కదం తొక్కిన జనం | People skins Kadam | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన జనం

Published Thu, Nov 6 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

కదం తొక్కిన జనం

కదం తొక్కిన జనం

అనంతపురం అర్బన్ :
 ప్రజలకు బాబు చేసిన మోసాలను .. ప్రజలకు తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు జనం కదం తొక్కారు. నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే , సీజీసీ సభ్యుడు బి.గురునాథరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలపై కళాకారుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎస్. సలాంబాబాలు హాజరయ్యారు.  రైతుల, చేనేత,  డ్వాక్రా మహిళ రుణ మాఫీ , ఫించన్లు, రేషన్‌కార్డుల విషయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజానికానుద్దేశించి నాయకులు మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపద్ధాల హామీల  జనం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. బాబు చేసిన మోసాలపై ఈ ధర్నా కార్యక్రమం  ఆరంభం మాత్రమేనన్నారు. రైతులకు  రూ. 87వేల612 కోట్లు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా మహిళలకు రూ. 14వేల 204 కోట్లు  బేషరతుగా మాఫీ చేస్తామని ఇంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదన్నారు. రైతుల, డ్వాక్రా మహిలలకు దాదాపు రూ.25వేల కోట్లు  అపరాధ వడ్డీ కట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.  రైతు రుణాల మాఫీ కోసం కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారన్నారు.  పింఛన్ల మంజూరులో వివక్ష చూపుతున్నారన్నారు.

  ఐదు మాసాల్లోనే  16లక్షల75 వేలు తెల్ల రేషన్‌కార్డులు తొలగించి 67 లక్షల మంది కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. సబ్సిడీ బియ్యానికి రూ.3881 కోట్ల అవసరమైతే చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ. 2318 కోట్లు  మాత్రమేనన్నారు. బెల్టు షాపులను రద్దు చేస్తామని 13800  షాపులకు  అనుమతులిచ్చారని విమర్శించారు.  లోటు బడ్జెట్ ఉందని ఊరూరా చెబుతూ ... హుండీలు పెట్టుకొని విరాళాలు సేకరిస్తు తన జీవితాన్ని ఆడంబరంగా గడుపుతున్నారన్నారు.  

ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన  వినతి పత్రాన్ని డెప్యూటీ తహశీల్దార్  కుమారస్వామికి నాయకులు అందచేశారు.  కార్యక్రమంలో సీనియర్ నాయకులు బి. ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్ రాగేపరశురాం,  చవ్వారాజశేఖర్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, యువనాయకుడు బి.యోగిశ్వరెడ్డి, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి, మీసాల రంగన్న, అనంతచంద్రారెడ్డి, మైనార్టీ నాయకులు నదీం, నగర మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, కార్పోరేటర్‌లు సరోజమ్మ, జానకి, బాలాంజనేయులు, నగర యువజన నాయకులు మారుతినాయుడు, కసనూరు రఘునాధరెడ్డి ఎస్సీసెల్ నగర అధ్యక్షులు పూలకుంట పెన్నోబలేసు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు రిలాక్స నాగరాజు,  బిసి మహిళా జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, బిసి జిల్లా అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు, ఆదినారాయణరెడి,్డ రూరల్ మండల అధ్యక్షులు ధనుంజయాదవ్,ప్రదానకార్యదర్శులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి,  చింతకుంట మధు,  పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, ప్రమీళదేవి, కొనా రాజారెడ్డి, రమణారెడ్డి, రమేష్‌రెడ్డి, జెఎంబాషా, నిమ్మలనాగరాజు, , గవ్వల వెంకటేష్, గువ్వల రాజేష్‌రెడ్డి, బండిశ్రీకాంత్, బ్రహ్మానందరెడ్డి, యూపీ నాగిరెడ్డి, ఆదినారాయణ, పీరా, హజ్‌రాబీ, దేవి, సోనీ రమణ, ప్రమీళ, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement