న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఒకటైన భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు కట్టుబడి ఉన్నామని కేఫె చెయిన్ సంస్థ టాటా స్టార్‌బక్స్ వెల్లడించింది. భారత్ నుంచి స్టార్‌బక్స్ నిష్క్రమిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 76 నగరాల్లో 470 పైచిలుకు స్టోర్స్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించింది. టాటా గ్రూప్‌లో ఎఫ్‌ఎంసీజీ విభాగమైన టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్), అమెరికాకు చెందిన స్టార్‌బక్స్ కార్పొరేషన్ కలిసి జాయింట్ వెంచర్‌గా టాటా స్టార్‌బక్స్‌ను ఏర్పాటు చేశాయి. నిర్వహణ వ్యయాలు భారీగా ఉండటం, నష్టాలు పెరిగిపోతుండటం, మార్కెట్లో చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా స్టార్‌బక్స్ భారత్ నుంచి నిష్క్రమించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.
ఇదీ చదవండి: సోలారే సోబెటరూ..
రెస్టారెంట్ బ్రాండ్స్ క్విప్‌నకు సై
న్యూఢిల్లీ: రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్(గతంలో బర్గర్ కింగ్ ఇండియా) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల జారీ(క్విప్) చేపట్టనుంది. తద్వారా రూ. 500 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి ఈక్విటీ షేర్లు లేదా క్విప్‌నకు వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలియజేసింది. 2024 ఉద్యోగులకు షేర్ల కేటాయింపు(ఇసాప్)నకు సైతం బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా అర్హులైన డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులకు స్టాక్ ఆప్షన్లను జారీ చేయనున్నట్లు వివరించింది. ఇసాప్‌లో భాగంగా దాదాపు 1.05 కోట్ల ఆప్షన్స్‌ను గరిష్టంగా ఆఫర్ చేసే వీలున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment