రోల్ మోడల్ గా ఉంటా: సివిల్స్ టాపర్
న్యూఢిల్లీ: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించానని ఫస్ట్ ర్యాంకర్ టీనా దాబే వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష-2015లో టాపర్ గా నిలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. చెప్పలేని ఆనందానుభూతికి లోనపుతున్నానని, వర్ణించడానికి మాటలు రావడం లేదని పేర్కొంది. సహనం, స్పష్టత, క్రమశిక్షణ, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఫస్ట్ ర్యాంక్ సాధించానని వెల్లడించింది.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఎంచుకుంటానని తెలిపింది. హర్యానా కేడర్ తరపున పనిచేయడం సవాల్ తో కూడుకున్నదని అభిప్రాయపడింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో పాసవడంతో యువతులకు రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు టీనా చెప్పింది.
తన కుమార్తె టాపర్ నిలవడం టీనా తండ్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫస్ట్ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్ పాసవడం తమకెంతో ఆనందం కలిగిస్తోందన్నారు. తనకు మాటలు రావడం లేదని టీనా తల్లి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తన కూతురే తన హీరో అని ఆమె వ్యాఖ్యానించారు.