అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం అతని భార్య మెలానియా తన ఆవేదనను ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా, థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల షూటర్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయమయ్యింది.
మెలానియా తన భావోద్వేగాలను ఒక ప్రకటనలో పంచుకుంటూ ట్రంప్‌ను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ఘటనలో గాయపడినవారికి సానుభూతి ప్రకటించారు. ఆమె తన ప్రకటనలో.. ‘డొనాల్డ్ అభిరుచిని, నవ్వును, మాటల చాతుర్యాన్ని, సంగీతంపైగల ప్రేమను, అతని స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక అమానవీయ రాజకీయ ఘటన ఇది. ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు. నా భర్త జీవితంలో నాకు నచ్చిన ప్రధాన అంశం అతని మానవతా దృక్పథం.
ఆయన ఉదారమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మంచి, చెడు సమయాల్లో నేను అతని వెంట ఉన్నాను. ప్రేమకు భిన్నమైన అభిప్రాయాలు, విధానాలు, రాజకీయ ఆటలు హీనమైనవని మనం మరచిపోకూడదు. మా వ్యక్తిగత, నిర్మాణాత్మక జీవిత కట్టుబాట్లు మా మరణం వరకు అలానే కొనసాగుతాయి. దేశంలో మార్పు పవనాలు వచ్చాయని అంటున్నారు. ఈ మాటకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. రాజకీయ విభేదాలకు అతీతంగా స్పందిస్తున్నవారిని అభినందిస్తున్నాను’ అని మెలానియా పేర్కొన్నారు.
— MELANIA TRUMP (@MELANIATRUMP) July 14, 2024
Comments
Please login to add a commentAdd a comment