pattern
-
స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి
న్యూఢిల్లీ: వినియోగదారులను నష్టపర్చేలా పలు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ’డార్క్ ప్యాటర్న్’ పద్ధతులు పాటిస్తుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే దిశగా స్వీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని సంస్థలను ఆదేశించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగీ, జొమాటో తదితర ఈ–కామర్స్ సంస్థలతో భేటీ అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన తగు వ్యవస్థ ఏర్పాటు కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్లో వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా మోసం చేసే విధానాలను డార్క్ ప్యాటర్న్లుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు యూజరు ఎంచుకోకపోయినా షాపింగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్‌లను జోడించేయడం, చెక్ అవుట్ చేసే సమయంలో ఉత్పత్తుల ధరలను మార్చేయడం, తక్షణం కొనుగోలు చేయకపోతే నష్టపోతామేమో అనే తప్పుడు భావన కలిగేలా తొందరపెట్టడంలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. మధ్యవర్తులు అమ్మకాలను పెంచుకునేందుకు లేదా అమ్ముకునేందుకు అమలు చేసే మోసపూరిత విధానాల గురించి ఈ–కామర్స్ సైట్లను వాడే వినియోగదారులకు, విక్రేతలకు పెద్దగా తెలియదని సింగ్ చెప్పారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అవగాహన కల్పించి, స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇలాంటి పద్ధతులు కొనసాగితే ఈ విషయంలో నిబంధనలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. -
పది పాసవడం.. ఇక ఈజీ!
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదోతరగతి చదివే విద్యార్థులకు శుభవార్త. ఇక మీరంతా పదోతరగతి పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే పాస్ మార్కులకు సంబంధించిన నిబంధనలను సవరించి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్ఈ) త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తంగా 33 శాతం వస్తే చాలు.. ప్రస్తుతం సీబీఎస్ఈ విద్యావిధానంలో పదో తరగతిలో ఓ విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలంటే ఇంటర్నల్స్‌లో 33 శాతం, థియరీ పరీక్షల్లో 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనను సవరించి, ఇంటర్నల్స్, థియరీలో కలిపి 33 శాతం మార్కులు వస్తే చాలు. అంటే థియరీలో 33 శాతంకంటే తక్కువగా వచ్చి, ఇంటర్నల్స్‌లో 33 శాతం కంటే ఎక్కువ వచ్చినా.. మొత్తంగా 33 శాతం దాటితే ఉత్తీర్ణులైనట్లే. రెండింటిలో 33 శాతం మార్కులు రావాలనే నిబంధన నుంచి మినహాయింపును ఇవ్వాలని సీబీఎస్ఈ యోచిస్తున్నట్లు సమాచారం. మీ అభిప్రాయమేంటో చెప్పండి.. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ని అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు బోర్డు జారీచేసింది. 33 శాతం నిబంధనను సవరించడంపై అభిప్రాయమేంటో చెప్పాలని ఆయా పాఠశాలలను సీబీఎస్ఈ కోరింది. వాటి నుంచి సమాధానం వచ్చిన వెంటనే ఈ వారంలోనే సమావేశమై, దీనిపై అధికారిక ప్రకటన జారీ చేయాలని భావిస్తోంది. 2011 నుంచి సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలను ఆప్షన్ (ఐచ్చికం)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ 7 ఏళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలను కచ్చితం చేశాయి. దీంట్లో భాగంగానే పరీక్ష విధానాల్లో ఈ మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు... వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన కార్యాచరణను బోర్డు అధికారులు వేగవంతం చేశారు. 10, 12 తరగతుల పరీక్షలకు ముందు జరిగే ‘స్టూడెంట్ యాక్టివిటీస్’ను వీలైనంత త్వరగా అందజేయాలని ఆయా విద్యా సంస్థలు, పాఠశాలలకు సీబీఎస్ఈ అధికారులు లేఖలు పంపారు. దీన్ని బట్టి ఏటా జరిగే తేదీలకంటే ముందుగానే బోర్డు పరీక్షలు ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివే 9, 10 తరగతుల విద్యార్థుల వివరాలు ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్షల నిర్వహణ నిమిత్తం ఆయా వివరాలను cbse.nic.inలో నమోదు చేయాలని సూచించింది. -
చంద్రబాబు తీరుతోనే ‘హోదా’ పట్ల నిర్లక్ష్యం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు తీరుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పట్ల నిర్లక్ష్యం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణాల నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ప్రజలను గందరగోళానికి గురిచేయడం మానుకోవాలని చంద్రబాబు, కేసీఆర్‌లకు హితవు పలికారు. కృష్ణా నీటి పంపిణీపై బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల ఆధారంగా ఇరు రాష్ట్రాలలోని పాలమూరు ప్రాంతం, రాయలసీమ,ప్రకాశం జిల్లా నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చర్చించి పరిష్కరించుకోవాలన్నారు.చర్చల ద్వారా నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంలను రామకృష్ణ కోరారు. -
యూపీఎస్సీ పరీక్ష విధానం మార్చాలి
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే పరీక్ష పద్ధతిలో మార్పు లు చేయాలని వందలాది మంది సివిల్ సర్వీసెస్ ఔత్సాహిక అభ్యర్థులు రోడ్డెక్కారు. పార్లమెంట్ హౌస్ సమీపంలో సోమవారం ఆందోళనకు దిగా రు. యూపీఎస్సీ సిలబస్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది తప్పించిన కొన్ని సబ్జెక్ట్‌లను తిరిగి చేర్చాలన్నారు. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినప్పటికీ అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడంతో జల ఫిరంగులను ప్రయోగించారు. ‘పరీక్ష పద్ధతిలో పక్షపాతంతో వ్యవహరిస్తోంది. దీన్ని పున:సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంద’ని ఓ విద్యార్థి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.