Tina Dabi
-
ఐఏఎస్ టీనా దాబీ వైరల్ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు
జైపూర్ : ఒకటి,రెండు,మూడు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఓ జిల్లా ఐఏఎస్ అధికారిణి సదరు అధికార పార్టీ నేతకు వంగి వంగి పెట్టిన దండాలు. ఇప్పుడీ అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గత నెలలో రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నవో బార్మర్ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియాను ఆహ్వానించారు."दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।"#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024 అయితే కార్యక్రమానికి వచ్చిన సతీష్ పూనియా కాన్వాయ్ నుంచి దిగి వస్తూనే ఫోన్లో బిజీ అయ్యారు. అదే సమయంలో సతీష్ పూనియాను ఆహ్వానించేందుకు వచ్చిన టీనా దాబి ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించారు. కొద్ది సేపటి తర్వాత టీనా దాబి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్ టీనా దాబి వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టీనా దాబిరాజస్థాన్కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచిన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..2021లో జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది.గతేడాది 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. -
ఐపీఎస్‌ను పెళ్లాడిన టీనా దాబి సోదరి.. ఐఏఎస్ భార్య కోసం కేడర్ మార్పు..
ఐఏఎస్ అధికారి, యూపీఎస్సీ టాపర్ టీనా దాబి సోదరి ఐఏఎస్ రియా దాబి పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఐపీఎస్ అధికారి మనీష్ కుమార్‌తో ఏడడుగులు వేశారు. కాగా మనిష్ కుమార్, రియా దాబిలు కుటుంబ సభ్యుల అనుమతితో ఏప్రిల్ నెలలోనే కోర్టు వివాహం చేసుకున్నారు. అంటే వీరి పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తుంది. అయితే మనీష్ కుమార్ కేడర్‌ను మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మారుస్తూ హోం మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక రియా దాబి ఆమె భర్త ఐపీఎస్ మనీష్ కుమార్ ఇద్దరూ 2020 యూపీఎస్సీ బ్యాచ్‌కు చెందిన వారే. యూపీఎస్సీ పరీక్షల్లో ఆమె 15వ ర్యాంకర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని అల్వార్‌కు కలెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరికి ముస్సోరీలోని శిక్షణా అకాడమీలో పరిచయం ఏర్పడగా.. అనంతరం స్నేహం ప్రేమగా మారింది. అయితే రియా రాజస్థాన్ కేడర్ కాగా మనీష్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్. వివాహామనంతరం మనీష్ తన కేడర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకొని..మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మార్చుకున్నారు. చదవండి: బిల్లు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే! కాగా మనీష్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. బీటెక్ చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 2020 పరీక్షలో 581 ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని ఒసామాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇప్పుడు రాజస్థాన్‌కు బదిలీ కానున్నారు. త్వరలోనే వీరు జైపూర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనున్నారు. కాగా రియా సోదరి టీనా దాబి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2015 టాపర్‌గా నిలిచారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి దళితురాలిగా రికార్డు సృష్టించింది. సెకండ్ ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రెండేళ్లకే 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. గతేడాది ఐఏఎస్ ప్రదీప్ గావండేను రెండో పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
మరోసారి వార్తల్లో నిలిచిన సివిల్స్ టాపర్ టీనా దాబీ.. మార్క్‌షీట్ వైరల్
యూపీఎస్సీ టాపర్, ఐఏఎస్ అధికారి టీనా దాబీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సీబీఎస్ఈ 12వ తరగతి మార్క్‌షీట్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీనాకు హిస్టరీ, పాలిటికల్ సైన్స్‌లో 100కు 100 మార్కులు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. అయితే ఈ మార్క్‌షీట్ నిజంగా టీనాదేనా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆమెకు రెండు సబ్జెక్టుల్లో 100 మార్కులు రావడాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అసలు టీనా మార్క్‌షీట్ నెట్టింట్లో లేదని తెలుస్తోంది. అయితే టీనా 2011 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 93శాతం మార్కులు సాధించినట్లు సమాచారం. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్లో చదివిన ఆమె.. టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేసింది. తన ప్రతిభకు గానూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా అందుకుంది. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోంది. తరచూ వార్తల్లో టీనా సివిల్స్‌లో టాపర్ అయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన దళిత యువతిగా అరుదైన ఘనత సాధించింది. అయితే సివిల్స్ రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా వెనక్కి తగ్గకుండా 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ప్రదీప్ గవాండేను(2013 ఐఏఎస్ బ్యాచ్)ను రెండో వివాహం చేసుకుంది టీనా. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి 2022లో జరిగింది. ఇది కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం. చదవండి: జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..
Tina Dabi.. అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి అందరికీ సుపరిచితురాలే. ఇటీవలే ఆమె రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండేను వివాహం చేసుకున్నారు. కాగా, మరోసారి టీనా దాబి వార్తల్లో నిలిచారు. అయితే, కలెక్టర్ టీనా దాడి ఫొటోనే వాట్సాప్‌లో వాడుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో, విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు.. ఓ మొబైల్ నెంబర్‌తో వాట్సాప్ ఓపెన్ చేసి, దాంట్లో ఐఏఎస్ టీనా దాబి ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. అనంతం వాట్సాప్‌లో ఆ నెంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు చేశాడు. అమెజాన్ గిఫ్ట్ కార్డులు పంపాలంటూ చాలా మందికి మెసేజ్‌లు పెట్టాడు. దీంతో, కలెక్టర్ టీనా దాబీనే గిఫ్ట్ కార్డులు అడిగిందే ఏమో అని వారు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు సెక్రటరీ సునితా చౌదరీకి కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డు పంపాలంటూ అతడి వాట్సాప్ నుంచి మెసేజ్ వెళ్లింది. దీంతో, ఎందుకైనా మంచిదని ఆమె.. టీనా దాబికి ఫోన చేసి అసలు విషయం అడిగింది. గిఫ్ట్ కార్డు గురించి చెప్పడంతో షాకైన కలెక్టర్ టీనా దాబి.. ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీకి తెలియజేసింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. యువకుడిని అరెస్ట్ చేశారు. CM अशोक गहलोत के बाद अब IAS टीना डाबी के नाम पर ठगी, अफसर से ही मांग लिया गिफ्ट#IAS #Tinadabi https://t.co/zTbOOBvIMM — Zee Salaam (@zeesalaamtweet) August 9, 2022 ఇక.. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. కాగా, రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగితోనే పరాచకాలా.. తేడా వస్తే ఇలాగే ఉంటంది.. -
Tina Dabi: ఆమెది మళ్లీ లవ్ మ్యారేజ్!
అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి రెండోసారి వివాహం చేసుకున్నారు. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండే వివాహంతో శుక్రవారం ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, బంధువులు సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. టీనా, ప్రదీప్‌ల మ్యారేజ్ మరాఠీ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ కార్యక్రమంలో టీనా తెలుపు, బంగారు రంగు చీర ధరించగా, ప్రదీప్ కూడా తెల్లటి కుర్తా-పైజామాలో కనిపించాడు. కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 2015 ఐఏఎస్ బ్యాచ్‌లో టాపర్ అయిన టీనా దాబీ, డాక్టర్ ప్రదీప్ గవాండే (2013 ఐఏఎస్ బ్యాచ్) మే 2021లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ జంట ప్రేమ మొదట స్నేహంతో ప్రారంభమైంది. టీనా, ప్రదీప్ కలిసి పనిచేస్తున్నప్పుడు మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీనా దాబి తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు మార్చిలో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్త, రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండే అని వెల్లడించింది. దుమారం రేపిన మొదటి వివాహం.. తర్వాత విడాకులు.. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. అయితే రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు. -
ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి.. మళ్లీ పెళ్లి
అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి(28) మరోసారి వార్తల్లో నిలిచారు. రెండోసారి వివాహానికి ఆమె సిద్ధమయ్యారు. మరో ఐఏఎస్ అధికారితో తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో టీనా దాబి స్వయంగా షేర్ చేశారు. టీనా దాబి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘నువ్వు ఇచ్చిన నవ్వు..’ అంటూ క్యాప్షన్ ఉంచారామె. అలాగే ఆమె కాబోయే భర్త, రాజస్థాన్ కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాన్డే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు. ‘కలిసిఉంటే..’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 22న రాజస్థాన్‌లో వీళ్ల వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రదీప్ ప్రస్తుతం ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. టీనా దాబి ప్రస్తుతం రాజస్థాన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Tina Dabi (@dabi_tina) రాజస్థాన్‌కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచిన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట.. కిందటి ఏడాది జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది. తాజాగా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. View this post on Instagram A post shared by Tina Dabi (@dabi_tina) -
అప్పట్లో సంచలనం రేపిన ఆ ఇద్దరు ఐఏఎస్‌లకు విడాకులు
జైపూర్: ఐఏఎస్ టాపర్లుగా నిలవడంతో పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారి పెళ్లి తీవ్ర వివాదాస్పదమైంది. మతాలు వేరు కావడంతో ఆ పెళ్లిని పలు మత సంఘాలు తప్పుబట్టాయి. అయితే తాజాగా ఆ దంపతులు విడిపోయారు. అధికారికంగా న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. ఆ ఇద్దరే టినా దాబి, అథార్ ఖాన్. టినా దాబి 2015 సివిల్స్‌లో మొదటి ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించింది. అదే ఏడాది కశ్మీర్‌కు చెందిన అథార్ ఖాన్ రెండో ర్యాంక్ సాధించాడు. శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అధికారులుగా మారిన అనంతరం వారిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు హాజరై అభినందించి ప్రశంసించారు. టినా ఢిల్లీలోని శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. టీనా, అథార్ ఖాన్ తొలి ప్రయత్నంలోనే టాప్ ర్యాంక్‌లు సాధించి సంచలనం సృష్టించారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమలోనూ.. పాలనలోనూ ఈ జంట విజయవంతంగా రాణించారు. అయితే ఏమైందో ఏమోగానీ ఇప్పుడు టినా, అథార్ విడాకుల కోసం జైపూర్‌లోని కుటుంబ (ఫ్యామిలీ) కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన అనంతరం న్యాయస్థానం వీరిద్దరికీ మంగళవారం విడాకులు మంజూరు చేసింది. మెరుగైన పాలన అందిస్తూ అందరి నోళ్లల్లో నానిన వీరు విడాకులు తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు రాజకీయ, ఇతర ప్రముఖుల శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేకార్షణగా నిలిచిన ఆ దంపతులు విడిపోవడం షాకిచ్చింది. అయితే ఈ విడాకుల వెనుక కొందరి బెదిరింపులు ఉన్నాయని సమాచారం. పెళ్లి వివాదాస్పదం కావడంతో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. -
విడాకుల దిశగా సివిల్స్ టాపర్స్ జంట
-
విడాకుల దిశగా సివిల్స్ టాపర్స్ జంట
జైపూర్: రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ జంట పెళ్లి చేసుకొని రెండేళ్లు తిరిగిందో లేదో విడాకుల కోసం కోర్టుకెక్కింది. అథార్ అమీర్‌ఖాన్, టీనా దాబిలు పరస్పర అంగీకారంతో జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. లవ్ జిహాదీలో భాగంగానే వీరిద్దరి పెళ్లి జరిగిందని హిందూ మహాసభ ఆరోపణలు గుప్పించడంతో ఈ ఐఏఎస్ జంట విడాకుల వ్యవహారంపై అందరి దృష్టి పడింది. కశ్మీర్‌కు చెందిన అమీర్‌ఖాన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో రెండో స్థానం వస్తే, అదే బ్యాచ్‌లో టీనాకు మొదటి స్థానం, రాష్టపతి మెడల్ వచ్చాయి. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన వీరిద్దరూ శిక్షణా కాలంలోనే ప్రేమలో పడ్డారు. శిక్షణానంతరం వారిద్దరికీ జైపూర్‌లోనే పోస్టింగ్‌లు వచ్చాయి. 2018 మార్చిలో అమీర్, టీనా పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. సోషల్ మీడియా వేదికల్లో టీనా తన పేరులో ఉన్న ఖాన్‌ను తొలగించడంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నట్టు అందరికీ అర్థమైంది. అదే సమయంలో అమీర్‌ఖాన్ సోషల్ మీడియా వేదికల్లో టీనాని అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు ఏకంగా విడాకుల కోసం పిటిషన్ వేశారు. -
విడాకులు కోరిన ఐఏఎస్ దంపతులు
'సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్ ప్రేమపక్షులు అథర్ ఆమిర్ ఉల్ షఫీఖాన్, టీనా దాబీ తమ వివాహ బంధంపై ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వివాహమైన రెండేళ్లకే దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దాబీ భర్త షఫీఖాన్ జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో విడాకులను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తామిద్దరి అంగీకారం మేరకే పిటిషన్ ఫైల్ చేసినట్లు శుక్రవారం తెలిపారు. 2015 సివిల్స్ టాపరైన టీనా దాబీ తన జూనియర్ అయిన అమీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్ అఫీసర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ వీరి పెళ్లికి మాత్రం పలు హిందూ సంఘాలు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీనా ఐఏఎస్ టాపరై ఉండి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని విశ్వ హిందూ మహా సభ బహిరంగంగానే విమర్శించింది. అయినా అవేవి పట్టించుకుకోని ఈ జంట 2018లో అమీర్ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వివాహంతో ఒకటైయారు. పోస్టింగ్ అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం రాజస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్రంలో ఉండటం అనుకోకుండా వచ్చిన అదృష్టంగా భావించారు. అయితే పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య అభిప్రాయ విభేదాలు రావడం ప్రారంభమయ్యాయి. చదవుకున్న యువతీ, యువకులు కావడంతో అర్థంచేసుకుని సర్ధుకుపోతారని ఇరువురి కుటుంబ సభ్యులు తొలుత భావించారు. కాలం గుడుస్తున్న కొద్దీ మనస్పర్థాలు పెరగడంతో ఇక వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. అయితే కులాలు, మతాలను కాదని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వచ్చినా వెనుకడుగు వేయకుండా వివాహ బంధంతో ఒకటైన జంట తాజాగా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2015 సివిల్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే భోపాల్‌కు చెందిన టీనా దబి మొదటి ర్యాంకు సాధించగా.. అదే పరీక్షలో కశ్మీర్‌కు చెందిన అథల్ ఆమీర్ రెండో ర్యాంకు సాధించారు. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహరం హాట్‌టాపిక్‌గా మారగా.. ఇప్పుడు విడాకుల వార్త కూడా అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లవ్ జిహాద్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చసాగుతున్న తరుణంలో వీరు విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. హిందు మతానికి చెందిన యువతులకు ముస్లిం యువకులు గాలం వేసి మోసపూరితంగా వివాహం చేసుకుంటున్నారని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
నవ్వుతుండే అమ్మాయి
వెనుక చాలా మాటలు. రిజర్వేషన్ క్యాండిడేట్. భర్తదీ సేమ్ కేటగిరీ..! చూసి ప్లాన్ చేసుకుంది. సొంత ప్రతిభేమీ కాదు. అంతా పేరెంట్స్ పలుకుబడి. ఇప్పుడు ‘బ్రిక్స్’ చాన్స్. అదీ అంతే.. సిఫారసు. ఒక మాట కాదు!! అన్నీ వింటూ హాయిగా నవ్వడమూ.. మాటలు కాదు! భారత ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీ అవడం టీనా దాబీ కల. ఆ కల అటుండగనే అంతకంటే పెద్ద కల ఆమెను కనింది! టీనాను ‘బ్రిక్స్’ గౌరవ సలహాదారుగా బ్రిటన్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలను తిప్పుకు రావడానికి ఆ రెక్కల గుర్రం ఇంటి బయట సిద్ధంగా ఉంది! ఇండియా సహా బ్రిక్స్‌లోని ఐదు దేశాలు ఇవి. టీనా ప్రస్తుతం రాజస్థాన్‌లోని భిల్వారాలో సబ్–డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆమె రాజస్థాన్ నుంచి కదిలేదేమీ ఉండదు. బ్రిక్స్ స్టీరింగ్ కమిటీకి సలహాలు అవసరమైనప్పుడు ఈ ఐఎఎస్ ఆఫీసర్‌కు కాల్ చేస్తోంది. వెబ్ మీటింగ్‌లకు ఆహ్వానిస్తుంది. ఆ కమిటీలో ఒక్కగానొక్క ఐఏఎస్ ఆఫీసర్ టీనా. ఇరవై ఏడేళ్ల అమ్మాయి. అవును. అమ్మాయిలానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ. ఎప్పుడూ హుషారుగా డ్యూటీ చేస్తూ! వినే ఉంటారు.. భిల్వారాలోకి కరోనా చొరబడకుండా టీనా సరిహద్దుల్లో గట్టి బందోబస్తు పెట్టించిందని. రెండు నెలల క్రితమే ఆమె పేరు భిల్వారా నుంచి గట్టిగా దేశానికి వినిపించడం. టీనా దాబి! ఎక్కడో విన్నట్లుందే అనుకున్నారు. ఐదేళ్ల క్రితం కేవలం ఇరవై రెండేళ్ల వయసులో యు.పి.ఎస్.సి.ని ‘క్రాక్’ చేసి ఫస్ట్ ర్యాంక్‌తో దేశానికి తన విజయధ్వానాన్ని ప్రతిధ్వనింపజేసింది ఈ అమ్మాయే. బ్రిక్స్ కమిటీ గౌరవ సలహాదారుగా 2023 వరకు ఉంటారు టీనా. బ్రిక్స్‌కి సలహా ఇవ్వడం అంటే జైర్ బొల్సనారోకి, వ్లాదిమర్ పుతిన్‌కి, నరేంద్ర మోదీకి, షి జిన్‌పింగ్‌కి, సిరిల్ రమాఫోసాకు సలహా ఇవ్వడమే. ఐదు దేశాల వాణిజ్యం, పరిశ్రమలు, రాజకీయాలు, సహకారం.. వీటి మీద కమిటీని టీనా తన సూచనలతో నడిపించాలి. కరోనా లేకుండా ఉంటే టీనా ఈరోజు (జూలై 23) రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉండేవారు. ఏటా ఒక్కో ‘బ్రిక్స్’ దేశంలో సదస్సు జరుగుతుంది. ఈ ఏడాది రష్యా అనుకున్నారు. అది రద్దయింది. టీనా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో బి.ఎ. పొలిటికల్ సైన్స్ చదివారు. అక్కడా టాపరే. ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఐ.ఎ.ఎస్.కి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. రోజుకు తొమ్మిది నుంచి పన్నెండు గంటల ప్రిపరేషన్! డిగ్రీ అయిన రెండేళ్లకే సర్వీస్ కమిషన్ పాస్ అయ్యారు. ట్రయినింగ్ ముస్సోరీలో. అక్కడే ఆమెకు రాష్ట్రపతి గోల్డ్ మెడల్, ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ వచ్చాయి. అక్కడే ఆమిర్ ఉల్ షఫీఖాన్ పరిచయం అయ్యాడు. టీనా బ్యాచ్‌మేట్ అతను. ఇప్పుడు వాళ్లిద్దరూ దంపతులు. రెండేళ్ల క్రితమే పెళ్లయింది. ఆమిర్‌కు రాజస్థాన్‌లోనే పోస్టింగ్. జమ్ము కశ్మీర్ అడిగితే అక్కడ ఖాళీల్లేవని ఇక్కడ ఇచ్చారు. టీనాకూ అలాగే జరిగింది. ఆమె హర్యానా అడిగితే రెండో ఆప్షన్‌గా ఉన్న రాజస్థాన్ ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్రంలో ఉండటం అనుకోకుండా వచ్చిన అదృష్టం. ఇద్దరూ సాహితీ ప్రియులే. ఆయన పొయెట్రీ రాస్తారు. ఈమె ఇంగ్లిష్ నవలలు చదువుతారు. టీనా తండ్రి జస్వంత్ దాబి బి.ఎస్.ఎన్.ఎల్.లో జనరల్ మేనేజర్. తల్లి హిమానీ దాబీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో అధికారి. పిల్లల కోసం ఉద్యోగం మానేశారు. మీనాకు రియా అని ఒక చెల్లి. ఈ కుటుంబానిది భోపాల్. టీనా చిన్నప్పుడే ఢిల్లీ వచ్చి స్థిరపడ్డారు. తల్లిదండ్రులు పలుకుబడి గలవాళ్లు కాబట్టి టీనాకు కెరీర్లో ప్రాధాన్యం లభిస్తోందని, ఇప్పుడు బ్రిక్స్‌కు వచ్చిన అవకాశం కూడా అలాంటిదే అని గత రెండు రోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఆ ట్రోల్స్‌ని చూసి ఎప్పటిలా నవ్వుకుని వదిలేస్తున్నారు టీనా. ఆమె ప్రతిభావంతురాలు కాకపోయుంటే ఆ సంగతి ఎక్కడో ఒక చోట బయట పడి ఉండాలి. స్కూల్లోనో, కాలేజ్‌లోనో, క్యాంపస్‌లోనో, ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్లోనో, ఎస్డీఎంగా ఇప్పుడు పని చేస్తున్న హోదాలోనో! ప్రతిచోటా ఆమెకు మంచిపేరే ఉంది. మంచి మార్కులే పడుతున్నాయి. దళితురాలు కనుక ఏమైనా ప్రచారం చెయ్యొచ్చు అనుకుంటే ప్రతిభ చూస్తూ కూర్చోదు. పై స్థాయికి చేరుస్తూనే ఉంటుంది.. ఏడ్చేవాళ్లను ఏడవనివ్వమని. బ్రిక్స్ సిసిఐ (చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) ‘యంగ్ లీడర్స్ ఇనీషియేటివ్స్’ కమిటీకి గౌరవ సలహాదారు గా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. యువతే భవిష్యత్తు. కీలకమైన రంగాలలో యువతకు ప్రేరణనిచ్చి, వారిని ప్రోత్సహించి, వారి ద్వారా ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఆలోచనల్ని మేము పంచుకోబోతున్నాం. – టీనా దాబి, యువ ఐ.ఎ.ఎస్. అధికారి -
ఆ పోస్ట్ నాది కాదు: టీనా దాబీ
న్యూఢిల్లీ: దేశం నలుమూలలా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అట్టుడుకుతున్న నేపథ్యంలో.. కొంతమంది దుండగులు ప్రముఖుల పేరుతో నకిలీ ఫేసుబుక్ ఖాతాలు సృష్టించి.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తాజాగా మంగళవారం ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా హిందీ భాషలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 'ఐఏఎస్ టీనా దాబి' పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా వెలువడటంపై టీనా దాబీ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకు వివరణ ఇచ్చారు. అది నకిలీ ఖాతా అని, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కాగా ఢిల్లీకి చెందిన దళిత యువతి టీనా దాబి నాలుగు సంవత్సరాల క్రితం (2015) ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. ఆ తర్వాత తన బ్యాచ్‌మేట్ అయిన కశ్మిరీ ఐఏఎస్ అథర్ ఖాన్‌ను ప్రేమించి.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. తరువాత, ఇద్దరికి రాజస్థాన్‌లోని భిల్వారాలో పోస్టింగ్ లభించింది. కాగా టీనా భర్త అథర్ సివిల్ సర్వీసెస్‌లో రెండవ ర్యాంకు సాధించడం విశేషం. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా పౌరసత్వ సవరణ చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. చదవండి: సివిల్స్ టాపర్ టీనా దాబి -
ప్రేమ చిహ్నంతో.. ఐఏఎస్ లవ్‌బర్డ్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్ ప్రేమపక్షులు అమీర్ ఉల్ షఫీ, టీనా దాబీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో వివాదాల నడుమ ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రేమకు చిహ్నమైన తాజ్మహాల్తో సరదాగా ఫోటోలకు పోజులిచ్చారు. వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ శాశ్వతమైన ప్రేమకు అద్భుతమైన శ్మారక చిహ్నమైన తాజ్‌మహాల్ వద్ద నా హుబ్బీతో’’ అని వారు షేర్ చేసిన ఫోటోలకు కామెంట్ పెట్టారు. వారి విహహం అనంతరం తొలిసారి విజిటింగ్‌కు బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. తాజ్ మహాల్, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రదేశాలను వారు సోమవారం సందర్శించారు. 2015 సివిల్స్ టాపరైన టీనా దాబీ తన జూనియర్ అయిన అమీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్ అఫీసర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ వీరి పెళ్లికి మాత్రం పలు హిందూ సంఘాలు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీనా ఐఏఎస్ టాపరై ఉండి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని విశ్వ హిందూ మహా సభ బహిరంగంగానే విమర్శించిన విషయం తెలిసిందే. అయినా అవేవి పట్టించుకుకోని ఆ జంట 2018లో అమీర్ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వివాహంతో ఒకటైయారు. -
ఐఏఎస్ టాపర్ల ప్రేమపెళ్లి: రాహుల్ ఆసక్తికర ట్వీట్!
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహెల్గామ్లో వివాహం చేసుకున్న ఐఏఎస్ దంపతులు టీనా దబీ, అథర్ ఆమిర్ ఉల్ షఫీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. వారి ప్రేమబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఐఏఎస్ టాపర్లు అయిన టినా దబీ, ఆమిర్ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ పట్ల పలు వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వచ్చాయి. అయినా వెనుకడుగు వేయకుండా వారు తాజాగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. వారి ప్రేమపెళ్లిపై తాజాగా రాహుల్‌గాంధీ ట్విటర్లో స్పందించారు. ‘2015 బ్యాచ్ ఐఏఎస్ టాపర్లు అయిన టీనాదబీ, అథర్ ఆమిర్ ఉల్ షఫీలకు వివాహ మహోత్సవం సందర్భంగా అభినందనలు. మీ ప్రేమబంధం మరింత బలోపేతం కావాలని, అసహనం, విద్వేషం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలువాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ’ అని రాహుల్ ట్వీట్ చేశారు. మూడేళ్ల క్రితం సివిల్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే భోపాల్‌కు చెందిన టీనా దబి మొదటి ర్యాంకు సాధించగా.. అదే పరీక్షలో కశ్మీర్‌కు చెందిన అథల్ ఆమీర్ రెండో ర్యాంకు సాధించారు. వీరు శనివారం దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్లో వివాహం చేసుకున్నారు. చదవండి: ఐఏఎస్ జంట చూడముచ్చటంట... -
పెళ్లి కోసం మతం మారాలట!
మీరట్: సివిల్ సర్వీసెస్-2015 టాపర్ టీనా దాబి.. రెండో ర్యాంకర్ షఫీ ఖాన్‌ను పెళ్లాడతానన్న ప్రకటనపై అఖిల భారతీయ హిందూ మహాసభ అభ్యంతరం తెలిపింది. ఆమె తల్లిదండ్రులకు రాసిన లేఖలో...ఈ పెళ్లి ప్రతిపాదనను విరమించుకోవాలని లేదా ఖాన్‌ను మత మార్పిడికి ఒప్పించాలంది. ‘ఖాన్‌ను టీనా పెళ్లి చేసుకోవాలనుకోవడం షాక్‌కు గురిచేసింది. ఇది లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉంది. ఇది జరగకూడదు. అరుునా వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖాన్ మతం మార్చుకోవాలి. దీని కోసం మా సభ్యులు మీకు సాయం చేస్తారు’ అని సంస్థ జాతీయ కార్యదర్శి మున్నా శర్మ టీనా తండ్రి జశ్వంత్‌కి లేఖ పంపారు. -
‘ఐఏఎస్‌ల ప్రేమ పెళ్లి రద్దు చేయండి’
న్యూఢిల్లీ: సివిల్స్ 2015 టాప్ ర్యాంకర్ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్ అతహార్ ఆమిర్ ఉల్ షపీ ఖాన్ల ప్రేమ వివాహానికి సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. వారిద్దరి ప్రేమ వివాహాన్ని రద్దు చేయాలని, లేదంటే ఖాన్‌ను మతం మార్చుకునేందుకు ఒప్పించాలని, అందుకు అతడు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేయాలని టీనా దాబీ తల్లిదండ్రులను కోరుతూ ఆఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మున్నా కుమార్ శర్మ ఓ లేఖ రాశారు. ‘మీ కుటుంబం తీసుకున్న నిర్ణయం లవ్ జిహాద్‌ను మరింత ప్రోత్సహిస్తుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఒక వేళ వారిద్దరికి నిజంగా పెళ్లి చేసుకోవాలని బలంగా ఉంటే మాత్రం ఖాన్‌ను హిందూ మతంలోకి ఖచ్చితంగా మారాలి. మార్పిడి తర్వాతే వివాహం జరగాలి. ఈ కార్యక్రమానికి మా సంస్థ సభ్యులు మీకు సహాయం చేస్తారు’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ ప్రియమైన జశ్వంత్ దాబిగారు.. 2015 ఐఏఎస్ పరీక్షల్లో టాపర్ టీనా నిలవడాన్ని చూసి మేమంతా సంతోషిస్తున్నాం. ఖాన్‌ను పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించిన నిర్ణయం మమ్మల్ని దిగ్బాంతికి గురి చేసింది. ఈ విషయంలో మేం చాలా విచారంగా ఉన్నాం. మీకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ముస్లింలు అంతా లవ్ జిహాద్‌ను వ్యాప్తి చేస్తున్నారు. హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో ముస్లిం మతంలోకి మార్చేందుకు వివాహం చేసుకుంటున్నారు. ఒక వేళ పెళ్లి చేసుకోవడమే ఆ ఇద్దిరికి ముఖ్యం అనిపిస్తే ముందు ఖాన్‌ను మతమార్పిడి జరగాలి’ అని కూడా ఆయన అన్నారు. పొలిటికల్ సైన్స్‌లో యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్‌ను సాధించిన టీనా ఎలాంటి వ్యూహం లేకుండానే తొలి ప్రయత్నంలోనే సివిల్స్(2015)లో తొలి ర్యాంక్ ను సాధించింది. ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ అకాడమీలో ట్రైనీగా చేరేముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమిర్‌ను కలుసుకుంది. ఆ కార్యక్రమంలోనే వారిద్దరి ప్రేమకు పునాది పడింది. ఇటీవలె వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మీడియాకు వెల్లడించారు. టీనా తండ్రి జశ్వంత్ దాబీ ఢిల్లీ టెలికాం విభాగంలో, తల్లి హిమాలీ దాబీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. (చదవండి....టాప్ ర్యాంకర్ల ప్రేమకథ.. ట్విస్ట్) -
టాప్ ర్యాంకర్ల ప్రేమకథ.. ట్విస్ట్
‘1 వచ్చి.. 2పై వాలె.. ’ అని చంద్రబోస్ రాసిన పాట గుర్తుందా? ఆయన సరదాగా రాసిన పాట ఐఏఎస్ టాపర్ల విషయంలో నిజమైంది. 2015 సివిల్స్‌లో టాప్ ర్యాంకర్ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్ అతహార్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్లు ప్రేమలో పడ్డారు. కులం, మతం, ప్రాంతం వేటికవే భిన్న నేపథ్యాలున్న ఈ ఇద్దరి ప్రేమకథ ఐఏఎస్ ఫెలిసియేషన్ సెర్మనీలో తొలిచూసులోనే మొదలై, అనేక ట్విట్లులతో ఐఏఎస్ అకాడమీలో సహజీవనం మీదుగా నిశ్చితార్థం వైపుకు వెళుతోంది.. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల టీనా దాబీ చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభకనబర్చేది. కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ స్కూల్, లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదువుకుంది. పొలిటికల్ సైన్స్‌లో యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్‌ను సాధించిన ఆమె ప్రత్యేక స్ట్రాటజీ ఏదీ లేకుండానే ప్రిపేర్ అయి తొలి ప్రయత్నంలోనే సివిల్స్(2015)లో మొదటిర్యాంక్ సాధించింది. తండ్రి ఢిల్లీ టెలికాం విభాగంలో, తల్లి హిమాలీ దాబీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ అకాడమీలో ట్రైనీగా చేరేముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమిర్‌ను మొదటిసారిగా కలుసుకుంది. ఫస్ట్ డేనే ఆమిర్ ఖాన్ ఆమెను ఇంప్రెస్ చేసేప్రయత్నం చేశాడు.. పాకిస్థాన్ సరిహద్దుకు సమీప అనంతనాగ్ జిల్లాలోని దేవీపురా ఆమిర్ సొంత ఊరు. జమ్ముకశ్మీర్ నుంచి సివిల్స్‌కు ఎంపికైన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. ఆమిర్ తండ్రి అక్కడి ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్. తల్లి గృహిణి. 2014లో 560 ర్యాంక్ సాధించిన ఆమిర్.. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్‌కు ఎంపికై లక్నోలో శిక్షణ పొందారు. అయితే ఐఏఎస్ సాధించాలనే అతని కల రెండో ప్రయత్నంలో(2015లో) నెరవేరింది. ఆలిండియా రెండో ర్యాంక్ సాధించి టీనా తర్వాతి స్థానంలో నిలిచాడు. ఫెసిలియేషన్ సెర్మనీలో మొదటిసారి టీనాను కలుసుకున్నాడు.. ‘మే 11న సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్(నార్త్‌బ్లాక్)లో ఉదయం ఐఏఎస్ ర్యాంకర్ల అభినందన సభ జరిగింది. సాయంత్రానికి ఆమిర్ ను మా ఇంటి ముందు చూసేసరికి షాక్ తిన్నా. తను నిర్మొహమాటంగా చెప్పేశాడు.. ‘చూడగానే ప్రేమ పుట్టింది..లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని! అప్పటికప్పుడు నేను నిర్ణయం తీసుకోలేకపోయా. కొద్ది రోజుల తర్వాత ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీలో ట్రైనీలుగా చేరాం. మరికొన్నాళ్లకు కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చాం. ఆ టైమ్.. నిజంగా సో స్వీట్! ఆమిర్, నేను తెగ తిరిగేవాళ్లం. మా స్టేటస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాళ్లం. అలా చేయడమే పొరపాటని తర్వాత తెలిసింది.. మా ఇద్దరి మతాలు, కులాలు, ప్రాంతాలు వేరు. అయినా ఆ విషయంలో మాకు పట్టింపులులేవు. కానీ సోషల్ మీడియాలో కొందరు దాన్ని రచ్చచేసే ప్రయత్నం చేశారు. పరాయి మతస్తుడితో చనువేంటని కొందరు, దళిత బిడ్డవు కాబట్టి అణగారిన వర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఇదంతా ఓ 5 శాతం మందే. ఆమీర్‌కు, నాకు పరిచయం ఉన్న వాళ్లలో 95 శాంతం మంది మా ప్రేమను అభినందించారు. అటు మా పేరెంట్స్ కూడా అభ్యంతరపెట్టలేదు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే నిశ్చితార్థం చేసుకుంటాం. పెళ్లి ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. అంబేద్కర్ నాకు ఆదర్శం. ఆయన చూపిన బాటలో దేశానికి మేలు చేయాలనేది నా అభిలాష.. ఆమీర్ కోరిక కూడా ఇదే’అని టీనా దాబీ చెప్పారు. -
విజేతలకు అసలైన పరీక్ష
పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకగా... సమర్ధతకు మారుపేరుగా పరిగణించే సివిల్ సర్వీసుకు ఎంపిక కావడం కోసం ఏటా లక్షలాదిమంది అభ్యర్థులు పోటీపడుతుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్షల్లో ఇటీవలికాలంలో వెల్లడవుతున్న ఫలితాలు ఆశాజనకంగా, స్ఫూర్తిదాయ కంగా నిలుస్తున్నాయి. కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే సివిల్ సర్వీస్ పరిమిత మన్న పాత అభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నాయి. నిరుడు వెల్లడైన ఫలితాల్లో తొలి నాలుగు స్థానాలనూ యువతులే సాధించారు. ప్రథమ ర్యాంక్ తెచ్చుకున్నామె వికలాంగురాలు కూడా. ఈసారి ఫలితాల్లో అగ్రగామిగా నిలిచిన యువతి టీనా దాబి వయసు కేవలం 22 ఏళ్లు. పైగా ఆమెకిది తొలి ప్రయత్నం. దళిత వర్గంనుంచి వచ్చిన టీనా ఇక్కడ పాతుకుపోయి ఉన్న పితృస్వామిక భావ జాలాన్ని, లింగ వివక్షను పారదోలడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటున్నది. ఆ విషయాల్లో ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్న హర్యానాను తన కార్య క్షేత్రంగా ఎంచుకోబోతున్నట్టు ప్రకటించింది. అమ్మానాన్నలిద్దరూ ఇంజనీర్లు కావడంవల్ల కలిగిన ఆర్ధిక వెసులుబాటు, ప్రతిభకు పదునుపెట్టుకునే అవకాశం ఆమెను ఢిల్లీలోని ఉన్నత శ్రేణి విద్యా సంస్థ లేడీ శ్రీరాం కళాశాలకు చేర్చి ఉండొచ్చు గానీ...బయటి సమాజంలో ఆడపిల్ల ఎలాంటి వివక్షకు గురవుతున్నదో ఒక యువతిగా ఆమె అవగాహనలోకి వచ్చింది. ఆ వివక్షను రూపుమాపాలన్న కృత నిశ్చయమూ ఏర్పడింది. రెండో ర్యాంకర్‌గా నిలిచిన యువకుడు అతర్ అమిర్ స్వస్థలం నిత్యం ఉద్రిక్తతలతో సతమతమయ్యే జమ్మూ–కశ్మీర్‌లోని అనంతనాగ్. రెండో ప్రయత్నంలో ఇంత ఉన్నతమైన ర్యాంక్‌ను చేజిక్కించుకున్న అతర్కుకూడా ఇక్కడి సమస్యల విషయంలో సంపూర్ణమైన అవగాహన ఉంది. తను పుట్టి పెరిగిన ప్రాంతం మిలిటెన్సీ ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ కశ్మీర్‌లోనిది. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాటుబడతానని అతర్ చెబుతున్నాడు. ఎన్నో సంక్లిష్టతలతో, వడబోతలతో కూడుకుని ఉండే సివిల్ సర్వీస్ పరీక్షల్లో వెనకబడిన ప్రాంతాలనుంచి వచ్చినవారు విజేతలుగా నిలవడం మెచ్చదగిన విషయం. వీరిలో చాలామంది బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు. అందు వల్ల సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడినవారు. 361వ ర్యాంక్ సాధించిన 21 ఏళ్ల అన్సార్ అహమద్ షేక్ పొందిన అనుభవాలు దిగ్భ్రమ కలిగిస్తాయి. పూణేలో పీజీ చేయడానికి వెళ్లినప్పుడు మైనారిటీ అయిన కారణంగా తలదాచుకోవడానికి ఆశ్రయం దొరక్క ఇబ్బందులు పడిన తీరును అతను వివరించాడు. తన మిత్రుడి పేరు శుభంను సొంతం చేసుకుంటే తప్ప దిక్కూ మొక్కూ లేకపోయిందని అన్సార్ చెప్పిన మాటలు మన సమాజం పాటిస్తున్న విలువలను ప్రశ్నిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ మెరుగైన ర్యాంకులు సాధించినవారిలో కూడా పలువురు వెనకబడిన ప్రాంతాలవారూ, నిరుపేద కుటుంబాలకు చెందినవారున్నారు. నల్ల గొండ జిల్లాకు చెందిన చామకూరి శ్రీధర్ ఒకవైపు పేదరికంతో, మరోవైపు అంగ వైకల్యంతో పోరాడుతూనే అహోరాత్రాలూ శ్రమించి 348వ ర్యాంక్ సాధించాడు. విజేతలుగా నిలిచినవారిలో చాలామంది కులం, మతం, ప్రాంతం, పుట్టుక కారణంగా సమాజంలో తమకెదురైన ప్రతికూలతలనూ, సవాళ్లనూ అధిగమించిన వారు. కళ్లల్లో ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఇటువైపు వచ్చినవారు. సమకాలీన సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా అవగాహనతోపాటు వాటి పరిష్కారం తమకు సాధ్యమేనని విశ్వసిస్తున్నవారు. అందుకు అవసరమైన సంక ల్పమూ, పట్టుదలా ఉన్నవారు. వీరంతా ఏ బహుళజాతి సంస్థలోనో ఉన్నతో ద్యోగాన్ని సాధించి లక్షల్లో వేతనం పొందగలిగే సత్తా ఉన్నవారు. దాంతో పోలిస్తే తక్కువ జీతమూ, అధిక శ్రమ, ఎన్నో బాధ్యతలు ఉండే సివిల్ సర్వీసులను ఎంచుకోవడం వెనకున్న నిజాయితీని, అంకితభావాన్ని గుర్తించేవారుంటే మంచిదే. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి కలిగే దురహంకారంతో వ్యవహరించే వారే అధికంగా తారసపడే కార్యనిర్వాహకవర్గం అలాంటి అంశాలను గుర్తించగలిగే స్థాయిలో ఉందా? మూడేళ్లక్రితం యూపీలోని నోయిడా జిల్లా ఉన్నతాధికారిగా పనిచేసిన యువ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్, హర్యానాలో సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, జమ్మూ–కశ్మీర్లో ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్ వంటివారి అనుభవాలు అందుకు భరోసా నివ్వడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాజకీయంగా కక్ష సాధించడంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనాకాలంలో కీలక పదవుల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులను నాలుగేళ్ల క్రితం కేసుల పేరుతో ఎంతగా వేధించారో అందరికీ గుర్తుంది. చట్టాలు ఏం చెబుతున్నా, న్యాయం ఏదైనా తాము అనుకున్నదే అమలు జరగా లని కోరుకునే పాలకుల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తేనే మంచి పోస్టుల్లో కొనసాగడం...లేనట్టయితే అప్రాధాన్య పోస్టులకు బదిలీ కావడం చాలా చోట్ల సివిల్ సర్వీసు అధికారులకు ఎదురవుతున్న అనుభవం. ఒకటి రెండు బదిలీల తర్వాత కూడా ‘దారికి’ రానివారిని మరిన్ని బదిలీలతో వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాలెన్ని ఎదురైనా సేవాభావంతో, కర్తవ్యదీక్షతో పనిచేసి ప్రజల్లో ఈ వ్యవస్థపై నమ్మకాన్ని నిలిపిన ఎస్ఆర్ శంకరన్, బి.డి. శర్మ వంటివారు కూడా లేకపోలేదు. ఇప్పుడు కోట్లాదిమంది పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న అనేక పథకాలకు వారు రూపశిల్పులు. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవ హరించడం... రాజకీయ ఒత్తిళ్లున్నా, కక్ష సాధింపులున్నా నిబద్ధతతో పనిచేయడం కత్తిమీది సాము. అందుకు ఎంతో ఓపిక, పట్టుదల, అసహాయులపట్ల ప్రేమ అవసరం. ఆ లక్షణాలను కోల్పోకుండా పనిచేసినప్పుడే ఈ విజేతలంతా సివిల్ సర్వీసుకు వన్నె తెస్తారు. -
రోల్ మోడల్ గా ఉంటా: సివిల్స్ టాపర్
న్యూఢిల్లీ: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించానని ఫస్ట్ ర్యాంకర్ టీనా దాబే వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష-2015లో టాపర్ గా నిలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. చెప్పలేని ఆనందానుభూతికి లోనపుతున్నానని, వర్ణించడానికి మాటలు రావడం లేదని పేర్కొంది. సహనం, స్పష్టత, క్రమశిక్షణ, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఫస్ట్ ర్యాంక్ సాధించానని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఎంచుకుంటానని తెలిపింది. హర్యానా కేడర్ తరపున పనిచేయడం సవాల్ తో కూడుకున్నదని అభిప్రాయపడింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో పాసవడంతో యువతులకు రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు టీనా చెప్పింది. తన కుమార్తె టాపర్ నిలవడం టీనా తండ్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫస్ట్ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్ పాసవడం తమకెంతో ఆనందం కలిగిస్తోందన్నారు. తనకు మాటలు రావడం లేదని టీనా తల్లి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తన కూతురే తన హీరో అని ఆమె వ్యాఖ్యానించారు.