ఐఏఎస్ సాధించటం చాలామంది యువత కల. అయితే కొందరు మాత్రమే ఆర్థికంగా, వ్యక్తిగతంగా.. ఎదరయ్యే సవాళ్లను అధిగమించి విజయం సాధించగలుగుతారు. అలాంటి కోవకు చెందిందే అలంకృత. డిప్రెషన్ అనేది ఎంత భయానక మానసిక వ్యాధి అనేది తెలిసిందే. దీన్ని అధిగమించడం అంత సులభం కాదు. అలాంటి సమస్యతో పోరాడుతూనే క్లిష్టతరమైన సివిల్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారి అయ్యింది. ఈ క్రమంలో ఆమె చేసిన అలుపెరగని పోరాటం అసామాన్యమైనది. వ్యక్తిగతంగా క్షోభను అనుభవిస్తూనే..తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించి అందర్నీ విస్తుపోయేలా చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన అలంకృత పాండే ఎంఎన్‌ఎన్‌ఐటీ అలహాబాద్ నుంచి ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులోని ఐటీ కంపెనీలో పనిచేసింది కూడా. ఇంకా ఏదో సాధించాల్సింది మిగిలిపోయిందన్న ఫీల్‌తో 2014లో ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంది. అయితే ఆ ఏడాదే ఆమె తీవ్రమైన డిప్రెషన్‌తో మనో వ్యధను అనుభవించింది.
తన స్నేహితులు, కుటుంబసభ్యుల మద్దతతుతో అధిగమించే యత్నం చేసింది. అయితే తీవ్రమైన డిప్రెషన్ ప్రభావంతో..ఆ ఏడాది ఫ్రిలిమ్స్‌కు హాజరు కావడం కూడా మానుకోక తప్పలేదు. అయినప్పటికీ అలంకృత అంతు చూసేంత వరకు తగ్గేదే లే..అంటూ వెనుకడుగు వేయలేదు. ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ సాగించేలా ప్రణాళిక వేసుకుని మరీ కష్టపడి చదివేది. సరిగ్గా 2015లో ఆమె కష్టానికి ఫలితం దక్కింది.
ఆ ఏడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యింది. తొలి పోస్టింగ్ పశ్చిమబెంగాల్ కేడర్ కేటాయించడంతో అక్కడ నుంచి ఐఎఏస్‌గా బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత తన తోటి ఐఏఎస్ అధికారి అన్షుల్ అగర్వాల్‌ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బీహార్‌లో ఐఏఎస్‌గా విధుల నిర్వర్తిస్తోంది.
ఇక్కడ అలంకృత డిప్రెషన్‌పై సడలని అలుపెరగని పోరాడటమే ఐఏఎస్ సాధించేలా చేసింది. సడలని స్థిరమైన స్థైర్యంతో కష్టతరమైన సవాళ్లను అధిగమించి అద్భుతాలను సృష్టించొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. సాధించాలన్న దృఢ సంకల్పం ముందు ఎంతటి అనారోగ్య సమస్య అయినా కతం కావాల్సిందే కదూ..!.
(చదవండి: బెట్టింగ్ పిచ్చి తగ్గేదెలా?)
Comments
Please login to add a commentAdd a comment