issues
-
అతీగతీలేని ‘వినతి’
సాక్షి, అమరావతి :ప్రజల నుంచి భారీఎత్తున విజ్ఞాపనలు తీసుకుంటున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వాటి పరిష్కారానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు జనం వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రతి శనివారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ వినతులు స్వీకరిస్తున్నారు. ప్రతిరోజూ కొందరు మంత్రులు కూడా అక్కడ విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలను చూసి జనసేన, బీజేపీ ఆఫీసుల్లోనూ ఈ తంతు సాగిస్తున్నారు. అలాగే, ప్రతి సోమవారం ఎప్పటిమాదిరిగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా టీడీపీ ప్రభుత్వం మార్చింది. జనం గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ ప్రభుత్వంలోనూ పెద్దఎత్తున తమ సమస్యలను మొర పెట్టుకుంటున్నా వాటికి పరిష్కారం మాత్రం దొరకడంలేదు. సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న వారికి సైతం ఎటువంటి ఊరట లభించడంలేదు. ఉదా.. నెలరోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన నబీల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి టీడీపీ ఆఫీసులో తన సమస్యపై సీఎంకు వినతిపత్రం ఇచ్చాడు.కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి పురోగతిలేదు. ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వస్తుండడంతో వాటిపై ఏంచేయాలో తెలీడంలేదని అధికారులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందుల గురించే ఎక్కువ మంది ఫిర్యాదుల చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నా అవి ఎప్పుడూ రొటీన్‌గా వచ్చే రెవెన్యూ సమస్యలేనని అధికారులు చెబుతున్నారు. వచ్చిన విజ్ఞాపనలను పరిష్కరించే పరిస్థితి లేకపోవడంతో అధికారులు కిందా మీదా పడుతున్నారు. దీంతో చేసేదిలేక 60 రోజుల్లో వినతిని పరిష్కరించాలి కాబట్టి ఈలోపే ఏదో ఒక కారణంతో దాన్ని మూసేసి అది పరిష్కారమైపోయినట్లు నమోదు చేస్తున్నారు. మరోవైపు.. అసలేమీ జరగకుండానే వినతిపత్రం ఇచ్చిన వారికి అది క్లియర్ అయిపోయినట్లు ఎస్ఎంఎస్లు వస్తుండడంతో వారు బిత్తరపోతున్నారు.కోర్టు కేసు లేకుండా ఉన్నట్లు చెప్పి మూసేశారు..తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అల్లవరం గ్రామానికి చెందిన భీమవరపు కటుమస్వామి జులై 15న ఆర్డీఓ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (ఎఫ్ఎంసీ) లేకుండానే తమ కుటుంబానికి చెందిన భూమిని మ్యుటేషన్ చేశారని విజ్ఞాపన ఇచ్చాడు. తన అమ్మమ్మ నూకాలమ్మ 2016లో చనిపోయిందని, ఆమెకు వారసత్వంగా ఉన్న భూమిని ఆమె చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా రెవెన్యూ అధికారులు వేరే కొందరికి మ్యుటేషన్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. అడుగుతుంటే పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు.ఆర్డీఓ ఈ వినతిని తీసుకుని ఎఫ్ఎంసీ లేకుండా మ్యుటేషన్ ఎలా చేస్తారని ఫిర్యాదు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వీఆర్ఓ విచారణకు వెళ్లాడు. కానీ, కొద్దిరోజులకు మీ సమస్య పరిష్కారమైందంటూ కటుమస్వామికి ఎస్ఎంఎస్ రావడంతో అతను విస్తుపోయాడు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అడిగితే కోర్టులో కేసు ఉందని తహశీల్దార్ రిపోర్టు ఇవ్వడంతో సమస్య పరిష్కారమైందని ఫిర్యాదును మూసివేసినట్లు చెప్పారు. అతను ఈ కేసు కోర్టు పరిధిలో లేదని అన్ని ఆధారాలు చూపడంతో నిజమేనని ఒప్పుకున్నా తాము చేసేదేంలేదని ఆర్డీఓ చేతులెత్తేశారు. 60 రోజుల్లోపు వినతిని పరిష్కరించాల్సి వుండడంతో కోర్టు వంకతో వినతిని తహశీల్దార్ క్లియర్ చేసినట్లు తేలింది.65 వేల సమస్యలు పరిష్కారమయ్యాయటఇలా ఇప్పటివరకు 65,211 సమస్యలను పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్) వెబ్సైట్లో జూన్ 15 నుంచి ఇప్పటివరకు 88,761 విజ్ఞాపనలు అందగా, 65,211 విజ్ఞాపనలను పరిష్కరించినట్లు ప్రభుత్వం అందులో పేర్కొంది. అయితే, ఇవన్నీ గోకవరం కేసు మాదిరిగానే ఏమీ అవకుండానే కాగితాల్లోనే పరిష్కారమైనట్లు రాసుకున్నారని బాధితులు వాపోతున్నారు. -
జరా జాగ్రత్త ..! అలా చేస్తే బ్లాక్ లిస్టింగే.. ట్రాయ్ హెచ్చరిక
-
ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు: మెలానియా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం అతని భార్య మెలానియా తన ఆవేదనను ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా, థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల షూటర్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయమయ్యింది.మెలానియా తన భావోద్వేగాలను ఒక ప్రకటనలో పంచుకుంటూ ట్రంప్‌ను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ఘటనలో గాయపడినవారికి సానుభూతి ప్రకటించారు. ఆమె తన ప్రకటనలో.. ‘డొనాల్డ్ అభిరుచిని, నవ్వును, మాటల చాతుర్యాన్ని, సంగీతంపైగల ప్రేమను, అతని స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక అమానవీయ రాజకీయ ఘటన ఇది. ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు. నా భర్త జీవితంలో నాకు నచ్చిన ప్రధాన అంశం అతని మానవతా దృక్పథం.ఆయన ఉదారమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మంచి, చెడు సమయాల్లో నేను అతని వెంట ఉన్నాను. ప్రేమకు భిన్నమైన అభిప్రాయాలు, విధానాలు, రాజకీయ ఆటలు హీనమైనవని మనం మరచిపోకూడదు. మా వ్యక్తిగత, నిర్మాణాత్మక జీవిత కట్టుబాట్లు మా మరణం వరకు అలానే కొనసాగుతాయి. దేశంలో మార్పు పవనాలు వచ్చాయని అంటున్నారు. ఈ మాటకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. రాజకీయ విభేదాలకు అతీతంగా స్పందిస్తున్నవారిని అభినందిస్తున్నాను’ అని మెలానియా పేర్కొన్నారు. pic.twitter.com/IGIWzL6SMJ— MELANIA TRUMP (@MELANIATRUMP) July 14, 2024 -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్
మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు ధరించి స్కూలుకు రాకూడదు. ఈ విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయులు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆ నోటిఫికేషన్లో వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులకు వేర్వేరు రకాల డ్రెస్ కోడ్లు అమలు చేయనున్నారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ , టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్, చురీదార్, లేదా చీర ధరించాలని తెలిపారు. పురుష ఉపాధ్యాయులు, షర్టు, ప్యాంటు ధరించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. షర్టును ప్యాంట్‌లోకి టక్ ఇన్ చేయాలని సూచించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా ఈ డ్రెస్ కోడ్‌పై పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఏమి ధరించాలి? ఏమి ధరించకూడదనేది వారి వ్యక్తిగత విషయమని, దానిపై వారికి ప్రత్యేక హక్కు ఉంటుందని వారంటున్నారు. ఉపాధ్యాయుల వస్త్రధారణ విద్యార్థులపై దుష్ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతోనే డ్రెస్‌కోడ్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
నటి ఒలివియాకి కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!
సెలబ్రెటీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు చాలామంది ఈ బ్రెస్ట్ కేన్సర్ బారినే పడుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్లో తెలియదు గానీ ఈ భయానక వ్యాధుల బారిన పడటం జరుగుతోంది. అయితే ఈ రొమ్ము కేన్సర్ కొందరిలో రెండు రొమ్ములోనూ, మరికొందరిలో ఒక్కదానిలోనే వస్తోంది. అయితే చాలావరకు దీన్ని ముందుగానే గుర్తించడం సాధ్యపడదు. పైగా ఒక్కోసారి ఇది నిర్థారణ అయ్యాక వేగవంతంగా విస్తరిస్తుంటుంది. చాలా కేసుల్లో రేడియోథెరఫీతో నివారించగా, మరికొన్ని కేసుల్లో పూర్తిగా రొమ్ముని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వివరంగా తెలుసుకుందామా!.యూఎస్ నటి ఒలివియా మున్ గతేడాది రొమ్ము కేన్సర్ బారిన పడినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ విషాదకర వార్త తన చెవిన పడిందంటూ చెప్పుకొచ్చింది. తాను ఆ టైంలో పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడేంత వరకు ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తన రెండు రొమ్ముల్లో ఈ కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని పేర్కొంది. అయితే ఈ కేన్సర్ చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు స్కానింగ్‌లో తేలింది. దీంతో తాను డబల్ మాస్టెక్టమీ చేయించుకున్నాని అని తెలిపింది.ఆ తర్వాత సుమారు పది నెలల వరకు దాదాపు నాలుగు శస్త్ర చికిత్సలు చేయించుకున్నానని చెప్పింది. ఈ హెల్త్ జర్నీలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో మద్దతివ్వడం వల్లే దీన్నుంచి బయటపడగలిగానని చెప్పుకొచ్చింద. ఆమె ఇటీవల 2024 ఆస్కార అవార్డుల వేడుకల్లో తన భాగస్వామితో కలిస రెడ్‌కార్పెట్‌పై మెరిసింది కూడా. ఈ నేపథ్యంలో బ్రెస్ట్ కేన్సర్ ఇంత ప్రమాదమా? అన్ని సర్జరీలు తప్పవా? అనే ఆసక్తికర విషయాలు చూద్దాం!. View this post on Instagram A post shared by o l i v i a (@oliviamunn)రొమ్ము కేన్సర్ అంటే..రొమ్ము క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఆదిలోనే గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. దీని కారణంగా రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. ఇది ఎక్కువగా స్త్రీలకు వస్తుంది. చాలా అరుదైన సందర్భాల్లో పురుషులకు వస్తుంది. అంతేగాదు మహిళ్లో కూడా కొందరికీ రెండు రొమ్ములోనూ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎవరికీ ఎక్కువంటే..కుంటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన మహిళలకు వస్తుంది. అంతేగాదు 12 సంవత్సరాల కంటే ముందు రజస్వల అయినా లేదా 55 సంవత్సరాల తరువాత మోనోపాజ్ దశలో కూడా ఈ రోమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఊబకాయం, అధికబరువు, వల్ల రోమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.అధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకునేవాళ్లు కూడా ఈ కేన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పొగాకు, మద్యపానం సేవించే వారు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు..రొమ్ములో నొప్పి లేకుండా గడ్డలుగా ఉండటంరొమ్ముపై చర్మం మసకబారడంచనుమొనలపై దద్దుర్లు లేదా పుండ్లుచనుమొనల ఆకృతిలో మార్పులుచనుమొనల గుండా రక్తపు మరకల్లా కనిపించడంచంకలో వరకు రొమ్ము నిండుగా ఉన్నట్లు కనిపించటంచికిత్స విధానాలు..శస్త్రచికిత్సరేడియోథెరపీహార్మోన్ ల థెరపీకీమోథెరపీఈ బ్రెస్ట్ కేన్సర్‌లో చాలా వరకు కణితిని మాత్రమే తొలగించేందుకు సర్జన్లు యత్నిస్తారు. దీనిని బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ(Breast Conservation Surgery) అని అంటారు. కేన్సర్ తిరిగి వచ్చే అవకాశాలను తగ్గించడం కొరకు ఆపరేషన్ తరువాత కూడా రోగులకు రేడియేషన్, కీమోథెరపీ వంటివి ఇవ్వడం జరుగుతుంది. నివారణ..ఏ కేన్సర్ అయినా ముందుగానే గుర్తిస్తే ప్రమాదం నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఎప్పటికప్పుడూ మహిళలు ఏడాదికి ఒక్కసారైన రొమ్ముకి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచుకోవాలిరోజూ వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. (చదవండి: నో స్మోకింగ్ డే! ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహారపదార్థాలివే!) -
సుష్టిగా తిన్నాక ‘కునుకు’ మంచిదే, కానీ ఈ డేంజర్ కూడా ..!
పగటిపూట అన్నం తిన్నవెంటనే కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అందులోనూ వేసవి వచ్చిందంటే కాసేపైనా నిద్రపోవాల్సిందే. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? ఎంతసేపు కునుకు తీస్తే మంచిది? పగటిపూట నిద్రపోవడం కొంతవరకూ మంచిదే. పని నుంచి కొంచెం విశ్రాంతి తీసుకోవడంతో అలసట దూర మవుతుంది. ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.అందుకనే దీన్ని పవర్ న్యాప్ అని అంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ముప్పే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందట. కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. వీరికి మినహాయింపు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. మిగిలినవారు గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి. పగటి నిద్ర నష్టాలు ♦ ఊబకాయం ♦ రాత్రి నిద్రకు భంగం, బాడీ బయలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది ♦ రాత్రి నిత్ర లేకపోతే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ♦ డిప్రెషన్ -
మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!
'చిన్నపిల్లల చర్మం చాలా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వారి చర్మం పొడిబారడంతో అనేక సమస్యలు వస్తాయి. మొదటే మృదువైన చర్మం. దానికి తోడు చలికాలంలో పొడిబారి పగలడం, చిట్లడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘అటోపిక్ డర్మటైటిస్’ అంటారు. ఈ సీజన్లో నెలల పిల్లలు మొదలు.. ఎదిగిన పిల్లల్లోనూ అనేక వయసు చిన్నారులో కనిపించే అటోపిక్ డర్మటైటిస్ సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలిపే కథనమిది.' అటోపిక్ డర్మటైటిస్లో మొదట్లో చర్మం పొడిబారి, దురదతో ఎర్రగా మారుతుంది. పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘లైకెనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద ఇంకా పెరుగుతుంది. దాంతో మరీ ఎక్కువగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం మరింత మందమవుతుంది. ఈ ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) సాగుతుంటాయి. కొందరిలో ఇదొక దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా కూడా మారవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే.. చలికాలంలో చెమ్మ (తేమ) ఇగిరిపోతూ ఉండటంతో చర్మం పొడిబారడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇలాంటప్పుడు చర్మం పొడిబారి, ఎర్రబారుతుంది. కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఆస్తమా, డస్ట్ అలర్జీలు ఉండేవారిలో అటోపిక్ డర్మటైటిస్ సమస్య ఎక్కువ. వివిధ వయసుల పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఇలా.. రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు.. ఈ వయసు పిల్లల్లో చర్మం ఎర్రబారడం ప్రధానంగా ముఖంపైన, మెడ దగ్గర కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో దేహంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా జరిగే అవకాశముంది. ఉదాహరణకు పాకే పిల్లల్లో వాళ్ల మోకాళ్లు నేలకు ఒరుసుకుపోతుండటం వల్ల మోకాళ్ల దగ్గర ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌తో చర్మం ప్రభావితం కావడమన్నది చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే.. మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ వయసు పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్లైన్) ఉన్నచోట్ల దురద వచ్చి, అది పగులు బారుతున్నట్లవుతుంది. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో చర్మం పొడిబారడం కాస్త ఎక్కువ. పైగా ఈ పొడిబారడమన్నది మోకాళ్ల కింది భాగంలో ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు.. పొడి బారినప్పుడు బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా కనిపిస్తుంటాయి. ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవులు పొడిబారి, పగుళ్లలాగా వస్తుంది. పెదవుల చుట్టూ చర్మమంతా పగుళ్లుబారి ఓ సరిహద్దులా స్పష్టంగా కనిపిస్తూ, ఆ భాగం మంట పుడుతుంటుంది. దీన్ని ‘పెరీ–ఓరల్ డర్మటైటిస్’ అంటారు. ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో.. ఏడేళ్ల వయసు నుంచి (అంతకంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే) పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఈ వయసునుంచి లక్షణాల తీవ్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. అయితే ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. చికిత్స / మేనేజ్మెంట్ తొలి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్): అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు తొలి దశల్లో చికిత్స చాలా తేలిక. చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్ వంటివి రాస్తే చేస్తే చాలు. పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం తగ్గుతుంది. రాత్రి నిద్రపడుతుంది. అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం: సబ్బులు, డిటర్జెంట్లు.. అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్నది చూసుకోవాలి. అలా జరుగుతుంటే.. సబ్బులను, డిటర్జెంట్లను మార్చాలి. ఘాటైన సబ్బులకు బదులు మైల్డ్‌గా ఉండే క్లెన్సెర్స్ తో శుభ్రం చేసుకోవాలి. పిల్లల్ని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి (ముఖ్యంగా నట్స్, సీ ఫుడ్), ఒకవేళ ఆ ఆహారాలతో అలర్జీ వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉంచాలి. పూత మందులతో చికిత్స: పిల్లలకు ఎమోలియెంట్స్ అని పిలిచే.. లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్ వంటివి పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా వాడే స్టెరాయిడ్స్ కూడా వాడవచ్చు. పైపూతగా వాడే స్టెరాయిడ్స్‌ను ఎక్కువ రోజులు వాడకుండా ఉండేందుకు టాపికల్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ వాడవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పైపూత యాంటీబయాటిక్, స్టెరాయిడ్ కాంబినేషన్స్‌ను వాడవచ్చు. నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు: నిద్రకు ముందు డాక్టర్ సలహా మేరకు నాన్ సెడెటివ్ యాంటీహిస్టమైన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. రెండోదశ చికిత్స: మొదటిదశ చికిత్స (ఫస్ట్‌లైన్ ట్రీట్మెంట్)తో అంతగా ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ డోస్ పెంచడమూ, అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ చికిత్స: కొంతమంది పిల్లలకు అల్ట్రావయొలెట్ బి– కిరణాలతో చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి. మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్మెంట్): నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటి ఈ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే జరగాలి. వెట్ ర్యాప్ టెక్నిక్.. అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ‘వెట్ ర్యాప్ టెక్నిక్’తో మంచి ఫలితాలుంటాయి. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట ఎమోలియెంట్స్ పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన బ్యాండేజ్‌ను ఒక పొరలా కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొరలా పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. దీన్నే వెట్ ర్యాప్ టెక్నిక్ అంటారు. దీంతో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రతను తగ్గించవచ్చు. లక్షణాలు.. చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటిగుల్లలూ రావచ్చు. ఎర్ర బారినచోట చర్మం పొట్టు కట్టినట్లు అవుతుంది. మందంగానూ (లైకెనిఫికేషన్) మారుతుంది. కొన్నిసార్లు కాస్తంత పొట్టు రాలడంతోపాటు అక్కడ గాటు కూడా పడవచ్చు. మందంగా తెట్టుకట్టిన చర్మం పై పొర లేచిపోయినప్పుడు అక్కడ ద్రవం ఊరుతుండవచ్చు (ఊజింగ్). ఈ దశలోనూ చికిత్స అందకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ ఇవి చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..! -
ఇవి చదవడంతో మీకు ఏం జరుగుతుందో తెలుసా..!
వార్తలు వినడం, చదవడం, చూడడం ద్వారా మనచుట్టూ ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందే. సామాజిక, రాజకీయ, మానవీయ కథనాల ద్వారా ప్రపంచంతో సంబంధం కలిగి ఉండాలి కూడా. అయితే మానవీయ కథనాలకంటే మనసును గాయపరిచే కథనాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మంచికంటే చెడు ఎక్కువగా ఉంటుంది. అలాంటి సంఘటనలను ఒక వార్తగా తెలుసుకోవడం వరకే పరిమితం చేయాలి. నేరకథనాలను చూసేటప్పుడు మనసు ఉద్వేగానికి లోనవుతుంది, ఆ మేరకు దేహంలో రక్తప్రసరణ వేగం పెరగడం, హార్మోన్లు ప్రభావితం కావడం వంటి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రైమ్ వార్తల ఆధారంగా అల్లుతున్న సుదీర్థ కథనాలకు మన రోజులో ఎక్కువగా చోటివ్వకూడదని చెప్తున్నారు యూఎస్ ఆధారిత మేయో క్లినిక్ హెల్త్ సిస్టమ్ ప్రతినిధులు. పిల్లలు, వయసు మీరినవాళ్లు ఇంట్లో ఉన్న సమయంలో క్రైమ్ థిల్లర్ సినిమాలను పెట్టకూడదు. వీటివల్ల పిల్లలు తరచూ మానసిక ఆందోళనలకు లోనవుతుంటారు. పెద్దవాళ్లలో గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. ఇలా రోజూ జరుగుతుంటే ఈ పరిస్థితి గుండె సమస్యలకు దారి తీస్తుంది. అందుకే లైఫ్ వెల్‌బీయింగ్‌కి క్రైమ్ స్టోరీలకు దూరంగా ఉండడం కూడా ప్రధానమే. ఇవి చదవండి: మీకు తెలుసా..! మీ ఆరోగ్యం మీ ఆలోచనలతోనేనని.. -
మహిళల సమస్యలపై ‘సాహస్’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ‘సాహస్’పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ పోర్టల్‌లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ‘గెట్ హెల్ప్’ఆప్షన్ ఉన్నట్టు వారు వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7331194540 నంబర్లోనూ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. సాహస్ పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించామని, మహిళల్లో అవగాహన కోసం దీనిపై మరింత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు మొదలు.. లైంగిక వేధింపులపై ఎలా ఫిర్యా దు చేయాలి, న్యాయ సాయం ఎలా పొందాలో పోర్టల్‌లో పొందుపరిచినట్టు తెలిపారు. ఫిర్యాదులకు https:// womensafetywing. telangana. gov. in/ sahas/ లో క్లిక్‌చేసి వివరాలు పొందవచ్చని వివరించారు. -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్‌గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్‌లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్‌లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్‌ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్‌లో ‘మీ స్కూల్ కరిక్యులమ్‌లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్‌తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్‌లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
Electoral bonds case: పలు సమస్యలున్నాయి!
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పారీ్టలన్నింటికీ అవి సమానావకాశం కలి్పంచకపోతే వివక్షే అవుతుందని అభిప్రాయపడింది. ‘అంతేగాక ఈ పథకంలో అస్పష్టత కూడా దాగుంది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు (ఎస్బీఐ), దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది’ అని అభిప్రాయపడింది. అంతేగాక విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిగకుండా ఎటువంటి రక్షణా లేదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఏ పార్టీ ఎంత పవిత్రమైనదో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం’’ అని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజేఐ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం రోజంతా విచారణ జరిపింది. ‘‘ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశం అభినందనీయమే. కానీ ఈ పథకంలో అతి పెద్ద సమాచార లోపముంది’’ అని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు. -
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా నినాదాలతో హోరెత్తింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, లేకపోతే సమాజంలో మార్పు ఉండదని ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీల బతుకులు మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, డాక్టర్ ఎన్ మారేష్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఆర్.కృష్ణయ్యతో పాటు ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో జబ్బల శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, పద్మలత, నీలం వెంకటేష్, భూపేష్ సాగర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కృష్ణా’లో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాల కోసం సెపె్టంబర్ 30 తేదీ వరకు తెలంగాణకు 6.04 టీఎంసీలు, ఏపీకి 25.29 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఈనెల 21న హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కన్వినర్ డీఎం రాయిపూరే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 15.609 టీఎంసీలు, శ్రీశైలంలో 58.865 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని, ఇండెంట్లలో కోరిన విధంగా తాగు, సాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేసేందుకు నిల్వలు సరిపోవని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి ఆశించిన మేర వరద వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి కేటాయింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ 12 టీఎంసీలు, ఏపీ 7 టీఎంసీలు వాడుకున్నాయి ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఏపీ 7.427 టీఎంసీ లు, తెలంగాణ 12.595 టీఎంసీలు కలిపి మొ త్తం 20.022 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకున్నట్టు త్రిసభ్య కమిటీ చెప్పింది. ♦ నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా ఏపీ 3.592 టీఎంసీలు, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 2.088 టీఎంసీలు, సీడబ్ల్యూఎస్(తాగునీటి పథకం) ద్వారా 1.748 టీఎంసీలను ఏపీ వాడుకున్నట్టు పేర్కొంది. ♦ నాగార్జునసాగర్ప్రాజెక్టు నుంచి జంట నగరాల తాగునీటి అవసరాలకు 3.493 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా 2.921 టీఎంసీలు, ఎడమకాల్వ ద్వారా 1.536 టీఎంసీలు కలిపి మొత్తం 7.95 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.771 టీఎంసీలు, తాగునీటి కోసం 0.874 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. కృష్ణాబోర్డుకు లేఖ: కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ అవసరాలకు కేవలం 4.8 టీఎంసీలను నాగార్జునసాగర్ నుంచి కేటాయించడం పట్ల తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుద ల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్టు తెలిసింది. కృష్ణా బోర్డు నిర్ణయంతో తెలంగాణలో తీవ్ర తా గునీటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
కొంచెం నెమ్మదిస్తేనే... నిలవగలం!
గడచిన శతాబ్దాల్లో మనిషి అనూహ్యమైన ప్రగతి సాధించాడు. బొగ్గు, వంటగ్యాస్, సహజ వాయువుల శక్తిని ఒడిసిపట్టి, ఇంధన విప్లవం సాధించడంతో సమాజం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. ఆర్థిక అభివృద్ధి అనేది సామాజిక ఆకాంక్షలు పెరిగేందుకు దోహదపడింది. అదే సమయంలో మానవజాతి భవిష్యత్తు కూడలికి చేరింది. అభివృద్ధి వెంట పరుగులు పెట్టడాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. మానవజాతి మరిన్ని కాలాలు మనుగడ సాగించాలంటే ఈ ఆలోచన, సమీక్ష అత్యవసరం. అభివృద్ధితో వచ్చిన ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కేన్స్ చెప్పినట్లు, మనిషి జీవన ప్రమాణం కొన్ని వేల ఏళ్లపాటు స్తబ్ధుగానే ఉండింది. శిలాజ ఇంధనాల వాడకం మొదలుకావడం అంటే 18, 19వ శతాబ్దం నుంచే దీంట్లో పెను పురోగతి మొదలైంది. బొగ్గు, వంటగ్యాస్, ముడిచమురు అందుబాటులోకి రావడం మన జీవితాలను సమూలంగా మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దాల్లోనే సగటు ఆయుష్షు రెట్టింపు అయ్యింది. వేల కిలోమీటర్ల దూరాన్ని గంటల్లో దాటేయగలుగుతున్నాం. ప్రపంచం మూలమూల ల్లోని వారితోనూ సమాచార వినిమయం చిటికెలో జరిగిపోతోంది. వృద్ధి చెందుతున్న టెక్నాలజీ, దాని విపరిణామాలూ ప్రపంచ రూపు రేఖలను మార్చేశాయి అనడంలో సందేహం లేదు. కానీ ఈ అనూహ్య వేగానికి మనం మూల్యం కచ్చితంగా చెల్లిస్తున్నాం. మరింత ఎక్కువ ఉత్పత్తి చేయాలి... అది కూడా సమర్థంగా జరగాలన్న ఆదుర్దా మనల్ని మనం సమీక్షించుకునే, విమర్శించు కునే... ప్రకృతితో మనకున్న సంబంధాన్ని మదింపు చేసుకునే సమ యమూ ఇవ్వడంలేదు. పైగా... వలసలు, మనిషి చలనశీలతలకు ముడిపడి ఉన్న రాజకీయ సవాళ్లు కూడా కాలంతోపాటు సంక్లిష్టమ వుతూ పోయాయి. ఇప్పుడు ప్రయాణమూ సులువే, పెద్ద ఎత్తున వలస వెళ్లిపోవడమూ సులభమే. వీటి ప్రభావం వనరులపై పడుతోంది. వలస వెళ్లిన ప్రాంతాల సంస్కృతులతో ఘర్షణలకు కారణ మవుతున్నాయి. సామాజిక సమన్వయమూ దెబ్బతింటోంది. సరి హద్దులు పలుచనైపోయి ప్రపంచం కుంచించుకుపోతున్న కొద్దీ పరిస్థి తులు మరింత ముదురుతున్నాయి. అందుకే ఒక క్షణం ఆగి ఈ సవాళ్లను దీర్ఘాలోచనలతో, సమతుల దృష్టితో పరిష్కరించాల్సి ఉంటుంది. సుస్థిరత–అభివృద్ధి మనిషి శతాబ్దాలుగా ఇంధన వినియోగమనే వ్యసనానికి బానిస. శిలాజ ఇంధనాలు మనల్ని ముందుకు పోయేలా చేసినా ప్రపంచాన్ని వాతావరణ మార్పుల అంచున నిలబెట్టింది కూడా ఇవే. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు పెద్దపీట వేయాల్సిన సమయం ఇదే. అయితే ఈ మార్పు జరగాలంటే గనుల తవ్వకాలు, నిర్మాణాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్నది విమర్శకుల అలోచన. పర్యావరణ అనుకూల టెక్నాలజీల కోసం అవసరమైన రాగి, నికెల్, కోబాల్ట్, ఇతర ఖనిజాలు మన అవసరాలకు తగినన్ని ఉన్నాయా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యల్లో కొంత నిజం లేకపోలేదు. కానీ.. మనిషి తన సృజ నాత్మకతతో వీటిని అధిగమించడం పెద్ద కష్టమూ కాదు. భూమిలో ఈ అత్యవసరమైన లోహాలు తగినన్ని ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. కాకపోతే వీటి శుద్ధీ కరణ పద్ధతులు మాత్రం సమస్యాత్మకమైనవి. వీటిని అధిగమించ డమూ కష్టమేమీ కాదు. డిమాండుకు తగ్గట్టు సరఫరాలను పెంచగలిగే పెట్టుబడిదారీ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే ఈ సవాళ్లను ఎదుర్కోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఈ క్రమంలో పర్యావరణ, సామాజిక సమస్యలను విస్మరించడం సరికాదు. ‘రేర్ ఎర్త్మెటల్స్’ ఉత్పత్తిలో, గ్రీన్ టెక్నాలజీల్లో ముందువరసలో ఉన్న చైనాలో పర్యావరణ పరిస్థితి దిగజారిపోవడం, కాలుష్యం, కొన్ని వర్గాల సామాజిక బహిష్కరణ, ఆరోగ్య అంశాలు మనకు హెచ్చరికలుగా నిలవాలి. ఇంకో కీలకమైన విషయం... పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకోవాలంటే మన ఆలోచనా ధోరణుల్లోనూ మార్పులు రావాలి. సుస్థిరత అనేది అభివృద్ధికి అడ్డంకి కాదనీ, మెరుగైన భవిష్యత్తుకు మార్గమనీ గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధులకు పొంతన కుదరదన్న ద్వైదీభావం సరికాదని తెలుసుకోవాలి. నిజానికి పర్యావరణ అనుకూల విధానాలు ఆర్థిక వృద్ధిని పెంచుతాయనీ, నూతన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందనీ అర్థం చేసుకోవడం ముఖ్యం. పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడి పనిచేసే కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇదో మేలి అవకాశం. జీవన విధానంలో నిదానం పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు కాస్త నెమ్మదైన జీవన విధానమూ తోడైతే శిలాజ ఇంధనాల దుష్పరిణామాలను తగ్గించడం వీలవుతుంది. ప్రపంచంపై, సమాజంపై సరైన అవగాహన కలిగి ఉంటూ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఫలాలను అనుభవించడం అవసరం. అభివృద్ధి సాధించే ప్రయాసలో మన చర్యల పర్యవసానా లను గుర్తించి తదనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం కూడా అవసరం. ఆధునిక జీవితంపై మోజు తాత్కాలికంగా కొన్ని ప్రయో జనాలు కల్పించవచ్చునేమోగానీ... దీర్ఘకాలంలో భూమ్మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదముంది. అభివృద్ధిని సాధించాలన్న వ్యామోహంలో ప్రస్తుతం 800 కోట్లు దాటిన మానవ జనాభాకు ఆహారం అందివ్వడం ఎలా అన్నది మరవకూడదు. మానవ మనుగడ కోసం మన వేగాన్ని తగ్గించు కోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ, అందరికీ ఆహార కల్పన అన్న అంశాల మధ్య సమతౌల్యత సాధించాలి. ప్రస్తుతం ఆహారాన్ని పండించడం అనేది ఒక పరిశ్రమలా సాగు తోంది. అయితే ఇందుకు పర్యావరణం మూల్యం చెల్లిస్తోంది. విచ్చల విడి రసాయన ఎరువుల వాడకం, అడవుల నరికివేతవంటివన్నీ పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యతలు, భూమి సారాల విషయంలో చెడు ప్రభావం చూపాయి. సుస్థిరాభివృద్ధి కావాలంటే ఇదే పద్ధతిని కొనసాగించడం మంచిది కాదు. నిదానమే ప్రధానము అందరికీ ఆహారమన్న సవాలును ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలను వెత కాల్సి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ... వ్యవసాయ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయాలి. వనరులు అందరికీ అందుబాటులో ఉండేలా అవకాశాలను కల్పించాలి. కాక పోతే ఇదో సంక్లిష్టమైన సవాలే. ఎన్నో సౌకర్యాలు కల్పించిన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనూ కొంచెం జాగరూకతతో వ్యవహరించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్లు భవిష్యత్తులో ఉద్యోగాలను తగ్గిస్తాయన్న ఆందోళన కూడా ఒకవైపు ఏర్పడుతోంది. ఈ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. విద్యపై పెట్టే పెట్టుబడులు పెరగాలి. అదే సమయంలో కొత్త టెక్నాలజీల గురించి అందరికీ శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు కావాలి. విధానాల ద్వారా సామాజిక అసమతుల్యతలను రూపుమాపే ప్రయత్నం జరగాలి. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఈ ఉరుకుల జీవితాన్ని కాస్త మందగింపజేస్తే ఆత్మవిమర్శకు అవకాశం ఏర్పడుతుంది. మానసిక, భావోద్వేగ సంక్షేమాలను మన ప్రాథమ్యాలుగా ఉంచుకుని పనిచేసేందుకు పనికొస్తుంది. ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు వీలేర్పడుతుంది. ప్రాపంచిక సౌఖ్యాల వెంబడి పరుగులో సామాజిక బంధాలను దాదాపుగా విస్మ రించాం. బంధుత్వాలు, సహానుభూతి, మానవ సంబంధాలను మరో సారి ఆచరించేందుకు, కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తుంది. డా‘. శ్రీనాథ్ శ్రీధరన్ - వ్యాసకర్త కార్పొరేట్ సలహాదారు, ‘టైమ్ ఫర్ భారత్’ రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ధరణికి ఇక్కట్లు
-
AP: త్వరలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం: కొమ్మినేని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని సీఆర్ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ల ముసుగులో కొత్త పెత్తందార్ల అవతారం ఎత్తినట్లు కనిపిస్తోందని, ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో కలిసి సదస్సులు పెట్టడం ద్వారా వారి అసలు ఎజెండాను బయటపెట్టుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం జరిగిందని, ఉదాహరణకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వంటివి ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే సమాచారశాఖ కమిషనర్‌ను సంప్రదించవచ్చని అన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా జగన్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని, తద్వారా జర్నలిస్టులకు శుభవార్త తెలపవచ్చని ఆశిస్తున్నానని కొమ్మినేని చెప్పారు. ఇప్పటికే 98.5 శాతం హామీలు నెరవేర్చడమే కాకుండా, 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం కొద్దివేల మంది జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వకుండా ఉండదని, కాని దీనికి సంబంధించి విధి, విధానాలపై ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు. నిజానికి ఇప్పటికే పలు చోట్ల ప్రభుత్వ స్కీములలో ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు కూడా ఉన్నారన్న సంగతి తన పర్యటనలలో తెలిసిందని ఆయన అన్నారు. ఇదే సమయంలో కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వం చేసే ఏ పనిపైన అయినా విషం చిమ్ముతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.జర్నలిస్టుల కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ దుష్టశక్తులే అడ్డంకిగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు జర్నలిజంలో కూడా పెత్తందారులుగా మారి తమ జులుం ప్రదర్శించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు అడ్డగోలుగా వార్తలు ఇస్తున్నా, ప్రభుత్వంపై నీచమైన స్థాయిలో అసత్యాలతో సంపాదకీయాలు రాస్తున్నా జర్నలిస్టు సంఘాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మీడియా యజమానులు జర్నలిజం విలువలకు పాతర వేస్తూ నగ్నంగా తిరుగుతుంటే ఈ యూనియన్ల నేతలు, జర్నలిస్టులలో పెత్తందారులుగా తయారైనవారు కనీసం నోరెత్తలేకపోతున్నారని కొమ్మినేని మండిపడ్డారు. తెలంగాణకు సంబంధించిన ఒక బూర్జువా విప్లవవీరుడు ఏపీకి వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని సుద్దులు చెబుతున్నారని, తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరు జర్నలిస్టులను అరెస్టు చేస్తే కనీసం ఖండించలేని ఈ విప్లవకారుడు ఏపీలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో సుప్రింకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా హౌసింగ్ సొసైటీకి అక్కడి ప్రభుత్వం తగు ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉందని, మరి దాని గురించి ఈయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని కొమ్మినేని అడిగారు. ఏపీలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉన్నాయి కనుకే కొన్ని పత్రికలు, టీవీలు, యథేచ్ఛగా నోటికి వచ్చిన దుష్టభాషతో వార్తా కథనాలు, సంపాదకీయాలు ఇవ్వగలుగుతున్నాయని, ప్రజల మనసులలో విషం నింపాలని చూస్తున్నాయన్న సంగతి గుర్తించాలని ఆయన అన్నారు. తమ మీడియా సంస్థలలో జీతాలు ఇవ్వకపోయినా, ఉద్యోగులను ఇష్టారీతిన తొలగించినా కనీసం నోరు విప్పని కొందరు జర్నలిస్టు నేతలు ప్రతిదానికి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మాత్రం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చివరికి తమ సంస్థ యాజమాన్యాలు చేయవలసిన పనులు కూడా ప్రభుత్వమే చేయాలని వీరు కోరుకోవడంలోనే పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. చిన్న పత్రికలకైనా, పెద్ద పత్రికలకైనా కొన్ని నిబంధనలు పెట్టకపోతే ప్రభుత్వ రాయితీలు ఎలా దుర్వినియోగం అవుతాయో అందరికి తెలుసునని అన్నారు. చదవండి: చంద్రబాబు.. సీఎం జగన్‌కు మరో ఆయుధం ఇచ్చినట్టేనా? కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టించడం ద్వారా ఈ సంఘాలు జర్నలిజం ముసుగులో టీడీపీ ఎజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు పాలనకు సర్టిఫికెట్ ఇచ్చిన ఆ బూర్జువా విప్లవకారుడు ఆ రోజుల్లో కొందరు జర్నలిస్టుల ఉద్యోగాలకు ఎసరు పెట్టినా ఖండించలేదని, కొన్ని టీవీ చానళ్లను చంద్రబాబు ప్రభుత్వం నిషేధించినా నోరెత్తలేదని, పైగా ఇప్పుడు అదే బాగుందని అంటున్నారని, ఇందులో ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని అంతా అర్ధం చేసుకోవాలని కొమ్మినేని అన్నారు. జర్నలిస్టు సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పడం తప్పుకాదని, అదే సమయంలో సంయమనంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.. అలాకాకుండా ఏవో కొన్ని రాజకీయ పక్షాల ప్రయోజనం కోసం జర్నలిస్టు సంఘాలు ప్రయత్నిస్తే అది జర్నలిజానికి మరింత మచ్చ తెస్తుందని కొమ్మినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
పంచ్ డైలాగ్స్ తో టీడీపీకి ఝలక్ ఇస్తున్న కేశినేని నాని..!
-
రాజు చుట్టూ ని‘బంధనాలు’.. ప్రతి రోజూ రాజభోగాలే అనుకుంటే పొరపాటే!
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక దేశానికి రాజుగా కిరీటధారణ జరిగితే ఇక ప్రతి రోజూ రాజభోగాలు అనుభవించడమే అనుకుంటే పొరపాటే. విందు వినోదాలు, చుట్టూ వందిమాగధులు, ఏ చిన్న పనికైనా జీ హుజూర్ అనే సేవకులు ఇవన్నీ ఉన్నప్పటికీ మరిన్ని ఆంక్షల చట్రంలో బతకాల్సి ఉంటుంది. రాజు ప్రాణం ప్రజలకు ఎంతో విలువైనది. అందుకే భద్రతా కారణాలు, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలతో కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పా టించాలి. ఒక రకంగా బంగారు పంజరంలో బంధించినట్టుగా స్వేచ్ఛను కోల్పోవలసి ఉంటుంది. 70 ఏళ్ల క్రితం రాణి ఎలిజæబెత్ నాటి నిబంధనలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కింగ్ చార్లెస్ అవి ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించి తీరవలసిందే. కానుకల స్వీకరణ తప్పనిసరి బ్రిటన్ రాజ సంప్రదాయం ప్రకారం వారికొచ్చే కానుకల్ని తప్పనిసరిగా స్వీకరించాలి. దేశంలో వివిధ ప్రాంతాలు సందర్శించినప్పుడు ఇతర దేశాల పర్యటనలకి వెళ్లినప్పుడు రాజుపై గౌరవంతో చాలా మంది రకరకాల కానుకలు ఇస్తారు. వాటిని రాజు తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ ఆ కానుకలు ఏదైనా ప్రత్యుపకారం పొందడం కోసం ఇస్తూ ఉంటే మాత్రం రాజకుటుంబం వారు కానుకల్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. విలియంతో ప్రయాణించలేరు బ్రిటన్ రాజుతో పాటు వారసుడు కూడా ము ఖ్యమే. కింగ్ చార్లెస్ తర్వాత సింçహాసనం అధిష్టించే వారసత్వపు హక్కు కలిగిన ప్రిన్స్ విలి యమ్‌తో కలిసి ఆయన ఎక్కడికీ ప్రయాణించకూడదు. ఇద్దరూ వేర్వేరు విమానాలు, వాహనాల్లోనే వెళ్లాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉండకూడదన్న భావనతో ఈ నిబంధన తీసుకువచ్చారు. వస్త్రధారణ రాజు ధరించే వస్త్రధారణకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దౌత్యపరంగా అనుకూలంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. రాజు ఏ దేశానికి వెళితే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులే ధరిస్తారు. ఇక రాజు తనతో పాటు ఎప్పుడూ నలుపు రంగు వస్త్రాలు తీసుకువెళతారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అనుకోని పరిస్థితుల్లో అంత్యక్రియలకి హాజరుకావాల్సి వస్తే అప్పుడు వేసుకోవడం కోసం నల్ల బట్టలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. షెల్ ఫిష్ తినలేరు రాజుతో సహా బ్రిటన్ రాచకుటుంబీలు అందరూ షెల్ఫిష్కు దూరంగా ఉండాలి. ఫుడ్ పాయిజనింగ్‌కి అవకాశం ఉన్న తినకూడదన్న నిబంధనలైతే ఉన్నాయి. ఇక రాజు భద్రతే అత్యంత కీలకం కాబట్టి అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఓటుకి దూరం బ్రిటన్ రాజు ఎప్పుడూ రాజకీయాల్లో తటస్థ వైఖరి అవలంబించాలి. ఏ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకూడదు. అయితే పలు సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉన్నప్పటికీ రాచ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఓటింగ్‌కి కూడా దూరంగా ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు ఎన్ని రకాల ఆంక్షలున్నా బ్రిటన్ రాజు ఒక్కరికే ఉన్న సదుపాయం ఒకటుంది. అదే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం. కారు డ్రైవ్ చేయాలని అనుకుంటే ఆయనకు లైసెన్స్ అక్కర్లేదు. పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా ప్రయాణించవచ్చు. సెల్ఫీలు ఆటోగ్రాఫ్‌లు ఉండవు ప్రజలెవరైనా రాజుతో కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చట పడితే అది కుదిరేపని కాదు. ఎవరికీ ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదు. అలా ఇస్తే రాజు సంతకం ఫోర్జరీ చేస్తారన్న భయం ఉంది. సెల్ఫీలు దిగకూడదు. రాజు కుటుంబ సభ్యులందరికీ ఇదే వర్తిస్తుంది. అయితే ప్రోటోకాల్స్‌లో ఈ నిబంధనని అధికారికంగా ఇంకా చేర్చలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంకా ఆలస్యమే..!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కష్టాలు తీరడం లేదు. ఈ పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్‌మిత్తల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్య సమస్యల పరిష్కారానికి ఉపక్రమించినప్పటికీ, ఈ క్రమంలో వస్తున్న తీవ్ర సాంకేతిక సమస్యలు అడుగు ముందుకు పడనీయడం లేదని సమాచారం. ఈ కారణంగానే విస్తీర్ణం, పేరు మార్పు లాంటి సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న 10 సమస్యలకు సంబంధించిన మార్పులు జరిగినప్పటికీ, సాంకేతిక అవరోధాల కారణంగా బుధవారం నాటికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చిందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న పట్టాదారులు తమ భూమి విక్రయానికి గాను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా, తాము ఉంటున్న దేశం నుంచే అదీకృత డాక్యుమెంట్ పంపి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా ఉన్న ఈ ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన సమస్యలు కూడా దాదాపు పూర్తయినట్టేనని, ఒకట్రెండు రోజుల్లో అన్నీ అందుబాటులోకి వస్తా యని సీసీఎల్ఏ వర్గాలు చెపుతున్నాయి. వేలసంఖ్యలో పెండింగ్‌లో టీఎం 33 దరఖాస్తులు ధరణి పోర్టల్‌లోకి రైతుల వివరాల నమోదు సమయంలో వచ్చి న చిక్కులను తొలగించేందుకు గాను టీఎం (టెక్నికల్ మాడ్యూల్) 33 కింద దరఖాస్తులు తీసుకుంటున్నారు. పట్టాదారు పేరు, భూమి విస్తీర్ణం, స్వభా వం, మిస్సింగ్ సర్వే నంబర్ల లాంటి సమస్యల సవరణ కోసం ఈ మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పట్టాదారు బయోమెట్రిక్‌తో మీసేవా కేంద్రం ద్వారా తగిన ఆధారాలు పొందుపరిచి ఈ మాడ్యూ ల్ కింద రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే తీవ్ర జాప్యం జరుగుతుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మాడ్యూల్ కింద దరఖాస్తు చేసుకున్న వారి సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం కూడా ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే స్థానిక అధికారులు (తహసీల్దార్లు) నిష్పక్షపాతంగా నివేదికలు పంపడం లేదని, ఈ నివేదికల ఆధారంగా కలెక్టర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ కలెక్టర్లు ఆమోదించినా సీసీఎల్ఏ కార్యాలయంలో క్లియర్ చేయాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమవుతోంది. ఈ దరఖాస్తుల పరిష్కారానికి సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా, ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు సీసీఎల్ఏ కార్యాలయ స్థాయి లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. తహసీల్దార్లు, జిల్లాల కలెక్టర్లు నివేదికలు పంపేందుకే నెలలు గడుస్తోందని, ఆ తర్వాత సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లిందీ లేనిదీ తెలియడం లేదని, ఒకవేళ సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లినా తదుపరి సమా చారం కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. టీఎం–33 దరఖాస్తులను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని, తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
సీఎం జగన్ చేతికి బోయ, వాల్మీకి కులాల సమస్యల అధ్యయన నివేదిక
సాక్షి, గుంటూరు: బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామూల్ ఆనంద్‌కుమార్ చేసిన అధ్యయనం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి చేరింది. నివేదిక (పార్ట్ 1)ను సీఎం జగన్‌కు స్వయంగా అందజేశారు శామ్యూల్. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌ను కలిసి అందజేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే కూడా ఉన్నారు. -
80 సీట్లను బీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుంది: మంత్రి ఎర్రబెల్లి
-
2023లో సమస్యలతో సావాసమే: సునాక్
లండన్: బ్రిటన్‌వాసులకు ప్రధాని రిషి సునాక్ తన న్యూ ఇయర్ సందేశంలో చేదు వార్త విన్పించారు. దేశాన్ని వేధిస్తున్న పెను సమస్యలు 2023లో పూర్తిగా పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు. ‘‘నేనలాంటి డొల్ల మాటలు చెప్పబోను. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆర్థికంగా బ్రిటన్‌తో పాటు ప్రపంచం వెన్ను విరిచింది. రుణ భారాన్ని అదుపులోకి తెచ్చే క్రమంలో కఠినమే అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. -
అమిత్ షా తో సీఎం వైఎస్ జగన్ చర్చించిన అంశాలు ఇవే
-
ఇంధన భద్రతలో ఆటో ఎల్పీజీ కీలకపాత్ర
న్యూఢిల్లీ: ఓవైపు అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు పెరుగుతుండగా, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా వ్యవస్థ సమస్యలు వెన్నాడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధన భద్రతను సాధించడంలో ఆటో ఎల్పీజీ కీలక పాత్ర పోషించగలదని పరిశ్రమ సమాఖ్య ఐఏసీ తెలిపింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ తర్వాత రవాణా కోసం అత్యధికంగా ఉపయోగించే ఇంధనాల్లో ఆటో ఎల్పీజీ మూడో స్థానంలో ఉందని వివరించింది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అవకాశాలు చాలా తక్కువని ఐఏసీ పేర్కొంది. కరోనా కారణంగా అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండటం, ఇంధన ఎగుమతిలో కీలకంగా ఉంటున్న ఒక దేశం పూర్తి స్థాయి యుద్ధంలో నిమగ్నమై ఉండటం తదితర అంశాల కారణంగా ఇంధన భద్రత సాధించడం మరింత కీలకంగా మారిందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా ఆటో ఎల్పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలా కాకుండా వాటికి తగినంత గుర్తింపునివ్వకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా వ్యాఖ్యానించారు. విద్యుత్‌తో పోలిస్తే ఉత్పత్తి దశ నుంచి వినియోగం వరకూ ఎల్పీజీ వల్ల వచ్చే ఉద్గారాలు చాలా తక్కువని ఆయన చెప్పారు. -
ప్రధానితో భేటీలో కీలకాంశాలను ప్రస్తావించిన సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా.. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నాం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు సీఎం జగన్. ముందుగా.. కోవిడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రధానికి వివరించారు. ఆపై రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ల సుదీర్ఘకాలం గడిచినప్పటికీ.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, పైగా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని సీఎం జగన్, ప్రధానికి వివరించారు. గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, అయినప్పటికీ కొంత పురోగతే కనిపిస్తోందని, కీలకాంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు సీఎం జగన్. ► 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని, 2014–15 సంవత్సరానికి సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరారు. ► గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, రుణాలపై పరిమితి విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోంది. ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోంది. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎం జగన్, ప్రధానిని కోరారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశం కూడా ఇంకా పెండింగులోనే ఉంది. మొత్తం ప్రాజెక్టుకోసం రూ.55,548 కోట్ల రూపాయలు అవుతుందని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానమంత్రికి గుర్తుచేశారు సీఎం జగన్. డ్రింకింగ్ వాటర్ సఫ్లైని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా డ్రింకింగ్ వాటర్‌ను ప్రాజెక్టులో భాగంగా చూశారని ప్రస్తావించారు. ► పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్ వైజ్‌గా చూస్తున్నారని, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడమే కాకుండా, వ్యయం కూడా పెరుగుతోందని ప్రధానికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యవయాన్ని కాంపొనెంట్ వైజ్‌గా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ► పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని, దీనివల్ల చాలావరకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, ఆలస్యం అవుతున్నకొద్దీ ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టునుంచి తక్షణమే ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీకి వివరించారు. ఇందులో భాగంగా 41.15 మీటర్ల ఎత్తు వరకూ ఆయా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఈమేరకు పనులు చేయడానికి దాదాపు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని, ఈ డబ్బును అడహాక్‌గా మంజూరు చేసినట్టైతే పనులు వేగంగా ముందుకు సాగుతాయని పీఎంకు వివరించారు. ఈ డబ్బు మంజూరు చేసినట్టైతే భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు సకాలంలో పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని సీఎం జగన్, ప్రధానికి తెలిపారు. ► తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం జగన్, తద్వారా తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీజెన్కోకు ఈ బకాయిలు చాలా అవసరమని తెలిపారు. ► అలాగే.. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తంచేసిన అంశాలతో నీతి ఆయోగ్ కూడా ఏకీభవించి కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సునూ ప్రస్తావించారు సీఎం జగన్. ► రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని, రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని ప్రధానికి వివరించిన సీఎం. నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని.. ఈమేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ► రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని పునరుద్ఘాటించిన సీఎం. ► రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలిపి ఇప్పటికి 14 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారని, మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలు మంజూరుచేయాలని పీఎంను కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ► కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు. ► విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. -
పెన్షన్లపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సచ్చివాలయ సిబ్బంది
-
కాణిపాకం వివాదంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందన
-
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మళ్ళీ రచ్చకెక్కిన విభేదాలు
-
Telangana: కొలువులకు ‘కొత్త’ సంకటం
వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్‌కు చెందిన గోపి రెండో తరగతి వరకు ఇంటి పక్కనున్న పాఠశాలలో చదివాడు. మంచి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించాలని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయీంనగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో గోపిని తండ్రి చేర్పించాడు. అతను 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఇప్పుడు పునర్విభజనలో నయీంనగర్ హన్మకొండ జిల్లాలో భాగమవడం, గోపి ఒకటి నుంచి 7వ తరగతిలో ఎక్కువ సంవత్సరాలు నయీంనగర్‌లో చదువుకోవడంతో అతని స్థానికత హన్మకొండ అయింది. ఎల్బీనగర్కు చెందిన సృజన్ కుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో, 4 నుంచి 10వ తరగతి వరకు ఉప్పల్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఇంతకుముందు వరకు సృజన్‌ది రంగారెడ్డి జిల్లా స్థానికత. కానీ జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డిని 3 జిల్లాలు చేశారు. సృజన్ పాఠశాల విద్యను ఎక్కువ సంవత్సరాలు మేడ్చల్ జిల్లాలో చదవడంతో ఆ జిల్లా స్థానికుడయ్యాడు. ఇక అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే మేడ్చల్ జిల్లాలోని పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. పుట్టిపెరిగిన రంగారెడ్డి జిల్లాలో 5 శాతం ఓపెన్ కేటగిరీ కోటా కింద దరఖాస్తు చేసుకోవాలి. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగ ఖాళీలున్నట్లు సీఎం కేసీఆర్ 4 రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో జిల్లా కేడర్‌లోని పోస్టులు 39,829. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం రావడంతో జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో స్థానిక, ఓపెన్ కేటగిరీ నిష్పత్తి 95:5గా నిర్ధారించారు. ఈ క్రమంలో జిల్లా కేడర్‌లోకి వచ్చే 39,829 పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ చేయాలి. కొత్త జోనల్ విధానంతో స్థానిక అభ్యర్థులకు అత్యధిక అవకాశాలు పెరుగుతున్నా ఇప్పుడు స్థానికత తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. జిల్లాల పునర్విభజనతో అభ్యర్థుల స్థానికత మారింది. కొత్త జిల్లాల సరిహద్దుల్లోని మెజార్టీ అభ్యర్థులకు ఈ సమస్య ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పుట్టి, పెరిగిన జిల్లాలో స్థానిక కోటాలో దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. స్థానికత ఇలా.. అభ్యర్థి స్థానికతను నిర్ణయించడంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఏడేళ్లు ఒకేచోట చదవకుంటే ఎక్కువ తరగతులు ఎక్కడ చదివాడో ఆ ప్రాంతం స్థానికతలోకి వస్తాడు. ఈ లెక్కన ఒకటి నుంచి ఏడో తరగతి వరకు గరిష్టంగా నాలుగేళ్లు ఎక్కడ చదువుకుంటే ఆ జిల్లా స్థానికత పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం జిల్లా స్థాయి ఉద్యోగాలన్నీ స్థానికత ప్రకారమే భర్తీ చేస్తారు. దీంతో స్థానికత ధ్రువీకరణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పట్టణ ప్రాంతంతో గజిబిజి రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా ప్రభుత్వం విభజించింది. ఇందులో హైదరాబాద్ జిల్లా మినహా మిగతా 9 జిల్లాలు 32 జిల్లాలుగా మార్పు చెందాయి. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో స్థానికతకు ప్రాధాన్యమిస్తూ నియామకాలు చేపట్టే క్రమం తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తోంది. చాలా జిల్లాల్లో పట్టణ ప్రాంతాలను విభజించడంతో స్థానికత సందిగ్ధంలో పడింది. ఉమ్మడి జిల్లా కేంద్రాలకు దగ్గర్లోని పట్టణ ప్రాంతాల్లో కొంత భాగం ఓ జిల్లాలో, మరికొంత భాగం మరో జిల్లాలో చేర్చారు. కొన్నిచోట్ల నగర ప్రాంతాన్ని ఓ జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని మరో జిల్లాగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాను 3 జిల్లాలుగా విభజించారు. ఇందులో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మెజార్టీ భాగం పట్టణ ప్రాంతం కావడంతో ఈ రెండు జిల్లాల్లో చాలా మంది అభ్యర్థుల స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్–నారాయణపేట, వనపర్తి–గద్వాల, కరీంనగర్–పెద్దపల్లి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకం. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు ఉండటం.. దూరం నుంచి వచ్చి పట్టణ çప్రాంతాల్లో చదువుకోవడంతో స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. -
విశాఖ తీరంలో మత్స్యకారుల వేట వివాద పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు
-
సరసమైన ధరలకు వినోదం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
-
ప్రేమవివాహం.. కుటుంబ కలహాలు.. రెండు రోజుల వ్యవధిలోనే..
సాక్షి, యైటంక్లయిన్‌కాలనీ (కరీంనగర్): ఇరు కుటుంబాల పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. కానీ జీవిత ప్రయాణంలో ఓడిపోయారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 11న రామగుండం రైల్వేస్టేషన్లో జంగటి అరుణ తన ఇద్దరు పిల్లలు సాత్విక్, సాత్వికను రైలు కిందికి తోసి తాను దూకింది. తల్లి కూతురు మృతి చెందగా.. చికిత్స పొందుతూ రెండు రోజుల వ్యవధిలో కుమారుడు మృతిచెందాడు. మృతురాలి భర్త జంగటి ప్రవీణ్ (32 )కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారంలో ఒంటరితనం భరించలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు క్వాశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
భారీగా గుంతలు: ప్రాణాలు పోతేనే.. పట్టించుకుంటారా?
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పేరుతో రోడ్ల వెంట భారీగా గుంతలు తవ్వుతున్నారు. పైపులైన్లు వేయడంలో ఆలస్యం కావడం.. గుంతల వద్ద కనీసం జాగ్రత్తలు పాటించకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. శనివారం వరంగల్ హెడ్ ఫోస్టాఫీస్ సమీపంలోని ఓ వృద్ధుడు అదుపు తప్పి డ్రెయినేజీలో పడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంకన్న, షబ్బీర్‌లు వెంటనే స్థానికుల సహకారంతో బయటకు తీశారు. ఇలా వరంగల్ స్టేషన్ రోడ్డు నుంచి చౌరస్తా వరకు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా.. వెంటనే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
‘తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తాం’
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జరిగే వర్షాకాల సమావేశంలో తెలంగాణ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎంపీ నాగేశ్వర్ రావు తెలిపారు. కాగా, ఆదివారం పార్లమెంట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. అదేవిధంగా, 48 గంటల ముందే బిల్లుల వివరాలను సభకు తెలపాలని కోరినట్టు నాగేశ్వర్రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తామని వివరించారు. -
Corona Virus: ‘లాంగ్ హాలర్స్’ అంటే ఎవరో తెలుసా?
కరోనా గురించి కొత్త కొత్త పరిశోధనల్లో తేలుతున్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి ఒక అధ్యయనంలో ఈ ‘లాంగ్ హాలర్స్’ గురించి తెలిసింది. ‘కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బాగైపోయాం’ అనుకున్నవారిని సైతం కోవిడ్ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధపెడుతుంటాయి. అలా బాధపడే పరిస్థితిని ‘లాంగ్ కోవిడ్’ లేదా ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ అనీ... అలా బాధపడేవారినే ‘‘లాంగ్ హాలర్స్’’గా పేర్కొంటున్నారు. క్లివ్లాండ్ క్లినిక్‌లోని లోరియన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్... ‘ఫ్యామిలీ మెడిసిన్’ విభాగానికి చెందిన వైద్యపరిశోధకుడు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ గురించీ... అలాగే ‘లాంగ్ హాలర్స్’పై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా... ఇటీవలే దీని వివరాలను బయటికి వెల్లడించారు. లాంగ్ హాలర్స్ అంటే ఎవరు, వారి లక్షణాలేమిటి, వారి సమస్యలకు కారణాలేమిటి లాంటి అనేక విషయాలు తెలిపేదే ఈ కథనం. ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బాధితులు ఎవరు? ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన ఎవరు పడతారు? ఎలాంటి లక్షణాలూ లేని అసింప్టమాటిక్ రోగులు దీని బారిన పడరా? కేవలం మూడు, నాలుగు వారాల పాటు కూడా నెగెటివ్ రానివారే దీని బారిన పడతారా?... ఈ సందేహాలు మీ మదిలో రావచ్చు. కానీ అలాంటి మినహాయింపులేమీ ఈ లాంగ్ హాలర్స్కు ఉండవంటున్నారు పరిశోధకులు. ఎలాంటి లక్షణాలూ లేకుండా ఉన్నవారూ, కొద్దిపాటి లక్షణాలతో తేలిగ్గానే కరోనా బారినుంచి తప్పించుకున్నవారు మొదలుకొని సుదీర్ఘకాలం పాటు దాని బారిన పడ్డవారు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన పడవచ్చు. అలాగే ఎవరో వయోవృద్ధులకు మాత్రమే అది పరిమితమేమో అంటూ కూడా పొరబడవద్దు. ఎందుకంటే... యౌవనంలో ఉన్నవారూ, నడివయసువారు, అప్పుడే వృద్ధాప్యంలో అడుగుపెట్టినవారు మొదలుకొని బాగా వయోవృద్ధుల వరకు అందరూ దీనిబారిన పడే అవకాశాలున్నాయంటున్నారు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు. పైగా ఇదొక ఛాలెంజింగ్ పరిస్థితి అని... అందరికీ ఒకేలాంటి చికిత్స కాకుండా... ప్రతి ఒక్కరికీ వారి వారి పరిస్థితి ని బట్టి వేర్వేరు చికిత్సలు అందించేలా జబ్బు విసురుతున్న సవాలే ఈ సమస్య అని క్రిస్టోఫర్ బబియుక్ పేర్కొంటున్నారు. ఆయన పేర్కొన్న శాస్త్రీయ వివరాలు చాలావరకు సాధారణ ప్రజలకూ పనికివచ్చేవే. ప్రశ్న: గతంలో చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే ‘లాంగ్ హాలర్స్’గా మారే అవకాశం ఉందా? సమాధానం: ఒకరకంగా అలాగే అనుకోవచ్చు. కానీ కచ్చితంగా అదేనిజం అని అనుకోడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గత మన అనుభవాలను బట్టి గతంలో ఏదో క్రానిక్ జబ్బులతో బాధపడేవారే ఇలా సుదీర్ఘకాలం పాటు ఏవో లక్షణాలతో బాధపడుతుంటారని తేలినా... కొందరు మామూలు వ్యక్తుల్లో సైతం కొన్ని లక్షణాలు అదేపనిగా కొనసాగుతున్నాయి. అందుకే ఈ స్థితి ఫలానా నిర్దిష్ట వ్యక్తుల్లోనే కనిపిస్తుందని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడానికి వీలు కావడం లేదు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్లో కనిపిస్తున్న లక్షణాలేమిటి? సమాధానం: చాలా లక్షణాలే ఈ లాంగ్ హాలర్స్లో ఉన్నాయి. అవి... దీర్ఘకాలికం గా కొనసాగే తీవ్రమైన దగ్గు, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటం, శ్వాస సరిగా అందకపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, కొందరిలో నీళ్లవిరేచనాలు కూడా. అయితే ఈ అందరిలోనూ కనిపిస్తూ ఉండే ఒకే ఒక లక్షణం తీవ్రమైన అలసట. దీన్నే ‘క్రానిక్ ఫెటీగ్’గా చెప్పవచ్చు. ఇలాంటి చాలామంది లాంగ్ హాలర్స్లో ‘బ్రెయిన్ ఫాగ్’ కూడా కనిపిస్తోంది. అంటే... మంచు కప్పి ఉన్నప్పుడు ఏదీ స్పష్టంగా తెలియనట్టే... వీళ్లలో కూడా ఏ ఆలోచనా స్పష్టంగా లేక అయోమయానికి గురవుతుంటారు. దీన్నే ‘బ్రెయిన్ ఫాగ్’ అని అంటారు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్ నుంచి ఈ లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి పాకుతాయా అంటే ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ అంటువ్యాధా? సమాధానం : అదృష్టవశాత్తూ కాదు. ఎందుకంటే ఇవన్నీ అప్పటికే కరోనా సోకి తగ్గినవారిలో కనిపించే కొన్ని దీర్ఘకాలిక లక్షణాలు. అంతేతప్ప ఇదో వ్యాధి కాదు. అందునా అంటువ్యాధి కాదు. అందుకే, అంటుకుంటుందేమో అని దీనిగురించి ఆందోళన అక్కర్లేదు. కేవలం కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయినవారి నుంచే ఆ వైరస్ మరొకరికి అంటుకుంటుది. రెండువారాల తర్వాత వైరస్ దేహం నుంచి తొలగిపోయాక ఏ రోగీ కరోనాను వ్యాపింపజేయలేడు. (అతడు కాంటేజియస్ కాదు). కాబట్టి వ్యాధి సోకిన రెండు వారాల తర్వాత అటు రోగినీ, ఇటు లాంగ్ హాలర్స్నీ అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా వారికి సమాజం నుంచి మరింత సానుభూతి, సహకారం అవసరం. ప్రశ్న: కొందరిలో ఈ లక్షణాలు సుదీర్ఘకాలం ఎందుకు కొనసాగుతున్నాయి? సమాధానం : కరోనా వచ్చి తగ్గాక చాలామందిలో అది వారి అంతర్గత అవయవాల్లో ‘ఇన్ఫ్లమేషన్’ (వాపు, మంట లాంటి స్థితి) తీసుకొస్తుందన్న విషయం తెలిసిందే కదా. బహుశా ఆ ‘ఇన్ఫ్లమేటరీ కండిషన్స్’ అన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ లక్షణాలన్నీ కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలూ, పరిశోధకుల అంచనా. అందుకే ఈ అంశాలపై ఇప్పటికే పరిశోధన కొనసాగుతోందనీ, ఇంకా చాలా అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు కొనసాగితే సుదీర్ఘకాలంలో అప్పటికే కిడ్నీవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు ఉన్నవారిపై కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల కలిగే ఫలితాలేమిటో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే పరిశోధనలు మాత్రం విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రశ్న: ఇప్పుడీ పరిస్థితిలో ‘లాంగ్ హాలర్స్’ ఏం చేయాలి? సమాధానం : కరోనా తగ్గిందనీ, తమకు నెగెటివ్ వచ్చిందని తెలిశాక కూడా లక్షణాలు కనిపిస్తున్నా లేదా కోవిడ్–19 వచ్చి తగ్గిందనుకున్న 28 రోజుల తర్వాత కూడా మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నా ముందుగా వారు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పటికి ఉన్న అవగాహన మేరకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తమ పల్మునరీ (ఊపిరితిత్తులకు సంబంధించిన), కార్డియోవాస్కులార్ (గుండెకు సంబంధించిన), న్యూరలాజికల్ (మెదడు సంబంధిత) పరీక్షలను వారి వారి డాక్టర్ల సలహాల మేరకు చేయించుకుంటూ ఉండాల్సి రావచ్చు. ఇక ఆ తర్వాత వారంతా క్రమం తప్పకుండా దేహానికి మంచి ఖనిజలవణాలు దొరికేలా ఎప్పుడూ ద్రవాహారాలు తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తింటూ, కంటినిండా నిద్రపోతూ... శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. ఈ అంశాలన్నింటినీ ఆరోగ్యవంతులూ, కరోనాకు గురికాని వారందరు కూడా పాటిస్తే అవి వాళ్లందరికీ మేలు చేసేవే. ప్రశ్న: లాంగ్ హాలర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? సమాధానం : లాంగ్ హాలర్స్తో సహా... ప్రతివారూ, కరోనా వచ్చి తగ్గిన వారు సైతం (వారి వారి దేశాల్లోని ప్రభుత్వ, వైద్య సంస్థలు చెప్పిన నిర్ణీత కాల వ్యవధి ముగిశాక) తప్పక వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. -
Covid Vaccine: సామాన్యుడికి సకాలంలో టీకా అందేనా?
‘సరూర్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ రెండో డోసు టీకా కోసం బుధవారం ఆన్లైన్లో స్లాట్‌బుక్ చేసుకున్నారు. ఆయనకు ఈ నెల ఏడో తేదీన అబ్దుల్లాపూర్‌మెట్ పీహెచ్సీలో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో టీకా వేయనున్నట్లు ఫోన్‌కు మెస్సేజ్ కూడా వచ్చింది. ఆ తర్వాతి రోజు బుక్ చేసుకున్న స్లాట్ కేన్సల్ అయినట్లు మళ్లీ మెస్సేజ్ వచ్చింది. సంబంధిత పీహెచ్‌సీకి వెళ్లి ఆరా తీయగా..టీకాలు స్టాక్ లేకపోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలిసి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. .. ఇలా శ్రీకాంత్ ఒక్కరే కాదు టీకా కోసం కోవిన్యాప్లో స్లాట్‌బుక్ చేసుకున్న అనేక మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు’. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ టీకాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఇప్పటికే ఫస్ట్ డోసు టీకా తీసుకుని, రెండో డోసు కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుంటున్న లబ్ధిదారులకు...స్లాట్‌బుకింగ్ రద్దయినట్లు మెస్సేజ్‌లు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నిష్పత్తికి తగినన్ని టీకాలు పంపిణీ చేయకపోవడమే ఇందుకు కారణం. టీకాలు ఎప్పుడు వస్తాయో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారు సుమారు 15 లక్షల మందికిపైగా టీకాలు వేయించుకున్నారు. వీరిలో మరో మూడు లక్షల మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీ తీసుకెళ్లిన వారికి రిజిస్టర్లో పేరు నమోదు చేసుకుని టీకాలు వేసేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది. అయితే, చాలా మందికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌పై సరైన అవగాహాన లేదు. కుంటుంబ సభ్యులకు విడివిడిగా ఫోన్లు కూడా లేవు. ఒకే నెంబర్‌తో కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేస్తుండటంతో యాప్ నిరాకరిస్తోంది. ఇంటర్నెట్పై అవగాహన ఉన్న వారు స్వయంగా ఇంట్లోని కంప్యూటర్, సెల్‌ఫోన్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటుండగా... అవగాహన లేని వారు సమీపంలోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మీసేవ నిర్వాహకులు దీన్ని అవకాశంగా తీసుకుని రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తుండటం గమనార్హం. బాధితులకు విషమ ‘పరీక్ష’ ఒక వైపు కరోనా వైరస్ నగరంలో చాపకింది నీరులా విస్తరిస్తుండగా..మరో వైపు ప్రభుత్వం టెస్టుల సంఖ్యను కుదించడం ఆందోళన కలిగిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు తదితర సమస్యలతో బాధపడుతూ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారికి నిరాశే మిగులుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 248 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌కు రోజుకు సగటున 150 మంది వరకు వస్తుండగా, కిట్ల కొరత వల్ల ప్రస్తుతం 50 మందికి మించి టెస్టులు చేయడం లేదు. 20 ప్రభుత్వ, 63 ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుండగా, వీటిలో రోజుకు సగటున 25 వేల టెస్టులు చేస్తున్నారు. టెస్టింగ్ కేంద్రాల సామర్థ్యానికి మించి రోగులు వస్తుండటంతో రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం అవుతోంది. నిజానికి 12 నుంచి 24 గంటల్లోపే ఫలితం రావాల్సి ఉన్నా...48 గంటలు దాటినా రావడం లేదు. ఫలితంగా వైరస్ సోకిన వారే కాకుండా విదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి రిపోర్టుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మరో 1918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ( చదవండి: కరోనా వేళ.. గుంపులు గుంపులుగా జనాలు ) -
గర్భవతులకు ఇదో పెద్ద సమస్య!
గర్భవతుల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి పెరుగుతున్నకొద్దీ అది మూత్రనాళాలపై ఒత్తిడి కలగజేయడం వల్ల మూత్రపిండాలు వాచిపోతాయి. దాంతో మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ కాస్తా... మూత్రపిండాలకూ చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉంది లేదా నెలల నిండకముందే ప్రసవం కూడా కావచ్చు. అందువల్ల గర్భవతులు మూత్రపరీక్ష చేయించుకుని, ఇన్ఫెక్షన్ ఉంటే తప్పక మందులు వాడాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్కు చికిత్స సాధారణంగా వచ్చే సిస్టైటిస్‌కి మూడు రోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు సరిపోతుంది. మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే దీర్ఘకాలం పాటు చికిత్స (లాంగ్ టర్మ్ సప్రెసెంట్ థెరపీ) అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలలో రాళ్లను తొలగించడం కోసం కొన్ని నాన్‌సర్జికల్, సర్జికల్ ప్రొíసీజర్స్ అవసరం కావచ్చు. -
ఈ లక్షణాలుంటే కోవాగ్జిన్ టీకా తీసుకోవచ్చా?
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు సీరం వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారన్న వార్తలు ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు సంబంధించి భారత్ బయోటెక్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల కోవాగ్జిన్ టీకా దుష్ప్రభావాలపై పలు విమర్శలు వచ్చిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా తాజా సూచనలు జారీ చేసింది. ఎవరు తమ టీకాను తీసుకోకూడదు, ఎవరు తీసుకోవచ్చు అనే వివరాలతో ఒక వివరణాత్మక ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్నవారు, రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రభావం చూపే మందులు వాడేవారు, అలర్జీ ఉన్నవారు తమ కోవాగ్జిన్ టీకాను తీసుకోవద్దు అని భారత్ బయోటెక్ హెచ్చరించింది. భారత్ బయోటెక్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం రక్తస్రావ లోపాలు లేదా బ్లడ్ థిన్నర్స్ వాడేవారు టీకా తీసుకోకపోవడం మంచిది. అలాగే జ్వరం లేదా అలెర్జీ ఉన్నవారు, గర్భిణీ, పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. దీనితోపాటు మరో కంపెనీ టీకా తీసుకున్న వారు కోవాగ్జిన్ టీకా వాడవద్దని కూడా హెచ్చరించింది. వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత ఎవరైనా కోవిడ్-19 లక్షణాలను కనిపిస్తే, దాన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఆధారంగా "ప్రతికూల సంఘటన" గా పరిగణిస్తారని పేర్కొంది. కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ రూపొందిస్తోంది. ఇప్పటికీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అత్యవసర ఉపయోగం కోసం కేంద్రం అనుమతి పొందిన రెండు సంస్థల్లో భారత్ బయెటెక్ ఒకటి. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. -
విమానాలకు టేకాఫ్ సమస్యలు
-
ఇంటి కాలుష్యం ఆపండి
మన దేశంలో అభివృద్ధి బాగా జరగాలని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలంటే అభివృద్ధి జరగాలని మనం అనుకుంటూ ఉంటాం. యువతరం కూడా అభివృద్ధి ఫలాలను పొందేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అయితే, ఆ అభివృద్ధితో పాటు కాలుష్యం అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. తెచ్చిపెడుతూనే ఉంది. కాలుష్యం అనేది పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించినది. ఇది ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు.ఈ విషయంలో పర్యావరణ కాలుష్యం, సహజవనరులను కలుషితం చేయడంలో ఎవరికి వారు తమ పాత్రను పోషిస్తున్నారనేది గమనార్హం. కాలుష్యకారకాలతో అభివృద్ధి ఏ విధంగా అనుసంధానించబడిందో.. అది మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే అని తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవచ్చు. ఇంటి నుంచే హానికారాలు షాంపూలూ, డిటర్జెంట్లు, సౌందర్యసాధనాలు, ఎయిర్ప్రెషనర్లు, విండో క్లీనర్లు, డిష్‌వాష్ ద్రవ్యాలు, హెయిర్ డైలు, మస్కిటో రిఫెల్లెంట్లు (దోమల మందులు), ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విలాసవంతులు, ఆధునికులు విరివిగా ఉపయోగించే వస్తువులు. ఇవి చిన్నగా అనిపించే పెద్ద కాలుష్యకారకాలుగా మన ముందు ఇప్పుడు సమస్యాత్మకంగా నిలిచాయి. ఇవి ఇళ్లల్లో ఉండటం అభివృద్ధి అని మనం అనుకుంటూ ఉంటాం. అందువల్ల విలాసవంతులు వాడే ఈ వస్తువులు ఒక సాధారణ ఇంటిలో చోటు సంపాదించుకోవడం ప్రారంభించాయి. తద్వారా ఈ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో అనేక ఎంఎన్సీ కంపెనీలు ఈ వస్తువుల ఉత్పత్తిలో దూసుకుపోయాయి. ఈ వస్తువుల అమ్మకాలలో వచ్చే లాభంతో ఇండియన్ మార్కెట్లో మెరుగైన ఉత్పత్తిని ఇవ్వడానికి ఎమ్ఎన్సీలు పోటీ పడటం ప్రారంభించాయి. మురుగు నీటి నుంచి మంచి నీళ్లలోకి ఈ పోటీ పరుగులో ఎమ్ఎన్సీలు వస్తువుల ఉత్పత్తిలో సంక్లిష్టమైన రసాయన కలయికల వల్ల కలిగే ఆరోగ్యప్రమాదాల గురించి ఏ మాత్రం బాధపడటం లేదు. ఈ ఉత్పత్తులు సామాన్యుడి రోజువారీ జీవితంలో చాలా సహాయకారిగా ఉన్నప్పటికీ వాటి అవశేష ప్రభావం ప్రజారోగ్యం, పర్యావరణ దృక్ఫథం నుండి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉత్పత్తుల వాడకం తర్వాత ప్రమాదకర రసాయన అవశేషాలను వదిలేస్తాం. తరువాత ఇవి మన స్థానిక మురుగు నీటిలో చేరుతాయి. ప్రమాదకర రసాయనాలతో నిండిన మురుగునీరు తరచూ మంచినీటి ప్రవాహాలలోకి చేరుతుంటుంది. మన నగరాలు, పట్టణాలలో చాలా వరకు సమర్థవంతమైన మురుగునీటి శుద్ధి కర్మాగారాలు లేవు. కొన్ని సార్లు అసలు మురుగునీటి ప్రమాదకర స్వభావాన్ని పట్టించుకోం.అంతేకాదు, ఈ మురుగు నదీ జలాలు, సహజ వనరుల్లోకి చేరుకుంటున్నాయి. తత్ఫలితంగా ఈ రసాయనాలు నదుల పర్యావరణ వ్యవస్థ, వాటి మీద ఆధారపడే ప్రాణులకు అపాయం కలిగించడమే కాకుండా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయి. ఈ హానికరమైన రసాయనాలు ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి. ఈ రసాయనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ రసాయనాల ప్రభావాలు కొన్ని సార్లు చాలా ప్రమాదకరమైనవి. అవి తల్లి పాలను కూడా కలుషితం చేస్తాయి. భావితరాలకు ఏమిస్తున్నాం? మన వారసులకు ఆస్తులు అందించడంలో చూపించే ఆసక్తి మేలైన పర్యావరణాన్ని అందించడంలో చూపడం లేదనేది వాస్తవం. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో ఒకటైన భారతదేశం ప్రకృతికి అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. సాంకేతికత ఒక జీవనశైలికి దారితీసింది. దీనిలో ఒక సామాన్యుడి రోజువారి జీవితంలో ప్రకృతి ఒక భాగంగా మారింది. కానీ, ఇంత గొప్ప మన సాంస్కృతిక పర్యావరణ వారసత్వాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. నాటి నుండి పాలకులు, ప్రభుత్వాలు మన నాగరిక వారసత్వం గొప్పదనాన్ని మెచ్చుకోలేదు సరికదా కాలక్రమంలో ఒక సామాన్యుడి అవసరాలకు తగినట్లుగా మార్పులను చేర్చడానికి చర్యలు కూడా తీసుకొలేదు. మన ప్రభుత్వాలు ప్రపంచంలోని పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనాలపై మక్కువ చూపించాయి. ఫలితంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆ పరిజ్ఞానంలో దిగుమతికి ఇచ్చిన ప్రాధాన్యత పర్యావరణ రక్షణకు ఇవ్వలేదు. ఇల్లే శిక్షణ ఉత్పత్తుల వాడకం పెరుగుల అభివృద్ధి ప్రక్రియను సూచిస్తుంది కదా అనవచ్చు. కానీ, ఇది ఏ రకం అభివృద్ధి ప్రక్రియో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఉత్పత్తులకు ‘నో’ చెప్పడం ఎలా? హానికరమైన రసాయనాల ఉత్పత్తికి ఒక చిన్న ఇంటి సహకారం ఎంత ఉంది? తమ జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఒక సామాన్యుడు ప్రకృతి చేతుల్లోకి ఎలా వెళుతున్నాడు?! తెలుసుకోవడంలో ఎప్పుడూ అనాసక్తినే చూపుతున్నాం. ఈ రకమైన అభివృద్ధి మన పిల్లలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాత్రమే ఇవ్వగలదని, కచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని కాదని మన అనుభవాల నుంచే స్పష్టమవుతుంది. అధునాతన ఎయిర్ కండిషనర్లు, వాటర్ ప్యూరిఫైర్లతో కూడిన ఆధునిక ఇళ్లను మన పిల్లలకు బహుమతిగా ఇవ్వగలం. కానీ, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తాగునీరు కాదు. ఒక ఇంటి నుంచి ఈ రసాయనాలను విడుదల చేయడం తక్కువే కావచ్చు. ఈ ఉత్పత్తులను ఉపయోగించే జనాభా అధికంగా ఉండటం, గృహ కాలుష్యకారకాలను విస్మరించడం అంత అల్పమైన విషయం కాదని గ్రహించవచ్చు. ఆధునిక సమాజంలో జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి తిరిగి ప్రకృతి చేతుల్లోకి వెళ్లడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మన జీవితంలో ప్రకృతి పాత్రను గుర్తించడంలో మాత్రం ఎప్పుడూ వెనుకబాటులో ఉండకూడదు. ప్రతి ఒక్కరు దీనిని అభ్యాసంగా చేసుకోవాలి. రోజువారీ కార్యకలాపాలలో ప్రకృతికి తగిన గౌరవం ఇచ్చి తీరాలి. భారతదేశంలో గృహ కాలుష్య కారకాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు త్వరితంగా చర్యలు తీసుకోవాల్సిన సరైన సమయం మాత్రం ఇదే! – ఆరెన్నార్ -
స్పెషల్‌గా చూస్తారు.. మార్గం చూపుతారు
పరుగులు పెడుతున్న ఈ సాంకేతిక యుగంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే క్షణాలు సన్నగిల్లుతున్నాయి. ఫలితంగా ఎన్నో మానసిక సమస్యలు మనిషిని చుట్టుముడుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధలు అనుభవిస్తున్నవారు కొందరైతే.. మానసిక ఎదుగుదల లేని పిల్లల పెంపకం గురించి సమస్యలు ఎదుర్కొనే తల్లిదండ్రులు కొందరు. ‘ఇలాంటి వారికి పరిష్కార మార్గాలు సూచించేందుకు ఒకే కప్పు కింద వందమంది స్పెషలిస్టులతో అవసరమైన థెరపీలతో చికిత్సనందిస్తున్నా’మన్నారు సరిపల్లి శ్రీజ. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ‘పినాకిల్ బ్లూమ్స్’ పేరుతో థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసి తగిన మార్గదర్శకాలను రూపొందించారు. పోషకాహార నిపుణురాలైన శ్రీజ పిల్లల న్యూరలాజికల్ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఎలా పయనించారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.మా అబ్బాయి సంహిత్‌కు ఇప్పుడు నాలుగేళ్లు. చూస్తున్నారుగా చలాకీగా తిరుగుతూ ఎలా మాట్లాడుతున్నాడో.. ఇప్పుడు ఈ మాట ఆనందంగా చెప్పుగలుగుతున్నాను కానీ, మూడేళ్ల క్రితం మేం పడిన బాధ అంతా ఇంతా కాదు. వాడు పుట్టిన ఏడాదికి ఓ రోజు బాగా జ్వరం, నోటి నుంచి నురగలు వచ్చాయి. భయమేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. ట్రీట్మెంట్ పూర్తయ్యి, జ్వరం తగ్గింది కానీ, ఆ తర్వాత నుంచి వాడిలో విచిత్రమైన మార్పులు.. చేతికి ఏది దొరికితే అది విసిరేసేవాడు. పిలిస్తే పలికేవాడు కాదు.. ఈ సమస్యలతో మళ్లీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్ ‘ఆటిజమ్’కు సంబంధించిన ఓ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. ‘అసలు మా అబ్బాయికున్న సమస్య ఏంటీ, ఇప్పుడీ పుస్తకం నాకెందుకు ఇచ్చారు?’ అని డాక్టర్‌ను అడిగితే ‘మీ అబ్బాయికి ఆటిజమ్ సమస్య ఉంది, మిగతా పిల్లల్లా కాదు తను’ అంటూ ఆటిజమ్ పిల్లల ప్రవర్తన గురించి వివరించి కొన్ని మందులు రాసిచ్చారు. అయితే వీడు మిగతా అందరు పిల్లల్లాగే చక్కగా ఆడుకునేవాడు, పెట్టింది తినేవాడు, అనవసరంగా ఏడ్వడం.. వంటివి చేసేవాడు. డాక్టర్‌తో ఇది ‘ఆటిజమ్’ కాదంటే మళ్లీ చెక్ చేశారు. ఆ పరీక్షలో మా అబ్బాయికి వినికిడి సమస్య ఉందని, దానివల్లే వాడు మేం చెప్పేది సరిగా వినడం లేదని తేల్చారు. బాబుకి మాటలు సరిగా రావాలన్నా, చెప్పింది వినాలన్నా రెండు– మూడేళ్లు స్పీచ్ థెరపీ చేయాలన్నారు. రోజూ స్పీచ్ సెంటర్‌కి తీసుకెళ్లాలి. వాడు రెండు రోజులు థెరపీ సెంటర్‌కి వచ్చాడు. మూడో రోజు నుంచి రానని మొరాయించడంతో అక్కడి వాతావరణం, ఆ థెరపీ విధానం నచ్చడం లేదని అర్థమైంది. ఇలాంటి పిల్లలకు థెరపీ ఇవ్వాలంటే ఇంటిలాంటి ప్లేస్ ఉండాలి. అది వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దేదిలా ఉండాలి. ‘అలాంటి సంస్థను మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు’ అనే ఆలోచనతో వీటికి సంబంధించి ఉన్న రకరకాల సెంటర్స్ గురించి చాలా రీసెర్చి చేశాం. థెరపీతో తెరపి.. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది రకరకాల న్యూరలాజికల్ కండిషన్స్, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ల సర్వే ద్వారా తెలిసింది. ఆ సమస్యలు.. ఆటిజం కావచ్చు, సెరిబ్రల్ పాల్సీ, చిన్న చిన్న ఫోబియాలు, మాటలో లోపాలు, స్ట్రెస్, డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు, వైవాహిక బంధాలలో సమస్యలు.. ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారున్నారని తెలిసింది. ఇలాంటి వారికి థెరపీ ఇచ్చి వారి జీవితాలకు తెరపి ఇవ్వాలని మావారు సరిపల్లి కోటిరెడ్డితో కలిసి రెండేళ్ల క్రితం ‘పినాకిల్ బ్లూమ్స్’ పేరుతో స్పీచ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. దీంట్లో స్పీచ్ థెరపీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ మోడిఫికేషన్.. అన్నీ ఒకే దగ్గర లభించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక బ్రాండ్... వంద మంది స్పెషలిస్ట్‌లు వంద మంది స్పెషలిస్ట్‌లు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశాం. స్పెషల్ చిల్డ్రన్సే కాదు టీనేజ్ పిల్లల ప్రవర్తనలోనూ మార్పులు తీసుకురాదగిన థెరపీలను ఇక్కడ డెవలప్ చేశాం. రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఇక్కడకు వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటుంటారు. ఆనందంగా వారి భావి జీవితాలను నిర్మించుకుంటున్నారు. స్పెషల్ చిల్డ్రన్‌కి థెరపీ ఇప్పించలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులకు సేవా, కోటి ఫౌండేషన్ల ద్వారా ఉచితంగా చికిత్సను ఇస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ 300 మంది పిల్లలు థెరపీ పొందుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి 3 నెలల నుంచి రెండేళ్ల వరకు థెరపీ అవసరం. ఇప్పటికి హైదరాబాద్‌లో 11 థెరపీ సెంటర్లను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పినాకిల్ బ్లూమ్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ ముగించారు శ్రీజ. నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల పరిశీలిస్తూ... పరిష్కరించాలి... పిల్లల చిన్న వయసులోనే ఆటిజమ్‌ను గుర్తించకపోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కొందరిలో మాట ఉండదు. వాళ్లంతట వాళ్లు ఆడుకోలేరు, సోషల్ స్కిల్స్ ఉండవు, పిలిస్తే పలకకపోవడం, ఐ కాంటాక్ట్ ఉండకపోవడం వంటివి ప్రాథమిక లక్షణాలు. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. అలాగే నలుగురిలో కలవలేకపోవడం, డిప్రెషన్, ఆత్మన్యూనత వంటి సమస్యలను కుటుంబసభ్యులు త్వరగా గుర్తించగలిగితే కౌన్సెలింగ్‌ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. డాక్టర్ శ్రీజ, పినాకిల్ బ్లూమ్స్ నిర్వాహకురాలు -
నైట్షిఫ్ట్లతో డీఎన్ఏలో మార్పులు
ఇతరులతో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వారి డీఎన్ఏలో చాలా ఎక్కువగా మార్పులు వస్తుంటాయని హాంకాంగ్ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ఫలితంగా గుండెజబ్బులు, నాడీసంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వీరు అంటున్నారు. అనెస్థీషియా అకడమిక్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారి డీఎన్ఏ మార్పులు... మామూలు వారితో పోలిస్తే 30 శాతం వరకూ ఎక్కువ ఉంటాయి. దీనికి నిద్రలేమి కూడా తోడైతే డీఎన్ఏ నష్టం ఇంకో 25 శాతం ఎక్కువ ఉంటుంది. డీఎన్ఏలో తరచూ ఒకటి అరా మార్పులు జరగడం మామూలే అయినప్పటికీ రెండుగా విడిపోయేటప్పుడు ఈ మార్పులు కొనసాగడం.. మరమ్మతులకు లొంగకపోవడం వల్ల సమస్యలు వస్తూంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డబ్ల్యూ.చోయి తెలిపారు. తాము జరిపిన అధ్యయనంలో రాత్రిపూట పనిచేసే వారితోపాటు మూడురోజులపాటు సరైన నిద్ర లేని వారి రక్తాన్ని విశ్లేషించామని, కాకపోతే ఈ పరీక్షలు చాలా తక్కువ మందితో జరిపామని చోయి వివరించారు. మరిన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకున్న తరువాతే డీఎన్ఏ విడిపోవడానికి.. వ్యాధులకూ ప్రత్యక్షసంబంధం ఉందని చెప్పగలమని వివరించారు. -
ఉయ్యాల ఊగితే..మాంచి నిద్ర!
రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ మధ్యకాలంలో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందా? అయితే ఒక పనిచేయండి. ఇంట్లో ఓ ఉయ్యాల వేయించుకోండి. ఎంచక్కా దానిపైనే ఊగుతూ నిద్రపోండి. మీ సమస్యలు ఉపశమించే అవకాశం ఉంది. అదెలా అని ఆశ్చర్యపోవద్దు. స్విట్జర్లాండ్, జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన రెండు వేర్వేరు అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఉయ్యాలపై ఊగడం నిద్రను ఎక్కువ చేయడం మాత్రమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుందట. మాములు పరిస్థితుల్లో కూడా బాగా నిద్రపోయే వారు కొంతమందిని ఎన్నుకుని తాము ప్రయోగాలు చేశామని.. ఉయ్యాల ఊపులకు వీళ్లు చాలా తొందరగా నిద్రలోకి జారుకోవడమే కాకుండా.. ఎక్కువ సమయం దీర్ఘనిద్రలో ఉన్నట్లు తెలిసిందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లారెన్స్ బేయర్ తెలిపారు. అలాగే కొన్ని పదాలను గుర్తుపెట్టుకుని మళ్లీ చెప్పాల్సిందిగా కోరే పరీక్షలోనూ వీరు విజయం సాధించారని తద్వారా వారి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు తాము ఒక అంచనాకు వచ్చామని వివరించారు. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లోనూ దాదాపు ఇదే ఫలితాలు రావడం విశేషం. ఎలుకలను నిద్ర పుచ్చేందుకు వీరు కదిలే పంజరాలను ఉపయోగించారు. -
క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో సోదరి
ప్రముఖ డిజైనర్.. రణ్‌బీర్ కపూర్ సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని, ‘కోకిచి మికిమోటో’ అనే ఆభరణాల సంస్థకు క్షమపణలు తెలిపారు. విషయం ఏంటంటే.. కొన్నాళ్ల క్రితం రిద్ధిమా కపూర్ ‘ఆర్ జ్యూవెలరి’ పేరుతో సొంత బ్రాండ్‌ను ప్రారంభించి.. ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేయించి అమ్ముతున్నారు. ఈ క్రమంలో పండుగల సీజన్ సందర్భంగా రిద్ధిమా ఒక చెవి దుద్దుల డిజైన్‌ను విడుదల చేశారు. అయితే ఈ చెవి దుద్దుల డిజైన్, ప్రముఖ ముత్యాల నగల తయారీదారులు ‘కోకిచి మికిమోటో’ కంపెనీ తయారు చేసిన చెవి దుద్దుల డిజైన్ రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి. దాంతో రిద్ధిమా, కోకిచి వారి డిజైన్‌ను కాపీ కొట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. View this post on Instagram The legendary Kokichi Mikimoto is known in the pearl world as the ‘King of Pearls’. His ‘cultured pearls’ —patented in 1916 — is a benchmark for the industry at large. So, naturally ‘Jewellery designer of the year’, @riddhimakapoorsahniofficial couldn’t help herself from selling the iconic Mikimoto pearl and diamond earrings under her namesake label. If this is not #gutsontoast, we don’t know what is! 🤯 . . #gandi #dietsabya #copy #🤢 #riddhimakapoorsahni #mikimoto #mikimotopearls A post shared by Diet Sabya (@dietsabya) on Nov 25, 2018 at 1:57am PST తొలుత ఈ విషయం గురించి ఒక అపరిచిత వ్యక్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ విషయం కాస్తా వైరల్ కావడంతో రిద్ధిమా క్షమాపణలు చెప్పారు. ‘ఒరిజినల్ డిజైన్ని ట్యాగ్ చేయకపోవడం మా తప్పే. డిజైనర్ల సృజనాత్మకతను మేము గౌరవిస్తాము. మేము ఎవరిని కాపీ చేయము.. ఒకవేళ అలాంటి పనులు చేస్తే మాకు స్ఫూర్తినిచ్చిన వారిని మేము ఎప్పటికి గౌరవిస్తాము’ అంటూ రిద్ధిమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Riddhima Kapoor Sahni (@riddhimakapoorsahniofficial) on Nov 25, 2018 at 8:41am PST -
‘సర్కార్’పై ఏమిటీ అరాచకం!
పుస్తకాలు మొదలుకొని చలనచిత్రాలు, ఛాయాచిత్రాల వరకూ సృజనాత్మక రంగంలోని సకల పార్శా్వల్లోనికీ జొరబడి తమ మాటే చెల్లుబాటు కావాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చే ధోరణి ఉన్నకొద్దీ పెరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం పదే పదే చెప్పినా ఈ విషయంలో ఏ మార్పూ రావడం లేదు. తాజాగా వివిధ భాషల్లో విడుదలైన తమిళ చిత్రం ‘సర్కార్’ చుట్టూ ఆ మాదిరి వివాదమే రాజుకుంది. అందులోని కొన్ని సన్నివేశాలు తమ పార్టీ అధినేత జయలలితను, ఆమె తీసుకొచ్చిన జన సంక్షేమ పథకాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ పాలక అన్నా డీఎంకే కార్యకర్తలు తమిళనాడులోని థియేటర్లపై పడ్డారు. ఆ చిత్రం బ్యానర్లు, పోస్టర్లు చించి కటౌట్లు ధ్వంసం చేశారు. మంత్రులు ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు మురుగదాస్‌లకు వ్యతిరేకంగా ప్రకటనలి చ్చారు. ఒక మంత్రి ‘దేశద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని సన్నివేశాలు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది అన్నాడీఎంకే నేతల అభియోగం. మురుగ దాస్‌పై ఫిర్యాదు రావడం తరవాయిగా ఆయన ఇంటిపై రాత్రికి రాత్రే పోలీసులు దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సాధారణ పౌరుడెవరైనా తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇంత వేగంగా కదులుతారా? మురుగదాస్ తెల్లారి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు అన్నా డీఎంకే కార్యకర్తలకు అభ్యంతరకరం అనిపించిన సన్నివేశాల తొలగింపునకు, కొన్ని పదాలు వినబడకుండా చేసేందుకు చిత్ర నిర్మాతలు అంగీ కరించాల్సి వచ్చింది. తమ అధినేతను అవమానించినవారిని సాష్టాంగపడేలా చేయగలిగామన్న సంతృప్తి అన్నా డీఎంకే నేతలకు ఉండొచ్చు. కానీ సాధారణ ప్రజలకు ఇదెలాంటి సందేశాన్ని పంపు తుంది? బలప్రయోగంతో దేన్నయినా సాధించుకోగలమన్న అభిప్రాయం కలిగించదా? ప్రభుత్వా నికి సారథ్యం వహించే పార్టీకి ఇది మంచి చేస్తుందా? రేపెవరైనా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇదే మార్గాన్ని అనుసరిస్తే ముఖ్యమంత్రి పళనిస్వామి ఏం చేస్తారు? ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి అధి కారం కట్టబెట్టేది తమ సమస్యలు పరిష్కరించడానికి. అంతేతప్ప తమకు శిరోభారం కలిగించమని కాదు. కానీ అది పుస్తకం కావొచ్చు, అయ్యప్ప సన్నిధికి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం కావొచ్చు... దేన్లోనైనా వివాదం రెచ్చగొట్టి లబ్ధిపొందుదామని చూసే ధోరణి రాజ కీయ నాయకుల్లో పెరుగుతోంది. ఏదైనా కళారూపంపై అందరికీ ఏకీభావం ఉండాలని లేదు. దాన్ని మెచ్చేవారున్నట్టే, అదంటే నచ్చనివారు కూడా ఉంటారు. రచయితలైనా, కళాకారులైనా సమాజంలో జరిగేవాటిని విమర్శ నాత్మకంగా ప్రతిబింబిస్తారు తప్ప దేన్నీ గాల్లోంచి సృష్టించలేరు. మనకు రోజూ తారసపడేదే అయినా, అది మన అనుభవంలోకి పదే పదే వస్తున్నా మనం చూడని భిన్న కోణాన్ని వారు అందులో స్పృశించి ఉండొచ్చు. అది సరైంది కాదనుకునేవారు దాన్ని నిశితంగా విమర్శించవచ్చు. నిరసన వ్యక్తం చేయొచ్చు. అదెలా తప్పో నిరూపించవచ్చు. న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించ వచ్చు. కానీ ఈ మార్గాలను వదిలిపెట్టి ఆవేశంతో రోడ్లెక్కి వ్యక్తులపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తుంది. కానీ చిత్రమేమంటే ఆవేశంతో చెలరేగే గుంపులు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే నేతలు సైతం ఇలాంటి పనులు చేయడానికి వెరవడం లేదు. జనాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించి వారి మెప్పు పొందాలని ఒకప్పుడు పార్టీలు తహతహలాడేవి. ఇప్పుడు రోజులు మారాయి. తామను కునే అభిప్రాయాన్ని వారిపై రుద్ది, దాన్ని జనాభిప్రాయంగా చలామణి చేసి ఆ వంకన ‘బ్లాక్‌మెయి లింగ్’కు దిగే ధోరణి పెరిగిపోయింది. ‘పద్మావత్’ చిత్రం పడిన కష్టాలు ఇందుకు ఉదాహరణ. షూటింగ్ జరుపుకునే దశ నుంచి దానిపై కర్ణి సేన దాడులు చేస్తూ వచ్చింది. ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలు తీసుకొచ్చినవారికి రూ. 5 కోట్లిస్తామనే వరకూ వ్యవహారం వెళ్లింది. చివరకు ఆ చిత్రంలో తామనుకున్నట్టు ఎలాంటి అభ్యంతరకర సన్నివే శాలూ లేవని తెలిసినా ఈ గుంపు విధ్వంస పోకడల్ని విడనాడలేదు. తమిళనాడు థియేటర్ యజ మానుల సంఘం నాయకుడు సుబ్రమణియమ్ ఆవేదన గమనించదగ్గది. రాజకీయ పార్టీలకూ, నటులకూ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా తమ ఆస్తులు ధ్వంసమవుతున్నాయని, వ్యాపారం దెబ్బతింటున్నదని ఆయన చెప్పారు. నిజమే... ప్రముఖ నటుడు రజనీకాంత్ చిత్రం ‘కాలా’పై ఆర్నెల్లక్రితం ఇలాంటి వివాదమే చెలరేగింది. అనేక కారణాలు చెప్పి ‘కాలా’కు అడ్డంకులు సృష్టిం చేందుకు అటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో అనేక సంఘాలు ప్రయత్నించాయి. చివరకు ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. ఇప్పుడు ‘సర్కార్’కు కూడా అవరోధాలు తప్పలేదు. మన కున్న కళారూపాల్లో సినిమా అనేది కోట్లాది రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపారం. ఏవో సాకులు చెప్పి అడ్డుకోవాలని చూడటం భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడం మాత్రమే కాదు... దానిపై ఆధారపడి ఉన్న వందల కుటుంబాల జీవికను దెబ్బతీయడం. తమిళనాడు ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. చలనచిత్రాలను చూసి, అవి ప్రదర్శనయోగ్యంగా లేవనుకుంటే కత్తిరించడానికి లేదా మొత్తంగా అనుమతి నిరా కరించడానికి ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు వంటివి ఉన్నాయి. వాటిపై ఆఖరి మాట చెప్పడానికి న్యాయస్థానాలున్నాయి. అసలు ప్రజాస్వామ్యంలో ఈ సెన్సారింగ్ విధానమే సరికాదని వాద నలొస్తున్న తరుణంలో...రాజకీయ పార్టీలు, కులసంఘాలు సెన్సారింగ్ బాధ్యతను తమ భుజాలకెత్తుకుని అధికారం అండతో గొడవలు సృష్టించడం, బెదిరింపులకు దిగడం దారుణం. రాజ్యాంగంపై, చట్టాలపై విశ్వాసమున్నదని చెబుతున్నవారు ఇలాంటి పోకడలకు పోవడం సరికాదు. -
ఎన్టీఆర్‌తో గొడవలు లేవు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా వంశీ పరిచయం అయ్యాడు. వక్కంతం వంశీ ‘కిక్’, ‘టెంపర్’, ‘ఎవడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ కంటే ముందు వంశీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో డైరెక్టర్‌గా మారాలనుకున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ కోసం కథ కూడా సిద్ధం చేశాడు వక్కంతం వంశీ. కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకున్నాడు. గతంలో ఎన్టీఆర్, వంశీల మధ్య విబేధాలు వచ్చాయినే వార్తలు హల్చల్ చేశాయి. వంశీ ప్రస్తుతం ఆ విషయంపై స్పందించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఏ విధమైన వివాదాలు లేవని, ఆయనతో టచ్‌లో ఉన్నానని చెప్పాడు. ‘ ఎన్టీఆర్‌తో గొడవలు ఉన్నాయని వచ్చిన రూమర్స్ నిజం కాదు. డైరెక్టర్‌గా చేయమని ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించాడు. నా మొదటి చిత్రం ఆయనతోనే చేయాలని అనుకున్నాను. స్టోరి కూడా రెడీ చేశాను. కానీ ఆ ప్రాజెక్టును ఆపేశాం. ఆ సమయంలో బన్నీ కోసం ఓ కథ ఉంటే చెప్పమని బుజ్జి గారు అడిగారు. అప్పుడు ‘నా పేరు సూర్య’ కథ సిద్ధం చేశాను’ అని వక్కంతం వంశీ తెలిపాడు. -
నెలసరి సమస్యలకు మండూకాసనం
మండూకాసనం గర్భకోశ వ్యాధులు, రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనంలో మొదట..వెన్ను నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడల మీద ఉంచాలి.రెండు పిడికిళ్లు బిగించి కింది పొట్టకు ఆనించాలి. మోకాళ్లను కొంచెం దూరం జరిపి, నడుమును (వెన్నును కాదు) వంచి నుదురును నేలకు ఆనించాలి. ఆ స్థితిలో పదిసార్లు శ్వాస తీసుకుని వదిలిన తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. మొదటి ప్రయత్నంలో నుదుటిని నేలకు ఆనించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు బలవంతంగా ఆనించే ప్రయత్నం చేయరాదు. సాధనతో సాధ్యం చేసుకోవాలి. ఉపయోగాలు: గర్భకోశ వ్యాధులు, రుతు సంబంధ సమస్యలు పోతాయి. మోకాళ్ల నొప్పులు పోతాయి. నడుము ప్రదేశంలోని దేహభాగాలను ఆరోగ్యవంతంగా ఉంటాయి. పిరుదులలోని కొవ్వు కరిగిపోతుంది. జాగ్రత్తలు: బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. -
ఏలికా.. మాట్లాడాలిక!
ఏ నియోజకవర్గాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం.. నగరం సమస్తంసమస్యల పద్మవ్యూహం. వానొస్తే చిగురుటాకులా వణుకుతున్న సిటీ. మరమ్మతులకు నోచుకోని రహదారులు.. అడుగడుగునాగుంతలు.. ఆక్రమణలకు గురైన నాలాలు.. పారిశుధ్యం కొరవడిన వీధులు.. నిధులున్నా ముందుకు సాగని అభివృద్ధి పనులు.. తాగునీటి ఇబ్బందులు.. ప్రగతికి దూరంగా మురికివాడలు... ఇలా ఒకటా రెండా మహానగరాన్ని ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు మూడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సభలో సిటీ ఎమ్మెల్యేలు గళం విప్పుతారని నగరవాసులు ఆశిస్తున్నారు. మీ వాణిని మీదైన బాణీలో వినిపించండి ఎమ్మెల్యే సార్లూ..! శేరిలింగంపల్లి:ఎ.గాంధీ ♦ నియోజకవర్గంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. రూ.200 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అటకెక్కాయి. ♦ చందానగర్‌లోని రెడ్డి కాలనీలో ఎస్టీపీ ప్లాంట్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ♦ నాలాల విస్తరణ ఊసే లేదు. నాలాలు కబ్జాకు గురవుతుండడంతో కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల వర్షాలకు దీప్తిశ్రీనగర్ నీట మునిగింది. గచ్చిబౌలి నాలా పొంగడంతో ఇందిరానగర్, రాంకీటవర్స్ రోడ్డు జలదిగ్భంధంలో చిక్కుకుంది. ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. గౌలిదొడ్డి కేశవ్‌నగర్‌లో రెండెకరాలు, తాజీనగర్లో 1.25 ఎకరాలు, హఫీజ్‌పేట్ సాయినగర్‌లో 1.20 ఎకరాల స్థలం గుర్తించినప్పటికీ పనులు మొదలవడం లేదు. మలక్‌పేట్ :అహ్మద్ బలాల ♦ మలక్‌పేట్ నియోజవర్గంలోని మూసారంబాగ్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట, చావుణి డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ♦ మూసీ పరివాహక ప్రాంతాల్లోని తీగలగూడ, షాలివాహననగర్, చావుణి గుడిసెవాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ పనులు ప్రారంభం కాలేదు. ♦ చాదర్‌ఘాట్, మలక్‌పేట్‌లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యకు ఇంతవరకూ పరిష్కారం చూపలేదు. ♦ మలక్‌పేట్‌లోని ఆర్యూబీ కింద రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. ముషీరాబాద్ :కె.లక్ష్మణ్ ♦ హుస్సేన్‌సాగర్ నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం కలగానే మారింది. ♦ లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల వద్ద పైప్‌లైన్ పగిలిపోయి ఏడాదిగా కలుషిత నీరు వస్తోంది. ♦ అశోక్‌నగర్ బ్రిడ్జి వెడల్పు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ♦ వీఎస్టీ చౌరస్తా విస్తరణ పనులు చేపట్టాలి. ♦ ముషీరాబాద్‌లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మహేశ్వరం :తీగల కృష్ణారెడ్డి ♦ నియోజకవర్గంలో ఇంటింటికీ కృష్ణా జలాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. మీర్పేట్, జిల్లెలగూడ, బడంగ్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల పరిధిలో మూడు, నాలుగు రోజులకు ఒకసారి మంచినీరు వస్తోంది. ♦ జిల్లెలగూడ, మీర్పేట్లోని చెరువులను సుందరీకరిస్తామని ఇచ్చిన హామీ అటకెక్కింది. ఈ ప్రాంతాల్లోని చెరువులు మురుగు నీటితో కంపు కొడుతున్నాయి. ♦ రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. మరమ్మతు పనుల ఊసే లేదు. ♦ ఆర్కేపురం ఎన్టీఆర్నగర్ వాసులకు రెగ్యులరైజేషన్ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అంబర్‌పేట..: కిషన్‌రెడ్డి ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ♦ బతుకమ్మ కుంట పునరుద్ధరణలో తీవ్ర జాప్యం. ♦ అంబర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కొరత. ♦ ఆధునికీకరణకు నోచుకోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ♦ సమస్యగా పరిణమించిన రత్నానగర్, మోహిన్చెరువు, ఓయూ నాలాలు. చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఒవైసీ ♦ ఉప్పుగూడ రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాతబస్తీ..మారదా.. దుస్థితి చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో మూడేళ్లుగా సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి కుళాయిల్లో మురుగు నీరు సరఫరా అవుతోంది. చార్మినార్ కాలిబాట పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. -పాషాఖాద్రీ,చార్మినార్ ఎమ్మెల్యే యాకుత్‌పురా: అహ్మద్‌ఖాన్ ♦ సంతోష్‌నగర్ ఐ.ఎస్.సదన్ చౌరస్తా వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. మూడేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ♦ పూర్తిస్థాయిలో రీమోడలింగ్ జరగని డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు. ♦ నూర్‌ఖాన్‌బజార్ వద్ద నిర్మిస్తున్న మంచినీటి రిజర్వాయర్ పూర్తి కాలేదు. బహదూర్‌పురా:మోజంఖాన్ ♦ లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ♦ నాలాల విస్తరణ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ♦ బహదూర్‌పురా– కిషన్‌బాగ్ రోడ్డులో నౌ నంబర్ వరకు ప్లైఓవర్ బ్రిడ్జి మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. గోషామహల్: రాజాసింగ్‌లోథా ♦ ధూల్‌పేట్‌లోని గుడుంబా తయారీదారులు రోడ్డున పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేదు. ♦ బేగంబజార్‌లో చేపల మార్కెట్ అభివృద్ధి అటకెక్కింది. ♦ జుమ్మెరాత్ బజార్లో కల్యాణ మండపం నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. కుత్బుల్లాపూర్:వివేకానంద్ ♦ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాలుగేళ్లుగా పక్కా భవనం లేదు. ♦ సుభాష్‌నగర్ నుంచి ఫాక్స్‌సాగర్ వరకు నాలా పనులు మొదలు కాలేదు. ♦ జగద్గిరిగుట్టలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మారింది. ♦ గాజులరామారం సర్కిల్ పరిధిలో క్వారీ గుంతలు మృత్యుకుహరాలుగా మారాయి. ♦ బహదూర్‌పల్లి, కొంపల్లి మధ్య రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ♦ గండిమైసమ్మ జ్యోతిరావు పూలే స్టేడియం పనులు ఒక్క అడుగు కూడా పడలేదు. ♦ రసాయన వ్యర్థాలను అక్రమంగా నాలాల్లోకి వదులుతున్నా చర్యలు శూన్యం. ఉప్పల్:ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ♦ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు కలగానే మిగిలింది. ♦ ఉప్పల్ ప్రధాన రహదారి విస్తరణ ప్రతిపాదనకే పరిమితం. ♦ ఏడు చెరువుల పరిరక్షణ హామీ అటకెక్కింది. ♦ ఎమ్మెల్యే నిధులు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికే పరిమితం. ♦ నాచారం ప్రధాన రహదారి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ధర్నా చేసినా ఫలితం లేదు. ♦ పేదలకు ఇళ్ల నిర్మాణం హామీ నెరవేరలేదు. సనత్‌నగర్:తలసాని ♦ నియోజకవర్గంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య. బేగంపేట్ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉంటుంది. ♦ సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్, పంజగుట్ట, బాలానగర్, బంజారాహిల్స్, సోమాజిగూడ, సనత్‌నగర్, ఎరగ్రడ్డ, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదొక్కటే ప్రధాన మార్గంగా ఉంది. ♦ బండమైసమ్మనగర్, జీవై కాంపౌండ్, పొట్టిశ్రీరాములునగర్, అంబేడ్కర్‌నగర్ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పునాదుల దశ దాటలేదు. బస్తీవాసులు అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్ :మాగంటి గోపీనాథ్ ♦ బోరబండలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు హామీ నెరవేరలేదు. ♦ బోరబండ పెద్దమ్మనగర్‌లో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. ♦ రహమత్‌నగర్‌లో ఆర్భాటంగా ప్రకటించిన ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ♦ రహమత్‌నగర్‌లో ప్రభుత్వ ఐటీఐ, మ«ధురానగర్లో స్విమ్మింగ్‌పూల్, రాజీవ్‌నగర్‌లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలాయి. మేడ్చల్ :సుధీర్‌రెడ్డి ♦ ఘట్కేసర్ మండలంలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్న ఎమ్మెల్యే హామీ నేరవేరలేదు. ♦ మేడ్చల్, ఘట్కేసర్, శామీర్‌పేట మండలాల్లో మినీ స్టేడియాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. కూకట్పల్లి :మాధవరం కృష్ణారావు ♦ భరత్‌నగర్ మార్కెట్‌ను ఆ«ధునికీకరిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు. ♦ బాలానగర్ చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులు మొదలు కాలేదు. మల్కాజిగిరి :చింతల కనకారెడ్డి ♦ ఆర్ఓబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ♦ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచి, కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ♦ సఫల్గూడ చెరువులను మినీ ట్యాంక్‌లుగా అభివృద్ధి చేసి, ఇక్కడ బోటింగ్, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఎల్బీనగర్ :ఆర్.కృష్ణయ్య ♦ వర్షాలకు కాలనీలు మునిగిపోతున్నాయి. ఇటీవల తపోవన్ కాలనీ, గ్రీన్‌పార్కు, ఆదర్శనగర్, గడ్డిఅన్నారంలోని ఇళ్లలోని వరద నీరు చేరింది. ♦ నాలాల విస్తరణ ఊసే లేదు. చెరువుల అభివృద్ధి అటకెక్కింది. ♦ రహదారుల విస్తరణ కాగితాలకే పరిమితం. శివారు ప్రాంతాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. -
భయంగా ఉంటోందా?
జీవితంలో కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి చాలా చిన్నవిగానే అనిపిస్తాయి. అనుభవించిన వాళ్లకు మాత్రమే వాటి బాధ అర్థమవుతుంది. తరచుగా అలాంటి చిన్నా చితకా సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఈ పరిహారాలను పాటించండి.ఆర్థిక ఇక్కట్లు, ఆరోగ్య బాధలు లేకపోయినా, ఒక్కోసారి ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. అప్పుడు అశ్వగంధ వేరును బూడిదరంగు దారంలో కట్టి మెడలో వేసుకోండి. అలాగే, అశ్వగంధాది లేహ్యాన్ని రెండుపూటలా సేవించండి. కొందరికి సాధారణ సమయాల్లో మామూలుగానే ఉన్నా, ప్రయాణాలు చేసే సందర్భాల్లో తెలియని భయాలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రయాణానికి బయలుదేరే ముందు కాలభైరవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి. కొందరు విద్యార్థులు బాగానే చదివినా పరీక్షలంటే తగని భయం ఏర్పడుతుంది. పరీక్షల పట్ల విపరీతమైన భయంతో ఇబ్బంది పడే విద్యార్థులకు తల్లి చేతుల మీదుగా మెడలో వెండి హారాన్ని ధరింపజేయాలి. అలాగే, పరీక్షలంటే భయపడే విద్యార్థులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కొందరికి తరచుగా పీడకలలు వస్తుటాయి. కలల్లో తరచుగా క్రూరమృగాలు, పాములు, భూతప్రేత పిశాచాదులు కనిపించి ఉలిక్కిపడి నిద్రలేస్తుంటారు. ఆ తర్వాత భయంతో ఒక పట్టాన నిద్రపట్టదు. పీడకలలు భయపెడుతున్నట్లయితే, సంజీవని పర్వతం మోస్తున్న ఆంజనేయుడి బొమ్మ గల వెండి లేదా రాగి లాకెట్‌ను ఎర్రతాడుతో మెడలో వేసుకోండి. ప్రతి మంగళవారం ఉదయం ఆంజనేయ ఆలయంలో దర్శనం చేసుకుని, ఆలయం వెలుపల ఉండే యాచకులకు అరటిపండ్లు పంచిపెట్టండి. – పన్యాల జగన్నాథ దాసు -
‘క్యాష్‌లెస్’ కాస్త ఖరీదే!!
డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న సమస్యలు • కార్డులు, వాలెట్లు, నెట్ బ్యాంకింగ్‌కు చార్జీలు • కార్డులపై చెల్లింపులకు ఏకంగా 2 శాతంపైనే • వాలెట్లో డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే తంటా • నెట్ సహా అన్ని లావాదేవీల్లో వైఫల్యాలు • ట్రాన్సాక్షన్ పూర్తి కాదు.. ఖాతాలో డబ్బులేమో మాయం • ఎక్కడికి వెళ్లాయో అర్థమవ్వదు;ఎవరినీ సంప్రదించాలో తెలీదు • కొత్త మాధ్యమాలకు కరవైన నిబంధనలు • సామాజిక మాధ్యమాలను ఆశ్రయించాలంటున్న నిపుణులు నిజం!! ఇది డిజిటల్ యుగం. మీడియా నుంచి ఆర్థిక లావాదేవీల దాకా అన్నీ డిజిటల్ మయమే. అందుకే ప్రభుత్వం కూడా చలామణిలో ఉన్న కరెన్సీని ఒక్కసారిగా రద్దు చేసి డిజిటల్ లావాదేవీల ప్రచారం మొదలుపెట్టింది. కరెన్సీ పెద్దగా అందుబాటులో లేదు కనక జనం కూడా విధిలేక డిజిటల్ లావాదేవీల వైపు అడుగులేస్తున్నారు. కాకపోతే ఇంకా చాలామందికి మొబైల్ వాలెట్లు వాడేదెలా? దానికి చార్జీలేమైనా అవుతాయా? ఇంటర్ నెట్లో బ్యాంకింగ్ లావాదేవీలు ఎలా చేయాలి? ఒకవేళ మధ్యలో ఫెయిలైతే పరిస్థితేంటి? కార్డుల ద్వారా ఎవరికైనా చెల్లింపులు చేయొచ్చా? చార్జీలేమైనా భరించాల్సి ఉంటుందా? ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... మొబైల్లోనే ఉంటుంది మీ వాలెట్... సుజన ఆన్లైన్లో మొబైల్ ఫోన్ కొంటూ... మొబైల్ వాలెట్‌తో చెల్లించింది. లావాదేవీ పూర్తయినట్లు వాలెట్ ప్రొవైడర్ నుంచి సుజనకు మెయిల్ వచ్చింది. ఆన్లైన్ రిటైలర్ మాత్రం తనకు పేమెంట్ అందలేదన్నాడు. కాబట్టి ఫోన్ పంపలేదు. ఒక వారం గడిచింది. అయినా సుజన డబ్బులు ఆమె ఖాతాలోకి రాలేదు. ఎవరికి చెప్పాలన్నది ఆమెకు తెలియలేదు. ఏం చేయాలంటే..! పేటీఎం సహా చాలా వాలెట్లు ఫిర్యాదులు తీసుకోవటానికి ఫోన్ నెంబరేమీ ఇవ్వటం లేదు. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మెయిల్ పంపటానికి మాత్రం అవకాశం ఇస్తున్నాయి. అంటే... మనం గట్టిగా ఎవరినీ అడగటానికి లేదు. మెయిల్ ఇవ్వటం... సమాధానం వచ్చేదాకా చూడటం.... అంతే చేయగలిగింది. అయితే చాలా వరకూ మెయిళ్లకు ఈ సంస్థలు స్పందించి లావాదేవీల్ని పరిష్కరిస్తున్నాయి. ‘‘లావాదేవీలు నిర్వహించే మాధ్యమాన్ని బట్టి లావాదేవీ సెటిల్మెంట్ ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సాక్షన్లు ఫెయిలవుతాయి. ఇలాంటపుడు ఆ లావాదేవీ మొత్తం తిరిగి మనకు చేరడానికి కొన్ని సెకన్ల నుంచి ఏడు పనిదినాల సమయం పట్టొచ్చు. ఇంకా ఎక్కువ సమయం పడితే.. అపుడు ఆ డబ్బులు పూల్ అకౌంట్లో ఉంటాయి. వాలెట్స్/ బ్యాంకులు.. పేమెంట్ నెట్వర్క్ ప్రొవైడర్‌తో కలిసి ఈ అకౌంట్లను నిర్వహిస్తాయి’’ అని పేయూ ఇండి యా సర్వీస్ డెలివరీ హెడ్ హరి వేలాయుధన్ చెప్పారు. వాలెట్లు ఎలా వాడాలి? పేటీఎం, మొబిక్విక్, ఆక్సిజన్, ఫోన్‌పే, స్వైపే... ఇలా రకరకాల మొబైల్ వాలెట్లు అందుబాటులో ఉన్నాయి. దేని ప్రయోజనాలు దానివి. దేని నష్టాలు దానివి. ఎందుకంటే అన్ని వాలెట్లూ అన్ని లావాదేవీలకూ వాడలేం. ఉదాహరణకు మనం ఒక దుకాణంలో పేటీఎం ద్వారా చెల్లించాలని భావిస్తే... సదరు దుకాణదారుడు కూడా పేటీఎం వాడుతుండాలి. తను వేరే వాలెట్ వాడితే కుదరదు. వీటిని వాడాలనుకున్న వారు మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మన వివరాలతో రిజిస్టర్ చేసుకుని... మనకున్న ఆన్లైన్ బ్యాంకు ఖాతా నుంచో, లేకపోతే క్రెడిట్/డెబిట్ కార్డు నుంచో దీన్లో డబ్బులు వేయాలి. అప్పటి నుంచి వాడటం మొదలుపెట్టొచ్చు. చార్జీలెలా ఉంటాయంటే... వాలెట్లలో ఉన్న ప్రస్తుతం చాలా వాలెట్లు మనం లావాదేవీలు చేసేటపుడు ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. కాకపోతే వాలెట్లో డబ్బులు వేసేటపుడు మన బ్యాంకులు మాత్రం లావాదేవీ చార్జీ తీసుకుంటున్నాయి. ఒకవేళ మనం వాలెట్లో ఉన్న డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేసుకోవాలన్నా ఇవి 1–4 శాతం మధ్య చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గమనించి వాడాల్సి ఉంటుంది. మీ బ్యాంకంతా... ఇంటర్నెట్లోనే రాజేష్ తన బ్యాంకు ఖాతా నుంచి మొబైల్ వాలెట్‌కు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వెళ్లింది. కానీ వాలెట్లో జమ కాలేదు. ఎందుకిలా? బ్యాంకును ఫోన్లో సంప్రదించాడు. ‘‘సర్! ఇది రెండంచెల వ్యవస్థ. రెండింటి మధ్య పేమెంట్ గేట్‌వే ఉంటుంది. ఇది బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకొని.. దాన్ని వాలెట్లో జమ చేస్తుంది. గేట్‌వేకు చేరక ముందే లావాదేవీ ఫెయిలయి ఉండొచ్చు. సర్వర్ పనిచేయకపోవడం, నెట్వర్క్ సమస్యలు ఉండొచ్చు. గేట్‌వే కంపెనీలు బ్యాంకులతో రోజూ లావాదేవీలను సెటిల్ చేస్తాయి. ఇది జరిగి మీ ఖాతాలోకి డబ్బులు రావటానికి 1–2 పనిదినాలు పట్టొచ్చు’’ అని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వివరించాడు. ఒకవేళ పేమెంట్ గేట్‌వే డబ్బుల్ని తీసుకున్నాక లావాదేవీ ఫెయిలైతే ఆ డబ్బులు వాలెట్‌కు చేరుతాయి. అదీ కథ. ‘‘నిజమే! వాలెట్ నుంచి బ్యాంక్‌కు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసేటపుడు ఎక్కువ సమస్యలొస్తున్నాయి’’ అని పేటీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ దీపక్ అబాట్ చెప్పారు. ‘‘బ్యాంకుల్లో రద్దీ వల్ల రిఫండ్ ఆలస్యం కావొచ్చు. మేం వాటికి రెఫరెన్స్ నంబర్‌ను పంపిస్తాం. బ్యాంకులో జరిగే ప్రక్రియతో మాకెలాంటి సంబంధం ఉండదు. మా దగ్గరకొచ్చిన కస్టమర్లకు ఏం చేయాలో సూచనలు మాత్రమే ఇవ్వగలం’’ అని వివరించారాయన. నెట్‌బ్యాంకింగ్ చేసేదెలా? ఇంటర్ నెట్ బ్యాంకింగ్ చేయడానికి మీకు మొదట బ్యాంకు ఖాతా ఉండాలి. తరవాత బ్యాంకు బ్రాంచిలో సంప్రదిస్తే వారు చిన్న దరఖాస్తు తీసుకుని నెట్‌బ్యాంకింగ్ ఐడీ ఇస్తారు. పాస్‌వర్డ్‌ను పోస్ట్‌లో పంపిస్తారు. ఈ ఐడీ, పాస్వర్డ్ సాయంతో నెట్‌బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చు. ఈ నెట్‌బ్యాంకింగ్ ద్వారా బిల్లులు చెల్లించటంతో పాటు, ఇతరుల బ్యాంకు ఖాతాలకు, మొబైల్ వాలెట్లకు డబ్బులు బదిలీ చేయొచ్చు. ఇపుడు ప్రతి బ్యాంకూ మొబైల్ యాప్‌లు తెచ్చింది. మొబైల్ యాప్ ద్వారానే నెట్‌బ్యాంకింగ్ లావాదేవీలన్నీ జరుపుకోవచ్చు. వాలెట్లతో పోలిస్తే వీటికి భద్రత ఎక్కువ. చార్జీలూ తక్కువ. చార్జీలూ ఉంటాయి... ఇతరుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయాలంటే వారిని మీ పేయీలుగా జత చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక... ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్)తో పాటు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ చేయొచ్చు. ప్రతి లావాదేవీకీ కొంత చార్జీ ఉంటుంది. ఇది రూ.2–5 మధ్య ఉంటుంది. ఎక్కువ మొత్తాలకైతే ఆర్టీజీఎస్, తక్కువ మొత్తాలకైతే నెఫ్ట్, తక్షణం (సెకన్లలో) డబ్బు బదిలీ కావాలంటే ఐఎంపీఎస్ వాడాలి. ఐఎంపీఎస్‌కు కాస్త ఎక్కువగా రూ.5 వరకూ చార్జీలవుతాయి. కార్డు వాడొచ్చు... కానీ చార్జీలుంటాయ్ సౌమ్య ఓ షాపులో సరుకులు కొని డెబిట్ కార్డుతో చెల్లించబోయింది. స్వైప్ చేశాక.. కాసేపటికి ట్రాన్సాక్షన్ తిరస్కరణకు గురైనట్లు అక్కడ మెసేజీ కనిపించింది. కానీ మొబైల్‌కు మాత్రం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకును సంప్రదిస్తే... ఆ డబ్బులు తిరిగి వస్తాయని, కంగారు పడొద్దని చెప్పారు. కంగారు సంగతి సరే! ముందు దుకాణదారుకు చెల్లించటానికి డబ్బులుండాలి కదా!! అనుకుంది. స్నేహితుల సాయంతో పని పూర్తిచేసింది. కార్డులు వాడటమెలా? నిజానికి ప్రభుత్వమిపుడు కరెన్సీని తగ్గించి డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తోంది. నెట్‌బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ల వంటివి కాస్త ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారికే కాగా... అందరికీ చేతనైనది కార్డుల వాడకమే. ఎందుకంటే దేశంలో చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి. వారికి డెబిట్ కార్డులూ ఉన్నాయి. కొందరికైతే క్రెడిట్ కార్డులుంటాయి. షాపుల్లో చెల్లింపులకు కార్డులు వాడొచ్చు. ఇంటర్నెట్లో కూడా ఈ కార్డుల ద్వారా లావాదేవీలు జరపొచ్చు. ఈ కార్డుల వాడకానికి కావాల్సిన పిన్ నంబరును బ్యాంకులే ఇస్తాయి. చార్జీలతో జాగ్రత్త! డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... డిజిటల్ లావాదేవీలు జరిపేవారిపై చార్జీలను కూడా బాదుతుండటం గమనార్హం. కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించే ప్రతి వ్యాపారీ... చివరికి అలా స్వీకరించిన డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు తీసుకునేటపుడు బ్యాంకులు 2 నుంచి 4 శాతం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ తామెందుకు భరించాలని భావిస్తున్న వ్యాపారులు.... ఆ చార్జీల్ని కూడా కస్టమర్లపైనే వేస్తున్నారు. వీటిని భరించటమెందుకని భావిస్తున్న కస్టమర్లు... కార్డు బదులు నగదు ఇవ్వటానికే మొగ్గు చూపుతున్నారు. ఇదంతా ఒక గొలుసు వ్యవస్థ. ఇటీవలే పెట్రోలు బంకులు ఈ విషయంపై సమ్మె చేశాయి. తమను కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేయొద్దని చెబుతూ... తమ వద్ద నుంచి మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. సమ్మె చేస్తామన్నారు. కార్డులు తీసుకోకూడదని కూడా ఒక దశలో నిర్ణయించారు. చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకుని కొంత గడువు అడగటంతో వెనక్కి తగ్గారు. నిజానికిది ఒక్క పెట్రోలు బంకుల సమస్య మాత్రమే కాదు. కార్డుల్ని స్వీకరించే వారందరి సమస్య. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎలాంటి లావాదేవీలూ లేని లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డులు జారీ చేస్తున్నాయి. కానీ తమకు చార్జీలవుతున్నాయి కాబట్టి వ్యాపారులు ఈ కార్డుదారుల నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది 4 శాతం వరకూ ఉండటంతో కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. మనలో ఆ సత్తా ఉందా? వాలెట్లెలా వాడాలి? కార్డులెలా వాడాలి? నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి? చార్జీలెంత? అనే విషయాలన్నీ పక్కనబెడితే... ఆసలు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే వ్యవస్థ మన దగ్గర ఉందా? అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే డిజిటల్ లావాదేవీల్లో ఫెయిలవటం సాధారణంగా మారిపోయింది. ఇక మోసగాళ్ల సంగతి సరేసరి. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే ఖాతాలో డబ్బులు మాయం. పైపెచ్చు కొత్తగా వస్తున్న డిజిటల్ మాధ్యమాలకు సరైన నిబంధనలు కూడా లేవు. ఉదాహరణకు డబ్బులు తీసుకెళ్లడానికి ఏటీఎంకు వెళతాం. అక్కడ డబ్బులు రావు. కానీ డబ్బులు కట్ అయినట్లు మన మొబైల్‌కి మేసేజ్ మాత్రం వస్తుంది. తర్వాత మళ్లీ మన ఖాతాలో ఆ డబ్బులు జమవుతాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. సమస్య పరిష్కారానికి ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. ఏటీఎంలో డబ్బులు రాకుండా, మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే.. ఈ విషయాన్ని బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన ఏడు పనిదినాల్లో బ్యాంకులు ఆ సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే అవి రోజుకు రూ.100 జరిమానా భరించాలి. కానీ వాలెట్స్, యూపీఐ వంటి కొత్త పేమెంట్ చెల్లింపు మాధ్యమాలకు వచ్చేసరికి ఇలాంటి నిబంధనలు లేవు. లావాదేవీలకు, ఉద్యోగుల సంఖ్యకు పొంతన లేదు.. ‘‘పెద్ద నోట్ల రద్దు తరవాత లావాదేవీల పరిమాణం 10 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం 1.5–2 రెట్లే పెరిగింది. అందుకే ఫెయిలైన లావాదేవీల పరిష్కారానికి కొన్ని సంస్థలు ఎక్కువ రోజుల సమయం తీసుకోవచ్చు’ అని మొబిక్విక్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆకాశ్ గుప్తా చెప్పారు. వాలెట్ సంస్థలు వారి సిబ్బందిని వేగంగానే పెంచుకుంటున్నాయని తెలియజేశారు. ‘నవంబర్‌కు ముందు మొబిక్విక్లో 160 మంది ఉద్యోగులు ఉన్నారు. మార్చి చివరి నాటికి వీరి సంఖ్య 1,000కి చేరొచ్చు’ అని తెలిపారు. సోషల్ మీడియాను వాడేసుకోవచ్చు... లావాదేవీ ఫెయిలయ్యాక రెండు నుంచి ఏడు రోజుల్లోగా రిఫండ్ రాకపోతే.. వెంటనే వాలెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. మీకు వచ్చిన రెస్పాన్స్ సంతృప్తికరంగా లేకపోతే ఇంకా గట్టిగా ప్రయత్నించండి. ప్రతి వాలెట్ సంస్థ వాటి వెబ్సైట్లో సమస్య పరిష్కారపు నిబంధనలను పొందుపరిచే ఉంటుంది. అక్కడ సంబంధిత అధికారుల వివరాలు ఉంటాయి. వారిని సంప్రదించాలి. ‘‘చిట్టచివరిగా గ్రీవెన్స్ అధికారి వద్ద సమస్య కచ్చితంగా పరిష్కారమవ్వాలి. అక్కడా కాకపోతే మీరు ఆర్బీఐ గ్రీవెన్స్ సెల్‌ను సంప్రదించొచ్చు’ అని ఫ్రీచార్జ్ అధికార ప్రతినిధి చెప్పారు. సమస్యను బ్యాంక్ లేదా వాలెట్ సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తే త్వరగా పరిష్కారం కావచ్చని చిల్లర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చెప్పారు. ‘సంస్థలు వారి సోషల్ మీడియా ఇమేజ్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మీ సమస్య ఏడు రోజులు దాటినా కూడా తీరకపోతే.. అప్పుడు మీరు ఆయా సంస్థల సోషల్ మీడియా పేజ్‌లను వాడుకోండి’ అని సూచించారు. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ఆర్యూ సమస్యలు పీఏసీ చైర్మన్ దృష్టికి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్ కోరారు. వారి ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు గురువారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని కలిసి యూనివర్సిటీ సమస్యలను విన్నవించారు. ఆధారాలను కూడా అందజేశారు. వీసీ నరసింహులు అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాటించకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ కాంట్రాక్టులను భర్తీ చేశారని, బంధువులకు, తప్పుడు సర్టిఫికెట్లు, ఫేక్ పీహెచ్‌డీలు పెట్టిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని, సీఈ, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్లను నిబంధనలకు విరుద్ధంగా నియమించాలరని ఆరోపించారు. రిజిస్ట్రార్ అమర్నాథ్ ప్రొఫెసర్షిప్ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినా, సగం జీతం వచ్చినా ఆయన్నే రిజిస్ట్రార్‌గా కొనసాగించడం దారుణమన్నారు. తక్షణమే వీసీ నరసింహులును రీకాల్ చేయాలని, యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై సీబీ సీఐడీ దర్యాప్తు జరిపించాలని కోరారు. దీనిపై పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. అక్రమాలకు పాల్పడే వారిపై ఆధారాలతో సహా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్యూ జేఏసీ నేతలు శ్రీరాములు, రాఘవేంద్ర, సురేశ్, రమణ, లక్ష్మణ్, శంకర్, నాగరాజు, భరత్, రాజు, వెంకటేశ్, అశోక్, వైఎస్ఆర్సీపీ నేత దేవరాజు తదితరులు పాల్గొన్నారు. 10 కెఎన్ఎల్ 283: బుగ్గనతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు -
ఇపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వాడుకలో లేని పీఎఫ్ ఖాతాల నిధులకు సైతం వడ్డీ చెల్లించేందుకు యోచిస్తున్నామని ప్రకటించిన సంస్థ తాజాగా ఉద్యోగుల సంక్షేమం కోసం మరో కీలక అడుగు వేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఒక ప్రకటన చేశారు. దీని ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు చనిపోయిన వారం రోజుల్లోపు వారి క్లెయిములను పూర్తి చేసేందుకు, అలాగే ఒక కార్మికుడు ఉద్యోగం నుంచి వైదొలగే ముందే పీఎఫ్ సమస్యల్ని పరిష్కరించేలా కార్మిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అక్టోబర్ 26 న జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈమేరకు పూర్తి మార్గదర్శకాలను జారీ చేసినట్టు చెప్పారు. సత్వరమే చర్యలు తీసుకునేలా ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ 64 వ వ్యవస్థాపక ఉత్సవాలను జరుపుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దత్తాత్రేయ సంస్థ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. అలాగే సంస్థ చేపట్టిన సంస్కరణలపై ప్రశంసలు కురిపించిన మంత్రి అక్టోబర్ 25, 2016 న కామన్ సేవా కేంద్రాల (సీఎస్ సీ) ఇ-గవర్నెన్స్ తో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే ఈపీఎఫ్ చందాదారులకు కోసం ఒక గృహ పథకం ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్టు చెప్పారు. పీఎఫ్ ఖాతాకు ఆధార్ ను అనుసంధానం చేసిన 50 లక్షలమంది పెన్షనర్లను జీవన్ ప్రమాణ పత్రాలతో గౌరవించనున్నట్టు దత్తాత్రేయ ప్రకటించారు. -
జీవిత భాగస్వామికీ వస్తుందా?
హెపటైటిస్-బి ఉంటే.. జీవిత భాగస్వామికీ వస్తుందా? గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. గత ఐదేళ్ల క్రితం నేను చేయించిన రక్తపరీక్షలో హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ అని తేలింది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ వైరస్ వల్ల ఎలాంటి హాని లేదని తెలిపారు. త్వరలో నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకున్న ఈ సమస్య వల్ల నేను చేసుకోబోయే భార్యకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? పెళ్లి చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు తెలిపిన వివరాలను చూస్తే మీకు ‘హెపటైటిస్-బి’ వైరస్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. పరీక్షల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. కాబట్టి మీరు ప్రస్తుతం క్యారియర్ దశలో ఉన్నారు. అంటే ఈ దశలో ఉన్నవారికి వైరస్ శరీరంలో ఉంటుంది. కానీ ఎలాంటి హానీ తలపెట్టదు. అయితే మీ రక్తం, వీర్యం ద్వారా హెపటైటిస్-బి ఇతరులకు సోకే అవకాశం ఉంది. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా మీరు చేసుకోబోయే భాగస్వామికి ఈ విషయం చెప్పండి. ఆమెకూ ‘హెపటైటిస్-బి’ పరీక్షలు నిర్వహించండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ లేనట్లయితే ఆమెకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పించండి. మీరు క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకోసారి ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’ను చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏదైనా తేడా వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నా వయసు 65 ఏళ్లు. నాకు డయాబెటిస్, హైబీపీ ఉన్నాయి. ఒకసారి ఉన్నట్లుండి కడుపులో నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. అప్పుడు డాక్టర్‌గారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసి ‘కాలేయంలో కొవ్వు చేరింద’ని చెప్పారు. కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? - రవీందర్, నూజివీడు మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారు ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలోనూ లివర్‌లో కొవ్వు చేరడం సాధారణంగా జరుగుతుంది. కాలేయంలో కొవ్వు ఉన్నంత మాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ కాలేయం పనితీరులో తేడా కనిపిస్తే మాత్రం కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఒకసారి లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు డయాబెటిస్, బీపీ నియంత్రణలో ఉంచుకుంటూ, బరువును తగ్గించుకుంటే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోయే అవకాశం ఉంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ‘ఏసీ’తో సమస్య..? ఫ్స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 35. ఇటీవలే ఆఫీసు మారాను. ఇక్కడ చాలాసేపు ఎయిర్ కండిషన్ గదిలో ఉండాల్సి వస్తోంది. దాంతో నాకు తలనొప్పి వస్తోంది. పైగా తీవ్రమైన అలసటతో కూడా బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. - సుధీర్, హైదరాబాద్ మీరు చెప్పిట్లుగానే ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... తీవ్రమైన అలసట: చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం: సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం: కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం: నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు (గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ) ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. శ్వాస సమస్యలు: చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ డెంగ్యూ ఫీవర్ నివారణ, చికిత్స ఆయుర్వేద కౌన్సెలింగ్ ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆయుర్వేదంలో దీనికి నివారణ, చికిత్స వివరించండి. - కొడుకుల వెంకటరమణి, హైదరాబాద్ ఎవరికైనా జ్వరం వస్తే, దాని స్వరూప స్వభావాలు, జ్వరగ్రస్తునికి ఉన్న ఇతర లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేయాలి. ఆయుర్వేదంలో దోషప్రాబల్యాన్ని బట్టి, వాత, పిత్త, కఫ సన్నిపాతజ జ్వరాలు, దూష్యప్రాధాన్యతననుసరించి ధాతుగత జ్వరాలు, కారణాన్ని బట్టి క్రిమిజ జ్వరాలు, రకరకాలుగా వర్గీకరించారు. డెంగ్యూ వ్యాధికి పగటిపూట కుట్టే దోమలు కారణం. మనిషి ప్రకృతి, రోగనిరోధకశక్తిని బట్టి వ్యాధి తీవ్రత, లక్షణాలు ఆధారపడి ఉంటాయి. రోగబలం, రోగిబలం పరిగణనలోకి తీసుకొని చికిత్సను నిర్ణయించాలి. డెంగీ జ్వరంలో... ప్లేట్లెట్ల సంఖ్య దిగజారినప్పుడే ప్రమాదభరితమవుతుంది. నివారణ కారణాన్ని దృష్టిలో ఉంచుకొని, దోమలు చేరని వాతావరణాన్ని సృష్టించుకోవాలి. కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. పుష్టికరమైన, హానిరహితమైన ఆహార విహారాలు పాటించాలి. చికిత్స {పధానంగా లక్షణాలను బట్టి శమన చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి ఉపకరించే కొన్ని జ్వరహర ఔషధాలను ఈ కింద పొందుపరచడం జరిగింది. మృత్యుంజయరస (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (7 రోజులు వాడాలి) అమృతారిష్ట (ద్రావకం) 4 చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి మూడు పూటలా తాగాలి (జ్వరం తగ్గే వరకు వాడాలి) ఆమలకీ స్వరసం, కుమారీ స్వరసం రెండేసి చెంచాలు కలిపి, రోజూ మూడు పూటలా సేవించాలి గిలోయీ ఆమ్ల సిరప్, అలోయిస్ సిరప్ అనే పేర్లతో ఇవి షాపుల్లో లభిస్తాయి. ఈ స్వరసాలు నివారణకూ, చికిత్సకూ కూడా పనికొస్తాయి. దీనివల్ల నీరసం, జ్వరం తగ్గడమే కాకుండా, ప్లేట్లెట్ల సంఖ్య పడిపోకుండా ఉంటుంది. ఒకవేళ పడిపోతే, పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఆహారం బలకరమైన ద్రవాహారాన్ని తీసుకోవాలి. (బార్లీ, జావ, కొబ్బరినీళ్లు, ఉప్మారవ్వతో చేసిన జావ, పలుచని మజ్జిగ మొదలైనవి) ఆకలి బాగా ఉంటే స్వల్ప ప్రమాణంలో ఇడ్లీ తేనెతో తినవచ్చు జ్వరం తగ్గినప్పటికీ ‘ఒళ్లంతా నొప్పులు, నీరసం, అరుచి’ వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. అప్పుడు ‘యోగరాజగుగ్గులు’ మాత్రల్ని రోజుకి రెండు (ఉదయం 1, రాత్రి 1) సేవించాలి. పైన చెప్పిన రెండు రకాల ‘స్వరసాల’ మిశ్రమాన్ని ఒక నెలరోజులు వాడవచ్చు. దానివల్ల లివర్కీ, ధాతువులకు బలం, క్షమత్వం కలుగుతాయి. నోటికి రుచి కలగాలంటే ‘భావన అల్లం లేదా భావన జీలకర్ర’ (బజారులో లభిస్తాయి) నమిలి మింగితే, చాలా గుణం కనిపిస్తుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
సమస్యల్లో కేజీబీవీ టీచర్లు
సకాలంలో అందని వేతనాలు కనీస వసతులు కరువే డిమాండ్ల సాధనకు టీచర్ల పోరాటం 4న హైదరాబాద్‌లో మహాధర్నా నిజామాబాద్ అర్బన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం కొన్నేళ్లుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా, వారి మొర అలకించిన వారు, సమస్యలు తీర్చిన వారే లేరు. రాత్రింబవళ్లు విద్యాలయాల్లో పని చేస్తున్న టీచర్లకు సరైన సౌకర్యాలు కూడా కరువయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతనాల సమస్య వేధిస్తూనే ఉంది. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో కేజీబీవీ టీచర్లు యూనియన్‌గా ఏర్పడి డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ, 4వ తేదీన హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 36 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. పదవ తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులు కూడా ఇక్కడ ఉంటున్నారు. వీరికి కేజీబీవీ టీచర్లు మెరుగైన విద్య, వసతులు అందిస్తూ సక్రమంగా చూసుకుంటున్నారు. కేజీబీవీలు చాలా చోట్ల ఊరికి దూరంగా ఉండడం, ప్రధానంగా మహిళా టీచర్లు కావడంతో కేజీబీవీలో ఉండేందుకు, వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె ఇళ్లలో కొనసాగుతున్న కేజీబీవీల్లో సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న వీరికి రూ.14 వేల వేతనం ఇస్తున్నారు. అది కూడా మూడు నెలలకు ఒకసారి ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. – వివిధ శాఖలలో ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లే కేజీబీవీ టీచర్లను కూడా క్రమబద్ధీకరించాలి. – పదో పీఆర్సీ ఆధారంగా స్పెషల్ ఆఫీసర్ల వేతనం రూ.37 వేలు, ఉపాధ్యాయుల వేతనం రూ.28 వేలు, పీఈటీలకు రూ.22 వేలు, అకౌంటెంట్‌కు రూ.20 వేలు, ఏఎన్ఎంకు రూ.18 వేల మేర పెంచాలి. – ఆకస్మిక సెలవులు 20, ప్రత్యేక ఆసస్మిక సెలవులు 7 మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. – వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలి. – హెల్త్‌కార్డుల మంజూరీతో పాటు వేసవి సెలవుల్లోనూ వేతనం ఇవ్వాలి. -
వేటు..మారేట్టు..!
భద్రాచలం: సీతమ్మ, లక్షణ స్వామి నగలు మాయం..భక్తుల కానుకల జమా పుస్తకం అదృశ్యం..ఇష్టమొచ్చినట్లు కొందరి వ్యవహారం..ఇలా వరుస ఘటనలతో భద్రాద్రి శ్ర శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టేందుకు ఈఓ రమేష్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్‌తో సహా ఉద్యోగులందరినీ ప్రస్తుతం ఉన్న చోట నుంచి మరో విభాగానికి బదిలీ లేదంటే సర్దుబాటు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అర్చకులు కూడా ఇక నుంచి రొటేష¯ŒS పద్ధతిలో విధులు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 45 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్థానభ్రంశం కల్పించిన ఈఓ తాజాగా రెగ్యులర్ ఉద్యోగులపై కొరడా ఝుళిపించారు. పనితీరు ఆధారంగా కొత్తగా విధులు, బాధ్యతలు కేటాయించారు. రామచంద్రమోహన్, చంద్రశేఖర్ ఆజాద్ ఈఓలుగా పనిచేసిన కాలంలో పాలనపై వారికి కొంతమేర పట్టు ఉండేది. వారి తర్వాత ప్రస్తుత ఈఓ రమేష్‌బాబు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న రమేష్‌బాబు, ఇక్కడ తన విచక్షణాధికారాలను ఉపయోగించి, ఉద్యోగులు, అర్చకులకు స్థానభ్రంశం కల్పించేందుకు నిర్ణయించారు. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆలయ ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లగా, ఆ మరకలు తొలగించే దిశగా భవిష్యత్‌లోనూ చర్యలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. -
సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంనారాయణ ఖమ్మం మామిళ్లగూడెం : జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం విరమించేదిలేదని టీయూడబ్ల్యూజేæ(ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టెకోల రాంనారాయణ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రెండేళ్లలో అనేకమంది కొత్త జర్నలిస్టులు వచ్చారని, అక్రిడిటేషన్ కార్డులు లేక వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లాలో మెరుగైన వైద్యం అందక 18మంది జర్నలిస్టులు మరణించారని గుర్తుచేశారు. హెల్త్‌కార్డుల ద్వారా అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పోరాటం చేసి ఇళ్ల స్థలాల కేటాయింపు జీఓ సాధిస్తే, తెలంగాణ ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసిందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు ప్రసేన్ మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ధర్నాకు వివిధ రాజకీయ పక్షాలు, జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలిపాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఐతగాని జనార్దన్, ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్సు అసోసియేషన్, వివిధ ప్రజాసంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. ధర్నా చౌక్ నుంచి జెడ్పీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరావు, నాయకులు సామినేని మురారి, తాళ్లూరి మురళీకృష్ణ, వింజం వెంకటనర్సయ్య, వనం వెంకటేశ్వర్లు, మాధవరావు, బట్టు శ్రీనివాస్, కల్లొజి శ్రీనివాసరావు, బీవీ రమణరెడ్డి, రాజు, సుధాకర్, నాగేశ్వరావు, రాంబాబు, సత్యనారాయణచారి, రవి తదితరులు పాల్గొన్నారు. -
దానితోనే యువతుల్లో సంతానలేమి..
సాక్షి, సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహరపు అలవాట్లు, ఆలస్యపు వివాహాల వల్ల మహిళల సంతాన సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నోవా ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ సరోజ కొప్పాల చెప్పారు. మద్యం, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల అండాశయ నిల్వలు పడిపోవడంతో పాటు, ఎగ్స్కౌంట్ తగ్గడానికి కారణం అవుతున్నట్లు తెలిపారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జీవనశైలిలో మార్పు వల్ల రజస్వల మొదలు గర్భం ధరించడం, నెలసరి రుతుక్రమం వరకు ఇలా అన్ని సమస్యాత్మకంగా మారుతున్నాయన్నారు. తల్లి కావాలని ఆశపడే వారికి ఇదో పెద్దశాపంగా మారిందన్నారు. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి తమ వద్ద చక్కని పరిష్కార మార్గం ఉందని చెప్పారు. జీవకణ దానం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారు. -
ఉరవకొండ సమస్యలపై నేడు నిరవధిక మహాధర్నా
∙తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి∙రోడ్డు పైనే వంటా వార్పు ఉరవకొండ: ఉరవకొండ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సవుస్యల పరి ష్కారం కోసం స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఉద్యమానికి సిద్ధమయ్యారు. శుక్రవారం వేలాది వుం ది ప్రజలతో కలిసి ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై నిరవధిక వుహాధర్నా చేపడుతున్నారు. ఈయన ఈ నెల ఎనిమిది నుంచి ‘గడప గడపకు వైఎస్ఆర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఉరవకొండలో పలు ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై పోరుబాట కుసిద్ధమయ్యారు. మహాధర్నాలో ప్రజలుపెద్దసంఖ్య లో పాల్గొని.. ప్రభుత్వం కళ్లు తెరి పించే లా చేద్దావుని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రధాన డివూండ్లు ఇవే.. పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం 2008 సంవత్సరంలో 83 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అయితే ఇప్పటికీ అర్హులకు స్థలాలు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో అర్హులైన అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించాలి.∙చేనేత అప్పులు రద్దు చేయాలి. కార్మికులకు సబ్సిడీతో రేషం అందించాలి.∙పట్టణ ప్రజలకు పరిశుభ్రమైనlనీటిని సరఫరా చేయాలి. కొత్త ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించడంతో పాటు పాత పైప్‌లైన్‌ను వూర్చాలి.∙గతంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు తొలగించారు. దీనివల్ల బహిర్భూమికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ వ్యక్తిగత వురుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలి. ∙అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలి.∙ఉరవకొండలో అభివృద్ధి పనులకు తక్షణమే రూ.50 కోట్లు విడుదల చేయాలి.∙బాలికల జూనియర్ కాలేజీకి పక్కా భవనాలు నిర్మించాలి.∙వంద పడకల ఆస్పత్రి పనులు ప్రారంభించాలి. -
సమస్యల పరిష్కారంలో విఫలం
ఉట్నూర్ : విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడావి రమేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని డీటీఏఫ్ భవన్లో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు చెల్లింపులు లేవని అన్నారు. పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి వెంటనే పదోన్నతులు కల్పించాలని, ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీటీఏఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడుగు సామ్యుల్, కౌన్సిలర్ బోజ్జు, జిల్లా ప్రధాన కార్యదర్శి వక్షోధర్, ఉపాధ్యక్షులు రవిత, దిలీప్, కార్యదర్శులు ప్రకాశ్, శ్రీదర్‌బాబు, కౌన్సిలర్ గజానంద్, అడిట్ కమిటీ కన్వీనర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మళ్ళీ చైనాకు వర్షాల ముప్పు!
బీజింగ్ః చైనాను వర్షాల ముప్పు వదలడం లేదు. మళ్ళీ వానలు ముంచెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం బ్లూ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం తీవ్రమైన గాలి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ.. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఎడ తెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దక్షిణ చైనా ప్రాంతం అతలాకుతలమౌతోంది. కాస్త తెరపి ఇచ్చిందనుకునే లోపే మళ్ళీ వర్షాలు మొదలవ్వడంతో ప్రభుత్వం బ్లూ అలర్ట్ ప్రకటించింది. దక్షిణ చైనాల్లో గాలి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు. గుయ్జౌ గువాంగ్జి, హునాన్, జియాంగ్జి, జెజియాంగ్, పుజియాన్, హెబీ, హెనాన్, యున్నాన్ ప్రాంతాల్లో.. రాగల 24 గంటల్లో తుపాను సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం థాటికి మట్టి కరిగిపోవడం, కొండచరియలు విరిగి పడటం, వరద నీరు ఊళ్ళను ముంచెత్తడం వంటి అనేక ప్రమాదాలతోపాటు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్ళనుంచీ బయటకు రావద్దని సూచించిన అధికారులు, ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. చైనాలో ఎరుపు, నారింజ, పసుపు, నీలం వంటి నాలుగు రంగులతో వాతావరణ హెచ్చరికల వ్యవస్థ అమల్లో ఉంది. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో రెడ్ (ఎరుపు) అలర్ట్ ఇస్తారు. ఆ తర్వాత స్థాయిని బట్టి ఆరెంజ్, ఎల్లో, బ్లూ వంటి హెచ్చరికలు జారీ చేస్తారు. బుధవారం నాటికి కురిసిన కుండపోత వర్షాలకు చైనాలో ఇప్పటికే 237 మంది చనిపోగా, 93 మంది వరకూ కనిపించకుండా పోయారు. వర్షాలు, వరదలకు వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. -
మెరుగైన చర్మకాంతికి...
బ్యూటిప్స్ వర్షాకాలంలో కొందరికి చర్మం పొడిగా అయిపోవడం, డల్‌గా అవ్వడం, నల్లబడటం, బిరుసుగా అయిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయట పడటానికే ఈ చిట్కాలు... ఓ బౌల్లో రెండు చెంచాల ముల్తానీ మట్టి, 1 చెంచా గంధపు పొడి, 2 చెంచాల లవంగ నూనె, కాసింత నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని నలుగు పిండి మాదిరిగా కాళ్లు, చేతులు, మెడకు రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వానాకాలం అయ్యేవరకూ వారంలో నాలుగైదు సార్లు ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి స్నానం చేస్తే... చర్మం మృదువుగా ఉండటంతో పాటు వానాకాలం వచ్చే చర్మవ్యాధులు కూడా దరిచేరవు. సువాసన కావాలనుకునేవారు కాస్త రోజ్‌వాటర్ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో కొంచెం బియ్యప్పిండి, నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనితో ఒళ్లు తోముకుని, ఆపైన వేణ్నీళ్లతో స్నానం చేస్తే చర్మం కాంతులీనుతుంది. -
ఆకుల అలలు..
బ్యూటిప్స్ తాజా ఆకుకూరలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం మెరగవుతుంది. అలాగే శిరోజాల నిగనిగలు పెరగాలంటే ఆకులతో చెలిమి చేయాలి.రెండు కప్పుల నీళ్లను మరిగించి అందులో 5-6 తాజా /ఎండు తేయాకులను వేసి, మూత పెట్టాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని తల వెంట్రుకలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూ వాడకుండా కేవలం చల్లని నీటితో తలను శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారైనా ఇలా చేయడం వల్ల కేశాలు పొడిబారవు. చిట్లడం వంటి సమస్యలు కూడా రావు. గుప్పుడు తులసి ఆకులను తీసుకొని మెత్తగా రుబ్బి, రసం తీయాలి. ఈ రసాన్ని మాడుకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి. చుండ్రు, ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.కలబంద ఆకును మధ్యకు విరిచి, దాని నుంచి వచ్చిన జెల్‌ను తలకు రాయాలి. తలస్నానం చేసిన తర్వాత కలబంద జెల్ ప్యాక్ వేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల వెంట్రుకలకు కండిషనర్ లభించి, మృదువుగా మారుతాయి. వేప ఆకులను శుభ్రం చేసి, ముద్దగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చుండ్రు, పేల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. -
రక్తం కల్తీ వ్యవహారంలో ఆసుపత్రికి నోటీసులు
హైదరాబాద్: కోఠిలోని ప్రసూతి వైద్యశాల అధికారులకు సుల్తాన్‌బజార్ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. రక్త కేంద్రంలో చోటు చేసుకున్న కల్తీ వ్యవహరంపై వివరాలు అందించాలని కోరారు. ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు రక్తాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. -
దద్దరిల్లి తెలంగాణ అసెంబ్లీ
హైదారాబాద్: కరువు సమస్యపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. కరువు మండలాల అంశం పై ఆదివారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చజరిగింది. కరువుమండలాల ప్రకటనలో నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పార్టీని నిలదీసింది. మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. సభ్యుల ఆందోళనతో స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు. -
సంప్రదాయ కళల్లో సమస్యల 'ప్రదర్శన'
నాగాలాండ్ సంప్రదాయ కళలు అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమయ్యాయి. స్థానిక సమస్యల కథాంశాలుగా మారాయి. నాగాలాండ్ మహిళల రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఉండే నూలు వడకడం, నేత, నృత్యం, అల్లికలు, కాన్వాస్, పెయింటింగ్స్, ఫోక్ డ్యాన్స్ వంటి సంప్రదాయ కళలను కాన్వాస్‌లు, షాల్స్ రూపంలో రూపొందించిన ఓ కళాకారిణి ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంలో 'హీలింగ్' పేరున ప్రదర్శన ఏర్పాటుచేసింది. సమస్యలు ప్రధానాంశంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శన చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగాలాండ్‌కు చెందిన విద్యావంతురాలు, కళాకారిణి ఐరిస్ ఓడ్యూ తన కళకు అక్కడి సమస్యలను జోడించింది. గృహహింస, లైంగిక వేధింపుల వంటి సమస్యల పరిష్కారంతో పాటు... వారి గౌరవానికి వన్నె తెచ్చేలా శాలువాలు, పెయింటింగ్స్ గా అనేక కళాత్మక డిజైన్లను రూపొందించి ప్రదర్శన ఏర్పాటు చేసింది. నాగాలాండ్ లోని వివిధ సామాజిక వర్గాల ద్వారా తయారైన 9 ఎక్రిలిక్ పెయింటింగ్స్, ఉలెన్ సంప్రదాయ శాలువాలను ఓడ్యూ 12వ ఆసియా ఉమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించారు. మహిళలే కాదు.. బాధిత పురుషులు, బాలల సమస్యలను కూడ తన కళల్లో పొందుపరిచారు. ప్రపంచయుద్ధ సమయంలో జర్మన్ సైనిక యూనిఫారాల కోసం మొదటిసారి ఫ్యాబ్రిక్స్ వాడకం మొదలు పెట్టారని, నాగాలాండ్ బర్మా సరిహద్దు ప్రాంతంలో నేటికీ అదే సంప్రదాయం కొనసాగుతోందని, అత్యధిక సమయం పట్టడంతో పాటు, కఠినంగా కూడా ఉండే నేత కళను గ్రామాల్లోని మహిళలు అందమైన శాలువాలుగా వారి కోసం నేస్తూనే ఉన్నారని ఓడ్యూ చెబుతున్నారు. తన కాన్వాస్ కోసం శాలువాలను నేసే విధానం చూస్తే అక్కడి మహిళల కష్టం ప్రత్యక్షంగా తెలిసిందంటున్నారు. ఈ ప్రదర్శనలు గ్రామీణ మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించగలవని, సమస్యల పరిష్కారానికి సహకరిస్తాయని ఓడ్యూ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే ఆలోచనతోనే హీలింగ్ పేరున తాను ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఓడ్యూ వెల్లడించారు. -
'చిదంబరం కొత్త పల్లవి హాస్యాస్పదం'
చెన్నై: మైనారిటీల భద్రత, అఫ్జల్ గురు వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఆదివారం చెన్నైలో వెంకయ్య నాయుడు విలేకరులతో మాట్లాడారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష ఫైల్‌ను హోం మంత్రిగా ఉన్న సమయంలో పట్టించుకోని చిదంబరం, ఇప్పుడు కొత్త పల్లవి అందుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇంతకీ అఫ్జల్ తీవ్రవాదా..? కాదా..? అన్న విషయం కాంగ్రెస్‌తో పాటుగా చిదంబరం స్పష్టం చేయాలని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ బలం పెరుగుతున్నదని, దీంతో కాంగ్రెస్‌లో గుబులు పట్టుకుని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలను రాజకీయ వ్యవహారంలోకి తీసుకొచ్చి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పదిమంది విద్యార్థులు గతంలో మరణిస్తే, పట్టించుకోని వాళ్లు, ఇప్పుడు ఓ విద్యార్థి విషయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని వెంకయ్య నాయుడు విమర్శించారు. కొన్ని పత్రికలు సైతం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని, ఏదేని కీలక విషయం ఉంటే దానిని పక్కన పెట్టి, అనవసరపు రాద్ధాంతాల్ని హెడ్లైన్లలో చూపిస్తున్నారని మండి పడ్డారు. జేఎన్‌యూలో జరిగిన వ్యవహారాన్ని హైలెట్ చేసిన మీడియా, అక్కడి చర్యలకు వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనను పట్టించుకోక పోవడం బట్టి చూస్తే.. ఏ మేరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. విపక్షాల నిరసనలపై స్పందించాల్సిన అవసరం ప్రధాని మోదీకి లేదన్నారు. -
సీనియర్ల చేత ప్రచారం.. పార్టీలో భిన్న వాదనలు
-
'జవాన్లూ.. సోషల్ మీడియాతో జాగ్రత్త'
చండీగఢ్: ఆర్మీ జవాన్లు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని.. ఫేస్బుక్, ఇతర వెబ్సైట్లలో పోర్న్ వీడియోలు, చిత్రాలు చూడొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల రంజిత్ సింగ్ అనే వ్యక్తిని ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ యువతి హనీట్రాప్ చేసి.. భద్రతా సమాచారాన్ని రాబట్టిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో జవాన్లు చేయకూడని పది పనులను పేర్కొంటూ ఆర్మీ అధికారులు ఓ జాబితాను విడుదల చేశారు. దీనిలో.. ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోర్న్ చిత్రాలు చూడరాదు. యూనిఫామ్ ధరించిన ఫొటోను వాట్సప్, ఫేస్బుక్ వంటి వాటిల్లో ప్రొఫైల్ ఫొటోగా పెట్టరాదు. లాటరీలు, ప్రైజులు తగిలాయంటూ వచ్చిన మెసేజ్‌లను ఓపెన్ చేయరాదు. వ్యక్తిగత సమాచారం, హోదా లాంటి విషయాలను సోషల్ మీడియాలో ఉంచొద్దు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులను అనుమతించొద్దు. జవాన్ల కుటుంబ సభ్యులు సైతం వృత్తిని తెలిపే వివరాలను పోస్ట్ చేయరాదు. వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో మిలటరీకి సంబంధించిన సమాచారం ఉంచొద్దు. ఇలాంటి సూచనలు ఉన్నాయి. -
అమ్మ మెడకు మరో కేసు
-
రైల్వేస్టేషన్‌కు రాజధాని హంగులెప్పుడో!
రైల్వే కొత్త జీఎం రవీంద్రగుప్తా వీటిపై దృష్టి పెట్టేనా! విజయవాడ : విజయవాడ రైల్వే డివిజన్‌కు తొలిసారిగా వస్తున్న జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాజధానిగా విజయవాడ మారడానికితోడు వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనుండటంతో ఈ ప్రాంతంపై రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొత్త జీఎం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంత అవసరాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో పాటు విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు కొత్త రైళ్లు, రైల్వేస్టేషన్లో అత్యాధునిక సౌకర్యాల కల్పన, శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు అంశాలను ప్రజాప్రతినిధులు జీఎం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. కొత్తరైళ్లు అవసరం నగరం నుంచి బెంగళూరు, అహ్మదాబాద్, షిర్డి, ముంబై, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు నూతన రైళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. బెంగళూరు, షిర్డి, తిరుపతి, హైదరాబాద్‌లకు వెళ్లే రైళ్లలో బెర్త్‌లన్నీ వచ్చే సంక్రాంతికి ఇప్పుడే నిండిపోయాయంటే డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తెల్లవారుజామున చేరే విధంగా కొత్త రైళ్లు వేయాలి. విజయవాడ, మచిలీపట్నం నుంచి రైళ్లు ప్రారంభమైతే ఈ ప్రాంత వాసులకు ఉపయుక్తం. నత్తనడకన కొత్త రైల్వేలైన్లు మచిలీపట్నం-భీమవరం-నర్సాపురం డబ్లింగ్ పనులు ప్రారంభమై ఐదేళ్లయినా నత్తనడకనే సాగుతున్నాయి. వచ్చే పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తి చేసేలా జీఎం దృష్టిపెట్టాలి. కోటిపల్లి-నర్సాపురం లైను 13 ఏళ్ల కిందట మంజూరైనా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రాజధాని స్టేషన్లపై దృష్టిపెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కోరితే కృష్ణా కెనాల్, మంగళగిరి రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసి కొత్త రాజధానికి రాకపోకలు సులభతరం చేస్తామని గతంలో జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టిపెడితే బాగుంటుంది. భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడికి తరలి వస్తే రాకపోకలు పెరుగుతాయి. పుష్కరాల నాటికి ఆర్.ఆర్. ఐ వచ్చే పుష్కరాల నాటికి 8, 9, 10 ఫ్లాట్‌ఫారాల లైన్‌ను విశాఖపట్నం, హైదరాబాద్ రూట్లకు అనుసంధానం చేస్తూ రైల్వే రూట్ ఇంటర్ లాకింగ్ సిస్టిమ్‌ను ఏర్పాటు చేయాలి. రూ.150 కోట్లతో జరుగుతున్న ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్లాట్‌పారాలపై పలుచోట్ల షెల్టర్స్ లేవు. స్టేషన్లో సౌకర్యాలపై ఇన్చార్జి జీఎం ప్రదీప్ కుమార్ సక్సేనా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. శాటిలైట్ స్టేషన్లపై దృష్టిపెట్టాలి గుణదల రైల్వేస్టేషన్‌ను శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తే విజయవాడ రైల్వేస్టేషన్‌పై వత్తిడి తగ్గుతుంది. అయితే ఇది కార్యరూపం దాల్చడం లేదు. గుణదల రైల్వేస్టేషన్‌ను రూ.3 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రైల్వే అధికారులు సిద్దంగా వున్నారు. రాయనపాడు, ఇబ్రహీంపట్నం స్టేషన్లను కూడా శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. -
ఫాస్ట్ ట్రాక్ విధానంలో మూడుగంటల్లోనే నడవగలరు!
హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన వెన్ను నొప్పి వస్తోంది. దీనికి హోమియోలో తగిన చికిత్స సూచించండి. - సుందర్, మెదక్ ఇటీవల వెన్ను సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ తరహా నొప్పి వస్తోంది. మీరు వెన్నునొప్పి అని రాశారు. కానీ అది ఏ భాగంలోనో రాయలేదు. మన వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. అందులో 7 మెడ భాగంలో, 12 వీపు భాగంలో, 5 నడుము భాగంలో మిగతావి అంతకంటే కిందన ఉంటాయి. ఎముకకూ, ఎముకకూ మధ్యన డిస్క్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. ఇది మన కదలికల సమయంలోగానీ, ఏదైనా పనిచేసేటప్పుడు ఎముకల మధ్య రాపిడిని నివారిస్తుంది. ఈ డిస్క్ మధ్యన మెదడు నుంచి వచ్చే నాడులు ఉంటాయి. ఉదాహరణకు నడుము దగ్గర ప్రారంభమై తొడల ద్వారా కాళ్ల వరకూ వెళ్లే అతి పెద్ద నరాన్ని ‘సయాటిక్ నర్వ్’ అంటారు. నడుము వద్ద ఉండే ఎల్4-ఎల్5 మధ్య సయాటిక్ నరం ఆరంభం అవుతుంది. ఈ నరం మీద ఒత్తిడి పెరిగి నొప్పికి దారితీయడాన్ని సయాటిక్ ఈ నరం ఒత్తిడికి గురవ్వడం వల్ల వచ్చే నొప్పిని సయాటికా అంటారు. ఇక మెడ భాగంలోని వెన్నుపూసల అరుగుదలతో పాటు మరికొన్ని కారణాల వల్ల వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడ భాగంలోని రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ పక్కకు జరగడం, మెడకు తీవ్రమైన గాయం కావడం వంటి కారణాలతో ఈ సమస్య కావచ్చు. గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలోనూ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాళ్లలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బాధితుల్లో మెడ భాగంలో తీవ్రమైన నొప్పి, చేయి లేదా భుజాలకు నొప్పి పాకడం, చేతి వేళ్ల తిమిర్లు లేదా ఆ భాగాలు మొద్దుబారడం లక్షణాలు ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇక కొందరిలో నడము వద్ద ఉండే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరిగిపోవడం వల్ల కూడా అక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి పడి లంబార్ స్పాండిలైటిస్ అనే సమస్య రావచ్చు. ముఖ్యంగా ఎల్3, ఎల్4, ఎల్4 వంటి వెన్నుపూసలలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. హోమియో చికిత్స: వెన్నుకు సంబంధించిన ఏ నొప్పులకైనా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్. కామొమిల్లా మాగ్‌ఫాస్ వంటి మందులను రోగి తత్వాన్ని, మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. నిపుణులైన హోమియో డాక్టర్లు సూచించిన కాలపరిమితి మేరకు వాటిని వాడితే, ఆపరేషన్ అవసరం లేకుండానే శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. హోమియో మందులతో పాటు మంచి పౌష్టికాహారం, ఫిజియోథెరపీ వల్ల కూడా వెన్ను సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 62 ఏళ్లు. విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాను. వైద్యులను సంప్రదిస్తే మొదట మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గకపోయేసరికి మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొమ్మని సూచిస్తున్నారు. ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్నా నెలల తరబడి మంచానికే పరిమితమైతే నాకు సేవలు చేసేవారు ఎవరూ లేరు. నా సమస్యకు ఆపరేషన్ ఒక్కటే మార్గమా? ఇతర ప్రత్యామ్నాయం చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సత్యనారాయణ, కరీంనగర్ మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స గురించి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అన్న విషయం మీరు తెలపలేదు. ప్రస్తుతం మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ మీకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు లేకుండా ఉంటే ఫాస్ట్‌ట్రాక్ విధానంలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడానికి వీలవుతుంది. ఈ విధానంలో సర్జరీ చేస్తే ఆపరేషన్ జరిగిన మూడు గంటల్లోనే మీరు నడవగలుగుతారు. సాధ్యమైనంతవరకు సర్జరీ జరిగిన 24 గంటల్లోపే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. మీరు నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సిన అవసరం ఉండదు. దాంతో మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సర్జరీ జరిగిన నాలుగురోజుల్లో మీరు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడపగలుగుతారు. సర్జరీ తర్వాత మీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఈ విధానంలో ఆపరేషన్ ముందు నుంచే నొప్పి నివారణ ప్రక్రియలు ప్రారంభిస్తారు. మీకు ఎలాంటి బాధ లేకుండా సర్జరీ చేస్తారు. ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆపరేషన్ చేయడానికి వైద్యులు నిర్ధారణ చేస్తే, ఈ సర్జరీకి ముందు, తర్వాత చేయాల్సిన వ్యాయామాలు, ఫిజియోథెరపీ గురించి వైద్యులు క్షుణ్ణంగా తెలియజేస్తారు. మీ సందేహాలూ, అపోహలూ పూర్తిగా నివృత్తి అయిన తర్వాతనే సర్జరీకి సిద్ధం చేస్తారు. కాబట్టి మీరు అనవసరమైన భయాందోళనలూ, అపోహలను పక్కనబెట్టి వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధమవండి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాకు 8 నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో రక్తపరీక్షల్లో హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అని చెప్పినారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే మళ్లీ హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అన్నారు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా లేదా సరైన సలహా ఇవ్వగలరు. - లక్ష్మయ్య, వరంగల్ మీకు 6 నెలల తర్వాత కూడా హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అన్నారు కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్ ‘బి’ అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్త పరీక్షలు చేసుకొని వ్యాధి ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవాలి. వ్యాధి చాలామందిలో సుప్తావస్థలో ఇన్‌యాక్టివ్ దశలో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి యాక్టివేట్ స్టేజ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నవారికి ఏ మందులు అవసరం లేదు. వీరు చేయవలసిందల్లా ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి గాస్ట్రో ఎంటరాలజిస్టుని సంప్రదించి ఎల్.ఎఫ్.టి. పరీక్షలు చేసుకొని మీ వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లోకి ఏమైనా వెళ్లిందా అనేది చూసుకోవాలి. యాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్తే దానికి వివిధ రకాలైన మందులు లభ్యమవుతాయి. అందులో మీరు ఏ డ్రగ్ వాడాలో మీ దగ్గరలోని డాక్టర్ని సంప్రదించి వాడడం అవసరం. నా వయసు 55. మలద్వారం ద్వారా రక్తం పడుతోంది. డాక్టర్ని సంప్రదిస్తే పైల్స్ అని చెప్పి ఆపరేషన్ చేశారు. కాని రక్తం పడడం ఆగలేదు. దయచేసి నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు. - రామారావు, వైజాగ్ మలద్వారం ద్వారా రక్తం రావడానికి పైల్స్ ఒక కారణం కావచ్చు, కాని రక్తం రావడానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అందులో ముఖ్యంగా పెద్ద పేగు కాన్సర్. మీరు ఒకసారి కొలనోస్కోపి / సిగ్మాయిడోస్కోపి అనే పరీక్ష చేయించుకోవడం మంచిది. ఆ పరీక్షలో మీకు రక్తం ఎక్కడ నుండి వస్తుందో తెలుస్తుంది. కారణం తెలిస్తే సరైన వైద్యం చేయించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వాళ్ల పెద్దప్రేగు కాన్సర్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఈ కాన్సర్‌ని తొలి దశలో కనుగొంటే క్యూర్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు అశ్రద్ధ చేయకుండా దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. -
స్లీప్ కౌన్సెలింగ్
స్లీప్ పెరాలసిస్ అంటే..? నా వయసు 50. నా సమస్య ఏమిటంటే... నేను నిద్రలేచాక చాలాసేపటి వరకు నా శరీరం, చేతులు, కాళ్లు ఇవేవీ కదలడం లేదు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి ఉంచగలను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోంది. కానీ నా అవయవాలేవీ నా స్వాధీనంలో ఉండటం లేదు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు కొనసాగుతోంది. దీంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కె. రామస్వామి, మిర్యాలగూడ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీరు స్లీప్ పెరాలసిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారు నిద్రలో లేదా నిద్రలేచాక తాత్కాలికంగా కాసేపు కదలడం, మాట్లాడటం, చదవడం... ఇలాంటి పనులేవీ చేయలేరు. పూర్తిగా నిద్రనుంచి పూర్తిగా మెలకువ స్థితికి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హేలూసినేషన్స్కు) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం స్పందించాలనుకున్నా ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఈ స్లీప్ పెరాలసిస్ అన్నది రెండు సమయాల్లో కలుగుతుంది. మొదటిది... నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు; రెండోది నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు. స్లీప్ పెరాలసిస్ అన్నది చాలా అరుదైన రుగ్మత కాదు. ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. పిల్లలు తమ కౌమారస్థితిలో (అడాలసెన్స్లో) ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. స్లీప్ పెరాలసిస్ అన్నది సాధారణంగా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇది వచ్చేందుకు దోహదపడే మరికొన్ని అంశాలివి... నిద్రలేమి మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధులు ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం నిద్ర సంబంధమైన ఇతర సమస్యలు ఉండటం కొన్ని మందులు వాడటం (ముఖ్యంగా ఏడీహెచ్‌డీకి వాడేవి) తీవ్ర అవమానానికి గురికావడం చికిత్స: స్లీప్ పెరాలసిస్ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్ పెరాలసిస్‌కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా ఒకపట్టాన నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 - 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏవైనా మానసిక సమస్యలు ఉంటే వాటికి చికిత్స చేయడం ద్వారా కూడా దీనికి చికిత్స చేయవచ్చు. డాక్టర్ వి.వి. రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ - కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఉపాధ్యాయుల పోరుబాట
వచ్చేనెల 9న మహాధర్నా చేపట్టనున్న పీఆర్టీయూ సీఎస్ రాజీవ్శర్మకునోటీసు అందజేత ఉమ్మడి సర్వీసురూల్స్ అవుల్లోకి తేవాలి వెంటనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి పాఠశాలల మూసివేత యోచనను విరమించుకోవాలి పీఆర్సీ బకారుులను మొత్తం జీపీఎఫ్ ఖాతాల్లో జవు చేయూల్సిందే పనిచేయుని హెల్త్‌కార్డులు ఎవరికోసమని ప్రశ్న హైదరాబాద్: తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు పోరుబాట పట్టనున్నారు. ఇందుకోసం మహాధర్నా చేపట్టనున్నారు. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఇబ్బందులు, పీఆర్సీ బకాయిలు, హెల్త్‌కార్డులపై ఆందోళనకు సిద్ధమైన ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ-టీఎస్ వచ్చే నెల 9న మహాధర్నాకు పిలుపునిచ్చింది. తమ సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి తదితరులు సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలసి ధర్నా నోటీసు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 9న హైదరాబాద్‌లో 20 వేల మంది ఉపాధ్యాయులతో మహాధర్నా చేపడతామని చెప్పారు. ఆలోగా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల డిమాండ్లు.. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ లేక పర్యవేక్షణాధికారుల నియామకాలు ఆగిపోయి పాఠశాలల్లో మిగతా 2వ పేజీలో ఠ పర్యవేక్షణ కొరవడి, విద్యా బోధన దెబ్బతింటోంది. వెంటనే ఖాళీగా ఉన్న డిప్యూటీఈవో, డైట్ లెక్చరర్, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలి. హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలల మూసివేత యోచనను ఉపసంహరించాలి. - ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాలి. - పదో పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లోనే జమచేయాలి. బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చి బాండ్లు అంటున్నారు. అందుకు ఒప్పుకొనేది లేదు. - సీనియర్ టీచర్లకు 9వ పీఆర్సీలో నష్టం జరిగినందున ఇప్పుడు వెయిటేజీ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. - ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదు. వాటితో ప్రయోజనం లేకుండాపోయింది. - రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. - ఉన్నత పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలి. - పంచాయతీరాజ్, ఎయిడెడ్ పాఠశాలల్లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు అర్ధ వేతన సెలవులను (హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) నగదుగా మార్చుకునే వెంటనే పునరుద్ధరించాలి. - డీఎస్సీ-2003లో ఎంపికై 2005లో నియమితులైన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. - విద్యార్థుల ప్రవేశ వయసును 5 నుంచి 3 ఏళ్లకు తగ్గించి... శిశు తరగతులను, ఇంగ్లిషు మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. - పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. -
నిద్ర వస్తున్నట్లు అనిపిస్తోందా..?
మూడు ముచ్చట్లు పెద్దగా పని చేయకపోయినా అలసటగా అనిపిస్తోందా..? రాత్రి తగినంత సేపు నిద్రపోయినా పగటిపూట మగత మగతగా నిద్ర ముంచుకొస్తోందా..? పని మధ్యలో ఆపేసి కాసేపు కునుకుతీసి లేచినా, పరిస్థితి బాగుండటం లేదా..? అయితే, ఓసారి మీ బరువును పరీక్షించుకోండి. స్థూలకాయానికి తోడు డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇలాంటి సమస్యలు మామూలేనంటున్నారు నిపుణులు. హైపర్ సోమ్నియా.. అంటే, అతినిద్రతో బాధపడుతున్న వారు ప్రపంచ జనాభాలో దాదాపు ముప్పయి శాతం వరకు ఉంటారని ఒక అంచనా. హైపర్ సోమ్నియా కారణంగా పనితీరు మందగించడమే కాదు, తరచు యాక్సిడెంట్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నిపుణులు హెచ్చరిస్తు న్నారు. దీని నుంచి బయట పడేందుకు బరువు తగ్గడమే ఉత్తమమార్గమని వారు సూచిస్తున్నారు. -
ప్రయాణం పడటం లేదా?
ట్రావెల్ కొందరికి ప్రయాణాలంటే భయం ఉంటుంది. ప్రయాణాల్లో తల తిరగడం, కడుపులో తిప్పి వాంతి అవడం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి సమస్యలే అందుక్కారణం. రెండు నుంచి 12 ఏళ్ల పిల్లలు, గర్భవతులు, మైగ్రేయిన్ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య అధికం. ఎక్కువ మోతాదులో ఆహారం, పానీయాలు తీసుకోకూడదు. మసాలాలు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం ప్రయాణానికి ముందు తీసుకోకూడదు. కారులో కూర్చునేటప్పుడు వీలైనంత వరకు ముందు సీటునే ఎంచుకోవాలి. విండో అద్దాలను పూర్తిగా మూసేయకుండా బయటి గాలిని పీల్చుకుంటూ ఉండాలి. తల తిరిగినా, వాంతి వచ్చినట్టు అనిపించినా అల్లం, యాలకులు, లవంగం, వాము వంటివి బుగ్గన పెట్టుకోవాలి. తలను వెనక్కు వాల్చి, కళ్లు మూసుకొని ఏదైనా అందమైన ప్రదేశంలో ఉన్నట్టు ఊహించుకోవాలి. లేదంటే, నిద్రపోవడానికి ప్రయత్నించాలి. -
సమస్యల వలయంలో విమ్స్
బళ్లారి, కొప్పళ ఆస్పత్రులకు ఒక్కరే డెరైక్టర్ ఇన్చార్జిలతో కాలం నెట్టుకొస్తున్న పాలకులు అవస్థలు పడుతున్న రోగులు బళ్లారి: బళ్లారి జిల్లాతోపాటు కొప్పళ, రాయచూరు, చిత్రదుర్గం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించే విమ్స్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జనానికి జబ్బు చేస్తే ఆస్పత్రికి వె ళ్లి చికిత్సలు చేయించుకుని బాగు చేయించుకుంటారు. అయితే జనానికి వైద్యం చేసే ప్రధాన ఆస్పత్రి అయిన విమ్స్‌కు జబ్బు చేయడం రోగులకు శాపంగా మారింది. బళ్లారి నగరంలోని 1000 పడకల అతిపెద్ద ఆస్పత్రిలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. విమ్స్ డెరైక్టర్ రెండు ప్రధాన ఆస్పత్రులకు డెరైక్టర్‌గా వ్యవహరిస్తుండడంతో సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. కొప్పళలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెరైక్టర్‌గా పని చేసే శ్రీనివాస్‌ను ఆరు నెలల క్రితం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి డెరైక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే కొప్పళకు కొత్త డెరైక్టర్‌ను నియమించకుండా, అక్కడి బాధ్యతలను కూడా శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆరు నెలలు దాటినా కొప్పళకు డెరైక్టర్‌గా ఎవరినీ నియమించలేదు. రెండు ఆస్పత్రులకు శ్రీనివాస్ డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. దీంతో రెండింటికి న్యాయం చేయలేకపోతున్నారు. బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో సర్జరీ, మెడిసన్, ఓబీజీ, ఆర్థో, ఈఎన్టీ, స్కిన్, రేడియాలజీ, చిల్డ్రన్స్, యూరాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే 20కి పైగా వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అం దులో ఒ క్కొక్క డిపార్ట్మెంటు కు ఒక్కొక్కరు ఇన్ చార్జిలుగా వైద్యులు ఉంటారు. వారి నేతృత్వంలో ఒక్కొక్క డిపార్ట్మెంటులో మరో 10 మందికి పైగా వైద్యులు పని చేస్తుంటారు. ఇలా వందలాది మంది వైద్యులు పని చే సే ప్రధాన ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. ఇంత పెద్దాస్పత్రిని పర్యవేక్షించే డెరైక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకు పోతున్నట్లు వైద్యులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రధాన ఆస్పత్రుల్లో సంతకాలు పెట్టడానికే ఆయనకు సమయం సరిపోతుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రిలో సమస్యలు రోజురోజుకూ జఠిలమవుతున్నాయి. సంబంధిత వైద్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు విమ్స్ ఆస్పత్రిలో సమస్యల గురించి పట్టించుకునే కనీస ఆలోచన చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమ్స్ ఆస్పత్రిలో మంచినీటి సమస్యతోపాటు పారిశుధ్య సమ స్య పట్టిపీడిస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వార్డును సక్రమంగా శుభ్రం చేయడం లేదని రోగులు పేర్కొన్నారు. మరోవైపు మందుల కొరత వేధిస్తోంది. వీటితో పా టు ఆస్పత్రిలో పని చేసే వైద్యులకు కూడా సక్రమంగా జీతాలు అందించడం లేదు. వీటితో పాటు ప్రిన్సిపాల్, సీఈఓ వంటి ప్రధాన పోస్టులకు సంబంధించిన వైద్యులు కూడా ఇన్ చార్జిలే పని చేస్తున్నారు. పూర్తిస్థాయి బాధ్య తలు అప్పగించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా ఇన్ చార్జి మంత్రికి ఆస్పత్రి లో సమస్యలు పరిష్కరించడానికి కాదు కదా కనీసం ఆస్పత్రిని విజిట్ చేయడానికి కూడా తీరిక లేదేమో అని పలువురు విమర్శిస్తున్నా రు. విమ్స్ ఆస్పత్రి పరిధిలోకి వచ్చే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, దంత ఆస్పత్రి పనులు పూర్తి కాలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, దంత ఆస్పత్రికి నిధుల కొరత వేధిస్తుండడంతో మూ డు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెన క్కి వెళుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వి మ్స్ ఆస్పత్రిలో అడుగడుగునా సమస్యలు రా జ్యమేలుతున్నాయి. ఇకనైనా సంబంధిత మం త్రి ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. : సీఎం కేసీఆర్
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పేదలందరికీ పింఛను, రేషన్‌కార్డులు తప్పకుండా ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ నగరంలో కేసీఆర్ మూడో రోజు పర్యటిస్తున్నారు. గరీబ్‌నగర్‌లో సీఎం స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. గరీబ్‌నగర్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే ఇక్కడికి వచ్చానని చెప్పారు. గరీబ్‌నగర్ పేరు తీసి కాలనీకి అమీర్‌నగర్ అని పెట్టుకుందామని అన్నారు. గరీబ్‌నగర్‌లో కబ్జాలో ఉన్న అందరి స్థలాలు క్రమబద్దీకరిస్తామని వెల్లడించారు. మీ దగ్గరికే అధికారులు వస్తారని ,అని వివరాలు సేకరిస్తారని చేప్పారు. మురికివాడల్లో పక్కా గృహాలు నిర్మించే కార్యక్రమానికి రేపే శ్రీకారం అన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు.పేదల జీవనవిధానంలో ఇప్పటి వరకు మార్పు రాలేదు కనుకే ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు అని సీఎం కేసీఆర్ అన్నారు. -
ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం..
వరంగల్ బస్తీ వాసులకు సీఎం కేసీఆర్ హామీ కాలనీల నిర్మాణానికి రేపు శంకుస్థాపన రెండోరోజూ వరంగల్ బస్తీల్లో పర్యటన భూపాలపల్లి నియోజకవర్గంపై ప్రత్యేకంగా సమీక్ష నేడు, రేపు వరంగల్‌లోనే ఉండనున్న సీఎం సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరుసగా రెండోరోజు కూడా వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీన్‌దయాళ్ నగర్, ప్రగతి నగర్, నాగేంద్ర నగర్, జితేందర్ నగర్ బస్తీలకు వెళ్లి అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. దీన్‌దయాళ్ నగర్లో మహిళల వద్దకు వెళ్లి వారి మధ్యలో కూర్చుని సమస్యలు విన్నారు. మూడు బస్తీల వద్ద గుడిగూడిన స్థానికులను ఉద్దేశించి వేర్వేరుగా ప్రసంగించారు. ‘వరంగల్‌లో 500 ఎకరాల్లో మొత్తం 160 బస్తీలు ఉన్నయట. నిన్న మూడు బస్తీలల్ల తిరిగిన. ఇయ్యాల ఇక్కడ, మరో రెండు బస్తీలల్ల తిరుగుత. ఇప్పుడైతే ఈ ఆరు బస్తీలను సమగ్రంగా అభివృద్ధి చేస్త. మార్చి తర్వాత మరికొన్ని కాలనీలు, ఆ తర్వాత ఇంకొన్ని పూర్తి చేసుకుందం. మీ కాలనీని ఐదు నెలల్లో అడ్వొకేట్స్ కాలనీ స్థాయిలో అభివృద్ధి చేస్త. ఇప్పుడు మీరున్నది చెరువు శిఖం భూములు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నరు. ఇప్పుడు మీకు ఆన్స్టేక్ చట్టం మేరకు హక్కు పత్రాలు ఇయ్యాలె. ఆర్థికంగా సమకూర్చుకున్నవాళ్లు ఇండ్లు కట్టుకున్నరు. మిగిలిన అందరికీ వెంటనే ఇళ్ల పట్టాలిస్తం. ఈ బస్తీల్లో ఉన్న వారు ఎందరనేది కచ్చితంగా తేలాలె. మీ ఎమ్మెల్యే వినయభాస్కర్ రేపు ఇక్కడే కుర్చీ వేసుకుని కూసుంటడు. బస్తీలో ఉన్న వాళ్లు రేపు ఎక్కడికీ వెళ్లొద్దు. అధికారులు వస్తరు. మీ వివరాలు చెప్పాలి. నేను నైట్ ఇక్కడే ఉంట. జాబితా ప్రకారం అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తం. వెంటనే వన్ ప్లస్ వన్ (గ్రౌండ్ ఫ్లోర్, ఒక అంతస్తు) పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తం. ఇప్పుడు నేలపై ఉన్న వారు కింద (గ్రౌండ్ ఫ్లోర్లో) ఉంటరు. వేరే వారు పైన (మొదటి అంతస్తులో) ఉంటరు. ఇక్కడ వసతులు ఏమీ లేవు. నడిచిచూస్తే తెలుస్తాంది. నేను వస్తాన్నని మొరంబోసిన్రు. నాకు తెలుసు నిన్న ఇక్కడ ఎట్టుండెనో. వరద నీరు పోయేందుకు మోరీ కట్టాలె. తాగునీరు ఉండాలె. అన్నీ ఏర్పాటు చేయిస్తాం. ఎల్లుండి నేను వచ్చి కొత్త కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్త. ఐదు నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తాం. ఇప్పుడు కాదు ఈలలు, సంబరాలు. పూర్తి చేసినంక మీ కాలనీలనే బ్రహ్మాండమైన దావత్ చేసుకుందం’ అని అన్నారు. పింఛన్ల విషయంలో మహిళలు ఫిర్యాదులు చేయడంపై సీఎం స్పందిస్తూ ‘అర్హులందరికీ పింఛన్లు అందుతయ్. రేపు ఉదయమే అధికారులు వచ్చి అన్నీ సరిచేస్తరు. పట్టాలతోపాటు పింఛన్లు ఇస్తరు’ అని భరోసా ఇచ్చారు. దీన్‌దయాళ్ నగర్లో కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఒక మహిళ పదేపదే ఏదో చెప్పబోతూ అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. కేసీఆర్ సరదాగా... ‘నన్ను మీ ఇంటికి తీసుకబోయి కట్టేసుకోమ్మా. లొల్లిబోతది’ అని సరదాగా అనడంతో అక్కడున్న వారంతా నవ్వారు. స్థానిక రేషన్ డీలర్‌పై సీఎంకు బస్తీవాసులు ఫిర్యాదు చేయగా డీలర్‌ను వెంటనే మార్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కేసీఆర్ వెంట ఉప ముఖ్యమంత్రి రాజయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి ఉన్నారు. ఆర్డీవో కేంద్రంగా భూపాలపల్లి! తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదయం తెలంగాణ అర్చక సమాఖ్య సదస్సులో పాల్గొన్న కేసీఆర్ మధ్యాహ్నం హెలికాప్టర్లో వరంగల్ నుంచి కేటీపీపీకి చేరుకున్నారు. స్పీకర్‌తో కలసి అక్కడే అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గ సమస్యలపై సమీక్షించారు. రూ.75 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంజూరు చేశారు. భూపాలపల్లిని ఆర్డీవో కేంద్రంగా మారుస్తామన్నారు. అనంతరం కేటీపీపీ రెండో దశ పనులను పరిశీలించి మళ్లీ వరంగల్‌కు వచ్చారు. నేడు, రేపు వరంగల్‌లోనే.. వరంగల్ జిల్లాకు గురువారం ఆకస్మిక పర్యటనకు వచ్చిన సీఎం శనివారం ఇక్కడే ఉండనున్నారు. ఆయన శనివారం వరంగల్ నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఆదివారం సైతం వరంగల్‌లోనే ఉంటానని దీన్‌దయాళ్ నగర్ బస్తీలో కేసీఆర్ ప్రకటించారు. సీఎం గురువారం పర్యటించిన బస్తీల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వరంగల్ నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి సామాజిక పింఛన్ల అర్హుల వివరాలను సేకరించారు. అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేశాకే తాను హైదరాబాద్ వెళ్తానని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీపురం బస్తీలో కేసీఆర్ గురువారం ప్రకటించారు. ఆదివారం వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటి వరకు కేసీఆర్ వరంగల్‌లోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. టీఆర్ఎస్లో చేరిన తాటి వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వెంకటేశ్వర్లును పార్టీలోకి ఆహ్వానించారు. తాటి వెంకటేశ్వర్లుతోపాటు ఆయన అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. వరంగల్‌లోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు కడియం శ్రీహరి, ఎ.సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.