ఉపాధ్యాయుల పోరుబాట
వచ్చేనెల 9న మహాధర్నా చేపట్టనున్న పీఆర్టీయూ
సీఎస్ రాజీవ్‌శర్మకునోటీసు అందజేత
ఉమ్మడి సర్వీసురూల్స్ అవుల్లోకి తేవాలి
వెంటనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి
పాఠశాలల మూసివేత యోచనను విరమించుకోవాలి
పీఆర్సీ బకారుులను మొత్తం జీపీఎఫ్ ఖాతాల్లో జవు చేయూల్సిందే
పనిచేయుని హెల్త్‌కార్డులు ఎవరికోసమని ప్రశ్న
హైదరాబాద్: తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు పోరుబాట పట్టనున్నారు. ఇందుకోసం మహాధర్నా చేపట్టనున్నారు. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఇబ్బందులు, పీఆర్సీ బకాయిలు, హెల్త్‌కార్డులపై ఆందోళనకు సిద్ధమైన ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్‌టీయూ-టీఎస్ వచ్చే నెల 9న మహాధర్నాకు పిలుపునిచ్చింది. తమ సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి తదితరులు సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలసి ధర్నా నోటీసు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 9న హైదరాబాద్‌లో 20 వేల మంది ఉపాధ్యాయులతో మహాధర్నా చేపడతామని చెప్పారు. ఆలోగా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుల డిమాండ్లు..
ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ లేక పర్యవేక్షణాధికారుల నియామకాలు ఆగిపోయి పాఠశాలల్లో
మిగతా 2వ పేజీలో ఠ
పర్యవేక్షణ కొరవడి, విద్యా బోధన దెబ్బతింటోంది. వెంటనే ఖాళీగా ఉన్న డిప్యూటీఈవో, డైట్ లెక్చరర్, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలి.
హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలల మూసివేత యోచనను ఉపసంహరించాలి.
- ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాలి.
- పదో పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లోనే జమచేయాలి. బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చి బాండ్లు అంటున్నారు. అందుకు ఒప్పుకొనేది లేదు.
- సీనియర్ టీచర్లకు 9వ పీఆర్సీలో నష్టం జరిగినందున ఇప్పుడు వెయిటేజీ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
- ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదు. వాటితో ప్రయోజనం లేకుండాపోయింది.
- రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
- ఉన్నత పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలి.
- పంచాయతీరాజ్, ఎయిడెడ్ పాఠశాలల్లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు అర్ధ వేతన సెలవులను (హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) నగదుగా మార్చుకునే వెంటనే పునరుద్ధరించాలి.
- డీఎస్సీ-2003లో ఎంపికై 2005లో నియమితులైన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
- విద్యార్థుల ప్రవేశ వయసును 5 నుంచి 3 ఏళ్లకు తగ్గించి... శిశు తరగతులను, ఇంగ్లిషు మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి.
- పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.