నిద్ర వస్తున్నట్లు అనిపిస్తోందా..?
మూడు ముచ్చట్లు
పెద్దగా పని చేయకపోయినా అలసటగా అనిపిస్తోందా..? రాత్రి తగినంత సేపు నిద్రపోయినా పగటిపూట మగత మగతగా నిద్ర ముంచుకొస్తోందా..? పని మధ్యలో ఆపేసి కాసేపు కునుకుతీసి లేచినా, పరిస్థితి బాగుండటం లేదా..? అయితే, ఓసారి మీ బరువును పరీక్షించుకోండి. స్థూలకాయానికి తోడు డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇలాంటి సమస్యలు మామూలేనంటున్నారు నిపుణులు.
హైపర్ సోమ్నియా.. అంటే, అతినిద్రతో బాధపడుతున్న వారు ప్రపంచ జనాభాలో దాదాపు ముప్పయి శాతం వరకు ఉంటారని ఒక అంచనా. హైపర్ సోమ్నియా కారణంగా పనితీరు మందగించడమే కాదు, తరచు యాక్సిడెంట్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నిపుణులు హెచ్చరిస్తు న్నారు. దీని నుంచి బయట పడేందుకు బరువు తగ్గడమే ఉత్తమమార్గమని వారు సూచిస్తున్నారు.