యూపీఎస్‌సీ పరీక్ష విధానం మార్చాలి | Civil service aspirants protest near parliament, demand changes in UPSC exam pattern | Sakshi
Sakshi News home page

యూపీఎస్‌సీ పరీక్ష విధానం మార్చాలి

Published Tue, Dec 10 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

Civil service aspirants protest near parliament, demand changes in UPSC exam pattern

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్‌సీ) నిర్వహించే పరీక్ష పద్ధతిలో మార్పు లు చేయాలని వందలాది మంది సివిల్ సర్వీసెస్ ఔత్సాహిక అభ్యర్థులు రోడ్డెక్కారు. పార్లమెంట్ హౌస్ సమీపంలో సోమవారం ఆందోళనకు దిగా రు. యూపీఎస్‌సీ సిలబస్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది తప్పించిన కొన్ని సబ్జెక్ట్‌లను తిరిగి చేర్చాలన్నారు. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినప్పటికీ అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడంతో జల ఫిరంగులను ప్రయోగించారు. ‘పరీక్ష పద్ధతిలో పక్షపాతంతో వ్యవహరిస్తోంది. దీన్ని పున:సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంద’ని ఓ విద్యార్థి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement