UPSC exam
-
అమ్మానాన్నా.. క్షమించండి
మేడ్చల్ రూరల్: యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్ష క్లియర్ చేయలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌నోట్ రాసి ఓఆర్ఆర్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో నివాసం ఉండే గంగిశెట్టి సాకేత్ కుమార్ (28) ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న సాకేత్ మూడుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాసినా విజయం సాధించలేదని కుమిలిపోతూ ఉన్నాడు. ఈ నెల 16న హైదరాబాద్‌లో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి తల్లిదండ్రులు, సోదరి, బావతో కలిసి భోజనం చేసి పడుకుంటానని చెప్పి మొదటి అంతస్తులోని తన గదిలోకి వెళ్లాడు. సోమవారం ఉదయం గదిలో చూడగా సాకేత్ కనిపించలేదు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సాకేత్ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. దీంతో కుటుంబీకులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి గౌడవెళ్లి వద్ద ఓఆర్ఆర్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. గమ్యం చేరని ప్రయాణానికి ముగింపు సాకేత్ రెండు సూసైడ్నోట్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అమ్మానాన్నా.. చెల్లి దయచేసి ఈ జన్మకి నన్ను క్షమించండి. నేను బెంగళూరు వెళ్లాక జీవితం కుదుట పడిందని, కిందటి వారం జీతం కూడా పెరిగి మంచి భవిష్యత్తు ఉందని భావించాను. కానీ నేను యూపీఎస్సీ పరీక్ష క్లియర్ చేయలేదనే బాధ నా మదిలో నుంచి పక్కకి పోవడంలేదు. భావోద్వేగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నా, గమ్యం (ఐఏఎస్) చేరని ప్రయాణానికి ఒక ముగింపు’అంటూ సూసైడ్ నోట్ రాశాడు. మరో సూసైడ్‌నోట్‌లో ‘భయం కారణంగా నేను అనుకున్నది చేయలేకపోతున్నా. కాబట్టి సులువైన మార్గంలో ఇంటిని విడిచిపెట్టాలనుకుంటున్నా. నా కోసం వెతకకండి. నేను అదృష్టవంతుడినైతే నా శరీరం కుళ్లిపోయిన స్థితిలో దొరుకుతుంది’ అని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
ఫెయిల్ అవ్వడం ఎలా ?: ఫన్నీ వైరల్ వీడియో
యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. అందుకనే చాలామంది యూపీఎస్సీ పరీక్షల్లో గెలుపు కోసం ఈ పరీక్షల్లో మంచిగా ఉత్తీర్ణత సాధించిన వారి విజయగాథలను ఆదర్శంగా తీసుకుంటూ ప్రిపేర్ అవుతారు. పైగా వాటికి సంబంధించిన మార్గనిర్దేశిక వీడియోలను కూడా తెగ చూస్తుంటారు. కానీ ఎప్పుడైన యూపీఎస్సీ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో మార్గనిర్దేశం చేసే వీడియో గురించి విన్నారా! లేదు కదా. కానీ అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వాయు కాలుష్యంపై చర్యలేవి: సుప్రీంకోర్టు) అసలు విషయంలోకెళ్లితే....ఐఏఎస్ అధికారి అవాంశ్ శరణ్ యూపీఎస్సీ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో మార్గనిర్దేశం చేసే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా ఆ వీడియోలో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించకూడదనుకంటే చేయవలసిన పనుల సుదీర్ఘ జాబితా గురించి చెప్పుకొస్తారు. ఆ తర్వాత ఆయన "యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఎలా విఫలమవ్వాలి'" అనే గైడ్‌ని నిజాయితీగా ప్రయత్నించవద్దు లేకుంటే మీరు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి" అంటూ చమత్కరిస్తారు. నిజానికి ఈ వీడియో చూడంగానే ఏంటిది అనిపిస్తుంది. ఎలాంటివి చేస్తే ఫెయిలవుతాం అనేవి ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఒక చక్కని సందేశంలా ఉపయోగ పడటమే కాక తాము అలా చేస్తున్నామా అనేది కూడా ఎవరకి వారుగా వ్యక్తిగతంగా తెలుసుకునేలా ఉంటుంది. అయితే నెటిజన్లు కూడా ఈ విషయాలకు ఏకిభవిస్తూ "మేము కూడా ఇలాంటి తప్పిదాలు చేశాం. అందువల్లే విఫలమయ్యానంటూ" రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) How to fail UPSC Civil Services Exam. Well explained. pic.twitter.com/IftbagsJA5 — Awanish Sharan (@AwanishSharan) November 8, 2021 -
ఐఏఎస్ కావాలనుకుంటున్నారా? ఈ సూచనలు పాటించారంటే..
ఐఏఎస్ ఎందరికో కల. కానీ కొందరు మాత్రమే విజయతీరాలను చేరగలుగుతారు. యూపీఎస్సీ ప్రతియేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు క్లియర్ చేయడం అంతసులువేంకాదనే విషయం మనందరికీ తెలిసిందే! అందుకు చదువుతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా కీలకమే. ఎందుకంటే.. అభ్యర్ధులు మానసికంగా, శారీరకంగా ఎప్పుడైతే దృఢంగా ఉండగలుగుతారో ప్రిపరేషన్‌పై మరింత ఫోకస్ చేయగలుగుతారు. 2018 బ్యాచ్‌కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ అనుపమ అంజలి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. సివిల్స్ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు, సలహాలు ఇవే.. విద్యాభ్యాసం అనుపమ అంజలి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రెండో ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ పరీక్షలను క్లియర్ చేశారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. కుటుంబ నేపథ్యం అనుపమ తండ్రి కూడా సివిల్ సర్వెంటే. ఐపీఎస్ ఆఫీసర్‌గా భోపాల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫొటో కర్టెసీ: డీఎన్ఏ విజయ సూత్రం ఇదే సివిల్స్ ప్రిపరేషన్లో అభ్యర్ధులు బోర్‌గా ఫీలవడం సర్వసాధారణం. అనుపమ ఏం చెబుతున్నారంటే.. ఇటువంటి సందర్భాల్లో అభ్యర్ధులు తమని తాము పునరుత్తేజ పరచుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి విరామాలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా నూతన ఉత్సాహం నిండి, ప్రిపరేషన్ కొనసాగించడానికి ప్రోత్సాహకంగా ఉంటాయి. అలాగే శారీరక వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా ప్రతి అభ్యర్థికి ఎంతో ముఖ్యం. ఇది మిమ్మల్ని దృఢంగా, సానుకూలంగా ఉంచడానికి తోడ్పడుతుంది. సెల్ఫ్ మోటివేషన్ లేదా స్వీయ ప్రేరణ సుదీర్ఘ యూపీఎస్సీ ప్రిపరేషన్లో వ్యతిరేక ఆలోచనలు రావడం సాధారణమే. అయితే అనుపమ ఏమంటారంటే.. ప్రిపరేషన్ సమయంలో అభ్యర్ధులు తరచుగా ఒత్తిడికి గురై, నిరాశకు లోనవ్వడం జరుగుతుంది. ఏదేమైనా పాజిటివ్‌గా ఉండటం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఈ విధమైన ధోరణి అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి దోహదపడుతుంది. ప్రతికూల ఆలోచనలను అధిగమించకపోతే విజయం సాధించడం చాలా కష్టం. కాబట్టి పరీక్షలు సమర్ధవంతంగా రాయాలనుకునే అభ్యర్ధులు స్వీయ ప్రేరణను అలవరచుకోవాలి. ప్రేరణ పొందడానికి కొంత కృషి కూడా అవసరమౌతుంది. ఎందుకంటే.. మీ ప్రిపరేషన్ సజావుగా కొనసాగేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సివిల్స్ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు అన్నిరకాల ఆటంకాలకు/ఆందోళనలకు దూరంగా ఉండాలి. ఫ్యామిలీ ఫంక్షన్లు, ఫ్రెండ్స్ పార్టీలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే కుటుంబ బాధ్యలకు దూరంగా ఉంటే మంచిది. యూపీఎస్సీ పరీక్షలను క్లియర్ చేయడానికి ఈ సూచనలు ఎంతో సహాయపడతాయి. చదవండి: Trupti Gaikwad: రెండేళ్ల కిందట అలా మొదలైంది.. పూజ తర్వాత -
ముప్పుతిప్పలు పెట్టిన ప్రిలిమ్స్ ప్రశ్నలు!
సాక్షి, అమరావతి/ సాక్షి అమరావతి బ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పేపర్ 2 నిర్వహించారు. దేశవ్యాప్తంగా 12 నుంచి 13 లక్షల మంది హాజరయ్యే ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లో 33 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 35 నుంచి 40 శాతం మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. విజయవాడలో 12,176 మంది పరీక్ష రాయాల్సి ఉండగా సుమారు 4,800 మంది హాజరయ్యారు. విశాఖపట్నంలో 11,566 మంది, తిరుపతిలో 6,635 మంది, అనంతపురంలో 2,869 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 35 శాతానికి మించి రాలేదు. ఇన్‌డైరెక్టు ప్రశ్నలే అధికం గతంలో కన్నా ఈసారి ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఇన్‌డైరెక్టు ప్రశ్నలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. జనరల్ స్టడీస్‌లో నేరుగా సమాధానాలు గుర్తించే ప్రశ్నలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ ఇండెక్స్‌ను ఆధారం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జాగ్రఫీలో చాలా తక్కువ ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘మోడ్రన్ ఇండియా’లో ప్రశ్నలు అడిగినా అవి ఒకింత కష్టంగానే ఉన్నాయని తెలిపారు. రెండో పేపర్లో వచ్చిన ప్రశ్నలు మేథమెటిక్స్ సబ్జెక్టు చదువుకున్న వారికి సులభంగా ఉన్నాయని చెప్పారు. జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నలు గతంలో కన్నా కొంత సులభంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రిలిమ్స్ ప్రశ్నలను గమనిస్తే స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తోంది. ఈసారి పరీక్షలకు అభ్యర్థుల హాజరు కూడా తగ్గింది’’ అని సివిల్స్ శిక్షణ సంస్థ బ్రెయిన్‌ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ వివరించారు. ఫ్యాక్చువల్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడిగారని, లోతుగా విశ్లేషించేలా అవి ఉన్నాయని సివిల్స్ సబ్జెక్టు నిపుణురాలు బాలలత తెలిపారు. ‘‘కరెంట్ ఆఫైర్స్ ప్రశ్నలు ఎక్కువ ఇచ్చినా వాటిని నేరుగా అడగలేదు. ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంటే తప్ప వాటి సమధానాలు గుర్తించలేని విధంగా ప్రశ్నలున్నాయి’’ అని విజన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ సెంటర్ హెడ్ శశాంక్ వివరించారు. కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు ఈసారి సివిల్స్ ప్రశ్నల తీరుతో కటాఫ్ మార్కులపై నిపుణుల అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. గత ఏడాది ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు 105 కాగా, ఈసారి కటాఫ్ అదే విధంగా ఉండడమో, ఒకటి రెండు మార్కులు తగ్గడమో ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. పోస్టులు సంఖ్య తగ్గుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. గత ఏడాది 1000 పోస్టులుండగా ఈసారి 200 వరకు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రశ్నలు అడిగిన తీరు చూస్తే కటాఫ్ 105 నుంచి 110 మధ్య ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి అక్టోబర్ 1న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గత ఏడాది తమిళనాడులో సివిల్స్ పరీక్షకు హాజరైన ఐపీఎస్ అధికారి ఒకరు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి వాటికి ఆస్కారమివ్వకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
సంతృప్తికరంగా లేకుంటే శిక్ష తప్పదు?
సాక్షి, హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ : ఐఏఎస్ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడిన ఐపీఎస్ ప్రొబెషనరీ అధికారి సఫీర్ కరీంపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. ముందుగా ఆయన నుంచి వివరణ కోరుతామని, వివరణ సంతృప్తికరంగా లేకుంటే మాత్రం శిక్ష తప్పదని పేర్కొన్నారు. 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సఫిర్ కరీం ప్రస్తుతం తిరునల్వేలి జిల్లా నంగునేరిలో పనిచేస్తున్నారు. ఐఏఎస్ కావాలన్న కోరికతో మరోసారి యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలోని ఎగ్మోర్‌లోని పరీక్షా కేంద్రంలో హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతూ దొరికిపోయారు. ఆయనకు సహకరించిన భార్య అతని భార్య జాయిస్ జాయ్తోపాటు కోచింగ్ సెంటర్ లాఎక్స్లెన్స్ నిర్వాహకుడు రాంబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ అకాడెమీపై పోలీసులు దాడి చేసి, పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టడీ సర్కిల్ మాస్ కాపీయింగ్‌కు అడ్డాగా మారినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని తమిళనాడు డీసీపీ అరవిందన్ తెలిపారు. జాయిస్ జాయ్తోపాటు రాంబాబును నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై తమిళనాడుకు తరలించనున్నట్లు సమాచారం. -
22 లక్షల జాబ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి!
ఈ-రిటైల్ దిగ్గజం అమెజాన్ అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి రూ. 22 లక్షలు జీతం ఆఫర్ చేస్తూ జాబ్‌ను ఇవ్వజూపింది. కానీ అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. తన కలల ఐఏఎస్ కొలువు కోసం అంతటి ఆఫర్‌ను తృణప్రాయంగా త్యజించాడు. అతనే హర్యానాకు చెందిన హిమాన్షు జైన్. తాజా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 44వ ర్యాంకు సాధించిన ఈ కుర్రాడు హైదరాబాద్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో కంప్యూటర్ సైన్స్ పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ వెంటనే అతనికి అమెజాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చాయి. కానీ, తన జీవితగమ్యం కార్పొరేట్ కంపెనీల్లో కొలువు చేయడం కాదని హిమాన్షుకు అనిపించింది. అందుకే అమెజాన్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే ప్రారంభంలో రూ. 22లక్షల జీతంలో ఉద్యోగం ఇస్తామని ఆ సంస్థ ఆఫర్ చేసినా.. హిమాన్షు తిరస్కరించాడు. ఆ తర్వాత రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ అతని మనస్సు నిలువలేదు. అతనికి ఐఏఎస్ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. 'ఒక ఐఏఎస్ అధికారి దేశంలో మార్పు తీసుకురాగలడని మా కుటుంబసభ్యులు, టీచర్లు ఎప్పుడూ చెప్పేవారు. అప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా పెట్టుకున్నా' అని చెప్పిన హిమాన్షు.. ఆర్బీఐలో సైతం ఉద్యోగం వదిలేసి సివిల్స్‌కు సిద్ధమయ్యేందుకు ఢిల్లీ వచ్చాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ను అధిగమించినా.. మెయిన్స్‌లో విఫలమయ్యాడు. మూడో ప్రయత్నంలో రెట్టించిన ఉత్సాహంతో, మరింత అకుంఠిత దీక్షతో సివిల్స్ రాసి అనుకున్నది సాధించాడు. 44వ ర్యాంకు సాధించిన ఈ యువకెరటం కలలను నిజం చేసుకోవాలంటే అవి సాకారమయ్యే వరకు వాటిని వెంటాడుతూనే ఉండాలని చెప్తున్నాడు. -
రోల్ మోడల్ గా ఉంటా: సివిల్స్ టాపర్
న్యూఢిల్లీ: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించానని ఫస్ట్ ర్యాంకర్ టీనా దాబే వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష-2015లో టాపర్ గా నిలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. చెప్పలేని ఆనందానుభూతికి లోనపుతున్నానని, వర్ణించడానికి మాటలు రావడం లేదని పేర్కొంది. సహనం, స్పష్టత, క్రమశిక్షణ, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఫస్ట్ ర్యాంక్ సాధించానని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఎంచుకుంటానని తెలిపింది. హర్యానా కేడర్ తరపున పనిచేయడం సవాల్ తో కూడుకున్నదని అభిప్రాయపడింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో పాసవడంతో యువతులకు రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు టీనా చెప్పింది. తన కుమార్తె టాపర్ నిలవడం టీనా తండ్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫస్ట్ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్ పాసవడం తమకెంతో ఆనందం కలిగిస్తోందన్నారు. తనకు మాటలు రావడం లేదని టీనా తల్లి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తన కూతురే తన హీరో అని ఆమె వ్యాఖ్యానించారు. -
సైకిల్ షాపు కుర్రోడు.. ఐఏఎస్ కొట్టాడు!
అతనో సైకిల్ షాపు యజమాని కొడుకు. అయితేనేం.. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 32వ ర్యాంకు కొట్టాడు. అంటే.. పక్కాగా ఐఏఎస్‌కు ఎంపిక అయినట్లేనన్నమాట. మహారాష్ట్రలోని థానె జిల్లా బోయిసర్కు చెందిన వరుణ్ బరన్వాల్ ఈ ఘనత సాధించాడు. నిజానికి పదోతరగతి పరీక్షలు రాస్తున్నప్పుడే 2003లో వరుణ్ తండ్రి మరణించారు. అయినా ఆ పరీక్షల్లో 89 శాతం మార్కులు సాధించాడు. పుణెలోని ఎంఐటీ కాలేజి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేయడమే కాదు.. ఏకంగా గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. కాలేజీలో సీనియర్లు తనకు ఎంతగానో సహకరించారని, మహారాష్ట్ర, గుజరాత్ లేదా కర్ణాటక రాష్ట్రాలలో ఏదో ఒక కేడర్‌లో ఐఏఎస్ అధికారిగా చేరాలని అనుకుంటున్నానని వరుణ్ చెప్పాడు. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటున్న వరుణ్ తమ సైకిల్ షాపును కూడా చూసుకుంటున్నాడు. -
‘మాధవీ కృష్ణమూర్తి’ పిటిషన్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: తనకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని, ఈ క్రమంలోనే తన పేరును యూపీఎస్సీకి సిఫార్సు చేయలేదని ఆరోపిస్తూ ప్రభుత్వాధికారి మాధవీ కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. వివాదం తేలేవరకు 6 కన్ఫర్డ్ పోస్టుల్లో ఒకదాన్ని ఖాళీగా ఉంచేలా ఆదేశించాలని ఆమె తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. నేడు, రేపు ఇంటర్వ్యూలు రెవెన్యూయేతర 6 కనఫర్డ్ ఐఏఎస్ పోస్టులకుగాను శుక్ర, శనివారాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 30 మందిలో 14 మందికి ఇప్పటికే ఇంటర్వ్యూలు ముగియగా, మిగతా 16 మందికి యూపీఎస్సీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. -
యూపీఎస్సీ పరీక్ష విధానం మార్చాలి
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే పరీక్ష పద్ధతిలో మార్పు లు చేయాలని వందలాది మంది సివిల్ సర్వీసెస్ ఔత్సాహిక అభ్యర్థులు రోడ్డెక్కారు. పార్లమెంట్ హౌస్ సమీపంలో సోమవారం ఆందోళనకు దిగా రు. యూపీఎస్సీ సిలబస్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది తప్పించిన కొన్ని సబ్జెక్ట్‌లను తిరిగి చేర్చాలన్నారు. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినప్పటికీ అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడంతో జల ఫిరంగులను ప్రయోగించారు. ‘పరీక్ష పద్ధతిలో పక్షపాతంతో వ్యవహరిస్తోంది. దీన్ని పున:సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంద’ని ఓ విద్యార్థి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.