ఎక్కువ జీతాలు తీసుకునే సీఈఓలు ఎవరంటే? టక్కున చెప్పే సమాధానం.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్. అయితే వీరి కంటే ఎక్కువ జీతం తీసుకున్న ఓ వ్యక్తి ఒకరున్నారని బహుశా.. కొంతమందికి తెలిసుండకపోవచ్చు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన జీతం ఎంత? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.
యాపిల్, గూగుల్ చీఫ్‌లు ఒక్కొక్కరు దాదాపు 75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 646 కోట్లు) ప్యాకేజ్ తీసుకుంటారు. కానీ ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks) సీఈఓ 'బ్రియాన్ నికోల్'(Brian Niccol) మాత్రం ఏకంగా 96 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం తీసుకుంటున్నారు. అంటే ఆయన జీతం సుమారు రూ. 827 కోట్లు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.
గత ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో కంపెనీలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ నికోల్.. జీతంలో దాదాపు 94 శాతం స్టాక్ అవార్డుల నుంచి వచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన కంపెనీలో చేరిన నెల రోజుల తరువాత 5 మిలియన్ డాలర్ల సైన్ ఆన్ బోనస్ కూడా పొందారు. దీంతో అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓలలో నికోల్ ఒకరుగా నిలిచారు.
సెప్టెంబర్ 2024లో నికోల్ బాధ్యతలు తీసుకున్నప్పుడు.. కంపెనీ ఆయన వార్షిక వేతన ప్యాకేజీ విలువ సుమారు 113 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే సీఈఓగా చేరిన కేవలం నాలుగు నెలల్లో 96 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు. గత ఏడాది స్టార్‌బక్స్ వరుస నష్టాలను చవి చూసిన సమయంలో.. సంస్థ భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగించి, ఆ స్థానంలో నికోల్‌ను నియమించింది.
ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment