బాలీవుడ్ హీరో కమ్ విలన్ అర్జున్ కపూర్ హిట్ అందుకుని చాలాకాలమే అయింది. 2017 తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత సింగం అగైన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అయితే చాలాకాలంగా అతడు మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడట!
నా పరిస్థితి దారుణం..
దీనిగురించి తాజా ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. సింగం అగైన్ సినిమాకు సంతకం చేసినప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, శారీరకంగా, మానసికంగా అన్ని కోణాల్లోనూ బాధలో కూరుకుపోయాను. డైరెక్టర్ రోహిత్ శెట్టి నా లుక్ మార్చుకునేందుకు కొంత టైమ్ ఇచ్చాడు. అప్పటికే సినిమాపై నాకు ప్రేమ పోయింది.
జనాలు ఆదరిస్తారా?
ఇప్పుడీ సినిమా చేయాలా? మళ్లీ సినిమాతో ప్రేమలో పడాలా? జనాలు నిజంగా నన్ను ఆదరిస్తారా? లేదంటే తిరస్కరిస్తారా? ఇలా ఉండేవి నా ఆలోచనలు. హిట్టు అందుకుని ఏళ్లు గడిచిపోతుంటే మనపై మనకే అనుమానం రావడం సహజమే కదా! పైగా లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడిని.
డిప్రెషన్
సినిమానే జీవితం అనుకున్న నేను మూవీస్ చూసి ఎంజాయ్ చేయలేకపోయాను. పైగా ఇతరుల సినిమాలు చూస్తూ నాకిలాంటి ఛాన్స్ వస్తుందా? అని ఆలోచించేవాడిని. నిద్ర రావడానికి యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చూసేవాడిని. గతేడాదే డిప్రెషన్ నుంచి బయటపడేందుకు థెరపీ తీసుకోవడం మొదలుపెట్టాను.
హషిమోటో వ్యాధి
ఎప్పుడూ చెప్పలేదు కానీ నాకు హషిమోటో అనే వ్యాధి ఉంది. మా అమ్మకు, సోదరి అన్షులాకు కూడా ఉంది. ఈ వ్యాధి వల్ల నా బరువు అదుపులో ఉండేది కాదు అని చెప్పుకొచ్చాడు. హషిమోటో అనేది ఆటోఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధి. ఇది థైరాయిడ్ గ్రంధిని డ్యామేజ్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment