచ్చారని, తమ కంపెనీల కోసం పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రీమర్లపైనే ఆధారపడి వాషింగ్టన్‌లోని చాలా కంపెనీలు పనిచేస్తున్నాయని, వారి వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నాయని ఫిర్యాదులో చెప్పారు. తమ రాష్ట్రాల్లోని అతిపెద్ద కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్ వంటి కంపెనీల్లో, డ్రీమర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్‌గా, రిటైల్, సేల్స్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఏసీఏ రద్దుతో ఒకవేళ ఉద్యోగులు తమ స్టేటస్‌ను కోల్పోతే, చాలా బాధను భరించాల్సి ఉంటుందని అమెజాన్ ఆందోళన వ్యక్తంచేసింది. మైక్రోసాఫ్ట్‌లో 39 మంది డ్రీమర్లు ఉన్నారని, డీఏసీఏను రద్దు చేయడం దేశమొత్తానికి అతిపెద్ద ఎదురుదెబ్బ అని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు, చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ స్మిత్ చెప్పారు. డీఏసీఏ రద్దుపై వ్యాపారవేత్తలు మండిపడుతున్నారు. 8 లక్షల మంది డ్రీమర్లు, తమ కంపెనీలకు, తమ ఆర్థికవ్యవస్థకు ఎంతో ముఖ్యమని చెప్పారు. 100కు పైగా టెక్ కంపెనీలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన దావాకు మద్దతు పలుకుతున్నాయి. -
మొబైల్‌తో స్టార్‌బక్స్ కాఫీ ఆర్డర్!
న్యూఢిల్లీ: మీరు స్టార్‌బక్స్ కాఫీ ప్రియులా? అయితే స్టార్‌బక్స్ కాఫీని మొబైల్ ద్వారా ఆర్డర్ చేసే రోజులు త్వరలో రానున్నాయి. ‘కస్టమర్లు త్వరలో మీ మొబైల్ సాయంతో స్టార్‌బక్స్ కాఫీ కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు. రివార్డ్స్ కార్డు ద్వారా చెల్లింపు జరపొచ్చు. మాకు దేశంలో ఇప్పటికే 1,60,000 యాక్టివ్ మై స్టార్‌బక్స్ రివార్డ్స్ ప్రోగ్రామ్ యూజర్లు ఉన్నారు’ అని టాటా స్టార్‌బక్స్ సీఈవో సుమి ఘోష్ తెలిపారు. ప్రపంచ ంలోని ఇతర దేశాలతో పోలిస్తే తాము భారత్‌లో చాలా వేగంగా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ‘అమెరికాలో మా సంస్థకు సంబంధించిన 25 శాతం లావాదే వీలు స్టార్‌బక్స్ యాప్ ద్వారానే జరుగుతున్నాయి. యాప్ సాయంతో దగ్గరిలోని ఔట్‌లెట్‌ను తెలుసుకోవచ్చు. అలాగే దాని ద్వారా స్టార్‌బక్స్ కార్డు సాయంతో కాఫీ కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు’ అని వివరించారు. ఇలాంటి సేవలను ఈ ఏడాది భారత్‌లో తొలిసారి ప్రారంభిస్తామని తె లిపారు. ఇక్కడ వృద్ధి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. అమెరికాకు చెందిన స్టార్‌బక్స్ 2012లో టాటా గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు ద్వారా భారత్‌లోకి అడుగుపెట్టింది. దీనికి దేశంలో 83 ఔట్లెట్స్ ఉన్నాయి. -
బిల్లులుంటే అక్రమం.. లేకుంటేనే సక్రమం!
ఇదీ మండలంలో అధికారుల పనితీరు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు వాటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అమరావతిలోని ఓ ప్రైవేటు క్వారీ నుండి మంగళవారం ఉదయం బిల్లులతో ఇసుక లోడుతో వస్తున్న నాలుగు లారీలను తాడేపల్లి తహశీల్దార్ వెంకటేశ్వర్లు ఆపి, వాటిని పరిశీలించారు. ఆ బిల్లుల్లో వినియోగదారుడి పేరు లేదని, అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని లారీలను నిలిపివేశారు. వే బిల్లులు తీసుకుని తన కార్యాలయానికి వెళ్లారు. ఎక్కడి నుండో ఇసుక వస్తుంటే తాడేపల్లి అధికారులు ఆ లారీలను తనిఖీలు చేస్తున్నారే తప్ప.. మండలంలోని పెనుమాక ఇసుక రీచ్ నుండి రాత్రీ పగలూ తేడా లేకుండా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం మాతం చేయడం లేదు. ఇసుక రీచ్‌లో జరుగుతున్న అక్రమ రవాణా గురించి రోజూ పత్రికల్లో కథనాలు వస్తున్నా, వాటి గురించి ఆలోచించట్లేదు. పైగా ఎక్కడి నుండో వస్తున్న లారీలను తనిఖీ చేస్తుండడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెనుమాకలో రాత్రి సమయాల్లో లారీలు తిరగడంపై ఆగ్రహించిన మహిళలు రోడ్డుపైకి వచ్చి గంటల కొలదీ లారీలను నిలిపి ధర్నా చేశారు. అప్పుడు పత్తాలేని అధికారులు ఇప్పుడు మాత్రం చిన్న సాకుతో లారీలను నిలిపేసి, హడావుడి సృష్టించడం వెనుక పరమార్థమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ పెనుమాక రీచ్‌లో బిల్లులు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఆ ఇసుక రీచ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులది కావడం వల్లే అధికారులు దాని జోలికి వెళ్లడం లేదని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. -
ధరలపై మరో పోరు
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా కలెక్టరేట్ ఎదుట జిల్లా స్థాయి ఆందోళన విశాఖపట్నం : చుక్కలనంటుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మారు ఉద్యమించనుంది. ఇప్పటికే గత నెలలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వినూత్న నిరసనలతో హోరెత్తించిన పార్టీ శ్రేణులు ఈసారి జిల్లా కేంద్రమైన విశాఖలో ఆందోళనకు సిద్ధమయ్యారు. కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు పార్టీ జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. తొలుత నగరంలోని సరస్వతి పార్కు నుంచి జగదాంబ జంక్షన్, కేజీహెచ్ అప్రోడ్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో సహా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ కమిటీలు బాధ్యులు, ఇతర ముఖ్యనేతలంతా ఈ ధర్నాలో పాల్గొనున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొనేలా పార్టీ జిల్లా కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నిత్యావసర ధరల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ధర్నా ద్వారా సర్కార్‌కు తెలియజెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పిలుపు నిచ్చారు. జిల్లా పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. -
నిరసన సెగ
బాక్సైట్ తవ్వకాలకు అనుమతులపై అఖిల పక్షాల నిరసన ఐక్య ఉద్యమానికి సమాయత్తం నేడు మన్యం బంద్ ఉద్రిక్తత నేపథ్యంలో సీఆర్పీఎఫ్ అధికారుల పర్యటన శీతాకాలం ఆరంభంలో ఏజెన్సీ ఒక్కసారిగా వేడెక్కింది. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో మన్యంలో నిరసనాగ్ని రగులుకుంది. సర్కారు వైఖరికి వ్యతిరేకంగా మన్యం బందుకు సిద్ధమైంది. ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని పాడేరులో అఖిలపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి తేల్చి చెప్పాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రతిన బూనాయి. వైఎస్సార్సీపీతో సహా వామపక్షాలు.. ఇతర రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. పాడేరు : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అఖిలపక్షాల్లో నిరసన పెల్లుబికింది. శుక్రవారం పలు మండలాల్లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జీకేవీధి, చింతపల్లి, పాడేరు, పెదబయలు మండలాల్లో విపక్షాలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలను నిర్వహించాయి. జి.మాడుగుల మండలంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి అనంతరం సభను బహిష్కరించి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ధర్నా, ర్యాలీ నిర్వహించారు. పాడేరులో అఖిలపక్షాలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. రాజకీయ పార్టీలు, పీసా, విద్యార్థి కమిటీలు సమావేశమై బంద్‌కు పిలుపునిచ్చాయి. బాక్సైట్ ఉద్యమంలో అందరి భాగస్వామ్యం: ఎమ్మెల్యే ఈశ్వరి మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడానికి ఐక్య ఉద్యమం చేపట్టాలని, ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ గిరిజన భవన్లో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్షాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాల్లో ఆదివాసీ ప్రజలను సంఘటితం చేసి ఉమ్మడి పోరుతోనే బాక్సైట్‌ను అడ్డుకోగలమన్నారు. ఆదివాసీలంతా వ్యతిరేకిస్తున్నా, పర్యావరణానికి గిరిజనుల మనుగడకు విఘాతమని తెలిసినా ప్రభుత్వం నిరంకుశంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిందని ధ్వజమెత్తారు. ప్రకృతి సంపదపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగబడుతున్నాయని, మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే ప్రజా ప్రతిఘటన తప్పదని మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు హెచ్చరించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలన వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ గిరిజన సంఘం, సీపీఎం నాయకులు ఆర్.శంకరరావు, ఎంఎం శ్రీను, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పాలికి అప్పారావు, సీపీఐ నాయకుడు కూడా భూషణరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాంగి సత్తిబాబు, బీజేపీ నాయకులు ఉమా మహేశ్వరరావు, వేమనబాబు, సల్ల రామకృష్ణ, బీఎస్పీ నాయకులు సుర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం మార్చుకోకుంటే టీడీపీకి గుడ్‌బై విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన 97 జీఓను ఉపసంహరించాలని మాజీ మంత్రి మణికుమారి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వి.కాంతమ్మ, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, టీడీపీ నాయకులు బొర్రా నాగరాజు, ఎంవిఎస్ ప్రసాద్, శెట్టి లక్ష్మణుడు, పాంగి రాజారావు, జి.మాడుగుల జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఓ హరినారాయణన్‌కు వినతిపత్రం అందజేసి ఐటీడీఏ వద్ద నిరసన తెలియజేశారు. మన్యంలో ఆదివాసీలంతా వ్యతిరేకిస్తున్న బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వడం భావ్యం కాదన్నారు. ఈనెల 13న తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశానికి హాజరై బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని కోరనున్నట్లు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పూనుకుంటే పార్టీ నుంచి వైదొలుగుతామని పేర్కొన్నారు. -
రోడ్లు మూసేస్తే ధర్నా
సబ్ ఏరియా జీఓసీకి తేల్చి చెప్పాను నసీరుద్దీన్ షా ఉర్సుకు ‘దారి’క్లియర్ ఎంపీ మల్లారెడ్డి వెల్లడి కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రతిపాదిత రోడ్లను మూసేస్తే తాను ధర్నాకు సైతం వెనుకాడేది లేదని ఎంపీ మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ-ఆంధ్రా సబ్‌ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)- ఇన్- చీఫ్ మేజర్ జనరల్ పచోరీని కలిశారు. ఈ భేటీలో కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అజయ్ సింగ్ నేగీ, కల్నల్ క్యూ అజయ్ కటోచీ తదితరులున్నారు. బోయిన్‌పల్లిలోని ప్రముఖ దర్గా నసీరుద్దీన్ షా బాబా దర్గాలో ఉర్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్మీ స్థావరాల నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగా రోడ్డు తెరిపించాల్సిందిగా మల్లారెడ్డి జీఓసీని కోరారు. ఇందుకు సమ్మతించి ఈ నెల 7 నుంచి 9 వతేదీ వరకు దర్గా వెళ్లేందుకు అనువుగా రోడ్డు మార్గాన్ని తెరిచేలా సంబంధిత కమాండర్‌కు జీఓసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏఓసీ రోడ్ల మూసివేతపై ఆసక్తి కరమైన చర్చ జరిగినట్లు ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ గుండా వెళ్లే రోడ్ల మూసివేతపై ఆర్మీ అధికారుల నిర్ణయం ఏంటని జీఓసీని అడగ్గా... ఈ మార్గంలో సాధారణ పౌరుల రాకపోకలపై నిషేధం విధించేందుకు తమకు కోర్టు అనుమతిచ్చినట్లు తెలిపారన్నారు. ఈ మేరకు డిసెంబర్ 1 నుంచి గాఫ్ రోడ్డు మూసేస్తున్నట్లు స్పష్టం చేశారని మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను మానుకోవాలని సూచించగా ఉన్నతాధికారులు, లేదా మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే రోడ్ల మూసివేత నిర్ణయంలో మార్పు ఉంటుందని పచోరీ పేర్కొన్నట్లు ఎంపీ వెల్లడించారు. తాను శుక్రవారం ఢిల్లీకి వెళ్లి నేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిసి రోడ్ల మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని కోరతానన్నారు. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
-
కేయూ కామన్ మెస్ ఎదుట ధర్నా
కేయూక్యాంపస్ : కాకతీయ యూని వర్సిటీ కామన్ మెస్ ఎదుట విద్యార్థి సంఘాలు గురువారం ధర్నా నిర్వహించారుు. నాణ్యమైన భోజనం అందటంలేదని, కేర్‌టేకర్‌ను తొల గించాలని డిమాండ్ చేశారు. ప్రైవే టు మెస్ కాంట్రాక్టర్‌కు అనుకూలం గా కేర్‌టేకర్ వ్యహరిస్తున్నారని ఆరోపించారు. హాస్టళ్ల డెరైక్టర్ మనోహర్ నాణ్యమైన భోజనం అందించి, కేర్‌టేకర్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమిం చారు. ఈకార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఏబీవీపీ, ఎంఎస్ఎఫ్ నాయకులు మేడారపు సుధాకర్, ముదిగొండ రాజు, మంద భాస్కర్, రాకేష్, సిద్దు, శ్రావణ్, రాంబాబు, మధు, రమేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
మా కుమార్తెను హత్య చేసిన వారిని శిక్షించాలి
- మృతదేహంతో ధర్నా బద్వేలు అర్బన్: తమ ఒక్కగానొక్క కూతురిని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు లక్ష్మిపాళెంలోని మృతురాలి భర్త ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. బద్వేలు మండలం పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన వీరయ్య, వెంకటసుబ్బమ్మల మొదటి సంతానమైన చంద్రకళ ను లక్ష్మిపాళెం గ్రామానికి చెందిన సంపతి వెంకటసుబ్బయ్యకు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. రెండేళ్లుగా వెంకటసుబ్బయ్య మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా భార్యతో గొడవకు దిగడంతో ఆమె ఇంటినుంచి వెళ్లిపోయి మంగళవారం రాత్రి పెద్ద చెరువులో శవమై కనిపించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నేరుగా లక్ష్మిపాళెంలోని మృతురాలి భర్త వెంకటసుబ్బయ్య ఇంటి వద్దకు తెచ్చి సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. తమ కుమార్తెను భర్త, అత్తమామలే అంతమొందించి చెరువులో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. విషయం తెలుసుకున్న బద్వేలు సీఐ రామాంజినాయక్ అర్బన్, రూరల్ ఎస్ఐలు నాగమురళి, నరసింహారెడ్డిలు సిబ్బందితో సంఘట నా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులు , బంధువులతో చర్చించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
-
ఎర్రజెండోళ్ల ఇంటి ముందు ధర్నా చేయండి
పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్‌రావు సలహా సీఎం చెప్పినా వినిపించుకోరా? వాళ్ల మాటలు విని మోసపోయాం.. న్యాయం చేయాలని కార్మికుల వేడుకోలు రామచంద్రాపురం: ఉద్యోగాలు పోవడానికి కారకులైన ఎర్రజెండోళ్ల ఇంటి ఎదుట ధర్నా చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి నివాసానికి వచ్చిన ఆయనను జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి.. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశుద్ధ్య కార్మికులతో కలసి చీపురు పట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. అదే మాదిరిగా పారిశుద్ధ్య కార్మికులను అన్నా నమస్తే అంది మన ముఖ్యమంత్రే. సమ్మె వివరమించుకోమని.. జీతాలు పెంచుతానని ముఖ్యమంత్రి చెప్పినా వినిపించుకోకుండా సమ్మె చేశారు. ముఖ్యమంత్రి మాట విని 20 వేల మంది కార్మికులు సమ్మె నుంచి విధుల్లోకి వచ్చారు. మిగతా రెండు వేల మంది ఎర్రజెండోళ్ల మాట విని సమ్మె చేసి నౌకరీలు పోగొట్టుకున్నారు. ముఖ్యమంత్రి దండం పెట్టి మీకు ఇళ్లు కూడా కట్టిస్తానని చెప్పినా ఎవరూ వినకపాయే. స్థానిక ఎమ్మెల్యే కూడా విరమించమని కోరినా మీరు వినిపించుకోలేదు. అందుకే తొలగించడం జరిగింది’ అన్నారు. దాంతో కార్మికులు ఎర్రజెండోళ్లను నమ్మి మోసపోయామని.. మాకు న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
సర్కారుపై దండయాత్ర
ధర్నాతో శ్రీకారం రాజధాని ప్రాంత రైతులకు కొండంత భరోసా బలవంతపు భూసేకరణ తగదన్న వైఎస్ జగన్ ఉద్వేగంగా ఉరకలెత్తించిన రైతులు, నేతల ప్రసంగాలు 29న ప్రత్యేక హోదా బంద్ జయప్రదం చేయాలంటూ జగన్ పిలుపు విజయవాడ బ్యూరో : రాజధాని ప్రాంతంలో రైతుల కాళ్ల కింద భూమిని సర్కారు కనికరం లేకుండా లాగేసుకుంటోంది. కూలీలు, పేదల చేతిలో అన్నం ముద్ద భవిష్యత్‌లో ఉంటుందో లేదోనన్న భయందోళనకు టీడీపీ ప్రభుత్వం కారణమవుతోంది. ఇటువంటి కష్టకాలంలో మీకు అండదండగా నేనున్నానంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చేపట్టిన ధర్నా ప్రభుత్వంపై దండయాత్రకు రాజధాని ప్రాంత వాసుల్ని సన్నద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వంపై పోరుకు వేలాది మంది సైనికుల్లా తరలివచ్చారు. రాజధాని ప్రాంత రైతులకు కొండంత భరోసా... గతంలో రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో స్వయంగా పర్యటించి బాధితుల బాధలు, వ్యథలు తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి ఇటీవల మంగళగిరి వేదికగా రెండు రోజులు సమరదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా బృందాలుగా పర్యటించి రాజధాని ప్రాంతంలో రైతులు, ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పటికే ప్రభుత్వం వేలాది ఎకరాలు సేకరించి మళ్లీ భూసేకరణకు పూనుకోవడంతో జగన్మోహన్రెడ్డి ధర్నాకు దిగి రాజధాని ప్రాంత రైతులకు కొండంత భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు తాము వ్యతిరేకమని జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రైతులను కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వమూ మనలేదని ఆయన హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల వద్ద తీసుకున్న భూమిని పువ్వుల్లో పెట్టి ఇస్తామని ప్రకటించడంతో రైతులకు ధీమా ఇచ్చినట్టు అయ్యింది. ఇప్పటికే భూములు ఇచ్చినవారు, ఇవ్వలేక భయందోళనలు చెందుతున్నవారందరికీ జగన్మోహన్రెడ్డి మాటలతో ధైర్యం వచ్చింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు... భూసేకరణకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా చేపట్టిన ధర్నాలో వైఎస్సార్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప్ అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కోన రఘుపతి, మహ్మద్ ముస్తఫా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, పేర్ని నాని, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాము, కార్యదర్శి కాజ రాజ్‌కుమార్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుట్టా రామచంద్రరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, గుంటూరు జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, నియోజకవర్గ కన్వీనర్లు సింహాద్రి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్, దూలం నాగేశ్వరరావు, మొండితోక అరుణ్‌కుమార్, కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 29న బంద్ జయప్రదానికి పిలుపు... రైతుల కోసం చేపట్టిన ధర్నా వేదిక నుంచి ప్రజలకు ఈ నెల 29న బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బంద్ తన కోసం కాదని, రాష్ట్రంలోని యువత, ప్రజల కోసం అని తెలిపారు. యువతకు విద్య, ఉపాధి, రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలు రావాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరని, దాన్ని పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అంతకుముందు ప్రసంగించిన రైతులు, కూలీలు, నేతలు ఉద్వేగపూరితంగా మాట్లాడారు. రాష్ట్ర నేతలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ప్రసంగించారు. వారి మాటల్లో భూసేకరణపై ఆందోళన, రైతుల పరిస్థితిపై ఆవేదనతో పాటు చంద్రబాబు సర్కారుపై ఆక్రోశం పెల్లుబికింది. మొత్తానికి ధర్నాతో రాజధాని రైతులకు, ప్రజలకు కొండంత అండగా వైఎస్సార్సీపీ ఉందని చాటిచెప్పారు. -
నేడు వైఎస్ జగన్ ధర్నా
విజయవాడ : మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా చేయనున్నారు. చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో జ్వర మృతుల కుటుంబాలను ఆదుకోని ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి మృతి చెందిన కుటుంబాల వారితో కలిసి ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాలో పాల్గొంటారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుషిత నీరు తాగి ఊరంతా జ్వరాల బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల జగన్మోహన్రెడ్డి కొత్తమాజేరు గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో తాగునీటి చెరువును, ఫిల్టర్బెడ్లను పరిశీలించారు. ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను శుభ్రం చేయాల్సిన విషయంలో అంతులేని నిర్లక్ష్యం వహించిన అధికారుల తీరును ఈ సందర్భంగా తప్పుబట్టారు. రెండున్నర నెలలుగా గ్రామంలో విషజ్వరాలు విజృంభించి ప్రాణాలు తీస్తుంటే అధికార యంత్రాంగానికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మంగళవారం జరగనున్న ధర్నాలో పాలకుల తీరును ఆయన ఎండగట్టనున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైన పాలకుల తీరును ప్రశ్నిస్తూ.. మానవత్వం చూపని అధికార పార్టీ నేతల అమానవీయ చేష్టలను ఈ ధర్నాలో ప్రజలకు తెలియజేస్తారు. ధర్నాలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. విజయవాడలో రాత్రికి బస కేఎల్ యూనివర్సిటీ నుంచి వైఎస్ జగన్ నేరుగా విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అనంతరం గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఏపీయుడబ్ల్యుజే సభలకు హాజరు... ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యుజే) రాష్ట్ర మహాసభలకు మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్ హాజరవుతారు. కేఎల్ యూనివర్సిటీ ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలు, సామాజిక బాధ్యత తదితర అంశాలపై ప్రసంగిస్తారు. రేపు భూసేకరణకు వ్యతిరేకంగా.. గాంధీనగర్ : రాజధాని తాము వ్యతిరేకం కాదని, అడ్డగోలుగా భూసేకరణ చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ స్పష్టం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా చేస్తున్న నేపథ్యంలో సోమవారం వేదిక స్థలాన్ని రఘురామ్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 30 శాతం పైగా రైతులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అడ్డగోలుగా ముందుకుపోతోందన్నారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్దారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్‌ఖాన్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజకుమార్, పాల్గొన్నారు. -
భూసేకరణకు వ్యతిరేకంగా 26న జగన్ ధర్నా
-
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా 26న జగన్ ధర్నా
విషజ్వరాల బాధితుల్ని ఆదుకోనందుకు నిరసనగా 25న మచిలీపట్నంలో ధర్నా వెల్లడించిన వైఎస్సార్సీపీ నేత పార్థసారథి సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.. లేకుంటే ఆందోళన తప్పదు హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు కీలకమైన ప్రజాసమస్యలపై వరుసగా రెండు రోజులపాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ధర్నాలు చేయనున్నారు. పేద రైతుల అభీష్టానికి భిన్నంగా రాజధానికోసం వారినుంచి బలవంతంగా భూములను సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ ప్రాంతంలో ఈ నెల 26న ఆయన ఒకరోజు ధర్నాకు పూనుకుంటున్నారు. కృష్ణా జిల్లా కొత్త మాజేరులో విషజ్వరాల బాధితుల్ని రాష్ట్రప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా ఆయన ఈ నెల 25న మచిలీపట్నంలో ఒకరోజు ధర్నా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. భూసేకరణపై రైతుల్లో తీవ్ర ఆందోళన, అలజడి నెలకొన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకెళ్లడంపై జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఆయన నిర్ణయించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో జరగనున్న ఈ ఆందోళన కార్యక్రమాన్ని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 26న భూసేకరణ వ్యతిరేక ధర్నా వేదిక ఎక్కడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. బాబు పైశాచికత్వానికి నిదర్శనం.. రాజధాని నిర్మాణంకోసం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని రైతులనుంచి సమీకరించినట్లుగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మళ్లీ మూడువేల ఎకరాల్ని బలవంతంగా సేకరించాలని నిర్ణయించడం సీఎం చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనమని పార్థసారథి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, రైతుసంఘాలు, ప్రజలంతా బలవంతపు భూసేకరణ చేయొద్దని చెబుతున్నా చంద్రబాబు రైతుల్ని ఇబ్బందులకు గురిచేయాలని చేస్తున్నారంటే, అది ఆయన ప్రజా వ్యతిరేక, స్వార్థపూరిత, రాక్షస మనస్తత్వాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. మధ్యలో ప్రైవేటు ఆస్తులుంటే తప్పేంటీ? రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ఆహ్వానించిన సింగపూర్, జపాన్ కన్సల్టెంట్లు నిర్దేశిం చిన విధంగా సీడ్క్యాపిటల్లో అసెంబ్లీ, సచి వాలయం ప్రధానంగా ఉంటాయని, వాటి మ ధ్యలో ప్రైవేటు ఆస్తులుంటే తప్పేమిటి? అని పార్థసారథి ప్రశ్నించారు. హైదరాబాద్ సచివాలయం, అసెంబ్లీకి మధ్యలో బోలెడన్ని ప్రైవే టు ఆస్తులున్నాయి కదా! అని గుర్తుచేశారు. కాలం చెల్లనున్న ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని లాక్కుంటారా? 2013 భూసేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు మరో పదిహేను రోజుల్లో కాలం చెల్లనున్న తరుణంలో చంద్రబాబు కత్తిగట్టి దానినే అడ్డం పెట్టుకుని రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కుంటున్నారని పార్థసారథి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్ణయం మార్చుకోవాలని, లేకుంటే రైతులకు తమ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని ప్రకటించారు. కొత్తమాజేరులో విషజ్వరాలు సంభవించినా వాటిని అంగీకరించడానికే ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే మచిలీపట్నంలో ధర్నా చేస్తున్నామని ఆయన తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లాకలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా జరుగుతుందన్నారు. -
‘హోదా’ కోసం సమరభేరి
నేడు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మరోసారి తన నిరసన గళాన్ని వినిపించబోతోంది. రాష్ట్రాన్ని విభజించే సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై దాదాపు 15 నెలలవుతున్నా ఒక్క అడుగూ ముందుకు పడకపోగా ఈ విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రెండూ దోబూచులాడుతున్నాయి. దీని ఫలితంగా రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆందోళనతో ఈ అంశంపై తొలినుంచీ వివిధ మార్గాల్లో పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఇదే అంశంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా అంశంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఢిల్లీ గడ్డపై సోమవారం ధర్నా చేపడుతున్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న జంతర్‌మంతర్(పార్లమెంటు వీధి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో) వద్ద చేపడుతున్న ఈ ధర్నాలో ఆయనతోపాటు వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, క్రియాశీల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఈ ధర్నాకోసం వైఎస్సార్సీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జోరువాన కురుస్తున్న నేపథ్యంలో ధర్నా వేదిక నిర్మాణ పనులను సాయంత్రం నుంచి చేపట్టి రాత్రికల్లా పూర్తి చేశారు. పార్లమెంటు వీధి మొత్తం భారీ హోర్డింగులు, పార్టీ జెండాలతో నిండిపోయింది. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని హోర్డింగ్‌ల్లో రాశారు. వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటును పార్టీ నేతలు ధర్నాస్థలి వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ చేరిన జగన్ ఇదిలా ఉండగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు పార్టీనేతలు, కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిన రెండు ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రికి దేశ రాజధాని నగరానికి చేరాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది. సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ధర్నాస్థలి నుంచి పార్లమెంట్‌కు మార్చ్ఫాస్ట్ నిర్వహించనున్నారు.‘హోదా’పై ఏరాష్ట్ర విషయంలోనైనా చట్టం చేశారా? వైఎస్సార్సీపీ ఆగ్రహం సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అంశంపై చట్టం చేయాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్ సీపీ మండిపడింది. ఆదివారం రాత్రి ధర్నా స్థలిని పరిశీలించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ముఖ్య నేతలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, తదితరులు జంతర్‌మంతర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదన్న వెంకయ్య వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ‘వెంకయ్యనాయుడు పచ్చిగా మాట్లాడారు. గతంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాను పార్లమెంటులో చట్టం చేసి ఇచ్చారా? వెంకయ్యనాయుడు అలా మాట్లాడడం సరికాదు. అలాంటప్పుడు ఆనాడు సభలో పదేళ్లు కావాలని ఎలా అడిగారు? ఈ దేశ చరిత్రలో కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయం..’ అని పేర్కొన్నారు. -
కేంద్రం తీరు అప్రజాస్వామికం
నిరసనగా అసెంబ్లీలో ఎంపీ, మాజీ ఎంపీల ధర్నా సాక్షి, హైదరాబాద్: అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, అంజన్‌కుమార్ యాదవ్, సురేశ్ శేట్కర్, మల్లు రవి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు గాంధీవిగ్రహం దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నించారు. అసెంబ్లీ లోపల గేట్లకు తాళం ఉండటంతో విగ్రహానికి ఎదురుగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... అవినీతిపరులకు కేంద్రం అండగా ఉంటున్నదన్నారు. అవినీతిపరులపై చర్య తీసుకోవాలని కోరిన ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని విమర్శించారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట తరువాత వారిని పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచేందుకే..
ఢిల్లీ ధర్నాపై వైఎస్సార్సీపీ నేత ధర్మాన ధర్నా ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన పార్టీ నేతలు హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 10న ఢిల్లీ ధర్నాకు పిలుపునిచ్చిందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయనతోపాటు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, సాగి దుర్గాప్రసాదరాజు, అంబటి రాంబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ ధర్నా ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగే అన్యాయ్యాన్ని సరిదిద్దడానికే ప్రత్యేకహోదా అంశం పుట్టుకొచ్చిందన్నారు. అది కేవలం హామీ మాత్రమే కాదని.. అన్యాయం జరిగిన ప్రాంతానికి న్యాయం చేయడం లాంటిదని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా మొదట్నుంచీ ప్రత్యేక హోదా సాధనకోసం వైఎస్సార్సీపీ పోరాడుతోందని.. దానికి కొనసాగింపుగానే ఢిల్లీ ధర్నాకు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టకపోవడం రాష్ట్ర ప్రజలందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోందన్నారు. టీడీపీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా, రాష్ట్రంలో అధికారంలో ఉండి చంద్రబాబు దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ధర్మాన ప్రశ్నించారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు దీనిని చిన్న విషయంగా భావిస్తున్నారని తప్పుపట్టారు. నష్టపోయిన ప్రజలపక్షాన ఢిల్లీలో వైఎస్సార్సీపీ చేపట్టిన ఢిల్లీ ధర్నాలో రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి తరలివెళ్లిన కార్యకర్తల తో ధర్నా నిర్వహించిన అనంతరం ర్యాలీగా పార్లమెంట్ వైపునకు వెళ్లే కార్యక్రమం ఉంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. -
మహిళలు తలచుకుంటే సీఎం కూడా దిగిపోవాల్సిందే
మందుబాబుల ఆగడాలతో కదంతొక్కిన మహిళలు {పభుత్వ మద్యం దుకాణం ఎత్తివేయాలని రాస్తారోకో, ధర్నా ఎక్సైజ్ సీఐ కార్యాలయం ముట్టడి యలమంచిలి : ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్ధినులు, మహిళలు, మహిళా ఉద్యోగులు ఆ మార్గాల మీదుగా వెళ్లలేకపోతున్నారు. మందుబాబుల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. వారి వేధింపులు భరించలేకపోతున్నాం. అత్యంత రద్దీగా ఉండే సీత, తులసీ థియేటర్ల మార్గంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడమేమిటి? ఈ దుకాణాన్ని అక్కడ నుంచి తరలించాలని ఎంతమందికి చెప్పినా అరణ్యరోదనే అవుతోంది. వెంటనే మందుబాబుల ఆగడాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు మద్యం దుకాణాన్ని అక్కడ నుంచి తరలించాల్సిందేనంటూ సోమవారం యలమంచిలి పట్టణంలోని 6, 7, 8, 9 వార్డులకు చెందిన మహిళా సంఘాల నేతలు, స్థానిక మహిళలు భారీ ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ సీఐ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. వాహనాల రాకపోకలు అడ్డుకుని నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి ఎక్సైజ్ సీఐ, సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ జి.బాలకృష్ణ మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బందితో రాస్తారోకో జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో డ్యూటీలో ఉన్న సెంట్రీ మహిళా కానిస్టేబుల్‌కు మహిళలు వినతి పత్రం ఇచ్చి, రెండు రోజుల్లోగా ప్రభుత్వ మద్యం దుకాణం వేరేచోటికి మార్చకపోతే మహిళల సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. మహిళలు ధర్నా చేస్తున్న సమయంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ‘మీకేం పనిలేదా ?’ అనడంతో ఆందోళన చేస్తున్న మహిళలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. తాము ఎవరితోనూ మాటలు పడాల్సిన పనిలేదని, మహిళలను చులకనగా చూస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మహిళల జోలికి వచ్చినా, అవమానించినా ముఖ్యమంత్రి కూడా కుర్చీదిగిపోవాల్సి వస్తుందని అన్నారు. ఆందోళన కార్యక్రమంలో కరణం రమాదేవి, కాండ్రేగుల నూకరత్నం, వేగి పుష్ప, మళ్ల సరోజిని, కర్రి లక్ష్మి, దొడ్డి పావని, శీరందాసు సూర్యకుమారి, వై.లక్ష్మి, దాడి మంగ, మారిశెట్టి నూకరత్నం, సత్యవతి సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పోరుబాట
వచ్చేనెల 9న మహాధర్నా చేపట్టనున్న పీఆర్టీయూ సీఎస్ రాజీవ్శర్మకునోటీసు అందజేత ఉమ్మడి సర్వీసురూల్స్ అవుల్లోకి తేవాలి వెంటనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి పాఠశాలల మూసివేత యోచనను విరమించుకోవాలి పీఆర్సీ బకారుులను మొత్తం జీపీఎఫ్ ఖాతాల్లో జవు చేయూల్సిందే పనిచేయుని హెల్త్‌కార్డులు ఎవరికోసమని ప్రశ్న హైదరాబాద్: తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు పోరుబాట పట్టనున్నారు. ఇందుకోసం మహాధర్నా చేపట్టనున్నారు. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఇబ్బందులు, పీఆర్సీ బకాయిలు, హెల్త్‌కార్డులపై ఆందోళనకు సిద్ధమైన ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ-టీఎస్ వచ్చే నెల 9న మహాధర్నాకు పిలుపునిచ్చింది. తమ సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి తదితరులు సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలసి ధర్నా నోటీసు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 9న హైదరాబాద్‌లో 20 వేల మంది ఉపాధ్యాయులతో మహాధర్నా చేపడతామని చెప్పారు. ఆలోగా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల డిమాండ్లు.. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ లేక పర్యవేక్షణాధికారుల నియామకాలు ఆగిపోయి పాఠశాలల్లో మిగతా 2వ పేజీలో ఠ పర్యవేక్షణ కొరవడి, విద్యా బోధన దెబ్బతింటోంది. వెంటనే ఖాళీగా ఉన్న డిప్యూటీఈవో, డైట్ లెక్చరర్, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలి. హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలల మూసివేత యోచనను ఉపసంహరించాలి. - ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాలి. - పదో పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లోనే జమచేయాలి. బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చి బాండ్లు అంటున్నారు. అందుకు ఒప్పుకొనేది లేదు. - సీనియర్ టీచర్లకు 9వ పీఆర్సీలో నష్టం జరిగినందున ఇప్పుడు వెయిటేజీ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. - ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదు. వాటితో ప్రయోజనం లేకుండాపోయింది. - రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. - ఉన్నత పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలి. - పంచాయతీరాజ్, ఎయిడెడ్ పాఠశాలల్లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు అర్ధ వేతన సెలవులను (హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) నగదుగా మార్చుకునే వెంటనే పునరుద్ధరించాలి. - డీఎస్సీ-2003లో ఎంపికై 2005లో నియమితులైన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. - విద్యార్థుల ప్రవేశ వయసును 5 నుంచి 3 ఏళ్లకు తగ్గించి... శిశు తరగతులను, ఇంగ్లిషు మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. - పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. -
నిరసన హోరు
కొనసాగిన ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు ఇబ్రహీంపట్నంలో భిక్షాటన నగరంలో మానవహారం జిల్లా వ్యాప్తంగా 728 సర్వీసులు నడిపిన అధికారులు విజయవాడ : జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మంగళవారం కూడా నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో ఆర్టీసీ కార్మికులు అన్ని ప్రధాన డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికుల సమ్మె ఏడో రోజూ కొనసాగింది. అయితే అధికారులు జిల్లాలో 728 సర్వీసులను నడిపారు. దూర ప్రాంతాలైన చెన్నై, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, వైజాగ్ మినహా అన్ని ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. బస్సులు సగటున 50 శాతం వరకు నడుస్తున్నా సంస్థకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో కార్మిక సంఘాల నేతలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్‌స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి బయటకు వెళ్లే బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో బస్సులు యథావిధిగా నడిచాయి. అనంతరం కార్మికులు బస్‌స్టేషన్ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. అక్కడినుంచి కంట్రోల్ రూమ్ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్మించారు. దీంతో బందరు రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులపై బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదని సూచించారు. 43 శాతం ఫిట్మెంట్ సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అక్కడి నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జిల్లాలో.. తిరువూరు, గుడివాడ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం తదితర బస్ డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తిరువూరులో ఆర్టీసీ డిపో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. బస్టాండ్‌లో కార్మిక సంఘాలు సభ నిర్వహించాయి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకటరామారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగ్గయ్యపేట డిపో వద్ద కార్మికులు చెవిలో పూలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలో నిరసన ప్రదర్శన జరిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మునిసిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైస్‌చైర్మన్ అక్బర్ మద్దతు ప్రకటించారు. గుడివాడ బస్ డిపో ప్రధాన ద్వారం వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నంలో కార్మికులు ప్రధాన రహదారుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. నూజివీడు డిపో అద్దె బస్సు డ్రైవర్‌పై మెర్సుపూడి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రాయి విసిరిన సంఘటనలో డ్రైవర్ గాయపడ్డారు. కోర్టుకు రేపు చెబుతాం.. హైకోర్టుకు తమ నిర్ణయాన్ని న్యాయవాది ద్వారా బుధవారం వెల్లడిస్తాం. న్యాయపరంగా సాధించుకోవాల్సిన హక్కుల కోసం చట్టానికి లోబడే సమ్మె చేస్తున్నాం. దీనిపై అన్ని సంఘాల నేతలతో మాట్లాడుతున్నాం. బుధవారం 10.30 గంటలకు నేరుగా నిర్ణయం వెల్లడించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. - వై.వి.రావు, ఈయూ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి -
సీఎం ఆఫీస్ ముందు బీజేపీ నేతల ధర్నా
సర్కారు తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేల నినాదాలు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు హైదరాబాద్: బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ మంగళవారం ఉద యం ముఖ్యమంత్రి కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో సచివాలయంలో కలకలం రేగింది. ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతా సిబ్బంది సైతం ఉలిక్కిపడ్డారు. ధర్నా చేస్తున్నది చట్టసభ్యులు కావడంతో భద్రతా సిబ్బం దికి కాసేపు ఏంచేయాలో పాలుపోలేదు. గంట తర్వాత సచివాలయ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న అభియోగం కింద బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఉదయం 11గంటల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి, కె.లక్ష్మణ్, రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకని సచివాలయాని(సి-బ్లాక్)కి వచ్చారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులకు ముందుగానే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమిచ్చారు. అయితే ఆ సమయంలో సీఎం తన కార్యాలయంలో లేరని భద్రతా సిబ్బంది చెప్పడంతో వారు అప్పటికప్పుడు అక్కడే దర్నాకు దిగారు. నగర ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఇంతవరకు సమావేశం ఏర్పా టు చేయలేదని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పలుమార్లు సీఎం అపాయింట్మెంట్ కోరినా స్పందించలేదని ఎమ్మెల్యేలు ఆరోపిం చారు. ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ ఇదేనా అంటూ నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రూ.200 కోట్లతో ప్రభుత్వం ‘స్వచ్ఛ హైదరాబాద్’ను చేపట్టింద ని, ప్రజాధనంతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికే ఈ ఎత్తుగడని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. కాగా, ప్రజాప్రతినిధులను అవమానించడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నట్లు నేతలు తెలిపారు. మంచి పనులతో బలం పెంచుకో: కె.లక్ష్మణ్ పదవులు, పనుల ఎరతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడం కాకుండా, అభివృద్ధి పనులు చేసి టీఆర్ఎస్ బలాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, ప్రజలకు మేలు చేయాలని సూచించారు. అధికారమే శాశ్వతమనే భ్రమలో సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ప్రజా సమస్యలపై చర్చించడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. -
వేధింపుల ప్రిన్సిపాల్ మాకొద్దు
బి.కొత్తకోట: అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బి.కొత్తకోట ఆదర్శ పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కిరణ్చంద్రకుమార్ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం 8వ తరగతి విద్యార్థినీవిద్యార్థులు మూ డు గంటలపాటు ధర్నా నిర్వహించారు. వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్న ప్రిన్సిపాల్ మాకొద్దంటూ నినాదా లు చేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్, డీఈవో సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే... కొంతకాలంగా ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కిరణ్ వేధిస్తున్నారంటూ 21 ఆరోపణలతో కూడిన ఫిర్యాదును 81 మం ది విద్యార్థినీ విద్యార్థుల సంతకాలతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మార్సీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంఈ వో ధనరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. కిరణ్ తమను ఏరకంగా వేధిస్తున్నారో సవివరంగా చెప్పుకొన్నారు. దీనిపై చర్యలు తీసుకొవాలనీ, లేకుంటే రాత్రంతా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ కార్యాలయంలోనే బైఠాయించారు. కొంతసేపటి తర్వాత కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించి, నినాదాలు చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, డీఈవోల దృష్టికి వెళ్లడంతో వారు స్పం దించారు. డీఈవో ఎంఈవోతో ఫోన్లో మాట్లాడారు. ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను తెలుసుకొన్నారు. దీనిపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ కూడా ఆరా తీసి వివరాలు తెలుసుకొన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇస్తామని ఎంఈవో చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే శంకర్‌కు ఫిర్యాదు చేశారు. ‘గాడిదలకు పుట్టారా’ తరగతి గదిలో పాఠాలు చేప్పే కిరణ్ చాలా అసభ్యకరమైన పదాలు వాడు తూ తిడుతుంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. గాడిదలకు పుట్టారా లేక కంచర గాడిదకు, అడ్డ గాడిదలకు పుట్టారా అంటూ అవహేళనగా మాట్లాడుతారని చెప్పారు. 12 పీరియడ్లకు సరిపోయే సిలబస్‌ను అరగంటలో ముగించి.. డౌట్లు అడిగితే ‘డౌట్లు కడి గేసుకోండి’ అంటూ హేళన గా మాట్లాడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. కంప్యూటర్ పాఠాలు నే ర్చుకునే వీలులేకుండా గదిలోకి వెళ్లనివ్వడంలేదని చెప్పారు. మీరిప్పుడు 8, 9లోకి రండి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ బెదిరిం చారని వాపోయారు. ఒకరోజు ఆల స్యంగా వస్తే వారం రోజులు గైర్హాజరు వేస్తూ, చాలాసార్లు కొట్టారని ఈ వేధింపుల నుంచి కాపాడమంటూ వేడుకొన్నారు. ‘పనిలేక వచ్చుంటారులే’ ఈ విషయంపై ఫోన్లో ప్రిన్సిపాల్ కిరణ్ వివరణ కోరగా వాళ్లు పనిలేక ధర్నాకు వచ్చుంటారులే.. ఇదంతా మామూలేనంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వేధిస్తున్నారన్న విషయంపై వివరణ ఇవ్వలేదు. -
ఫియర్లెస్!
కిటకిటలాడే ముంబై వీధులు... చుట్టూ భారీ జనసందోహం... బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ధర్నా చేస్తూ కనిపించింది! పైన భానుడు భగభగమంటుంటే... ఓ పక్కన టియర్ గ్యాస్ కమ్ముకొస్తుంటే... జంకు, బెరుకు లేకుండా రోడ్డు మధ్యలో నిలబడి నినాదాలతో అదరగొట్టింది! స్టార్ స్టేటస్... లగ్జరీ లైఫ్... అమ్మడికి రోడ్డెక్కాల్సినంత అవసరం ఏమొచ్చిందనేగా! కూల్..! రియల్‌గా కనిపించినా... ఇదంతా ‘రీల్’ లైఫ్ సన్నివేశం.ప్రస్తుతం ఈ సుందరాంగి చేస్తున్న ‘అకీరా’ సినిమా కోసం ఇంతలా కష్టపడిందనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పిక్చర్ కోసం సోను మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసిందని సమాచారం. ఆమె రియల్ ఫాదర్ శత్రుఘన్ సిన్హా ఇందులోనూ అదే రోల్ ప్లే చేస్తున్నాడు. -
ఎక్కడి బస్సులు అక్కడే
బస్‌భవన్ వద్ద ధర్నా కోసం తరలి వెళ్లిన కార్మికులు 70 శాతానికిపైగా బస్సులు డిపోలకే పరిమితం అల్లాడిన టెన్త్ విద్యార్థులు, ఇతర ప్రయాణికులు నగరంలో గురువారం గురువారం పెద్ద సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నట్టుండి బస్ భవన్ వద్ద ధర్నాకు తరలివె ళ్లడంతో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి అష్టకష్టాలు పడ్డారు. సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల ధర్నా గురువారం లక్షలాది మంది ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నగరంలోని వివిధ డిపోలకు చెందిన కండక్టర్లు, డ్రైవర్లు భారీ సంఖ్యలో బస్‌భవన్ వద్ద ధర్నాకు తరలి వెళ్లడంతో గ్రేటర్‌లోని అన్ని డిపోలలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే పరీక్షలకు బయలుదేరిన పదోతరగతి విద్యార్ధులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి బస్టాపుల్లోనే పడిగాపులు పడ్డారు. తిరిగిన కొద్దిపాటి బస్సులు ప్రయాణికులతో కిక్కిరిపోయాయి. ఉ. 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 70 శాతానికి పైగా బస్సులు నిలిచిపోయినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. కండక్టర్లు, డ్రైవర్లు ఇలా పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలి వెళ్తారని తాము అంచనా వేయలేకపోయినట్లు పేర్కొన్నారు. కాగా నగరంలోని 28 డిపోల పరిధిలో 3850 బస్సులు ఉన్నాయి. మొదటి షిఫ్టులో (మధ్యాహ్నం 2 గంటల వరకు) బయలుదేరవలసిన 1264 బస్సులలో కేవలం 456 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. టెన్త్ విద్యార్థుల్లో టెన్షన్ కేవలం బస్పాస్పైనే ఆధారపడి పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన పదోతరగతి విద్యార్థులు గంటలు గడిచినా బస్సులు రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు పరీక్షా సమయం దగ్గరపడడం, వందల రూపాయలు చెల్లించి ఆటోల్లో వెళ్లేందుకు జేబులో తగినన్ని డబ్బులు లేకపోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఎనిమిదిన్నర దాటినా బస్సులు రాకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. చివరి క్షణాల్లో వచ్చిన ఒకటి రెండు బస్సుల్లో కిక్కిరిసి బయలుదేరారు. మరోవైపు కొంతమంది చివరి క్షణాల్లో తల్లిదండ్రు సహాయంతో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. ఏమైనప్పటికీ ఆర్టీసీ నిర్లక్ష్యం వల్ల పదోతరగతి విద్యార్ధులు గురువారం ప్రశాంతంగా పరీక్షలు రాయలేకపోయారు. కార్మికుల ధర్నా నేపథ్యంలో సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, పంజగుట్ట, కూకట్పల్లి, తదితర ప్రాంతాల్లో బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది, ఇక బస్సుల కొరతను ఆటో, క్యాబ్ డ్రైవర్లు క్యాష్ చేసుకున్నారు. ప్రయాణికుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. -
కదంతొక్కిన ఆశా వర్కర్లు
కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్ల ధర్నా స్తంభించిన ట్రాఫిక్..బలవంతంగా అరెస్టులు.. తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలోపలువురికి గాయాలు హైదరాబాద్: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్(ఆశా)(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌లోని ఏపీసాక్స్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏపీసాక్స్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అధికారులు హామీలకే పరిమితమయ్యారని ఆగ్రహించిన ఆశా వర్కర్లు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆశా వర్కర్ల ఆందోళన సుమారు ఐదు గంటల పాటు కొనసాగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఊహించని పరిణామం కావడంతో పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్ల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్, అడిషన ల్ డీసీపీ చంద్రశేఖర్, ట్రాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి, సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్, మలక్‌పేట్ ఏసీపీలతోపాటు ఈస్ట్, సెంట్రల్ జోన్ల పరిధిలోని పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది రం గంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేసి ఫలక్‌నుమా, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, సీఐటీయూ నేతలు అబ్బాస్, తులసితో పాటు వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు గాయాల పాలయ్యారు. మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు. -
ఇసుక జీవోను రద్దు చేయాలని ధర్నా
పార్వతీపురం (విజయనగరం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఇసుక జీవోను రద్దు చేయాలని విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నగరంలో పలు సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాకు విజయనగరంలోని భవన నిర్మాణ కార్మికులు, రైతుకూలీ, సీఐటీయూ సంఘాలు సోమవారం మద్దతు తెలిపాయి. సుమారుగా 500 మంది భవన నిర్మాణ కార్మికులు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ జీవోను రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పనులు లేక ఇక్కడి ప్రజలు వలస పోతున్నారని వెంటనే ఈ జీవోను రద్దు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
ఇసుక విక్రయాలు రద్దు చేయాలి
శింగనమల :‘ఇసుక రీచులను ఎక్కడా డ్వాక్రా మహిళలతో నిర్వహించడం లేదు. వారి ముసుగులో టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. చంద్రబాబు తన పార్టీ కార్యకర్తల కోసమే ఇసుక విక్రయాలు చేపట్టారు. వాటిని వెంటనే రద్దు చేయాల’ని వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. శింగనమల మండలం ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద బుధవారం వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాలు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీం అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నాయకుడు బోయ తిరుపాలు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక రీచులను ప్రారంభించి.. టీడీపీ నేతలకు అప్పగించారని విమర్శించారు. ఇసుక రీచులు పెట్టడం వల్ల భవన నిర్మాణ కార్మికులు, కూలీలు పనుల్లేక రోడ్డున పడ్డారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇసుక విక్రయాలు చేపట్టి టీడీపీ నేతలకు దోచిపెడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇసుక విక్రయాలను చేపట్టడం వల్ల సామన్యుడు ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో రూ.వెయ్యికి దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.5 వేలకు చేరిందన్నారు. ఇసుక దొరక్క జిల్లాలో ఆరు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ.. ఉల్లికల్లు ఇసుక రీచులో అక్రమాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇసుక విక్రయాలు రద్దు చేయాలని ఫిబ్రవరి ఆరున అనంతపురం నగర బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఓబులు మాట్లాడుతూ ఇసుక రీచులు మాఫియా, టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాయని విమర్శించారు. ఇక్కడ మూడడుగులు మాత్రమే ఇసుకను తీయాలని నిబంధన ఉన్నా 20 అడుగులు తవ్వారన్నారు. ధర్నా విషయం తెలుసుకొని ముందస్తుగానే ఇసుక విక్రయాలు నిలిపివేసి, గుంతలు కనపడకుండా చాగల్లు రిజర్వాయర్‌కు వెళ్తున్న నీటిని వదిలారన్నారు. ఇక్కడ ఇన్ని అక్రమాలు జరుగుతున్నా డీఆర్డీఏ అధికారులు పట్టించుకోలేదన్నారు. దీనిపై ఇన్చార్జి పీడీని ఫోన్లో సంప్రదించగా.. జిల్లా కలెక్టర్ దిృ్టకి తీసుకెళ్లి చర్చిస్తున్నామని చెప్పారన్నారు. దీన్నిబట్టి వారు ఏవిధంగా పని చేస్తున్నారో తెలుస్తోందన్నారు. ఇసుక రీచ్ వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు తగ్గిపోయే పరిస్థితి ఉందన్నారు. తాగునీరు లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్రీరామిరెడ్డి, సీపీఎం నాయకులు జాఫర్, నల్లప్ప, సీపీఐ జిల్లా నాయకులు లింగమయ్య, బాలరంగయ్య, చెన్నప్ప యాదవ్, ఇతర నేతలు నారాయణస్వామి, నాగరాజు, పోతన్న, వీరనారప్ప, పద్మావతి, అమీనమ్మ, శంకుతలమ్మ, భాగ్యమ్మ, ఆషాబీ, రామాంజినేయులు,పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు : ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద ధర్నాకు వెళుతున్న వారిని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. శింగనమల మరువకొమ్మ, నాయనపల్లి క్రాస్, ఉల్లికల్లు గ్రామం వద్ద అడ్డుకోవడంతో వారు పోలీసులపై మండిపడ్డారు. ఉల్లికల్లు రీచ్ వద్ద ధర్నా చేపట్టడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, శింగనమల, ఇటుకలపల్లి ఎస్ఐలు రామారావు ఆధ్వర్యంలో దాదాపు వంద మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. శింగనమల తహశీల్దారు సుధామణిని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఓబులు నిలదీశారు. -
మాకొద్దు..
వన్ ప్లస్ వన్ వద్దని గుడిసెవాసుల ఆందోళన నగరంలోని మురికివాడల్లో పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని, అర్హులైన వారికి కొత్త ఇళ్లు కట్టివ్వాలని, వన్ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దని వామపక్షాలు శుక్రవారం ఆందోళనకు దిగాయి. గుడిసెవాసులు హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. వన్ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దని, నగరంలో గుడిసెలు వేసుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించి అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి. నాగయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణ పోరాట సాధన సమితి క న్వీనర్లు సిరబోయిన కరుణాకర్, దుబ్బశ్రీనివాస్, సీపీఐ నగర కార్యదర్శి వీరగంటి సదానందం, ఎంసీపీఐ(యు) నగర కార్యదర్శి మాలి బాబురావు, సీపీఎం నాయకులు మెట్టు శ్రీనివాస్, సూడికృష్ణారెడ్డి, టి.ఉప్పల్లయ్య, అక్కెనపట్లి యాదగిరి, సీపీఐ నాయకులు పోతరాజు సారయ్య, న్యూడెమోక్రసీ నాయకుడు ఆరెళ్లి కృష్ణ పాల్గొన్నారు. - సుబేదారి -
సింగరేణిలో ప్రశాంతంగా సమ్మె
* కొత్తగూడెం రీజియన్‌లో 63 శాతం మంది హాజరు.. * కార్పొరేట్లో 220 మంది గైర్హాజరు * కొనసాగిన ఆందోళనలు, అరెస్టులు కొత్తగూడెం : సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఐదురోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలో విస్తరించి ఉన్న నాలుగు ఏరియాల్లో రెండోరోజైన బుధవారం పాక్షికంగానే కొనసాగింది. రీజియన్ వ్యాప్తంగా నాలుగు ఏరియాల్లో కలిపి రెండు షిఫ్ట్‌లలో 63 శాతం కార్మికులు విధుల్లో పాల్గొన్నారు. ముందస్తు అరెస్టులు, నిరసనగా ఆందోళనలు కొనసాగాయి. కొత్తగూడెం ఏరియాలో విధులకు వెళ్లే కార్మికులను అడ్డుకునేందుకు యత్నించిన 15 మంది ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ నాయకులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అరెస్టులకు నిరసనగా నాయకులు స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌తో పాటు సమ్మెకు పిలుపునిచ్చిన హెచ్ఎంఎస్ కూడా విధులకు హాజరవుతూ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ఆరోపించారు. ఇల్లెందులో జీఎం కార్యాలయం ఎదుట జేఏసీ నాయకులు ధర్నా చేశారు. మణుగూరు ఏరియాలో జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న 70 మంది జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 63 శాతం హాజరైన కార్మికులు.. జిల్లాలోని కొత్తగూడెం రీజియన్ పరిధిలో నాలుగు ఏరియాల్లో రెండోరోజు మొదటి రెండు షిఫ్టులలో 63 శాతం కార్మికులు విధులకు హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో 1710 మంది కార్మికోద్యోగులకుగాను 1311 మంది హాజరుకాగా 179 మంది సెలవులో ఉన్నారు. మిగతా 220 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు కార్పొరేట్ పరిధిలో గైర్హాజరు లేనప్పటికీ రెండోరోజు కొంతమంది ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. కొత్తగూడెం ఏరియా పరిధిలో 3241 మంది కార్మికులకుగాను 1709 మంది హాజరయ్యారు. 185 మంది సెలవులో ఉండగా 1347 మంది విధులకు హాజరుకాలేదు. ఇల్లందు ఏరియాలో 1379 మంది కార్మికులకు గాను 585 మంది విధుల్లో పాల్గొన్నారు. మరో 50 మంది సెలవులో ఉండగా 744 మంది గైర్హాజరయ్యారు. మణుగూరు ఏరియాలో 2405 మంది కార్మికులకుగాను 1297 మంది విధుల్లో పాల్గొనగా 160 మంది సెలవులో ఉన్నారు. 948 మంది గైర్హాజరయ్యారు. మొదటిరోజు 95.3 శాతం ఉత్పత్తి.. సమ్మె ప్రారంభమైన మంగళవారం కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ఏరియాలలో 95.3 శాతం ఉత్పత్తి నమోదైంది. మూడు ఏరియాల్లో 72,600 టన్నుల లక్ష్యానికి గాను 69,220 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. కొత్తగూడెం ఏరియా అత్యధికంగా 24,518 టన్నులకు 25,448 టన్నులు, ఇల్లందు ఏరియాలో 19,340 టన్నులకు 17,677 టన్నులు, మణుగూరు ఏరియాలో 28742 టన్నులకు 26,095 టన్నుల ఉత్పత్తి నమోదైంది. కాగా మొదటి షిఫ్టునకు హాజరైన కార్మికులను రెండో షిఫ్టులో సైతం కొనసాగిస్తూ యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి చేయించిందని కార్మిక సంఘాలు అంటున్నాయి. -
కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
* విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన * సర్పంచ్ అరెస్ట్‌కు డిమాండ్ ఆదిలాబాద్ అర్బన్ : ఆహారభద్రత కార్డుల జాబితా విషయంలో భీమిని తహశీల్దార్ దేవానంద్‌పై దాడికి పాల్పడిన మండల పరిధిలోని నాయినిపేట సర్పంచ్ అశోక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా మెయిన్ గేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రేస) జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ భీమిని తహశీల్దార్ దేవానంద్‌పై దాడి చేసిన నాయినిపేట సర్పంచ్ అశోక్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని కలెక్టర్ జగన్మోహన్ చెప్పారని, కానీ ఇంత వరకు అరెస్ట్ చేయలేదన్నారు. దీనికి నిరసనగా సోమవారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టినట్లు తెలిపారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు సరికాదన్నారు. తహశీల్దార్‌పై దాడిని అన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్ను గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు రాజేశ్వర్, సుభాష్‌చందర్, చంద్రశేఖర్, అతికొద్దీన్, సంజయ్‌కుమార్, విలాస్, సదానందం, శ్రీకాంత్, షీల, సుజాత, జ్యోతి, ఉద్యోగులు పాల్గొన్నారు. సంఘాలు, నాయకుల మద్దతు తహశీల్దార్‌పై దాడికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు వివిధ సంఘాలు, నాయకులు మద్దతు తెలిపారు. బీజేపీ జిల్లా నాయకుడు పాయల శంకర్ మద్దతు తెలిపారు. వీరితో పాటు గజిటెడ్ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, నాయకులు గుణవంత్‌రావు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు రాజసమ్మయ్య, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ నాయకుడు సుధాకర్‌రెడ్డి తదితరలు మద్దతు తెలిపారు. కాగా జైనథ్ తహశీల్దార్‌తో, రెవెన్యూ ఉద్యోగులంతా పెన్‌డౌన్ నిర్వహించారు. సర్పంచ్ అరెస్ట్ బెల్లంపల్లి : భీమిని తహశీల్దార్ జుమ్మిడి దేవానంద్‌పై దాడికి పాల్పడిన నాయకునిపేట సర్పంచ్ ఓడేటి అశోక్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి డీఎస్పీ ఎ.రమణారెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న తహశీల్దార్‌ను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
కదం తొక్కిన ఐకేపీ వీఓఏలు
కలెక్టరేట్ దద్దరిల్లింది.. మూడు గంటలపాటు అట్టుడికింది.. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం వీఓఏలు కలెక్టరేట్‌ను ముట్టడించారు.. జిల్లావ్యాప్తంగా వేలాది మంది తరలివచ్చారు.. ధర్నాతో కలెక్టర్ కార్యాలయం ప్రధానగేటు, సుబేదారికి వచ్చే రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద రహదారిని పోలీసులు మూసివేశారు. సుబేదారి : అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) వీఓఎలు మం గళవారం కదం తొక్కారు. వీఓఏల సంఘం ఆధ్వర్యం లో జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన మహిళలు కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. మధ్యాహ్నం 12గంటల నుంచి మూడు గంటల వరకు ప్రధాన గేట్లను దిగ్బంధించారు. మహిళలను విస్మరిస్తే.. మహిళలు, మహిళా సంఘాలను విస్మరిస్తే ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని ఐకేపీ సంఘం నాయకులు హెచ్చరించారు. ధర్నాకు హాజరైన వారిని ఉద్దేశించి తెలంగాణ ఐకేపీ వీఓఏల సంఘం అధ్యక్షురా లు మారపల్లి మాధవి మాట్లాడుతూ 18నెలలుగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ)లకు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఇప్పటికైనా వీఓఏల ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.5వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ఎస్‌హెచ్‌జీలకు 12నెలల జీరో శాతం వడ్డీ ఇవ్వాలని, అభయ హస్తం పింఛన్లు కొనసాగించాలని కోరారు. ధర్నాకు మద్దతు పలికిన అంగన్వాడీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ మహిళా సంఘాల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ లేదా పీడీ రావాలి కలెక్టర్ లేదా ఐకేపీ పీడీ ఎవరో ఒకరు వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని వీఓఏల సంఘం బాధ్యులు స్పష్టం చేశారు. ఈ విషయమై సుబేదారి పోలీసులు ప లుమార్లు చెప్పినా వారు వినిపించుకోలేదు. అయితే, సమస్య తమ పరిధిలో లేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉందని జిల్లా అధికారులతో మాట్లాడిన పోలీసులు చెప్పడంతో చివరకు వీఓఏలు ధర్నా విరమించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, ఉపాధ్యక్షుడు రొయ్యల రాజు, నాయకులు టి.పులా, విద్యాసాగర్, డి.తిరుమల్‌రెడ్డి, ఎం.సాంబయ్య, పి.శంకర్, రమేష్, యాదానాయక్, శ్రీనివాస్, కుమార్, కె.మాధవి, రవీందర్, యువరాజు, సుధాకర్ పాల్గొన్నారు. ధర్నాతో దారుల మూసివేత ఐకేపీ వీఓఏల ధర్నాలో కలెక్టరేట్ ప్రధాన గేట్లతో పాటు సుబేదారికి వచ్చి రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం దగ్గరి రోడ్లను పోలీసులు మూసివేయించారు. బారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలను నియంత్రించారు. ఎక్సైజ్ కా లనీ రోడ్డు నుంచి కాజీపేటకు వెళ్లే వాహనాలు, ఫాతి మానగర్ క్రాస్ రోడ్డు నుంచి హన్మకొండకు వెళ్లే వాహనాలను మళ్లించారు. సుబేదారి ఎస్సైలు రాంప్రసాద్, సుబ్బారెడ్డి బందోబస్తు పర్యవేక్షంచారు. -
వీవోఏలపై ఖాకీల ఉక్కుపాదం
మహిళలని కూడా చూడకుండా అరెస్టులు ఇళ్లకు వెళ్లి.. ఫోన్లలో బెదిరించిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచే అరెస్టుల పర్వం 18 నెలల జీతాల కోసం 2 నెలలుగా సీఎఫ్‌ల సమ్మె నేడు హైదరాబాద్‌లో మహాధర్నా, అసెంబ్లీ ముట్టడి దాన్ని విఫలం చేసేందుకు జిల్లాల్లో అడ్డుకోవాలని సర్కారు ఆదేశాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యమాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. మహిళలని కూడా చూడకుండా బెదిరింపులు, అరెస్టులకు పాల్పడుతోంది. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న పోలీసులు ఐకేపీ మహిళల ఇళ్లకు వెళ్లి, ఫోన్లు చేసి బెదిరించి మరీ పోలీస్స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. దీనికి కారణమేమిటంటే.. సోమవారం హైదరాబాద్‌లో జరగనున్న ఐకేపీ సీఎఫ్(వీవోఏ)ల రాష్ట్రస్థాయి ధర్నా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే ఈ అరెస్టులని తెలిసింది. కొన్ని నెలలుగా ప్రభుత్వం చెల్లించాల్సిన వేతన బకాయిల కోసం కొన్నాళ్లుగా వీవోఏలు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో సోమవారం ధర్నా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మిగిలినవారు ఆదివారం బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచే గ్రామాలు, పట్టణాల్లో మోహరించి వీవోఏలను అదుపులో కి తీసుకోవడం ప్రారంభించారు. గ్రామాల్లో అయితే వీవోఏల ఇళ్లకు వెళ్లి మ రీ అదుపులోకి తీసుకున్నారు. ఇంటి వద్ద లేనివారికి ఫోను చేసి తక్షణమే పోలీస్ ష్టేషనుకు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించారు. స్వచ్ఛందంగా రాకపోతే రాత్రివేళ ఇళ్లకు వచ్చి అరెస్టు చేస్తామ ని హెచ్చరించారు. స్టేషన్‌కు వచ్చిన వారికి అదుపులోకి తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ ఆరెస్టులు జరిగాయి. కాగా అదుపులోకి తీసుకున్న వారిని మంగళవారం ఉదయం పదకొండు గంటల వరకు విడిచిపెట్టే పరిస్థితి లేదని తెలిసింది. దీంతో ఇళ్లు, పిల్లలను వదిలి మహిళలు పో లీస్ ష్టేషన్లలో పడి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రభుత్వ చర్యలను మ హిళా, ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. జిల్లాలో మొత్తం 1300 మంది వీవోఏలు 18 నెలల వేతన బకాయిల కోసం అక్డోబర్ 15 నుం చి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. వేతనాల కోసం ఉద్యమించిన మహిళల సమస్య పరిష్కరించకపోగా వారిని అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. సీఐటీయూ నేతల ఆరెస్టు ఐకేపీ సీఎఫ్‌లకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నాయకులను సైతం ఆరెస్టు చేశారు. శ్రీకాకుళంలో సీఐటీయూ కార్యదర్శి దుప్పల గోవిందరావును, రాజాంలో ఆ యూనియన్ నేత రామూర్తినాయుడును ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేడు పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నా ఐకేపీ మహిళా ఉద్యోగుల(వీవోఏ) అక్రమ ఆరెస్టులకు నిరసనగా సోమవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు సీఐటీయే అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతిరావు, డి.గోవిందరావులు తెలిపారు. వివిధ మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటారని చెప్పారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు పీఎన్ కాలనీ: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. ఐకేపీ ఉద్యోగులతోపాటు, తమ యూనియన్ నేతల అరెస్టులను ఆయన ఖండించారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు తమ ఇంటికి వచ్చి తనను అరెస్టు చేశారన్నారు. 18 నెలల నుంచి వీవోఏలకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహ రించడం సరికాదన్నారు. వీవోఏలకు మద్దతుగా ప్రజల సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
‘ఆసరా’పై మళ్లీ సర్వే చేయాలి
యాచారం:ఆసరాకు సంబంధించి మళ్లీ రీసర్వే చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తు బుధవారం చింతుల్ల గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు 500 మంది వరకు ఉండగా ప్రస్తుతం కేవలం 279 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు అయ్యాయన్నారు. పింఛన్లు కోల్పోయి అనేక మంది పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 50 మందికి పైగా లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.అంజయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి బ్రహ్మయ్య మాట్లాడుతూ... గ్రామంలో రీ సర్వే చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు. ఎంపీపీ రమావత్ జ్యోతి నాయక్ లబ్ధిదారుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. మళ్లీ రీ సర్వే చేయించి అర్వులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ ఉష దృష్టికి ఎంపీపీ తీసుకెళ్లారు. దీంతో శాంతించిన వారు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో చింతుల్ల సీపీఎం నాయకులు విజయ కుమార్, నర్సింహ, వెంటకయ్య తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల కోసం ఆందోళన పెద్దేముల్: పింఛన్ల పంచాయతీ ఆగడం లేదు. రోజూ ఏదో గ్రామం నుంచి తమకు పింఛన్ రావడం లేదంటూ ప్రజలు కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని బుద్దారం, పెద్దేముల్ తదితర గ్రామాలకు చెందిన పలువరు వృద్ధులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. మూడు రోజుల నుంచి తిరుగుతున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఈఓపీఆర్డీ సుహాసిని, పంచాయతీ కార్యదర్శులు విశ్వనాథం, అమృతలతో వాగ్వాదానికి దిగారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామంటూ అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి వెనుదిరిగారు. -
నిలువునా ముంచారు..
* చంద్రబాబు అన్ని రుణాలు మాఫీ చేస్తామన్నందుకే ఓట్లేశాం * ఇపుడేమో సవాలక్ష కొర్రీలేస్తున్నారు * రూల్స్ పేరుతో బ్యాంకర్లు కూడా అన్యాయం చేస్తున్నారు * ఏపీజీబీ ఎదుట ధర్నాలో మండిపడిన రైతులు అనంతపురం అగ్రికల్చర్ : అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తానంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత రైతుల నెత్తిన రాళ్లేశాడని రైతులు మండిపడ్డారు. రుణాలు కట్టొద్దని ఆయన చెప్పినందునే కట్టలేదని, ఇపుడేమో మాఫీ కాలేదని వాపోయూరు. చంద్రబాబునాయుడు ఓ రకంగా మోసం చేస్తుంటే బ్యాంకర్లు మరోలా ఇబ్బందులకు గురిచేస్తూ రుణమాఫీ వర్తించకుండా చేస్తున్నారని పలువురు రైతులు సోమవారం స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, గార్లదిన్నె మండలాలకు చెందిన రైతులు స్థానిక ఏపీబీజీలో పంట రుణాలు, బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించడంతో తమ రుణాలన్నీ మాఫీ జాబితాలో ఉంటాయని ఆశించారు. బంగారు కుదువపెట్టి తీసుకున్న రుణాలు మాఫీ జాబితాలో లేకపోగా బంగారు నగలు వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేయడంతో రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బంగారు నగలు పెట్టి తీసుకున్న రుణాలు పంట కింద కాకుండా మామూలుగా తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకర్లు చెప్పడంతో నిర్ఘాంతపోయారు. తమ చేతుల్లో ఏమీ లేదని, ఎల్డీఎం లేదా మీ-సేవలో అడగండంటూ ఉచిత సలహా ఇవ్వడంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరి రైతులకు సంబంధించిన రుణాలు రూ.50 వేలు లోపున్నా పూర్తిగా మాఫీ కాకపోవడంతో నిలదీశారు. అందులో తమ ప్రమేయం లేదంటూ స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం మాఫీ జరిగిందని అధికారులు జవాబిచ్చారు. బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నపుడు పట్టాదార్ పాస్‌పుస్తకం నకలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు పసలూరు ఆంజనేయులు, పొడరాళ్ల శ్రీనివాసులు, తోపుదుర్తి శాంతమ్మ, చియ్యేడు వెంకటరెడ్డి, కాటికానికాలువ రామానాయుడు తదితరులు ప్రభుత్వం చేసిన అన్యాయం, బ్యాంకర్లు వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశారు. రుణాలు తీసుకున్నపుడు ఎలాంటి షరతులు లేకున్నా మాఫీకి వచ్చే సరికి సవాలక్ష నిబంధనలు పెట్టి రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అసలే కరువుతో కుదేలై అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ఇలాంటి పరిస్థితి కల్పించడం దారుణమన్నారు. -
ఆత్మహత్యలపై స్పందించండి: లెఫ్ట్
* రూ.5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం * ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరు సాగుతుందని ప్రకటన సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వెంటనే వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై తన వైఖరిని ప్రకటించాలని పది కమ్యూనిస్టు పార్టీలు హెచ్చరిక జారీ చేశా యి. ఈ నెల 5వ తేదీ నుంచి 10 వరకు పది జిల్లాల్లో రైతు కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు చేపట్టిన బస్సు జాతాలకు ముగింపుగా గురువారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించాయి. ‘రైతుల ఆత్మహత్యల ను నివారించాలి, ఆర్థిక భద్రతను కల్పించాలి-ప్రభుత్వం వెంటనే స్పందించాలి’ నినాదం తో నిర్వహించిన ధర్నాలో పది వామపక్షాల నేతలు, రైతు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వామపక్షాల నేతలు మాట్లాడుతూ...ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రైవేట్ రుణాలను సంస్థాగత రుణాలుగా మార్చాలని, వాటిపై రెండేళ్ల మారటోరియం విధించాలని, రైతులకు వడ్డీలేకుండా బ్యాంకులు రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వారి కుటుంబాల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు తాము చేపట్టిన మొదటి దశ ఉద్యమం ముగిసినా, ప్రభుత్వం స్పందించేదాకా ఎన్నేళ్లయినా పోరాటం కొనసాగించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆత్మహత్యలు 5 వేలకు పెరుగుతాయి ప్రభుత్వం సహాయ చర్యలను వెంటనే చేపట్టకుంటే వ్యవసాయరంగ సంక్షోభం ముదిరి రైతుల ఆత్మహత్యలు అయిదువేలకు పెరిగే ప్రమాదముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్లు ఖర్చు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, 500 మంది రైతుల ఆత్మహత్యలకు రూ.5 లక్షల చొప్పున చెల్లించినా రూ.25 కోట్లు మాత్రమే అవుతుందన్నారు. ఆడపడుచుల కన్నీళ్లు తుడవలేని కరుకు గుండె సీఎంవా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గజే్వలులో అభివృద్ధిని సమీక్షించిన సీఎం కేసీఆర్, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులు పంట రుణాలను చెల్లించవద్దని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలని న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకటరామయ్య రైతులకు సూచించారు. తాము 160 మంది చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించామని, ఈ ఆత్మహత్యలు నిజమో కాదో తేల్చుకోవాలని ప్రభుత్వానికి సీపీఎం నేత సారంపల్లి మల్లారె డ్డి సవాల్ విసిరారు. పశ్య పద్మ (సీపీఐ), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), సాదినేని వెంకటేశ్వరరావు (న్యూడెమోక్రసీ), బండా సురేందర్‌రెడ్డి(ఫార్వర్డ్ బ్లాక్), జానకిరాములు (ఆర్ఎస్పీ), మూర్తి (లిబరేషన్), మురహరి (ఎంసీపీఐ-సీ), వీరయ్య (సీపీఐ-ఎంఎల్) ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. కాగా, రెండో దశ ఉద్యమ కార్యాచరణను శుక్రవారం ఎంబీ భవన్లో సమావేశమై వామపక్షాల నేతలు ఖరారు చేయనున్నారు.. -
సమస్యల వలయం
- ట్రిపుల్ ఐటీలో అధికారుల మధ్య విభేదాలు - కొరవడిన ప్రశాంతత - నష్టపోతున్న విద్యార్థులు వేంపల్లె(ఇడుపులపాయ): ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం ప్రశాంతత కొరవడింది. రోజుకో సమస్యతో సిబ్బంది, విద్యార్థులు నిరసనలు, ధర్నాలతో రోడ్డెక్కుతున్నారు. ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులలో కూడా విభేదాలు పొడసూపడంతో ఇక్కడ కూడా అధికారులు వర్గాలుగా విడిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తారాస్థాయికి చేరిన విభేదాలు ట్రిపుల్ ఐటీలో ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఇక్కడ ఉన్న అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇక్కడ నలుగురు అధికారులు ఉండగా.. ఇద్దరు ఒక వర్గంగా.. ఇద్దరు మరో వర్గంగా విడిపోయారని తెలుస్తోంది. వీరి కింది స్థాయి సిబ్బంది కూడా చెరో వర్గానికి వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు వీరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు బయటికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం వారు వెళ్లగానే యధా రాజా తథా ప్రజ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆందోళనల వెనుక ఎవరు.. ట్రిపుల్ ఐటీలో ఇటీవలి సంఘటనలు పరిశీలిస్తే వెనక నుంచి ఎవరైనా విద్యార్థులు, సిబ్బంది చేత ధర్నాలు, ఆందోళనలు చేయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులక్రితం భద్రతా సిబ్బంది అనవసరంగా తమను చితకబాదారని విద్యార్థులు ధర్నాకు దిగారు. దిగివచ్చిన అధికారులు ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి క్షమాపణతోపాటు ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను, ఒక హెచ్ఆర్‌టీని తొలగించారు. అంతటితో సమస్య సద్దుమణుగుతుందనుకున్న నేపథ్యంలో హెచ్ఆర్టీతో క్షమాపణ చెప్పించాలని మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వెనకనుంచి ఎవరో కథ నడిపిస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసుల జోక్యం తప్పనిసరి ట్రిపుల్ ఐటీలోని సమస్యలను పరిష్కరించేందుకు పోలీసుల జోక్యం తప్పనిసరి అవుతోంది. ఇటీవల జరిగిన అన్ని ఆందోళనల సమయంలోనూ పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, సీఐ మహేశ్వరరెడ్డి, వేంపల్లె, ఆర్కె వ్యాలీ ఎస్ఐలు, పోలీసులు సమస్యను పరిష్కరించే దిశగా పావులు కదిపారు. ప్రతిసారి భారీ సంఖ్యలో పోలీసులు ట్రిపుల్ ఐటీలో బందోబస్తు విధులు నిర్వర్తించాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెల్పుతోంది. -
అన్నదాతకు అండగా... పోరుబాట
నేడు బందరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ జిల్లావ్యాప్తంగా తరలిరానున్న నేతలు, శ్రేణులు స్వచ్ఛందంగాహాజరయ్యేందుకు సిద్ధమవుతున్న రైతులు, మహిళలు విజయవాడ : అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ గడిచిన ఆరు నెలలుగా రోజుకో ప్రకటన చేస్తూ తప్పించుకు తిరుగుతోంది. దీంతో అన్నదాతలు, డ్వాక్రా మహిళల రుణాలపై వడ్డీలు పెరిగి మరింత భారంగా మారింది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అన్ని జిల్లాల్లో ధర్నాలు చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10 గంటలకు మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేయనున్నారు. రైతులను విస్మరించారు... జిల్లాలో 7.03 లక్షల మంది రైతులకు 9,137 కోట్ల పంట రుణాలు, 58 వేల డ్వాక్రా గ్రూపులకు రూ.918 కోట్ల రుణాలు ఉన్నాయి. ఇవన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. వాటిపైనే విస్తృత ప్రచారం చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన చంద్రబాబు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానన్న హామీని తుంగలో తొక్కారు. కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అనంతరం రైతులకు ఇచ్చిన హామీ నుంచి బయటపడేందుకు అనేక రకాల నిబంధనలు విధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో గడచిన ఆరు నెలలుగా రుణమాఫీ జరగకపోగా అన్నదాతలకు బ్యాంకుల్లో అప్పు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆందోళనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే జిల్లాలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం ధర్నాకు సిద్ధమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కొలుసు పార్థసారథి నియోజకవర్గాల సమన్వయకర్తలతో, ముఖ్య నేతలతో, అనుబంధ విభాగాల నేతలతో చర్చించారు. దర్నాను పర్యవేక్షించడానికి పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లాకు మాజీ మంత్రి ఎం. వెంకట రమణను సమన్వయకర్తగా నియమించింది. ఈ క్రమంలో మోపిదేవి పార్టీ జిల్లా నేతలతో ధర్నా ఏర్పాట్లపై చర్చించారు. మరోపక్క రైతులు, డ్వాక్రా మహిళలు కూడా స్వచ్ఛందంగా ధర్నాకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. -
ప్రజాపోరుకు రెడీ
⇒ వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయసాయిరెడ్డి ఉద్బోధ ⇒డిసెంబర్ 5న ధర్నాతో ఉద్యమబాటకు శ్రీకారం ⇒జిల్లా విసృ్తతస్థాయి సమావేశంతో కార్యకర్తల్లో కదనోత్సాహం సీతమ్మధార(విశాఖపట్నం): ‘ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు అసమర్థ, అవినీతిపాలనపై ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలి’అని వైఎస్సార్‌కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. డిసెం బర్ 5న పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్న మహాధర్నాను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన జిల్లా పార్టీ విసృ్తతస్తాయి సమావేశంలో విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ఉద్బోధించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం కావాలన్నారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనే జిల్లా అభివృద్ధి చెందిందని సోదాహరణంగా వివరించారు. విమ్స్ స్థాపన వైఎస్సార్ కృషేనన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని ప్రతిపాదన వైఎస్సార్ హయాంలోనే వచ్చిందన్నారు. బీహెచ్‌పీవీ, షిప్‌యార్డ్ వంటి సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర నిధులు రాబట్టడం ద్వారా కార్మికులను ఆదుకున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో తాండవకు రూ. 55 కోట్లు, రైవాడకు రూ. 25 కోట్లు, కోనాం ప్రాజెక్టుకు రూ. 21 కోట్లతో పనులు ప్రారంభించి 75శాతం పూర్తి చేస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలల్లో బడ్జెట్లో ఒక్క పైసా కూడ కేటాయించిన పాపాన పోలేదన్నారు. వైఎస్ హయాంలో జిల్లాలో 3.20లక్షల ఇళ్లు నిర్మించారని, 3.20లక్షలమందికి కొత్తగా పింఛన్లు ఇప్పించారన్నారు. చంద్రబాబు ఈ ఆరునెలల్లో ఒక్క ఇల్లు కట్టించకపోగా 49వేల మందికి పింఛన్లు తొలగించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. డిసెంబర్ 15నాటికి జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తామన్నారు. పార్టీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు సుజయకృష్ణ రంగారావు మట్లాడుతూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొనున్న ధర్నాను విజయవంతం చేయడానికి గ్రామాలు, వార్డులవారీగా రైతులు, మహిళలను సమీకరించాలన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలతో ద్వారా గిరిజనుల జీవనాన్ని ఛిన్నాభిన్నం చేసే చంద్రబాబు కుట్రను తిప్పికొడతామన్నారు. బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గకపోతే గిరిజనులతో కలసి ప్రభుత్వంపై భారీపోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహం చెందకుండా పార్టీ బలోపేతానికి సమన్వయంతో పని చేయాలన్నారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాట్లాడుతూ సీపోర్టు, ఎయిర్‌పోర్టు, తూర్పుకనుమల్లో అపారమైన సంపదనుదోచుకోవడానికి చంద్రబాబు విశాఖపట్నంపై పడ్డారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గ్రామ,వార్డు, మండల, జిల్లాస్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి, బలోపేతం చేయాల్సి అవసరం ఉందన్నారు. జీవీఎంసీ ఎన్నికలలో సైనికుల్లా పనిచేసి అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వార మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్పారు. పార్టీ నేతలు ఏమన్నారంటే.. పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ 10ఏళ్ల తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో దొంగలు పడ్డ రీతిలో దోచుకుంటున్నారని విమర్శించారు. అధికార ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలముందుకు కెళ్లేందకు భయపడే పరిస్థితి ఉందన్నారు. పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ రుణాలు కోసం చంద్రబాబు కేవలం తమపార్టీ కార్యకర్తలు దండుకునే విధంగా కమిటీలు ఏర్పాటు చేసిన వ్యక్తలుచేత సంతకాలు పెట్టుకోవల్సిన దుస్థితి కల్పించారన్నారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు, భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలు కొనసాగిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల తరుపు పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూధనరెడ్డి మట్లాడుతూ వైఎస్ హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు బాబు పాలనలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయన్నారు. రాష్ట్ర రైతు సంఘం నాయకుడు నాగిరెడ్డి మాట్లాడుతూ రైతురుణ మాపీ అని చెప్పి చంద్రబాబు తిరిగి రైతు ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నారన్నారు. భార్యమెడలో తాళిబొట్టు వేలంపాట పడుతుందని ఆవేదనలో ఇటీవల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రంలో చాలా మందికి కంటతడి పెట్టంచిందన్నారు. రాష్ట్ర విద్యార్ధి విభాగం అధ్యక్షుడు సలాం బాబు మాట్లాడుతూ ఆంద్రప్రదశ్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని సాగితే, చంద్రబాబు పాలన అ అంటే అప్పులు, ఆ అంటే ఆత్మహత్యలుగా సాగుతుందని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు మాపీ, మాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హ్యాపీగా కాఫీ తాగుతూ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టి ఒక్క్కొరికి బీపీ పెంచే కార్యక్రమంలో తలమునకలయ్యి ఉన్నారని ఎద్దేవా చేసారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ భవిష్యత్తులో బలోపేతం అవ్వాలంటే సమిష్టి కృషి అవసరం అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ మాట్లాడుతూ తుపాన్లో ముఖ్యమంత్రి రూ. లక్షకోట్లుగా ప్రకటిస్తే, మరో మంత్రి 50వేల కోట్లని, ఇప్పుడు 21వేల కోట్లుగా నష్టాన్ని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికలలో పీఠం కైవసం చేసుకుని జగన్మోహనరెడ్డికి బహుమతిగా ఇవ్వాలన్నారు. గాజువాక సమన్వయకర్త తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ ధర్నాకు నగరంలో ప్రతినియోజకవర్గం నుంచి 4వేలమంది, జిల్లాలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వెయ్యిమంది చొప్పన వచ్చి విజయవంత చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక, పర్యాటక,సినీ రంగాలలో శరవేగంగా అభివృద్ది చెందడానికి రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త కోలా గురువులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి డిసెంబర్ 5న విశాఖలో తలపెట్టిన ధర్నాలో ప్రజాసమీకరణతో విజయవంతం చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు నివాళులు అర్పించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. కొయ్య ప్రసాదరెడ్డి స్వాగతోపన్యాసం చెబుతూ ఈ సమావేశంతో పార్టీ మళ్లీ పోరుబాట పట్టాలని ఆకాంక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ముగింపు ఉపన్యాసం ఇస్తూ ఈ సమావేశం స్ఫూర్తి డిసెంబర్ 5న నిర్వహించనున్న ధర్నా విజయవంతానికి పార్టీ కార్యకర్తలు ఉద్యుక్తమవుతారన్నారు. హుద్‌హుద్ తుపాను మృతులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నివాళి అర్పిస్తూ ఈ సమావేశంలో నేతలు కొద్దిసేపు మౌనం పాటించారు. వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు సాగి దుర్గాప్రసాద్‌రాజు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, పార్టీ నేతలు చెంగల వెంకటరావు, బొడ్డేట ప్రసాద్, సత్తి రామకృష్ణారెడ్డి, పోతల ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు, వివిధ అనుబంధ సంఘాల ప్రతి నిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
‘జీవన భృతి’పై ఆందోళన
ఆర్మూర్ తహశీల్ ఎదుట బీడీ కార్మికుల ధర్నా ఎన్నికల ముందు హామీని సీఎం కేసీఆర్ నెలబెట్టుకోవాలి ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శివనమాల కృష్ణ డిమాండ్ ఆర్మూర్ టౌన్: బీడీ కార్మికులకు నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి వెంటనే అమలు చేసి సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన చేపట్టారు. జంబీ హనుమాన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించగా వేలాది మంది బీడీ కార్మికులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార సభల్లో తనకు తానుగా బీడీ కార్మికుల బతుకు దుర్భరంగా ఉందని తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం లో ఏడు లక్షల మంది బీడీ కార్మికులుంటే 25 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరందరి ఓట్లను పొందేందుకు కేసీఆర్ హామీ ఇవ్వగా, కా ర్మికుల కుటుంబాలు నమ్మి ఓట్లు వేశాయని అన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సైతం బీడీ కార్మికుల జీవన భృతి చర్చకు వచ్చిందని అన్నారు. కానీ బడ్జెట్లో మాత్రం బీడీ కార్మికుల జీవన భృతి అంశానికి నిధులు కేటాయించలేదని, దీంతో కార్మికుల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోనైనా బీడీ కార్మికులకు జీవన భృతి అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖ రికి నిదర్శనమని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశా ల్లో ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అన్ని పక్షాల నాయకులను కలిసి కోరామని చెప్పారు. కా గా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేసిందని విమర్శించారు. ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేసిందని అన్నారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు, బహుళ అంతస్తుల భవనాలు, మెట్రో లైన్ పొడగింపునకు రూ. వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్ బీడీ కార్మికులకు రూ. 840 కోట్లు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. వెంట నే బడ్జెట్ సవరణ చేసి బీడీ కార్మికుల భృతికి నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు, పెన్షన్‌దారులకు జీవన భృతి ఎప్పటి నుంచి ఇచ్చేది స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అ నంతరం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎం ముత్తెన్న, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు బి దేవరాం, ఐఎఫ్టీయూ డివిజన్ నాయకుడు సూర్య శివాజీ ప్రసంగించారు. అనంతరం అరుణోదయ కళా బృందం ప్రదర్శనతో అంబేద్కర్ చౌరస్తా వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. తదనంతరం తహశీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ మేరకు తహశీల్దార్ డి శ్రీధర్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ఎన్ దా సు, సత్తెక్క, సార సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో మళ్లీ ధర్నా
విద్యార్థులతో డీఎస్పీ, సీఐ, డెరైక్టర్ల చర్చలు వేంపల్లె(ఇడుపులపాయ): ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో శనివారం పోలీసు పహారా నిర్వహించారు. శుక్రవారం తమను అనవసరంగా భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ ఇన్‌ఛార్జి సీఐ రసూల్ కొట్టారని, మహిళా సెక్యూరిటీ గార్డుల నుంచి వేధింపులు ఉన్నాయని విద్యార్థులు ధర్నాకు దిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన అధికారులు సీఐ రసూల్ క్షమాపణతోపాటు హెచ్ఆర్టీ చిన్నారెడ్డి, ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేస్తున్నట్లు డెరైక్టర్ ప్రకటించారు. 11డిమాండ్లను విద్యార్థులు పరిష్కరించాలని కోరగా, దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భోజనం విరామం తర్వాత మళ్లీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హెచ్ఆర్టీ చిన్నారెడ్డి ఎట్టి పరిస్థితులలోనూ క్షమాపణ చెప్పి తీరాలని భీష్మించుకు కూర్చున్నారు. విషయాన్ని తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి వారితో చర్చలు జరిపి, ఆందోళనను విరమించేలా చేశారు. శనివారం కూడా విద్యార్థులు ధర్నాకు దిగుతారని సంకేతాలు రావడంతో పోలీసు పహారా చేపట్టారు. డీఎస్పీ హరినాథబాబు, రూరల్ సీఐ మహేశ్వరరెడ్డిలతోపాటు 5మంది ఎస్ఐలు, 50మంది పోలీసులు క్యాంపస్‌లో పహారా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు అక్కడే ఉన్నారు. హెచ్ఆర్టీ చిన్నారెడ్డిని సస్పెండ్ చేసినట్లు డెరైక్టర్ చెబుతున్నారని, క్యాంపస్‌లోకి ఒకవేళ వచ్చిన తర్వాత పునరాలోచిస్తామని వివరించారు. అంతేకాక మొండి వైఖరిని విడనాడి ట్రిపుల్ ఐటీలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎస్పీ హరినాథబాబు సూచించారు. దీంతో ప్రస్తుతం అక్కడ సమస్య సద్దుమణిగినట్లు తెలుస్తోంది. -
గర్జించిన ఐకేపీ ఉద్యోగులు
-
డెరైక్టర్ డౌన్..డౌన్
వేంపల్లె(ఇడుపులపాయ) : ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శుక్రవారం రాత్రి రోడ్డెక్కారు. తమను అన్నివిధాలా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. డెరైక్టర్, సెక్యూరిటీ సీఐని తొలగించాలని నినాదాలు చేశారు. ఈనెల 16వ తేదీన ఈ-1 క్యాంపస్‌లోని సెకండ్ ఫ్లోర్లో కొంతమంది విద్యార్థులు ఐఐటీ ఫ్యాకల్టీ అధ్యాపకురాలిపై కామెంట్ చేశారు. దీంతో ఆమె డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి, సీఐ రసూల్, ఓఎస్డీ ప్రభాకర్‌రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. మీరు పట్టించుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులను గుర్తించి ఒక గదిలోకి పిలిపించుకుని కామెంట్ చేసిన వ్యక్తులు ఎవరు అని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు ముందుకు రావడం.. వారిపై చర్యలు తీసుకోవడమేకాకుండా చితకబాదినటు తెలుస్తోంది. తాము ఐఐటీ అధ్యాపకురాలు అనుకోలేదని.. స్టూడెంటు అనుకుని అలా వ్యవహరించామని విద్యార్థులు తెలియజేసినట్లు సమాచారం . అదే రోజున ఈ-4 విద్యార్థులు ఓ మెస్‌లో జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడికి వెళ్లి రాత్రి 11గంటలవరకు అక్కడే ఉండటంతో మెస్ నిర్వాహకులు సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారు. దీంతో అక్కడికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది ఇంత సమయం వరకు ఎందుకు ఉన్నారని ప్రశ్నించడంతో వారిపై తిరగబడినట్లు తెలిసింది. దీంతో అక్కడ వారిని కూడా సెక్యూరిటీ సిబ్బంది చితకబాదినట్లు తెలిసింది. ఈ రెండు సంఘటనలపై విద్యార్థులు దాదాపు 2వేలమంది శుక్రవారం సాయంత్రం రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. అనవసరపు సాకులు చెప్పి తమపై నిందలు వేస్తున్నారని.. విద్యార్థులంటేనే గౌరవం లేదని ఆరోపించారు. ఈ రెండు సంఘటనలు ఏకకాలంలో జరిగాయి. శుక్రవారం వరకు పరీక్షలు ఉండటంతో అంతవరకు ఓపిక పట్టి.. అదే రోజు సాయంత్రం విద్యార్థులు ధర్నాకు దిగారు. సమస్యలు తీర్చకపోతే ధర్నాను కొనసాగిస్తామని విద్యార్థులు తెగేసి చెప్పారు. డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి విద్యార్థులతో పొద్దుపోయేదాకా మాట్లాడారు. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. డెరైక్టర్ ఏమంటున్నారంటే.. : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలన్నదే తన తపన అని.. అందులో భాగంగా విద్యార్థులు క్రమశిక్షణ తప్పినప్పుడు కొన్ని చర్యలు తీసుకోక తప్పదని ఇన్‌ఛార్జి డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులను చితకబాదిన మాట అవాస్తవమని తెలిపారు. రెండు సంఘటనలు జరిగాయని తమ దృష్టికి రావడంతో సంబంధిత విద్యార్థులను కార్యాలయంలోకి పిలిపించి గట్టిగా మందలించామన్నారు. సీఐ క్షమాపణతో సమసిన వివాదం విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ట్రిపుల్ ఐటీ అధికారులు దిగి వచ్చారు. విద్యార్థుల సమస్యలను డెరైక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు చర్చించారు. తిరునాథ్ అనే విద్యార్థిని కొట్టినందుకు సెక్యూరిటీ ఇన్‌ఛార్జి, సీఐ రసూల్ క్షమాపణ చెప్పారు. విద్యార్థినిలను అనుచితంగా మాట్లాడిన హెచ్ఆర్టీ చిన్నారెడ్డి, మహిళా సెక్యూరిటీ గార్డులు ఉమా, ఫాతిమాలను సస్పెండ్ చేస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి విద్యార్థుల ముందు ప్రకటించారు. అలాగే పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీఇచ్చారు. క్యాంపస్‌లో లైట్లు, ఇతర సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకుని వేంపల్లె ఎస్ఐ హాసం, ఆర్కే వ్యాలీ ఎస్ఐ ప్రదీప్‌నాయుడు, పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. మాట మార్చిన డెరైక్టర్ : ట్రిపుల్ ఐటీ డైర్టర్ వ్యవహార శైలిపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలేదని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో మొదట తమ తప్పేమి లేదని.. విద్యార్థుల బాగు కోసమే మందలించామని చెప్పుకొచ్చిన డెరైక్టర్.. ఏ ఒక్క విద్యార్థిని కొట్టలేదని మీడియాకు తెలిపారు. తర్వాత అర్ధగంటకే విద్యార్థుల ముందు బహిరంగంగా తప్పు జరిగినందుకు హెచ్ఆర్టీ, మహిళా సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశామని ఇన్‌ఛార్జి సెక్యూరిటీ అధికారితో క్షమాపణ చెప్పిస్తామని చెప్పడం గమనార్హం. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
నెల్లూరు(రెవెన్యూ): చెరువు లోతట్టు ప్రాంతంలో పంటల సాగుకు అనుమతివ్వాలని నెల్లూరురూరల్ మండలం సౌత్‌మోపూరునకు చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా కనుపూరు కాలువ నీటితో 150 మంది పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం సాగుకు అనుమతి ఇవ్వలేదన్నారు. రైతులు జీవనోపాధి కోల్పోయామన్నారు. అధికారులు స్పందించి పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగు భూములకు పట్టాలివ్వండి పదేళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మం జూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొడవలూరు మండలం పెయ్యలపాళెం సీపీఐ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకుల మా ట్లాడుతూ పంటల సాగుకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. టైలర్స్ వర్కర్స్ బోర్డును ఏర్పాటు చేయాలి టైలర్స్ వర్కర్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం టైలర్లను గుర్తించి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.కోటి ఫండ్ ఇచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దానిని రద్దు చేసిందన్నారు. ఫెడరేషన్‌ను పునర్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించాలి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బిల్లులను ప్రతి నెలా సకాలంలో చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవ అధ్యక్షురాలు ఎస్కె.రెహనాబేగం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఇస్కాన్ సిటీకి మధ్యాహ్న భోజన కాంట్రాక్టు ముగుస్తున్నందున ఆ జీఓను రద్దు చేసి పొదుపు మహిళలకే పథకం అప్పగించాలన్నారు. యూనియన్ నాయకులు విజయమ్మ, విమలమ్మ, రాములమ్మ, రమణమ్మ పాల్గొన్నారు. హమాలీల సమస్యలు పరిష్కరించాలి ఎంఎల్ఎస్ పాయింట్లలో పని చేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ హమాలీలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వెం టనే ఇవ్వాలన్నారు. ఉదయగిరి, కావలి ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద హమాలీలు పని చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ శ్రీకాంత్‌కు వినతిపత్రం సమర్పించారు. -
కదం తొక్కిన జనం
అనంతపురం అర్బన్ : ప్రజలకు బాబు చేసిన మోసాలను .. ప్రజలకు తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు జనం కదం తొక్కారు. నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే , సీజీసీ సభ్యుడు బి.గురునాథరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలపై కళాకారుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎస్. సలాంబాబాలు హాజరయ్యారు. రైతుల, చేనేత, డ్వాక్రా మహిళ రుణ మాఫీ , ఫించన్లు, రేషన్‌కార్డుల విషయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజానికానుద్దేశించి నాయకులు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపద్ధాల హామీల జనం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. బాబు చేసిన మోసాలపై ఈ ధర్నా కార్యక్రమం ఆరంభం మాత్రమేనన్నారు. రైతులకు రూ. 87వేల612 కోట్లు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా మహిళలకు రూ. 14వేల 204 కోట్లు బేషరతుగా మాఫీ చేస్తామని ఇంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదన్నారు. రైతుల, డ్వాక్రా మహిలలకు దాదాపు రూ.25వేల కోట్లు అపరాధ వడ్డీ కట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతు రుణాల మాఫీ కోసం కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారన్నారు. పింఛన్ల మంజూరులో వివక్ష చూపుతున్నారన్నారు. ఐదు మాసాల్లోనే 16లక్షల75 వేలు తెల్ల రేషన్‌కార్డులు తొలగించి 67 లక్షల మంది కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. సబ్సిడీ బియ్యానికి రూ.3881 కోట్ల అవసరమైతే చంద్రబాబు బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ. 2318 కోట్లు మాత్రమేనన్నారు. బెల్టు షాపులను రద్దు చేస్తామని 13800 షాపులకు అనుమతులిచ్చారని విమర్శించారు. లోటు బడ్జెట్ ఉందని ఊరూరా చెబుతూ ... హుండీలు పెట్టుకొని విరాళాలు సేకరిస్తు తన జీవితాన్ని ఆడంబరంగా గడుపుతున్నారన్నారు. ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డెప్యూటీ తహశీల్దార్ కుమారస్వామికి నాయకులు అందచేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బి. ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్ రాగేపరశురాం, చవ్వారాజశేఖర్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, యువనాయకుడు బి.యోగిశ్వరెడ్డి, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి, మీసాల రంగన్న, అనంతచంద్రారెడ్డి, మైనార్టీ నాయకులు నదీం, నగర మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, కార్పోరేటర్లు సరోజమ్మ, జానకి, బాలాంజనేయులు, నగర యువజన నాయకులు మారుతినాయుడు, కసనూరు రఘునాధరెడ్డి ఎస్సీసెల్ నగర అధ్యక్షులు పూలకుంట పెన్నోబలేసు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు రిలాక్స నాగరాజు, బిసి మహిళా జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, బిసి జిల్లా అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు, ఆదినారాయణరెడి,్డ రూరల్ మండల అధ్యక్షులు ధనుంజయాదవ్,ప్రదానకార్యదర్శులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, ప్రమీళదేవి, కొనా రాజారెడ్డి, రమణారెడ్డి, రమేష్‌రెడ్డి, జెఎంబాషా, నిమ్మలనాగరాజు, , గవ్వల వెంకటేష్, గువ్వల రాజేష్‌రెడ్డి, బండిశ్రీకాంత్, బ్రహ్మానందరెడ్డి, యూపీ నాగిరెడ్డి, ఆదినారాయణ, పీరా, హజ్రాబీ, దేవి, సోనీ రమణ, ప్రమీళ, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
‘గాంధీ’లో అత్యవసర సేవలు బంద్
హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సాధారణ విధులను బహిష్కరించిన గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు బుధవారం మధాహ్నం నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. వైద్యశాఖ మంత్రి, డీఎం ఈలతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవలను బహిష్కరిస్తున్నామని జూడాల సం ఘం ప్రతినిధులు అభిలాష్, క్రాంతిచైతన్యలు తెలి పారు. విధులను బహిష్కరించిన అనంతరం జూడాలు గాంధీ ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేపట్టి ‘చెవిలో పువ్వు’ కార్యక్రమం నిర్వహిం చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో గాంధీ జూడా నరేష్ బ్యాగును పోలీసులు తనిఖీ చేయగా కిరోసిన్ బాటిల్, అగ్గిపెట్టె దొరికాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మరికొంతమంది వద్ద పోలీసులు బ్లేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం అత్యవసర సేవలు అందక నలుగురు రోగులు మృతి చెందారు. కాగా, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలంటూ రామంతాపూర్ ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాల విద్యార్థులు చేస్తు న్న ఆందోళన బుధవారం 31వ రోజుకు చేరింది. -
రాయల్ స్టార్‌బక్స్
టాటావారి స్టార్‌బక్స్ రుచులు సిటీవాసులకు తొలిసారి పరిచయం అయ్యాయి. చిక్కటి కాఫీతో పాటు చక్కటి కేక్స్, కుకీస్, మఫిన్స్, సాండ్విచ్ వంటి ఐటమ్స్ ఈ కాఫీ షాప్‌లో చవులూరిస్తున్నాయి. హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటైన ఈ స్టోర్స్ జూబ్లీహిల్స్‌లో కొలువుదీరింది. ఇక్కడ జరిగిన స్టార్‌బక్స్ ఓపెనింగ్ సెర్మనీలో సినీ ప్రముఖులు తళుక్కుమన్నారు. నమ్రతా శిరోద్కర్‌తో పాటు జూనియర్ మహేష్ గౌతమ్, చార్మి, హర్షవర్ధన్ రాదే తదితరులు ప్రారంభోత్సవంలో సందడి చేశారు. -
భారత్‌లో స్టార్‌బక్స్‌కు ఉజ్వల భవిత
న్యూయార్క్: భారత్‌లో స్టార్‌బక్స్‌కు బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందని స్టార్‌బక్స్ సీఈవో హోవార్డ్ షుల్జ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 25 కాఫీ స్టోర్లే ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులోనే వేలాది అవుట్‌లెట్స్‌ను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తర్వాత తమకు ఉండే అతి పెద్ద రెండు మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కానున్నదని ఆయన చెప్పారు. మరొక దేశం చైనా అని పేర్కొన్నారు. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ రూపొందించిన రిఇమాజినింగ్ ఇండియా: అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆప్ ఏషియాస్ నెక్స్ట్ సూపర్‌పవర్ అనే పుస్తకానికి రాసిన ఒక వ్యాసంలో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలో మొత్తం 60 వ్యాసాలున్నాయి. లబ్దప్రతిష్టులైన దిగ్గజ కంపెనీల సీఈవోలు, విద్యావేత్తలు, చరిత్రకారులు ఈ వ్యాసాలను రాశారు. విప్రో ప్రేమ్‌జీ, మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తదితరులు వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.స్టార్‌బక్స్‌కు భారత పెద్ద మార్కెట్ కాబోతోందని హోవార్డ్ షుల్జ్ అంచనా వేస్తున్నారు. అయితే భారత్‌లో ఈ లక్ష్యాలు సాధించడం అంత సులభమేమీ కాదని కూడా ఆయన అంగీకరించారు. భారత మార్కెట్లోకి ప్రవేశించడానికే తమకు ఆరేళ్లు పట్టిందని వివరించారు.